ఆన్లైన్లో హోమ్ ఇన్సూరెన్స్ సంవత్సరానికి రూ.150 మాత్రమే..


Zero
Documentation
Quick Claim
Process
Affordable
Premium
,
Zero
Documentation
Quick Claim
Process
Affordable
Premium
,
అసలు హోమ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
నేను గృహ బీమాను ఎందుకు పొందాలి?
హోమ్ ఇన్సూరెన్స్ గురించి మీకు ఇప్పటికీ గందరగోళంగా ఉంటే ఇది చదవండి…
డిజిట్ అందిస్తున్న హోమ్ ఇన్సూరెన్స్‌లో గొప్పదనం ఏమిటి?
డిజిట్ హోమ్ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ అవుతాయి?
నోట్: ఇండియాలో చోరీలు సర్వసాధారణం. అటువంటి చోరీల నుంచి మీ ఇంటిని భద్రపరుచుకునేందుకు మీరు హోమ్ ఇన్సూరెన్స్ పాలసీని బర్గ్లరీ ఇన్సూరెన్స్ పాలసీ(UIN: IRDAN158RP0019V01201920)తో కలిపి తీసుకోవచ్చు.
హోమ్ ఇన్సూరెన్స్‌లోని రకాలు
ఆప్షన్ 1 |
ఆప్షన్ 2 |
ఆప్షన్ 3 |
మీ ఇంట్లో ఉండే కంటెంట్లు (మీకు సంబంధించిన వ్యక్తిగత వస్తువుల వంటివి) |
మీ ఇంటిని, ఇంటిలో ఉండే కంటెంట్లను ఇది కవర్ చేస్తుంది. |
మీ ఇంటిని, ఇంటిలో ఉన్న కంటెంట్‌ను, ఆభరణాలను కూడా కవర్ చేస్తుంది. |
హోమ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
- భవనం/ స్ట్రక్చర్: హోమ్ ఇన్సూరెన్స్‌లో భవనం అనేది మీ ఇంటి భౌతిక రూపంగా పరిగణించబడుతుంది.
- కంటెంట్ : కంటెంట్ అనేది మీ ఇంటిలో ఉన్న వ్యక్తిగత వస్తువులను తెలుపుతుంది. మీ ఇంటిలో ఉండే ఫర్నిచర్ కూడా హోమ్ ఇన్సూరెన్స్‌లో కవర్ చేయబడుతుంది.
మీ ఇంటిని హోమ్ ఇన్సూరెన్స్ ద్వారా సంరక్షించడం వలన లాభాలు ఏంటి?
హోమ్ ఇన్సూరెన్స్‌ను ఎవరు పొందాలి?
ఎటువంటి ఇళ్లు కవర్ అవుతాయంటే
డిజిట్ అందజేసే హోమ్ ఇన్సూరెన్స్ ద్వారా సొంత ఇళ్ల నుంచి అద్దెకున్న అపార్ట్మెంట్ల వరకు అన్ని రకాల ఇళ్లు కవర్ అవుతాయి. అన్ని రకాల గృహాలను కవర్ చేసేలా డిజిట్ హోమ్ ఇన్సూరెన్స్ రూపొందించబడింది.
హోమ్ ఇన్సూరెన్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు..
హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎందుకు ముఖ్యం?
మీ ఇల్లు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన వాటిలో ఒకటి. చాలా మందికి తమ జీవితంలోని అతి పెద్ద ఆస్తి కూడా ఇల్లే.
అందువల్ల మీరు ఆ ఆస్తిని చాలా భద్రంగా ఉంచుకోవాలి. హోమ్ ఇన్సూరెన్స్ అనేది మీ ఇంటిలో జరిగే దొంగతనాలను నివారించలేకపోయినా కానీ దొంగతనం వలన కలిగే నష్టాల నుంచి మాత్రం మిమ్మల్ని కాపాడుతుంది.
దొంగతనాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు, తుఫానుల వలన మీ ఇంటికి కలిగే నష్టాల నుంచి కవర్ చేసేందుకు హోమ్ ఇన్సూరెన్స్ చాలా అవసరం.
నేను హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఆన్లైన్లో ఎందుకు కొనుగోలు చేయాలి?
మీ ఇంటిని భద్రంగా ఉంచడం చిన్న విషయం కాదు. ఇందుకు సంబంధించి మీరు ఎల్లప్పుడూ సరైన నిర్ణయాలను మాత్రమే తీసుకోవాలి. నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా ప్రశాంతంగా ఆలోచించాలి.
ఆన్లైన్ హోమ్ ఇన్సూరెన్స్‌తో ఇది చాలా సులభం అవుతుంది. మీరు ఇంటి వద్దే కూర్చుని వివిధ రకాల హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను పోల్చి చూడవచ్చు. అంతేకాకుండా సరైన నిర్ణయాన్ని తీసుకోవచ్చు.
ఆన్లైన్లో హోమ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడంతో పాటుగా మీ పాలసీని కస్టమైజ్ చేయవచ్చు. ఇంకా డాక్యుమెంటేషన్‌ను మేనేజ్ చేయొచ్చు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇవన్నీ చేయొచ్చు. ఎటువంటి దస్తావేజుల అవసరం ఉండదు.
హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభావితం చేసే అంశాలు..
కొన్ని అంశాలు నేరుగా లేదా పరోక్షంగా హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభావితం చేస్తాయి. అటువంటి కొన్ని కారణాలు..
- ఇంటి రకం - మీ ఇల్లు మీ సొంతమా.. లేక అద్దెకు తీసుకున్నదా? అది అపార్ట్మెంట్లో ఉన్నా లేకున్నా సొంత బంగళా అయినా మీ హోమ్ ఇన్సూరెన్స్ మీ ఇంటి రకం మీద ఆధారపడుతుంది. హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఈ రకాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది.
