ఆన్​లైన్​లో షాప్ ఇన్సూరెన్స్ పాలసీ

జీరో పేపర్‌వర్క్. ఆన్‌లైన్ ప్రక్రియ

షాప్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

షాప్ ఇన్సూరెన్స్ అనేది ఒక రకమైన బీమా పాలసీ. షాప్ లోపల మరియు వెలుపల ఉంచబడిన వస్తువులను ఇది కవర్ చేస్తుంది. డిజిట్ అందజేసే షాప్ ఇన్సూరెన్స్ అగ్ని ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలైన వరదలు, మరియు భూకంపాల వంటి వాటి నుంచి మీ షాప్​ను కవర్ చేస్తుంది. ఇది మా భారత్ సూక్ష్మ ఉద్యమ్ సురక్షా పాలసీ (IRDAN158RP0080V01202021) కింద అందించబడుతుంది. .

ఏదేమైనా షాప్​లో ఉన్న వస్తువులు తరచూ దొంగతనాలకు గురయ్యే ప్రమాదం ఉంది. కావున మేము షాప్ ఇన్సూరెన్స్​తో కలిసి కలిసి ప్రత్యేక బర్గర్లీ ఇన్సూరెన్స్​ పాలసీని అందజేస్తాం. అంటే డిజిట్ బర్గర్లీ ఇన్సూరెన్స్ పాలసీ (IRDAN158RP0019V01201920) వంటిది. ఈ విధంగా మీ దుకాణం కేవలం మంటలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడబడటమే కాకుండా దోపిడీ కారణంగా సంభవించే డ్యామేజెస్ మరియు లాసెస్ నుంచి కూడా మిమ్మల్నికాపాడుతుంది.

షాప్ ఇన్సూరెన్స్ ఎందుకు ముఖ్యమైనది?

1

2021వ సంవత్సరంలో 6 మిలియన్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయని రికార్డులు చెబుతున్నాయి.(1)

2

ఇండియా రిస్క్​ సర్వే 2021 ప్రకారం అగ్నిప్రమాదాలు అనేవి నాలుగో అతిపెద్ద విపత్తుగా ఓటు వేయబడింది.(2)

3

 2020లో ఇడియాలో మొత్తం 9,329 ఫైర్ యాక్సిడెంట్ కేసులు నమోదయ్యాయి. (3)

డిజిట్ షాప్‌కీపర్ ఇన్సూరెన్స్ పాలసీ గొప్పదనం ఏమిటి?

సంపూర్ణ రక్షణ: వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తుల నుంచి మరియు అగ్నిప్రమాదాల వంటి వాటి నుంచి మా షాప్ ఇన్సూరెన్స్ కాపాడుతుంది. ఇది ఒకే పాలసీలో మీకు అనేక ప్రయోజనాలను అందజేస్తుంది.

సమ్ ఇన్సూర్డ్ (బీమా మొత్తం): మీ వ్యాపారం యొక్క స్వభావం మరియు పరిమాణం ఆధారంగా మీ బీమా మొత్తాన్ని మీ ఇష్టం వచ్చిన విధంగా సెట్ చేసుకునేందుకు మేము మీకు ఆప్షన్ అందిస్తాం.

త్వరిత ఆన్‌లైన్ క్లెయిమ్‌లు: మా షాప్ కీపర్స్ ఇన్సూరెన్స్​ సాంకేతికంగా ఎనేబుల్ చేయబడినది. దీంతో క్లెయిమ్‌లు సులభం అవడమే గాక, సెటిల్ చేయడం కూడా ఎంతో సులభం. క్లెయిమ్ చేస్తున్నప్పుడు మీకు కావలసిందల్లా స్మార్ట్‌ఫోన్, మా త్వరిత స్వీయ-తనిఖీ ప్రక్రియ ద్వారా మీకు మార్గనిర్దేశం చేయడానికి మా డిజిట్ యాప్ ఉపయోగపడుతుంది. (గమనిక: ఐఆర్​డీఏఐ (IRDAI) నిర్దేశించిన చట్టాల ప్రకారం రూ. 1 లక్ష కంటే ఎక్కువ క్లెయిమ్‌లకు భౌతిక తనిఖీలు అవసరం)

డబ్బుకు తగిన విలువ : వ్యాపారాన్ని నడపడంలో ఖర్చులు, లాభ నష్టాలతో కూడిన చక్కటి బ్యాలెన్స్ ఉంటుందని మేము అర్థం చేసుకున్నాము. అందుకే, మీ షాప్ బడ్జెట్‌కు సులభంగా సరిపోయేలా మేము మీకు సాధ్యమైనంత ఉత్తమమైన షాప్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని అందిస్తాము.

అన్ని వ్యాపార వర్గాలను కవర్ చేస్తుంది: మీకు చిన్న సాధారణ దుకాణం ఉన్నా లేదా పెద్ద తయారీ మిల్లు ఉన్నా; మా  షాప్‌కీపర్స్ ఇన్సూరెన్స్ వ్యాపారం యొక్క ప్రతీ రకం, పరిమాణానికి అనుగుణంగా కస్టమైజ్‌ చేయబడుతుంది.

డిజిట్ షాప్ కీపర్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏమేం కవర్ అవుతాయి

ఏమేం కవర్ చేయబడదు?

డిజిట్ అందించే షాప్ ఇన్సూరెన్స్ పాలసీ ఈ కింది వాటికి కవరేజీలను అందించదు. 

  • ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేసే చర్య కవర్ చేయబడదు. 

  •  ఏవైనా పర్యావసాన నష్టాలు (కన్సీక్వెన్షల్ లాసెస్) కవర్ చేయబడవు. 

