డిజిట్​ ఇన్సూరెన్స్​కు మారండి

భారతదేశంలో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు

Source: indiatimes

ఇండియాలో ఉన్న క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు వ్యక్తిగత లేదా వ్యాపారం యొక్క క్రెడిట్ యోగ్యత ను అంచనా వేస్తాయి. రుణాలు ఇచ్చే సంస్థలు లోన్ దరఖాస్తులను అప్రూవ్ చేయడం లేదా తిరస్కరించడం కోసం క్రెడిట్ రేటింగ్ అనేది చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. 

క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల గురించి మరింత తెలుసుకునేందుకు చదవండి!

క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అంటే ఏమిటి?

క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అనేది ఒక వ్యక్తి లేదా వ్యాపారం యొక్క ఆదాయం మరియు క్రెడిట్ లైన్స్‌ను బేస్ చేసుకుని క్రెడిట్ యోగ్యతను అంచనా వేస్తుంది. లోన్ తీసుకునే వారు తిరిగి ఎలా చెల్లిస్తారనే విషయం గురించి తెలుసుకునేందుకు రుణదాతలు క్రెడిట్ రేట్ లేదా స్కోరును ఉపయోగిస్తారు. ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) కింద వర్క్ చేస్తాయి. 1992 సెబీ చట్టం ప్రకారం నిబంధనలు ఉంటాయి.

తదుపరి సెగ్మెంట్‌ ఇండియాలోని టాప్ 7 క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల గురించి తప్పకుండా చర్చిస్తుంది.

భారతదేశంలోని టాప్ 7 రేటింగ్ ఏజెన్సీలు ఏమిటి?

ఇండియాలో ఉత్తమమైన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఏది అని ఆలోచిస్తున్నారా? దేశంలో సెబీ వద్ద రిజిస్టర్ అయిన టాప్ 7 క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల గురించి వివరించాం. అవేంటంటే-

1. క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CRISIL)

దేశంలోనే అత్యంత పురాతనమైక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. ఇది 1987లో స్థాపించబడింది. ఇండియాతో పాటుగా ఇది యూఎస్ఏ, యూకే, చైనా, పోలండ్, అర్జెంటీనా మరియు హాంగ్‌కాంగ్ వంటి దేశాలలో పని చేస్తుంది. క్రిసిల్ అనేది ప్రాథమికంగా మార్కెట్లో ఉన్న బ్రాండ్ విలువ, మార్కెట్ షేర్, బోర్డు కెపాసిటీని బట్టి కమర్షియల్ సంస్థల యొక్క క్రెడిట్ యోగ్యతను లెక్కిస్తుంది. అది మాత్రమే కాకుండా 2016 నుంచి క్రిసిల్ అనేది మౌలిక సదుపాయాల రేటింగులోకి కూడా ప్రవేశించింది. 2017లో కేర్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలో 8.9 శాతం షేర్ ను పొందింది. 

అంతే కాకుండా స్థిర ఆదాయ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడి పనితీరును బెంచ్ మార్క్ చేసేందుకు 2018లో డాలర్ మరియు రూపాయి వెర్షన్ లో ఇది మొదటి సూచికను ప్రవేశపెట్టింది. క్రిసిల్ పోర్ట్‌ఫోలియో ఈ కింది వాటిని కలిగి ఉంటుంది:

  • యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ (యులిప్) ర్యాంకింగ్స్

  • మ్యూచువల్ ఫండ్ ర్యాంకింగ్

  • క్రిసిల్ కొలాషన్ మరియు ఇంకెన్నో

రిజిస్టర్డ్ చిరునామా మరియు సంప్రదింపు వివరాలు

క్రిసిల్ కొలాషన్ ఇండెక్స్ మరియు మరిన్ని

టెల్(ఫోన్): + 91 (22) 33423000

ఫ్యాక్స్: + 91 (22) 33423810

ఈ-మెయిల్: info@crisil.com

2. ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇన్ ఇండియా (ICRA)

1991లో స్థాపించబడిన ఐసీఆర్ఏ ఇది పారదర్శకమైన రేటింగ్ సిస్టాన్ని కలిగి ఉంటుంది.

  • కార్పోరేట్ గవర్నెన్స్ రేటింగ్

  • మ్యూచువల్ ఫండ్స్ రేటింగ్

  • పర్ఫామెన్స్ రేటింగ్

  • మార్కెట్ లింక్డ్ డిబెంచర్స్

  • ఎస్ఎంఈ 

  • ఎస్ఎంఈ

  • స్ట్రక్చర్డ్ ఫైనాన్స్ రేటింగ్ మరియు ఇంకెన్నో

2017కి ముందు ఐసీఆర్ఏ అనేది మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ మరియు ఇండియాకు చెందిన కొన్ని బ్యాంకింగ్ మరియు ఆర్థిక సంస్థలతో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. అంతే కాకుండా ఇది ప్రస్తుతం మూడీస్‌లో అతిపెద్ద షేర్ హోల్డర్. ప్రస్తుతం ఈ కంపెనీకి 4 సబ్సిడరీలు (ఉప కంపెనీలు) ఉన్నాయి, అవేంటంటే:

  • కన్సల్టింగ్ అండ్ ఎనలిటిక్స్

  • డేటా సర్వీసెస్ అండ్ కేపీవో

  • ఐసీఆర్ఏ లంక

  • ఐసీఆర్ఏ నేపాల్

రిజిస్టర్డ్ చిరునామా మరియు సంప్రదింపు వివరాలు

1105, కైలాష్ బిల్డింగ్, 11వ ఫ్లోర్ 26, కస్బూర్భా గాంధీ మార్గ్, ఢిల్లీ: 110 001

ఫోన్: + 91 (11) 23357940 – 50

ఫ్యాక్స్: + 91 (11) 23357014

ఈమెయిల్: info@icraindia.com

3. క్రెడిట్ ఎనాలసిస్ అండ్ రీసెర్చ్ లిమిటెడ్ (CARE)

1993లో కార్యకలాపాలు ప్రారంభించిన కేర్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీకి కోల్‌కతా, న్యూ ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, పూనే, అహ్మదాబాద్, జైపూర్, హైదరాబాద్, కోయంబత్తూర్ వంటి నగరాల్లో ఆఫీసులు ఉన్నాయి. ఇది రెండు రకాల బ్యాంక్ రుణ రేటింగ్‌లను అంచనా వేస్తుంది:

  • స్వల్పకాలిక రుణ సాధనం (తక్కువ కాలానికి తీసుకున్న రుణం)

  • దీర్ఘకాలిక రుణ సాధనం (ఎక్కువ కాలానికి తీసుకున్న రుణం)

పెట్టుబడిదారులు క్రెడిట్ రిస్క్ మరియు రిస్క్ రిటర్న్ ఎక్స్‌పెక్టేషన్స్‌కు సంబంధించి సమాచారంతో కూడిన ఎంపికలను సెలెక్ట్ చేసుకునేందుకు కేర్ క్రెడిట్ రేటింగ్ ను ఉపయోగిస్తారు. అది మాత్రమే కాకుండా పెట్టుబడి అవసరాలను తీర్చేందుకు కేర్ అనేది సంస్థలకు సహాయం చేస్తుంది. ఇది దీనిని కూడా లెక్కిస్తుంది:

  • ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్స్ (ఐపీవో)

  • రెన్యూవబుల్ (తిరిగి వాడుకునే) ఎనర్జీ సర్వీస్ కంపెనీస్ (రెస్కో)

  • రియల్ ఎస్టేట్

  • ఎనర్జీ సర్వీస్ కంపెనీస్ (ఎస్కో)

  • షిప్‌యార్డ్ మరియు ఇతర కంపెనీల ఆర్థిక అంచనాలు

కేర్ సేవలు వాల్యుయేషన్ సర్వీసెస్ కు ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఈక్విటీ వాల్యుయేషన్, రుణ సాధనాలు మరియు మార్కెట్ లింక్డ్ డిబెంచర్లను కూడా కలిగి ఉంటాయి. అంతే కాకుండా కేర్ పోర్చుగల్, మలేషియా, సౌతాఫ్రికా, బ్రెజిల్ వంటి 4 దేశాలతో కలిసి ఇంటర్నేషనల్ క్రెడిట్ రేటింగ్ కంపెనీ అయిన ఏఆర్సీ రేటింగ్స్ ను స్థాపించింది. 

