సంవత్సరానికి ₹150 నుండి హోమ్ లోన్ కోసం హోం ఇన్సూరెన్స్*
జీరో పేపర్‌వర్క్. ఆన్‌లైన్ ప్రక్రియ

హోమ్ లోన్ కోసం హోం ఇన్సూరెన్స్

హోమ్ లోన్ కోసం హోం ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

హోమ్ లోన్ కోసం హోం ఇన్సూరెన్స్ అనేది దీర్ఘకాలిక ఆస్తి ఇన్సూరెన్స్ పాలసీ, ఇక్కడ ఇన్సూరెన్స్ సంస్థ హోమ్ మరియు సంబంధిత అంశాలకు కవరేజీని అందిస్తుంది. అగ్నిప్రమాదం, వరదలు, తుఫానులు మొదలైన కారణాల వల్ల ఇంటికి జరిగే ఏదైనా డ్యామేజ్ కోసం ఇంటి యజమాని ఆర్థికంగా కవర్ చేయబడుతుందని డిజిట్ హోం ఇన్సూరెన్స్ పాలసీ నిర్ధారిస్తుంది.

హోం ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం ఎందుకు అవసరం?

మీ ఇంటికి లేదా దానిలోని వస్తువులకు ఏదైనా డ్యామేజ్ జరిగితే, హోం ఇన్సూరెన్స్ ను కలిగి ఉండటం అవసరం. పాలసీ వల్ల కలిగే డ్యామేజ్ వల్ల కలిగే నష్టాలకు మీరు ఆర్థికంగా కవర్ చేయబడతారని నిర్ధారిస్తుంది. దానికి తోడు, హోం లోన్, రుణదాతకు మొండి బాకీగా మారకుండా చూసుకుంటుంది.

హోం లోన్ తీసుకునేటప్పుడు హోం ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేయడం తప్పనిసరి కాదా?

హోం ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం తప్పనిసరి కాదు. కాకపోతే, మీ ఆర్థిక ప్రయోజనాల కోసం ఒకటి కలిగి ఉండటం మంచిది. కనీస ప్రీమియం చెల్లించడం ద్వారా మీరు మీ డ్రీమ్ హౌస్‌ని కొనుగోలు చేయడానికి ఇప్పటికే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినందున మీ ఆస్తిని మరియు దానిలోని సామనుకు ఏదైనా డ్యామేజ్ జరగకుండా కాపాడుకోవచ్చు.

హోం లోన్ తీసుకునేటప్పుడు హోం ఇన్సూరెన్స్ కలిగి ఉండటం ఎందుకు ప్రయోజనకరం?

హోం లోన్ పొందడం అనేది ఒక పెద్ద కమిట్మెంట్, ఎందుకంటే మీ సంపాదన నుండి ఎక్కువ మొత్తంలో చాలా కాలం పాటు లోన్‌ని తిరిగి చెల్లించడం జరుగుతుంది. ఈ క్రింది కారణాల వల్ల హోం ఇన్సూరెన్స్ పాలసీ ఉపయోగపడుతుంది - 

  • ఇన్సూరెన్స్ సంస్థ ఆస్తిని కవర్ చేస్తుంది కాబట్టి ఇది మీ కుటుంబాన్ని మరియు వారిపై ఆధారపడిన వారిని అప్పుల నుండి రక్షిస్తుంది.
  • మీరు శాశ్వత వైకల్యం, తీవ్రమైన అనారోగ్యం లేదా ఊహించని ఉద్యోగ నష్టం నుండి రక్షించే యాడ్-ఆన్ కవర్‌లను ఎంచుకోవచ్చు.

హోం ఇన్సూరెన్స్ మరియు హోం లోన్ ఇన్సూరెన్స్ మధ్య వ్యత్యాసం

మనం హోం ఇన్సూరెన్స్ మరియు హోం లోన్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడేటప్పుడు, రెండింటి మధ్య కొన్ని తేడాలు ఉంటాయి. దిగువ పట్టికలో వాటిని పరిశీలిద్దాం:

