ప్రాపర్టీ ఇన్సూరెన్స్ మీ ఇల్లు, దుకాణం మరియు వ్యాపారం కోసం

property-insurance
usp icon

Zero

Documentation

usp icon

Quick Claim

Process

usp icon

Affordable

Premium

back arrow
Home Insurance exchange icon
Zero Paperwork Online Process
home icon
shop icon
office icon
factory icon
Please enter property type
Please select property type
Enter Valid Pincode
+91
Please enter valid mobile number
I agree to the Terms & Conditions
background-illustration
background-illustration

అసలు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

ఇల్లు, అపార్ట్​మెంట్, వ్యాపారం, కేఫ్ లేదా ఆస్పత్రి వంటి అన్ని రకాల మీ వ్యాపారాలకు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ కవర్ అందజేస్తుంది. అగ్నిప్రమాదాలు, దొంగతనాలు, సహజ ప్రకృతి విపత్తుల వంటి అనుకోని విపత్తుల నుంచి ఈ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ మిమ్మల్ని కవర్ చేస్తుంది.

ప్రతీ ఒక్కరికి సొంత ఇల్లు అనేది ఒక కల. అటువంటి ఇంటిని మీరు కొనుగోలు చేసినపుడు దానిని సంరక్షించేందుకు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. మీ కలల ఇల్లు సురక్షితంగా ఉండేందుకు అవసరమైనదంతా మీరు చేయాలని అనుకుంటున్నారు. 

మీరు సొంత వ్యాపారాన్ని నడిపిస్తుంటే, అంతేకాకుండా మీ షాప్, కార్యాలయానికి కలిగే అన్ని రకాల నష్టాల నుంచి దానిని సంరక్షించాలని చూస్తే.. మీరు డిజిట్ అందిస్తున్న ప్రాపర్టీ ఇన్సూరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. మీ వ్యాపారం ఎంత సెన్సిటివ్ అయినా కానీ నష్టాల నుంచి ఇది కవర్ చేస్తుంది.

మీ అందమైన ఇంటిని లేదా స్టోర్​ను కానీ సంరక్షించాలని చూస్తే డిజిట్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇది రెండు రకాల ప్రయోజనాలతో మీకు లభిస్తుంది. అగ్ని ప్రమాదాలు, సహజ ప్రకృతి విపత్తుల, దొంగతనాల నుంచి (స్టాండర్డ్ ఫైర్ & పెరిల్స్) ఇది రక్షణను అందిస్తుంది. ఎందుకంటే వీటన్నింటి వలన అన్ని ఆస్తులకు రిస్క్ ఉంటుంది. ఇది అనుకోని సందర్భాల్లో మీకు ఏర్పడగల డ్యామేజీల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. అగ్ని ప్రమాదాలు, సహజ విపత్తులు, దొంగతనాలు, పేలుళ్ల వలన ఏర్పడే డ్యామేజీల నుంచి ఇది కవర్ చేస్తుంది.

Read More

ప్రాపర్టీ ఇన్సూరెన్స్ సరైనదో కాదో తెలియట్లేదా?

ఇది చదవండి.

Burglary
2017లో భారతదేశంలో 2,44,119 దొంగతనం, రాబరీ కేసులు నివాస ప్రాంతాల్లో జరిగాయి. (1)
Loss of Property
2017వ సంవత్సరంలో భారతదేశంలోని నివాస ప్రాంతాల్లో దొంగతనాలు దాదాపు 40 శాతం పెరిగాయి.  (2)
Fire Outbreak
వ్యాపార సంస్థలకు అగ్ని ప్రమాదాల వలన కలిగే రిస్క్ 3వ అతిపెద్ద రిస్క్​గా పరిగణించబడుతుంది. (3)
Home Theft
భారతదేశంలో జరిగే 70శాతం దొంగతనాలు నివాస సముదాయాల్లో జరిగేవే. (4)
Fire in Building
అగ్నిప్రమాదాల వలన ప్రభావితమైన భవనం​లో ఉన్న వ్యాపారాలు 25 నుంచి 30 శాతం వరకు తగ్గుదలను చూస్తాయి. (5)

డిజిట్ అందిస్తున్న ప్రాపర్టీ ఇన్సూరెన్స్​ గొప్పతనం ఏమిటి?

  • డబ్బుకు తగ్గ విలువ : ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనేది ఒక పెద్ద డీల్. దీని ద్వారా మీ బిల్డింగ్ అందులోని ఉన్న వస్తువులు కవర్ చేయబడతాయి. ఈ పాలసీ ఇన్సూరెన్స్ ప్రీమియంలు మీకు ఎక్కువగా అనిపించొచ్చు. కానీ మీకు తక్కువ ధరకు పాలసీ ప్రీమియంలు అందించేందుకు మేము ప్రయత్నిస్తాం.

  • డిజిటల్ ఫ్రెండ్లీ : డిజిట్ ఇండియా మొట్టమొదటి ఆన్​లైన్ బీమా సంస్థగా నిలిచింది. మా వద్ద చాలా రకాల పనులు ఆన్​లైన్​లోనే పూర్తవుతాయి. బిల్డింగ్ ఇన్సూరెన్స్ కొనుగోలు నుంచి క్లెయిములు చేయడం వరకు ఇలా ప్రతీ ఒక్కటి ఆన్​లైన్​లోనే ఉంటుంది. క్లెయిముల కోసం తనిఖీ అవసరమైనపుడు కూడా ఆన్​లైన్​లోనే పూర్తి చేయొచ్చు. కానీ ఐఆర్​డీఏఐ (IRDAI) నిబంధనల ప్రకారం రూ. 1 లక్ష కంటే ఎక్కువ విలువ గల క్లెయిముల కోసం మాన్యువల్​గా తనిఖీ చేయడం తప్పనిసరి.

  • అన్ని వ్యాపార కేటగిరీలను కవర్ చేస్తుంది : మీరు మీ కుటుంబ వ్యాపారం లేదా కిరాణా దుకాణాలను అలాగే స్టోర్స్​ను కవర్ చేయాలని భావించినా మా బీమా అన్ని రకాల వ్యాపారా​లకు సరిపోతుంది. ఆ వ్యాపారం పెద్దదైనా చిన్నదైనా మా బీమా కవర్ చేస్తుంది.

  • అద్దెదారులకు కూడా ప్లాన్లు : నేటి రోజుల్లో అద్దె ఇళ్లల్లో నివసించే వారు పెరిగిపోతున్నారు. అద్దెకు ఉన్న ఇల్లు ఎప్పటికీ సొంతం కాదు. అందుకోసమే అద్దెకు ఉండే వారి సొంత వస్తువుల కోసం మేము మీకు బీమా అందిస్తాం.

డిజిట్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్​లో ఏమేం కవర్ అవుతాయి?

Fires

అగ్నిప్రమాదాలు

అగ్ని ప్రమాదాల వలన భవనానికి, అందులోని కంటెంట్స్​కు జరిగే డ్యామేజీల నుంచి కవర్ చేస్తుంది.

Explosion & Aircraft Damage

పేలుళ్లు, ఎయిర్​క్రాఫ్ట్ డ్యామేజ్

మీ ఇంటిని ఈ బీమా పేలుళ్లు, ఎయిర్​క్రాఫ్ట్ డ్యామేజీల నుంచి కాపాడుతుంది.

Storms

తుఫానులు

భయంకరమైన తుఫానుల వలన మీ ఆస్తికి కలిగే నష్టాల నుంచి ఇది కవర్ చేస్తుంది. తుఫానుల వలన భారీ మెరుపులు సంభవించి ఆస్తి నష్టం కలిగితే ఈ పాలసీ కవర్ చేస్తుంది.

Floods

వరదలు

వరదల వలన మీ ఆస్తికి నష్టం కలిగినపుడు ఈ పాలసీ సంరక్షిస్తుంది. వర్షాలు అదుపుతప్పి మీ ఆస్తులకు నష్టం వాటిల్లిపుడు ఇది కవర్ చేస్తుంది.

Burglaries

దొంగతనాలు

భారతదేశంలో దొంగతనాలు సహజం. అనుకోని సందర్భాల్లో దొంగతనాలు జరిగినపుడు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఆస్తిని, దానిలోని కంటెంట్​ల​ను కవర్ చేస్తుంది. డిజిట్ బర్గ్​లరీ ఇన్సూరెన్స్ కింద ఇవి కవర్ అవుతాయి. (UIN: IRDAN158RP0019V01201920).

Earthquakes

భూకంపాలు

ప్రకృతి ప్రకోపాల నుంచి తప్పించుకోవడం అసాధ్యం. కానీ.. మీకు సంభవించగల అవకాశం ఉన్న నష్టాల నుంచి మిమ్మల్ని మీరు కవర్ చేసుకోవడం చాలా అవసరం. ప్రాపర్టీ ఇన్సూరెన్స్ భూకంపం వంటి ప్రకృతి విపత్తుల వలన కలిగే నష్టాన్ని కూడా కవర్ చేస్తుంది.