రిజిస్టర్డ్ చిరునామా మరియు సంప్రదింపు వివరాలు

4వ ఫ్లోర్, గోద్రేజ్ కొలీజియం, సోమాలియా హాస్పిటల్ రోడ్, ఎవరార్డ్ నగర్ వెనకాల, తూర్పు ఎక్స్‌ప్రెస్ హైవేకు బయట, సియోన్ (E), ముంబై: 400 022

ఫోన్: + 91 (22) 566 02871/ 72/73

ఫ్యాక్స్: + 91 (22) 566 02876

ఈమెయిల్: care@careratings.com

4. ఆక్యుట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్

అక్యుట్ రేటింగ్ అండ్ రీసెర్చ్ అనేది గతంలో స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ రేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియాగా (ఎస్ఎంఈఆర్ఏ) పిలవబడేది. 2005లో పూర్తి స్థాయి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీగా రూపుదిద్దుకుంది. ఎంఎస్ఏంఈ (మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్) ల విశ్వసనీయతను అంచనా వేసేందుకు ఇది రెండు ప్రాథమిక కేటగిరీలను కలిగి ఉంటుంది:

  • బాండ్స్ రేటింగ్స్

  • ఎస్ఎంఈ రేటింగ్స్

అదనంగా 2012లో బ్యాంక్ లోన్ ల రేటింగ్స్ కోసం బేసెల్-II ప్రమాణాల ప్రకారం అక్వైట్ ఎక్స్‌టర్నల్ క్రెడిట్ అసెస్‌మెంట్‌గా (ఈసీఏఐ) ఆర్బీఐ ద్వారా గుర్తింపు పొందింది. 

రిజిస్టర్డ్ చిరునామా మరియు సంప్రదింపు వివరాలు

యూనిట్ నెం. 102, 1వ ఫ్లోర్, సుమెర్ ప్లాజా, మరోల్ మరోషి రోడ్, మరోల్, అంధేరి (తూర్పు), ముంబై: 400 059

ఫోన్: + 91 (22) 67141144/45

ఫ్యాక్స్: + 91 (22) 67141142

ఈమెయిల్: info@acuite.in

5. ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ (Ind-Ra)

ఇండ్-రా అనేది 1995లో స్థాపించబడింది. ఇది ఫిచ్ గ్రూప్ అనుబంధ సంస్థ. కింది వాటికి ఇది క్రెడిట్ రేటింగ్లను అందిస్తుంది:

  • ఇన్సూరెన్స్ కంపెనీలు

  • కార్పొరేట్ సమస్యలు

  • బ్యాంకులు

  • ఆర్థిక సంస్థలు

  • ప్రాజెక్ట్ ఫైనాన్స్

  • మేనేజ్ (నిర్వర్తించిన) ఫండ్స్

  • అర్బన్ లోకల్ సంస్థలు

  • ఫైనాన్స్ మరియు లీజింగ్ కార్పొరేషన్లు 

కేవలం సెబీ ద్వారా మాత్రమే కాకుండా ఇండియా రేటింగ్ అనేది ఆర్బీఐ మరియు నేసనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా ఆథరైజ్ చేయబడింది. ఇండియా రేటింగ్ బ్రాంచ్‌లు ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, పూనేలో ఉన్నాయి.

