జనరల్ ఇన్సూరెన్స్​ ఏజెంట్‌గా మారండి

కలిసి అద్భుతంగా మారుదాం

ఇన్సూరెన్స్​ పాలసీలను అమ్మే వ్యక్తిని ఇన్సూరెన్స్​ ఏజెంట్ అంటారు. ఇతడు ఇన్సూరెన్స్​ కంపెనీ ఆధీనంలో పని చేస్తాడు. ఆ కంపెనీ పాలసీలనే విక్రయిస్తాడు.

ఇంటి నుంచే ఇన్సూరెన్స్​ ఏజెంట్ ఎలా కావాలని మీరు చూస్తున్నట్లయితే లేదా సర్టిఫైడ్​ పాయింట్​ ఆఫ్​ సేల్స్​ పర్సన్ (POSP) ​గా ఎలా మారాలా అని చూస్తుంటే డిజిట్​ మీకు గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. మీరు ఇన్సూరెన్స్​ ఏజెంట్​గా మారడం వలన కస్టమర్లకు సాయం చేసే అవకాశం కలుగుతుంది. వారు పాలసీలు ఎంచుకునేటపుడు వారి అవసరాలకు తగిన పాలసీని వారికి సిఫారసు చేయవచ్చు.

డిజిట్​ కంపెనీతో మీరు హెల్త్​ ఇన్సూరెన్స్​, మోటార్​ (కార్​, బైక్​, కమర్షియల్​ వాహనాలు) ఇన్సూరెన్స్​, ఎస్‌ఎఫ్‌ఎస్‌పీ (SFSP) ఇన్సూరెన్స్​, ఇంటర్నేషనల్​ ట్రావెల్​ ఇన్సూరెన్స్​ చేయించొచ్చు.

జనరల్​ ఇన్సూరెన్స్​ అంటే ఏమిటి?

జనరల్​ ఇన్సూరెన్స్​లో కార్​ ఇన్సూరెన్స్​, బైక్​ ఇన్సూరెన్స్​, ట్రావెల్​ ఇన్సూరెన్స్​, ఎస్‌ఎఫ్‌ఎస్‌పీ (SFSP) ఇన్సూరెన్స్​, హెల్త్​ ఇన్సూరెన్స్​ వంటివి ఉంటాయి.

అనుకోని సందర్భాల్లో రక్షించుకునేందుకు జనరల్​ ఇన్సూరెన్స్​ పాలసీలు ప్రజలకు బాగా సాయం చేస్తాయి.

ఉదాహరణకు, ఒక కార్​ ఇన్సూరెన్స్​ తీసుకొని ఉన్నట్లైతే ఆ కారుకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అయ్యే ఖర్చులు, నష్టాల నుంచి కవర్​ చేస్తుంది. రిపేర్లకు అయ్యే ఖర్చులు జేబు నుంచి పెట్టుకోనవసరం లేకుండా సహాయపడుతుంది. అదేవిధంగా ఎస్‌ఎఫ్‌ఎస్‌పీ (SFSP) ఇన్సూరెన్స్​ పాలసీ ప్రకృతి విపత్తుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.

మోటారు వాహనాల చట్టం, పట్టణ జనాభా పెరగడం వంటి కారణాల వలన చాలా మంది భారతీయులు ప్రస్తుత రోజుల్లో తమను తాము, తమ ఆస్తులను కాపాడుకునేందుకు ఇన్సూరెన్స్​ చేయించుకుంటున్నారు.

*డిస్‌క్లెయిమర్‌ (Disclaimer) – ఇన్సూరెన్స్​ ఏజెంట్లకు ప్రత్యేక కేటగిరీ అంటూ ఏమీ లేదు. మీరు జనరల్​ ఇన్సూరెన్స్​ ఏజెంట్​గా నమోదు చేసుకుంటే అన్ని రకాల జనరల్​ ఇన్సూరెన్స్​ పాలసీలను అమ్మవచ్చు.

