డిజిట్ పార్ట్‎నర్ అవండి
35,000 పైచిలుకు పార్ట్‎నర్లు డిజిట్‌తో 674 కోట్లకు పైగా సంపాదించారు.

పెట్టుబడి లేకుండా విద్యార్థులు ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడం ఎలా?

విద్యార్థిగా ఉండటం ఒక వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన దశ. ఏదేమైనా, చదవడం ఒక ఫుల్ టైమ్ వృత్తి, కాబట్టి కొంచెం డబ్బు సంపాదించాలని చూస్తున్న విద్యార్థులు తమ చదువుపై ప్రభావం చూపని పార్ట్ టైమ్ ఉద్యోగాల కోసం వెతకడం ప్రారంభిస్తారు.

పెద్దగా పెట్టుబడి పెట్టకుండా ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడం లేదా కనీస అనుభవం అవసరమయ్యే ఉద్యోగాలను కనుగొనడం విద్యార్థులకు ఎదురయ్యే ఇబ్బందులు.

ఇలాంటి వారికి శుభవార్త. వాస్తవానికి విద్యార్థుల కోసం అనేక ఆన్‌లైన్‌ పార్ట్ టైమ్ ఉద్యోగాలు ఉన్నాయి, ఇక్కడ వారు ఇంట్లో ఉండి డబ్బు సంపాదించవచ్చు.

విద్యార్థిగా ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడానికి ఉత్తమ మార్గాలు ఏమిటి?

1. ఇన్సూరెన్స్ ని POSPగా అమ్మడం

POSP లేదా పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్ కావడం మరియు ఇన్సూరెన్స్ ని విక్రయించడం విద్యార్థులకు లాభదాయకమైన పార్ట్ టైమ్ ఉద్యోగం. POSP అనేది ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్, అతడు ఇన్సూరెన్స్ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో అమ్మడానికి ఇన్సూరెన్స్ కంపెనీతో కలిసి పని చేస్తాడు.

  • ఏమి అవసరం? - 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి మరియు 18 ఏళ్లు నిండి ఉండాలి. ఐఆర్డిఎఐ అందించే 15 గంటల కచ్చిత శిక్షణను కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • మీరు ఎంత సంపాదించగలరు? - మీరు అమ్మే పాలసీల సంఖ్యపై మీ ఆదాయం ఆధారపడి ఉంటుంది. అందువల్ల మీరు ఎన్ని ఎక్కువ పాలసీలను అమ్మితే, మీరు అంత ఎక్కువ ఆదాయాన్ని పొందుతారు.
  • మీరు ఈ ఉద్యోగాన్ని కొనసాగించగలరా? - అవును, మీకు అమ్మే అభిరుచి ఉంటే, మీరు దీనిని తర్వాత ఫుల్ టైం ఉద్యోగంగా కొనసాగించవచ్చు.

POSP ఏజెంట్ కావడానికి , దశలు, అవసరాలు మరియు నిబంధనల గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి.

2. ఫ్రీలాన్సింగ్ చేపట్టండి

మీరు రాయడం, ప్రోగ్రామింగ్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, డిజైనింగ్ లేదా మరేదైనా నైపుణ్యాలలో నిష్ణాతులైతే మీరు ఫ్రీలాన్సర్ గా ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించవచ్చు. మీరు అప్ వర్క్, ఫైవర్ర్ లేదా ట్రూలాన్సర్ వంటి పోర్టల్స్ లో ఫ్రీలాన్సర్ గా రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడు మీరు మీ నైపుణ్యాలను కావాల్సిన క్లయింట్లకు మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టవచ్చు.

  • ఏమి అవసరం? - మీకు మార్కెటింగ్ నైపుణ్యం ఉన్నంత వరకు, మీరు ఫ్రీలాన్సింగ్ పోర్టల్లో నమోదు చేసుకోవచ్చు, అయితే దీనికి చిన్న ఫీజు అవసరం కావచ్చు.
  • మీరు ఎంత సంపాదించగలరు? - మీరు అందించే పని, మీకు ఎంత పని చేయడానికి సమయం ఉంది అనే దానిపై మీ ఆదాయం ఆధారపడి ఉంటుంది.

మీరు ఈ ఉద్యోగాన్ని కొనసాగించగలరా? - అవును, మీరు అందించే పనిని బట్టి, మీరు ఫ్రీలాన్సర్ గా పూర్తి సమయం పని చేయడం కొనసాగించవచ్చు.

3. ఆన్‌లైన్‌లో ట్యూషన్ ప్రారంభించండి

విద్యార్థులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటున్నారు, కాబట్టి ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడానికి ఒక సులభమైన మార్గం ఈ జ్ఞానాన్ని కొంచెం ఇతరులతో పంచుకోవడం. మీరు స్కూల్ పిల్లలకు ట్యూషన్ చెప్పాలనుకుంటున్నారా లేదా ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకునే పెద్దలకు కోర్సులను అందించాలనుకుంటే, మీకు కావలసిందల్లా వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్.

