ఇల్లు, బిల్డింగ్, షాప్, వ్యాపారాల కోసం ప్రాపర్టీ ఇన్సూరెన్స్

జీరో పేపర్‌వర్క్. ఆన్‌లైన్ ప్రక్రియ

అది ఒకరి నివాస సముదాయం, అపార్ట్​మెంట్​, వ్యాపార సముదాయం, కేఫ్ లేదా ఆసుపత్రి కావొచ్చు. ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనేది బిల్డింగ్ మరియు దాని కంటెంట్​లను ప్రొటెక్ట్ చేసేందుకు రూపొందించిన ఇన్సూరెన్స్ పాలసీ. అగ్ని ప్రమాదాలు, దొంగతనాలు, కొండచరియలు విరిగి పడడం, రాళ్లు దొర్లుకుంటూ రావడం, ప్రకృతి విపత్తుల వలన సంభవించే లాసెస్​/డ్యామేజెస్​ను ఈ పాలసీ కవర్ చేస్తుంది. 

కావున మీరు మీ అందమైన ఇంటినైనా లేదా మీ స్టోర్​నైనా రక్షించాలని అనుకుంటే మీరు డిజిట్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయాలి. అనుకోని సందర్భాలలో తలెత్తే పొటెన్షియల్ లాసెస్ మరియు డ్యామేజెస్ వలన మీరు నష్టపోకుండా ఇది కవర్ చేస్తుంది. 

ప్రాపర్టీ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎందుకు ముఖ్యం?

ఇండియాలో 2021వ సంవత్సరంలో 1.6 మిలియన్ల అగ్ని ప్రమాదాలు రికార్డ్ అయ్యాయి. (1)

ఇండియాలో 64% మంది ప్రజలు ఇంటి భద్రత విషయంలో ఏదైనా ప్రమాదం తలెత్తితే హ్యాండిల్ చేసేందుకు సరైన పరికరాలు కలిగి లేరు (2)

వ్యాపారాలు సాఫీగా కొనసాగకుండా అడ్డుకోవడంలో అగ్ని ప్రమాదాలు 3వ అతిపెద్ద రిస్క్​గా ర్యాంక్ చేయబడ్డాయి. (3)

ఇండియాలో జరిగే దొంగతనాలలో 70% దొంగతనాలు ఇళ్లల్లోనే జరుగుతున్నాయి.(4)

డిజిట్ అందిస్తున్న ప్రాపర్టీ ఇన్సూరెన్స్​ గొప్పతనం ఏమిటి?

డబ్బుకు తగ్గ విలువ : ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనేది ఒక పెద్ద డీల్. దీని ద్వారా మీ బిల్డింగ్ అందులోని ఉన్న వస్తువులు కవర్ చేయబడతాయి. ఈ పాలసీ ఇన్సూరెన్స్ ప్రీమియంలు మీకు ఎక్కువగా అనిపించొచ్చు. కానీ మీకు తక్కువ ధరకు పాలసీ ప్రీమియంలు అందించేందుకు మేము ప్రయత్నిస్తాం.

డిజిటల్ ఫ్రెండ్లీ : డిజిట్ ఇండియా మొట్టమొదటి ఆన్​లైన్ బీమా సంస్థగా నిలిచింది. మా వద్ద చాలా రకాల పనులు ఆన్​లైన్​లోనే పూర్తవుతాయి. బిల్డింగ్ ఇన్సూరెన్స్ కొనుగోలు నుంచి క్లెయిములు చేయడం వరకు ఇలా ప్రతీ ఒక్కటి ఆన్​లైన్​లోనే ఉంటుంది. క్లెయిముల కోసం తనిఖీ అవసరమైనపుడు కూడా ఆన్​లైన్​లోనే పూర్తి చేయొచ్చు. కానీ ఐఆర్​డీఏఐ (IRDAI) నిబంధనల ప్రకారం రూ. 1 లక్ష కంటే ఎక్కువ విలువ గల క్లెయిముల కోసం మాన్యువల్​గా తనిఖీ చేయడం తప్పనిసరి.

అన్ని వ్యాపార కేటగిరీలను కవర్ చేస్తుంది : మీరు మీ కుటుంబ వ్యాపారం లేదా కిరాణా దుకాణాలను అలాగే స్టోర్స్​ను కవర్ చేయాలని భావించినా మా బీమా అన్ని రకాల వ్యాపారా​లకు సరిపోతుంది. ఆ వ్యాపారం పెద్దదైనా చిన్నదైనా మా బీమా కవర్ చేస్తుంది.

