ఆన్‌లైన్‌లో మీ ఆస్తికి ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీని పొందండి

property-insurance
property-insurance
usp icon

Zero

Documentation

usp icon

Quick Claim

Process

usp icon

Affordable

Premium

Zero Paperwork Online Process
Select Property Type
Enter Valid Pincode
+91
Please enter valid mobile number
I agree to the Terms & Conditions
background-illustration
usp icon

Zero

Documentation

usp icon

Quick Claim

Process

usp icon

Affordable

Premium

background-illustration

ఫైర్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

ఫైర్ ఇన్సూరెన్స్ అనేది ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీలో ఒక ముఖ్యమైన భాగం, ఇది మీ ఇల్లు, అపార్ట్‌మెంట్ భవనాలు, కార్యాలయ స్థలాలు, దుకాణాల వంటి వ్యాపార ఆస్తులను అగ్నిప్రమాదం కారణంగా సంభవించే ఏవైనా నష్టాల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.

*నిరాకరణ(డిస్​క్లెయిమర్) - ఫైర్ ఇన్సూరెన్స్ అనేది స్వతంత్ర (విడిగా లభించే) ప్రొడక్ట్ కాదు. మీరు ఈ కవర్​ను పొందడానికి గోడిజిట్ అందించే పాలసీలయిన భారత్ లఘు ఉద్యమ్ సురక్ష లేదా భారత్ సూక్ష్మ ఉద్యమ్ సురక్ష హోమ్ కొరకు భారత్ గృహ రక్ష పాలసీలలో ఏదో ఒక దానిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 

Read More

ఫైర్ ఇన్సూరెన్స్ ఎందుకు ముఖ్యమో మీకు తెలియదా?

అయితే చదవండి..

1

వ్యాపారాల కొనసాగింపు మరియు కార్యకలాపాలు నిర్వహించేందుకు ఉన్న పెద్ద ప్రమాద కారకాలలో అగ్ని ప్రమాదాలు 3వ అతిపెద్ద ప్రమాదంగా ర్యాంక్ చేయబడ్డాయి. (1)

2

నివాస సముదాయాలు ఎక్కువగా అగ్ని ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉందని ADSI నివేదిక తెలియజేస్తుంది. (2)

3

2021లో ఇండియాలో మొత్తం 1.6 మిలియన్లు అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. (3)

డిజిట్ అందించే ఫైర్ ఇన్సూరెన్స్‌ గొప్పదనం ఏంటి?

  • డబ్బుకు తగిన విలువ : బీమాలో ఆస్తి నష్టాన్ని కవర్ చేయడమే చాలా పెద్ద విషయం. ప్రమాదానికి సంబంధించి చాలా ఉంటాయి! అందువల్ల, వీటికి ప్రీమియంలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయన్న విషయం మీరు గమనించవచ్చు. అయినప్పటికీ, అగ్ని, ఇతర నష్టాల నుంచి మీ ఆస్తికి బీమా చేయడానికి మీకు సాధ్యమైనంత ఉత్తమమైన, అత్యంత సరసమైన ప్రీమియంను అందించడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తాము.
  • డిజిటల్ ఫ్రెండ్లీ : భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ ఇన్సూరెన్స్ కంపెనీలలో ఒకటిగా, మేము ఫైర్ ఇన్సూరెన్స్ కొనుగోలు నుంచి డిజిటల్ క్లెయిమ్‌లు చేయడం వరకు మా అన్ని ప్రక్రియలను డిజిటల్​గా ప్రయత్నిస్తాము. కాబట్టి తనిఖీ అవసరమైనప్పుడు కూడా, మీరు దీన్ని ఆన్‌లైన్‌లో చేయవచ్చు! (రూ. 1 లక్ష కంటే ఎక్కువ క్లెయిమ్‌లు మినహా. ఐఆర్​డీఏఐ (IRDAI – ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ) ప్రకారం) -అవి మాన్యువల్‌గా మాత్రమే చేయాలి.

