ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసి ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి
Instant Policy, No Medical Check-ups

ఇండియా నుంచి వెళ్లే వారికి ఆస్ట్రేలియా టూరిస్ట్ వీసా

ఇండియా నుంచి వెళ్లే వారి కోసం ఆస్ట్రేలియా టూరిస్ట్ వీసాకు సంబంధించిన మొత్తం సమాచారం

ఆస్ట్రేలియా పిలుస్తోంది!

ఆస్ట్రేలియాలో ఉన్న అద్భుత ప్రదేశాలను చూసేందుకు మీరు ఉత్సాహంగా ఉన్నారని మాకు తెలుసు. అక్కడ ఉన్న బీచ్ లు, ఎడారులు, ఒక్కటేమిటి అన్నీ ఎంతో అందంగా ఉంటాయి. స్వేచ్ఛగా, ఆనందంగా విహరించేందుకు ఇది ఒక అందమైన ప్రదేశం. అక్కడి అందమైన బీచ్ లలో తిరుగుతున్నామని కలకనే ముందు మీ వీసా ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయని నిర్థారించుకోండి. మీరు ట్రావెల్ చేసేందుకు (ఎగిరేందుకు) సిద్ధంగా ఉన్నారని నిర్థారించుకోండి.

మేము ఒక సెకనులో వాటి గురించి మీకు తెలియజేస్తాం!

ఇండియన్లు ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు టూరిస్ట్ వీసా అవసరమా?

అవును. భారత పౌరులు ఆస్ట్రేలియా వెళ్లేందుకు వీసా కావాలి. మీరు ట్రావెల్ చేయాలని అనుకునే తేదీ కంటే ముందుగానే మీ వీసా అప్లికేషన్ ను సమర్పించాలని, మీ వీసా ఖరారు అయిన తర్వాత అన్ని ప్రయాణ ఏర్పాట్లను చేసుకోవాలని సిఫారసు చేయబడింది.

భారతీయ పౌరులకు ఆస్ట్రేలియాలో వీసా ఆన్ అరైవల్ సదుపాయం ఉందా?

లేదు. భారతీయ పౌరులకు ఆస్ట్రేలియాలో వీసా ఆన్ అరైవల్ సదుపాయం అందుబాటులో లేదు.

భారతీయ పౌరులకు ఆస్ట్రేలియా వీసా ఫీజు

వీసా సబ్ క్లాస్ / నోట్ బేస్ చార్జ్
సందర్శకుల సబ్ క్లాస్ 600- అన్ని స్ట్రీమ్లు తరచూ ట్రావెల్ చేసే వారికి తప్ప / 1a మరియు 1b 145 AUD
సందర్శకుల సబ్ క్లాస్ 600 - తరచూ ట్రావెల్ చేసే వారి కోసం 1,020 AUD
ఈ-విజిటర్ (సబ్‌క్లాస్ 651) Nil
ఎలక్ట్రానిక్ ట్రావెల్ అథారిటీ/ 1c Nil

ఆస్ట్రేలియన్ ప్రభుత్వం మీద ఆధారపడి వీసా చార్జీలు మరియు ఇతర చార్జీలు మారుతూనే ఉంటాయి. 

నోట్:

  • 1a విజిటర్ వీసా సబ్‌క్లాస్ 600 5 స్ట్రీమ్ లను కలిగి ఉంటుంది.

  • 1b వీసా అనేది ఎవరైతే విదేశాలకు ప్రాతినిథ్యం వహించే ప్రతినిధులు ఉంటారో వారి కోసం. వీసా చార్జీలు ఏమీ ఉండవు. కానీ సపోర్టింగ్ సాక్ష్యాలు కావాలి.

  • 1c ETA (ఎలక్ట్రానిక్ ట్రావెల్ అథారిటీ) అప్లికేషన్లు ఆన్ లైన్ లో ప్రాసెస్ చేయబడతాయి. కావున వాటికి సర్వీస్ చార్జీలు విధించబడతాయి.