అద్దెదారులకు కూడా ప్లాన్లు : నేటి రోజుల్లో అద్దె ఇళ్లల్లో నివసించే వారు పెరిగిపోతున్నారు. అద్దెకు ఉన్న ఇల్లు ఎప్పటికీ సొంతం కాదు. అందుకోసమే అద్దెకు ఉండే వారి సొంత వస్తువుల కోసం మేము మీకు బీమా అందిస్తాం.

డిజిట్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్​లో ఏమేం కవర్ అవుతాయి?

మా ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అందజేసేవి (మీకు ఆఫర్ చేసేవి)

వివిధ రకాల ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ప్లాన్స్

డిజిట్​లో మేము అందించే గో డిజిట్ భారత్ లఘు ఉద్యమ్ సురక్ష, గో డిజిట్ భారత్ సూక్ష్మ ఉద్యమ్ సురక్ష, గో డిజిట్ భారత్ గృహ రక్ష పాలసీ వంటి ఇన్సూరెన్స్ పాలసీలు మీ ఆస్తులను అగ్ని ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలైన వరదలు, భూకంపాల వంటి వాటి నుంచి కవర్ చేస్తాయి. ఆస్తులు దొంగతనానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది కావున దొంగతనాల నుంచి మీ ఆస్తులను రక్షించేందుకు మేము డిజిట్ బర్గ్​లరీ ఇన్సూరెన్స్ పాలసీని కూడా అందిస్తున్నాం. ఇలా మీ ఆస్తి అగ్ని ప్రమాదాలు మరియు ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించబడటమే కాకుండా దొంగతనాల నుంచి కూడా రక్షించబడుతుంది. మీకు సులభంగా అర్థమయ్యేందకు కవరేజెస్​ను మేము ఈ కింది విధంగా వర్గీకరించాం. 

ఆప్షన్ 1 ఆప్షన్ 2 ఆప్షన్ 3
మీ ఇల్లు లేదా బిజినెస్​లో ఉండే కంటెంట్స్​ను మాత్రమే కవర్ చేస్తుంది. భవనం మరియు కంటెంట్స్​ రెండింటినీ ఇది కవర్ చేస్తుంది. మీ బిల్డింగ్​ను మాత్రమే కవర్ చేస్తుంది.

ప్రాపర్టీ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు

  • కంటెంట్ - ప్రాపర్టీ ఇన్సూరెన్స్​లో కంటెంట్స్ అంటే ఏమిటని మీరు ఇంకా గందరగోళంలో ఉంటే.. మీ ప్రాంగణంలో ఉండే మరియు శాశ్వతంగా మీ బిల్డింగ్ స్ట్రక్చర్​కు జోడించకుండా ఉండే వస్తువులను కంటెంట్స్ అని సూచిస్తారు.
  • బిల్డింగ్/స్ట్రక్చర్ – పేరుకు తగ్గట్లుగానే మీ ప్రాపర్టీ ఇన్సూరెన్స్​లో బిల్డింగ్ లేదా స్ట్రక్చర్ అనేది మీరు కవర్ చేసే మొత్తం ప్రాపర్టీని సూచిస్తుంది. మీరు మీ ఇంటిని లేదా మీ సొంత విల్లాను సంరక్షించాలని చూస్తున్నట్లయితే అవి భవనాన్ని సూచిస్తాయి.

ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఎవరికి అవసరం?

మీరు నివసించే ఇల్లు అయినా లేదా వ్యాపార కార్యాలయం అయినా వాటిని అనుకోని విపత్తుల నుంచి రక్షించుకునేందుకు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అవసరం. దొంగతనాలు లేదా సహజ ప్రకృతి విపత్తుల వలన సంభవించే భారీ ఆర్థిక నష్టాల నుంచి ఇది మిమ్మల్ని కవర్ చేస్తుంది.

ఇంటి యజమానులు

కొన్నేళ్ల నుంచి ఇది మీ ఇల్లు అయినా లేదా మీ కలల సౌధం అయినా కానీ అది చాలా విలువైనది. మీ చేతిలో లేని విపత్కర పరిస్థితుల నుంచి మీ ఇంటిని, మీ జేబుకు ఆర్థిక నష్టం కలగకుండా కాపాడుకునేందుకు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి.

అద్దెదారులు

సాధారణంగా ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనేది సొంతంగా భవనాలు ఉన్న వారికేనని అందరూ అనుకుంటారు. కానీ అది తప్పు. ఇంటి కోసం కానీ ఆఫీసుల కోసం కానీ భవనాలను అద్దెకు తీసుకున్న వారి కోసం కూడా డిజిట్​లో కస్టమైజ్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. మీలో ఎవరైతే ఈ కేటగిరీకి చెందుతారో వారికోసం కూడా ఇన్సూరెన్స్ రూపొందించబడి ఉంది.

