Select Number of Travellers
మోటార్
హెల్త్
మోటార్
హెల్త్
More Products
మోటార్
హెల్త్
సపోర్ట్
closeమా వాట్సాప్ నంబర్ కాల్స్ కోసం ఉపయోగించబడదు. ఇది చాట్ మాత్రమే నంబర్.
24x7
Missed Call Facility
Affordable
Premium
1-Day Adventure
Activities Covered
Terms and conditions apply*
ప్రయాణం. మనలో చాలా మంది దీని కోసం బ్రతుకుతాము. అన్ని బుకింగ్స్ మరియు ప్రయాణ ప్రణాళికలను మనం నెలల ముందే నుంచే సిద్ధం చేయడం మొదలుపెడతాం. అయితే మనం ఏదైనా వేరే దేశానికి వెళ్లేటపుడు తప్పకుండా తీసుకెళ్లాల్సిన వీసా గురించి చివరి క్షణం వరకూ మరిచిపోతాం.
ఫ్లైట్ లో వెళ్తే కొన్ని గంటల్లో చేరుకునే యూకే భారతీయుల ఫేవరేట్ ట్రావెల్ డెస్టినేషన్ గా ఉంది. అక్కడ ఉన్న స్టూడెంట్స్ ను లేదా కుటుంబ స్నేహితులను లేదా లండన్ నగరం యొక్క అందాలను చూసేందుకు మరియు స్కాట్లాండ్ మరియు వేల్స్ లో అందమైన ప్రదేశాలను చూసేందుకు అంతా వెళ్తారు. మీరు యూకేకి వెళ్లాలని ప్లాన్ వెళ్తుంటే ఈ కథనం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఇండియన్లు యూకే టూరిస్ట్ వీసాను ఎలా పొందాలో సమగ్రమైన సమాచారాన్ని అందిస్తుంది.
మీరు అమెరికన్, కెనడియన్, ఆస్ట్రేలియన్ పాస్ పోర్ట్ హోల్డర్ అయితే తప్ప, యూకేకు ట్రావెల్ చేసేందుకు టూరిస్ట్ వీసా కోసం అప్లై చేసుకోవాలి. మీరేం చింతించకండి. ఇండియా నుంచి స్టాండర్డ్ యూకే విజిటర్ వీసాను పొందేందుకు రెండు వారాల సమయం పడుతుంది. బయట ఉన్న పుకార్ల మాదిరిగా దానిని పొందడం కష్టమైన పనేం కాదు. మీరు ఇండియా నుంచి యూకే వీసాకు అప్లై చేసినప్పుడు వారు అడిగిన వివరాలన్నింటినీ సమర్పించారని నిర్దారించుకోండి.
లేదు. యూకేకు ట్రావెల్ చేసే ఇండియన్ పాస్ పోర్ట్ హోల్డర్లకు వీసా ఆన్ అరైవల్ ప్రోగ్రాం లేదు. అందుకోసం స్టాండర్డ్ యూకే టూరిస్ట్ వీసా కోసం అప్లై చేసుకోవడం ఒక్కటే మార్గం.
ఇండియా నుంచి యూకే టూరిస్ట్ వీసా కోసం ప్రాసెసింగ్ ఫీజు అనేది సుమారు USD 97.89 అవుతుంది. (79.06 పౌండ్లు). మీరు మీ ప్రాసెస్ ను వేగవంతం చేసేందుకు లేదా సులభం చేసే వీసా ఏజెంట్ ను వాడితే ఏజెంట్ అదనంగా కమిషన్ అమౌంట్ వసూలు చేస్తాడు.
మీ పాస్ పోర్ట్ 6 నెలల కంటే ఎక్కువ కాలం చెల్లుబాటు అవుతుందని నిర్దారించుకోండి. అంతే కాకుండా వీసాలో కనీసం రెండు ఖాళీ పేజీలు ఉన్నాయో లేదో చూసుకోండి.
మీరు ట్రావెల్ చేసేందుకు తగినన్ని నిధులు ఉన్నాయని నిరూపించేందుకు కనీసం చివరి మూడు నెలల బ్యాంక్ స్టేట్మెంట్లను చూపెట్టండి.
రెండు 45mm x 35mm (పాస్ పోర్ట్ -సైజ్) ఫొటోలు.
అప్లికేషన్ ఫారం నింపండి - gov. uk వెబ్ సైట్ ను సందర్శించి యూకే విజిట్/టూరిస్ట్ వీసా అప్లికేషన్ ను పూరించండి. మీ అన్ని వివరాలు కరెక్టుగానే ఉన్నాయని నిర్దారించుకోండి. మీరు ఏదైనా సమాచారం తప్పుగా పేర్కొంటే మీ వీసా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. మీ వీసా ప్రాసెసింగ్ లో మీకు చిన్న సహాయం అవసరం అయినా లేక మీ ప్రాసెస్ త్వరగా ముగియాలని మీరు అనుకున్నా కానీ మీరు అదనపు ఫీజు చెల్లించి వీసా ఏజెంట్ ను సంప్రదించొచ్చు.
యూకే వీసా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించండి - మీ ఫారం ఫిలప్ చేయడం పూర్తయిన తర్వాత చెల్లుబాటయ్యే డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా యూకే వీసా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించండి. 6 నెలల వరకు స్టాండర్డ్ యూకే విజిటర్ వీసా కోసం 123 (యూఎస్ డాలర్లు) ఖర్చు అవుతుంది. (100 పౌండ్లు).
మీ ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ను బుక్ చేసుకోండి - మీ పేమెంట్ పూర్తయిన తర్వాత మీ ఇంటర్వ్యూ డేట్ ని బుక్ చేసుకోమని మిమ్మల్ని అడుగుతారు. మీ అపాయింట్మెంట్ తేదీ రోజు మీరు అందుబాటులో ఉంటారని నిర్దారించుకోండి. ఒక వేళ మీరు కనుక మీ యూకే వీసా అపాయింట్మెంట్ తేదీని రీషెడ్యూల్ చేసుకోవాలని అనుకుంటే మీరు వీసా అప్లికేషన్ ను మరలా పూరించాల్సి ఉంటుంది!
యూకే టూరిస్ట్ వీసా ప్రాసెసింగ్ సమయం - ఇండియా నుంచి స్టాండర్డ్ యూకే టూరిస్ట్ వీసాను ప్రాసెస్ చేసేందుకు కనీసం 2 వారాల సమయం పడుతుంది. కానీ ముందుజాగ్రత్తగా కనీసం 3 వారాల ముందు అప్లై చేసుకోవడం మంచిది.
యూకే కు ప్రయాణం చేయడం ఏం ఆషామాషీ వ్యవహారం కాదు. అంతే కాదు మీరు ప్రపంచకప్ కోసం అక్కడికి ప్రయాణం చేస్తుంటే అక్కడి స్టేడియం టికెట్లు ఎంత భారీ ధర పలుకుతాయో మనందరికీ తెలుసు! మీరు చివరగా కోరుకునేది ఏమిటంటే ముందుగా ప్రణాళిక వేసుకోని విషయాలకు తక్కువ ఖర్చు చేయడం.
అది మాత్రమే కాకుండా నేటి రోజుల్లో ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఖరీదైనది కాదు. మీరు ట్రావెల్ చేసేటప్పుడు అనుకోకుండా వచ్చే ప్రణాళిక లేని ఖర్చులను ట్రావెల్ ఇన్సూరెన్స్ భర్తీ చేస్తుంది. ఉదాహరణకు వన్ వీక్ (వారం రోజుల) ట్రిప్ కోసం మీరు డిజిట్ అందించే యూకే ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అది మీరు రూ. 225 (GBP 2.25) (GST లేకుండా) కంటే తక్కువ ఖర్చుతో వస్తుంది. ఇది మీ ట్రిప్ లో మీరు భోజనం కోసం ఖర్చు చేసే దానికంటే తక్కువగా ఉంటుంది!
