మీ ఇల్లు, దుకాణం మరియు వ్యాపారం కోసం బర్గ్​లరీ ఇన్సూరెన్స్
property-insurance
usp icon

Zero

Documentation

usp icon

Quick Claim

Process

usp icon

Affordable

Premium

Terms and conditions apply*

back arrow
Home Insurance exchange icon
Zero Paperwork. Online Process.
home icon
shop icon
office icon
factory icon
Please enter property type
Please select property type
Enter Valid Pincode
+91
Please enter valid mobile number
I agree to the Terms & Conditions
background-illustration
background-illustration

బర్గ్​లరీ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

బర్గ్​లరీ ఇన్సూరెన్స్ అనేది ప్రాపర్టీ ఇన్సూరెన్స్​లో చేర్చబడిన ఒక ముఖ్యమైన కవరేజీ. ఇది దోపిడీ లేదా దొంగతనాల వల్ల మీ ఇల్లు లేదా మీ వ్యాపారానికి కలిగే నష్టాల నుంచి కవర్ చేస్తుంది. ఇది మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 

మీకు సొంత ఇల్లు ఉన్నా లేక మీరు గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్నా లేదా సొంతంగా దుకాణం లేదా ఆఫీసు కలిగి ఉన్నా కానీ ఊహించిన దొంగతనాల వలన మీ ఆస్తికి కలిగే నష్టం నుంచి మిమ్మల్ని కవర్ చేయడంలో బర్గ్​లరీ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యమైనది. 

Read More

బర్గ్​లరీ ఇన్సూరెన్స్ ఎందుకు ముఖ్యమో అర్థం కావడం లేదా?

పూర్తిగా చదవండి..

1

2021వ సంవత్సరంతో పోల్చుకుంటే 2022లో దేశరాజధానిలో దోపిడీ కేసులు 112 శాతం మేర పెరిగాయి. (1)

 

2

2021లో ఇండియాలో 2,81,602 ఆస్తి నేరాలు నివాస సముదాయాల్లో రిజిస్టర్ అయ్యాయి. (2)

 

3

2021లో ఇండియాలో ఆస్తుల కేసులు18.5 శాతం మేర పెరిగాయి. ఆ మొత్తంలో 12.8 శాతం దోపీడీలకు సంబంధించ కేసులే ఉన్నాయి. (3)

 

డిజిట్ అందించే బర్గ్​లరీ ఇన్సూరెన్స్ గొప్పతనం ఏమిటి?

  • వాల్యూ ఫర్ మనీ: మీ ఆస్తులను నష్టాల నుంచి కాపాడటం సవాల్​తో కూడుకున్నది. ఎంతలా ఆలోచించినా ఇక్కడ ప్రమాదం పొంచి ఉంది. కావున బర్గ్​లరీ ఇన్సూరెన్స్ ప్రీమియంలు చాలా ఎక్కువగా ఉంటాయని మీరు భావిస్తారు. కానీ సాధ్యమైనంత తక్కువ ధరలకు మీకు పాలసీలు అందించేందుకు మేము శాయశక్తులా కృషి చేస్తాం. అనుకోని సందర్భాల్లో జరిగే దొంగతనాల వలన సంభవించే నష్టాల నుంచి ఇది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది.

  • డిజిటల్ ఫ్రెండ్లీ: భారదేశంలో మొదటి డిజిటల్ ఇన్సూరెన్స్ కంపెనీగా డిజిట్ నిలిచింది. మేము అన్ని ప్రక్రియలను సులభతరం చేసేందుకు ప్రయత్నిస్తాం. బర్గ్​లరీ ఇన్సూరెన్స్ కొనుగోలు నుంచి ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే వరకు అన్నీ ఆన్​లైన్​లోనే ఉంటాయి. ఒకవేళ తనిఖీ అవసరమైనా కానీ ఆన్​లైన్​లోనే పూర్తవుతుంది. (రూ. 1 లక్ష కంటే ఎక్కువ క్లెయిమ్స్ విషయంలో ఐఆర్​డీఏఐ (IRDAI) (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్​మెంట్ అథారిటీ) నిబంధనల ప్రకారం మ్యాన్యువల్ తనిఖీ అవసరం.)

  • అన్ని రకాల బిజినెస్ కేటగిరీలను కవర్ చేస్తుంది: ఒక వేళ మీరు మీ ఫ్యామిలీ బిజినెస్ కవర్ చేసుకోవాలనుకున్నా, ఆఫీస్ స్పేస్, కిరాణా స్టోర్ లేదా స్టోర్స్ చెయిన్ వంటి వాటికి బర్గ్​లరీ ఇన్సూరెన్స్ సరిగ్గా సరిపోతుంది. మా ఇన్సూరెన్స్ పాలసీ అన్ని రకాల బిజినెస్​లకు సరిపోతుంది. అవి ఎంత పెద్దవి ఎంత చిన్నవి అని మేము చూడం.

  • అద్దెదారుల కోసం ప్లాన్స్: నేటి రోజుల్లో అనేక మంది అద్దెకు ఉంటున్నారని మేము అర్థం చేసుకున్నాం. అందుకోసమే అద్దెదారులకు కూడా ఇన్సూరెన్స్ ప్లాన్లను మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు సొంతం కాని విషయాలకు కూడా మా వద్ద ఇన్సూరెన్స్ ప్లాన్లు ఉన్నాయి. మీరు మీ రెంటల్ అపార్ట్​మెంట్​ను దొంగతనాల నుంచి కవర్ చేయాలని భావిస్తే బర్గ్​లరీ ఇన్సూరెన్స్ పాలసీ సరిగ్గా సరిపోతుంది.

డిజిట్ అందించే బర్గ్​లరీ ఇన్సూరెన్స్​లో ఏం ఏం కవర్ అవుతాయి?

డిజిట్ అందించే బర్గ్​లరీ ఇన్సూరెన్స్ పాలసీ కింది కవరేజీలను అందిస్తుంది. 

 

Loss/damage to property

ఆస్తికి ఏదైనా డ్యామేజ్ జరిగితే

పాలసీ పీరియడ్​లో దొంగతనాలు, ఇల్లు బద్దలు కొట్టడం, ఇతర దోపిడీ వంటి వాటి వల్ల ఆస్తికి ఏదైనా నష్టం కలిగితే పాలసీ ప్రకారం కవర్ చేయబడుతుంది.

Damage to premises

ప్రాంగణానికి కలిగే నష్టం

ఏదైనా దొంగతనం జరిగినపుడు లేదా దొంగతనం చేసేందుకు ప్రయత్నించినపుడు ఆవరణకు జరిగే నష్టం ఈ పాలసీలో కవర్ చేయబడుతుంది.

Cost incurred for damaged locks

పాడయిపోయిన తాళాలకు అయ్యే ఖర్చు

బీమా చేయబడిన స్థలంలో ఉన్న పాడయిపోయిన తాళాలకు అయ్యే ఖర్చును కూడా పాలసీ భరిస్తుంది.

Damage to safe/strong room

సేఫ్ లేదా స్ట్రాంగ్ రూమ్​కు జరిగిన నష్టం

బీమా చేసిన స్థలంలో ఉన్న సేఫ్ లేదా స్ట్రాంగ్ రూమ్​కు జరిగిన ఏదైనా నష్టాన్ని పాలసీ కవర్ చేస్తుంది.

బర్గ్​లరీ ఇన్సూరెన్స్ రకాలు

డిజిట్ అందించే బర్గ్​లరీ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం ద్వారా మీ పూర్తి ప్రాపర్టీలను రక్షించుకోవచ్చు. డిజిట్ అందజేస్తున్న స్టాండర్డ్ ఫైర్ & స్పెషల్ పెరిల్స్ పాలసీలో దొంగతనాలు, ప్రకృతి విపత్తులు, అగ్నిప్రమాదాల వలన కలిగే డ్యామేజెస్ కవర్ చేయబడతాయి. మేము అందించే కొన్ని రకాల కవరేజ్ టైప్స్..

ఆప్షన్ 1

ఆప్షన్ 2

ఆప్షన్ 3

మీ ఇల్లు లేదా ఆఫీసులో ఉన్న కంటెంట్స్ మాత్రమే కవర్ చేస్తుంది.

మీ ఇల్లు లేదా ఆఫీసు బిల్డింగ్ మరియు అందులో ఉన్న కంటెంట్స్​ను కవర్ చేస్తుంది.

మీ ఇల్లు లేదా ఆఫీసు భవనం, కంటెంట్స్​ను కవర్ చేస్తుంది. అంతే కాకుండా నగదు వంటి విలువైనవాటిని కూడా కవర్ చేస్తుంది.

బర్గ్​లరీ ఇన్సూరెన్స్ ఆఫర్ చేసేది

  • మీ ఇంటికి బర్గ్​లరీ ఇన్సూరెన్స్- నివాస భవనాలు, సొంత భవనాల్లో దొంగతనాలు జరగడం చాలా సాధారణం. భారతదేశంలో 70 శాతం దొంగతనాలు నివాస ప్రాంతాల్లోనే జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. మీరు సొంతింట్లో ఉన్నా లేదా కమ్యూనిటీ కాంప్లెక్స్​లో నివసిస్తున్నా బర్గ్​లరీ ఇన్సూరెన్స్ మీకు సరిగ్గా సూటవుతుంది.

  • మీ బిజినెస్, షాప్​కు బర్గ్​లరీ ఇన్సూరెన్స్- పనివేళలు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ వారి షాప్స్​కు, ఆఫీసులకు తాళాలు వేసుకుని వెళ్లిపోతారు. మీ షాప్ ఎక్కడ ఉందనే దాని మీద ఆధారపడి దొంగతనం జరిగే రిస్క్ ఉంటుంది. మా కస్టమైజ్డ్ బర్గ్​లరీ ఇన్సూరెన్స్ ద్వారా మీరు దొంగతనాల వలన జరిగే నష్టాల నుంచి కవర్ కావొచ్చు.

బర్గ్​లరీ ఇన్సూరెన్స్ ఎవరికి అవసరం?

దొంగతనాలను ఊహించడం చాలా కష్టం. ఇవి చాలా నష్టాలను కలగజేస్తాయి. షాప్ ఓనర్లు, హోమ్ ఓనర్స్ ప్రతి ఒక్కరూ బర్గ్​లరీ ఇన్సూరెన్స్​ను కలిగి ఉండాలి. అందులో ఉన్న కంటెంట్స్​ను ప్రొటెక్ట్ చేసుకునేందుకు బర్గ్​లరీ ఇన్సూరెన్స్​ సరిగ్గా సూటవుతుంది.

ఇంటి యజమానులు

ఏళ్లుగా మీ సొంత ఇల్లు అయినా లేదా మీ కొత్త కలల ఇల్లు అయినా కానీ సొంతిల్లు అంటే మీకు చాలా గొప్పది. అనుకోని సందర్భాల వల్ల మీ ఇంటికి జరిగే డ్యామేజెస్ నుంచి ఇది కాపాడుతుంది.

అద్దెకు ఉండేవారు

బర్గ్​లరీ ఇన్సూరెన్స్ ప్రాపర్టీలను కలిగి ఉన్న వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ డిజిట్​లో మేము అందజేసే బర్గ్​లరీ ఇన్సూరెన్స్ అద్దెకు ఉండేవారికి కూడా కవర్ అవుతుంది. మీరు ఒకవేళ అపార్ట్​మెంట్​ను అద్దెకు తీసుకుని నివసిస్తున్నా బర్గ్​లరీ ఇన్సూరెన్స్ కాపాడుతుంది.

చిన్న వ్యాపారాల యజమానులు

మీరు ఒక వేళ చిన్న జనరల్ స్టోర్ లేదా చిన్న బొటిక్ నడిపినా కూడా లేదా కస్టమైజ్డ్ చేనేత కళల స్టోర్స్ నడిపినా కానీ మీకు బర్గ్​లరీ ఇన్సూరెన్స్ కవరేజ్ చేస్తుంది. ఎవరైనా స్వతంత్ర వ్యాపారం నిర్వహించినా కానీ మీరు తప్పకుండా బర్గ్​లరీ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. జరిగే అవకాశమున్న నష్టాలు, డ్యామేజీల నుంచి ఇది కవర్ చేస్తుంది.

