కిసాన్ వికాస్ పత్ర కాలిక్యులేటర్

పెట్టుబడి పెట్టిన మొత్తం సొమ్ము

రూ. 1000- 50 లక్షల మధ్య విలువను ఎంటర్ చేయండి
1000 50 లక్షలు
కెవీపీ వార్షిక వడ్డీ రేటు
7.2 %
వ్యవధి
10 సంవత్సరాలు
పెట్టుబడి పెట్టిన సొమ్ము విలువ
17,761
మెచ్యూరిటీ అమౌంట్ (మొత్తం)
₹ 9,57,568

కిసాన్ వికాస్ పత్ర కాలిక్యులేటర్

కెవీపీ మెచ్యూరిటీ కాలిక్యులేటర్ ఎలా పని చేస్తుంది?

 

కేవీపీ కాలిక్యులేటర్ మొదట పెట్టుబడి పెట్టిన మొత్తం అమౌంట్ యొక్క సమ్మేళనం (కాంపౌండింగ్) మీద పని చేస్తుంది. ఇక్కడ మనం పొందిన లాభాలను గణించేందుకు ఉపయోగించే ఫార్ములా చక్రవడ్డీ సూత్రంలాగా ఉంటుంది.

A = P (1 + r/n) ^ (nt)

ఇక్కడ,

 

పారామీటర్స్ (పారామితులు)

వివరణ

A

మెచ్యూరిటీ మొత్తం

P

ప్రిన్సిపల్ లేదా మొదట పెట్టిన మొత్తం

r

వడ్డీ రేటు

t

పెట్టుబడి పెట్టిన కాలం

n

వడ్డీ అనేది కాల వ్యవధితో సమానంగా చక్రవడ్డీగా మారుతుంది

కేవీపీ కాలిక్యులేటర్ లో వర్తించే వివిధ గణన కొలమానాలను పరిశోధించే ముందు ఈ కింది ఉదాహరణలను ఒకసారి పరిగణించండి. ఈ విభాగంలో తర్వాత పేర్కొన్న కొలమానాలను మీరు సులభంగా అర్థం చేసుకునేందుకు ఇది సహాయపడుతుంది.

 

ఉదాహరణ: A అనే వ్యక్తి రూ. 1 లక్ష 18 ఆగస్టు 2021న కేవీపీలో పెట్టుబడి పెట్టాడని అనుకుందాం.

 

కేవీపీ కాలిక్యులేటర్ ను ఉపయోగించే వ్యక్తి ఈ కింది గణన కొలమానాలకు సంబంధించిన విలువలను ఇన్‌పుట్ చేయాల్సి ఉంటుంది:

లెక్కించే కొలమానాలు

వివరాలు

పెట్టుబడి పెట్టిన సొమ్ము

పెట్టుబడి మొత్తం అనేది ఒక వ్యక్తి ఈ పథకంలో పెట్టుబడి పెట్టే మొత్తాన్ని సూచిస్తుంది. పైన పేర్కొన్న ఉదాహరణ ప్రకారం పెట్టుబడి మొత్తం అనేది రూ. 1 లక్ష అవుతుంది

పెట్టుబడి పెట్టిన తేదీ

పెట్టుబడి తేదీని ఒక వ్యక్తి కేవీపీ పథకంలో పెట్టుబడి పెట్టిన తేదీగా నిర్దారించవచ్చు. పైన పేర్కొన్న ఉదాహరణ ద్వారా, ఇక్కడ పెట్టుబడి తేదీ అనేది 18/08/2021.

 

కేవీపీ కాలిక్యులేటర్ లో పేర్కొన్న డేటాను ఎంటర్ చేసిన తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ అనేది లెక్కించబడుతుంది. ఆ తర్వాత వినియోగదారునికి మెచ్యూరిటీ మొత్తం, మెచ్యూరిటీ తేదీ మరియు వడ్డీ గురించిన వివరాలు అందించబడతాయి.

కేవీపీ విషయంలో వడ్డీ ఏటా కలిపే ఉంటుందని గమనించండి. ప్రస్తుతం ఆఫర్‌పై చెల్లిస్తున్న వడ్డీ రేటు 6.9 శాతం కేవీపీకి నిర్ణీత కాలవ్యవధి లేదు. ప్రస్తుత వడ్డీ రేటుతో మెచ్యూరిటీ తేదీ అనేది 124 నెలలుగా ఉంటుంది.

 

ఈ అంశాలు మన పరిధిలో లేవు. (మనకు అర్థం కావు) కావున కేవీపీ వడ్డీ ని ఎలా లెక్కింపు చేస్తారో ఇప్పుడు చూద్దాం.

కేవీపీ పథకం కోసం వడ్డీ రేటు పట్టిక

ఆర్థిక మంత్రిత్వ శాఖ అందించే అప్డేట్ల ప్రకారం ఈ పథకం వడ్డీ రేట్లు కాలానుగుణంగా మారుతాయి. ఈ పథకానికి ప్రస్తుతం వర్తించే వడ్డీ రేటు సంవత్సరానికి 6.9 శాతం, ఈ వడ్డీ రేటు 124 నెలల కాలంలో ఒకరి పెట్టుబడిని రెట్టింపు చేస్తుంది.

 

దిగువ పట్టిక కాల వ్యవధిలో ఈ పథకానికి వర్తించే వడ్డీ రేట్లలో వచ్చే హెచ్చుతగ్గులను సూచిస్తుంది:

కాల వ్యవధి

వడ్డీ రేటు

2020-2021వ ఆర్థిక సంవత్సరం Q1

6.9శాతం

2019-2020 ఆర్థిక సంవత్సరం Q4

7.6 శాతం

2019-2020 ఆర్థిక సంవత్సరం Q2

7.6 శాతం

2019-2020 ఆర్థిక సంవత్సరం Q1

7.7 శాతం

2018-2019 ఆర్థిక సంవత్సరం Q4

7.7 శాతం

2018-2019 ఆర్థిక సంవత్సరం Q3

7.7 శాతం

2018-2019 ఆర్థిక సంవత్సరం Q2

7.3 శాతం

2018-2019 ఆర్థిక సంవత్సరం Q1

7.3 శాతం

ప్రస్తుత వడ్డీ రేటు 6.9 శాతం, వడ్డీని లెక్కించే కేవీపీ కాలిక్యులేటర్ 2020-2021 ఆర్థిక సంవత్సరం Q1లో ఆర్జించిన వడ్డీ కోసం ఈ రేటును పరిగణలోకి తీసుకుంటుంది.

 

కేవీపీ కాలిక్యులేటర్ మరియు దాని వివిధ అంశాల గురించి మీరు ఇప్పటికే ప్రాథమిక అవగాహనను పొంది ఉండాలి. కావున మీరు ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లయితే నిశ్చింతగా ముందుకు సాగండి. మరింత ప్రయోజనం కోసం ఈ సాధనాన్ని ఉపయోగించుకోండి.

తరచుగా అడిగే ప్రశ్నలు