- మీ ఇల్లు ఎంత పాతది – ఇతర బీమా పాలసీల లాగానే ఇక్కడ కూడా ప్రీమియాన్ని నిర్ణయించడంలో ఇంటి వయస్సు కీలకంగా పని చేస్తుంది.
- మీ ఇల్లు ఎంత పెద్దది – మీ ఇంటి వైశాల్యం (చదరపు అడుగుల విస్తీర్ణం) మీ హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై అత్యధిక ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ ప్రభావం నేరుగానే ఉంటుంది. ఎందుకంటే పెద్ద ఇంటికి ఎక్కువ బీమా మొత్తం అవసరం అవుతుంది. అందువలన ప్రీమియం కూడా ఎక్కువగా ఉంటుంది.
- ఇంటి భద్రతా చర్యలు - మీ ఇంటిలో ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారనే దాని మీద కూడా హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆధారపడి ఉంటుంది. మీ ఇంటిలో కనుక అగ్ని ప్రమాదాల నుంచి రక్షించే వ్యవస్థ ఉంటే మీ హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది తగ్గించబడుతుంది.
- అదనపు కవరేజ్- బేసిక్ హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు మీ ఇంటికి మాత్రమే వర్తిస్తాయి. ఇవి మీ వ్యక్తిగత వస్తువులకు కూడా వర్తిస్తాయి. కానీ బంగారు ఆభరణాలకు మాత్రం వర్తించవు. కొన్ని హోమ్ ఇన్సూరెన్స్‌లలో అదనపు కవర్లు అందుబాటులో ఉంటాయి. ఈ అదనపు కవర్లను ఎంచుకుంటే స్టాండర్డ్ ప్లాన్ కంటే ఎక్కువగా వస్తువులు కవర్ చేయబడతాయి. తద్వారా మీ బీమా ప్రీమియం ప్రభావితం చేయబడుతుంది.
హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను పోల్చేందుకు చిట్కాలు
మీరు హోమ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు.. మీ ఇంటికి సరిపోయే ప్లాన్‌ను ఎంచుకునేందుకు పరిశీలించాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు..
- కవరేజ్ ప్రయోజనాలు – మీరు హోమ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు చూడాల్సిన ముఖ్యమైన విషయం కవరేజ్. మీకు ఏ విధమైన కవరేజ్ అందుతుందో ఏ విధమైన కవరేజ్ అందదో పూర్తిగా తెలుసుకోవడం చాలా అవసరం. ఇలా తెలుసుకుంటే అనుకోని సందర్భాల్లో జరిగిన నష్టానికి మీరు క్లెయిమ్ చేసినప్పుడు కవర్ కాని విషయాల గురించి క్లెయిమ్ చేయరు. ఏది కవర్ అవుతుందో ఏది కవర్ కాదో తెలుసుకోవడం వలన మంచి ప్లాన్‌ను మీరు ఎంచుకునే అవకాశం ఉంటుంది.
- బీమా చేయబడిన మొత్తం – మీ హోమ్ ఇన్సూరెన్స్‌లో బీమా చేయబడిన మొత్తం అనేది మీరు క్లెయిమ్ చేసినప్పుడు పొందే గరిష్ట మొత్తాన్ని సూచిస్తుంది. కావున ఇది చాలా ముఖ్యం. బీమా చేయబడిన మొత్తం విలువను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కేవలం మీరు కట్టే ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని ప్రభావితం చేయడం మాత్రమే కాదు. మీరు క్లెయిమ్ చేసిన సమయంలో పొందే నష్టపరిహారాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
- అందుబాటులో ఉన్న యాడ్–ఆన్స్ – కొన్నిసార్లు మీకు ప్రాథమిక ప్లాన్ ప్రయోజనాల కంటే కూడా ఎక్కువ కవరేజ్ అవసరమవుతుంది. ఇక్కడే మీకు యాడ్–ఆన్స్ ఉపయోగపడతాయి. వివిధ బీమా కంపెనీలు వివిధ పరిధిలలోని యాడ్–ఆన్స్‌ను మీకు అందజేస్తాయి. అలాగే మీకు డిజిట్ ఇన్సూరెన్స్‌లో హోమ్ ఇన్సూరెన్స్ చేసే వారి కోసం.. జ్యువెలరీ ప్రొటెక్షన్ యాడ్–ఆన్ అందజేస్తాం. మీ ఆప్షన్లను పోల్చి చూసుకోని ఏది మీకు సరిగ్గా సూటవుతుందో దానిని ఎంచుకోండి.
సరైన బీమా మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?
ఇన్సూరెన్స్‌లో బీమా చేయబడిన మొత్తం విలువ మీరు క్లెయిమ్ చేసినప్పుడు పొందే గరిష్ట రికవరీని సూచిస్తుంది. ఇది మీరు ఇన్సూరెన్స్ చేసిన ఇంటి విలువను కూడా నిర్ణయిస్తుంది. కాబట్టి మీరు ఎంచుకున్న బీమా చేయబడిన మొత్తం విలువ మీ ఇంటి నిజమైన విలువను ప్రతిబింబిస్తుందని మీరు నిర్ధారించుకోవాలి. కావున మీరు సరైన మొత్తాన్ని బీమా విలువగా ఎంచుకోవాలి. మీ ఇంటి చదరపు అడుగుల విస్తీర్ణంతో పాటుగా ఇంటిలోని వస్తువుల విలువను కూడా అంచనా వేసి చెప్పాల్సి ఉంటుంది.