డిజిట్ ఇన్సూరెన్స్ చేయండి
5 కోట్ల+ కస్టమర్లు విశ్వసిస్తున్నారు

లమ్ సమ్ కాలిక్యులేటర్

మొత్తం లమ్ సమ్ పెట్టుబడి

500 మరియు 1 కోటి మధ్య విలువను నమోదు చేయండి
500 1 కోటి

కాలం (సంవత్సరాలు)

1 మరియు 30 మధ్య విలువను నమోదు చేయండి
1 30

మొత్తం లమ్ సమ్ పెట్టుబడి

1 మరియు 30 మధ్య విలువను నమోదు చేయండి
%
1 30
పెట్టుబడి పెట్టిన మొత్తం
16,00,000
వడ్డీ రేటు
₹ 9,57,568
మొత్తం విలువ
₹25,57,568

లమ్ సమ్ పెట్టుబడి ప్లాన్ కాలిక్యులేటర్ ఆన్‌లైన్

మొదటి సారి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు వివిధ పథకాలు మరియు పెట్టుబడి రీతులను ఎంచుకోవడంపై సందేహం వ్యక్తం చేయడం సహజం.

మీరు వారిలో ఒకరు అయి, లమ్ సమ్ పెట్టుబడిని పరిగణనలోకి తీసుకుంటుంటే, లమ్ సమ్ క్యాలిక్యులేటర్ బాగా సహాయపడుతుంది. ఇది మీ పెట్టుబడి ప్రణాళికపై మీకు స్పష్టమైన దృక్పథాన్ని అందిస్తుంది మరియు సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణకు సాయం చేస్తుంది.

ఎలా అని మీరు అడిగితే?

దీన్ని అర్థం చేసుకోవడానికి మీరు ఈ ఆన్‌లైన్ సాధనం యొక్క వివరం పై మా వివరణాత్మక గైడ్ ను చదవాలి.

ప్రారంభిద్దాం!

లమ్ సమ్ క్యాలిక్యులేటర్ అంటే ఏమిటి?

లమ్ సమ్ పెట్టుబడి కాలిక్యులేటర్ అనేది వ్యక్తులు తమ లమ్ సమ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ మెచ్యూరిటీ విలువ గురించి ఒక ఆలోచనను పొందడానికి సహాయపడే ఆన్‌లైన్ సాధనం.

మ్యూచువల్ ఫండ్స్ ద్వారా సంపదను కేటాయించే 2 మార్గాలలో లమ్ సమ్ పెట్టుబడి ఒకటి. ఈ ప్రక్రియలో, వ్యక్తులు మొత్తం మొత్తాన్ని ఒక నిర్దిష్ట కాలానికి ఒకేసారి పెట్టుబడి పెడతారు. ఈ పెట్టుబడి పద్ధతిలో రాబడిని ప్రభావితం చేసే వేరియబుల్ కారకాలు తక్కువ ఉంటాయి. అదనంగా, ఎక్కువ కాలం పాటు అధిక రాబడిని కోరుకునే వ్యక్తులు ఈ మార్గాన్ని ఎక్కువగా ఇష్టపడతారు.

లమ్ సమ్ రిటర్న్ కాలిక్యులేటర్ వంటి ఆన్‌లైన్ సాధనం వ్యక్తులు తమ పెట్టుబడికి పొందగలిగే మొత్తం రాబడిని అంచనా వేయడం సులభం చేస్తుంది.

అటువంటి ఖచ్చితమైన ఫలితాలను అందించడానికి ఈ ఆన్‌లైన్ సాధనం ఎలా పని చేస్తుందో అని మీరు ఆలోచిస్తున్నట్లయితే, మేము మీకు వివరిస్తాము!

లమ్ సమ్ క్యాలిక్యులేటర్ ఎలా పని చేస్తుంది?

ఒక లమ్ సమ్ క్యాలిక్యులేటర్ ఒక వ్యక్తి యొక్క పెట్టుబడి వివరాల ఆధారంగా అవుట్‌పుట్‌లను ఉత్పత్తి చేస్తుంది మరియు పెట్టుబడి మొత్తం, వ్యవధి మరియు ఆశించిన రాబడి రేటును కలిగి ఉంటుంది. ఈ ఆన్‌లైన్ సాధనం వినియోగదారులను ఈ విలువలను నమోదు చేయడానికి నిర్దిష్ట ఫీల్డ్‌లను అందిస్తుంది.

ఆ తర్వాత, ఈ సాధనం ఫలితాలను అందించడానికి లమ్ సమ్ క్యాలిక్యులేటర్ ఫార్ములాలో ఈ విలువలను భర్తీ చేస్తుంది. ఈ ఫార్ములాను ఈ క్రింది విధంగా సూచించవచ్చు:

A = P x {1+ (i/n)}nt

ఇందులో,

A = మెచ్యూరిటీ తర్వాత తుది విలువ

P = పెట్టుబడి మొత్తం

i = ఆశించిన రాబడి రేటు

n = సంవత్సరానికి చక్రవడ్డీ ల సంఖ్య

t = మొత్తం పెట్టుబడి కాలం

 

ఈ లమ్ సమ్ లెక్కింపు సూత్రాన్ని ఉపయోగించిన తర్వాత, ఆన్‌లైన్ సాధనం అంచనా వేసిన భవిష్యత్తు విలువ మరియు సంపద లాభం యొక్క ఫలితాలను ప్రదర్శిస్తుంది.

ఉదాహరణకు, మీరు సంవత్సరానికి కలిపి 12% రాబడి రేటుతో 10 సంవత్సరాల పాటు ₹12 లక్షలు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు అనుకోండి. అలాంటప్పుడు, మీరు మొత్తం ₹37,27,018 సుమారుగా సంపాదిస్తారు. కాబట్టి, మీ సంభావ్య సంపద లాభం ₹25,27,018 అవుతుంది.

ఇప్పుడు, లమ్ సమ్ క్యాలిక్యులేటర్ ద్వారా అంచనా వేయబడిన ఈ మొత్తాన్ని సుమారు గా ఎందుకు పిలుస్తారు అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే అటువంటి ఆన్‌లైన్ సాధనం ఎగ్జిట్ లోడ్ మరియు ఎక్సపెన్స్ రేషియో వంటి అంశాలను పరిగణించదు.

మీ చివరి నికర రాబడి ఈ కారకాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అందుకే మీ అసలు తుది విలువ ఈ కాలిక్యులేటర్ ఫలితానికి సరిగ్గా పోలి ఉండకపోవచ్చు.

ఈ ఆన్‌లైన్ సాధనం ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మీకు తెలుసు కాబట్టి మీరు దీన్ని ఎలా ఉపయోగించాలో కూడా అర్థం చేసుకోవాలి.

లమ్ సమ్ క్యాలిక్యులేటర్ను ఎలా ఉపయోగించాలి?

ఈ ఆన్‌లైన్ కాలిక్యులేటర్‌ని ఉపయోగించి మీరు కోరుకున్న ఫలితాలను ఎలా పొందాలనే దానిపై దశల వారీ గైడ్ ఇక్కడ ఉంది.

  • స్టెప్ 1: మీరు ఎంచుకున్న ఫండ్ మేనేజ్‌మెంట్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. లమ్ సమ్ క్యాలిక్యులేటర్ ఎంపికకు నావిగేట్ చేయండి.
  • స్టెప్ 2: మీకు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తాన్ని టైప్ చేయండి.
  • స్టెప్ 3: మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తం వ్యవధిని నమోదు చేయండి.
  • స్టెప్ 4: మీరు ఆశించిన రాబడి రేటును ఎంచుకోండి.
  • స్టెప్ 5: "లెక్కించు" బటన్‌ను నొక్కండి.

పై విధానాన్ని పూర్తి చేసిన తర్వాత, కాలిక్యులేటర్ కింది వాటి కోసం మీకు ఫలితాలను చూపుతుంది.

  • పెట్టుబడి పెట్టబడిన మొత్తం
  • తుది రాబడి విలువ
  • మొత్తం సంపద లాభం

ఈ ఫలితాలు పెట్టుబడిదారులకు వారి ఆర్థిక నిర్ణయం తీసుకోవడంలో అనేక రకాలుగా ఉపయోగపడతాయి.

లమ్ సమ్ క్యాలిక్యులేటర్ యొక్క ఉపయోగాలు ఏమిటి?

