ఆన్​లైన్​లో షాప్ ఇన్సూరెన్స్ పాలసీ

property-insurance
property-insurance
usp icon

Zero

Documentation

usp icon

Quick Claim

Process

usp icon

Affordable

Premium

Zero Paperwork. Online Process
Select Property Type
Enter Valid Pincode
+91
Please enter valid mobile number
I agree to the Terms & Conditions
background-illustration
usp icon

Zero

Documentation

usp icon

Quick Claim

Process

usp icon

Affordable

Premium

background-illustration

షాప్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

షాప్ ఇన్సూరెన్స్ ఎందుకు ముఖ్యమైనది?

1
2021వ సంవత్సరంలో 6 మిలియన్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయని రికార్డులు చెబుతున్నాయి.(1)
2
ఇండియా రిస్క్​ సర్వే 2021 ప్రకారం అగ్నిప్రమాదాలు అనేవి నాలుగో అతిపెద్ద విపత్తుగా ఓటు వేయబడింది.(2)
3
 2020లో ఇడియాలో మొత్తం 9,329 ఫైర్ యాక్సిడెంట్ కేసులు నమోదయ్యాయి. (3)

డిజిట్ షాప్‌కీపర్ ఇన్సూరెన్స్ పాలసీ గొప్పదనం ఏమిటి?

  • సంపూర్ణ రక్షణ: వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తుల నుంచి మరియు అగ్నిప్రమాదాల వంటి వాటి నుంచి మా షాప్ ఇన్సూరెన్స్ కాపాడుతుంది. ఇది ఒకే పాలసీలో మీకు అనేక ప్రయోజనాలను అందజేస్తుంది.
  • సమ్ ఇన్సూర్డ్ (బీమా మొత్తం): మీ వ్యాపారం యొక్క స్వభావం మరియు పరిమాణం ఆధారంగా మీ బీమా మొత్తాన్ని మీ ఇష్టం వచ్చిన విధంగా సెట్ చేసుకునేందుకు మేము మీకు ఆప్షన్ అందిస్తాం.
  • త్వరిత ఆన్‌లైన్ క్లెయిమ్‌లు: మా షాప్ కీపర్స్ ఇన్సూరెన్స్​ సాంకేతికంగా ఎనేబుల్ చేయబడినది. దీంతో క్లెయిమ్‌లు సులభం అవడమే గాక, సెటిల్ చేయడం కూడా ఎంతో సులభం. క్లెయిమ్ చేస్తున్నప్పుడు మీకు కావలసిందల్లా స్మార్ట్‌ఫోన్, మా త్వరిత స్వీయ-తనిఖీ ప్రక్రియ ద్వారా మీకు మార్గనిర్దేశం చేయడానికి మా డిజిట్ యాప్ ఉపయోగపడుతుంది. (గమనిక: ఐఆర్​డీఏఐ (IRDAI) నిర్దేశించిన చట్టాల ప్రకారం రూ. 1 లక్ష కంటే ఎక్కువ క్లెయిమ్‌లకు భౌతిక తనిఖీలు అవసరం)
  • డబ్బుకు తగిన విలువ : వ్యాపారాన్ని నడపడంలో ఖర్చులు, లాభ నష్టాలతో కూడిన చక్కటి బ్యాలెన్స్ ఉంటుందని మేము అర్థం చేసుకున్నాము. అందుకే, మీ షాప్ బడ్జెట్‌కు సులభంగా సరిపోయేలా మేము మీకు సాధ్యమైనంత ఉత్తమమైన షాప్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని అందిస్తాము.
  • అన్ని వ్యాపార వర్గాలను కవర్ చేస్తుంది: మీకు చిన్న సాధారణ దుకాణం ఉన్నా లేదా పెద్ద తయారీ మిల్లు ఉన్నా; మా  షాప్‌కీపర్స్ ఇన్సూరెన్స్ వ్యాపారం యొక్క ప్రతీ రకం, పరిమాణానికి అనుగుణంగా కస్టమైజ్‌ చేయబడుతుంది.