భారతదేశంలో జనరల్​ ఇన్సూరెన్స్​ రంగం గురించి ఆసక్తికర విషయాలు

1

ఒక్క గతేడాది కాలంలోనే భారతదేశంలో జనరల్​ ఇన్సూరెన్స్​ రంగం 14.5% వృద్ధి రేటు సాధించింది. (1)

2

2019లో భారతదేశంలో మొత్తం నాన్​-లైఫ్ ఇన్సూరెన్స్​ పాలసీల విలువ దాదాపు రూ. 1.59 లక్షల కోట్లు. (2)

3

2020లో భారతదేశంలో జనరల్​ ఇన్సూరెన్స్​ మార్కెట్​ దాదాపు 40 బిలియన్ల డాలర్లు దాటుతుందని అంచనా. (3)

డిజిట్​తోనే ఎందుకు నేను జనరల్​ ఇన్సూరెన్స్​ ఏజెంట్​గా మారాలి?

మీరు ఎందుకోసం ఇన్సూరెన్స్​ ఏజెంట్​గా మారాలి? డిజిట్​ను ఎందుకు ఎంచుకోవాలనే విషయాలను గురించి మరింతగా తెలుసుకోండి.

నేరుగా డిజిట్​తో కలిసి పనిచేయండి

మీరు పీవోఎస్‌పీ (POSP) పార్ట్​నర్​గా మాతో నేరుగా పని​ చేయొచ్చు. ఎటువంటి మధ్యవర్తులు ఉండరు. భారతదేశంలో డిజిట్​ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇన్సూరెన్స్​ కంపెనీ. 2019 ఆసియా జనరల్​ ఇన్సూరెన్స్​ కంపెనీ అవార్డును డిజిట్​  సొంతం చేసుకుంది. అతి తక్కువ సమయంలో ఈ అవార్డును పొందిన మొదటి ఇన్సూరెన్స్​ కంపెనీ డిజిట్​.

ఎక్కువ ప్రొడక్టులు

మేము ఎక్కువ ఇన్సూరెన్స్​ పాలసీలను ఆఫర్​ చేస్తాం. ఇవి మీ ఆస్తులను కాపాడేందుకు బాగా సహాయపడతాయి. ఉదాహరణకు మేము హెల్త్​, మోటార్​ (కార్​, టూ వీలర్​, కమర్షియల్​ వాహనాలు), ట్రావెల్​, హోమ్​, అనేక రకాల పాలసీలను మేము అందజేస్తాం.

ఇన్సూరెన్స్‌ను సులభతరం చేశాం

మేము ఇన్సూరెన్స్​ విధానాన్ని సులభతరం చేశాం. మేము నమ్మేది కూడా అదే. ఇన్సూరెన్స్​ పాలసీ చేయాలంటే అన్ని రకాల డాక్యుమెంట్లు అవసరమా? అందుకే మా ఇన్సూరెన్స్​ పాలసీలు 15 సంవత్సరాల పిల్లాడు కూడా అర్థం చేసుకునేలా ఉంటాయి.

పటిష్టమైన బ్యాకెండ్‌ సపోర్ట్‌

టెక్నాలజీ మా ప్రధాన బలం. మా వద్ద ఉన్న సపోర్ట్​ టీమ్​ ఎల్లప్పుడూ మీకు సాయం చేసేందుకు ఎదురు చూస్తూ ఉంటుంది. అధునాతన ఫీచర్లతో ఉన్న మొబైల్​, వెబ్​ అప్లికేషన్లు మా కంపెనీకి ఉన్నాయి. వాటి సాయంతో 24x7 ఎప్పుడైనా సరే మేము పాలసీలను విక్రయిస్తాం.

జీరో-టచ్​ ఇన్సూరెన్స్

మా దగ్గర పాలసీ చేయిస్తే అన్ని ప్రక్రియలు ఆన్​లైన్‌లోనే పూర్తవుతాయి. ఎటువంటి పేపర్​ వర్క్​ అవసరం ఉండదు. ఇది కస్టమర్ల విలువైన సమయాన్ని ఆదా చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అదే కోరుకుంటారు కదా!

తక్షణమే పాలసీల జారీ

మా వద్ద ఎక్కువ సేపు వేచి ఉండే ప్రక్రియ లేదు. ఎటువంటి పేపర్​ వర్క్ కూడా ఉండదు. మేము త్వరితగతిన ఆన్​లైన్​లో ఇన్సూరెన్స్​ పాలసీలను జారీ చేస్తాం. ఈ విధానం ద్వారా మీకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉంటుంది.

త్వరగా కమిషన్​ సెటిల్​మెంట్

మీరు ఎటువంటి గాబరా పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము మీ వెనకాలే ఉన్నాం. మీ అన్ని రకాల కమిషన్ అమౌంట్లు చాలా తొందరగా సెటిల్​ అవుతాయి. మీరు పాలసీ పూర్తి చేసిన 15 రోజుల్లోపు మీ అకౌంట్‌లో కమీషన్‌ అమౌంట్‌ పడిపోతుంది.

ఆన్​లైన్​లో ఇన్సూరెన్స్​ ఏజెంట్​ అవడం ఎలా?

ఇన్సూరెన్స్​ ఏజెంట్​గా మారేందుకు సులభమైన మార్గం పీవోఎస్‌పీ (POSP) సర్టిఫికేషన్​ పూర్తి చేయడం. పాయింట్​ ఆఫ్ సేల్స్​ పర్సన్ (POSP) అనే పేరును ఇన్సూరెన్స్​ ఏజెంట్​కి కంపెనీ ఇచ్చిందంటే అతడు ఇన్సూరెన్స్​ ప్రొడక్టులను అమ్మేందుకు అర్హత కలిగి ఉంటాడు.

పీవోఎస్‌పీ (POSP)గా మారేందుకు మీకు కొన్ని కనీస విద్యార్హతలు అవసరం. ఐఆర్‌డీఏఐ (IRDAI) నిబంధనల ప్రకారం మీరు తప్పనిసరిగా పదో తరగతి పాస్​ అయి ఉండాలి. అంతేకాకుండా, శిక్షణా కార్యక్రమాన్ని కూడాపూర్తి చేయాలి. మీ శిక్షణ కాలం గురించి ఎటువంటి చింత అవసరం లేదు. డిజిట్​ అంతా చూసుకుంటుంది.

ఇన్సూరెన్స్​ ఏజెంట్ కావడానికి కావాల్సిన అర్హతలు​ ఏంటి?

మీరు ఇన్సూరెన్స్​ ఏజెంట్ కావడానికి ఏం కావాలంటే..

  • మీకు 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండాలి
  • కనీసం మీరు పదో తరగతి అయినా ఉత్తీర్ణులు అయి ఉండాలి
  • మీకు సరైన ఆధార్​ కార్డు, పాన్​ (PAN) కార్డు ఉండాలి
  • ఐఆర్‌డీఏఐ (IRDAI) అందించే 15 గంటల శిక్షణా కార్యక్రమాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలి.

మీరు తెలుసుకోవాల్సినవి నేర్చుకోవడంలో మేము మీకు సాయం చేస్తామని హామీ ఇస్తున్నాము!

ఎవరు ఇన్సూరెన్స్​ ఏజెంట్‌ కావచ్చు?

ఇన్సూరెన్స్​ ఏజెంట్‌ అయ్యేందుకు మీరు  కేవలం 18 సంవత్సరాల వయసు పూర్తి చేసుకుని పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

పదో తరగతి ఉత్తీర్ణులైన ఎవరైనా సరే ఇన్సూరెన్స్​ పాలసీలను అమ్మడానికి అర్హులే. అలాగే, వారు సర్టిఫైడ్​ పీవోఎస్‌పీ (POSP) ఏజెంట్​గా మారొచ్చు. ఈ పనిని కళాశాల విద్యార్థులు, ఇంట్లో ఉండే గృహిణులు, పదవీ విరమణ పొందినవారు, వ్యాపారవేత్తలు ఇలా ఎవరైనా సరే చేయించొచ్చు.

డిజిట్‌ ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌ కావడమెలా?

స్టెప్​ 1

మా పీవోఎస్‌పీ (POSP) ఫామ్​ నింపి సంతకం చేస్తే సరిపోతుంది. అన్ని రకాల వివరాలను నింపి అవసరమైన డాక్యుమెంట్లను అప్​లోడ్​ చేయండి.

