ఆన్​లైన్​లో మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ రెన్యూవల్ చేయండి.

మీరు క్వారంటైన్​లో ఉన్నా కూడా మీ బైక్​ లేదా కార్ ఇన్సూరెన్స్​ను రెన్యూవల్ చేసుకోండి.

కరోనా మహమ్మారి వలన ప్రస్తుతం చాలా మంది ఎటువంటి పని లేకుండా ఇంట్లోనే కూర్చుంటున్నారు. అందువలన వారి వాహనాలు మరింత డ్యామేజ్ అవుతున్నాయి. దుమ్ముపట్టి పోతున్నాయి.

ఇటువంటి సందర్భంలో వాహనం ఉపయోగించాల్సి వస్తే ఎటువంటి బీమా అవసరం లేదని అది పాడైపోయిందని మీరు చెప్పవచ్చు.

మీరు తప్పుగా ఆలోచించి ఉంటారు. కార్లు లేదా బైక్స్ గ్యారేజీలో పార్క్ చేసి ఉంచడం వలన అనేక సమస్యలు ఎదురవుతాయి. అందుకోసమే మీరు కారు లేదా బైక్ ఇన్సూరెన్స్​ను గడువుకు ముందే రెన్యూవల్ చేసుకోవాలి.

మరింత తెలుసుకోండి:

లాక్​డౌన్ వలన మీ వాహనానికి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది?

లాక్​డౌన్​లో మీరు ఎటువంటి పని చేయకుండా ఉన్నప్పటికీ మీ బైక్ పాడయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడో శుభవార్త ఉంది. ఆ నష్టాలు ఎక్కువ భాగం మోటార్​ ఇన్సూరెన్స్​ పాలసీలో కవర్ చేయబడతాయి.

మీరు సరైన సమయంలో పాలసీని రెన్యూవల్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే బీమా కంపెనీ మీ నష్టాలను కవర్ చేస్తుంది. లేదంటే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇక్కడ ఉంది.

దొంగతనం

భారతదేశంలో వాహనాలు దొంగతనానికి గురవడం అనేది పెద్ద విషయమేమీ కాదు. ఇది చాలా సర్వసాధారణం. ఒకరోజు తెల్లవారు జామున నిద్రలేచిన తర్వాత రాత్రి పార్క్ చేసిన స్థలంలో మీ వాహనం కనిపించకపోతే.. ఎలా ఉంటుందో ఆలోచించుకోండి

విధ్వంసం

కావాలని చేయకపోయినా అనుకోకుండా అయిన మీ వాహనం విధ్వంసాల వలన పాడైపోయే ప్రమాదం ఉంది. ఉదాహరణకు.. పిల్లలు వాహనానికి దగ్గర్లో బాల్​తో ఆడుకుంటూ ఉంటే.. అలా జరిగిన డ్యామేజీలు చాలా ఖర్చుతో కూడుకుని ఉంటాయి.

ప్రకృతి విపత్తులు

కొండ చరియలు విరిగి పడటం, వరదలు, భూకంపాలు సహజంగా సంభవిస్తాయి. ఇవి మీ వాహనానికి తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉంది.

మీరు అటువంటి ప్రాంతాల్లో నివసించకపోయినా పడిపోతున్న చెట్టుకొమ్మ వంటిది కూడా మీ వాహనాన్ని డ్యామేజ్ చేయొచ్చు.

కార్, బైక్ ఇన్సూరెన్స్​ను ఎందుకు గడువుకు ముందే రెన్యూవల్ చేసుకోవాలి?

మేము పేర్కొన్న విధంగా మీరు కనుక సకాలంలో బీమా పాలసీని రెన్యూవల్ చేసుకోకపోతే మీ బీమా సంస్థ మీ క్లెయిమ్​ను తీసుకోకపోవచ్చు. అటువంటి సందర్భంలో జరిగిన వాహన నష్టాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

క్లెయిమ్స్​ రిజెక్ట్ కాకుండా ఉండేందుకు

మీరు ఏదైనా క్లెయిమ్ చేసినపుడు ఇన్సూరెన్స్ కంపెనీ చూసే మొదటి విషయం మీ పాలసీ గడువు. ఒకవేళ మీ పాలసీ గడువు కనుక ముగిసిపోతే ఆ క్లెయిమ్​ను వెంటనే తిరస్కరిస్తుంది.

మీ నో క్లెయిమ్ బోనస్ సురక్షితంగా ఉంటుంది

ఎటువంటి క్లెయిములు చేయని సంవత్సరాలకు బీమా కంపెనీలు బోనస్​లు అందిస్తాయి. దీనిని నో క్లెయిమ్ బోనస్ అని అంటారు. కానీ ఈ ప్రయోజనాన్ని మీరు పొందాలనుకుంటే గడువుకు ముందే మీ పాలసీని రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీరు మీ నో క్లెయిమ్ బోనస్ (NCB) ప్రయోజనాన్ని కోల్పోతారు. ప్రీమియం మీద వచ్చే డిస్కౌంట్ కూడా పోతుంది.

ఎటువంటి తనిఖీ అవసరం లేదు

మీరు మీ పాత పాలసీని గడువులోగా రెన్యూవల్ చేస్తే ఆ ప్రక్రియ నిమిషాల్లో పూర్తవుతుంది. కానీ ఒకవేళ మీరు గడువు ముగిసిన తర్వాత మోటార్ ఇన్సూరెన్స్​ను రెన్యూవల్ చేయాలని భావించినపుడు బీమా కంపెనీ వారు మీ వాహనాన్ని తనిఖీ చేసేందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మిమ్మల్ని ఆర్థిక ఖర్చులకు గురి చేస్తుంది.

ప్రీమియంలో ఎటువంటి పెంపు ఉండదు

మీరు మీ పాలసీని గడువు లోపల రెన్యూవల్ చేయకపోతే మీరు కొత్త బీమా పాలసీని తీసుకోవాల్సి ఉంటుంది. ఉన్న పాలసీని రెన్యూవల్ చేయడం కంటే ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది.

తరుచూ అడిగే ప్రశ్నలు

డిజిట్​తో మోటార్ ఇన్సూరెన్స్ ఎలా రెన్యూవల్ చేసుకోవాలి?

ఇప్పటికే మీ వద్ద ఉన్న కార్ ఇన్సూరెన్స్​ను డిజిట్​తో కలిసి రెన్యూవల్ చేయడం చాలా సులభం. ఇందుకోసం స్మార్ట్​ఫోన్ ఆధారిత ప్రక్రియ ఉంది.

మీ పాలసీని రెన్యూవల్ చేసుకునేందుకు అనే బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. లేదా కార్​ నంబర్​ను నమోదు చేస్తే సరి. అప్పుడు మీ ఫోన్​కు ఒక వన్​ టైమ్ పాస్​వర్డ్ వస్తుంది. ఆ తర్వాత మీరు కొనసాగించవచ్చు

మీ వెహికిల్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ కోసం డిజిట్​ను ఎందుకు ఎంచుకోవాలి?

మీ పాత కార్​ ఇన్సూరెన్స్​ మాతోనే ఉందా లేదా అనేది మాకు అనవసరం. కార్​ ఇన్సూరెన్స్​ రెన్యూవల్​ కోసం డిజిట్​ను ఎంచుకోవడం ఎంతో సులభం, ఇబ్బంది లేనిది, ఆన్​లైన్​లో కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతుంది.

లాక్​డౌన్ ముగిసిన తర్వాత నా కారు లేదా బైక్​కు ఎటువంటి సమస్యలు లేవని నేను ఎలా నిర్ధారించుకోవాలి?

ఇంజిన్​ను ప్రతీరోజు ఆన్​ చేయడం వలన మీ ఇంజిన్ పాడవకుండా ఉంటుంది. బ్యాటరీ చెడిపోకుండా ఉండేందుకు వారానికి కనీసం రెండుసార్లయినా ఇలా చేయాలి.

కరోనా లాక్​డౌన్ సమయంలో నా కారు ఇన్సూరెన్స్ ల్యాప్స్​ (ముగిసిపోతే) నేను ఏం చేయాలి?

కరోనా వైరస్ లాక్​డౌన్ సమయంలో మీ కారు లేదా బైక్ ఇన్సూరెన్స్ పాలసీ ల్యాప్స్ అయితే వెంటనే బీమా కంపెనీ కస్టమర్ కేర్​ను సంప్రదించడం ఉత్తమం. వారు మీకు రెన్యూవల్ ప్రక్రియ గురించి వివరిస్తారు. ఆన్​లైన్​లో రెన్యూవల్ తీసుకోవడం మంచిది. ఇది పూర్తిగా కాంటాక్ట్ అవసరం లేని ప్రక్రియ.