హోం ఇన్సూరెన్స్ హోం లోన్ ఇన్సూరెన్స్
అగ్నిప్రమాదాలు, భూకంపాలు, వరదలు, దొంగతనం మొదలైన దుర్ఘటనల కారణంగా ఇంటికి జరిగిన నష్టం లేదా డ్యామేజ్ కి హోం ఇన్సూరెన్స్ చెల్లిస్తుంది. పాలసీదారు ఊహించని పరిస్థితులను ఎదుర్కొన్నట్లయితే, ఇన్సూరెన్స్ సంస్థ రుణదాతతో చెల్లించాల్సిన హోం లోన్ మొత్తాన్ని చెల్లించడం వల్ల హోం లోన్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది.
హోం ఇన్సూరెన్స్ పాలసీని పొందేందుకు చెల్లించాల్సిన ప్రీమియం తక్కువగా ఉంటుంది. హోం లోన్ ఇన్సూరెన్స్ కోసం, చెల్లించాల్సిన ప్రీమియం ఎక్కువగా ఉంటుంది.
మీరు హోం లోన్ తీసుకున్నప్పటికీ హోం ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయవచ్చు. మీరు హోం లోన్ పొందినట్లయితే మాత్రమే హోం లోన్ ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేయవచ్చు.
హోమ్ లోన్ ఇన్సూరెన్స్ కారణంగా ఇంటి డౌన్ పేమెంట్ తగ్గుతుంది. హోం ఇన్సూరెన్స్ విషయంలో డౌన్ పేమెంట్ పై ఎలాంటి ప్రభావం ఉండదు.

హోం లోన్ కోసం హోం ఇన్సూరెన్స్ కొనుగోలు కోసం పరిగణించవలసిన అంశాలు

హోం ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడానికి సిఫార్సు చేయబడినప్పటికీ, కొనసాగే ముందు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవడం అవసరం. వాటిని మనం పరిశీలిద్దాం:

కవరేజ్

హోమ్ లోన్ కోసం హోమ్ ఇన్సూరెన్స్‌ని కొనుగోలు చేసే ముందు మీరు ఇన్సూరెన్స్ సంస్థ అందించే కవరేజ్ పరిమాణాన్ని చూడాలి. చాలా ఇన్సూరెన్స్ సంస్థలు క్రమంగా తగ్గుతున్న కవరేజీని అందిస్తున్నందున ఇది చాలా ముఖ్యం. మంచి కవరేజ్ మీరు ఏదైనా సంఘటన నుండి రక్షించబడతారని నిర్ధారిస్తుంది.

చెల్లించవలసిన ప్రీమియం

మీరు చెల్లించే ప్రీమియం కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మీరు ఇప్పటికే హోం లోన్ కోసం ఈఎంఐగా పెద్ద మొత్తం చెల్లిస్తున్నందున మరియు ఇతర ఖర్చులు చూసుకోవాల్సిన అవసరం ఉన్నందున, ప్రీమియం మీ జేబుకు చిల్లు వేయకూడదు.

యాడ్-ఆన్‌లు

ఇన్సూరెన్స్ సంస్థ అందించే యాడ్-ఆన్ కవరేజీని విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఆస్తి ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం ద్వారా మీరు మరిన్ని ప్రయోజనాలను పొందేలా ఇది నిర్ధారిస్తుంది.

భారతదేశంలో హోం లోన్ కోసం హోం ఇన్సూరెన్స్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

హోం ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుంది?

హోమ్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని ఇంటిని మరియు దాని కంటెంట్‌ను ఏదైనా నష్టం జరగకుండా కాపాడుతుంది.

నేను దీర్ఘకాలిక హోం ఇన్సూరెన్స్ ను పొందడం కోసం పన్ను ప్రయోజనాలను పొందవచ్చా?

అవును, హోమ్ లోన్ ఇన్సూరెన్స్ పాలసీని పొందడం వల్ల మీరు పన్ను ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు అందించబడతాయి.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద క్లయిమ్ చేయగల గరిష్ట పన్ను ప్రయోజనం ఎంత?

మీరు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు క్లయిమ్ చేయవచ్చు.

అదే రుణదాత నుండి హోం లోన్ కోసం హోం ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేయడం అవసరమా?

అదే బ్యాంకు నుంచి హోం ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మరియు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డిఎ) ప్రకారం రుణదాతలు, రుణగ్రహీతను హోం ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయమని బలవంతం చేయలేరు.

హోమ్ లోన్ కోసం హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి?

స్థానం, ధర మరియు ఇంటి లక్షణాలు, భద్రతా చర్యలు, మినహాయింపు మరియు ఇన్సూరెన్స్ పాలసీ రకం వంటి అంశాల ఆధారంగా ప్రీమియం ఎక్కువ లేదా తక్కువగా ఉండవచ్చు.