రిజిస్టర్డ్ చిరునామా మరియు సంప్రదింపు వివరాలు

వొకార్డ్ టవర్స్, 4వ ఫ్లోర్, వెస్ట్ వింగ్, బాంద్ర కుర్లా కాంప్లెక్స్, తూర్పు బాంద్రా, ముంబై: 400 051

ఫోన్: + 91 (022) 40001700

ఫ్యాక్స్: + 91 (022) 40001701

ఈమెయిల్: investor.services@indiaratings.co.in

6. బ్రిక్‌వర్క్ రేటింగ్స్ (BWR)

2007లో స్థాపించబడిన బీడబ్ల్యుఆర్ ని కెనరా బ్యాంక్ ప్రమోట్ చేసింది. వ్యూహాత్మక భాగస్వామిగా సేవలందిస్తోంది. బీడబ్ల్యుఆర్ అనే దానిని కేవలం సెబీ మాత్రమే కాకుండా ఆర్బీఐ కూడా ఎక్స్‌టర్నల్ క్రెడిట్ అసెస్‌మెంట్ ఏజెన్సీగా రిజిస్టర్ చేసింది. (ఈసీఏఐ) మరియు ఎంఎస్ఎంఈ, ఎన్సీడీ, ఎన్ఎస్ఐసీ రేటింగ్ సర్వీసెస్ ద్వారా నమోదు చేయబడింది. బీడబ్ల్యుఆర్ అనేది కింది వాటికి రేటింగ్ లను ఇస్తుంది:

  • బ్యాంక్ లోన్లు

  • క్యాపిటల్ మార్కెట్ ఇన్‌స్ట్రుమెంట్స్

  • ఎస్ఎంఈలు

  • మున్సిపల్ కార్పొరేషన్లు

  • రియల్ ఎస్టేట్ పెట్టుబడులు

  • ఆసుపత్రులు

  • ఎంఎఫ్ఐ 

  • ఎన్జీవోలు

  • ఎడ్యుకేషనల్ సంస్థలు

  • టూరిజం 

  • ఐపీవోలు 

  • ఎంఎన్ఆర్ఈ 

  • ఐఆర్ఈడీఏ

అంతే కాకుండా ఇది వివిధ రకాల ఆర్థిక సాధనాలను నిర్వహించే రేటింగ్ సిస్టమ్స్ అందిస్తుంది.

రిజిస్టర్డ్ చిరునామా మరియు సంప్రదింపు వివరాలు

3వ ఫ్లోర్, రాజ్ అల్కా పార్క్, 29/3 & 32/2, కలేనా ఆగ్రహార, బన్నెఘట్ట రోడ్, బెంగళూరు: 560 076

ఫోన్: +91 (80) 4040 9940

ఫ్యాక్స్: +91 (80) 4040 9941

ఈమెయిల్: info@brickworkratings.com

7. ఇన్ఫోమెరిక్స్ వాల్యుయేషన్ అండ్ రేటింగ్ ప్రైవేట్ లిమిటెడ్

ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మాజీ ఫైనాన్స్ నిపుణులు, బ్యాంకర్లు, అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పర్సనల్స్ ద్వారా 2015లో స్థాపించబడింది. ఇది ఆర్బీఐ చేత గుర్తింపు కూడా పొందింది. తమ రేటింగ్లు మరియు గ్రేడింగ్ విధానాల ద్వారా సంస్థల యొక్క క్రెడిట్ యోగ్యత మూల్యాంకనాన్ని బ్యూరోలు అందిస్తాయి.

  • బ్యాంకులు

  • స్మాల్ అండ్ మీడియం-స్కేల్ యూనిట్స్ (చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు)

  • నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్

  • పెద్ద కార్పొరేట్

పెట్టుబడిదారులు మరియు లోన్ తీసుకునే వ్యక్తుల మధ్య అన్ని రకాల సమాచార అసమానతలను తగ్గిస్తుంది. ఇన్ఫోమెరిక్స్ కంపెనీ పారదర్శకతను ప్రధాన పాలసీగా నిర్వహిస్తూ చేస్తూ తమ వినియోగదారులకు కాంప్రహెన్సివ్ క్రెడిట్ రేటింగ్లను మరియు క్రెడిట్ నివేదికలను అందిస్తుంది.

రిజిస్టర్డ్ చిరునామా మరియు సంప్రదింపు వివరాలు

ఫ్లాట్ నెం. 104/108, 1వ ఫ్లోర్, గోల్ఫ్ అపార్ట్‌మెంట్స్, సుజన్ సింగ్ పార్క్, న్యూ ఢిల్లీ: 110003

ఫోన్: + 91 (11) 24601142, 24611910, 24649428

ఫ్యాక్స్ నెం.: + 91 (11) 24627549

ఈమెయిల్: vma@infomerics.com

లోన్ మంజూరు చేస్తే ఎటువంటి అపాయం కలిగి ఉందనే విషయాన్ని సూచించేందుకు ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు లెటర్ బేస్డ్ లేదా ఆల్ఫాన్యూమరిక్ స్కోర్లను ఉపయోగిస్తాయి.

క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఏం చేస్తుందని మీరు అనుకుంటున్నారా? తర్వాతి సెక్షన్ చదవండి!

క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ యొక్క విధి ఏమిటి?

ఈ ఏజెన్సీలు లోన్ తీసుకునే వ్యక్తికి సంబంధించిన కష్టమైన రికార్డులను తనిఖీ చేస్తాయి. మరియు దాని ప్రకారం వారికి రేటింగ్ అందజేస్తాయి. ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, సంస్థలు ఎటువంటి లాభాపేక్ష లేకుండా పని చేస్తాయి. స్థానిక ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, సెక్యూరిటీలు, దేశాలు మరియు ఇతర సంస్థలకు కూడా ఇవి రేటింగ్ను ఇస్తాయి.

క్రెడిట్ స్కోరు లెక్కింపులో ఉపయోగపడే కింది ఫ్యాక్టర్ లను క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు కలిగి ఉంటాయి. అవేంటంటే:

  • ఆర్థిక నివేదికలు

  • లోన్ (అప్పు) రకం

  • లోన్ తీసుకున్న రికార్డు లేదా చరిత్ర

  • తిరిగి చెల్లించే సామర్థ్యం

  • గత చెల్లింపుల రకం (విధానం) మరియు ఇతరాలు

మీ లోన్ అప్లికేషన్ ను అప్రూవ్ చేయాలా? వద్దా అనే విషయంలో ఆర్థిక సంస్థల నిర్ణయాన్ని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ప్రభావితం చేయవనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పెట్టుబడిదారులకు లోన్ టేకింగ్ ప్రాసెస్‌లో సహాయం చేసేందుకు ఈ క్రెడిట్ నివేదికలు మరియు అదనపు సమాచారంగా సహాయపడుతాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఏజెన్సీలు ప్రొవైడ్ చేసే క్రెడిట్ రేటింగ్ అనేది ఆర్థిక, మార్కెట్ నిబంధనలకు బెంచ్ మార్క్‌గా ఉంటుంది.

ఇండియాలో ఉన్న క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల గురించి చర్చ చేస్తూ మేము ఈ ఆర్టికల్‌ను ముగించాం.

తరచుగా అడుగు ప్రశ్నలు

క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు రేటింగ్ లను ఎలా సూచిస్తాయి?

క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు A-, AA+, AAA, A1+, A1- వంటి సంఖ్యలు మరియు చిహ్నాలు ఆల్ఫా న్యూమరిక్ సంజ్ఞలను పాటిస్తాయి.

క్రెడిట్ రేటింగ్ ప్రాసెస్‌కు ఎంత సమయం పడుతుంది?

క్రెడిట్ రేటింగ్ అనేది టైమ్ తీసుకునే ప్రక్రియ మరియు ఇది క్లిష్టమైనది. ఇది కంప్లీట్ అయ్యేందుకు రశీదు తీసుకున్న తేదీ నుంచి 3-4 వారాల సమయం పడుతుంది.