  • రహస్య అదృశ్యాలు మరియు వివరించలేకుండా ఉండే నష్టాలు కవర్ చేయబడవు. 

  • అరుదైన వస్తువులు, వెలకట్టలేని పెయింటింగ్స్, సెట్ చేయని రాళ్ల వంటి విలువైన వస్తువులు కవర్ చేయబడవు. 

  • ప్రకృతి వైపరీత్యం, అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు వలన కాకుండా యంత్రాలు పాడయిపోయినపుడు కవర్ చేయబడవు 

  • యుద్ధం లేదా అణు విపత్తు వల్ల కలిగే నష్టాలు కవర్ చేయబడవు. 

షాప్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల రకాలు

ఆప్షన్ 1 ఆప్షన్ 2 ఆప్షన్ 3
మీ షాప్​లోని కంటెంట్​కు మాత్రమే కవర్ అవుతుంది మీ భవనం/నిర్మాణం, మీ షాపులోని కంటెంట్​ రెండింటికీ కవర్ అవుతుంది. మీ బిల్డింగ్​ను కవర్ చేస్తుంది.

 

షాప్ ఇన్సూరెన్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

  • షాప్ కీపర్ ఇన్సూరెన్స్​లో ‘కంటెంట్​’ అంటే ఏమిటి: షాప్ కీపర్ ఇన్సూరెన్స్​లో కంటెంట్స్ అంటే మీ షాపులో ఉండే ప్రాథమిక వస్తువులు. ఉదాహరణకు మీరు బట్టల దుకాణాన్ని నడుపుతుంటే… మీ షాపులో అమ్మకానికి ఉంచిన వివిధ రకాల వస్త్రాలను కంటెంట్స్ సూచిస్తాయి.

 

  • షాప్‌కీపర్స్ ఇన్సూరెన్స్‌లో ‘బిల్డింగ్/స్ట్రక్చర్’ అంటే మీ ఉద్దేశం ఏమిటి - షాప్‌కీపర్స్ ఇన్సూరెన్స్‌లోని బిల్డింగ్/స్ట్రక్చర్ మీ షాప్ ఉన్న ప్రదేశాన్ని సూచిస్తుంది. ఇది పెద్ద కేంద్రం లేదా మాల్‌లో భాగంగా ఉన్న  దుకాణం లేదా గది కావచ్చు.

క్లెయిమ్‌ను ఎలా ఫైల్ చేయాలి?

మీరు షాప్​ కీపర్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్న తర్వాత డిజిట్​లో క్లెయిమ్స్ అన్ని సింపుల్​గా ఉంటాయి. కావున క్లెయిమ్ ప్రాసెస్ గురించి మీరు ఎటువంటి చింత పడాల్సిన అవసరం లేదు.

స్టెప్ 1

1800-258-5956 నంబర్​కు కాల్ చేయండి. లేదా hello@godigit.com కు మెయిల్ చేయండి. మీకు జరిగిన నష్టం మావద్ద రిజిస్టర్ చేయబడుతుంది.

స్టెప్ 2

మీకు ఒక స్వీయ-తనిఖీ లింక్ పంపబడుతుంది, తద్వారా మీరు మీ షాప్ లేదా దాని కంటెంట్‌లలో జరిగిన నష్టానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సులభంగా అప్‌లోడ్ చేయవచ్చు.

స్టెప్ 3

మీరు స్వీయ-తనిఖీ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, నష్టం అంచనా వేయబడటంతో పాటు ధృవీకరించబడుతుంది. అవసరమైతే (నష్టాలను డిజిటల్‌గా విశ్లేషించలేని నిర్దిష్ట పరిస్థితుల్లో), నష్టాన్ని అంచనా వేసే వ్యక్తి నియమించబడవచ్చు.

స్టెప్ 4

పరిస్థితిని బట్టి, ఎఫ్​ఐఆర్​ (FIR), నాన్​‌‌–ట్రేసేబుల్​ రిపోర్ట్ , అగ్నిమాపక శాఖ నివేదిక, ఇన్‌వాయిస్‌లు, కొనుగోలు పత్రాలు, అమ్మకపు పత్రాలు మొదలైన ఏవైనా అదనపు పత్రాలు అవసరమైతే మా కస్టమర్ కేర్ మీకు తెలియజేస్తుంది.

స్టెప్ 5

అన్నీ బాగుండి, నష్టం ధృవీకరించబడితే, మీరు సంబంధిత నష్టాలకు చెల్లింపు, పరిహారాలను అందుకుంటారు.

స్టెప్ 6

మీకు రావాల్సిన పరిహారం నెఫ్ట్​ (NEFT) బదిలీ ద్వారా ప్రాసెస్ చేయబడుతుంది.

షాప్‌కీపర్స్ ఇన్సూరెన్స్ పాలసీ ఎవరికి అవసరం?

ఫ్యామిలీ బిజినెస్ ఓనర్స్

మీరు సొంత దుకాణాన్ని కలిగి ఉండి దానిని నిర్వహిస్తున్నట్లయితే మీ షాప్​లో బట్టలు, బొమ్మలు, గృహోపకరణాలు, ఉపకరణాలు మొదలైన ఎంపిక చేసిన ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లయితే… మీ దుకాణం అన్ని రకాల నష్టాల నుంచి కవర్ చేయబడేందుకు మీరు మీ దుకాణానికి షాప్ ఇన్సూరెన్స్ అవసరం.

స్వతంత్ర దుకాణదారులు

ఎవరైతే తమ ప్రధాన ఆదాయ వనరుగా షాప్​ను భావిస్తున్నారో వారు షాప్​కీపర్ ఇన్సూరెన్స్ పాలసీని తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే మీరు దుకాణాన్ని కోల్పోయే ప్రమాదం లేదా ఆర్థిక కష్టాలు పడే ప్రమాదం ఉంది.

ప్రధాన ప్రాంతాల్లో దుకాణాలు ఉన్న దుకాణదారులు

నగరంలోని ప్రముఖ ప్రాంతాల్లో దుకాణాలను కలిగిన ఉన్న వ్యాపారస్తులు లేదా మహిళా వ్యాపారవేత్తలు, ఈ షాప్స్​ ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

ఒకటి కంటే ఎక్కువ షాపులు ఉన్న యజమానులు

ఒకటి కంటే ఎక్కువ దుకాణాలను కలిగి ఉన్న యజమానులు వారి షాపులన్నింటికీ షాప్ కీపర్స్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండాలి. మీ వ్యాపారానికి బీమా చేయడం వలన మీ షాప్ మరియు అందులోని వస్తువులను అనుకోని నష్టాల నుంచి కవర్ చేయడంతో పాటుగా.. మీ వ్యాపారం యొక్క స్థిరత్వాన్ని ప్రభావితం చేసే ఎటువంటి ప్రణాళిక లేని ఆర్థిక నష్టాలను మీరు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. 

ఎక్కువ రిస్క్ ఉండే వ్యాపారాలు

కొన్ని రకాల వ్యాపారాలు ఇతర వ్యాపారాల కంటే ఎక్కువ నష్టాలను చవి చూసే ప్రమాదం ఉంటుంది. ఉదాహరణకు సాధారణ దుకాణం కంటే ఆభరణాల దుకాణానికి ప్రమాదం సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా కొన్ని రకాల కర్మాగారాలు ఆఫీసుల కంటే ఎక్కువగా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. మీ వ్యాపారం యొక్క స్వభావం ఆధారంగా మీరు షాప్ ఇన్సూరెన్స్ పొందడం సరైందేనా? కాదా? అని మీరు అర్థం చేసుకోవచ్చు.

కవర్ చేయబడే దుకాణాల రకాలు

మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్స్

ప్రధానంగా మొబైల్ ఫోన్‌లు, మొబైల్ ఉపకరణాలు లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను విక్రయించే వ్యాపారాలు. ఉదాహరణకు క్రోమా, వన్‌ప్లస్, రెడ్‌మీ మొదలైన స్టోర్లకు నష్ట భయం ఉంటుంది. అటువంటి సందర్భంలో, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ స్టోర్ నష్టాల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది; వీటి విషయంలో అత్యంత సాధారణంగా జరిగే ప్రమాదాల్లో ఒకటి దొంగతనాలు.

కిరాణా, జనరల్ స్టోర్లు

పొరుగున ఉండే కిరాణా దుకాణాల నుంచి మీ బడ్జెట్ అనుకూలమైన సూపర్ మార్కెట్లు, సాధారణ దుకాణాల వరకు; అన్ని కిరాణా దుకాణాలు, సాధారణ దుకాణాలు కూడా ప్రాపర్టీ ఇన్సూరెన్స్​లో కవర్ చేయబడతాయి. బిగ్ బజార్, స్టార్ బజార్, రిలయన్స్ సూపర్ మార్కెట్ల వంటి దుకాణాలు ఇలాంటివాటికి కొన్ని సాధారణ ఉదాహరణలు.

కార్యాలయాలు మరియు విద్యాస్థలాలు

ఇది కార్యాలయ ప్రాంగణాలు, కళాశాలలు, కోచింగ్ ప్రాంగణాలు, పాఠశాలల వంటి విద్యాసంస్థలకు సరిగ్గా సరిపోయేలా రూపొందించబడింది. అటువంటి ఆస్తికి బీమా చేయించడం అనేది కేవలం నష్టాలను కవర్ చేయడానికి మాత్రమే కాకుండా.. విద్యార్థులు, మరియు ఉద్యోగులకు మీ సంస్థ మీద ఇది మరింత భరోసాను ఇస్తుంది. 

తయారీ రంగం మరియు ప్రాసెసింగ్

మీ వ్యాపారానికి సంబంధించిన తుది ఉత్పత్తులను తయారు చేసేందుకు వాడే అన్ని రకాల మిల్లులు మరియు ఫ్యాక్టరీలు ఇందులో ఉంటాయి. అది టెక్స్​టైట్ మిల్లు అయినా లేదా రసాయనాల తయారీ కేంద్రం అయినా సరే. డిజిట్ అందించే షాప్ కీపర్ ఇన్సూరెన్స్ పాలసీ అన్నింటికీ వర్తిస్తుంది. 

వ్యక్తిగత జీవనశైలి, ఫిట్‌నెస్

మీకు ఇష్టమైన మాల్స్, బట్టల దుకాణాల నుండి స్పాలు, జిమ్‌లు, ఇతర దుకాణాల వరకు; డిజిట్ ద్వారా ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పర్సనల్ లైఫ్‌స్టైల్, ఫిట్‌నెస్ విభాగంలోని అన్ని వ్యాపారాలకు కూడా వర్తిస్తుంది. అటువంటి ప్రాపర్టీలకు ఉదాహరణలలో ఎన్‌రిచ్ సెలూన్‌లు, కల్ట్ ఫిట్‌నెస్ సెంటర్‌లు, ఫీనిక్స్ మార్కెట్ సిటీ, ఇతర స్టోర్లు ఉంటాయి.

ఆహారం, తినదగినవి

ఆహారం తినే ప్రదేశాలు! కేఫ్‌లు, ఫుడ్ ట్రక్కుల నుంచి రెస్టారెంట్ చెయిన్లు, బేకరీల వరకు; డిజిట్ ద్వారా ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అన్ని రకాల ఆహార సంస్థలకు బాగా సరిపోతుంది. ఫుడ్ కోర్ట్‌లలోని రెస్టారెంట్లు, చాయ్ పాయింట్, చయ్యోస్ వంటి టీ దుకాణాలు, బర్గర్ కింగ్, పిజ్జా హట్ వంటి ఫాస్ట్ ఫుడ్ సంస్థలు కూడా అలాంటి వాటికి కొన్ని ఉదాహరణలు.

హెల్త్ కేర్

అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసిన అంశాలలో ఒకటి; డిజిట్ ద్వారా ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఆస్పత్రులు, క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఫార్మసీలు, ఇతర మెడికల్ స్టోర్లకు కూడా వర్తిస్తుంది.

ఇంటి మరమ్మతు సేవలు

వడ్రంగి, ప్లంబింగ్ రిపేర్ నుంచి మోటారు గ్యారేజీలు, ఇంజనీరింగ్ వర్క్‌షాప్‌ల వరకు ఈ కేటగిరీ వ్యాపారంలో ఉంటాయి.

ఇతరాలు

పైన పేర్కొన్న కేటగిరీలు కాకుండా, అన్ని పరిమాణాలు, వ్యాపారాల స్వభావానికి డిజిట్ ద్వారా ప్రాపర్టీ ఇన్సూరెన్స్‌‌కు అనుకూలంగా ఉంటుంది. మీరు జాబితాలో మీ వర్గాన్ని కనుగొనలేకపోతే, మమ్మల్ని సంప్రదించడానికి సంకోచించకండి. మీ ఇల్లు లేదా వ్యాపారం కోసం ఉత్తమంగా సరిపోయే ప్రాపర్టీ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడంలో మేము మీకు సహాయం చేస్తాము.

మీ షాప్‌కీపర్స్ ఇన్సూరెన్స్‌‌ పాలసీకి సరైన ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?

దీని గురించి ఆలోచించండి, అధ్వాన పరిస్థితిలో (మీ షాప్ మరమ్మతులు చేయలేని విధంగా పాడవడం) మీ వ్యాపారం యొక్క మొత్తం నష్టం ఎంత? దానికి సమాధానం బహుశా మీరు మీ దుకాణాన్ని ఎంతవరకు కవర్​ చేశారో అంత. అంచనా వేయడానికి సులభమైన మార్గం ఏమిటంటే, మీకు బొమ్మల దుకాణం ఉందని అనుకుంటే సగటున ఒక్కో బొమ్మ ధర రూ. 1,000. మీ దుకాణంలో అందుబాటులో ఉన్న స్టాక్ పరిమాణం, దాదాపు 1000 బొమ్మలు. ఈ సందర్భంలో, మీరు రూ. 1,000 x 1000, అంటే రూ. 10,00,000 కవర్ చేయాలి. అవసరమైతే మరింత స్పష్టత కోసం కింది వీడియోను చూడండి.

గమనిక: మీ ల్యాప్‌టాప్, ఫోన్ వంటి ఫిక్చర్‌లు, పోర్టబుల్ అసెట్లు ఈ షాప్ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌లో కవర్ చేయబడవు, కాబట్టి మీ బీమా మొత్తాన్ని లెక్కించేటప్పుడు అదే ధరను పరిగణించవద్దు.

భారతదేశంలో షాప్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల గురించి మరింత తెలుసుకోండి

షాప్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు ఎందుకు ముఖ్యమైనవి?

దుకాణాలు నడపడం మనలో చాలా మందికి ప్రధాన ఆదాయ వనరుగా ఉంటుంది. మీరు ఎటువంటి దుకాణం నడుపుతున్నారనేది పరిగణించాల్సిన అవసరం లేదు. అది అమూల్యమైనది. షాప్ కీపర్స్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా చాలా ముఖ్యమైనది. ఇది మీ దుకాణాన్ని మరియు అందులో ఉన్న వస్తువులను దురదృష్టకర అనుకోని పరిస్థితుల నుంచి కాపాడుకునేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ విధంగా మీరు మీ లాభాలు మరియు పొదుపులకు ఎటువంటి ఢోకా లేకుండా ఉంచుకోవచ్చు. ఎప్పుడు ఏమవుతుందో అనే దిగులుకు బదులు మీ వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద కాన్సంట్రేట్ చేయండి. మీ వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించండి. 

దుకాణాలు నడపడం మనలో చాలా మందికి ప్రధాన ఆదాయ వనరుగా ఉంటుంది. మీరు ఎటువంటి దుకాణం నడుపుతున్నారనేది పరిగణించాల్సిన అవసరం లేదు. అది అమూల్యమైనది. షాప్ కీపర్స్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా చాలా ముఖ్యమైనది. ఇది మీ దుకాణాన్ని మరియు అందులో ఉన్న వస్తువులను దురదృష్టకర అనుకోని పరిస్థితుల నుంచి కాపాడుకునేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ విధంగా మీరు మీ లాభాలు మరియు పొదుపులకు ఎటువంటి ఢోకా లేకుండా ఉంచుకోవచ్చు. ఎప్పుడు ఏమవుతుందో అనే దిగులుకు బదులు మీ వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద కాన్సంట్రేట్ చేయండి. మీ వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించండి. 

నేను ఆన్‌లైన్‌లో షాప్ ఇన్సూరెన్స్ పాలసీని ఎందుకు తీసుకోవాలి?

సంప్రదాయ బీమా కంపెనీలతో పాటు ఆఫ్‌లైన్‌లో అనేక షాప్ ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అయితే, షాప్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం వల్ల ఈ కింది మార్గాల్లో మీకు ప్రయోజనం చేకూరుతుంది: •మీ సమయాన్ని ఆదా చేస్తుంది: షాప్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం కొన్ని నిమిషాల వ్యవధిలోనే పూర్తవుతుంది. తద్వారా మీకు ఎంతో సమయం ఆదా అవుతుంది. • త్వరిత క్లెయిమ్‌లు: మేము అందించే లాంటి ఆన్‌లైన్ షాప్ ఇన్సూరెన్స్‌తో, క్లెయిమ్‌లను సులభంగా చేయవచ్చు, పరిష్కరించవచ్చు. మా స్మార్ట్‌ఫోన్‌ ఆధారిత స్వీయ-తనిఖీ ప్రక్రియకు ధన్యవాదాలు. •పేపర్ వర్క్ ఉండదు: డిజిటల్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినందున, మాకు ఎటువంటి రాత పనితో అవసరం లేదు.  ప్రతిదీ సాఫ్ట్ కాపీలతో కూడా చేయవచ్చు! ఖచ్చితంగా అవసరమైతే, పరిస్థితి ఆధారంగా మాత్రమే, మేము ఒకటి లేదా రెండు పత్రాలను అడగవచ్చు

సంప్రదాయ బీమా కంపెనీలతో పాటు ఆఫ్‌లైన్‌లో అనేక షాప్ ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అయితే, షాప్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం వల్ల ఈ కింది మార్గాల్లో మీకు ప్రయోజనం చేకూరుతుంది:

•మీ సమయాన్ని ఆదా చేస్తుంది: షాప్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం కొన్ని నిమిషాల వ్యవధిలోనే పూర్తవుతుంది. తద్వారా మీకు ఎంతో సమయం ఆదా అవుతుంది.

• త్వరిత క్లెయిమ్‌లు: మేము అందించే లాంటి ఆన్‌లైన్ షాప్ ఇన్సూరెన్స్‌తో, క్లెయిమ్‌లను సులభంగా చేయవచ్చు, పరిష్కరించవచ్చు. మా స్మార్ట్‌ఫోన్‌ ఆధారిత స్వీయ-తనిఖీ ప్రక్రియకు ధన్యవాదాలు.

•పేపర్ వర్క్ ఉండదు: డిజిటల్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినందున, మాకు ఎటువంటి రాత పనితో అవసరం లేదు.  ప్రతిదీ సాఫ్ట్ కాపీలతో కూడా చేయవచ్చు! ఖచ్చితంగా అవసరమైతే, పరిస్థితి ఆధారంగా మాత్రమే, మేము ఒకటి లేదా రెండు పత్రాలను అడగవచ్చు

షాప్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల ప్రయోజనాలు

ఊహించని పరిస్థితులకు వ్యతిరేకంగా కవరేజ్ - మీ దుకాణాన్ని అన్ని ఊహించని నష్టాలు, మంటలు, దొంగతనాలు, ప్రకృతి వైపరీత్యాలు, పేలుళ్ల వంటి ఇతర నష్టాల నుంచి రక్షిస్తుంది. ఊహించని నష్టాల నుంచి మీకు కవరేజ్ అందిస్తుంది - అనుకోకుండా వచ్చే ఖర్చులు ఎవరికైనా ఇబ్బందులను కలిగిస్తాయి. అటువంటి విపత్తులను దూరంగా ఉంచేందుకు మరియు మీ సంపాదనలను స్థిరంగా ఉంచుకునేందుకు షాప్​ కీపర్స్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది.  మనశ్శాంతి - మీరు మరియు మీ షాప్ రక్షించబడిందని తెలుసుకున్నపుడు ఇక నిశ్చింతగా ఉండవచ్చు.

  • ఊహించని పరిస్థితులకు వ్యతిరేకంగా కవరేజ్ - మీ దుకాణాన్ని అన్ని ఊహించని నష్టాలు, మంటలు, దొంగతనాలు, ప్రకృతి వైపరీత్యాలు, పేలుళ్ల వంటి ఇతర నష్టాల నుంచి రక్షిస్తుంది.

  • ఊహించని నష్టాల నుంచి మీకు కవరేజ్ అందిస్తుంది - అనుకోకుండా వచ్చే ఖర్చులు ఎవరికైనా ఇబ్బందులను కలిగిస్తాయి. అటువంటి విపత్తులను దూరంగా ఉంచేందుకు మరియు మీ సంపాదనలను స్థిరంగా ఉంచుకునేందుకు షాప్​ కీపర్స్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. 
  • మనశ్శాంతి - మీరు మరియు మీ షాప్ రక్షించబడిందని తెలుసుకున్నపుడు ఇక నిశ్చింతగా ఉండవచ్చు.

షాప్​కీపర్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్‌ను ఉపయోగించి ప్రీమియంను లెక్కించండి

షాప్‌కీపర్స్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్ మీ దుకాణానికి ఎంత వరకు బీమా చేయవచ్చో, దానికి చెల్లించాల్సిన సంబంధిత ప్రీమియంను నిర్ధారించడంలో మీకు సహాయం చేస్తుంది. షాప్‌కీపర్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్ ఎందుకు ముఖ్యమైనది? ప్రతీ దుకాణం, వ్యాపారం, రిటైల్ భిన్నంగా ఉంటుంది. అది వ్యాపారం యొక్క స్వభావం నుంచి దాని పరిమాణం, ఆర్థిక ఖర్చులపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా, ఏ రెండు షాప్‌ల బీమా పాలసీలు ఒకే విధంగా ఉండవు. దుకాణం రకం, పరిమాణం, వస్తువుల సంఖ్య, నగరం మొదలైన అనేక అంశాలు మీ షాప్‌కీపర్స్ ఇన్సూరెన్స్ ప్రీమియంను నిర్ణయిస్తాయి. దానికి షాప్‌కీపర్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది నేరుగా మీ షాప్‌లో ఎదురయ్యే నష్టాలను అంచనా వేసుకోవడంలో, వాటిని సురక్షితంగా ఉంచడానికి సరైన ప్రీమియంను నిర్ణయించడంలో సహాయపడుతుంది. షాప్‌కీపర్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియంపై ప్రభావం చూపే అంశాలు పైన పేర్కొన్న విధంగా, ఏ రెండు దుకాణాలకు షాప్‌కీపర్స్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం ఒకేలా ఉండదు. ప్రతీ దుకాణం, వ్యాపారం భిన్నంగా ఉంటాయి. మీ షాప్‌కీపర్స్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ప్రభావం చూపే అంశాలు కింద పేర్కొనబడ్డాయి: దుకాణం/వ్యాపారం యొక్క స్వభావం: వస్తువుల విక్రయానికి సంబంధించి ప్రతీ వ్యాపారం మరొకదానితో పోలిస్తే భిన్నంగానే ఉంటుంది. కొన్ని వస్తువులు ఇతర వాటి కంటే ఎక్కువ విలువైనవి కాబట్టి,  ప్రీమియం తేడాలు ఉంటాయి. ఉదాహరణకు: నగల దుకాణం సాధారణ దుకాణం కంటే ఎక్కువ షాప్‌కీపర్స్ ప్రీమియంను కలిగి ఉంటుంది.   దుకాణం పరిమాణం: మీ దుకాణం ఎంత పెద్దదైతే దాని విలువ అంత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, మీ షాప్‌కీపర్స్ ఇన్సూరెన్స్  ప్రీమియం కూడా బీమా చేయబడిన దుకాణం పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. స్టాక్ పరిమాణం: మీ ఇన్సూరెన్స్​ చేయబడిన మొత్తం దీనిపై ఆధారపడి ఉంటుంది. మీరు ఎన్ని ఎక్కువ వస్తువులకు బీమా చేస్తారో, మీ బీమా చేయబడిన మొత్తం అంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, మీ బీమా ప్రీమియం కూడా దీని ద్వారా ప్రభావితమవుతుంది. నగరం: ఏదైనా బీమా పాలసీ లాగానే, మీరు నివసించే నగరం లేదా మీ దుకాణం బీమా చేయబడిన నగరం మీ షాప్‌కీపర్స్ ఇన్సూరెన్స్  ప్రీమియంపై ప్రభావం చూపుతుంది, ఎందుకంటే ప్రతీ నగరానికి దాని ప్రత్యేకమైన నష్టాలు ఉంటాయి. ఆ ప్రమాదాలు సహజమైనవి లేదా మానవ తప్పిదంగా కూడా ఉండవచ్చు. ఉదాహరణకు; నేరాల రేటు అధికంగా ఉన్న నగరంలో ఉన్న దుకాణం సురక్షితమైన నగరంలో ఉన్న అదే దుకాణం కంటే ఎక్కువ ప్రీమియంను కలిగి ఉంటుంది.

షాప్‌కీపర్స్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్ మీ దుకాణానికి ఎంత వరకు బీమా చేయవచ్చో, దానికి చెల్లించాల్సిన సంబంధిత ప్రీమియంను నిర్ధారించడంలో మీకు సహాయం చేస్తుంది.

షాప్‌కీపర్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్ ఎందుకు ముఖ్యమైనది?

ప్రతీ దుకాణం, వ్యాపారం, రిటైల్ భిన్నంగా ఉంటుంది. అది వ్యాపారం యొక్క స్వభావం నుంచి దాని పరిమాణం, ఆర్థిక ఖర్చులపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా, ఏ రెండు షాప్‌ల బీమా పాలసీలు ఒకే విధంగా ఉండవు.

దుకాణం రకం, పరిమాణం, వస్తువుల సంఖ్య, నగరం మొదలైన అనేక అంశాలు మీ షాప్‌కీపర్స్ ఇన్సూరెన్స్ ప్రీమియంను నిర్ణయిస్తాయి. దానికి షాప్‌కీపర్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది నేరుగా మీ షాప్‌లో ఎదురయ్యే నష్టాలను అంచనా వేసుకోవడంలో, వాటిని సురక్షితంగా ఉంచడానికి సరైన ప్రీమియంను నిర్ణయించడంలో సహాయపడుతుంది.

షాప్‌కీపర్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియంపై ప్రభావం చూపే అంశాలు

పైన పేర్కొన్న విధంగా, ఏ రెండు దుకాణాలకు షాప్‌కీపర్స్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం ఒకేలా ఉండదు. ప్రతీ దుకాణం, వ్యాపారం భిన్నంగా ఉంటాయి. మీ షాప్‌కీపర్స్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ప్రభావం చూపే అంశాలు కింద పేర్కొనబడ్డాయి:

  • దుకాణం/వ్యాపారం యొక్క స్వభావం: వస్తువుల విక్రయానికి సంబంధించి ప్రతీ వ్యాపారం మరొకదానితో పోలిస్తే భిన్నంగానే ఉంటుంది. కొన్ని వస్తువులు ఇతర వాటి కంటే ఎక్కువ విలువైనవి కాబట్టి,  ప్రీమియం తేడాలు ఉంటాయి. ఉదాహరణకు: నగల దుకాణం సాధారణ దుకాణం కంటే ఎక్కువ షాప్‌కీపర్స్ ప్రీమియంను కలిగి ఉంటుంది.  
  • దుకాణం పరిమాణం: మీ దుకాణం ఎంత పెద్దదైతే దాని విలువ అంత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, మీ షాప్‌కీపర్స్ ఇన్సూరెన్స్  ప్రీమియం కూడా బీమా చేయబడిన దుకాణం పరిమాణంపై ఆధారపడి ఉంటుంది.
  • స్టాక్ పరిమాణం: మీ ఇన్సూరెన్స్​ చేయబడిన మొత్తం దీనిపై ఆధారపడి ఉంటుంది. మీరు ఎన్ని ఎక్కువ వస్తువులకు బీమా చేస్తారో, మీ బీమా చేయబడిన మొత్తం అంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, మీ బీమా ప్రీమియం కూడా దీని ద్వారా ప్రభావితమవుతుంది.
  • నగరం: ఏదైనా బీమా పాలసీ లాగానే, మీరు నివసించే నగరం లేదా మీ దుకాణం బీమా చేయబడిన నగరం మీ షాప్‌కీపర్స్ ఇన్సూరెన్స్  ప్రీమియంపై ప్రభావం చూపుతుంది, ఎందుకంటే ప్రతీ నగరానికి దాని ప్రత్యేకమైన నష్టాలు ఉంటాయి. ఆ ప్రమాదాలు సహజమైనవి లేదా మానవ తప్పిదంగా కూడా ఉండవచ్చు. ఉదాహరణకు; నేరాల రేటు అధికంగా ఉన్న నగరంలో ఉన్న దుకాణం సురక్షితమైన నగరంలో ఉన్న అదే దుకాణం కంటే ఎక్కువ ప్రీమియంను కలిగి ఉంటుంది.

సరైన షాప్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎలా ఎంచుకోవాలి?

మీ వ్యాపారం యొక్క ప్రధాన భాగాన్ని రక్షించే ప్లాన్​ను ఎంచుకునేటపుడు కొద్దిగా గందరగోళం ఉండడం సహజమే. మీకోసం దీన్ని మరింత సులభంగా చేసేందుకు మరియు సరైన షాప్​కీపర్ ఇన్సూరెన్స్ ఎంచుకునే సమయంలో మీరు పరిగణలోనికి తీసుకోవాల్సిన కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి.  a. బీమా చేయబడిన మొత్తం: మీరు క్లెయిమ్ చేయాల్సిన దురదృష్టకర పరిస్థితి ఉన్నప్పుడు మీరు పొందగలిగే అత్యధిక మొత్తం మీరు ఎంతకైతే బీమా చేయించుకున్నారో అదే. మీ షాప్‌లో ఉన్న వస్తువులు, కంటెంట్‌ల మొత్తం విలువ ఆధారంగా మీ బీమా మొత్తాన్ని కస్టమైజ్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే షాప్​ ఇన్సూరెన్స్​ను ఎంచుకోండి. గమనిక: బీమా చేయబడిన మొత్తం అధికంగా ఉందంటే మీ షాప్‌కీపర్స్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుందని అర్థం చేసుకోవాలి. అయితే ప్రీమియం ధరపై మీ నిర్ణయాన్ని ఆధారం చేసుకోకండి, మీ షాప్ వస్తువుల విలువపై ప్రీమియం ఆధారపడి ఉంటుంది. b. ఈజీ క్లెయిమ్ ప్రాసెసింగ్ విధానం: మనం ఏ ఇన్సూరెన్స్ తీసుకున్నా కానీ అందులో క్లెయిమ్స్ అనేవి చాలా ముఖ్యం. మీరు నష్టాలను ఎదుర్కొన్నపుడు తప్పనిసరిగా క్లెయిమ్ చేసుకోవాలి. ఒక పాలసీ క్లెయిమ్ సెటిల్​మెంట్ ప్రాసెస్ మరియు క్లెయిమ్ సెటిల్​మెంట్ రికార్డులను బట్టి మీరు షాప్ కీపర్స్ ఇన్సూరెన్స్​ను ఎంచుకోవాల్సిఉంటుంది.  c. కవరేజ్: మీ షాప్ ఇన్సూరెన్స్ అనేది ఎటువంటి నష్టాల నుంచి మిమ్మల్ని కవర్ చేస్తుంది? అది కేవలం మీ షాప్​ను మాత్రమే కవర్ చేస్తుందా? లేదా షాప్​లో ఉన్న కంటెంట్​లను కూడా కవర్ చేస్తుందా? వివిధ రకాల సంస్థలు అందించే షాప్ కీపర్ ఇన్సూరెన్స్​లు వివిధ రకాలుగా ఉంటాయి. మీరు పాలసీని తీసుకునే ముందు డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి. మీకు మరియు మీ షాప్​కు అవసరమైన షాప్ కీపర్ ఇన్సూరెన్స్​ను తీసుకునేందుకు ప్రయత్నించండి.  d. ఉత్తమ విలువ: చివరగా, అన్ని అంశాలను కలిపి లెక్కించండి. బీమా చేయబడిన మొత్తం నుంచి, ప్రీమియం వరకు చేర్చబడిన కవరేజీలు, మీకు ఉత్తమమైన విలువను అందించే  షాప్‌కీపర్స్ ఇన్సూరెన్స్  పాలసీని పొందండి.

మీ వ్యాపారం యొక్క ప్రధాన భాగాన్ని రక్షించే ప్లాన్​ను ఎంచుకునేటపుడు కొద్దిగా గందరగోళం ఉండడం సహజమే. మీకోసం దీన్ని మరింత సులభంగా చేసేందుకు మరియు సరైన షాప్​కీపర్ ఇన్సూరెన్స్ ఎంచుకునే సమయంలో మీరు పరిగణలోనికి తీసుకోవాల్సిన కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి. 

a. బీమా చేయబడిన మొత్తం: మీరు క్లెయిమ్ చేయాల్సిన దురదృష్టకర పరిస్థితి ఉన్నప్పుడు మీరు పొందగలిగే అత్యధిక మొత్తం మీరు ఎంతకైతే బీమా చేయించుకున్నారో అదే. మీ షాప్‌లో ఉన్న వస్తువులు, కంటెంట్‌ల మొత్తం విలువ ఆధారంగా మీ బీమా మొత్తాన్ని కస్టమైజ్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే షాప్​ ఇన్సూరెన్స్​ను ఎంచుకోండి.

గమనిక: బీమా చేయబడిన మొత్తం అధికంగా ఉందంటే మీ షాప్‌కీపర్స్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుందని అర్థం చేసుకోవాలి. అయితే ప్రీమియం ధరపై మీ నిర్ణయాన్ని ఆధారం చేసుకోకండి, మీ షాప్ వస్తువుల విలువపై ప్రీమియం ఆధారపడి ఉంటుంది.

b. ఈజీ క్లెయిమ్ ప్రాసెసింగ్ విధానం: మనం ఏ ఇన్సూరెన్స్ తీసుకున్నా కానీ అందులో క్లెయిమ్స్ అనేవి చాలా ముఖ్యం. మీరు నష్టాలను ఎదుర్కొన్నపుడు తప్పనిసరిగా క్లెయిమ్ చేసుకోవాలి. ఒక పాలసీ క్లెయిమ్ సెటిల్​మెంట్ ప్రాసెస్ మరియు క్లెయిమ్ సెటిల్​మెంట్ రికార్డులను బట్టి మీరు షాప్ కీపర్స్ ఇన్సూరెన్స్​ను ఎంచుకోవాల్సిఉంటుంది. 

c. కవరేజ్: మీ షాప్ ఇన్సూరెన్స్ అనేది ఎటువంటి నష్టాల నుంచి మిమ్మల్ని కవర్ చేస్తుంది? అది కేవలం మీ షాప్​ను మాత్రమే కవర్ చేస్తుందా? లేదా షాప్​లో ఉన్న కంటెంట్​లను కూడా కవర్ చేస్తుందా? వివిధ రకాల సంస్థలు అందించే షాప్ కీపర్ ఇన్సూరెన్స్​లు వివిధ రకాలుగా ఉంటాయి. మీరు పాలసీని తీసుకునే ముందు డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి. మీకు మరియు మీ షాప్​కు అవసరమైన షాప్ కీపర్ ఇన్సూరెన్స్​ను తీసుకునేందుకు ప్రయత్నించండి. 

d. ఉత్తమ విలువ: చివరగా, అన్ని అంశాలను కలిపి లెక్కించండి. బీమా చేయబడిన మొత్తం నుంచి, ప్రీమియం వరకు చేర్చబడిన కవరేజీలు, మీకు ఉత్తమమైన విలువను అందించే  షాప్‌కీపర్స్ ఇన్సూరెన్స్  పాలసీని పొందండి.

షాప్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి తరచూ అడిగే ప్రశ్నలు

షాప్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల ధర ఎంత?

ఇది పూర్తిగా మీ దుకాణం, వ్యాపారం యొక్క స్వభావం, పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. అవసరమైన వివరాలను అందించడం ద్వారా మీరు మీ  షాప్‌కీపర్స్ ఇన్సూరెన్స్ ప్రీమియంను లెక్కించవచ్చు.

భారతదేశంలో షాప్‌కీపర్స్ ఇన్సూరెన్స్ తప్పనిసరి కాదా?

ఇది తప్పనిసరి కానప్పటికీ, మీరు మీ దుకాణానికి బీమా పొందాలని సిఫార్సు చేయబడింది. ఈ విధంగా మీ దుకాణం, దాని కంటెంట్‌లు ఎల్లప్పుడూ రక్షించబడతాయి. ప్రమాదకర పరిస్థితులలో కవర్ చేయబడతాయి. తద్వారా మీ వ్యాపారానికి సంబంధించిన నష్టాలను  తగ్గించవచ్చు.

నా దుకాణంలో కొన్ని ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి. అవి కవర్ చేయబడతాయా?

అది మీ వ్యాపారం యొక్క స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ల్యాప్‌టాప్‌లు మీ ప్రాథమిక వ్యాపారంలో భాగం కాకపోతే (అంటే అమ్మకానికి) అప్పుడు అవి కవర్ చేయబడవు.

నాకు నగరం అంతటా దుకాణాలు ఉన్నాయి, నేను వాటన్నింటికీ ఒకే పాలసీని కొనుగోలు చేయవచ్చా?

అవును. మీరు చేయవచ్చు. కానీ దుకాణాలు ఏ ప్రాంతంలో ఉన్నాయన్న విషయాన్ని బీమాదారు తప్పకుండా తెలియజేయాలి. మరియు ఒక్కో దానికి ప్రత్యేకంగా సమ్ ఇన్సూర్డ్  అమౌంట్ కూడా ప్రకటించాలి.