డిజిట్ అందించే ప్రాపర్టీ ఇన్సూరెన్స్‌ పాలసీలు

Home Insurance

హోమ్ ఇన్సూరెన్స్

మీ ఇంటికి సరిపోయే హోమ్ ఇన్సూరెన్స్ రూపొందించబడింది. అది అపార్ట్​మెంట్​ అయినా లేదా విల్లా, స్వతంత్ర భవనం అయినా కానీ కవర్ చేయబడుతుంది. అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు, వరదలు, దొంగతనాలు, తుఫానుల వంటి అనుకోని సందర్భాల్లో మీ ఇంటిని, దానిలోని కంటెంట్లను హోమ్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది.

Business & Shop Insurance

బిజినెస్​, షాప్ ఇన్సూరెన్స్

బిజినెస్ లేదా షాప్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది వ్యాపార సంబంధిత ఆస్తులకు రక్షణ అందించేందుకు రూపొందించబడింది. అవి కిరాణా షాపులు అయినా కావొచ్చు లేదా బొటిక్స్, జనరల్ స్టోర్స్, కార్యాలయాలు, కర్మాగారాలు, మాల్స్ ఇలా ఏవైనా కానీ వాటికి సంభవించగల అవకాశం ఉన్న డ్యామేజీలు, ప్రకృతి విపత్తులు, దొంగతనాలు, అగ్నిప్రమాదాల వలన సంభవించే నష్టాల నుంచి కవర్ చేస్తుంది.

ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ప్లాన్​ల రకాలు

డిజిట్ ఇన్సూరెన్స్ ద్వారా అగ్నిప్రమాదాలు, సహజ ప్రకృతి విపత్తులైన వరదలు, భూకంపాల వంటి వాటి నుంచి మీ ఆస్తులను కాపాడుకోవచ్చు. మీరు డిజిట్ స్టాండర్డ్ ఫైర్ & స్పెషల్ పెరిల్స్ పాలసీని ఎంచుకుని రక్షణ పొందొచ్చు. అంతేకాకుండా ఆస్తులకు దొంగతనాల ముప్పు ఎప్పుడైనా ఉంటుంది. కావున మీ ఆస్తిని అగ్నిప్రమాదాలు, సహజ విపత్తుల నుంచి మాత్రమే కాకుండా దొంగతనాలు, రాబరీల నుంచి కూడా ఇది కాపాడుతుంది. మా కవరేజ్ ఆప్షన్లు కింద ఇవ్వబడ్డాయి.

ఆప్షన్ 1

ఆప్షన్ 2

ఆప్షన్ 3

మీ ఇల్లు లేదా వ్యాపారంలో ఉన్న కంటెంట్లను మాత్రమే కవర్ చేస్తుంది.

మీ ఇల్లు లేదా వ్యాపారంలో ఉన్న భవనాలు, వాటిలోని కంటెంట్స్​ను ఇది కవర్ చేస్తుంది.

మీ ఇల్లు లేదా వ్యాపార భవనాలను, వాటిలోని కంటెంట్స్​ను, అంతేకాకుండా షాపు కౌంటర్లలో ఉన్న విలువైన వస్తువులను కూడా కవర్ చేస్తుంది.

ప్రాపర్టీ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు

  • కంటెంట్- ప్రాపర్టీ ఇన్సూరెన్స్​లో కంటెంట్ దేనిని సూచిస్తుందని చాలా మంది తికమకపడతారు. ఇది మీ ఇంట్లో మీకు చెందిన పర్సనల్ వస్తువులను సూచిస్తుంది. ఉదాహరణకు: మీ ఇంట్లో ఒక దొంగతనం జరిగి ల్యాప్​టాప్ దొంగతనానికి గురయిందని అనుకోండి. మీ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ కంటెంట్స్​ను కవర్ చేస్తుంది కనుక ల్యాప్​టాప్ కూడా కవర్ అవుతుంది.
  • బిల్డింగ్/స్ట్రక్చర్ – పేరుకు తగ్గట్లుగానే మీ ప్రాపర్టీ ఇన్సూరెన్స్​లో బిల్డింగ్ లేదా స్ట్రక్చర్ అనేది మీరు కవర్ చేసే మొత్తం ప్రాపర్టీని సూచిస్తుంది. మీరు మీ ఇంటిని లేదా మీ సొంత విల్లాను సంరక్షించాలని చూస్తున్నట్లయితే అవి భవనాన్ని సూచిస్తాయి.

ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఎవరికి అవసరం?

మీరు నివసించే ఇల్లు అయినా లేదా వ్యాపార కార్యాలయం అయినా వాటిని అనుకోని విపత్తుల నుంచి రక్షించుకునేందుకు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అవసరం. దొంగతనాలు లేదా సహజ ప్రకృతి విపత్తుల వలన సంభవించే భారీ ఆర్థిక నష్టాల నుంచి ఇది మిమ్మల్ని కవర్ చేస్తుంది.