స్టెప్​ 2

మీ 15 గంటల శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేసుకోండి.

స్టెప్​ 3

సూచించిన పరీక్షను విజయవంతంగా రాయండి.

స్టెప్​ 4

మాతో అగ్రిమెంట్​ మీద సంతకం చేస్తే సరిపోతుంది. మీరు సర్టిఫైడ్ పీవోఎస్‌పీ (POSP)గా మారొచ్చు.

నేను జనరల్​ ఇన్సూరెన్స్​ ఏజెంట్​గా ఎందుకు మారాలి?

మీకు మీరే బాస్​

పీవోఎస్‌పీ (POSP) గా మారడం వలన ప్రయోజనమేంటంటే మీకు నచ్చిన విధంగా పని చేసుకునే సౌలభ్యం ఉంటుంది. ఇక్కడ మీకు మీరే బాస్​.

కాల పరిమితులు ఉండవు!

మీరు ఫుల్​ టైమ్​ అయినా లేదా పార్ట్​టైమ్​ అయినా పని చేయొచ్చు. లేదా మీ వీలును బట్టి ఎప్పుడైనా పని చేసుకోవచ్చు.

ఇంటి వద్ద నుంచే పని చేసే సౌలభ్యం

డిజిట్​ ఇన్సూరెన్స్​లో మేము ఎక్కువగా ఇన్సూరెన్స్​ పాలసీలను ఆన్​లైన్​లోనే అమ్ముతాం. కావున మీరు ఇంటి వద్దే కూర్చుని ఆన్​లైన్​ ద్వారా పాలసీలను అమ్ముకోవచ్చు.

కేవలం 15 గంటల శిక్షణ

మీరు సర్టిఫైడ్​ పీవోఎస్‌పీ (POSP) గా మారేందుకు తప్పనిసరిగా ఐఆర్‌డీఏఐ (IRDAI) అందించే 15 గంటల శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. మీరు కేవలం 15 గంటల మీ సమయాన్ని వెచ్చిస్తే సరిపోతుంది. మీరు ఇన్సూరెన్స్​ ఏజెంట్​గా మారొచ్చు.

ఎక్కువ సంపాదించే అవకాశం

మీ సంపాదన మీరు ఎన్ని గంటలు పని చేశారనే దాని మీద కాకుండా మీరు ఎన్ని పాలసీలు చేయించారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయం గురించి మీరు మరింతగా తెలుసుకునేందుకు మా ఇన్సూరెన్స్​ క్యాలుక్యులేటర్​ను ఉపయోగించడండి. అక్కడ ప్రతి పాలసీకి మీరు ఎంత మొత్తం పొందుతారనే వివరాలు పొందు పరిచి ఉంటాయి.

సున్నా పెట్టుబడి

మీకు మంచి స్మార్ట్​ ఫోన్​, ఇంటర్నెట్​ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. ఇంకా మీరు ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. కేవలం 15 గంటల శిక్షణ కాలంతోనే మీరు సర్టిఫైడ్​ పీవోఎస్‌పీ (POSP) గా మారే అవకాశం ఉంటుంది. ఇందులో మీరు డబ్బులు పెట్టుబడి పెట్టకుండానే బాగా సంపాదించుకోవచ్చు.

తరచూ అడిగే ప్రశ్నలు

డిజిట్​తో ఇన్సూరెన్స్​ ఏజెంట్​ (POSP) గా మారేందుకు ఏం సర్టిఫికెట్స్​ అవసరం?

మీరు 10 వ తరగతి లేదా ఆపై తరగతి చదివిన సర్టిఫికెట్‌ సమర్పించాలి. పాన్​ (PAN) కార్డు, ఆధార్​ కార్డు జిరాక్స్​లు (ముందు భాగం, వెనుక భాగం), మీ పేరు మీద ఉన్న అకౌంట్​ నుంచి క్యాన్సిల్​ అయిన చెక్​ (చెక్​ మీద మీ పేరు తప్పనిసరిగా ఉండాలి) దానితో పాటు ఒక ఫొటో.

పాన్​ (PAN) కార్డు హోల్డర్​ బ్యాంక్​ అకౌంట్​ హోల్డర్​ ఒక్కరే అయి ఉండాలా?

అవును. మీరు పొందే అన్ని రకాల కమీషన్ల మీద టీడీఎస్‌ (TDS) మినహాయించబడుతుంది. ఈ టీడీఎస్‌ (TDS) అనేది పాన్‌ (PAN) కార్డు మీదే ఆధారపడి ఉంటుంది.

నేను ఇన్సూరెన్స్​ పాలసీలను అమ్మడం ఎప్పుడు మొదలు పెట్టొచ్చు?

మీరు మాతో రిజిస్టర్​ చేసుకున్న వెంటనే మీకు పీవోఎస్‌పీ (POSP) శిక్షణ కోసం పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష​లో పాసయితే మీకు ఈ-సర్టిఫికెట్​ అందుతుంది.

అప్పుడు మీరు పీవోఎస్‌పీ (POSP) ఏజెంట్‌గా ఇన్సూరెన్స్‌ అమ్మడానికి అర్హులవుతారు.

నేను సర్టిఫైడ్​ పీవోఎస్‌ (POS) పర్సన్​గా మారేందుకు శిక్షణ తీసుకోవడం తప్పనిసరా?

అవును తప్పకుండా శిక్షణ తీసుకోవాలి. పీవోఎస్‌పీ (POSP) గా మారేందుకు శిక్షణ కచ్చితంగా అవసరమే. ఈ శిక్షణలో మీకు పాలసీ రకాలు, పాలసీలను ఎలా క్లెయిమ్ చేయాలి, ఎటువంటి నియమ నిబంధనలు ఉంటాయనే వివరాలను గురించి నేర్పుతారు.

నేను డిజిట్​ ఇన్సూరెన్స్​తో పార్ట్​నర్​ అయితే ఎటువంటి సపోర్ట్​ సేవలు నాకు లభిస్తాయి?

మీరు డిజిట్​ ప్లాట్​ఫాం మీద అమ్మే పాలసీల గురించి మీకు ఏవైనా సందేహాలుంటే డిజిట్ రిలేషన్​షిప్​ మేనేజర్​ మీకు సాయం చేస్తారు. ప్రతి ఒక్క డిజిట్​ పార్ట్​నర్​కి రిలేషన్​షిప్​ మేనేజర్​ని కేటాయిస్తారు. మీకు ఎటువంటి సందేహాలున్నా వారు నివృత్తి చేస్తారు.

partner@godigit.com మెయిల్​కు తమ సందేహాలను పంపడం ద్వారా కూడా ఏజెంట్స్​ మరింత సమాచారం పొందొచ్చు.

పీవోఎస్‌పీ (POSP) సర్టిఫికేషన్​ పూర్తయిన తర్వాత నేను నా పరిజ్ఞానాన్ని ఎలా పెంచుకోవచ్చు?

మా పీవోఎస్‌పీ (POSP) లు సర్టిఫికేషన్​ పొందిన తర్వాత మరొక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అది మీరు ఇన్సూరెన్స్​ పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ అమ్మకాలను మెరుగు పరుచుకునేందుకు, మీ సర్వీస్​ నైపుణ్యాలను పెంచుకునేందుకు సహాయపడుతుంది. ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా మీరు ఈ కింది అంశాలను నేర్చుకోవచ్చు:

  • సంక్లిష్టమైన ఇన్సూరెన్స్​ కేసులను పరిష్కరించేందుకు అధునాతన ఇన్సూరెన్స్‌ పరిజ్ఞానం
  • కొత్తగా వచ్చిన ఇన్సూరెన్స్​ ప్రొడక్టుల గురించి, వాటి వలన కలిగే మేలు గురించి.
  • వివిధ రకాల అమ్మకపు చిట్కాలను ఎంజాయ్​ చేస్తూనే నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ చిట్కాల వలన మీ అమ్మకాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది.

For list of Corporate & Individual Agents,  click here.