కమర్షియల్ మరియు బిజినెస్​ల కోసం ఆఫీస్ ఇన్సూరెన్స్ పాలసీ

మొత్తం ఆన్​లైన్​ ప్రక్రియ ఎటువంటి పేపర్ వర్క్ లేదు

ఆఫీస్ ఇన్సూరెన్స్ అనేది ఆఫీస్ మరియు అందులో ఉండే కంటెంట్​లను కాపాడేందుకు ఉన్న ఇన్సూరెన్స్ పాలసీ. గోడిజిట్ అందించే భారత్ సూక్ష్మ ఉద్యమ్ సురక్ష పాలసీ (UIN – IRDAN158RP0080V01202021) అగ్ని ప్రమాదాలు, సహజ విపత్తులైన వరదలు, భూకంపాల నుంచి కూడా మీ ప్రాపర్టీలను కాపాడుతుంది. 

అయినప్పటికీ చాలా కమర్షియల్ ప్రాపర్టీస్ రాబరీకి గురయ్యే అవకాశం ఉంది. అందువల్ల మేము ప్రత్యేకంగా బర్గర్లీ పాలసీని కూడా అందజేస్తున్నాం. అదే డిజిట్ బర్గర్లీ ఇన్సూరెన్స్ పాలసీ (UIN - IRDAN158RP0019V01201920) దీనిని గో డిజిట్ భారత్ సూక్ష్మ ఉద్యమ్ పాలసీతో కలిపి అందిస్తున్నాం. ఈ విధంగా మీ ఆఫీస్ అగ్ని ప్రమాదాలు, సహజ విపత్తుల నుంచి మాత్రమే కాకుండా దొంగతనాల వలన సంభవించే నష్టాల నుంచి కూడా కవర్ చేయబడుతుంది. 

ఆఫీస్ ఇన్సూరెన్స్ గురించి ఇంకా సందేహంగా ఉన్నారా?

అయితే పూర్తిగా చదవండి.

1

FICCI-పింకెట్రాన్ నిర్వహించిన ఇండియా రిస్క్ సర్వే 2021 ప్రకారం.. 2021వ సంవత్సరంలో ఇండియాలో 9,329 అగ్ని ప్రమాదాల సంఘటనలు నమోదయ్యాయి. ఇది కంపెనీలను ఆందోళనకు గురి చేస్తుంది.  

2

వ్యాపారాలు వృద్ధి చెందకుండా అడ్డుకునే భయాన్ని కలుగజేసే కారకాల్లో అగ్ని ప్రమాదాలు 4వ అతిపెద్ద రిస్క్​గా ఓట్ చేయబడ్డాయి. (1)

3

యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ (UNDRR) నివేదిక ప్రకారం 2000–2019 వ సంవత్సరంలో చైనా, యునైటెడ్ స్టేట్స్ తర్వాత ఎక్కువ ప్రకృతి విపత్తులు సంభవించిన దేశంగా ఇండియా నిలిచింది. (2)

డిజిట్ అందించే ఆఫీస్ ఇన్సూరెన్స్ పాలసీ గొప్పదనం ఏమిటి?

వాల్యూ ఫర్ మనీ: బిజినెస్​ను నడపడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నదని మేము అర్థం చేసుకుంటాం. ఆఫీస్ ఇన్సూరెన్స్ అనేది చాలా పెద్ద డీల్. అయినా కూడా మీ ఆఫీస్, అందులోని ప్రతీ దానిని కవర్ చేయడం చాలా అవసరం. కానీ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంలు చాలా ఎక్కువగా ఉంటాయని తెలుసు. కానీ మేము డిజిట్​లో మీకు కావాల్సినంత సాయం చేసేందుకు ప్రయత్నిస్తాం. తక్కువ ధరకు మీ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంలు అందించేందుకు కృషి చేస్తాం.

పూర్తి సంరక్షణ: వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాల వంటి నష్టాల నుంచి అలాగే దొంగతనాల వంటి నష్టాల నుంచి కూడా ఆఫీస్ ఇన్సూరెన్స్ పూర్తిగా రక్షిస్తుంది. ఈ పాలసీతో మీకు అనేక ప్రయోజనాలు అందుతాయి.

డిజిటల్ ఫ్రెండ్లీ: మొదటి భారతీయ ఆన్​లైన్ ఇన్సూరెన్స్ కంపెనీ అయిన డిజిట్​లో మీ ఆఫీస్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు, క్లెయిమ్స్ వరకు ప్రతిదీ డిజిటల్​గానే పూర్తవుతుంది. ఎటువంటి తనిఖీ ఉండదు. డిజిట్ యాప్ ద్వారా స్వీయ తనిఖీ ఎలా చేసుకోవాలో మీకు తెలియజేయబడుతుంది. (ఐఆర్​డీఏఐ (IRDAI) నిబంధనల ప్రకారం రూ. 1 లక్ష కంటే ఎక్కువ విలువ గల క్లెయిమ్స్​కు మ్యాన్యువల్ తనిఖీ అవసరం.)

అన్ని రకాల బిజినెస్ కేటగిరీలను కవర్ చేస్తుంది: మీరు పెద్ద కార్యాలయ భవనాన్ని కవర్ చేయాలనుకున్నా లేదా చిన్న ఆఫీస్ కవర్ చేయాలనుకున్న కానీ మేము అన్ని కేటగిరీలకు పాలసీలు అందజేస్తాం.

కంప్లీట్ ప్రొటెక్షన్ - మా ఆఫీస్ ఇన్సూరెన్స్ మీకు చాలా రకాల ప్రయోజనాలను అందిస్తుంది. మీ ఆస్తులను వరదలు, భూకంపాలు మరియు అగ్ని ప్రమాదాల వంటి విపత్తుల నుంచి కాపాడుతుంది. ఇవన్నీ ప్రయోజనాలు ఒకే ప్యాకేజీలో మీకు అందుబాటులో ఉంటాయి. 

డిజిట్ అందించే ఆఫీస్ ఇన్సూరెన్స్​లో ఏం ఏం కవర్ అవుతాయి?

ఏం కవర్ కావంటే?

  • ఉద్దేశపూర్వకంగా కావాలనే ఎవరైనా చేసిన చర్యల వల్ల నష్టం సంభవిస్తే కవర్ కాదు. 

  • పర్యావసాన నష్టాలు కవర్ చేయబడవు. 

  • రహస్యమైన అదృశ్యాలు, మరియు వివరించలేని నష్టాలు కవర్ చేయబడవు. 

  • క్యురియోస్, ఆర్ట్​కు సంబంధించినవి మరియు ఇంకా ఫిక్స్ చేయని విలువైన రాళ్ల వంటి ఇతర విలువైన వస్తువులు కవర్ చేయబడవు. 

  • ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, పేలుళ్ల వంటి కారణాల వలన కాకుండా మిగతా కారణాల వల్ల మెషనరీలు పాడయితే కవర్ చేయబడవు. 

  • యుద్ధం లేదా అణువిపత్తు వల్ల కలిగే నష్టాలు కవర్ చేయబడవు. 

వివిధ రకాల ఆఫీస్ ఇన్సూరెన్స్ ప్లాన్లు

డిజిట్​ ఆఫీస్ ఇన్సూరెన్స్ పాలసీ మీ కార్యాలయాన్ని వరదలు, భూకంపాలు, మరియు అగ్ని ప్రమాదాల వంటి సహజ విపత్తుల నుంచి రక్షిస్తుంది. అయితే కార్యాలయాల్లో దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. దొంగతనాలను మేము ప్రత్యేక పాలసీ కింద కవర్ చేస్తాం. దీనిని మీకు మరింత సులభతరం చేసేందుకు మేము ఈ కింది రకాల డిఫరెంట్ పాలసీను అందజేస్తున్నాం. 

ఆప్షన్ 1 ఆప్షన్ 2 ఆప్షన్ 3
మీ ఆఫీస్​లో ఉన్న కంటెంట్స్​ను మాత్రమే కవర్ చేస్తుంది. మీ ఆఫీస్ ప్రాంగణం అందులోని కంటెంట్స్ రెండింటినీ కవర్ చేస్తుంది. మీ బిల్డింగును కవర్ చేస్తుంది

ఆఫీస్ ఇన్సూరె

  • కంటెంట్ అంటే ఏమిటి?:ఆఫీస్ ఇన్సూరెన్స్​లోని కంటెంట్​లు మీ కార్యాలయంలోని ప్రాథమిక అంశాలను సూచిస్తాయి. ఉదాహరణకు భూకంపం, లేదా ఏదైనా ప్రకృతి విపత్తు వచ్చినపుడు ఆఫీసులోని కంటెంట్స్ డ్యామేజ్ అయితే పాలసీ పరిధిలోకి వచ్చి మీకు నష్టపరిహారం వస్తుంది. 

  • బిల్డింగ్ అర్థం ఏమిటి? : ఆఫీస్ ఇన్సూరెన్స్​లో బిల్డింగ్ అనేది మీ ఆఫీస్ యొక్క భౌతిక భవనాన్ని సూచిస్తుంది.

ఆఫీస్ ఇన్సూరెన్స్ ఎవరికి అవసరం?

అద్దెకు ఉండేవారు

ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనేది సొంత ఆస్తులు ఉన్న వారికి మాత్రమే అని చాలా మంది భావిస్తుంటారు. కానీ అద్దెకు తీసుకున్న వారి కోసం కూడా డిజిట్​లో మేము ఇన్సూరెన్స్ అందజేస్తాం. ఒకవేళ మీరు అద్దెకు తీసుకుని ఆఫీస్ లేదా వ్యాపారం నడుపుతుంటే మీకు కూడా డిజిట్ ఇన్సూరెన్స్ అందిస్తుంది.

చిన్న వ్యాపారాల యజమానులు

మీ వ్యాపారానికి చిన్న ఆఫీస్ ఉన్నా కూడా.. డిజిట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ సరిగ్గా సరిపోతుంది. జరిగే నష్టాలు, రిస్క్స్ నుంచి మాత్రమే కాకుండా మన చేతిలో లేని ప్రకృతి విపత్తులు, దొంగతనాల వంటి వాటి నుంచి కూడా ఈ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది.

మధ్య తరహా వ్యాపారాల యజమానులు

మీరు జనరల్ స్టోర్స్ చెయిన్, రెస్టారెంట్స్, లేదా మీడియం సైజ్ ఎంటర్​ప్రైజెస్ నడుపుతుంటే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ మధ్య తరహా వ్యాపారాలకు కూడా సరిపోతుంది. దొంగతనాలు, అగ్నిప్రమాదాలు, పేలుళ్లు, ప్రకృతి విపత్తులు, వరదలు, తుఫానులు, భూకంపాల వంటి వాటి వలన సంభవించే అన్ని నష్టాలు, డ్యామేజీలు కవర్ చేయబడతాయి.

పెద్ద సంస్థలు

మీరు ఒకటి కంటే ఎక్కువ ఆస్తులను కలిగి ఉండి... పెద్ద స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. మీ ప్రాపర్టీలను సంరక్షించడం ద్వారా కేవలం మీ బిజినెస్ రిస్క్ తగ్గించడం మాత్రమే కాకుండా ప్రజల్లో మీ వ్యాపారం పట్ల మంచి పేరు ఏర్పడుతుంది.

ఆఫీస్ ఇన్సూరెన్స్ వల్ల ప్రయోజనాలు ఏంటి?

భారతదేశంలో బిల్డింగ్ ఇన్సూరెన్స్ గురించి ఓసారి లుక్కేయండి.

  • ఊహించని పరిస్థితుల నుంచి కవరేజ్ అందిస్తుంది – ఇది మీ కార్యాలయాన్ని మాత్రమే కాకుండా అందులో ఉన్న కంటెంట్స్​ను కూడా అగ్ని ప్రమాదాలు, దొంగతనాలు, ప్రకృతి విపత్తులు పేలుళ్ల వంటి అన్ని అనుకోని డ్యామేజీలు, నష్టాల నుంచి కవర్ చేస్తుంది.
  • బిజినెస్ రిస్క్​లను తగ్గిస్తుంది – ఆఫీస్ ఇన్సూరెన్స్ కస్టమైజ్డ్ (నచ్చిన విధంగా మార్చుకునే) పద్ధతిలో కూడా వస్తుంది. కావున అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, వరదలు, దొంగతనాల వంటి అనుకోని సందర్భాల నుంచి మిమ్మల్ని ఆర్థికంగా రక్షించుకునేందుకు ఈ ఇన్సూరెన్స్ బాగా పని చేస్తుంది.
  • మానసిక ప్రశాంతత – మీ ఆఫీస్ అనుకోని సందర్భాల్లో తలెత్తే ఆర్థికపరమైన రిస్కుల నుంచి కవర్ చేయబడిందని మీరు నిర్ధారించుకున్నప్పుడు మీరు చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. ఎందుకంటే ఏమైనా అనుకోని ఘటనలు జరిగితే చూసుకోవడానికి మీ ఇన్సూరెన్స్ కంపెనీ మీ వెనకాలే ఉంటుంది.

ఆఫీస్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని ఎలా క్యాలుక్యులేట్ చేస్తారు?

మీ బిల్డింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కింది కారణాలచే ప్రభావితం అవుతుంది.

  • భవనం రకం – మీరు బీమా చేసే భవనం రకం అనేది మీ ఆఫీస్ ఇన్సూరెన్స్ ప్రీమియం పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. ఉదాహరణకు చూసుకుంటే ఆఫీసులో ఉన్న సింగిల్ ఫ్లోర్ ఆఫీస్ స్పేస్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధర కంటే.. పూర్తి భవనానికి బీమా చేయడం చాలా ఖర్చుతో కూడుకున్నది.
  • భవనం వయసు – మిగతా అన్ని బీమా పాలసీల మాదిరిగానే ఇక్కడ కూడా వయసు ప్రధాన ఆంశం. భవనం వయసు ఎంత పాతదైతే ప్రీమియం అంత తక్కువగా ఉంటుంది. కొత్త భవనానికి ఎక్కువగా ఉంటుంది.
  • ప్రాపర్టీ ఏరియా – ఆఫీస్ ఏరియా కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం మీద నేరుగా ప్రభావం చూపెడుతుంది. అందుకోసమే పెద్ద ప్రాపర్టీకి ఎక్కువ బీమా విలువ ఉంటుంది. ఆఫీస్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా ఎక్కువగా ఉంటుంది.
  • భద్రతా ప్రమాణాలు – దొంగతనాలు, అగ్ని ప్రమాదాల వంటి వాటి నుంచి కాపాడేందుకు చాలా ఆఫీసులకు భద్రతా ప్రమాణాలు ఉంటున్నాయి. ఇలా భద్రత ప్రమాణాలు ఉన్న ఆఫీసులకు ఆఫీస్ ఇన్సూరెన్స్ ప్రీమియం తక్కువగా ఉంటుంది.
  • అదనపు ప్రయోజనాలు – ఆఫీస్ ఇన్సూరెన్స్ అనేది ప్రధానంగా ఆఫీస్​ను, దానిలో ఉన్న కంటెంట్స్​ను కవర్ చేస్తుంది. కానీ ఆఫీసులో ఉన్న విలువైన ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను కవర్ చేయదు. అటువంటి వాటిని కవర్ చేసేందుకు మీరు యాడ్–ఆన్స్​ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అవి మీకు ఎక్కువ భద్రతను అందజేస్తాయి. తద్వారా మీ ఆఫీస్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా పెరుగుతుంది.

ఆన్​లైన్​లో ఆఫీస్ ఇన్సూరెన్స్ పాలసీని నేను ఎందుకు తీసుకోవాలి?

సంప్రదాయక బీమా కంపెనీలలో కూడా ఆఫ్​లైన్​లో అనేక ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి.

కానీ.. ఆఫీస్ ఇన్సూరెన్స్​ను ఆన్​లైన్​లో కొనుగోలు చేయడం వలన మీకు కింది ప్రయోజనాలు చేకూరుతాయి.

  • మీ సమయం ఆదా అవుతుంది: ఆన్​లైన్​లో ఆఫీస్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం అనేది నిమిషాల్లో పూర్తవుతుంది. దీని వలన మీ సమయం ఆదా అవుతుంది.
  • త్వరితమైన క్లెయిములు: మేము అందిస్తున్న ఆన్​లైన్ పాలసీల వలన క్లెయిములు చాలా సులభంగా పూర్తవుతాయి. ఎంతైనా మా స్మార్ట్​ఫోన్ ఆధారిత స్వీయ తనిఖీ ప్రక్రియకు ధన్యవాదాలు.
  • తక్కువ పేపర్​వర్క్: పూర్తిగా డిజిటల్ ఇన్సూరెన్స్ కంపెనీ అయిన మా వద్ద ఎటువంటి పేపర్ వర్క్ ఉండదు. మేము చాలా సందర్భాల్లో ఎటువంటి డాక్యుమెంట్స్ అడగం. ఎప్పుడైనా మరీ అవసరం పడితే ఒకటి రెండు డాక్యుమెంట్లను మాత్రమే అడుగుతాం.

బిల్డింగ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను పోల్చేందుకు చిట్కాలు

సరైన ఆఫీస్ ఇన్సూరెన్స్​ను ఎంచుకోవడం చాలా గజిబిజిగా ఉంటుంది. కానీ మీ ఆఫీసును ఉత్తమంగా సంరక్షించే బీమా ప్లాన్​ను ఎంచుకోండి.

మీ నిర్ణయ ప్రక్రియను సులభం చేసేందుకు... సరైన ఆఫీస్ ఇన్సూరెన్స్​ను మీరు ఎంచుకునేందుకు మీరు తనిఖీ చేయాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి.

  • కవరేజ్ ప్రయోజనాలు– మీ ఇన్సూరెన్స్​లో అతి ముఖ్యమైన విషయం మీకు లభించే కవరేజ్. మీ ఆఫీస్​ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత? అది దేని మీద వర్తిస్తుంది? అది కేవలం ఆఫీస్ స్పేస్​కు మాత్రమే వర్తిస్తుందా? లేక ఆఫీస్​లో ఉన్న కంటెంట్స్​కు కూడా పని చేస్తుందా? ఏం కవర్ అవుతాయి? ఏం కవర్ కావు అనే విషయాలను ప్రతిసారి తనిఖీ చేసుకోండి. సరైన విలువ గల ప్లాన్​ను ఎంచుకోవడంలో ఇది మీకు సహాయపడుతుంది.
  • బీమా చేసిన మొత్తం - ఒక వేళ మీరు క్లెయిమ్ చేసినపుడు మీరు కవర్ చేయబడే అత్యధిక మొత్తాన్నే బీమా చేసిన మొత్తం (సమ్ ఇన్సూర్డ్) విలువగా పరిగణిస్తారు. కావున మీరు ఆఫీస్ ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో బీమా మొత్తం విలువను కస్టమైజ్ చేసే పాలసీని తీసుకోవడం చాలా అవసరం. దాని వలన మీ ఆఫీసులోని కంటెంట్స్​ని బట్టి బీమా విలువను సెట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఎక్కువ బీమా మొత్తం అంటే ఎక్కువ ప్రీమియం.
  • క్లెయిమ్స్ సౌలభ్యం – ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీలో క్లెయిమ్స్ చాలా ముఖ్యం. ఎందుకంటే మీకు నష్టం లేదా డ్యామేజ్ ఎదురైన ప్రతీసారి క్లెయిమ్స్ చేస్తూ ఉంటారు. క్లెయిమ్ సెటిల్​మెంట్ రికార్డును దృష్టిలో ఉంచుకుని మీరు సరైన ఆఫీస్ ఇన్సూరెన్స్ అందించే సంస్థను ఎంచుకోండి. క్లెయిమ్ సెటిల్​మెంట్ రేషియో ఎక్కువగా ఉన్న సంస్థల్లో మీరు పాలసీలు తీసుకుంటే మీ క్లెయిమ్ చాలా త్వర​గా సెటిల్ అవుతాయి.
  • అందుబాటులో ఉన్న యాడ్–ఆన్స్- కొన్ని సార్లు ప్లాన్ కంటే మీకు ఎక్కువ కవరేజ్ అవసరం పడుతుంది. ఇక్కడే మీకు యాడ్–ఆన్స్ సరిగ్గా ఉపయోగపడతాయి. వివిధ బీమా కంపెనీలు వివిధ రకాలైన యాడ్-ఆన్స్​ను కలిగి ఉంటాయి. కావున అన్నింటిని పోల్చి చూసి మీ ఆఫీసుకు ఏదైతే సరిగ్గా సరిపోతుందో ఆ యాడ్–ఆన్​నే తీసుకోండి.

భారతదేశంలో ఆఫీస్ ఇన్సూరెన్స్​కు సంబంధించి తరచూ అడిగే ప్రశ్నలు

భారతదేశంలో ఆఫీస్ ఇన్సూరెన్స్ తప్పనిసరా?

లేదు. భారతీయ చట్టాల ప్రకారం ఆఫీస్ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి కాదు. కానీ జరగబోయే నష్టాలను కవర్ చేసేందుకు ఇది చాలా అవసరం. అందుకే ఎక్కువగా సిఫారసు చేయబడుతుంది. మీ ఆఫీస్, అందులోని కంటెంట్స్ ఎప్పుడూ సంరక్షించబడతాయి. అనుకోని దురదృష్టకర సందర్భాల్లో కవర్ చేయబడుతాయి.