  • అన్ని వ్యాపార వర్గాలను కవర్ చేస్తుంది : మీరు మీ కుటుంబ వ్యాపారం, కార్యాలయ స్థలం, కిరాణా స్టోర్ లేదా స్టోర్ల చైన్ రక్షించుకోవాలనుకున్నా, మా ఫైర్ ఇన్సూరెన్స్ అన్ని రకాల వ్యాపారాలకు అది పెద్దది అయినా  లేదా చిన్నది అయినా వాటికి అనుకూలంగా ఉంటుంది.

  • అద్దెదారుల కోసం ప్లాన్లు : ఈ రోజుల్లో సొంతంగా వ్యాపారం చేయడం కన్నా అద్దెకు ఉంటూ వ్యాపారం చేయడానికే చాలామంది ఆసక్తి చూపుతున్నారు. దీనిని  మేము అర్థం చేసుకున్నాము. అందుకే, మేము ప్లాన్‌లను కూడా అందిస్తున్నాము.

డిజిట్ ఫైర్ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ చేయబడుతాయి?

ఫైర్ కవర్ యాడ్-ఆన్ కవర్లతో కూడిన మా ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీలో ఏమేం కవర్​ అవుతాయంటే..

Explosion & Aircraft Damage

పేలుడు

పేలుడు వలన మీ ఆస్తికి ఏదైనా నష్టం వాటిల్లితే ఇది కవర్ చేస్తుంది.

Storms

తుఫాను

ఏదైనా సమయంలో మీ ఇల్లు లేదా దుకాణం తుఫాను వల్ల దెబ్బతిన్నా కానీ మీకు కవర్ లభిస్తుంది. అది తీవ్ర తుఫాను అయినా లేక మామూలు తుఫాను అయినా సరే.

Floods

వరద

వర్షాలు నియంత్రణలో లేనపుడు వరదల వల్ల సంభవించే నష్టాలు లేదా డ్యామేజెస్ నుంచి కూడా ఇది రక్షిస్తుంది. వరదలు మీ ఆస్తులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది.

Earthquakes

భూకంపాలు

ప్రకృతి విపత్తులను ఎవరూ కూడా ఆపలేరు. కానీ మీరు చేయాల్సిందేంటంటే.. వాటి వల్ల వచ్చే నష్టాల నుంచి మీరు కవర్ అయ్యేలా చూసుకోవడం. భారత్​ లఘు ఉద్యమ్ సురక్ష, గో డిజిట్ భారత్ సూక్ష్మ ఉద్యమ్ సురక్ష, మరియు గో డిజిట్ భారత్ గృహ రక్ష వంటి పాలసీలు భూకంపాల వంటి ప్రకృతి విపత్తుల వల్ల మీకు సంభవించే నష్టాల నుంచి కవర్ చేస్తాయి.

ఫైర్ ఇన్సూరెన్స్ రకాలు:

డిజిట్​లో మేము అందించే ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీ స్వతంత్ర పాలసీ కాదు. ఇది పూర్తి కవరేజీలో భాగం మాత్రమే. అగ్ని ప్రమాదాలు మరియు సహజ విపత్తుల వల్ల వల్ల వచ్చే ప్రతి నష్టాన్ని ఇది కవర్ చేస్తుందని దీనర్థం. మేము అందించే కొన్ని రకాల కవర్స్ కింద అందించబడ్డాయి. 

ఆప్షన్ 1

ఆప్షన్ 2

ఆప్షన్ 3

మీ ఇల్లు లేదా బిజినెస్​లో ఉన్న కంటెంట్స్​ను మాత్రమే కవర్ చేస్తుంది.

మీ ఇంటిలో లేదా వ్యాపారంలో ఉన్న కంటెంట్స్ మరియు బిల్డింగ్​ను కూడా కవర్ చేస్తుంది.