ఫ్లైట్ ఆలస్యం వంటి చిన్న అవాంతరాలకు కూడా ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది డబ్బు మరియు సమయంతో మీకు తిరిగి చెల్లిస్తుంది. లేకపోతే మీరు విమానాశ్రయం వద్దే వేచి ఉండవలసి వస్తుంది.
మీరు ప్రపంచకప్ సమయంలో వెళ్తున్నట్లయితే దేశం మొత్తం టూరిస్ట్ లతో నిండిపోతుంది. చాలా మంది పర్యాటకులు నేరాలకు బలవుతుంటారు! కానీ మీరు చింతించకండి. మీకు కనుక ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటే ఒక వేళ దొంగతనం జరిగినా లేక పాస్ పోర్ట్ పోగొట్టుకున్నా లేక లీగల్ బాండ్స్ విషయంలో కూడా మీరు కవర్ చేయబడతారు.
హాలీడే ఎంజాయ్ చేయడానికని మీరు అక్కడికి వెళ్లినప్పుడు దురదృష్టవశాత్తు అనుకోకుండా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే అయ్యే ఖర్చులను మొత్తం మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ చూసుకుంటుంది.
నేడు మార్కెట్లో లభించే ట్రావెల్ ఇన్సూరెన్స్ లు విదేశాల్లో ఉండే సాహసక్రీడలను కూడా కవర్ చేస్తాయి. కావున మీరు ట్రిప్ లో ఉన్నప్పుడు ప్రతి విషయం నుంచి రక్షించబడతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. 😊 మీరు ఇండియా నుంచి యూకేకు టూరిస్ట్ వీసా కోసం అప్లై చేసినప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది అదనంగా బలం చేకూరుస్తుంది.
మరింత తెలుసుకోండి:
మీరు యూకే వీసా ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేస్తారని, పాస్ పోర్ట్ మీద మరో స్టాంప్ తో మీరు అందమైన ప్రదేశాన్ని చూసేందుకు వెళ్తారని మేము ఆశిస్తున్నాం. మీ హాలీడే ట్రిప్ బాగా సాగాలని, అత్యుత్తమ జట్టే ప్రపంచకప్ గెలవాలని మేము ఆశిస్తున్నాం! 😉
అవును. మీరు యునైటెడ్ కింగ్ డమ్ వీసా కోసం అప్లై చేసుకున్నపుడు మీ పాస్ పోర్ట్ ]కనీసం 6 నెలల పాటు చెల్లుబాటులో ఉండాలి. పాస్ పోర్ట్ గడువు అనేది త్వరగా ముగిసిపోతే మీరు తిరస్కరణను ఎదుర్కోవచ్చు.
అవును. మీరు యునైటెడ్ కింగ్ డమ్ వీసా కోసం అప్లై చేసుకున్నపుడు మీ పాస్ పోర్ట్ ]కనీసం 6 నెలల పాటు చెల్లుబాటులో ఉండాలి. పాస్ పోర్ట్ గడువు అనేది త్వరగా ముగిసిపోతే మీరు తిరస్కరణను ఎదుర్కోవచ్చు.
ఒక వేళ మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయినా కానీ అప్లికేషన్ ఫీజు రీఫండ్ చేసే ఆప్షన్ ఇక్కడ అందుబాటులో లేదు. అటువంటి పరిస్థితిని నివారించేందుకు అప్లై చేసే ముందు ప్రతి పాయింట్ ను క్షుణ్ణంగా చదవడం మంచిది.
ఒక వేళ మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయినా కానీ అప్లికేషన్ ఫీజు రీఫండ్ చేసే ఆప్షన్ ఇక్కడ అందుబాటులో లేదు. అటువంటి పరిస్థితిని నివారించేందుకు అప్లై చేసే ముందు ప్రతి పాయింట్ ను క్షుణ్ణంగా చదవడం మంచిది.
లేదు. యునైటెడ్ కింగ్ డమ్ అటువంటి సదుపాయాన్ని అందించడం లేదు. మీరు చాలా కాలం ముందుగానే సరైన డాక్యుమెంటేషన్ తో అప్లై చేసుకోవడం మంచిది.