లమ్ సమ్ క్యాలిక్యులేటర్ మీరు అందించిన వివరాలను ఉపయోగించి పెట్టుబడి ఫలితాలను లెక్కించి అంచనా ఫలితాలను అందజేస్తుంది. మీ సంభావ్య రాబడి గురించి ఒక ఆలోచన కలిగి ఉండటం వలన మీ పెట్టుబడిని మీ ఆర్థిక లక్ష్యాలతో ఒకే దారిలో పెట్టడంలో మీకు సహాయపడుతుంది. మీకు అత్యంత అనుకూలమైన ఫలితాలను పొందడానికి మీరు మీ పెట్టుబడి పరిస్థితులను కూడా సర్దుబాటు చేయవచ్చు.

ఈ విధంగా, వ్యక్తులు మార్కెట్ పరిస్థితులు మరియు వ్యూహాలపై విస్తృత అవగాహన లేకపోయినా మెరుగైన ఆర్థిక అవగాహనను పెంపొందించుకోవడానికి లమ్ సమ్ రిటర్న్స్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు. ఇది పెట్టుబడిదారులకు మెరుగైన ఆర్థిక నిర్వహణలో సహాయపడుతుంది.

అదనంగా, లమ్ సమ్ క్యాలిక్యులేటర్ యొక్క అనేక ఇతర లాభాలు ఉన్నాయి.

లమ్ సమ్ క్యాలిక్యులేటర్ యొక్క ప్రయోజనాలు ఏమిటి?

లమ్ సమ్ క్యాలిక్యులేటర్ నుండి పెట్టుబడిదారులు ప్రయోజనం పొందగల కొన్ని మార్గాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఒకసారి చూడండి.

  • వేగవంతమైన మరియు సరైన ఫలితాలు: లమ్ సమ్ క్యాలిక్యులేటర్ యొక్క ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి దాని వేగం మరియు ఖచ్చితత్వం. మీరు మాన్యువల్ గణనలను నిర్వహించడానికి ఇచ్చిన సూత్రాన్ని ఉపయోగించగలిగినప్పటికీ, ఇది సమయం తీసుకుంటుంది. అదే సమయంలో, తప్పులు జరిగే ప్రమాదం ఎప్పుడు ఉంటుంది. ఆన్‌లైన్ కాలిక్యులేటర్‌తో, మీరు సెకన్లలో ఖచ్చితమైన ఫలితాలను పొందవచ్చు.
  • యూసర్-ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్: మనం గతంలో చర్చించినట్లుగా కొన్ని సాధారణ వివరాలను మాత్రమే నమోదు చేయాలి. ఆన్‌లైన్ సాధనం మిగిలిన పనిని చేస్తుంది. దీనివల్ల ఇది వాడటం చాలా సులభతరం అవుతుంది.
  • లభ్యత: ఈ ఆన్‌లైన్ సాధనం దాదాపు ప్రతి AMC యొక్క వెబ్‌సైట్‌లలో మరియు ఇతర ఆర్థిక వెబ్‌సైట్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది.
  • ఖర్చు-లేదు: ఈ కాలిక్యులేటర్‌లను ఉపయోగించడానికి వెబ్‌సైట్‌లు ఎటువంటి రుసుమును వసూలు చేయవు. అందువల్ల, మీ సౌలభ్యం మేరకు ఈ సాధనాన్ని ఉపయోగించడానికి మీరు ఈ పోర్టల్‌లలో ఒకదానిని సులభంగా సందర్శించవచ్చు.

అవసరమైన ఫలితాలను తనిఖీ చేయడానికి మీరు ఈ ఆన్‌లైన్ కాలిక్యులేటర్‌ను ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగించవచ్చు. అదనంగా, మీరు వివిధ ఫండ్ స్కీమ్‌ల ఫలితాలను తక్షణమే సరిపోల్చడానికి మరియు అత్యంత అనుకూలమైనదాన్ని ఎంచుకోవడానికి ఈ సాధనాన్ని ఉపయోగించవచ్చు.

పథకం రకం కాకుండా పరిగణించవలసిన ముఖ్యమైన విషయం పెట్టుబడి విధానం. గతంలో చర్చించిన ప్రకారం, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే 2 మార్గాలలో లమ్ సమ్ ఒకటి. ఇతర మార్గం సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. మీరు రెండింటి మధ్య గందరగోళంగా ఉన్నట్లయితే, మీరు పెట్టుబడి రాబడిని సరిపోల్చడానికి SIP కాలిక్యులేటర్‌ని ఉపయోగించవచ్చు.

లమ్ సమ్ మరియు SIP కాలిక్యులేటర్‌ల మధ్య తేడా ఏమిటి?

లమ్ సమ్ మరియు SIP రెండూ పెట్టుబడి పెట్టే మార్గాలు. ఈ రెండిటిలో వాటి ప్రత్యేక లాభాలు మరియు నష్టాలూ ఉన్నాయి. మీరు ఇప్పటికే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ అయితే, ఈ రెండింటి మధ్య తేడా మీకు ఇప్పటికే తెలిసి ఉండవచ్చు. కాకపోతే, లమ్ సమ్ కాలిక్యులేటర్ మరియు SIP కాలిక్యులేటర్ మధ్య ప్రాథమిక లెక్కింపు లో వ్యత్యాసం ఉంది.

మునుపటిది ఒక సారి పెట్టే పెట్టుబడి ఆధారంగా పెట్టుబడి వ్యవధి ముగింపులో మొత్తం మెచ్యూరిటీ మొత్తాన్ని గణిస్తుంది. ఒకసారి పెట్టుబడి పై రాబడి రేట్ ప్రతి సంవత్సరం సమయానుగుణంగా కాంపౌండ్ చెయ్యబడుతుంది. లమ్ సమ్ ద్వారా పెట్టుబడి పెట్టడం వలన పెట్టుబడిదారులకు సమయం మరియు శ్రమ కూడా ఆదా అవుతుంది, ఎందుకంటే వారు నిరంతరం పెట్టుబడులలో నిమగ్నమవ్వాల్సిన అవసరం లేదు.

ఒక SIP కాలిక్యులేటర్, మరోవైపు, మీరు పెట్టుబడి పెట్టిన కాలానికి మాత్రమే ఆశించిన రాబడిని గణిస్తుంది. ఇక్కడ వ్యవధి (నెలవారీ, త్రైమాసిక, మొదలైనవి) పెట్టుబడి మొత్తం పరిగణించబడుతుంది మరియు ప్రతి సైకిల్ లో తదనుగుణంగా రాబడి రేటు వర్తించబడుతుంది.

మీరు ఆన్‌లైన్ SIP కాలిక్యులేటర్‌ల గురించి వివరంగా తెలుసుకోవాలనుకుంటే, దాని గురించి మా దగ్గర ప్రత్యేక వ్యాసం ఉంది. మీరు దాన్ని చదవ వచ్చు.

అయితే, మీరు లమ్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్‌ని ఎంచుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్లయితే, మీ భవిష్యత్తు ఆదాయాలను ముందుగానే అంచనా వేయడానికి లమ్ సమ్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించడం మర్చిపోవద్దు.

తరచుగా అడుగు ప్రశ్నలు

లమ్ సమ్ కాలిక్యులేటర్ ఏ రకమైన రాబడిని ప్రదర్శిస్తుంది?

ఒక లమ్ సమ్ కాలిక్యులేటర్ మీ పెట్టుబడిపై మొత్తం రాబడిని అంచనా వేస్తుంది.

లమ్ సమ్ కాలిక్యులేటర్లో నేను నమోదు చేయగల కనీస పెట్టుబడి మొత్తం ఎంత?

కనీస లమ్ సమ్ పెట్టుబడి మొత్తం అన్నది మ్యూచువల్ ఫండ్ కంపెనీ ని బట్టి మారుతూ ఉంటుంది. అయితే, అనేక AMCలు ₹1000 కంటే తక్కువ పెట్టుబడులను అనుమతిస్తాయి.

 

లమ్ సమ్ కాలిక్యులేటర్‌లో వర్తించే సగటు రాబడి రేటు ఎంత?

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు వర్తించే సగటు రాబడి రేటు మార్కెట్ ట్రెండ్‌లపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అవి స్కీమ్ నుండి స్కీమ్‌కు కూడా భిన్నంగా ఉంటాయి. వ్యక్తులు తమ అత్యంత అనుకూలమైన ఎంపికను ఎంచుకునే ముందు అనేక ఫండ్ పథకాలను సరిపోల్చడమే కాకుండా మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి.