డిజిట్ ఇన్సూరెన్స్ చేయండి

విదేశాలలో మీ పాస్‌ పోర్ట్‌ పోతే ఏమి చేయాలి?

వ్యాపారం లేదా కుటుంబంతో సెలవులు గడిపేందుకు విదేశాలకు వెళ్ళినప్పుడు పాస్‌ పోర్ట్ కోల్పోవడం నిస్సందేహంగా చాలా ఇబ్బందికి గురిచేస్తుంది.

కాబట్టి, మీరు విదేశాల్లో మీ పాస్‌పోర్ట్‌ను పోగొట్టుకున్నట్లయితే, మీ దేశానికి సురక్షితంగా తిరిగి రావడానికి పరిష్కార మార్గాలను తెలుసుకోవడానికి ఈ కథనాన్ని చదవండి.

పాస్ పోర్ట్ పోయిన తర్వాత ఏమి చేయాలి?

మీరు విదేశీ ప్రయాణాలలో ఉండగా మీరు మీ పాస్ పోర్ట్ పోతే ఈ క్రింది ఐదు విధానాలను అనుసరించవచ్చు:

1. మీ సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి

పాస్ పోర్ట్ దొంగిలించబడిన లేదా పోయిన విషయాన్ని సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో తప్పక ఫిర్యాదు చేయాలి. పోగొట్టుకున్న పాస్ పోర్ట్ కు డాక్యుమెంటరీ రుజువుగా పని చేస్తుంది కాబట్టి పోలీసు రిపోర్ట్ కాపీ తీసుకోండి. ఎమర్జెన్సీ సర్టిఫికెట్ కోసం గానీ కొత్త పాస్ పోర్ట్ కోసం గానీ దరఖాస్తు చేసేటప్పుడు ఇది చాలా ముఖ్యమైన పత్రం అవుతుంది.

2. మీ దేశ ఎంబసీతో కాంటాక్ట్ లో ఉండండి

మీ పాస్ పోర్ట్ పోయినట్లు రిపోర్ట్ చేయడానికి మీ దేశ ఎంబసీని సంప్రదించండి. విదేశాలలో ఉన్న ఎంబసీలు పౌరుల జాతీయతను ధృవీకరించిన తర్వాత దేశానికి తిరిగి రావడానికి అవసరమైన ఎమర్జెన్సీ సర్టిఫికెట్ జారీ చేయడం ద్వారా సహాయం చేస్తాయి.

3. మళ్ళీ వీసా జారీ చేయమని దరఖాస్తు చేసుకోండి

ఒకవేళ మీ పాస్‌పోర్ట్‌ పోయినట్లయితే, మీరు కోల్పోయిన వీసాల కోసం కూడా దరఖాస్తు చేసుకోవాలి. మీ దేశ రాయబార కార్యాలయాన్ని సందర్శించి, కొత్తది పొందడం కోసం పాత వీసా యొక్క ఫోటోకాపీని, పోలీసు రిపోర్ట్ వంటి సంబంధిత పత్రాలను సమర్పించండి.

4. విమాన టికెట్లు రీషెడ్యూల్ చేసుకోండి

మీ పాస్‌పోర్ట్‌ పోయినట్లయితే మీ దేశానికి తిరిగి రావడం సాధ్యం కాదు. కొత్త పాస్‌ పోర్ట్‌  లేదా ఎమర్జెన్సీ సర్టిఫికెట్ కోసం మీరు చేసిన అప్లికేషన్ రిక్వెస్టును ప్రాసెస్ చేయడానికి సమయం పడుతుంది. అందువల్ల, మీ పరిస్థితి గురించి ఎయిర్‌లైన్‌కు తెలియజేసి, దానికి తగినట్లుగా దాన్ని రీషెడ్యూల్ చేసుకోవడం మంచిది. మీరు త్వరగా ఎయిర్‌లైన్స్‌ను సంప్రదిస్తే, దాన్ని రీషెడ్యూల్ చేసుకోవడానికి డబ్బు ఖర్చు తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి.

5. కొత్త పాస్‌ పోర్ట్‌ /ఎమర్జెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోండి

మీ నివాస దేశంలోని ఎంబసీని సంప్రదించిన తర్వాత, మీ అవసరానికి తగ్గట్టుగా కొత్త పాస్‌ పోర్ట్‌  లేదా ఎమర్జెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోండి. కొత్త పాస్ పోర్ట్ అవసరం అయినట్లయితే, మీరు కొత్త పాస్‌ పోర్ట్‌  పొందేందుకు ఒక వారం పాటు వేచి ఉండాలి. అయితే, మీరు ఒక వారం పాటు వేచి ఉండలేకపోతే, లేదా తీవ్రమైన అనారోగ్యం లేదా కుటుంబ సభ్యుల మరణం వంటి అత్యవసర పరిస్థితుల కోసం వెంటనే దేశానికి తిరిగి రావాలంటే, ఎమర్జెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోండి (ఇది తరువాత చర్చించబడుతుంది).

మీ పాస్‌ పోర్ట్‌  పోయినప్పుడు ఏమి చేయాలో మీరు తెలుసుకున్న తరువాత, కొత్త పాస్‌ పోర్ట్‌  మరియు ఎమర్జెన్సీ సర్టిఫికెట్ కోసం ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోవడానికి చదవండి.

ఆన్‌లైన్‌లో కొత్త పాస్‌ పోర్ట్‌ రీ-ఇష్యూకోసం ఎలా దరఖాస్తు చేయాలి?

మీరు పాస్‌ పోర్ట్‌  పోగొట్టుకున్న సందర్భంలో నకిలీ పాస్‌పోర్ట్‌లు జారీ చేయబడవు. కాబట్టి, ఈ క్రింది సాధారణ స్టెప్స్ అనుసరించడం ద్వారా కొత్త పాస్‌పోర్ట్‌ను తిరిగి చేసేందుకు దరఖాస్తు చేసుకోండి:

  • స్టెప్ 1: పాస్‌ పోర్ట్‌  సేవా కేంద్రం అధికారిక పోర్టల్‌ ని సందర్శించండి. పాస్‌ పోర్ట్‌  ఆఫీసు, మీ పేరు, పుట్టిన తేదీ మొదలైన సంబంధిత వివరాలను నమోదు చేయడం ద్వారా పాస్‌ పోర్ట్‌  సేవ యొక్క ఆన్‌లైన్ పోర్టల్‌లో మిమ్మల్ని మీరు నమోదు చేసుకోండి. మీరు ఇప్పటికే సభ్యులైతే, మీ లాగిన్ IDతో సైన్ ఇన్ చేయడానికి "ఎగ్జిస్టింగ్ యూజర్ లాగిన్"పై క్లిక్ చేయండి.•

  • స్టెప్ 2: "తాజా పాస్‌ పోర్ట్‌ /పాస్‌ పోర్ట్‌  రీ-ఇష్యూ కోసం అప్లై చేయండి" ని ఎంచుకొని పేరు, కాంటాక్ట్ డీటెయిల్స్ మొదలైన సంబంధిత వివరాలను పూరించి సమర్పించండి.

  • స్టెప్ 3: మీ సమీపంలోని పాస్‌ పోర్ట్‌  ఆఫీసులో అపాయింట్‌మెంట్ స్లాట్‌ను బుక్ చేసుకోవడానికి "సేవ్ చేసిన/సమర్పించబడిన అప్లికేషన్‌లను వీక్షించండి" అనే ఆప్షన్ క్రింద అందుబాటులో ఉన్న "చెల్లింపు మరియు అపాయింట్‌మెంట్ షెడ్యూల్" లింక్‌ను ఎంచుకోండి.

  • స్టెప్ 4: కింది పేమెంట్ పద్ధతులను ఉపయోగించి ఆన్‌లైన్లో డబ్బు చెల్లించి ముందుకు వెళ్ళండి – 

    • ఇంటర్నెట్ బ్యాంకింగ్ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అనుబంధ బ్యాంకులు లేదా ఏవైనా ఇతర బ్యాంకులు)

    • డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు (మాస్టర్ కార్డ్ లేదా వీసా)

    • SBI బ్యాంక్ చలాన్

గమనిక: మీ సమీపంలోని పాస్‌ పోర్ట్‌  సేవా కేంద్రం లేదా పాస్‌ పోర్ట్‌  ఆఫీస్ లేదా పోస్ట్ ఆఫీస్ పాస్‌ పోర్ట్‌  సేవా కేంద్రంలో అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేయడానికి ఆన్‌లైన్ చెల్లింపులు తప్పనిసరి.

  • స్టెప్ 5: అప్లికేషన్ రసీదుని ప్రింట్ చేయడానికి "ప్రింట్ అప్లికేషన్ రిసీట్" లింక్‌ని ఎంచుకోండి. ఈ విధంగా పాస్‌ పోర్ట్‌  పోయిన తర్వాత చేసే అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేయండి. 

ఈ రసీదులో అప్లికేషన్ రిఫరెన్స్ సంఖ్య ఉంటుంది. పాస్‌ పోర్ట్‌  కార్యాలయాన్ని సందర్శించేటప్పుడు ఈ రసీదును తీసుకెళ్లడం తప్పనిసరి కాదు. అపాయింట్‌మెంట్ వివరాలు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు SMS ద్వారా పంపబడతాయి. షెడ్యూల్ చేసిన తేదీలో అపాయింట్‌మెంట్ కు రుజువుగా చూపించడానికి ఇది సరిపోతుంది.

కొత్త పాస్‌పోర్ట్‌ను తిరిగి పొందడం కోసం ఆఫ్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి?

ఆఫ్‌లైన్‌లో కొత్త పాస్‌ పోర్ట్‌  కోసం దరఖాస్తు చేయడానికి, పాస్‌ పోర్ట్‌  ఆఫ్‌లైన్‌లో తిరిగి జారీ చేయమని దరఖాస్తు చేయడానికి ఇ-ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి, అధికారిక వెబ్‌సైట్‌లో "డౌన్‌లోడ్ ఇ-ఫారమ్ ట్యాబ్" క్రింద అందుబాటులో ఉంటుంది. "కొత్త పాస్‌ పోర్ట్‌  లేదా పాస్‌ పోర్ట్‌  రీ-ఇష్యూ" క్రింద ఉన్న లింక్‌పై క్లిక్ చేసి, అప్లికేషన్ టైప్, అప్లికెంట్ పేరు, పుట్టిన తేదీ మొదలైన సంబంధిత వివరాలతో ఆఫ్‌లైన్‌లో పూరించండి. ఈ ఫారమ్‌ను సరిగ్గా పూరించి, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయండి. పాస్‌ పోర్ట్‌  సేవా కేంద్రం గానీ ప్రాంతీయ పాస్‌ పోర్ట్‌  ఆఫీసు గానీ ఈ ఫారమ్ యొక్క ముద్రించిన కాపీని అంగీకరించవు.

కొత్త పాస్‌పోర్ట్‌ను రీ ఇష్యూ చేయడానికి ఏ పత్రాలు అవసరమవుతాయి?

అప్లికేషన్ రకం, అప్లికెంట్ కేటగిరీ, వృత్తి, ఇతర ప్రమాణాల ఆధారంగా, మీ పాస్‌పోర్ట్‌ పోయి ఉంటే తిరిగి పొందడానికి కోసం క్రింది పత్రాన్ని సమర్పించండి:

  • బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్ మొదలైన పుట్టిన తేదీ ఋజువు.

  • అనుబంధం F ప్రకారం పాస్‌ పోర్ట్‌  ఎలా పోగొట్టుకున్నారో తెలిపే అఫిడవిట్

  • ఒరిజినల్ పోలీసు రిపోర్ట్

  • వాటర్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, ఆధార్ కార్డ్ మొదలైన యుటిలిటీ బిల్లుల వంటి ప్రస్తుత నివాస చిరునామాకు సంబంధించిన డాక్యుమెంట్ ఋజువు.

  • పాత పాస్‌ పోర్ట్‌  యొక్క Non-ECR/ECR పేజీతో సహా మొదటి, చివరి రెండు పేజీలపై సంతకం చేసిన కాపీ

  • అనుబంధం G ప్రకారం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేదా అనుబంధం H ప్రకారం ముందస్తు సమాచార లేఖ

  • బర్త్ సర్టిఫికెట్, ఉన్నత విద్య పాస్ సర్టిఫికెట్ మొదలైన నాన్ ECR వర్గానికి చెందిన దరఖాస్తుదారుల కోసం డాక్యుమెంటరీప్రూఫ్.

  • పెన్షన్ పేమెంట్ ఆర్డర్

  • మైనర్ అప్లికెంట్స్ విషయంలో, తల్లిదండ్రులు వారి అసలు పాస్‌పోర్ట్‌ మరియు సంతకం చేసిన ఫోటోకాపీలను PSKకి తీసుకురావచ్చు. అప్లికెంట్ మైనర్ అయితే పత్రాలపై తల్లిదండ్రులు సంతకం చేయవచ్చు. అంతేకాకుండా, వారు తమ పేరు మీద అడ్రస్ ప్రూఫ్ కూడా సమర్పించవచ్చు.