లేదు. యునైటెడ్ కింగ్ డమ్ అటువంటి సదుపాయాన్ని అందించడం లేదు. మీరు చాలా కాలం ముందుగానే సరైన డాక్యుమెంటేషన్ తో అప్లై చేసుకోవడం మంచిది.
డాక్యుమెంటేషన్లో భాగంగా మీరు గత 3 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లను అందించాలి. అవి మీ ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబిస్తాయి.
డాక్యుమెంటేషన్లో భాగంగా మీరు గత 3 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లను అందించాలి. అవి మీ ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబిస్తాయి.
అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు మైనర్ తరఫున తల్లిదండ్రులు లేదా చట్టపరమైన గార్డియన్స్ (సంరక్షకులు) కానీ సంతకం చేయాలి. అప్లై చేసుకునేటప్పుడు మైనర్ పాస్ పోర్ట్ కాపీ మరియు తల్లిదండ్రులు/సంరక్షకుల నుంచి తీసుకొచ్చిన సమ్మతి పత్రం జతచేయాలి.
అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు మైనర్ తరఫున తల్లిదండ్రులు లేదా చట్టపరమైన గార్డియన్స్ (సంరక్షకులు) కానీ సంతకం చేయాలి. అప్లై చేసుకునేటప్పుడు మైనర్ పాస్ పోర్ట్ కాపీ మరియు తల్లిదండ్రులు/సంరక్షకుల నుంచి తీసుకొచ్చిన సమ్మతి పత్రం జతచేయాలి.
Please try one more time!
Travel Insurance for Popular Destinations from India
Get Visa for Popular Countries from India
నిరాకరణ -
మీ పాలసీ మీ పాలసీ షెడ్యూల్ మరియు పాలసీ పదాలలో పేర్కొన్న నిబంధనలు మరియు షరతులకు లోబడి ఉంటుంది. దయచేసి పత్రాలను జాగ్రత్తగా పరిశీలించండి.
దేశాలు, వీసా ఫీజులు మరియు ఇతర వాటి గురించి ఇక్కడ పేర్కొన్న సమాచారం వివిధ మూలాల నుండి తీసుకోబడింది. డిజిట్ ఇన్సూరెన్స్ ఇక్కడ దేనినీ ప్రచారం చేయడం లేదా సిఫార్సు చేయడం లేదు. దయచేసి మీరు మీ టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు, వీసా కోసం దరఖాస్తు చేసుకునే ముందు, ట్రావెల్ పాలసీని కొనుగోలు చేసే ముందు లేదా మరేదైనా నిర్ణయం తీసుకునే ముందు దాన్ని ధృవీకరించండి.
ఇతర ముఖ్యమైన కథనాలు
Get 10+ Exclusive Features only on Digit App
closeAuthor: Team Digit
Last updated: 28-08-2024
CIN: U66010PN2016PLC167410, IRDAI Reg. No. 158.
గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (గతంలో ఒబెన్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ అని పిలుస్తారు) - రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ - 1 నుండి 6 అంతస్తులు, అనంత వన్ (ఎఆర్ (AR) వన్), ప్రైడ్ హోటల్ లేన్, నర్వీర్ తానాజీ వాడి, సిటీ సర్వే నెం.1579, శివాజీ నగర్, పూణే -411005, మహారాష్ట్ర | కార్పొరేట్ ఆఫీస్ చిరునామా - అట్లాంటిస్, 95, 4వ బి క్రాస్ రోడ్, కోరమంగళ ఇండస్ట్రియల్ లేఅవుట్, 5వ బ్లాక్, బెంగుళూరు-560095, కర్ణాటక | పైన ప్రదర్శించబడిన, గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ యొక్క ట్రేడ్ లోగో, గో డిజిట్ ఇన్ఫోవర్క్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందినది మరియు లైసెన్స్ క్రింద, గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ అందించింది మరియు ఉపయోగించబడుతుంది.