మధ్య తరహా వ్యాపారాల యజమానులు

మీరు జనరల్ స్టోర్స్ చెయిన్లు నిర్వహిస్తుంటే మేము అందజేసే బర్గ్​లరీ ఇన్సూరెన్స్ మధ్య తరహా వ్యాపారాలను కవర్ చేసేందుకు సరిగ్గా సరిపోతుంది. దొంగతనాల వలన మధ్య తరహా వ్యాపారాల యజమానులకు కలిగే డ్యామేజీలు, నష్టాల నుంచి మిమ్మల్ని కవర్ చేస్తుంది. మీ వ్యాపారం పెద్దదా? చిన్నదా అనేది డిజిట్ పట్టించుకోదు.

పెద్ద సంస్థలు

మీ వ్యాపారం చాలా పెద్దది అయితే దానిని కాపాడుకోవడం కోసం మీరు బర్గ్​లరీ ఇన్సూరెన్స్ ఎంచుకోవాలి. దీని వలన బిజినెస్ రిస్క్ తగ్గిపోతుంది. అంతే కాకుండా మీ బిజినెస్​కు గుడ్ విల్ కూడా పెరుగుతుంది.

బర్గ్​లరీ ఇన్సూరెన్స్​లో కవర్ అయ్యే పర్సనల్ ప్రాపర్టీలు

బర్గ్​లరీ ఇన్సూరెన్స్​లో కవర్ అయ్యే పర్సనల్ ప్రాపర్టీలు

హౌజింగ్ సొసైటీలు, సొంత భవనాల్లో ఉన్న ఫ్లాట్స్​లో నివసించే వారి కోసం. మీరు ఆ ఫ్లాట్​ను అద్దెకు తీసుకున్నా లేక అది మీ సొంతమైనా కానీ బర్గ్​లరీ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.

ఇండిపెండెంట్ బిల్డింగ్

ఒక వేళ మీ పెద్ద ఫ్యామిలీ అంతా సొంత భవనంలో లేదా పెద్ద భవనంలో అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు అనుకుందాం. ఈ సందర్భంలో మీరు డిజిట్ అందిస్తున్న SFSP (స్టాండర్డ్ ఫైర్ మరియు పెరిల్స్ పాలసీ) పాలసీలో భాగంగా బర్గ్​లరీ ఇన్సూరెన్స్​తో వారందరినీ కవర్ చేయొచ్చు.

ఇండిపెండెంట్ విల్లా

మీరు ఇండిపెండెంట్ విల్లా కలిగి ఉన్నా లేక విల్లాలో అద్దెకు ఉన్నా మీకు బర్గ్​లరీ ఇన్సూరెన్స్ కవరేజ్ చాలా ముఖ్యం. మీ విల్లాను అందులోని కంటెంట్స్​ను ఇది దొంగతనాల నుంచి కాపాడుతుంది.

బర్గ్​లరీ ఇన్సూరెన్స్​లో కవర్ అయ్యే బిజినెస్ ప్రాపర్టీలు

మొబైల్ ఆటోమొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్స్

ప్రధానంగా ఆటోమొబైల్స్, మొబైల్​ ఫోన్లు, మొబైల్ యాక్సెసరీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ విక్రయించే స్టోర్లకు ఈ ఇన్సూరెన్స్ సరిగ్గా సరిపోతుంది. ఉదాహరణకు: క్రోమా (Croma), వన్​ప్లస్ (OnePlus), రెడ్​మీ (Redmi) మొదలయినవి. ఇటుంటి స్టోర్లకు దొంగతనాల ద్వారా జరిగిన నష్టాలు, డ్యామేజీల నుంచి బర్గ్​లరీ ఇన్సూరెన్స్ రక్షిస్తుంది.

గ్రోసరీ, జనరల్ స్టేషనరీ స్టోర్లు

మీ పొరుగునే ఉన్న కిరాణా కొట్ల నుంచి బడ్జెట్​ ఫ్రెండ్లీగా పేరున్న సూపర్ మార్కెట్స్, జనరల్ స్టోర్స్ వంటి వాటికి బర్గ్​లరీ ఇన్సూరెన్స్ సరిపోతుంది. బిగ్​బజార్ (Big Bazaar), స్టార్ బజార్ (Star Bazaar), రిలయన్స్ సూపర్ మార్కెట్ (Reliance Supermarkets) వంటి అన్ని రకాల షాప్స్, జనరల్ స్టోర్స్ ఈ బర్గ్​లరీ ఇన్సూరెన్స్​లో కవర్ అవుతాయి.