ఇంటి యజమానులు

కొన్నేళ్ల నుంచి ఇది మీ ఇల్లు అయినా లేదా మీ కలల సౌధం అయినా కానీ అది చాలా విలువైనది. మీ చేతిలో లేని విపత్కర పరిస్థితుల నుంచి మీ ఇంటిని, మీ జేబుకు ఆర్థిక నష్టం కలగకుండా కాపాడుకునేందుకు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి.

అద్దెదారులు

సాధారణంగా ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనేది సొంతంగా భవనాలు ఉన్న వారికేనని అందరూ అనుకుంటారు. కానీ అది తప్పు. ఇంటి కోసం కానీ ఆఫీసుల కోసం కానీ భవనాలను అద్దెకు తీసుకున్న వారి కోసం కూడా డిజిట్​లో కస్టమైజ్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. మీలో ఎవరైతే ఈ కేటగిరీకి చెందుతారో వారికోసం కూడా ఇన్సూరెన్స్ రూపొందించబడి ఉంది.

చిన్న వ్యాపారాల యజమానులు

మీరు చిన్న బొటిక్ లేదా చిన్న జనరల్ స్టోర్ నడుపుతున్నా డిజిట్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ మీకు సరిగ్గా సూటవుతుంది. స్వతంత్రంగా చిన్న వ్యాపారం నిర్వహించినా కూడా ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఉండటం వలన అనుకోని సందర్భాల్లో కలిగే విపత్తుల నుంచి ఎటువంటి నష్టాలు కలగకుండా మిమ్మల్ని ఆర్థికంగా రక్షిస్తుంది.

మధ్య తరహా వ్యాపారాల యజమానులు

మీరు కనుక మధ్య తరహా స్టోర్లను, రెస్టారెంట్లను నడుపుతుంటే.. అగ్నిప్రమాదాలు, దొంగతనాలు, పేలుళ్లు, ప్రకృతి విపత్తులు, భూకంపాలు, తుఫానుల నుంచి రక్షించుకునేందుకు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ సరిగ్గా సూటవుతుంది.

పెద్ద సంస్థలు

మీరు కనుక అనేక ఆస్తులను కలిగి పెద్ద స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తుంటే.. అటువంటి వారికి ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. వారికి ఉన్న అనేక వ్యాపారాలను ప్రాపర్టీ ఇన్సూరెన్స్ సంరక్షిస్తుంది. దాని వలన బిజినెస్ రిస్క్ తగ్గుతుంది. మీ అన్ని ఆస్తులను రక్షించుకునేందుకు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ సాయపడుతుంది.

కవర్ అయ్యే హోమ్ ప్రాపర్టీలు

వ్యక్తిగత అపార్ట్​మెంట్

హౌజింగ్ సొసైటీలు లేదా సొంత బిల్డింగ్​లలో ఉన్న సొంత ఫ్లాట్​లలోని వారికి ఇది సరిపోతుంది. పైన పేర్కొన్న వాటిలో మీరు ఫ్లాట్​ను కలిగి ఉన్నా లేదా అద్దెకు తీసుకున్నా కానీ ఇది రెండింటికీ సరిపోతుంది.

 

స్వతంత్ర భవనం

మీరు, మీ పెద్ద కుటుంబం ఒక పెద్ద సొంత భవనంలో లేదా అందులో అద్దెకు నివసిస్తున్నారని అనుకుందాం. ఇటువంటి సందర్భంలో డిజిట్ అందించే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ద్వారా మీరు వారందరినీ కవర్ చేసే ప్లాన్ ఎంచుకోవచ్చు.

స్వతంత్ర విల్లా

మీకు సొంత విల్లా లేదా ఇల్లు ఉంటే లేదా అటువంటి వాటిలో అద్దెకు ఉంటే.. వరదలు, దొంగతనాలు, తుఫానులు మొదలైన నష్టాల నుంచి మీ ఇంటిని అందులో ఉన్న కంటెంట్లను సంరక్షించేందుకు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి.

కవర్ అయ్యే షాప్, వ్యాపార ఆస్తుల రకాలు

మొబైల్, ఎలక్ట్రానిక్స్

ప్రధానంగా మొబైల్ ఫోన్లు లేదా మొబైల్ యాక్సెసరీలు లేదా ఎలక్ట్రానిక్ పరికరాలను అమ్మే అమ్మే వ్యాపారాలు. క్రోమా (Croma), వన్​ప్లస్ (OnePlus), రెడ్​మీ (Redmi) వంటి స్టోర్లు ఇందుకు ఉదాహరణ. సంభవించగల నష్టాలు, డ్యామేజీల నుంచి ఇటువంటి ఆస్తులకు ఆస్తి నష్టం జరిగితే ఇది కవర్ చేస్తుంది. దొంగతనాల వలన ఇక్కడ ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది.

