హెల్త్​ ఇన్సూరెన్స్​ ఏజెంట్​ అవండి

మనం కలిసి అద్భుతాలు చేద్దాం
Full Name is required Maximum 150 characters allowed
RM Code is required
POSP Code is required
Enter Valid Email Address
Pincode is required Please enter 6 digit pincode
Mobile Number is required Enter valid mobile number Mobile Number Of Digit Employee Is Not Allowed
Enter Valid OTP
Didn’t receive SMS? Resend Otp

I agree to the Terms & Conditions

Please accept terms and conditions

హెల్త్ ఇన్సూరెన్స్​ ఏజెంట్​/ POSP (పాయింట్​ ఆఫ్​ సేల్స్​ పర్సన్​) అంటే ఎవరు?

హెల్త్​ ఇన్సూరెన్స్​ ఏజెంట్​ ఏదైనా హెల్త్​ ఇన్సూరెన్స్​ కంపెనీతో కలిసి పని చేస్తూ ఉంటాడు. ఆరోగ్య సంబంధిత ఇన్సూరెన్స్​ ప్రొడక్టులను విక్రయిస్తాడు. తమకు అవసరమైన హెల్త్​ పాలసీని కస్టమర్లు తీసుకునేలా ఏజెంట్లు సాయం చేస్తారు.

డిజిట్​ ఇన్సూరెన్స్​ కంపెనీతో మీరు వ్యక్తులకు, కుటుంబాల​కు మేలు చేసే హెల్త్​ పాలసీలను విక్రయించే అవకాశం ఉంటుంది.

హెల్త్​ ఇన్సూరెన్స్​ అంటే ఏమిటి?

అనుకోని సందర్భాల్లో మనకు ఎదురయ్యే వైద్యపరమైన​ ఖర్చుల నుంచి కాపాడేవే హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీలు. ఇవి ఉంటే మనం ఆర్థికంగా నష్టపోకుండా ఉంటాం. ఇన్సూరెన్స్​ ఉన్న వ్యక్తి ఒకవేళ జబ్బు పడినా లేదా ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చేరినా చికిత్సకు అయ్యే ఖర్చులను ఈ పాలసీలు భరిస్తాయి.

హెల్త్​ ఇన్సూరెన్స్​ మార్కెట్​ భారతదేశంలో దినదినాభివృద్ధి చెందుతున్న మార్కెట్​. మన దేశంలోని 1.3 బిలియన్ల మందికి ఇది అవసరమైనప్పటికీ, అందులో కేవలం 20 శాతం మందికి మాత్రమే హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీలు ఉన్నాయి.

*డిస్​క్లైమర్​ (Disclaimer) – ఇన్సూరెన్స్​ ఏజెంట్లకు ప్రత్యేక కేటగిరీ అంటూ ఏమీ ఉండదు. మీరు జనరల్​ ఇన్సూరెన్స్​ ఏజెంట్​గా నమోదు చేసుకుంటే అన్ని రకాల ఇన్సూరెన్స్​ పాలసీలను విక్రయించాల్సి ఉంటుంది.

Read More

భారతదేశంలో హెల్త్​ ఇన్సూరెన్స్​ రంగం గురించిన ఆశ్చర్యకరమైన విషయాలు

1
మన దేశంలో హెల్త్​ ఇన్సూరెన్స్​ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2018లో ఈ రంగం 24 శాతం వృద్ధి రేటు సాధించింది.(1)
2
ఆర్థిక సంవత్సరం–2020లో భారతీయ​ ఇన్సూరెన్స్​ కంపెనీలు దాదాపు రూ. 40.17 లక్షల కోట్లను ప్రీమియంల కింద ఆదాయంగా పొందాయి. (డిసెంబర్​ 2019 వరకు). (2)
3
భారతదేశ జనాభాలో కేవలం 20 శాతం మంది మాత్రమే ఇన్సూరెన్స్​ పాలసీలు కలిగి ఉన్నారు. కాబట్టి ఈ రంగం ఇంకా చాలా వృద్ధి చెందే అవకాశం ఉంది. (3)

డిజిట్​తో హెల్త్​ ఇన్సూరెన్స్​ ఏజెంట్/పాయింట్​ ఆఫ్​ సేల్స్​ పర్సన్​ (POSP) ఎందుకు కావాలి?

హెల్త్​ ఇన్సూరెన్స్​ ఏజెంట్​గా ఎందుకు కావాలో, డిజిట్​ ఇన్సూరెన్స్​ కంపెనీనే ఎందుకు ఎంచుకోవాలో మరింత తెలుసుకోండి.

నేరుగా డిజిట్​తో వర్క్​ చేయండి

మీరు డిజిట్​ కంపెనీ పాయింట్​ ఆఫ్​ సేల్​ పర్సన్​ (POSP)గా నేరుగా పనిచేయండి. ఇందులో ఇతరుల ప్రమేయం ఉండదు. ప్రస్తుతం డిజిట్​ ఇన్సూరెన్స్​ కంపెనీ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థ. 2019వ సంవత్సరానికి డిజిట్​ ఆసియా యొక్క జనరల్​ ఇన్సూరెన్స్​ కంపెనీ అవార్డును గెలుచుకుంది. స్థాపించిన తక్కువ సమయంలోనే ఈ అవార్డును గెలుచుకున్న కంపెనీగా డిజిట్​ కొత్త రికార్డును సృష్టించింది.

ఇన్సూరెన్స్​ చేయడం చాలా సులభం

మేము ఇన్సూరెన్స్​ పాలసీ సులభం​గా పూర్తయ్యేలా చూస్తాం. అందుకే మా డాక్యుమెంట్లు చాలా సులభంగా అర్థమవుతాయి. 15 సంవత్సరాల వయసు వారు కూడా ఈ డాక్యుమెంట్లలోని విషయాలను సులభంగా అర్థం చేసుకుంటారు.

పటిష్టమైన బ్యాక్​ ఎండ్​ సపోర్ట్​

టెక్నాలజీనే మా ప్రధాన బలం. అందుకే మేము 24x7 సపోర్ట్​ను అందిస్తాం. అంతేకాకుండా ఎన్నో అధునాతన ఫీచర్లతో మొబైల్​, వెబ్​ యాప్​లను కూడా అందుబాటులోకి తెచ్చాం.

ఫేస్​బుక్​ (Facebook)లో 4.8 రేటింగ్స్​ పొందాం

కస్టమర్ల సంతృప్తే మాకు ముఖ్యం. అందుకే మేము మా కస్టమర్లకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తున్నాం. మా కంపెనీకి ఫేస్​బుక్​లో 4.8/5 రేటింగ్​ ఉంది. ఏ ఇన్సూరెన్స్​ కంపెనీకి ఇంత ఎక్కువ రేటింగ్​ లేదు.

డాక్టర్స్​ సిఫారసు చేసిన పాలసీలు

మా హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీలను ఎయిమ్స్​ (AIIMs) మాజీ డైరెక్టర్​ డా. ఎం.సి.మిశ్రా సహాయంతో రూపొందించాం.

అత్యధిక క్లెయిమ్​ సెటిల్​మెంట్​ రేషియో

మేము ప్రైవేటు కార్ల విషయంలో అత్యధిక క్లెయిమ్​ సెటిల్​మెంట్​ రేషియోను కలిగి ఉన్నాం. అంతేకాకుండా హెల్త్​ పాలసీలకు వచ్చిన 93 శాతం క్లెయిమ్స్​ను మేము సెటిల్​ చేశాం.

క్యాష్‌లెస్ క్లెయిమ్స్

దేశవ్యాప్తంగా మాకు 5900కు పైగా నెట్​వర్క్​ ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో చికిత్స చేయించుకున్న మా కస్టమర్లు క్యాష్​లెస్​ క్లెయిమ్స్​ సెటిల్​మెంట్​ సౌలభ్యాన్ని పొందవచ్చు. దీని వలన ఎలాంటి చింత లేకుండా చికిత్స చేయించుకోవచ్చు

పేపర్​లెస్​ ప్రాసెస్

మా పాలసీ ప్రక్రియ మొత్తం ఆన్​లైన్​లోనే ఉంటుంది. మీరు పాలసీ కొనుగోలు చేసినప్పటి నుంచి క్లెయిమ్​ వరకు మొత్తం ఆన్‌లైన్​లోనే పూర్తవుతుంది. మీరు ఎటువంటి పేపర్​ వర్క్​ చేసే అవసరం ఉండదు. మీరు ఇందుకోసం కేవలం స్మార్ట్​ఫోన్​ లేదా కంప్యూటర్​తో పాటు మంచి ఇంటర్నెట్​ కనెక్షన్​ను కలిగి ఉంటే సరిపోతుంది. కావున మీరు ఎక్కడినుంచైనా కానీ పూర్తి​ చేసుకోవచ్చు.

వెంటనే కమిషన్​ సెటిల్​మెంట్

కమిషన్​ విషయంలో మీరు కంగారు చెందాల్సిన అవసరం ఉండదు. మీరు పాలసీ జారీ చేసిన వెంటనే మీ కమిషన్​ అమౌంట్​ మీ బ్యాంకు అకౌంట్​లో జమ అవుతుంది. ప్రతీ 15 రోజులకోసారి మీకు కమిషన్​ అమౌంట్​ అందుతుంది.

హెల్త్​ ఇన్సూరెన్స్​ ఏజెంట్/పాయింట్​ ఆఫ్​ సేల్స్​ పర్సన్​ (POSP) కావడమెలా?

డిజిట్​తో హెల్త్​ ఇన్సూరెన్స్​ ఏజెంట్​/పాయింట్​ ఆఫ్​ సేల్స్​ పర్సన్​ (POSP) కావడమెలా?

స్టెప్​ 1

పైన ఉన్న మా POSP ఫామ్​ను నింపి అందులో మీ సరైన వివరాలు, సరైన డాక్యుమెంట్లు అప్​లోడ్​ చేయాలి.

స్టెప్​ 2

15 గంటల మీ శిక్షణ కాలాన్ని పూర్తి చేయండి.

స్టెప్​ 3

పరీక్షను పూర్తి చేయండి.

స్టెప్​ 4

మేము అందజేసే అగ్రిమెంట్​ మీద మీరు సంతకం చేస్తే చాలు. సర్టిఫైడ్​ POSPగా గుర్తింపు పొందుతారు.

మీరు ఎంత సంపాదించొచ్చు?

 

మీరు హెల్త్​ ఇన్సూరెన్స్​ ఏజెంట్​గా చేరిన తర్వాత ఎంత సంపాదిస్తున్నారనేది మీరు చేసే పాలసీల మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ ఆదాయం సంపాదించేందుకు హెల్త్​ ఇన్సూరెన్స్​ ఏజెంట్​కు అవకాశం ఉంటుంది. వైద్య చికిత్సల ఖర్చు పెరుగుతుండటమే ఇందుకు కారణం.

మనకు ఎటువంటి చికిత్స కావాలన్నా ప్రస్తుత రోజుల్లో అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. కావున మనం ఖర్చుల బారి నుంచి బయటపడేందుకు హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. వైద్య ఖర్చులను ఇవి కవర్​ చేస్తాయి.

ఒక ఇన్సూరెన్స్​ ఏజెంట్​ కమిషన్​ రూపంలో ఎంత సంపాదిస్తాడనేది కింద పూర్తిగా ఇవ్వబడింది. దీన్ని చూస్తే మీకు స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.

మంత్లీ నెట్​ ప్రీమియం

కమిషన్​ & నెట్​ ప్రీమియం మీద కమిషన్​ పర్సంటేజ్

ఆరోగ్య సంజీవని

<25K

సంవత్సరానికి - 25% | రెండు సంవత్సరాలకు - 23% | 3 సంవత్సరాలకు - 22%

15%

25 వేలు అంతకన్నా ఎక్కువ & 50 వేల కన్నా తక్కువ

సంవత్సరానికి - 28% | రెండు సంవత్సరాలకు - 26% | 3 సంవత్సరాలకు - 25%

15%

50 వేల కంటే ఎక్కువ & లక్ష కన్నా తక్కువ

సంవత్సరానికి - 30% | రెండు సంవత్సరాలకు - 28% | 3 సంవత్సరాలకు - 26%

15%

లక్ష రూపాయల కన్నా ఎక్కువ

సంవత్సరానికి - 35% | రెండు సంవత్సరాలకు - 30% | 3 సంవత్సరాలకు - 28%

15%

షరతులు:

  • నెలకు రెండుసార్లు పేమెంట్​ లభిస్తుంది.
  • మీరు పాలసీ చేసిన తేదీ మాత్రమే నెలను నిర్ధారిస్తుంది.
  • వేర్వేరు స్లాబ్​లకు పేమెంట్​ వేర్వేరుగా ఉంటుంది.
  • నియమ నిబంధనలు వర్తిస్తాయి. రెగ్యులేషన్​ సూచించిన గరిష్ట పరిమితికి లోబడి ఉంటుంది.
  • నికర ప్రీమియం అనేది జీఎస్టీ (GST)ని మినహాయించి ఉంటుంది.

నేను ఎందుకు హెల్త్​ ఇన్సూరెన్స్​ ఏజెంట్​గా మారాలి?

మీకు మీరే బాస్​ కండి

పాయింట్​ ఆఫ్ సేల్స్​ పర్సన్​ (POSP) కావడం వలన ప్రధాన లాభం ఏంటంటే మీకు నచ్చిన సమయంలో పని చేసుకునే అవకాశం ఉంటుంది. మీకు మీరే బాస్​గా ఉండొచ్చు. మిమ్మల్ని ఆదేశించే వారు ఎవరూ ఉండరు.

ఎటువంటి టైమ్​ లిమిట్​ ఉండదు!

మీరు ఫుల్​ టైమ్​, పార్ట్​ టైమ్​ మీకు ఇష్టం వచ్చిన విధంగా పని చేసుకోవచ్చు.

ఇంటి దగ్గరి నుంచే పని చేసే సౌలభ్యం

డిజిట్​ ఇన్సూరెన్స్​లో మేము ఎక్కువ పాలసీలను ఆన్​లైన్​లోనే చేస్తాం. కావున ఇన్సూరెన్స్​ ఏజెంట్​ ఇంటి వద్ద ఉండే పనిని పూర్తి చేసుకోవచ్చు. ఇలా మీకు ఎక్కువగా సౌకర్యవంతంగా ఉంటుంది.

కేవలం 15 గంటల శిక్షణ మాత్రమే

పాయింట్​ ఆఫ్ సేల్స్​ పర్సన్​ (POSP)గా గుర్తింపు పొందేందుకు మీరు 15 గంటల శిక్షణను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ శిక్షణ IRDAI ఆధ్వర్యంలో ఉంటుంది. కేవలం మీరు 15 గంటలు మాత్రమే కేటాయించి పాయింట్​ ఆఫ్​ సేల్స్​ పర్సన్​గా మారొచ్చు

ఎక్కువ సంపాదించే అవకాశం

మీరు సంపాదించే మొత్తం మీరు ఎన్ని గంటలు పని చేశారనే విషయం మీద ఆధారపడకుండా, మీరు ఎన్ని పాలసీలు చేశారనే దానిపై ఆధారపడుతుంది. ఈ విషయం గురించి మరింత విపులంగా అర్థం చేసుకునేందుకు మా ఆదాయ క్యాలుక్యులేటర్​ను ఒక్కసారి చూస్తే సరిపోతుంది. ఒక్క పాలసీని విక్రయించడం వలన మీకు ఎంత మొత్తం వస్తుందనే విషయాలు తెలుస్తాయి.

పెట్టుబడి ఉండదు

మీరు ఇన్సూరెన్స్ ఏజెంట్​గా మారేందుకు ఎటువంటి డబ్బును పెట్టుబడి పెట్టనవసరం లేదు. ఇందుకోసం కేవలం ఒక స్మార్ట్​ ఫోన్​, మంచి ఇంటర్నెట్​ కనెక్షన్​, 15 గంటల శిక్షణ సమయం మాత్రమే సరిపోతుంది. మీరు ఒక్కసారి పాయింట్​ ఆఫ్​ సేల్స్​ పర్సన్‌గా ఎంపికైతే మీ ఆదాయం స్థాయులు​ కూడా పెరుగుతాయి.

Frequently asked questions