ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఆన్​లైన్​లో కొనుగోలు చేయండి
Premium Starting ₹225 only*

ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్‌ల కోసం ఈ-వీసా అందించే దేశాలు

రోజూ వేలాది మంది ప్రజలు సరిహద్దులు దాటి ప్రయాణాలు చేస్తున్నారు. వారిలో కొంత మంది వ్యాపారాల కోసం వెళ్తుంటే మరికొంత మంది ఉన్నత చదువులు ఇతర అవసరాల కోసం వెళ్తున్నారు. మీరు వెళ్లాలనుకున్న దేశంలోకి వెళ్లే ముందు మీరు తప్పకుండా తీసుకెళ్లాల్సిన వస్తువులలో ముఖ్యమైనది వీసా ఒకటి. వీసా పొందడం అనేది లాంగ్ లెంగ్త్ ప్రాసెస్. ఈ ప్రక్రియ వల్ల మీరు అలసిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ-వీసా వల్ల ఈ ప్రక్రియ మరింత సులభమైంది. మీరు ఎటువంటి అవాంతరాలు లేకుండా వీసా పొందొచ్చు.

అసలు ఈ-వీసా అంటే ఏమిటి?

ఎలక్ట్రానిక్ వీసా లేదా ఈ-వీసా అనేది డిజిటల్‌గా ఆమోదించబడిన వీసా డాక్యుమెంట్. ఇది ప్రయాణికులను ఆ దేశంలోకి వెళ్లేందుకు అనుమతిస్తుంది. ఈ పత్రాన్ని చూపిస్తే అధికారులు ఏమీ అనరు. ఈ-వీసాతో ట్రావెలర్స్ ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు ఫారంను పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. సపోర్టింగ్ డాక్యుమెంట్స్‌ను కూడా అప్‌లోడ్ చేయొచ్చు. అంతే కాకుండా మీరు సందర్శించాలకునే దేశం విధించిన వీసా ఫీజులను ఆ దేశ గవర్నమెంట్ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా చెల్లించవచ్చు. 

హేన్లీ అండ్ పార్ట్‌నర్స్ అందించిన పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం మార్చి 2023 నాటికి కింద పేర్కొన్న జాబితాలో ఉన్న దేశాలకు ఈ - వీసాను దరఖాస్తు చేసుకోవచ్చు. స్వేచ్ఛాయుతంగా ప్రయాణించే(ఫ్రీడమ్ టూ ట్రావెల్) జాబితాలో మన దేశ పాస్‌పోర్ట్ 84వ ర్యాంకులో ఉంది. 

మార్చి 2023 నాటికి ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్ల కోసం ఈ-వీసాలను అందిస్తున్న దేశాల జాబితాను గురించి తెలుసుకోండి.

ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్లకు ఈ-వీసాను అందిస్తున్న దేశాల జాబితా

1. అంగోల

14. మలేషియా

2. అంటిగ్వా & బార్బుడా

15. మాల్డోవా

3.  ఆస్ట్రేలియా

16. మొరాకో 

4. అజెర్‌బైజాన్ 

17. రష్యా

5. బహ్రెయిన్ 

18. సావో టోమ్ & ప్రిన్సిపే 

6. బెనిన్ 

19. సింగపూర్

7. కొలంబియా 

20. సురినామ్

8. జిబౌటీ

21. తైవాన్ 

9. జార్జియా 

22. తజికిస్థాన్ 

10. కెన్యా 

23. తుర్కియే (టర్కీ)

11. కువైట్

24. ఉబ్జెకిస్థాన్ 

12. కిర్గిజ్సాన్ 

25. వియత్నం

13. లెసోతో 

26. జాంబియా 

2023లో భారత పౌరులకు ఆన్ అరైవల్ వీసా (దేశానికి వెళ్లగానే వీసా ఇచ్చేవి) ఇచ్చే దేశాల జాబితా

అనేక దేశాలు తమ దేశానికి వచ్చే ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్లకు ఈ-వీసాలు మరియు వీసా ఆన్-అరైవల్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. సాధారణంగా ఆన్-అరైవల్ వీసా ప్రాసెస్‌లో ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రయాణికుడి పాస్‌పోర్టుని క్షుణ్ణంగా తనిఖీ చేసి, వారి వేలిముద్రలు తీసుకుని, నిర్ణీత రుసుమును తీసుకుని వారికి వీసా పర్మిట్‌ను జారీ చేస్తారు. దేశంలోకి ఎంట్రీ ఇచ్చే ప్రధాన ప్రాంతాల్లో ఆన్-అరైవల్ వీసాను జారీ చేస్తారు. 

2023లో భారతీయ పౌరుల కోసం ఆన్-అరైవల్ వీసాలను మంజూరు చేస్తున్న దేశాల జాబితా కింద ఉంది.

27. బొలివియా 

44. మొజాంబిక్ 

28. బొట్వ్సానా 

45. మయన్మార్ 

29. బురుండి 

46. పలావు దీవులు 

30. కంబోడియా 

47. రువాండా 

31. కేప్ వేర్డే దీవులు 

48. సమోవా

32. కొమొరో దీవులు 

49. సీషెల్స్ 

33. ఎథియోపియా 

50. సియర్రా లియోన్ 

34. గబాన్ 

51. సోమాలియా 

35. గినియా-బిస్సావు 

52. శ్రీలంక 

36. ఇండోనేషియా 

53. సెయింట్ లూసియా 

37. ఇరాన్ 

54. టాంజానియా 

38. జోర్డాన్ 

55. థాయిలాండ్ 

39. లావోస్ 

56. తైమూర్-లెస్టే 

40. మడగాస్కర్ 

57. టోగో 

41. మాల్దీవులు 

58. తువులు 

42. మార్షల్ దీవులు 

59. ఉగాండ 

43. మౌరిటానియా 

60. జ్వింబాంబే 

2023లో ఇండియన్లు వీసా లేకుండా తిరగగలిగే దేశాల జాబితా

వీసా ఫ్రీ దేశాలంటే ఎటువంటి వీసా అవసరం లేకుండానే ప్రయాణికులను తమ దేశంలోకి అనుమతించే దేశాలు. ఈ దేశాలు ఏ దేశ ప్రయాణికులనైతే వీసా లేకుండా అనుమతిస్తున్నాయో ఆ దేశాలతో ముందుగానే పరస్పర ఒప్పందం చేసుకుని ఉంటాయి.  ఇటువంటి దేశాలలో వీసా చింత అవసరం లేదు కానీ… ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా అందించాలి. 

ఇండియన్స్ వీసా లేకుండా ఏఏ దేశాల్లో ప్రయాణించగలరో జాబితా ఇక్కడ ఉంది.

61. అల్బేనియా 

74. మారిషస్ 

62. బార్బడోస్ 

75. మైక్రోనేషియా

63. భూటాన్ 

76. మోంట్సెరాట్

64. బ్రిటీష్ వర్జిన్ దీవులు 

77. నేపాల్ 

65. కుక్ దీవులు 

78. నియు

66. డోమినికా 

79. ఒమన్ 

67. ఎల్ సల్వడార్ 

80. ఖతర్ 

68. ఫిజి 

81. సెనెగల్ 

69. గ్రెనడా 

82. సెయింట్ కిట్స్ మరియు నెవిస్ 

70. హయతి

83. సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడైన్స్ 

71. జమైకా 

84. ట్రినిడాడ్ అండ్ టొబాగో 

72. కజకిస్థాన్ 

85. టునిషియా 

73. మకావో (SAR చైనా)

86. వనాటు 

ఇండియన్ నేషనల్స్‌కు ఉన్న ఈ-వీసా అవసరాలు ఏమిటి?

మీ ఇండియన్ పాస్‌పోర్ట్ మీరు వెళ్లాలని అనుకుంటున్న దేశంలో ఈ-వీసా కోసం అర్హత కలిగి ఉంటే మాత్రమే మీరు ఈ-వీసాను అప్లై చేసుకోవచ్చు. కొన్ని దేశాలు అదనపు అర్హత ప్రమాణాలను కూడా కలిగి ఉన్నాయి. కాబట్టి సంబంధిత వెబ్‌సైట్‌లలో వాటిని గురించి తనిఖీ చేయండి. 

ఈ-వీసా అనేది ఆల్రెడీ అప్రూవ్ చేయబడినందున సరిహద్దుల వద్ద ప్రయాణికులు వేచి ఉండాల్సిన సమయాన్ని ఇది గణనీయంగా తగ్గించింది. మీ వద్ద అవసరమైన పత్రాలు ఉన్నాయో లేదో తనిఖీ చేసేందుకు మీ పాస్‌పోర్టు మీద స్టాంప్ వేసేందుకు ఇమ్మిగ్రేషన్ అధికారి అవసరం. 

ఈ ప్రక్రియకు మీకు కొన్ని ప్రామాణిక పత్రాలు అవసరం అవుతాయి. అవేటంటే… 

·    డిజిటల్ ఫొటోగ్రాఫ్ 

·    విదేశాలకు వచ్చిన తేదీ నుంచి కనీసం ఆరు నెలల పాటు చెల్లుబాటయ్యే పాస్‌పోర్ట్ 

·    ప్రయాణ ఏర్పాట్ల రుజువు, వసతి, రిటర్న్ టికెట్ మొదలయినవి

·    ఈ-వీసా అప్లికేషన్ ఫారం 

·    ఆన్‌లైన్ పేమెంట్ రశీదు 

మీరు వెళ్లాలనుకున్న దేశాన్ని బట్టి అదనపు పత్రాలు లేదా సమాచారం అవసరం కావొచ్చు. కావున ఈ-వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌ను సందర్శించడం చాలా అవసరం.

అంతర్జాతీయ ప్రయాణాలు చేసేందుకు మీరు ప్రయాణ బీమాను ఎందుకు తీసుకోవాలి?

ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మీకు తెలియని ప్రాంతాల్లో ఆర్థిక భద్రతను అందించడమే కాకుండా వైడ్ రేంజ్ (విస్తృత శ్రేణి) కవరేజీలను కూడా అందిస్తోంది. చాలా మంది ప్రయాణికులు బ్యాగేజీ లేదా ట్రావెల్ డాక్యుమెంట్ దొంగతనం వంటి అనుకోని పరిస్థితుల్లో తమను తాము ఆర్థికంగా రక్షించుకునేందుకు ప్రయాణ బీమాను కొనుగోలు చేస్తారు. మీకు విదేశాల్లో చికిత్స అవసరమైతే ట్రావెల్ ఇన్సూరెన్స్ సమగ్ర వైద్య కవరేజీని కూడా అందిస్తోంది.

 

ప్రయాణ బీమా పాలసీల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో కొన్ని.. 

  • మెడికల్ ఎమర్జెన్సీల కొరకు కవరేజ్ - మీ పర్యటన సమయంలో మీకు అత్యవసర వైద్య సదుపాయాలు అవసరం కావొచ్చు. ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యానికి సంబంధించినవి. అటువంటి సమయాల్లో ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మీ ఆస్పత్రి బిల్లులు మరియు వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది. 
  • ట్రిప్ క్యాన్సలేషన్ లేదా ఫ్లైట్ డిలేస్ (విమాన ఆలస్యాలు) - ఫ్లైట్ ఆలస్యం, మిస్స్‌డ్ కనెక్షన్, లేదా ఆల్ ఓవర్ ట్రిప్ క్యాన్సిలేషన్ వంటివి ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ కిందకు వస్తాయి. 
  • డిలే/లాస్ ఆఫ్ బ్యాగేజ్ - మీరు మీ హాలీడేను ఎంజాయ్ చేసేందుకు వేచి ఉండలేకపోతున్నారు. కానీ మీ చెకిన్ బ్యాగేజ్ రావడానికి ఆలస్యమయిందని అనుకుందాం. అటువంటి సమయంలో మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ డిలే లేదా లాస్ అయిన బ్యాగేజీకి పరిహారం చెల్లిస్తుంది. 
  • వాలెట్(డబ్బులు) లాస్ నుంచి రక్షణ - మీ వాలెట్‌ను కోల్పోవడం లేదా అది దొంగిలించబడడం అనేది విదేశాలకు వెళ్లినపుడు జరిగే అత్యంత సాధారణ ఘటన. అటువంటి పరిస్థితుల నుంచి మిమ్మల్ని రక్షించేందుకు మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ క్యాష్ ను అందిస్తుంది. 
  • పొడిగించబడిన లేదా రద్దైన పర్యటన కోసం కవర్ - సమ్మెలు, అల్లర్లు, ప్రకృతి వైపరీత్యాలు మరియు ఇతర ప్రమాదకర పరిస్థితులు ఏర్పడినప్పుడు మీ పర్యటన వ్యవధికి ఆటంకం ఏర్పడవచ్చు. ఇటువంటి పరిస్థితులు అనుకోకుండా అకస్మాత్తుగా వస్తాయి. మీ పర్యటన రద్దు కావడానికి లేదా పొడిగింపుకున కారణం అవుతాయి. ఖర్చుల గురించి చింతించకండి. ట్రిప్ క్యాన్సిల్ అయినా లేదా పొడగించబడినా ఖర్ర్చులను కవర్ చేసేందుకు మీ వద్ద ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ ఉంది. 
  • బౌన్స్‌డ్ బుకింగ్(అధిక బుకింగ్స్ వల్ల విమానంలో లేదా హోటల్‌లో మీ స్థానం గల్లంతయితే) - మీరు మీ వసతి బుకింగ్స్‌ను ముందుగానే బుక్ చేస్తారా? లేదా అక్కడికి చేరుకున్న తర్వాతనే బుక్ చేస్తారా? మీ హోటల్ ఓవర్ బుక్ అయినప్పుడు బౌన్స్‌డ్ బుకింగ్ కవర్‌తో ఉన్న ట్రావెల్ ఇన్సూరెన్స్ మీ రోజును పాడు కాకుండా చేస్తుంది. 

మీరు మీ ట్రిప్‌ను మరింత సురక్షితంగా, ఎటువంటి ఆర్థిక కష్టాలు లేకుండా భద్రతతో పూర్తి చేయాలని అనుకుంటే ప్రయాణానికి ముందే ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేయడం చాలా అవసరం. మార్కెట్లో అనేక ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి కనుక మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసే ముందు ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లను కంపేర్ చేయడం  చాలా అవసరం. మీరు తక్కువ ధరలో అధిక ప్రయోజనాలతో వచ్చే పాలసీలను ఎంచుకోవాలి.

నోట్: వీసా అవసరాలు ప్రతి దేశానికీ మారుతూ ఉంటాయి. మీరు ఏదైనా దేశానికి వెళ్లాలని అనుకుంటే టికెట్స్ బుక్ చేసే ముందే ఆ దేశం యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌ను సందర్శించి పాస్‌పోర్ట్ మరియు వీసా అవసరాలను గురించి చెక్ చేయాలి.

ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్ల ఈ-వీసాల గురించి తరచూ అడిగే ప్రశ్నలు

ఇండియన్స్ ఈ-వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చా?

అవును.. చేసుకోవచ్చు. భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు ఈ-వీసా కోసం వివిధ దేశాలకు అప్లై చేసుకోవచ్చు. ఆస్ట్రేలియా, కొలంబియా, జార్జియా, కువైట్, మొరాకో, మలేషియా, రష్యా, సింగపూర్ వంటి ఇతర దేశాలకు కూడా అప్లై చేసుకోవచ్చు.

ఈ-వీసా సౌకర్యం కోసం ఇండియన్స్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఈ-వీసా అప్లికేషన్ ప్రాసెస్‌ను స్టార్ట్ చేసేందుకు గవర్నమెంట్ వెబ్‌సైట్‌ను సందర్శిస్తే సరిపోతుంది. అవసరమైన పత్రాలను మీరు తప్పనిసరిగా సమర్పించి, దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి. అలాగే వీసా ఫీజులను ఆన్‌లైన్‌లో చెల్లించాలి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ పూర్తయి, అప్రూవ్ అయిన తర్వాత మీరు అందించిన ఈ-మెయిల్‌కు మీ అప్లికేషన్ మరియు ఈ-వీసా డాక్యుమెంట్ కన్ఫర్మేషన్ పంపుతారు. 

ఇండియన్స్ కోసం ఎన్ని దేశాలు ఈ-వీసాలను అందిస్తున్నాయి?

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం… మార్చి 23 నాటికి ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్ల కోసం ఈ -వీసాలను 26 దేశాలు మంజూరు చేస్తున్నాయి.

ఇండియన్లకు అందించే ఈ-వీసా గడువు ఎంత?

ఈ-వీసా వ్యాలిడిటీ అనేది దేశం నుంచి దేశానికి వేరుగా ఉంటుంది. మీరు ఒక దేశంలో 15-30 రోజుల వరకు ఉండవచ్చు. లేదా ఆ సమయాన్ని పెంచుకోవచ్చు.

వీసా ఆన్ అరైవల్ (వెళ్లిన తర్వాత వీసా ఇచ్చే దేశాలు) అందించే దేశాలు ఇండియన్స్‌కు ఈ-వీసాను అందిస్తున్నాయా?

అవును. చాలా దేశాలు ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్లకు వీసా ఆన్ అరైవల్‌తో పాటు ఈ-వీసా సౌకర్యాన్ని కూడా అందిస్తున్నాయి. ఉదాహరణకు మలేషియా, ఎథియోపియా, ఉగాండా, కేప్ వెర్డే, థాయిలాండ్ మొదలైన దేశాలు ఇండియన్లకు ఈ సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. మీరు వెళ్లాలని అనుకుంటున్న దేశానికి సంబంధించిన వీసా సమాచారం కోసం మీరు ప్రభుత్వ వెబ్‌సైట్లను సందర్శించండి.