ఇండియాలో ఉన్న వారు ఆస్ట్రేలియా టూరిస్ట్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఆస్ట్రేలియా టూరిస్ట్ వీసా కోసం అప్లై చేయడం చాలా సులభంగా ఉంటుంది. ఆస్ట్రేలియా టూరిస్ట్ వీసా విజిటర్ వీసా (సబ్‌క్లాస్ 600) కిందకు వస్తుంది. ఇది టూరిజం కోసం, దానిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మంజూరు చేయబడిన షార్ట్ టర్మ్ పర్మిట్. ఇందుకు సంబంధించిన మొత్తం ప్రక్రియ ఆన్ లైన్ లో ఉంటుంది. కావున మీరు హార్డ్ కాపీలతో ఎంబసీని సందర్శించాల్సిన అవసరం లేదు. 

మీరు ఆస్ట్రేలియా ఈటీఏ అప్లికేషన్ ఆన్ లైన్ ఫారాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకునేందుకు www.australiae-visa.com ను సందర్శించవచ్చు. మీరు అప్లికేషన్ ఫారాన్ని సరైన వివరాలతో నింపి అవసరం అయిన వీసా ఫీజులు చెల్లించి సబ్మిట్ చేయాలి. మీరు ఆస్ట్రేలియా ఈటీఏ వీసాను 2-3 రోజులలోపు అందుకుంటారు. ఫారంలో మీరు పేర్కొన్న ఈ-మెయిల్‌కు వివరాలు పంపబడతాయి.

ఆస్ట్రేలియన్ టూరిస్ట్ వీసాకు భౌతిక రూపంలో ఉండదు. కావున మీ వీసా వివరాలతో కూడిన వివరాలను ఈ మెయిల్ ద్వారా పొందుతారని దయచేసి గమనించండి. మీ వీసా నేరుగా పాస్ పోర్ట్ నెంబర్ కి లింక్ చేయబడుతుంది.

అప్లికేషన్ ప్రక్రియలో మీరు ఎటువంటి పొరపాట్లు చేయలేదని లేదా నకిలీ పత్రాలు సమర్పించలేదని నిర్థారించుకోవాలి. ఇది వీసా తిరస్కరణకు దారి తీయొచ్చు. మీ వీసా విజయవంతంగా ప్రాసెస్ చేయబడిందని నిర్థారించుకునేందుకు వీసా కన్సల్ట్ వారిని సంప్రదించాలని సూచించబడింది. 

ఆస్ట్రేలియా టూరిస్ట్ వీసా కోసం కావాల్సిన పత్రాలు

  • ఒరిజినల్ పాస్ పోర్ట్, మనం ట్రావెల్ చేసే తేదీ నుంచి 6 నెలల వ్యాలిడిటీ ఉన్నది

  • వీసా దరఖాస్తు ఫారం

  • 2 ఫొటోలు: 35 X 45mm, వైట్ బ్యాక్‌గ్రౌండ్, మ్యాట్ ఫినిష్ పేస్ సైజ్ 80%

  • అప్లికేషన్ వివరాలు, పాస్ పోర్ట్ వివరాలు, ట్రావెల్ వివరాలు, ఖర్చులను ఎవరు భరిస్తారనే వివరాలతో కూడి ఉన్న లెటర్

  • పాన్ కార్డు లేదా ఆధార్ కార్డు కాపీ

  • ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్

  • ఎంప్లాయ్‌మెంట్ ప్రూఫ్ మరియు పే స్లిప్స్

  • ఆదాయ పన్ను రిటర్న్స్

  • హోటల్ బుకింగ్స్ లేదా మీరు అక్కడ ఉండే సమయం మొత్తానికి వసతి

  • తిరిగి వచ్చేందుకు ఫ్లైట్ రిజర్వేషన్ లేదా రౌండ్ టికెట్

  • ఒకవేళ పెళ్లయితే మ్యారేజ్ సర్టిఫికెట్

ఆస్ట్రేలియా టూరిస్ట్ వీసా ప్రక్రియ సమయం

సబ్‌క్లాస్ 600 విజిటర్ వీసా టూరిస్ట్ స్ట్రీమ్ కింద ఆస్ట్రేలియా టూరిస్ట్ వీసా ప్రక్రియ సమయం 48 గంటల నుంచి 20 రోజుల వరకు ఉంటుంది. అయినప్పటికీ ఇది పీక్ ప్రాసెసింగ్ పీరియడ్ మరియు అన్ని రకాల సపోర్టింగ్ పత్రాలతో అప్లికేషన్ ను పూర్తి చేశారా? అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది.