కేవలం మీ బిల్డింగ్​ను మాత్రమే కవర్ చేస్తుంది

మా ఫైర్ ఇన్సూరెన్స్ ఆఫరింగ్​లు

  • ఇంటికోసం ఫైర్ ఇన్సూరెన్స్- మా ఫైర్ ఇన్సూరెన్స్ అనేది మా హోమ్ ఇన్సూరెన్స్​లో చేర్చబడిన ముఖ్యమైన కవరేజ్. కాబట్టి మీకు అపార్ట్​మెంట్, విల్లా లేదా ఇండిపెండెంట్ బిల్డింగ్ ఉన్నా కానీ మా హోమ్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. కేవలం అగ్ని ప్రమాదాల వల్ల సంభవించే నష్టాల నుంచి మాత్రమే కాకుండా అనుకోని పరిస్థితుల వల్ల సంభవించే తుఫానులు, పేలుళ్లు, వరదల వంటి వాటి వల్ల సంభవించే నష్టాల నుంచి కూడా కవర్ చేస్తుంది. 

  • వ్యాపారం లేదా దుకాణం కోసం ఫైర్ ఇన్సూరెన్స్- మా ఫైర్ ఇన్సూరెన్స్ అనేది అన్ని రకాల బిజినెస్ మరియు షాప్ ఇన్సూరెన్స్​లో కూడా చేర్చబడింది. ఇందులో చిన్న మరియు పెద్ద వ్యాపారాలు అన్ని రకాల దుకాణాలు, బొటిక్స్, ఆఫీస్​ స్థలాలు, వంటివి కూడా కవర్ అవుతాయి. షాప్ ఇన్సూరెన్స్ అనేది కేవలం అగ్ని ప్రమాదాల వల్ల ఏర్పడే నష్టాలను మాత్రమే కాకుండా.. తుఫానులు, వరదలు, భూకంపాల వల్ల సంభవించే నష్టాలను కూడా కవర్ చేస్తుంది. 

ఫైర్ ఇన్సూరెన్స్ ఎవరికి అవసరం?

మంటలు సాధరణమైనవి కాబట్టి ఆస్తిని కలిగి ఉన్న ఎవరైనా తమ ఇల్లు లేదా వ్యాపారం అగ్నిప్రమాదం కారణంగా సంభవించే నష్టాలు, డ్యామేజీల నుంచి కవర్ చేయబడిందని నిర్ధారించుకోవాలి.

ఇంటి యజమానులు

మీ పాత ఇల్లు అయినా లేదా మీ కలల సౌధం అయినా, భవనం ఏదైనప్పటికీ అది అత్యంత విలువైన ఆస్తి. అంతేకాకుండా, నివాస భవనాలలో మంటలు ఎక్కువగా సంభవిస్తాయి. అందువల్ల, మీ డబ్బులు, ఇల్లును రెండింటినీ రక్షించడానికి మీరు చేయగలిగే పని ఇదే.

కిరాయిదారులు

ఫైర్ ఇన్సూరెన్స్ అనేది ఆస్తులను కలిగి ఉన్న వ్యక్తులకు మాత్రమే అని చాలా మంది బీమాదారులు అనుకుంటారు. కానీ డిజిట్, కిరాయికి తీసుకున్న ఆస్తులకు కూడా ఫైర్ ఇన్సూరెన్స్‌ను అందిస్తుంది. కాబట్టి, మీరు అద్దెకు తీసుకున్న కార్యాలయ స్థలం లేదా అద్దెకు తీసుకున్న అపార్ట్​మెంట్​ కలిగి ఉంటే, మీరు  మీ సొంత భవనాలకు ఫైర్ ఇన్సూరెన్స్ పొందవచ్చు; అలాగే మీ ఇంటి కంటెంట్‌లకు కూడా..