చిన్న వ్యాపారాల యజమానులు

కస్టమైజ్​డ్ ఫ్యాషన్ మరియు హస్తకళలతో కూడిన ఒక చిన్న బొటిక్​ను లేదా చిన్న జనరల్ స్టోర్​ను మీరు నడుపినా కానీ మీరు మీ బిజినెస్​కు డిజిట్ అందించే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవచ్చు. డిజిట్ అందించే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీలు అన్ని రకాల వ్యాపారాలకు సరిగ్గా సరిపోతాయి. మీరు కనుక చిన్న వ్యాపారం లేదా సొంతంగా చిన్న షాపు నడుపుతున్నట్లయితే సంభావ్య నష్టాల నుంచి మీ వ్యాపారాలను రక్షించుకోవడానికి ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం చాలా అవసరం. 

మీడియం వ్యాపారాల యజమానులు

మీరు కనుక రెస్టారెంట్లు, జనరల్ స్టోర్స్ చెయిన్, లేదా ఒక మీడియం సైజ్ ఎంటర్​ప్రైజెస్​ను నడుపుతున్నా కానీ మీరు మీ వ్యాపారాలకు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు, తుఫానులు, భూకంపాల వలన మీడియం సైజ్ వ్యాపారాలకు ఎటువంటి సంభావ్య నష్టాలు తలెత్తకుండా ఉండేందుకు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ సరిగ్గా సరిపోతుంది.

పెద్ద వ్యాపారాలు

మీరు కనుక మల్టీపుల్ ప్రాపర్టీలను కలిగి ఉండి మీ వ్యాపారాలలో భారీ కార్యకలాపాలు చేస్తుంంటే.. ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ముఖ్యం. ఇది కేవలం మీ ఒక్క ప్రాపర్టీని కాపాడటమే కాకుండా అన్ని ప్రాపర్టీస్​ను రక్షిస్తుంది

కవర్ అయ్యే హోమ్ ప్రాపర్టీలు

వ్యక్తిగత అపార్ట్​మెంట్

హౌజింగ్ సొసైటీలు లేదా సొంత బిల్డింగ్​లలో ఉన్న సొంత ఫ్లాట్​లలోని వారికి ఇది సరిపోతుంది. పైన పేర్కొన్న వాటిలో మీరు ఫ్లాట్​ను కలిగి ఉన్నా లేదా అద్దెకు తీసుకున్నా కానీ ఇది రెండింటికీ సరిపోతుంది.

 

సొంత భవనం

మీరు మీ పెద్ద కుటుంబం ఇండిపెండెంట్ బిల్డింగ్​లోని మొత్తం ప్లాట్లను మీరు సొంతంగా కలిగి ఉన్నా లేక అద్దెకు తీసుకొని జీవిస్తున్నా కానీ ఇటువంటి సందర్భంలో మీరు డిజిట్ అందించే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీతో వాటిని కవర్ చేయొచ్చు. 

ఇండిపెండెంట్ విల్లా

మీరు సొంతంగా విల్లాను కలిగి ఉన్న లేదా దానిని అద్దెకు తీసుకున్నా కానీ పొటెన్షియల్ ప్రమాదాల నుంచి మీ విల్లాను మరియు అందులోని కంటెంట్స్​ను ప్రొటెక్ట్ చేసేందుకు మీరు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడం చాలా ముఖ్యం. 

కవర్ అయ్యే షాప్, వ్యాపార ఆస్తుల రకాలు

మొబైల్, ఎలక్ట్రానిక్స్

ప్రధానంగా మొబైల్ ఫోన్లు లేదా మొబైల్ యాక్సెసరీలు లేదా ఎలక్ట్రానిక్ పరికరాలను అమ్మే అమ్మే వ్యాపారాలు. క్రోమా (Croma), వన్​ప్లస్ (OnePlus), రెడ్​మీ (Redmi) వంటి స్టోర్లు ఇందుకు ఉదాహరణ. సంభవించగల నష్టాలు, డ్యామేజీల నుంచి ఇటువంటి ఆస్తులకు ఆస్తి నష్టం జరిగితే ఇది కవర్ చేస్తుంది. దొంగతనాల వలన ఇక్కడ ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది.

గ్రోసరీ, జనరల్ స్టోర్స్

మీకు ఇరుగు పొరుగున ఉన్న కిరాణా షాపుల నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ సూపర్​ మార్కెట్లు, జనరల్ స్టోర్ల వరకు ప్రాపర్టీ ఇన్సూరెన్స్​లో కవర్ అవుతాయి. బిగ్ బజార్ (Big Bazaar), స్టార్ బజార్ (Star Bazaar), రిలయన్స్ సూపర్​ మార్కెట్ (Reliance Supermarkets) వంటివి ఇందుకు కొన్ని ఉదాహరణలు.