నేను ఆస్ట్రేలియా వెళ్తుంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ ను ఎందుకు కొనుగోలు చేయాలి?

కేవలం ఆస్ట్రేలియా సందర్శనకు మాత్రమే కాకుండా మీరు ఏ ఇతర ప్రాంతాన్ని సందర్శించినా కానీ మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ అవసరం. ట్రావెల్ చేసేందుకు ఆస్ట్రేలియా అనేది ఒక అందమైన ప్రదేశం. కానీ మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా సరే అనుకోని పరిస్థితుల్లో చిక్కుకోవచ్చు.

లగేజీ దొంగతనం, నగదు పోగొట్టుకోవడం, పాస్ పోర్ట్ నష్టం, మెడికల్ ఎమర్జెన్సీలు వంటి ఇతర సమస్యలు పర్యాటకులకు ఎక్కడైనా ఎదురుకావొచ్చు. ఇటువంటి వాటి నుంచి మీరు రక్షణ పొందేందుకు ట్రావెల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం మంచిది.

మీరు ఆస్ట్రేలియాకు ప్రయాణిస్తున్నపుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ ను కలిగి ఉండాలని సూచించే ప్రధాన కారకాల్లో ఒకటి మెడికల్ ఖర్చులు. ఆస్ట్రేలియాలో మెడికల్ ఖర్చులు చాలా ఖర్చుతో కూడుకుని ఉంటాయి. ఒక వేళ మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ లేకపోతే చాలా కష్టం అవుతుంది. అటువంటి అన్ని పరిస్థితుల్లో ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మీకు భద్రతను అందిస్తుంది:

ఆస్ట్రేలియా ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా మేము అందించే ప్రయోజనాలు ఏంటో కింద ఓ సారి తనిఖీ చేయండి:

భారతీయ పాస్ పోర్ట్ హోల్డర్లకు ఆస్ట్రేలియా టూరిస్ట్ వీసా గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

పీక్ సీజన్ (రద్దీగా ఉండే సీజన్) లలో ఆస్ట్రేలియన్ వీసా కోసం ప్రాసెసింగ్ సమయం ఎంత పడుతుంది?

ప్రాసెసింగ్ సమయం 48 గంటల నుంచి 20 రోజుల వరకు ఉంటుంది. పీక్ సీజన్లలో పర్యాటకులు పోటెత్తినపుడు ప్రక్రియ సమయం ఎక్కువ పడుతుంది.

తరచుగా వెళ్లే విజిటర్స్ వేగవంతమైన ప్రక్రియ కోసం ఏవైనా నిబంధనలను కలిగి ఉన్నారా?

తరచూ ట్రావెల్ చేసే ప్రయాణికులు విజిటర్ సబ్ క్లాస్ 600 వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది స్టాండర్డ్ వీసాల కంటే మరింత ఖర్చుతో కూడుకున్నది. అయితే ప్రాసెస్ చేసేందుకు తక్కువ సమయం పడుతోంది.

భారతీయుల కోసం ఆస్ట్రేలియా ఆన్ అరైవల్ వీసాలను మంజూరు చేస్తోందా?

లేదు. భారతీయులకు వీసా ఆన్ అరైవల్ సదుపాయం అందుబాటులో లేదు. మీరు దేశాన్ని సందర్శించేందుకు గల కారణంతో సంబంధం లేకుండా ముందుగానే స్టాండర్డ్ ఆస్ట్రేలియన్ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలి.

వీసా దరఖాస్తు ప్రక్రియలో మీ పాస్ పోర్ట్ అనేది ఎంత కాలం చెల్లుబాటు ఉండాలి?

మీరు వీసా కోసం దరఖాస్తు చేసినపుడు మీ పాస్ పోర్ట్ కు ప్రయాణ వ్యవధితో పాటు కనీసం 6 నెలల గడువు ఉందని నిర్థారించుకోండి.

వీసా పాస్ పోర్ట్ నెంబర్ కి లింక్ చేయబడుతుందా?

అన్ని రకాల ఆస్ట్రేలియన్ వీసాలు మీ పాస్ పోర్ట్ నెంబర్ తో ఎలక్ట్రానిక్ గా లింక్ చేయబడతాయి.