మీరు ఉడెమీ, స్కిల్షేర్ లేదా కోర్సెరా వంటి వర్చువల్ ట్యూషన్ ప్లాట్ ఫామ్ తో సైన్ అప్ చేయవచ్చు లేదా మీ ఆన్‌లైన్‌ ట్యూషన్ క్లాసులను ప్రసారం చేయడానికి స్నేహితులు మరియు అలాంటి నెట్వర్క్ లను సోషల్ మీడియాలో సంప్రదించవచ్చు.

  • ఏమేమి అవసరం? - మీరు కొన్ని బోధనా నైపుణ్యాలను పెంచుకోవాల్సి ఉన్నప్పటికీ, చాలా తక్కువ పెట్టుబడి ఉంటుంది.
  • మీరు ఎంత సంపాదించగలరు? - మీ నైపుణ్యం స్థాయి మరియు సబ్జెక్టు ఆధారంగా, మీరు గంటకు రూ. 200-500 వరకు సంపాదించవచ్చు.

మీరు ఈ ఉద్యోగాన్ని కొనసాగించగలరా? - ట్యూషన్ అనేది పూర్తికాలపు పని కానప్పటికీ, మీరు దీన్ని పార్ట్ టైమ్ గా కొనసాగించవచ్చు లేదా మీరు దానిపై అభిరుచిని చూపిస్తే, మీరు చదివే ప్రాంతంలోని టీచింగ్ ఉద్యోగాలను పరిశీలించండి.

4. డేటా ఎంట్రీ ఉద్యోగాలను కనుగొనండి

పెట్టుబడి లేకుండా ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించాలనుకునే విద్యార్థులకు మరో ఆప్షన్ డేటా ఎంట్రీ జాబ్స్. ఇది అనుకూలంగా ఉన్నప్పుడు పని చేయడానికి అవకాశమిస్తుంది. కాబట్టి పార్ట్ టైమ్ పనికి ఇది మంచి ఎంపిక.

మీరు చేయాల్సిందల్లా ఫ్రీలాన్సర్, డేటా ప్లస్, ఆక్సియాన్ డేటా ఎంట్రీ సర్వీసెస్ లేదా గురు వంటి విశ్వసనీయ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుంటే చాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీల నుండి డేటా ఎంట్రీ ఉద్యోగాలను స్వీకరించడం ప్రారంభించవచ్చు. అయితే, మీ ఖాతా వివరాలను అందించే ముందు వాటి చట్టబద్ధతను తనిఖీ చేయాలని గుర్తుంచుకోండి.

  • ఏమేమి అవసరం? - మీకు కంప్యూటర్ యాక్సెస్, అలాగే ఎక్సెల్ మరియు ఇతర మైక్రోసాఫ్ట్ సాధనాలపై మంచి పని పరిజ్ఞానం ఉండాలి.
  • మీరు ఎంత సంపాదించగలరు? - డేటా ఎంట్రీ జాబ్ తో గంటకు రూ. 300 నుంచి రూ.1,500 వరకు సంపాదించవచ్చు.
  • మీరు ఈ ఉద్యోగాన్ని కొనసాగించగలరా? - డేటా ఎంట్రీ ఉద్యోగాలు సాధారణంగా పార్ట్ టైమ్ గా చేస్తారు.

5. బీటా టెస్టింగ్ యాప్స్, వెబ్సైట్లు

ఈ రోజుల్లో దాదాపు ప్రతి విద్యార్థికి స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ యాక్సెస్ ఉంది కాబట్టి, విద్యార్థులకు పార్ట్ టైమ్ డబ్బు సంపాదించడానికి ఒక మంచి ఎంపిక యాప్ లు మరియు వెబ్సైట్లను టెస్ట్ చేయడం. కంపెనీలు, యాప్ డెవలపర్లు కొత్త యాప్ లేదా వెబ్సైట్ ను క్రియేట్ చేసినప్పుడు 'బీటా టెస్టింగ్' అని పిలిచే పని చేయడానికి యూజర్లను నియమించుకుంటారు. మీరు వారి సైట్లు లేదా యాప్లను పరీక్షించాలి మరియు మీ యూజర్ అనుభవాన్ని రిపోర్ట్ చేయాలి మరియు ఏదైనా బగ్స్ లేదా సమస్యలను ప్రజల్లోకి లైవ్ వెళ్లడానికి ముందే గుర్తించాలి.

బీటాటెస్టింగ్, టెస్టర్ వర్క్, Test.io లేదా ట్రిమైయూఐ వంటి సైట్లలో ఈ ఉద్యోగాలు చేయడానికి మీరు సైన్ అప్ చేయవచ్చు.

  • ఏమేమి అవసరం? - మీకు ప్రత్యేక పరిజ్ఞానం అవసరం లేదు, కానీ మీరు పరీక్షిస్తున్న ఉత్పత్తిని బట్టి, మీకు లేటెస్ట్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ లేదా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అవసరం కావచ్చు.
  • మీరు ఎంత సంపాదించగలరు? - బీటా టెస్టింగ్ ప్రక్రియను బట్టి, మీ అనుభవాన్ని బట్టి మీరు సుమారు రూ. 1000 నుండి ₹ 3000 సంపాదించవచ్చు.
  • మీరు ఈ ఉద్యోగాన్ని కొనసాగించగలరా? - యాప్ మరియు వెబ్సైట్ టెస్టింగ్ సాధారణంగా పార్ట్ టైమ్ గా జరుగుతుంది, కానీ మీకు ప్రోగ్రామింగ్ లేదా సాఫ్ట్ వేర్ అభివృద్ధిలో అనుభవం ఉంటే, మీరు ఈ అనుభవాన్ని మీ భవిష్యత్తు కెరీర్లో ఉపయోగించవచ్చు.

కాబట్టి, ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించాలనుకునే విద్యార్థులు తమ ఖాళీ సమయాన్ని మరింత ఉత్పాదక మార్గంలో కొంచెం ఖర్చు చేయడం ద్వారా సులభంగా చేయవచ్చు. ఈ కింది వాటిని చేయడం ద్వారా నకిలీ ఏజెన్సీలు, స్కాంలు మరియు మోసాలను నివారించడానికి జాగ్రత్త వహించండి:

  • సైన్ అప్ చేయడానికి ముందు ఏదైనా సైట్ ని క్షుణ్ణంగా పరిశోధించడం మరియు వాటి సమీక్షలను తనిఖీ చేయడం.
  • మీ వ్యక్తిగత సమాచారం అడిగే ఏ సైట్ విషయంలోనైనా జాగ్రత్తగా ఉండండి.
  • చాలా పని కల్పిస్తున్న వెబ్సైట్లను చూడండి. అదే సమయంలో మీకు ఎక్కువ చెల్లింవని గుర్తించండి.
  • సంతకం చేయడానికి ముందు ఏదైనా ఒప్పందాన్ని క్షుణ్ణంగా చదవండి.

ఒకసారి మీరు ఈ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత, మీరు ఎటువంటి పెట్టుబడులు లేకుండా డబ్బు సంపాదించడానికి ఈ సులభమైన మరియు సమయానికి అనుకూలమైన మార్గాలను అనుసరించవచ్చు.

తరచుగా అడిగే ప్రశ్నలు

పార్ట్ టైమ్ ఉద్యోగాలు విద్యార్థులకు ఎలా సహాయపడతాయి?

పార్ట్ టైమ్ ఉద్యోగాలు విద్యార్థులకు అదనపు పాకెట్ మనీ సంపాదించడానికి గొప్ప మార్గం మరియు, వేతనాన్ని అందించడంతో పాటు, పార్ట్-టైమ్ ఉద్యోగం శిక్షణ మరియు పని అనుభవం రెండింటినీ అందిస్తుంది. అలాగే నైపుణ్యాలు మెరుగవుతాయి.

పార్ట్ టైమ్ ఉద్యోగాలు విద్యార్థులపై ప్రభావం చూపుతాయా?

పార్ట్ టైమ్ జాబ్ ఉండటం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, కానీ కొంతమందికి పార్ట్ టైమ్ ఉద్యోగంతో పాటు ఫుల్ టైమ్ చదవడం కష్టం. కాబట్టి మీరు ఒత్తిడికి గురవడం ప్రారంభిస్తే లేదా అది మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంటే, మీరు పని చేయడంపై పునరాలోచించాలనుకోవచ్చు.

విద్యార్థులు ఆన్‌లైన్‌ ఉద్యోగాల కోసం ఎక్కడ వెతకాలి?

ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించాలనుకునే విద్యార్థుల కోసం ఇప్పటికే కొన్ని టాప్ సైట్లను చూశాం. అయితే, ఈ వనరులు అందుబాటులో లేకపోతే, మీరు మాన్ స్టర్ లేదా లింక్డ్ఇన్ వంటి జాబ్ వెబ్సైట్లకు సైన్ అప్ చేయవచ్చు. అదనంగా మీరు ఉద్యోగ జాబితాలను పోస్ట్ చేసే సోషల్ మీడియా గ్రూపుల్లో చేరవచ్చు మరియు అన్నీ విఫలమైతే, మీ స్నేహితులు లేదా కుటుంబ నెట్వర్క్ల ద్వారా పాత పద్ధతిలో అడగండి.