కార్యాలయాలు, విద్యాసంస్థల ఆవరణలు

మా ప్రాపర్టీ ఇన్సూరెన్స్​లో ఈ కేటగిరీ అనేది కార్యాలయాలు, విద్యాసంస్థలకు సరిపోయేలా రూపొందించబడింది. ఇందులో పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు వస్తాయి. ఈ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ చేయడం వలన మీరు ఆర్థిక నష్టాల నుంచి కవర్ అవడమే కాకుండా మీ విద్యార్థులు, ఉద్యోగులకు ఇన్​స్టిట్యూట్ పట్ల విశ్వాసం మరింతగా పెరుగుతుంది.

హోమ్ రిపేర్ సర్వీసులు

వడ్రంగి, ప్లంబింగ్ మరమ్మతుల నుంచి మోటారు గ్యారేజీలు, ఇంజనీరింగ్ వర్క్​షాపుల వరకు ఇటువంటి వ్యాపారాలు ఉంటాయి.

పర్సనల్ లైఫ్ మరియు ఫిట్​నెస్

మీకు అత్యంత ఇష్టమైన బట్టల దుకాణాల నుంచి స్పాస్ వరకు అలాగే జిమ్స్ నుంచి ఇతర స్టోర్స్​ వరకు డిజిట్ అందించే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీ పర్సనల్ లైఫ్ స్టైల్ మరియు ఫిట్​నెస్ సెక్టార్​లో ఉండే అన్ని వ్యాపారాలను కవర్ చేస్తుంది. 

ఆహారం మరియు తినుబండరాలు

అందరూ తినే స్థలాలైన కేఫ్స్ మరియు ఫుడ్ ట్రక్స్ నుంచి మొదలుకుని రెస్టారెంట్లు మరియు బేకరీల వరకు డిజిట్ అందించే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీ అన్నింటికీ చక్కగా సరిపోతుంది. 

హెల్త్​కేర్

ఎంతో విలువైన ఆస్తులైన ఆసుపత్రులు, క్లినిక్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, మరియు మందుల దుకాణాలు కూడా డిజిట్ అందించే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ అవుతాయి. 

ఇతర ప్రాపర్టీస్

పైన పేర్కొన్న కేటగిరీలు మాత్రమే కాకుండా వివిధ రకాల సైజెస్ ఉన్న ఆస్తులకు కూడా డిజిట్ అందించే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీ కరెక్టుగా సూట్ అవుతుంది. లిస్ట్​లో మీ బిజినెస్ కేటగిరీని మీరు కనుక్కోలేకపోతే మమ్మల్ని ఎటువంటి సంకోచం లేకుండా మమ్మల్ని సంప్రదించండి. మీ ప్రాపర్టీకి బెస్ట్ పాలసీని ఎంచుకునేలా మేము మీకు సహాయం చేస్తాం. 

భారతదేశంలో ప్రాపర్టీ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోండి.

ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఎందుకు ముఖ్యం?

మీ ఇల్లు లేదా వ్యాపారం అనేవి మీకు ముఖ్యమైన ఆర్థిక వనరులు. ఇవి మీకు ఒక భద్రతను అందిస్తాయి. అటువంటి వాటిని వరదలు, తుఫానులు, పేలుళ్లు, అగ్నిప్రమాదాలు, దొంగతనాల వంటి అనుకోని సందర్భాల నుంచి కవర్ చేసేందుకు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి.

మీ ఇల్లు లేదా వ్యాపారం అనేవి మీకు ముఖ్యమైన ఆర్థిక వనరులు. ఇవి మీకు ఒక భద్రతను అందిస్తాయి. అటువంటి వాటిని వరదలు, తుఫానులు, పేలుళ్లు, అగ్నిప్రమాదాలు, దొంగతనాల వంటి అనుకోని సందర్భాల నుంచి కవర్ చేసేందుకు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి.

ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీ వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు

కంప్లీట్ కవరేజ్: ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మీ ఆస్తిని (స్టోర్ లేదా బిల్డింగ్​) దానిలో ఉండే కంటెంట్​లను రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఇది మిమ్మల్ని అన్ని రకాల నష్టాల నుంచి కాపాడుతుంది. అంతే కాకుండా అనేక రకాల బీమా సంస్థలు మీ అవసరాలకు తగిన విధంగా కవరేజ్​ను పెంచేందుకు వివిధ రకాల యాడ్ ఆన్స్ అందిస్తారు.  బిజినెస్​ రిస్క్​ను తగ్గిస్తుంది: మీ ఆస్తిని మరియు దాని కంటెంట్​లను కాపాడేందుకు ప్రాపర్టీ ఇన్సూరెన్స్​ పాలసీ కస్టమైజ్ ఆప్షన్స్​తో అందుబాటులో ఉంటుంది. తద్వారా ఇది వ్యాపార నష్టాల ప్రమాదాలను తగ్గిస్తుంది.  మనశ్శాంతి: మీ ఇల్లయినా కానీ మీ స్టోర్ అయినా కానీ పెద్ద మొత్తంలో ఆర్థిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. పెద్ద మొత్తంలో నష్టాలను ఎదుర్కోకుండా ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీ మిమ్మల్ని రక్షిస్తుంది. మీ ఆస్తిని బీమా కంపెనీ కవర్ చేస్తుందనే విషయం మిమ్మల్ని మనశ్శాంతిగా ఉండేలా చేస్తుంది. 

