కాంప్రహెన్సివ్ మోటార్ ఇన్సూరెన్స్

కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ

వాహనం నడపడం అనేది సౌలభ్యం, వీలును బట్టి ఉంటుంది. కానీ ఒక్కోసారి టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ డ్రైవ్ చేస్తున్నపుడు రోడ్డు మీద అనుకోని ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అటువంటి సందర్భాల్లో మీరు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండడం వలన ఎటువంటి ఆర్థిక నష్టాలకు గురికాకుండా ఉంటారు.

కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

ప్రమాదం జరిగినపుడు సొంత వాహనానికి, బీమా చేసిన వ్యక్తికి, థర్డ్ పార్టీ వాహనం లేదా థర్డ్ పార్టీ ఆస్తి (గాయాలైనా లేదా ఆస్తి డ్యామేజ్ అయినా) కవర్ చేసే బీమా పాలసీనే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అని అంటారు.

ఇన్సూరెన్స్ పాలసీల కోసం మార్కెట్ డిమాండ్​ను పరిష్కరించేందుకు ఐఆర్​డీఏ (IRDA) మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలను ప్రవేశపెట్టింది. ఇవి కాంప్రహెన్సివ్ ప్యాకేజ్ పాలసీ, థర్డ్ పార్టీ లయబులిటీ పాలసీగా అందుబాటులో ఉన్నాయి.

కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అనేది మీ సంరక్షణకు హామీనిస్తుంది.

a) వాహనం సొంత డ్యామేజ్

b) ప్రమాదంలో ఎవరైనా థర్డ్ పార్టీ బాధింపబడితే లయబులిటీ

ఏదైనా ఘటన జరిగినపుడు బీమా కంపెనీ చనిపోయిన లేదా గాయాలయిన వ్యక్తికి నష్టపరిహారం అందించడంతో పాటు మీ బైక్ రిపేర్ ఖర్చులను కూడా ఇన్సూరెన్స్ కంపెనీనే భరిస్తుంది. ఒక వేళ వ్యక్తి చనిపోయిన సందర్భంలో అతడి నామినీకి MACT నష్టపరిహారాన్ని అందిస్తుంది. కాంప్రహెన్సివ్ కవర్ అనేది వాహనం కొనుగోలు చేసేందుకు గల గరిష్ట కవర్.

కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్​లో ఏమేం కవర్ అవుతాయి?

థర్డ్ పార్టీ లయబులిటీ కవర్ మాదిరిగా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం తప్పనిసరి కాదు. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కవర్​ను కొనుగోలు చేయడం యజమాని ఇష్టం. బైక్ యజమాని తన సొంత డ్యామేజీలను కూడా కవర్ చేయాలనుకుంటే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకోవాలి.

డ్యామేజీ ఖర్చులు ఎక్కువగా ఉన్న సందర్భంలో మీకు అధిక కవరేజిని అందించే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా అవసరం.

  • వాహనం: ప్రమాదం వలన మీ కారుకు అయిన డ్యామేజ్ రిపేర్ ఖర్చులను కాంప్రహెన్సివ్ మోటార్ పాలసీ భరిస్తుంది. అంతే కాకుండా గ్లాస్ డ్యామేజ్, విండ్ షీల్డ్ డ్యామేజ్, జంతువుల వలన కలిగిన డ్యామేజ్ ఖర్చులను కూడా ఇది కవర్ చేస్తుంది. మీ కారుకు డెంట్స్ పడినా కూడా ఇది కవర్ చేస్తుంది. మీరు ఎటువంటి వర్రీ కావాల్సిన అవసరం లేదు.
  • థర్డ్ పార్టీ లయబులిటీ కవర్: కాంప్రహెన్సివ్ కవర్​లో ఇది తప్పనిసరి భాగం. థర్డ్ పార్టీ లయబులిటీ థర్డ్ పార్టీ వ్యక్తులకు అయిన గాయాలను లేదా థర్డ్ పార్టీ ఆస్తులు డ్యామేజ్ అయితే మాత్రమే కవర్ చేస్తుంది.
  • పర్సనల్ యాక్సిడెంట్ కవర్:  యజమాని, డ్రైవర్​ను కాపాడేందుకు మాండేటరీ కవర్​ను రూ. 2 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెంచారు.
  • కారు దొంగతనం: మీ కారుకు అన్ని సెక్యురిటీలు ఉన్నా కానీ ఒక్కోసారి అది ఎందుకో రిపేర్ చేయలేనంతగా పాడవుతుంది. దొంగతనానికి గురవుతుంది. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అనేది మీ పాలసీ బీమా మొత్తం విలువను బట్టి మీకు పరిహారం అందించబడుతుంది.
  • ప్రకృతి విపత్తులు: అగ్ని ప్రమాదాలు, అల్లర్లు, పేలుళ్లు, చెట్లు పడిపోవడం, వంటి అనేక ప్రకృతి విపత్తులు మీ వాహనానికి తీవ్ర నష్టం కలిగించొచ్చు. భూకంపాలు, వరదలు, తుఫానులు, వంటి వాటి వలన కారుకు అయ్యే ఖర్చులను ఈ ఇన్సూరెన్స్ పాలసీ కవర్ చేస్తుంది.
  • యాడ్–ఆన్ కవర్స్: కొన్ని యాడ్​-ఆన్స్ అదనపు ప్రీమియం చెల్లించన తర్వాత మాత్రమే బేసిక్ ప్లాన్​కు యాడ్ అవుతాయి. జీరో డిప్రిషియేషన్ కవర్, రోడ్ సైడ్ అసిస్టెన్స్, ఇంజిన్ ప్రొటెక్షన్, ప్యాసింజర్ కవర్ వంటివి ఉదాహరణలు.

కాంప్రహెన్సివ్, థర్డ్ పార్టీ లయబులిటీ పాలసీ మధ్య తేడాలు

కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ లయబులిటీ ఇన్సూరెన్స్
కవరేజ్ ఇది వాహనానికి కవరేజిని అందిస్తుంది. అంతే కాకుండా థర్డ్ పార్టీ ప్రాపర్టీస్ డ్యామేజ్ అయినా కూడా కవర్ చేస్తుంది. థర్డ్ పార్టీకి జరిగిన నష్టాల వలన ఏవైనా లయబులిటీస్ వస్తే ఇది కవర్ చేస్తుంది.
వాహనాలు మీ వాహనం కొత్తదయినా లేక కొన్ని సంవత్సరాల పాతదయినా కానీ మరమ్మతు ఖర్చులను కవర్ చేసేందుకు మీకు కాంప్రహెన్సివ్ కవర్ అవసరం. రోడ్డు యాక్సిడెంట్ తర్వాత అయ్యే మరమ్మతు ఖర్చులను ఇది కవర్ చేస్తుంది. 10 సంవత్సరాలు పైబడిన పాత వాహనాలకు రిపేర్ ఖర్చు ఓనర్ భరించాలి. కాబట్టి ఇటువంటి వాహనాలకు థర్డ్ పార్టీ లయబులిటీ పాలసీ సరిపోతుంది.
ఇన్సూరెన్స్ ధర గాయాలు, డ్యామేజెస్, దొంగతనాల నుంచి కవర్ అందిస్తుంది కాబట్టి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అనేది కాస్త ఖరీదైనది. కాంప్రహెన్సివ్ కవర్​తో పోల్చుకుంటే థర్డ్ పార్టీ లయబులిటీ ఇన్సూరెన్స్ ధర చాలా చీప్​.
ధర కాంప్రహెన్సివ్ కవర్ ధర మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఇన్సూరెన్స్ కంపెనీలు అందించే ఆఫర్లు, డిస్కౌంట్ల మీద ఆధారపడి ఉంటుంది. థర్డ్ పార్టీ లయబులిటీ పాలసీ ధరను రెగ్యులేటరీ నిర్ణయిస్తుంది.

కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం వలన లాభాలు

ఆర్థిక నష్టాలను దూరంగా ఉంచేందుకు మీరు కాంప్రహెన్సివ్ పాలసీని కొనుగోలు చేయడం చాలా ఉత్తమం. ఈ పాలసీలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

  • సొంత వాహనానికి అయిన డ్యామేజ్​ను కవర్ చేస్తుంది: కాంప్రహెన్సివ్ పాలసీలో మీ సొంత వాహనానికి డ్యామేజ్ అయినా కానీ కవర్ చేయబడుతుంది. ఉదాహరణకు: మీరు మీకారుతో రోడ్డు మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టారని అనుకుందాం. అప్పుడు కారు డ్యామేజ్ అయి రిపేర్ అవసరమయితే మీ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ అది కవర్ చేస్తుంది.

  • థర్డ్ పార్టీ లయబులిటీస్​ను కవర్ చేస్తుంది: ఒక వేళ ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి తప్పు చేయడం వలన థర్డ్ పార్టీ ప్రాపర్టీ డ్యామేజ్ అయినా ప్రాపర్టీకి లాస్ జరిగినా ఇది లయబులిటీ ఖర్చులను అందజేస్తుంది. మీరు హైవే మీద వాహనం నడుపుతున్నపుడు బ్యాలెన్స్ తప్పి రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టారని అనుకోండి. ఆ వ్యక్తికి గాయాలయ్యాయి ఒక వేళ అది మీ తప్పు అయినా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ కవర్ చేస్తుంది.

  • యాడ్-ఆన్ కవర్ల సదుపాయం ఉంది:  కొన్ని రకాల అదనపు సంరక్షణ కోసం యాడ్​–ఆన్​ కవర్లను తప్పనిసరిగా కొనుగోలు చేయాలి. జీరో డెప్, ఇంజిన్ ప్రొటెక్షన్ మొదలయినవి. ఇవి థర్డ్ పార్టీ లయబులిటీ పాలసీ కింద కవర్ కావు. మీరు నీరు నిలిచిన రోడ్డు మీద డ్రైవ్ చేస్తున్నారని అనుకోండి. కారు ఇంజిన్​లో నీరు జామ్ కావడంతో సడెన్​గా వర్క్ చేయడం ఆపేసింది. అటువంటి సందర్భంలో మీరు ఇంజిన్ ప్రొటెక్షన్ యాడ్–​ఆన్​ను కొనుగోలు చేసి ఉంటే మీ మరమ్మతు ఖర్చులు కవర్ చేయబడతాయి.

పర్సనల్ యాక్సిడెంట్ పాలసీని యాడ్ చేయడం ద్వారా యజమాని, డ్రైవర్​కు కవరేజీని రెగ్యులేటరీ పెంచింది. పీఏ (PA) కవర్ కనిష్ట పరిమితి ఇప్పుడు రూ. 15 లక్షలు.