  • అప్లికెంట్ యొక్క రెండు రీసెంట్ పాస్‌ పోర్ట్‌  సైజు ఫోటోగ్రాఫ్‌లు

గమనిక: దరఖాస్తుదారులు PSKలో పైన పేర్కొన్న అసలు పత్రాలను మరియు వాటి సంతకం చేసిన ఫోటోకాపీలను తప్పనిసరిగా సమర్పించాలి. అలాగే, పైన పేర్కొన్న పత్రాలు కేవలం సూచికలు మాత్రమే. ఏవైనా అదనపు పత్రాలను సమర్పించాలో, లేదో తెలుసుకోవడానికి పాస్‌ పోర్ట్‌  ఆఫీస్ పేజీ కింద అందుబాటులో ఉన్న అధికార పరిధిలోని పాస్‌ పోర్ట్‌  ఆఫీసు వారి హోమ్ పేజీ ని చూడండి.

ఇంతకు ముందు చెప్పినట్లుగా, కొత్త సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేయడానికి కొంత సమయం పట్టవచ్చు. ఎక్కువ కాలం విదేశంలో ఉండడం వల్ల ఇబ్బందులు పెరుగుతాయి. అటువంటి సందర్భాలలో, మీరు ఎమర్జెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కింది విభాగం ఎమర్జెన్సీ సర్టిఫికెట్ మరియు దాని దరఖాస్తు ప్రక్రియ యొక్క నియమాలను చర్చిస్తుంది. చదవండి!

ఎమర్జెన్సీ సర్టిఫికెట్ అంటే ఏమిటి?

ఎమర్జెన్సీ సర్టిఫికెట్ అనేది మీ పాస్‌ పోర్ట్‌  పోయినట్లయితే మీరు నివాస దేశానికి తిరిగి రావడానికి అనుమతించే వన్-వే ట్రావెల్ డాక్యుమెంట్. హై కమిషన్ చేత మీ జాతీయత మరియు ఇతర వివరాలను ధృవీకరించిన తర్వాత ఇది జారీ చేయబడుతుంది.

కింది సందర్భాలలో ఎమర్జెన్సీ సర్టిఫికెట్ జారీ చేయబడుతుంది:

  • పాస్‌ పోర్ట్‌  పోయినప్పుడు

  • పాస్‌ పోర్ట్‌  పాడైనా లేదా దొంగిలించబడినా

  • కొత్త పాస్‌పోర్ట్‌ను స్వీకరించడానికి నిరాకరించబడిన వ్యక్తులకు

  • సుదీర్ఘ కాలం పాటు పాస్‌ పోర్ట్‌  చెల్లుబాటు గడువు ముగిసి ఉన్నా

  • డిపోర్టేషన్ ఆదేశాల కింద ఉన్న వ్యక్తులు

వ్యక్తిగతంగా సంబంధిత రాయబార కార్యాలయాన్ని సందర్శించడం ద్వారా ఎమర్జెన్సీసర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సర్టిఫికెట్ పొందడానికి పర్సనల్ ఇంటర్వ్యూ విధానాల ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. ప్రత్యామ్నాయంగా, వారు ఇండియన్ ఎంబసీలు మరియు కాన్సులేట్ల వద్ద పాస్‌ పోర్ట్‌  సేవా అధికారిక పోర్టల్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో ఎమర్జెన్సీ సర్టిఫికెట్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

మీ పాస్‌ పోర్ట్‌  పోయినా లేదా దొంగిలించబడినా, ఎమర్జెన్సీసర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేయడం కోసం కొన్ని సాధారణ స్టెప్స్ ఈ క్రింద ఉన్నాయి:

  • స్టెప్ 1: ఇండియన్ ఎంబసీలు, కాన్సులేట్‌లలో పాస్‌ పోర్ట్‌  సేవా అధికారిక పోర్టల్‌ ని సందర్శించండి. మీరు ఏ దేశం నుండి పాస్‌ పోర్ట్‌  సేవల కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్నారో ఆ పేరును ఎంచుకోండి. 

ఇప్పుడు, "రిజిస్టర్" లింక్‌ను ఎంచుకోవడం ద్వారా పోర్టల్‌కు మీ పేరు నమోదు చేసుకోండి. మీ పేరు, పుట్టిన తేదీ మొదలైన వివరాలను ఎంబసీ లేదా కాన్సులేట్ దగ్గర నమోదు చేయండి. అలా కాకుండా, మీరు ఇప్పటికే నమోదు చేసుకున్నట్లయితే, మీ వివరాలతో లాగిన్ చేయండి.

  • స్టెప్ 2 : హోమ్ పేజీలో మీ ఎమర్జెన్సీ సర్టిఫికెట్ కోసం అవసరమైన ఆప్షన్ ఎంచుకోండి. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను పూరించి, సమర్పించండి.

  • స్టెప్ 3: సమర్పించిన దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింటౌట్ తీసుకొని, సంబంధిత పత్రాలతో రాయబార కార్యాలయాన్ని సందర్శించండి. మీరు సందర్శించిన దేశంలో అందుబాటులో ఉన్న దరఖాస్తు సమర్పణ కేంద్రం లేదా ఎంబసీల జాబితాను యాక్సెస్ చేయడానికి, "ఎంబసీ/కాన్సులేట్ కనెక్ట్" లింక్‌ని ఎంచుకోండి.

గుర్తుంచుకోండి, మీరు ఎమర్జెన్సీసర్టిఫికెట్ పొందడానికి ప్రాసెసింగ్ ఫీజులను అందించవలసి రావచ్చు. ఇంకా, అవసరమైన పత్రాల జాబితా అప్లై చేస్తున్న దేశాన్ని బట్టి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్కలా ఉంటాయి.  కాబట్టి ఈ సర్టిఫికెట్ కోసం అప్లై చేయడానికి భారతీయ కాన్సులేట్‌ను సంప్రదించే ముందు అధికారిక పోర్టల్‌ని చూడండి.

పాస్‌ పోర్ట్‌  కోల్పోవడం అనేది ఊహించలేని పరిస్థితి మరియు ప్రయాణంలో అసౌకర్యాన్ని సృష్టించవచ్చు. అయితే, అవాంతరాలను సులభంగా నివారించడానికి మీరు అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటే పైన పేర్కొన్న ఈ సూచనలను గుర్తుంచుకోండి.

తరచుగా అడుగు ప్రశ్నలు

ఎవరైనా పాస్‌ పోర్ట్‌ పోగొట్టుకున్నట్లయితే పాత పాస్‌ పోర్ట్‌ ఫోటోకాపీ అవసరమా?

పాస్‌ పోర్ట్‌  పోయిన లేదా దొంగిలించబడిన లేదా పాడైపోయిన సందర్భంలో పాత పాస్‌ పోర్ట్‌  ఫోటోకాపీని సమర్పించడం తప్పనిసరి కాదు. ఒకవేళ మీ దగ్గర అది ఉన్నట్లయితే, దానిని తప్పకుండా సమర్పించండి. అయితే, కొత్త పాస్‌ పోర్ట్‌  కోసం దరఖాస్తు చేసేటప్పుడు పాస్‌ పోర్ట్‌  నంబర్, తేదీ, జారీ చేసిన ప్రదేశం, గడువు తేదీ వంటి వివరాలు అవసరం. అది అందుబాటులో లేకుంటే, మీరు ప్రయాణించిన దేశంలోని సంబంధిత ఇండియన్ మిషన్‌ను సంప్రదించండి.

ఎమర్జెన్సీ సర్టిఫికెట్ ఎంతకాలం పాటు చెల్లుతుంది?

ఎమర్జెన్సీ సర్టిఫికెట్ చెల్లుబాటు ఒక నెల. ఆ లోపు మీరు మీ దేశానికి తిరిగి రావాలి.

కొత్త పాస్‌పోర్ట్‌ను తిరిగి జారీ చేయడానికి అభ్యర్థనను ప్రాసెస్ చేయడానికి ఎంత సమయం పడుతుంది?

మీ కొత్త పాస్‌ పోర్ట్‌  అప్లికేషన్ రిక్వెస్ట్ ప్రాసెస్ చేయడానికి దాదాపు 15 రోజులు పట్టవచ్చు. మీరు తత్కాల్ మోడ్‌లో దరఖాస్తు చేస్తే, దాదాపు 7 నుండి 10 రోజులు పట్టవచ్చు.