  • కంప్లీట్ కవరేజ్: ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మీ ఆస్తిని (స్టోర్ లేదా బిల్డింగ్​) దానిలో ఉండే కంటెంట్​లను రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఇది మిమ్మల్ని అన్ని రకాల నష్టాల నుంచి కాపాడుతుంది. అంతే కాకుండా అనేక రకాల బీమా సంస్థలు మీ అవసరాలకు తగిన విధంగా కవరేజ్​ను పెంచేందుకు వివిధ రకాల యాడ్ ఆన్స్ అందిస్తారు. 

  • బిజినెస్​ రిస్క్​ను తగ్గిస్తుంది: మీ ఆస్తిని మరియు దాని కంటెంట్​లను కాపాడేందుకు ప్రాపర్టీ ఇన్సూరెన్స్​ పాలసీ కస్టమైజ్ ఆప్షన్స్​తో అందుబాటులో ఉంటుంది. తద్వారా ఇది వ్యాపార నష్టాల ప్రమాదాలను తగ్గిస్తుంది. 

  • మనశ్శాంతి: మీ ఇల్లయినా కానీ మీ స్టోర్ అయినా కానీ పెద్ద మొత్తంలో ఆర్థిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. పెద్ద మొత్తంలో నష్టాలను ఎదుర్కోకుండా ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీ మిమ్మల్ని రక్షిస్తుంది. మీ ఆస్తిని బీమా కంపెనీ కవర్ చేస్తుందనే విషయం మిమ్మల్ని మనశ్శాంతిగా ఉండేలా చేస్తుంది. 

ఆన్​లైన్​లో ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి?

సరైన ఇన్సూరెన్స్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం ఓ సవాలుతో కూడుకున్న నిర్ణయం. మీరు తీసుకున్న నిర్ణయం మీదే మీకు ఎంతో ఇష్టమైన మీ ప్రాపర్టీ కవరేజ్ ఆధారపడి ఉంటుంది. ప్రాపర్టీ ఇన్సూరెన్స్​ను కొనుగోలు చేయడం కేవలం ఏదో ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం మాత్రమే కాదు. సరైన పాలసీ కొనుగోలు వల్ల మీ విలువైన ఆస్తులు కూడా రక్షించబడతాయి.

సరైన ఇన్సూరెన్స్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం ఓ సవాలుతో కూడుకున్న నిర్ణయం. మీరు తీసుకున్న నిర్ణయం మీదే మీకు ఎంతో ఇష్టమైన మీ ప్రాపర్టీ కవరేజ్ ఆధారపడి ఉంటుంది. ప్రాపర్టీ ఇన్సూరెన్స్​ను కొనుగోలు చేయడం కేవలం ఏదో ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం మాత్రమే కాదు. సరైన పాలసీ కొనుగోలు వల్ల మీ విలువైన ఆస్తులు కూడా రక్షించబడతాయి.

ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి?

ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం కింది కారకాలచే ప్రభావితమవుతుంది. అవేంటంటే.. ప్రాపర్టీ రకం:  మీరు బీమా చేయాలనుకున్న ఆస్తి రకం మీ బీమా ప్రీమియంలో భారీ తేడాను చూపిస్తుంది. ఉదాహరణకు చూసుకుంటే ఒక ఫ్యాక్టరీకి జనరల్ స్టోర్ కంటే ఎక్కువ ఇన్సూరెన్స్ ప్రీమియం ఉంటుంది. కావున మీరు బీమా చేసే ఆస్తి ఎలాంటి రకం అన్నది ముఖ్యభూమిక పోషిస్తుంది. ప్రాపర్టీ వయసు: ఇతర అన్ని బీమా​ల మాదిరిగానే దీనిలో కూడా వయసు అనేది ప్రీమియాన్ని ప్రభావితం చేసే ముఖ్య అంశం. ఆస్తి కొత్తదైతే ఎక్కువ ప్రీమియాన్ని కలిగి ఉంటుంది. ప్రాపర్టీ కొత్తదైతే తక్కువగా ఉంటుంది. ప్రాపర్టీ ప్రాంతం: బీమా చేసే ఆస్తి ఏరియా అనేది కూడా బీమా ప్రీమియాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే పెద్ద ఆస్తికి ఎక్కువ బీమా మొత్తం ఉంటుంది కనుక దాని ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుంది. సెక్యూరిటీ చర్యలు: అనేక ఇళ్లు, వ్యాపారాలు నేడు తమ ప్రాపర్టీలను దొంగతనాలు, అగ్నిప్రమాదాల వంటి విపత్తుల నుంచి రక్షించుకునేందుకు అనేక భద్రతా చర్యలను కలిగి ఉంటున్నాయి. మీరు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ చేయాలనుకున్న ఇల్లు లేదా షాప్​కు కూడా ఇటువంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉంటే మీ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గుతుంది. అదనపు కవరేజీలు:  ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ప్రధానంగా భవనం మరియు దాని కంటెంట్​లకు వర్తిస్తుంది. ఇంటిలో లేదా షాపులో అధిక ధర గల ఇతర విలువైన ఆభరణాల వంటివి కూడా ఉండొచ్చు. అందుకోసమే వేరే ధరతో లభించే యాడ్ ఆన్స్​ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు కనుక యాడ్ ఆన్స్​ను ఎంచుకుంటే అవి మీకు బెటర్ ప్రొటెక్షన్ అందజేస్తాయి. కానీ ఇవి ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని పెంచుతాయి. 

ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం కింది కారకాలచే ప్రభావితమవుతుంది. అవేంటంటే..

  • ప్రాపర్టీ రకం:  మీరు బీమా చేయాలనుకున్న ఆస్తి రకం మీ బీమా ప్రీమియంలో భారీ తేడాను చూపిస్తుంది. ఉదాహరణకు చూసుకుంటే ఒక ఫ్యాక్టరీకి జనరల్ స్టోర్ కంటే ఎక్కువ ఇన్సూరెన్స్ ప్రీమియం ఉంటుంది. కావున మీరు బీమా చేసే ఆస్తి ఎలాంటి రకం అన్నది ముఖ్యభూమిక పోషిస్తుంది.
  • ప్రాపర్టీ వయసు: ఇతర అన్ని బీమా​ల మాదిరిగానే దీనిలో కూడా వయసు అనేది ప్రీమియాన్ని ప్రభావితం చేసే ముఖ్య అంశం. ఆస్తి కొత్తదైతే ఎక్కువ ప్రీమియాన్ని కలిగి ఉంటుంది. ప్రాపర్టీ కొత్తదైతే తక్కువగా ఉంటుంది.
  • ప్రాపర్టీ ప్రాంతం: బీమా చేసే ఆస్తి ఏరియా అనేది కూడా బీమా ప్రీమియాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే పెద్ద ఆస్తికి ఎక్కువ బీమా మొత్తం ఉంటుంది కనుక దాని ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుంది.
  • సెక్యూరిటీ చర్యలు: అనేక ఇళ్లు, వ్యాపారాలు నేడు తమ ప్రాపర్టీలను దొంగతనాలు, అగ్నిప్రమాదాల వంటి విపత్తుల నుంచి రక్షించుకునేందుకు అనేక భద్రతా చర్యలను కలిగి ఉంటున్నాయి. మీరు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ చేయాలనుకున్న ఇల్లు లేదా షాప్​కు కూడా ఇటువంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉంటే మీ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గుతుంది.
  • అదనపు కవరేజీలు:  ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ప్రధానంగా భవనం మరియు దాని కంటెంట్​లకు వర్తిస్తుంది. ఇంటిలో లేదా షాపులో అధిక ధర గల ఇతర విలువైన ఆభరణాల వంటివి కూడా ఉండొచ్చు. అందుకోసమే వేరే ధరతో లభించే యాడ్ ఆన్స్​ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు కనుక యాడ్ ఆన్స్​ను ఎంచుకుంటే అవి మీకు బెటర్ ప్రొటెక్షన్ అందజేస్తాయి. కానీ ఇవి ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని పెంచుతాయి. 

ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ప్లాన్లను పోల్చడానికి చిట్కాలు

సరైన ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఎంచుకునేముందు ప్రతి ఒక్కరూ డైలమాలో పడతారు. ఇదో తికమక పెట్టే ఎంపిక. మీరు తీసుకునే నిర్ణయం మీ ఇంటిని లేదా మీరు ఎంతగానో ఇష్టపడే మీ బిజినెస్​ను రక్షించే ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి. మీరు సరైన బీమా సంస్థణు ఎంచుకునేందుకు మూడు విషయాలు ఇక్కడ ఉన్నాయి. వాటిని ఓ సారి పరిశీలించండి. కవరేజీ ప్రయోజనాలు: మీరు పొందే కవరేజ్ అనేది మీ బీమాలో ముఖ్యమైన భాగం. అనుకోని సందర్భాల్లో జరిగిన నష్టాల వలన మీరు క్లెయిమ్ చేసినపుడు మీరు దేనికి కవర్ అవుతారు. దేనికి కవర్ కారు అనే విషయాలను తెలుసుకోవడం చాలా అవసరం. ఎంతో విలువైన ఇన్సూరెన్స్ ప్లాన్​ను ఎంచుకునే ముందు కవరేజీ వివరాలను ఒకసారి పరిశీలించండి. బీమా మొత్తం: ప్రాపర్టీ ఇన్సూరెన్స్ విషయంలో మీ బీమా మొత్తం (సమ్ ఇన్సూర్డ్) విలువ అనేది మీరు ఏదైనా క్లెయిమ్ చేసినపుడు అందుకునే పూర్తి మొత్తాన్ని సూచిస్తుంది. కావున మీరు ఎంచుకునే బీమా మొత్తం విలువ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. బీమా మొత్తం విలువ అనేది మీ ప్రీమియం విలువను ప్రభావితం చేయడం మాత్రమే కాకుండా మీకు ఏదైనా డ్యామేజీలు లేదా నష్టాలు జరిగినపుడు మీరు అందుకునే మొత్తం విషయంలో తన మార్కును చూపిస్తుంది. అందుబాటులో ఉన్న యాడ్–ఆన్లు: మీకు కొన్ని సార్లు కవరేజ్ కంటే ఎక్కువ సాయం అవసరం ఉంటుంది. అటువంటి సందర్భంలోనే యాడ్–ఆన్స్ బాగా ఉపయోగపడతాయి. వివిధ రకాల బీమా సంస్థలు వివిధ యాడ్–ఆన్లను అందిస్తున్నాయి. కావున మీకు ఏది అవసరమో చూసుకుని ఎంపిక చేసుకోవడం అవసరం.

సరైన ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఎంచుకునేముందు ప్రతి ఒక్కరూ డైలమాలో పడతారు. ఇదో తికమక పెట్టే ఎంపిక. మీరు తీసుకునే నిర్ణయం మీ ఇంటిని లేదా మీరు ఎంతగానో ఇష్టపడే మీ బిజినెస్​ను రక్షించే ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి. మీరు సరైన బీమా సంస్థణు ఎంచుకునేందుకు మూడు విషయాలు ఇక్కడ ఉన్నాయి. వాటిని ఓ సారి పరిశీలించండి.

  • కవరేజీ ప్రయోజనాలు: మీరు పొందే కవరేజ్ అనేది మీ బీమాలో ముఖ్యమైన భాగం. అనుకోని సందర్భాల్లో జరిగిన నష్టాల వలన మీరు క్లెయిమ్ చేసినపుడు మీరు దేనికి కవర్ అవుతారు. దేనికి కవర్ కారు అనే విషయాలను తెలుసుకోవడం చాలా అవసరం. ఎంతో విలువైన ఇన్సూరెన్స్ ప్లాన్​ను ఎంచుకునే ముందు కవరేజీ వివరాలను ఒకసారి పరిశీలించండి.
  • బీమా మొత్తం: ప్రాపర్టీ ఇన్సూరెన్స్ విషయంలో మీ బీమా మొత్తం (సమ్ ఇన్సూర్డ్) విలువ అనేది మీరు ఏదైనా క్లెయిమ్ చేసినపుడు అందుకునే పూర్తి మొత్తాన్ని సూచిస్తుంది. కావున మీరు ఎంచుకునే బీమా మొత్తం విలువ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. బీమా మొత్తం విలువ అనేది మీ ప్రీమియం విలువను ప్రభావితం చేయడం మాత్రమే కాకుండా మీకు ఏదైనా డ్యామేజీలు లేదా నష్టాలు జరిగినపుడు మీరు అందుకునే మొత్తం విషయంలో తన మార్కును చూపిస్తుంది.
  • అందుబాటులో ఉన్న యాడ్–ఆన్లు: మీకు కొన్ని సార్లు కవరేజ్ కంటే ఎక్కువ సాయం అవసరం ఉంటుంది. అటువంటి సందర్భంలోనే యాడ్–ఆన్స్ బాగా ఉపయోగపడతాయి. వివిధ రకాల బీమా సంస్థలు వివిధ యాడ్–ఆన్లను అందిస్తున్నాయి. కావున మీకు ఏది అవసరమో చూసుకుని ఎంపిక చేసుకోవడం అవసరం.

సరైన ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ప్లాన్​ను ఎలా ఎంచుకోవాలి?

సరైన ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంచుకోవడం కోసం ఉత్తమ మార్గం పోల్చడం. మీ వద్ద ఉన్న అన్ని ఆప్షన్లను ఒకదానితో మరొక దానిని పోల్చి చూడండి. అంతే కాకుండా అందులో మీకు లభించే కవరేజీ ప్రయోజనాలు, బీమా మొత్తం విలువ, అందుబాటులో ఉన్న యాడ్–ఆన్స్, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం, కస్టమర్ సపోర్ట్ వంటి వాటిని బాగా చెక్ చేయండి. పైన పేర్కొన్నవి చెక్ చేయకుండా ఇన్సూరెన్స్ ప్రొవైడర్​ను ఎంచుకోకండి.

సరైన ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంచుకోవడం కోసం ఉత్తమ మార్గం పోల్చడం. మీ వద్ద ఉన్న అన్ని ఆప్షన్లను ఒకదానితో మరొక దానిని పోల్చి చూడండి. అంతే కాకుండా అందులో మీకు లభించే కవరేజీ ప్రయోజనాలు, బీమా మొత్తం విలువ, అందుబాటులో ఉన్న యాడ్–ఆన్స్, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం, కస్టమర్ సపోర్ట్ వంటి వాటిని బాగా చెక్ చేయండి. పైన పేర్కొన్నవి చెక్ చేయకుండా ఇన్సూరెన్స్ ప్రొవైడర్​ను ఎంచుకోకండి.

ప్రాపర్టీ ఇన్సూరెన్స్​ కోసం సరైన బీమా మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?

మీ బీమా సమ్ ఇన్సూర్డ్ విలువ అనేది మీ ఆస్తి మొత్తం విలువను సూచిస్తుంది. మీరు క్లెయిమ్ చేసిన సమయంలో మీరు అందుకునే గరిష్ట అమౌంట్​ ఇదే. కావున మీరు సరైన ప్రాపర్టీ విలువను ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు మీ ప్రాపర్టీ కొరకు సరైన సమ్ ఇన్సూర్డ్ విలువను ఎంచుకునేందుకు మా ప్రాపర్టీ ఇన్సూరెన్స్ క్యాలుక్యులేటర్​ను ఉపయోగించొచ్చు. ఇది మీ ప్రాంతాన్ని బట్టి సరైన ఇన్సూర్డ్ వ్యాల్యూని ఎంచుకోవడంలో సహాయపడుతుంది.

మీ బీమా సమ్ ఇన్సూర్డ్ విలువ అనేది మీ ఆస్తి మొత్తం విలువను సూచిస్తుంది. మీరు క్లెయిమ్ చేసిన సమయంలో మీరు అందుకునే గరిష్ట అమౌంట్​ ఇదే. కావున మీరు సరైన ప్రాపర్టీ విలువను ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు మీ ప్రాపర్టీ కొరకు సరైన సమ్ ఇన్సూర్డ్ విలువను ఎంచుకునేందుకు మా ప్రాపర్టీ ఇన్సూరెన్స్ క్యాలుక్యులేటర్​ను ఉపయోగించొచ్చు. ఇది మీ ప్రాంతాన్ని బట్టి సరైన ఇన్సూర్డ్ వ్యాల్యూని ఎంచుకోవడంలో సహాయపడుతుంది.

భారతదేశంలో ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీల గురించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQలు)

గో డిజిట్ అందించే గృహ రక్ష పాలసీ కింద నా ఆభరణాలు రక్షించబడతాయా?

స్వతహాగా ఆభరణాలు ఈ పాలసీలో కవర్ చేయబడవు. కానీ మీరు దానికి సంబంధించిన యాడ్–ఆన్ తీసుకుంటే అవి ఇన్సూరెన్స్​లో కవర్ చేయబడతాయి. అంతే కాకుండా మీరు ఇంట్లో ఉన్న ఆభరణాలకు అదనపు సంరక్షణను కూడా అందించొచ్చు.

ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఉద్దేశం ఏంటి?

ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనేది మీ ఇల్లు అందులోని కంటెంట్లను కవర్ చేస్తుంది. ఉదాహరణకు మీరు ఒక ఇంటిని ప్రాపర్టీ ఇన్సూరెన్స్​తో సంరక్షిస్తున్నట్లయితే మీ ఇంటికి అందులోని వస్తువులకు ఏవైనా భౌతిక డ్యామేజీలు అయితే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది.

భారతీయ చట్టాల ప్రకారం ప్రాపర్టీ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరా?

లేదు. భారతీయ చట్టాల ప్రకారం ప్రాపర్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి కాదు. కానీ సంభవించగల నష్టాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు ఇది అవసరం.