డిజిట్ షాప్ కీపర్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏమేం కవర్ అవుతాయి

fire

అగ్ని ప్రమాదాల వల్ల సంభవించే నష్టం

ఇన్సూర్ చేయబడిన ప్రాపర్టీకి ఓన్ ఫర్మెంటేషన్ (మూలకాలను వేరు చేసే రసాయన ప్రక్రియ) వల్ల లేదా సహజంగా వేడి చేయడం వలన లేదా ఆకస్మిక అగ్నిప్రమాదం వల్ల ఏదైనా నష్టం సంభవిస్తే ఈ పాలసీ కవర్ చేస్తుంది. అంతే కాకుండా ఈ పాలసీ ఫారెస్ట్ ఫైర్ లేదా జంగిల్ ఫైర్ వల్ల సంభవించే నష్టాలను కూడా కవర్ చేస్తుంది.

Explosion, Implosion, Collison, Impact

పేలుడు, గుద్దుకోవడం వలన కలిగే ప్రభావం

బయటి వస్తువుల వలన కార్యాలయ ప్రాంగణానికి ఏదైనా పేలుడు, లేదా ఇంపాక్ట్/ఢీకొనడం వల్ల సంభవించే నష్టాలు సంభవించినా కానీ ఇది కవర్ చేస్తుంది.

Damage due to natural calamities

ప్రకృతి వైపరీత్యాలు

తుఫానులు, భూకంపాలు, అగ్ని పర్వత విస్పోటనాలు, సైక్లోన్స్, వరదలు మొదలైన వాటి కారణంగా లేదా భూమి కోతకు గురవడం మరియు పెద్ద పెద్ద బండరాళ్లు కొట్టుకు రావడం వల్ల బీమా చేయబడిన ప్రాపర్టీకి నష్టం జరిగితే కవర్ కాబడుతుంది.

Terrorism

తీవ్రవాదం

సమ్మెలు, అల్లర్లు, తీవ్రవాద చర్యలు, మరియు ఉద్దేశపూర్వకంగా చేయబడిన నష్టాల నుంచి ఇన్సూర్ చేయబడిన ఆస్తులు కవర్ చేయబడతాయి.

Theft

దొంగతనాలు

పైన పేర్కొన్న విషయాల వలన నష్టం జరిగిన తర్వాత ఏడు రోజుల్లోపు దొంగతనం రిపోర్ట్ చేయబడితే.

Other coverages

ఇతర కవరేజెస్

ఆటోమేటిక్ స్పింక్లర్ ఇన్​స్టలేషన్స్ మరియు వాటర్ ట్యాంకుల నుంచి లీకేజీ కారణంగా ఆస్తి నష్టం.

ఏమేం కవర్ చేయబడదు?

షాప్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల రకాలు

ఆప్షన్ 1

ఆప్షన్ 2

ఆప్షన్ 3

మీ షాప్​లోని కంటెంట్​కు మాత్రమే కవర్ అవుతుంది

మీ భవనం/నిర్మాణం, మీ షాపులోని కంటెంట్​ రెండింటికీ కవర్ అవుతుంది.

మీ బిల్డింగ్​ను కవర్ చేస్తుంది.

 

షాప్ ఇన్సూరెన్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

  • షాప్ కీపర్ ఇన్సూరెన్స్​లో ‘కంటెంట్​’ అంటే ఏమిటి: షాప్ కీపర్ ఇన్సూరెన్స్​లో కంటెంట్స్ అంటే మీ షాపులో ఉండే ప్రాథమిక వస్తువులు. ఉదాహరణకు మీరు బట్టల దుకాణాన్ని నడుపుతుంటే… మీ షాపులో అమ్మకానికి ఉంచిన వివిధ రకాల వస్త్రాలను కంటెంట్స్ సూచిస్తాయి.

 

  • షాప్‌కీపర్స్ ఇన్సూరెన్స్‌లో ‘బిల్డింగ్/స్ట్రక్చర్’ అంటే మీ ఉద్దేశం ఏమిటి - షాప్‌కీపర్స్ ఇన్సూరెన్స్‌లోని బిల్డింగ్/స్ట్రక్చర్ మీ షాప్ ఉన్న ప్రదేశాన్ని సూచిస్తుంది. ఇది పెద్ద కేంద్రం లేదా మాల్‌లో భాగంగా ఉన్న  దుకాణం లేదా గది కావచ్చు.

క్లెయిమ్‌ను ఎలా ఫైల్ చేయాలి?

మీరు షాప్​ కీపర్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్న తర్వాత డిజిట్​లో క్లెయిమ్స్ అన్ని సింపుల్​గా ఉంటాయి. కావున క్లెయిమ్ ప్రాసెస్ గురించి మీరు ఎటువంటి చింత పడాల్సిన అవసరం లేదు.

స్టెప్ 1

1800-258-5956 నంబర్​కు కాల్ చేయండి. లేదా hello@godigit.com కు మెయిల్ చేయండి. మీకు జరిగిన నష్టం మావద్ద రిజిస్టర్ చేయబడుతుంది.

స్టెప్ 2

మీకు ఒక స్వీయ-తనిఖీ లింక్ పంపబడుతుంది, తద్వారా మీరు మీ షాప్ లేదా దాని కంటెంట్‌లలో జరిగిన నష్టానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సులభంగా అప్‌లోడ్ చేయవచ్చు.

స్టెప్ 3

మీరు స్వీయ-తనిఖీ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, నష్టం అంచనా వేయబడటంతో పాటు ధృవీకరించబడుతుంది. అవసరమైతే (నష్టాలను డిజిటల్‌గా విశ్లేషించలేని నిర్దిష్ట పరిస్థితుల్లో), నష్టాన్ని అంచనా వేసే వ్యక్తి నియమించబడవచ్చు.

స్టెప్ 4

పరిస్థితిని బట్టి, ఎఫ్​ఐఆర్​ (FIR), నాన్​‌‌–ట్రేసేబుల్​ రిపోర్ట్ , అగ్నిమాపక శాఖ నివేదిక, ఇన్‌వాయిస్‌లు, కొనుగోలు పత్రాలు, అమ్మకపు పత్రాలు మొదలైన ఏవైనా అదనపు పత్రాలు అవసరమైతే మా కస్టమర్ కేర్ మీకు తెలియజేస్తుంది.

స్టెప్ 5

అన్నీ బాగుండి, నష్టం ధృవీకరించబడితే, మీరు సంబంధిత నష్టాలకు చెల్లింపు, పరిహారాలను అందుకుంటారు.

స్టెప్ 6

మీకు రావాల్సిన పరిహారం నెఫ్ట్​ (NEFT) బదిలీ ద్వారా ప్రాసెస్ చేయబడుతుంది.

షాప్‌కీపర్స్ ఇన్సూరెన్స్ పాలసీ ఎవరికి అవసరం?

ఫ్యామిలీ బిజినెస్ ఓనర్స్

మీరు సొంత దుకాణాన్ని కలిగి ఉండి దానిని నిర్వహిస్తున్నట్లయితే మీ షాప్​లో బట్టలు, బొమ్మలు, గృహోపకరణాలు, ఉపకరణాలు మొదలైన ఎంపిక చేసిన ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లయితే… మీ దుకాణం అన్ని రకాల నష్టాల నుంచి కవర్ చేయబడేందుకు మీరు మీ దుకాణానికి షాప్ ఇన్సూరెన్స్ అవసరం.

స్వతంత్ర దుకాణదారులు

ఎవరైతే తమ ప్రధాన ఆదాయ వనరుగా షాప్​ను భావిస్తున్నారో వారు షాప్​కీపర్ ఇన్సూరెన్స్ పాలసీని తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే మీరు దుకాణాన్ని కోల్పోయే ప్రమాదం లేదా ఆర్థిక కష్టాలు పడే ప్రమాదం ఉంది.

ప్రధాన ప్రాంతాల్లో దుకాణాలు ఉన్న దుకాణదారులు

నగరంలోని ప్రముఖ ప్రాంతాల్లో దుకాణాలను కలిగిన ఉన్న వ్యాపారస్తులు లేదా మహిళా వ్యాపారవేత్తలు, ఈ షాప్స్​ ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

ఒకటి కంటే ఎక్కువ షాపులు ఉన్న యజమానులు

ఒకటి కంటే ఎక్కువ దుకాణాలను కలిగి ఉన్న యజమానులు వారి షాపులన్నింటికీ షాప్ కీపర్స్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండాలి. మీ వ్యాపారానికి బీమా చేయడం వలన మీ షాప్ మరియు అందులోని వస్తువులను అనుకోని నష్టాల నుంచి కవర్ చేయడంతో పాటుగా.. మీ వ్యాపారం యొక్క స్థిరత్వాన్ని ప్రభావితం చేసే ఎటువంటి ప్రణాళిక లేని ఆర్థిక నష్టాలను మీరు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. 

ఎక్కువ రిస్క్ ఉండే వ్యాపారాలు

కొన్ని రకాల వ్యాపారాలు ఇతర వ్యాపారాల కంటే ఎక్కువ నష్టాలను చవి చూసే ప్రమాదం ఉంటుంది. ఉదాహరణకు సాధారణ దుకాణం కంటే ఆభరణాల దుకాణానికి ప్రమాదం సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా కొన్ని రకాల కర్మాగారాలు ఆఫీసుల కంటే ఎక్కువగా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. మీ వ్యాపారం యొక్క స్వభావం ఆధారంగా మీరు షాప్ ఇన్సూరెన్స్ పొందడం సరైందేనా? కాదా? అని మీరు అర్థం చేసుకోవచ్చు.

కవర్ చేయబడే దుకాణాల రకాలు

మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్స్

ప్రధానంగా మొబైల్ ఫోన్‌లు, మొబైల్ ఉపకరణాలు లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను విక్రయించే వ్యాపారాలు. ఉదాహరణకు క్రోమా, వన్‌ప్లస్, రెడ్‌మీ మొదలైన స్టోర్లకు నష్ట భయం ఉంటుంది. అటువంటి సందర్భంలో, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ స్టోర్ నష్టాల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది; వీటి విషయంలో అత్యంత సాధారణంగా జరిగే ప్రమాదాల్లో ఒకటి దొంగతనాలు.

కిరాణా, జనరల్ స్టోర్లు

పొరుగున ఉండే కిరాణా దుకాణాల నుంచి మీ బడ్జెట్ అనుకూలమైన సూపర్ మార్కెట్లు, సాధారణ దుకాణాల వరకు; అన్ని కిరాణా దుకాణాలు, సాధారణ దుకాణాలు కూడా ప్రాపర్టీ ఇన్సూరెన్స్​లో కవర్ చేయబడతాయి. బిగ్ బజార్, స్టార్ బజార్, రిలయన్స్ సూపర్ మార్కెట్ల వంటి దుకాణాలు ఇలాంటివాటికి కొన్ని సాధారణ ఉదాహరణలు.

కార్యాలయాలు మరియు విద్యాస్థలాలు

ఇది కార్యాలయ ప్రాంగణాలు, కళాశాలలు, కోచింగ్ ప్రాంగణాలు, పాఠశాలల వంటి విద్యాసంస్థలకు సరిగ్గా సరిపోయేలా రూపొందించబడింది. అటువంటి ఆస్తికి బీమా చేయించడం అనేది కేవలం నష్టాలను కవర్ చేయడానికి మాత్రమే కాకుండా.. విద్యార్థులు, మరియు ఉద్యోగులకు మీ సంస్థ మీద ఇది మరింత భరోసాను ఇస్తుంది. 

తయారీ రంగం మరియు ప్రాసెసింగ్

మీ వ్యాపారానికి సంబంధించిన తుది ఉత్పత్తులను తయారు చేసేందుకు వాడే అన్ని రకాల మిల్లులు మరియు ఫ్యాక్టరీలు ఇందులో ఉంటాయి. అది టెక్స్​టైట్ మిల్లు అయినా లేదా రసాయనాల తయారీ కేంద్రం అయినా సరే. డిజిట్ అందించే షాప్ కీపర్ ఇన్సూరెన్స్ పాలసీ అన్నింటికీ వర్తిస్తుంది. 

వ్యక్తిగత జీవనశైలి, ఫిట్‌నెస్

మీకు ఇష్టమైన మాల్స్, బట్టల దుకాణాల నుండి స్పాలు, జిమ్‌లు, ఇతర దుకాణాల వరకు; డిజిట్ ద్వారా ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పర్సనల్ లైఫ్‌స్టైల్, ఫిట్‌నెస్ విభాగంలోని అన్ని వ్యాపారాలకు కూడా వర్తిస్తుంది. అటువంటి ప్రాపర్టీలకు ఉదాహరణలలో ఎన్‌రిచ్ సెలూన్‌లు, కల్ట్ ఫిట్‌నెస్ సెంటర్‌లు, ఫీనిక్స్ మార్కెట్ సిటీ, ఇతర స్టోర్లు ఉంటాయి.

ఆహారం, తినదగినవి

ఆహారం తినే ప్రదేశాలు! కేఫ్‌లు, ఫుడ్ ట్రక్కుల నుంచి రెస్టారెంట్ చెయిన్లు, బేకరీల వరకు; డిజిట్ ద్వారా ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అన్ని రకాల ఆహార సంస్థలకు బాగా సరిపోతుంది. ఫుడ్ కోర్ట్‌లలోని రెస్టారెంట్లు, చాయ్ పాయింట్, చయ్యోస్ వంటి టీ దుకాణాలు, బర్గర్ కింగ్, పిజ్జా హట్ వంటి ఫాస్ట్ ఫుడ్ సంస్థలు కూడా అలాంటి వాటికి కొన్ని ఉదాహరణలు.

హెల్త్ కేర్

అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసిన అంశాలలో ఒకటి; డిజిట్ ద్వారా ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఆస్పత్రులు, క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఫార్మసీలు, ఇతర మెడికల్ స్టోర్లకు కూడా వర్తిస్తుంది.

ఇంటి మరమ్మతు సేవలు

వడ్రంగి, ప్లంబింగ్ రిపేర్ నుంచి మోటారు గ్యారేజీలు, ఇంజనీరింగ్ వర్క్‌షాప్‌ల వరకు ఈ కేటగిరీ వ్యాపారంలో ఉంటాయి.

ఇతరాలు

పైన పేర్కొన్న కేటగిరీలు కాకుండా, అన్ని పరిమాణాలు, వ్యాపారాల స్వభావానికి డిజిట్ ద్వారా ప్రాపర్టీ ఇన్సూరెన్స్‌‌కు అనుకూలంగా ఉంటుంది. మీరు జాబితాలో మీ వర్గాన్ని కనుగొనలేకపోతే, మమ్మల్ని సంప్రదించడానికి సంకోచించకండి. మీ ఇల్లు లేదా వ్యాపారం కోసం ఉత్తమంగా సరిపోయే ప్రాపర్టీ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడంలో మేము మీకు సహాయం చేస్తాము.

మీ షాప్‌కీపర్స్ ఇన్సూరెన్స్‌‌ పాలసీకి సరైన ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?

భారతదేశంలో షాప్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల గురించి మరింత తెలుసుకోండి

షాప్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి తరచూ అడిగే ప్రశ్నలు