ఆఫీసులు, విద్యా సంస్థలు

ప్రాపర్టీ ఇన్సూరెన్స్​లోని ఈ కేటగిరీ ఆఫీసులు, విద్యా సంస్థలు అయిన కాలేజీలు, స్కూల్స్, కోచింగ్ సెంటర్లను కవర్ చేస్తుంది. ఇటువంటి ప్రాపర్టీలకు ఇన్సూరెన్స్ చేయించడం వలన దొంగతనాల నుంచి కవర్ చేయడమే కాకుండా మీ సంస్థ మీద మీ ఉద్యోగులకు విద్యార్థులకు నమ్మకం కలిగేలా కూడా చేస్తుంది.

హోమ్ రిపేర్స్, హౌజ్ హెల్ప్ సర్వీసులు

కార్పెంటరీ, ప్లంబింగ్ రిపేర్ల నుంచి మోటార్ గ్యారేజీలు, ఇంజనీరింగ్ వర్క్ షాపుల వరకు ప్రతీ ఒక్క కేటగిరీని ఇది కవర్ చేస్తుంది. దొంగతనాల వలన సంభవించే అన్ని నష్టాల నుంచి బర్గ్​లరీ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది.

పర్సనల్ హోమ్, లైఫ్​స్టైల్, ఫిట్​నెస్

డిజిట్ అందజేసే బర్గ్​లరీ ఇన్సూరెన్స్ లైఫ్ స్టైల్, ఫిట్​నెస్ రంగాల్లోని వ్యాపారాలను కవర్ చేస్తుంది. ఇందులో మీ ఫేవరేట్ మాల్స్, క్లాతింగ్ స్టోర్స్ నుంచి స్పాలు, జిమ్స్ వంటి స్టోర్స్ వరకు ఉంటాయి. ఎన్​రిచ్ సెలూన్స్ (Enrich Salons), కల్ట్ ఫిట్​నెస్ సెంటర్లు (Cult Fitness Centers), ఫొయెనిక్స్ మార్కెట్ సిటీ (Phoenix Market City) వంటి ఇతర స్టోర్స్ కవర్ అవుతాయి.

ఆహారం, తినుబండారాలు

ప్రతి ఒక్కరూ కేఫ్స్, ఫుడ్ ట్రక్స్ వద్ద తింటూ ఉంటారు. రెస్టారెంట్లు, బేకరీలకు కూడా బర్గ్​లరీ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, చాయ్ షాపుల వంటి వాటికి ఇది కవర్ అవుతుంది. చాయ్ పాయింట్ (Chai Point), చయ్యోస్ (Chayyos), పిజ్జా హట్ (Pizza Hut), బర్గర్ కింగ్ (Burger King) వంటివి వీటికి కొన్ని ఉదాహరణలు.

హెల్త్​కేర్

దొంగతనాలు, ప్రకృతి వైపరిత్యాల వంటి వాటి నుంచి అందర్నీ సంరక్షించే వాటిల్లో ఇవి ప్రధానమైనవి. వీటికి కూడా డిజిట్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అందజేస్తుంది. డిజిట్ అందజేసే ప్రాపర్టీ ఇన్సూరెన్స్​లో హాస్పిటల్స్, క్లినిక్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, ఫార్మసీలు, మెడికల్ స్టోర్ల వంటివి కూడా కవర్ అవుతాయి.

సర్వీస్, ఇతరాలు

కేవలం పైన పేర్కొన్న కేటగిరీలకు మాత్రమే కాకుండా డిజిట్ బర్గ్​లరీ ఇన్సూరెన్స్ అన్ని ప్రాపర్టీలకు కూడా వర్తిస్తుంది. మీ బిజినెస్ పరిమాణం, విధానం ఎలా ఉన్న కానీ ఇది సరిగ్గా సరిపోతుంది. మీ కేటగిరీని లిస్ట్​లో కనుక్కోలేకపోతే మాకు నిస్సంకోచంగా కాల్ చేయండి. మీ ప్రాపర్టీకి సరైన ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఎంచుకోవడంలో మేము మీకు సాయం అందిస్తాం.

భారతదేశంలో ఆన్​లైన్ బర్గ్​లరీ ఇన్సూరెన్స్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు