డిజిట్‌ పార్ట్‎నర్‎గా మారండి

కలిసి అద్భుతంగా మారుదాం

నిర్ధిష్ట ఇన్సూరెన్స్ ఉత్పత్తులను అమ్మే ఇన్సూరెన్స్ ఏజెంట్‎కు POSP (పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్) అనే పేరు ఇవ్వడం జరుగుతుంది.

POSP కావడానికి, IRDAI (ఐఆర్డీఏఐ) నిర్దేశించిన విధంగా మీరు కనీస విద్యార్హతలను కలిగి ఉండాలి. మేము అందించే శిక్షణ పొందాలి. POSPగా ఎలా ఉండాలి, దాని ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోవడానికి, చదవండి.

POSPగా మీరు ఏం అమ్మగలరు?డిజిట్‌ ఇన్సూరెన్స్‎తో, మీరు కార్‌ ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్, పర్సనల్ యాక్సిడెంట్ కవర్, SFSP (ఎస్‌ఎఫ్‌ఎస్‌పీ) ఇన్సూరెన్స్‎లను అమ్మవచ్చు.

POSPగా ఉండటం వల్ల కలిగే లాభాలు ఏమిటి?

  • మీకు మీరే బాస్‌గా మారండి: మీ కన్వీనియెన్స్‌ను బట్టి పని చేయండి. ఎందుకంటే ఇక్కడ మీకు మీరే బాస్!

  • ఫిక్స్‌డ్‌ టైమింగ్స్‌ ఉండవు – మీకు నచ్చిన పని గంటలను మీరు ఎంచుకోవచ్చు. ఫుల్ టైం పని చేయాలా లేదంటే పార్ట్ టైం పని చేయాలా అనేది మీరే నిర్ణయించుకుంటారు.

  • వర్క్ ఫ్రం హోం: పాలసీలను అమ్మేందుకు ఆన్‌లైన్‌ ప్రాసెస్‌లను ఉపయోగించండి. అలా వర్క్‌ ఫ్రం హోం చేయవచ్చు లేదా ఇంకా ఎక్కడి నుంచైనా కూడా పనిచేయొచ్చు!

  • కేవలం 15 గంటల శిక్షణ: కేవలం 15 గంటల శిక్షణతో మీరు ఇన్సూరెన్స్ నిపుణులుగా మారతారు. మీరు ఏది తెలుసుకోవాలనుకున్నా మేము మీకు సహాయం చేస్తాము!

  • ఎక్కువ మొత్తంలో సంపాదించండి - మీ ఆదాయం మీరు జారీ చేసే పాలసీల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. 

  • పెట్టుబడి అవసరం లేదు – మీరు చేరేటప్పుడు ఏం చెల్లించాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిందల్లా ఒక స్మార్ట్‌ఫోన్‌/కంప్యూటర్, ఒక ఇంటర్నెట్ కనెక్షన్!

POSPగా ఎవరు కావచ్చు?

కాలేజీ విద్యార్థులు

మీరు పై చదువులు చదువుతూ, అదనంగా సంపాదించడం కోసం కాస్త సమయం కేటాయించాలనుకుంటే, ఇది మీకు ఎంతో ఉత్తమమైన ఆప్షన్‌ అవుతుంది.మీకు ఇప్పటికే బిజినెస్ ఉండి, దాంతోపాటు ఇంకా ఏదైనా చేయాలనుకుంటే మీరు POSP కావచ్చు. మీకు కావాల్సినప్పుడు పని చేసి అదనంగా సంపాదించుకోవచ్చు.

ఇంట్లో ఉండే గృహిణులు & హోం మేకర్స్‌

మీరు ఇంటి వద్ద ఉండే భార్య లేదా భర్త అయి ఉండి, మీకు సమయం ఉంటే, మీరు POSPగా కావచ్చు. మీ కోసం, మీ కుటుంబం కోసం అదనంగా డబ్బు సంపాదించవచ్చు

రిటైర్ అయిన వారు

రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత మీరు ఇన్సూరెన్స్ ఏజెంట్‌ కావచ్చు. మీకు నచ్చినంత సమయాన్ని వెచ్చిస్తూ, ఇంటి నుంచే, మీకు నచ్చినప్పుడు పని చేసుకోవచ్చు.

బిజినెస్ మెన్/బిజినెస్ ఉమెన్

మీకు ఇప్పటికే బిజినెస్ ఉండి, దాంతోపాటు ఇంకా ఏదైనా చేయాలనుకుంటే మీరు POSP కావచ్చు. మీకు కావాల్సినప్పుడు పని చేసి అదనంగా సంపాదించుకోవచ్చు.

డిజిట్‌తో POSPగా ఎలా మారవచ్చు?

స్టెప్ 1

పైన ఇచ్చిన POSP ఫామ్‌ను నింపి సైనప్‌ అవ్వండి. మరిన్ని వివరాలతో మా టీం మిమ్మల్ని సంప్రదిస్తుంది. 😊

స్టెప్ 2

మాతో మీ 15 గంటల శిక్షణను పూర్తి చేసుకోండి.

స్టెప్ 3

నిర్దేశిత పరీక్షలను పూర్తి చేయండి.

స్టెప్ 4

మాతో అగ్రిమెంట్‌పై సంతకం చేయండి అంతే! మీరు సర్టిఫైడ్ POSP.

డిజిట్‌తో ఎందుకు పార్ట్‌నర్‌ అవ్వాలి?

డిజిట్‌తో కలిసి నేరుగా పని చేయండి

ఆసియా యొక్క జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ది ఇయర్-2019 తో కలిసి పని చేసే అవకాశం పొందండి.

పూర్తి సహకారం

మీ కోసం మేము 24x7 సపోర్ట్ టీంని కలిగి ఉన్నాము.

పేపర్ లెస్ పాలసీ ఇన్సూరెన్స్

మా అన్ని ప్రాసెస్‌లు ఆన్‌లైన్‌లో జరుగుతాయి. ఎలాంటి పేపర్ వర్క్ ఉండదు.

ఇన్‌స్టంట్‌ పాలసీ జారీ

పేపర్‌ వర్క్‌ వల్ల కలిగే జాప్యం ఉండదు. ఎలాంటి ఇబ్బంది లేకుండా, తక్షణమే ఆన్‌లైన్‌ ద్వారా మేము ఇన్సూరెన్స్ పాలసీలను జారీ చేస్తాం.

క్విక్ కమీషన్ సెటిల్మెంట్

మా అన్ని కమీషన్లు త్వరితగతిన సెటిల్‌ చేయబడుతాయి. పాలసీ జారీ అయిన ప్రతి 15 రోజులకు మీ కమీషన్ మీ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది.

తరచూ అడిగే ప్రశ్నలు

POSP ఏజెంట్ అవడానికి కావాల్సిన అర్హతలు ఏమిటి?

మీరు ఒకవేళ ఇన్సూరెన్స్ ఏజెంట్ అవ్వాలని అనుకుంటే, మీరు 18 సంవత్సరాలు దాటి ఉండాలి. కనీసం 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డ్, పాన్ (PAN) కార్డ్ కలిగి ఉండాలి.

నేను ఏయే డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి?

  • రిజిస్ట్రేషన్ కోసం కింద పేర్కొన్న డాక్యుమెంట్లు సెల్ఫ్ అటెస్టెడ్ (మీరు స్వతహాగా సంతకం చేయాలి) కలిగి ఉండాలి.
  • 10వ తరగతి లేదా ఆ పై తరగతి పాస్ సర్టిఫికేట్

  • మీ పాన్ (PAN) కార్డ్, ఆధార్ కార్డ్ కాపీ (ముందు, వెనుక భాగాలు)

  • ఒక క్యాన్సల్డ్ చెక్ (మీ పేరుతో ఉన్నది)

  • ఒక ఫొటో

పాన్ కార్డ్ కలిగిన వ్యక్తి, బ్యాంక్ అకౌంట్ కలిగిన వ్యక్తి ఒక్కరే అయి ఉండాలా?

మీ కమీషన్లు TDSతో ముడిపడి ఉంటాయి. మీ పాన్ (PAN ) కార్డ్ ఆధారంగా ట్యాక్స్ అధికారులు TDSను క్రెడిట్ చేయడం జరుగుతుంది.

నేను ఇన్సూరెన్స్ అమ్మడం ఎప్పటి నుంచి ప్రారంభించవచ్చు?

మీరు మాతో రిజిస్టర్ అయిన తర్వాత, వెంటనే POSP కోసం శిక్షణ మొదలు పెట్టవచ్చు. పరీక్షకు హాజరై పాస్ అయిన తర్వాత మీరు ఈ-సర్టిఫికెట్ పొందుతారు. అప్పుడు మీరు POSP ఏజెంట్‌గా ఇన్సూరెన్స్ పాలసీలను అమ్మవచ్చు.

POS పర్సన్‌గా సర్టిఫికెట్ పొందడానికి ఖచ్చితంగా శిక్షణ తీసుకోవాల్సిందేనా?

అవును. POSPగా మారడానికి మీరు ఖచ్చితంగా శిక్షణ తీసుకోవాల్సిందే. ఇందులో మీకు బేసిక్ ఇన్సూరెన్స్ గురించి, పాలసీల రకాల గురించి, ఇన్సూరెన్స్ తీసుకునే విధానం, దానిని క్లెయిమ్‌ చేసుకునే విధానం, నియమాలు, నిబంధనలు మొదలైనవి ఉంటాయి.

డిజిట్‌తో నేను పార్ట్‌నర్‌గా పనిచేస్తే, నాకు ఏ రకమైన సర్వీసులు అందుతాయి?

డిజిట్‌ పార్ట్‎నర్లు అందరికీ ఒక రిలేషన్‌షిప్‌ మేనేజర్ కేటాయించబడతారు. వారు ఏజెంట్లకు మార్గదర్శనం చేయడంతో పాటు డిజిట్‌ ప్లాట్‌ఫాంపై విక్రయించిన పాలసీలకు సంబంధించి ఏజెంట్ల ప్రశ్నలకు సమాధానం ఇస్తారు. ఏజెంట్లు partner@godigit.com పై మా సపోర్ట్ టీమ్‌ను ఈ-మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు

కార్పొరేట్ మరియు వ్యక్తిగత ఏజెంట్ల జాబితా కోసం, ఇక్కడ క్లిక్ చేయండి.