చిన్న వ్యాపార యజమానులు

మీరు కస్టమైజ్ చేసిన ఫ్యాషన్, హస్తకళలతో కూడిన చిన్న సాధారణ దుకాణం లేదా చిన్న బోటిక్ నడుపుతున్నవారైనా, మా ఫైర్ ఇన్సూరెన్స్ కవరేజ్ అన్ని రకాల వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది. మీరు స్వతంత్రంగా, చిన్న వ్యాపారాన్ని నడుపుతున్న వారైతే, మంటల వల్ల సంభవించే ఏవైనా  నష్టాల నుండి మీ వ్యాపారాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం.

మధ్య తరహా వ్యాపారాల యజమానులు

మీరు సాధారణ దుకాణాలు, రెస్టారెంట్లు లేదా మధ్య తరహా వ్యాపారాలను నడుపుతుంటే; అగ్నిప్రమాదం కారణంగా సంభవించే ఏవైనా నష్టాలను కవర్ చేయడానికి మా ఫైర్ ఇన్సూరెన్స్ కవరేజీ మధ్య తరహా వ్యాపార యజమానులకు కూడా సరిపోతుంది; అది చిన్నదైనా, పెద్దదైనా సరే.

పెద్ద సంస్థలు

మీ వ్యాపారం యొక్క భారీ కార్యకలాపాల కారణంగా మీరు అనేక ఆస్తులను కలిగి ఉన్నవారైతే, వ్యాపార ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడటమే కాకుండా, బాధ్యతాయుతమైన వ్యాపార సంస్థగా ఉండేందుకు సుహృద్భావాన్ని మెరుగుపరచడంలో సహాయపడే మీ అన్ని ఆస్తులను రక్షించడంలో ఆస్తి బీమా చాలా ముఖ్యమైనది.

ఫైర్ ఇన్సూరెన్స్‎లో కవర్ చేయబడే వ్యక్తిగత ఆస్తుల రకాలు

వ్యక్తిగత అపార్ట్​మెంట్

ఇది హౌసింగ్ సొసైటీలు లేదా స్టాండలోన్ భవనాల్లో భాగమైన స్వతంత్ర ఫ్లాట్లలో నివసించే వారి కోసం. అది మీ స్వంత ఫ్లాట్ కావచ్చు లేదా మీరు అద్దెకు తీసుకున్నది అయి ఉండవచ్చు. మా ప్రొడక్ట్ ఆ రెండింటికీ తగినదే!

ఇండిపెండెంట్ బిల్డింగ్

ఒకవేళ మీరు ఒక స్వతంత్ర విల్లా లేదా ఇంటిని స్వంతం చేసుకున్నట్లయితే లేదా అద్దెకు తీసుకున్నట్లయితే, మీ విల్లా, దానిలోని కంటెంట్‎లను అగ్నిప్రమాదాలు, మంటల నుంచి సంరక్షించేందుకు ఫైర్ ఇన్సూరెన్స్ కవరేజీ ఎంతో కీలకం. 

 

స్వతంత్ర విల్లా

ఒకవేళ మీరు ఒక స్వతంత్ర విల్లా లేదా ఇంటిని స్వంతం చేసుకున్నట్లయితే లేదా అద్దెకు తీసుకున్నట్లయితే, మీ విల్లా, దానిలోని కంటెంట్‎లను అగ్నిప్రమాదాలు, మంటల నుంచి సంరక్షించేందుకు ఫైర్ ఇన్సూరెన్స్ కవరేజీ ఎంతో కీలకం.

ఫైర్ ఇన్సూరెన్స్‎లో కవర్ చేయబడే వ్యాపార ఆస్తుల రకాలు

ఆటోమొబైల్స్ మరియు ఎలక్ట్రానిక్స్

ఆటోమొబైల్స్, మొబైల్ ఫోన్లు వాటి పరికరాలను విక్రయించే వ్యాపారాలు 

గ్రాసరీ (వంటిట్లోకి ఉపయోగపడే వస్తువులు), జనరల్ మరియు స్టేషనరీ వస్తువులు

పొరుగున ఉన్న కిరాణా షాప్స్ మొదలుకుని బడ్జెట్ ఫ్రెండ్లీ సూపర్ మార్కెట్స్ మరియు జనరల్ స్టోర్స్ అన్ని రకాల గ్రాసరీ స్టోర్స్ మరియు జనరల్ స్టోర్స్ ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ అవుతాయి. 

ఆఫీస్​ మరియు విద్యాస్థలాలు

మా ప్రాపర్టీ ఇన్సూరెన్స్​ పాలసీలో భాగంగా ఈ కేటగిరీ ఆఫీస్ ప్రాంగణాలు, మరియు స్కూల్స్, కోచింగ్ సెంటర్లు మరియు కాలేజీల వంటి విద్యాసంస్థలకు సరిపోయే విధంగా డిజైన్ చేయబడింది. 

రిపేర్స్ మరియు హౌస్ హెల్ప్

వడ్రంగి పనులు మరియు ప్లంబింగ్ రిపేర్స్ దగ్గరి నుంచి మోటార్ గ్యారేజెస్ మరియు ఇంజనీరింగ్ వర్క్​ షాపుల వరకు వివిధ కేటగిరీలకు చెందిన వ్యాపారాలు ఈ కేటగిరీలోకి వస్తాయి. 

హోమ్, లైఫ్​స్టైల్ మరియు ఫిట్​నెస్

మీకు ఎంతో ఇష్టమైన మాల్స్ మరియు క్లాత్ స్టోర్ల నుంచి స్పాలు, జిమ్స్ మరియు ఇతర స్టోర్స్ అన్నింటికీ.. పర్సనల్ లైఫ్ స్టైల్ మరియు ఫిట్​నెస్ సెక్టార్​లో ఉండే అన్ని వ్యాపారాలకు డిజిట్ అందించే ప్రాపర్టీ ఇన్సూరెన్స్​లో ఫైర్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. 

ఆహారం, తినుబండారాలు

ప్రతి ఒక్కరూ తినే ఒకే ఒక ప్రదేశం! కేఫ్‎లు, ఫుడ్ ట్రక్కుల నుంచి రెస్టారెంట్ చెయిన్లు, బేకరీల వరకు; మా ఫైర్ ఇన్సూరెన్స్ కవరేజీ అన్ని రకాల ఆహార పదార్థాల సంబంధిత సంస్థలకు బాగా సరిపోతుంది. ఫుడ్ కోర్టుల వద్ద రెస్టారెంట్లు, చాయ్ పాయింట్ (Chai Point), చాయోస్ (Chayyos) వంటి టీ దుకాణాలు, బర్గర్ కింగ్ (Burger King), పిజ్జా హట్ (Pizza Hut) వంటి ఫాస్ట్ ఫుడ్ సంస్థలు కూడా ఇటువంటి ఆస్తులకు కొన్ని ఉదాహరణలు.

హెల్త్ కేర్

కొన్ని ఆస్తులను మంటలు, అన్ని ఇతర ప్రమాదాల నుంచి కూడా సంరక్షించాల్సిన అవసరం ఉంటుంది; డిజిట్ ద్వారా ప్రాపర్టీ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆసుపత్రులు, క్లినిక్‎లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఫార్మసీలు, ఇతర మెడికల్ స్టోర్​లు కూడా కవర్ చేయబడుతాయి.

సేవలు & ఇతరాలు

పైన పేర్కొన్న కేటగిరీలు మాత్రమే కాకుండా డిజిట్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్​లో భాగంగా ఫైర్ ఇన్సూరెన్స్ కవరేజ్ అన్ని పరిమాణాలు మరియు స్వభావాల వ్యాపారాలకు సరిగ్గా సరిపోతుంది. 

భారతదేశంలో ఆన్‎లైన్ ఫైర్ ఇన్సూరెన్స్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)