గ్రోసరీ, జనరల్ స్టోర్స్

మీకు ఇరుగు పొరుగున ఉన్న కిరాణా షాపుల నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ సూపర్​ మార్కెట్లు, జనరల్ స్టోర్ల వరకు ప్రాపర్టీ ఇన్సూరెన్స్​లో కవర్ అవుతాయి. బిగ్ బజార్ (Big Bazaar), స్టార్ బజార్ (Star Bazaar), రిలయన్స్ సూపర్​ మార్కెట్ (Reliance Supermarkets) వంటివి ఇందుకు కొన్ని ఉదాహరణలు.

కార్యాలయాలు, విద్యాసంస్థల ఆవరణలు

మా ప్రాపర్టీ ఇన్సూరెన్స్​లో ఈ కేటగిరీ అనేది కార్యాలయాలు, విద్యాసంస్థలకు సరిపోయేలా రూపొందించబడింది. ఇందులో పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు వస్తాయి. ఈ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ చేయడం వలన మీరు ఆర్థిక నష్టాల నుంచి కవర్ అవడమే కాకుండా మీ విద్యార్థులు, ఉద్యోగులకు ఇన్​స్టిట్యూట్ పట్ల విశ్వాసం మరింతగా పెరుగుతుంది.

హోమ్ రిపేర్ సర్వీసులు

వడ్రంగి, ప్లంబింగ్ మరమ్మతుల నుంచి మోటారు గ్యారేజీలు, ఇంజనీరింగ్ వర్క్​షాపుల వరకు ఇటువంటి వ్యాపారాలు ఉంటాయి.

పర్సనల్ లైఫ్ స్టైల్, ఫిట్​నెస్

మీకు ఇష్టమైన మాల్స్, వస్త్ర దుకాణాల నుంచి స్పాల వరకు జిమ్స్, ఇతర స్టోర్లకు డిజిట్ అందించే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ సరిగ్గా సూటవుతుంది. డిజిట్ పర్సనల్ లైఫ్ స్టైల్, ఫిట్​నెస్ సెక్టార్ వ్యాపారాలను కూడా కవర్ చేస్తుంది. ఎన్​రిచ్ సెలూన్స్ (Enrich Salons), కల్ట్ ఫిట్​నెస్ సెంటర్లు (Cult Fitness Centers,), ఫొయెనిక్స్ మార్కెట్ సిటీ (Phoenix Market City) వంటి ఇతర స్టోర్లు ఉదాహరణలుగా ఉంటాయి.

ఆహారం, తినుబండారాలు

అందరూ తినే సాధారణ స్థలం హోటళ్లు, ఫుడ్ ట్రక్కులు. డిజిట్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్​లో కేఫ్​ల నుంచి బేకరీల వరకు ప్రతీ దానిని కవర్ చేస్తుంది. ఇవి అన్నింటికి సరిగ్గా సూటవుతాయి. ఫుడ్ కోర్టులు, టీ షాప్స్, చాయ్ పాయింట్ (Chai Point), చయ్యోస్ (Chayyos) వంటివి మరియు ఫాస్ట్ ఫుడ్ జాయింట్స్ అయిన బర్గర్ కింగ్ (Burger King), పిజ్జా హట్ (Pizza Hut) వంటివి వీటికి ఉదాహరణలు.

ఆరోగ్య సంరక్షణ

మనం తప్పకుండా సంరక్షించాల్సిన ఆస్తుల్లో ఇదొకటి. డిజిట్ అందించే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్స్, ఫార్మసీలు, మెడికల్ స్టోర్లను కవర్ చేస్తుంది.

ఇతరాలు

పైన పేర్కొన్న కేటగిరీలు కాకుండా మీకు వేరే కేటగిరీకి కూడా డిజిట్ అన్ని విధాలుగా సూటయ్యే ప్రాపర్టీ ఇన్సూరెన్స్​ను అందిస్తుంది. మీరు కేటగిరీ లిస్టులో కనుగొనలేకపోతే మాకు నిస్సంకోచంగా కాల్ చేయండి. మేము మీకు బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ అందించడంలో సహాయం చేస్తాం.

భారతదేశంలో ప్రాపర్టీ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోండి.

భారతదేశంలో ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీల గురించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQలు)