డిజిట్ పార్ట్‎నర్ అవ్వండి
35,000 పైచిలుకు పార్టనర్లు డిజిట్‎తో 674 కోట్లకు పైగా సంపాదించారు.

పెట్టుబడి లేకుండా ఆన్లైన్‎లో డబ్బు సంపాదించడం ఎలా?

ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో పనులతో బిజీగా ఉండగా, వారిలో చాలామంది ఎటువంటి పెట్టుబడి లేకుండా ఇంటి నుండి డబ్బు సంపాదించే మార్గాల కోసం చూస్తున్నారు. కాలేజీ విద్యార్థులు, ఇంట్లో ఉండే జీవిత భాగస్వాములు, గృహిణులు, పదవీ విరమణ చేసిన వారితో పాటు వ్యాపారం చేసే పురుషులు/మహిళలు కూడా పక్కన ఏదోలా సంపాదించాలని అనుకుంటున్నారు.

నిజానికి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా ఆన్ లైన్ లో డబ్బులు సంపాదించే మార్గాలు ఎన్నో ఉన్నాయి. దీనివల్ల మీరు మీ డబ్బును పణంగా పెట్టడం వల్ల వచ్చే రిస్కుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

పెట్టుబడి లేకుండా ఆన్లైన్‎లో డబ్బు సంపాదించడానికి కొన్ని ఉత్తమ మార్గాలు ఇక్కడ ఉన్నాయి

1. ఇన్సూరెన్స్ POSPగా మారండి

జీరో ఇన్వెస్ట్‎మెంట్, టైమ్ లిమిట్స్ లేకుండా, వర్క్ ఫ్రమ్ హోమ్‎తో ఆన్లైన్‎లో డబ్బులు సంపాదించే టాప్ మార్గాల్లో ఒకటి POSP(పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్)గా మారడం.

POSP అంటే ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్, అతడు/ఆమె నిర్దిష్ట ఇన్సూరెన్స్ ఉత్పత్తులను ఆన్లైన్‎లో అమ్మడానికి ఇన్సూరెన్స్ కంపెనీతో కలిసి పనిచేస్తాడు/పని చేస్తుంది. POSP ఏజెంట్‎గా, కస్టమర్లు వారి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా వారి కోసం సరైన ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడంలో మీరు సాయపడగలరు.

  • ఏమేమి అవసరం? - ఇన్సూరెన్స్ ఏజెంట్ కావడానికి మీకు 18 ఏళ్లు నిండి ఉండాలి మరియు 10 వ తరగతి పూర్తి చేసి ఉండాలి. దీని తరువాత, మీరు చేయాల్సిందల్లా జనరల్ / లైఫ్ ఇన్సూరెన్స్ లైసెన్స్ పొందడానికి IRDAI అందించే 15 గంటల నిర్బంధ శిక్షణను పూర్తి చేయాలి.
  • మీరు ఎంత సంపాదించగలరు? - వివిధ రకాల పాలసీలను అమ్మడానికి చాలా అవకాశం ఉంది మరియు మీరు అమ్మే పాలసీల సంఖ్యపై మీ ఆదాయం ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ పాలసీలను అమ్మితే అంత త్వరగా అధిక ఆదాయాన్ని పొందవచ్చు.

కాబట్టి స్మార్ట్ ఫోన్, మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నంత వరకు అమ్మే సామర్థ్యం ఉన్న ఎవరైనా POSP ఏజెంట్ కావొచ్చు. POSP ఏజెంట్ అవడానికి దశలు, అవసరాలు మరియు నిబంధనల గురించి మీరు ఇక్కడ మరింత తెలుసుకోవచ్చు.

2. ఫ్రీలాన్సింగ్ ద్వారా

ఫ్రీలాన్స్ అనేది ఆన్లైన్‎లో డబ్బు సంపాదించడానికి అత్యంత ప్రాచుర్యం పొందిన మార్గాలలో ఒకటి మరియు ఈ పనిని ప్రారంభించడానికి మీకు ఎటువంటి పెట్టుబడి అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా కొన్ని కీలక పోర్టళ్లను గుర్తించి ఫ్రీలాన్సర్‎గా రిజిస్టర్ చేసుకోవడమే. అప్పుడు మీరు కొన్ని శాంపుల్ వర్క్‎ను షేర్ చేయడం ద్వారా మీ స్కిల్స్‎కు తగ్గ క్లయింట్లకు మార్కెటింగ్ చేయాలి.

  • ఏమేమి అవసరం? - మీరు రాయడం, ప్రోగ్రామింగ్, ఎడిటింగ్, డిజైనింగ్ లేదా అనేక ఇతర నైపుణ్యాలలో మంచి పట్టు కలిగి ఉన్న వారైతే మీరు ఫ్రీలాన్సర్‎గా మారడం ద్వారా ఆన్లైన్‎లో డబ్బు సంపాదించవచ్చు. ఈ రోజుల్లో చాలా వ్యాపారాలు ఫ్రీలాన్సర్లకు చిన్న చిన్న పనులను ఎక్కువగా అప్పగిస్తున్నాయి.
  • మీరు ఎంత సంపాదించగలరు? - మీరు అందించే పనిని బట్టి ఫ్రీలాన్సర్‎గా బాగా సంపాదించవచ్చు.

జెన్యూన్‎గా పనిని అందించే కొన్ని టాప్ ఫ్రీలాన్సింగ్ సైట్లు:

3. ఇంట్లో తయారుచేసిన వస్తువులను అమ్మడం

ఎటువంటి పెట్టుబడి లేకుండా ఇంటి నుండి సులభంగా డబ్బు సంపాదించడానికి ఇది మరొక మార్గం. మీకు కావలసిందల్లా వంట పదార్థాలు లేదా క్రాఫ్ట్‎లు వంటి మీ ఉత్పత్తులకు ముడి పదార్థాలు. వండిన ఆహారం, ఆరోగ్యకరమైన స్నాక్స్, సువాసనగల కొవ్వొత్తులు, వాల్ హ్యాంగింగ్స్, టేబుల్ మ్యాట్లు మరియు అలంకరణ వస్తువులు వంటి ఉత్పత్తులు వీటిలో ఉన్నాయి.

  • ఏమేమి అవసరం? - మీకు హస్తకళలు లేదా వంట రంగాలలో నైపుణ్యాలు ఉంటే, మీ ఇంట్లో తయారుచేసిన ఉత్పత్తులను ఆన్లైన్‎లో విక్రయించడం చాలా సులభం.
  • మీరు ఎంత సంపాదించగలరు? - మీరు విక్రయించే ఉత్పత్తులు, మీ మార్కెటింగ్ నైపుణ్యాలు మరియు మీరు ఎంచుకున్న అమ్మకపు పార్ట్‎నర్ సైట్‎ని బట్టి, మీరు మీ ఉత్పత్తులను అధిక ధరలకు సెట్ చేయవచ్చు.

మీరు ఏమి తయారు చేయాలనుకుంటున్నారో మరియు అమ్మాలనుకుంటున్నారో మీకు తెలిసిన తర్వాత, మీరు ఇలాంటి సైట్లలో మిమ్మల్ని అమ్మకపుదారుగా నమోదు చేసుకోవాలి:

ఈ సైట్లు మీ ఉత్పత్తులను పెంచుతాయి మరియు వాటిని కస్టమర్లకు డెలివరీ చేసేలా చూస్తాయి. మరోవైపు మీరు ఇన్‎స్టాగ్రామ్, ఫేస్‎బుక్ లేదా వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‎ఫాంల ద్వారా వినియోగదారులకు నేరుగా విక్రయించవచ్చు మరియు సెకండరీ డెలివరీ సేవను ఉపయోగించవచ్చు.

4. డేటా ఎంట్రీ ఉద్యోగాలను ఎంచుకోండి

పెట్టుబడి లేకుండా ఆన్లైన్ ఉద్యోగం కోసం చూస్తున్న వారికి డేటా ఎంట్రీ మరో ఆప్షన్. మీరు ఇంటి నుండి పని చేయాలనుకుంటే లేదా అనుకూలమైన పార్ట్ టైమ్ ఉద్యోగం కోసం చూస్తున్న విద్యార్థి అయితే, ఇది మంచి ఆప్షన్.

  • ఏమేమి అవసరం? - ఇలాంటి ఉద్యోగాలకు కావాల్సిందల్లా కంప్యూటర్, ఎక్సెల్, ఇతర మైక్రోసాఫ్ట్ టూల్స్ పరిజ్ఞానం, కచ్చితత్వం కోసం ఒక కన్ను, డెడ్ లైన్ల కింద పనిచేయగలగడం.
  • మీరు ఎంత సంపాదించగలరు? - డేటా ఎంట్రీ ఉద్యోగాలు సాధారణంగా వేగంగా లేదా సులభంగా ఉంటాయి మరియు మీరు గంటకు రూ .300 నుండి రూ .1,500 సంపాదించవచ్చు.

విశ్వసనీయ వెబ్సైట్‎లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత, మీరు ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీల నుండి డేటా ఎంట్రీ ఉద్యోగాలను స్వీకరించవచ్చు (మీ ఖాతా వివరాలను బదిలీ చేయడానికి ముందు వాటి చట్టబద్ధతను తనిఖీ చేయండి). అప్పుడు మీకు డేటా సోర్స్‎కు ఇమెయిల్ లేదా లింక్ పంపబడుతుంది మరియు ఏమి చేయాలనే దాని గురించి సూచనలు ఇవ్వబడతాయి.

డేటా ఎంట్రీ ఉద్యోగాల కోసం మీరు చూడగల కొన్ని విశ్వసనీయ వెబ్సైట్లు ఇక్కడ ఉన్నాయి:

5. అప్లికేషన్‎లు మరియు వెబ్ సైట్‎లు లైవ్ లోకి వెళ్లడానికి ముందు వాటిని టెస్ట్ చేయడం

ఎటువంటి పెట్టుబడి లేకుండా ఆన్లైన్‎లో డబ్బు సంపాదించడానికి మరొక సులభమైన మార్గం అప్లికేషన్లు మరియు వెబ్సైట్లను టెస్ట్ చేయడం. కంపెనీలు, యాప్ డెవలపర్లు తమ యూజర్లు తమ యాప్స్, సైట్లతో అయోమయానికి గురికాకూడదని భావించి 'బీటా టెస్టింగ్' పేరుతో యూజర్లను నియమించుకుంటున్నారు. ప్రధానంగా, వారు తమ సైట్లు లేదా యాప్‎లను పరీక్షిస్తారు. వారి యూజర్ ఎక్స్‎పీరియన్స్‎ని పంచుకుంటారు లేదా ఏదైనా బగ్స్ మరియు సమస్యలను గుర్తిస్తారు.

  • ఏమేమి అవసరం? - దీన్ని చేయడానికి, మీకు ప్రత్యేక పరిజ్ఞానం అవసరం లేదు, కాబట్టి ఇంటి నుండి పని చేయాలనుకునేవారికి లేదా పార్ట్ టైం ఉద్యోగం కోసం ఇది మంచిది.
  • మీరు ఎంత సంపాదించగలరు? - బీటా టెస్టింగ్ ప్రక్రియ ఎంత పొడవు మరియు ఎంత సంక్లిష్టమైనవనే విషయాలు సంపాదనను ప్రభావితం చేస్తాయి. బీటా టెస్టింగ్ లో మీ అనుభవాన్ని బట్టి, మీరు ₹ 1000 నుండి ₹ 3000 వరకు సంపాదించవచ్చు.

యాప్ మరియు వెబ్సైట్ టెస్టింగ్ ఉద్యోగాలను అందించే కొన్ని సైట్లు:

మీరు ఆన్లైన్లో ఉద్యోగాల కోసం చూసే ముందు గుర్తుంచుకోవలసిన విషయాలు

ఏదేమైనా ఆన్లైన్‎లో డబ్బు సంపాదించడానికి సులభమైన మార్గాలున్నా వాటిలో చట్టబద్ధమైన మార్గాలను కనుగొనడం కష్టం. ఎందుకంటే ఇంటర్నెట్ నకిలీ ఏజెన్సీలు, స్కాంలు మరియు మోసాలతో నిండి ఉంది.

  • పనిని అందించడానికి ముందు మిమ్మల్ని రిజిస్ట్రేషన్ ఫీజు అడిగే లేదా మీ వ్యక్తిగత సమాచారాన్ని అడిగే ఏదైనా సైట్‎ల పట్ల జాగ్రత్తగా ఉండండి.
  • మీ పని నైపుణ్యాలను సద్వినియోగం చేసుకునే వెబ్సైట్లు మీకు తగినంత డబ్బు చెల్లించకపోవచ్చు. వాటి గురించి తెలుసుకోండి.
  • ఇటువంటి మోసపూరిత వెబ్సైట్లు మరియు కంపెనీలను నివారించడానికి ఒక గొప్ప మార్గం ఏదైనా సైట్‎ను క్షుణ్ణంగా పరిశోధించడం మరియు దాని గురించి ప్రజలు ఇచ్చిన రివ్యూలను మరియు కామెంట్లను చదవడం.
  • సంతకం చేయడానికి ముందు వారు మీకు అందించే ఒప్పందాన్ని చదవాలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.

మీ సమయాన్ని బాగా ఉపయోగించడం ద్వారా మరియు మరింత ఉత్పాదకంగా మారడం ద్వారా, మీరు ఇంట్లో కూర్చొని ఎటువంటి పెట్టుబడి లేకుండా కొంచెం అదనపు డబ్బును సంపాదించవచ్చు.

ఆన్లైన్‎లో ఇంటి నుండి డబ్బు సంపాదించడానికి ఈ మార్గాలు టైం ఫ్రెండ్లీ (అనుకూలంగా ఉన్న సమయంలో చేయడం). కాబట్టి అవి విద్యార్థులు, గృహిణులు, పదవీ విరమణ చేసినవారు మరియు ఇతరులకు మంచి ఎంపికలు. మీకు ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నప్పటికీ మరో పక్క సంపాదించడానికి ఇవి గొప్ప మార్గాలు. కాబట్టి, ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఈ అవకాశాలను ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు.