ఆటో రిక్షా ఇన్సూరెన్స్

ఆటో రిక్షా కోసం కమర్షియల్​ వెహికిల్​ ఇన్సూరెన్స్​

Third-party premium has changed from 1st June. Renew now

ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ ఒక కమర్షియల్​ వెహికిల్​ ఇన్సూరెన్స్​ పాలసీ. దీనిని భారతదేశంలో ఉన్న ఆటో రిక్షాల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఆటో డ్రైవర్ల అవసరాలు తీర్చటం కోసమే దీన్ని ప్రవేశపెట్టారు. థర్డ్​ పార్టీలకు డ్యామేజీలు​ అయినపుడు ఆటో రిక్షా యజమానులు ఆర్థిక నష్టాల నుంచి బయటపడేందుకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్​ను కలిగి ఉండాలి. కానీ మీకు థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ కన్నా కాంప్రహెన్సివ్​ ఇన్సూరెన్స్​ అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ ఇన్సూరెన్స్​లో మీ ఆటో రిక్షాకు జరిగే చాలా రకాల డ్యామేజీలు​ కవర్​ అవుతాయి. ఉదా. ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాలు, దొంగతనాల వలన జరిగే డ్యామేజీలు.

డిజిట్​ ఇన్సూరెన్స్​ కంపెనీ ఆటో యజమానుల కోసం రెండు రకాల పాలసీలను తక్కువ ధరలకే అందిస్తోంది.

నేను ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ ఎందుకు కొనుగోలు చేయాలి?

  • మీరు కానీ, మీ ఆర్గనైజేషన్​ కానీ ఆటో రిక్షాలను కలిగి ఉంటే ఇన్సూరెన్స్​ తీసుకోవడం తప్పనిసరి. కనీసం మీరు లయబులిటీ ఓన్లీ పాలసీనైనా తీసుకోవాలి. ఇది మిమ్మల్ని, మీ వ్యాపారాన్ని ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కిస్తుంది. థర్డ్​ పార్టీ వ్యక్తులకు ఎటువంటి డ్యామేజీలు​  జరిగినా ఇందులో కవర్​ అవుతాయి.
  • మీ వ్యాపారానికి ఆటో రిక్షా చాలా ముఖ్యమైతే మీరు థర్డ్​ పాలసీ ఇన్సూరెన్స్​ తీసుకోవడం కంటే కాంప్రహెన్సివ్​ ప్యాకేజ్​ పాలసీ తీసుకోవడం చాలా మంచిది. ఈ పాలసీ మిమ్మల్ని అనేక విషయాల నుంచి కాపాడుతుంది. మీ డ్రైవర్​కు ఏదైనా ప్రమాదం జరిగినా కూడా ఇది కవర్​ చేస్తుంది. ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు, ఉగ్ర దాడులు, అగ్ని ప్రమాదాలు, దొంగతనాలు వివిధ కారణాల వలన మీ రిక్షాకు ఎటువంటి డ్యామేజీలు జరిగినా ఈ పాలసీ కవర్​ చేస్తుంది.
  • సరైన ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ మీ కస్టమర్లు, ప్రయాణికులకు మీ మీద నమ్మకాన్ని పెంచుతుంది. దీని వలన మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.
  • మీ ఆటో రిక్షాకు సరైన పాలసీ ఉంటే ఏవైనా నష్టాలు జరిగినపుడు కూడా మీ వ్యాపారం ఎటువంటి కుదుపులకు లోను కాదు. సరైన పాలసీ ఉంటే మీరు నిశ్చింతగా ఉండొచ్చు. మీ సమయాన్ని మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు వాడుకోవచ్చు.

డిజిట్​ అందించే ఆటో రిక్షా ఇన్సూరెన్స్​నే ఎందుకు ఎంచుకోవాలి?

ఆటో రిక్షా ఇన్సూరెన్స్​లో ఏమేం కవర్​ అవుతాయి?

ఏమేం కవర్​ కావు?

మీ ఇన్సూరెన్స్​లో ఏ విషయాలు కవర్​ అవుతాయో తెలుసుకోవడంతో పాటు ఏ ఏ విషయాలు కవర్​ కావో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు చివరి నిమిషంలో, క్లెయిమ్​ చేసే సమయంలో ఇబ్బంది పడకూడదు. ఆ సమయంలో ఆశ్చర్యానికి గురి కాకూడదు. కాబట్టి కవర్​ కాని విషయాలేవనేది ముందుగానే తెలుసుకోవాలి.

థర్డ్​ పార్టీ పాలసీదారుడికి సొంత డ్యామేజీలు అయినపుడు

మీకు థర్డ్​ పార్టీ పాలసీ మాత్రమే ఉండి, ఏదైనా ప్రమాదంలో మీకు డ్యామేజీలు​ జరిగితే కవర్​ కావు.

మద్యం సేవించి వాహనం నడిపినా లేదా లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా

మీ ఆటో రిక్షాకు ప్రమాదం జరిగినప్పుడు ఆ రిక్షాను నడిపే వ్యక్తి మద్యం సేవించి ఉన్నా, లైసెన్స్​ లేకుండా వాహనం నడిపినా ఇన్సూరెన్స్​ కవర్​ కాదు.

స్వీయ నిర్లక్ష్యం

ఆటో రిక్షాకు డ్రైవర్​ లేదా యజమాని వ్యక్తిగత నిర్లక్ష్యం వలన ఏదైనా డ్యామేజ్​ జరిగితే (ఉదా. మీ నగరంలో వరదలు వస్తుంటే మీరు వాహనం తీసుకుని బయటకు వెళ్లినప్పుడు)

పర్యావసాన నష్టాలు

ప్రమాదాలు, ప్రకృతి విపత్తులతో సంబంధం లేని డ్యామేజీలు.

డిజిట్​ ఆటో రిక్షా ఇన్సూరెన్స్​లో ముఖ్యమైన ఫీచర్లు​

ముఖ్యమైన ఫీచర్లు​ డిజిట్​ ప్రయోజనం
క్లెయిమ్​ ప్రక్రియ పేపర్​లెస్​ క్లెయిమ్స్​
కస్టమర్​ సపోర్ట్​ 24x7 సపోర్ట్​
అదనపు కవరేజీ పీఏ కవర్​, లీగల్​ లయబులిటీ కవర్​, ప్రత్యేక మినహాయింపులు మొదలయినవి
థర్డ్​ పార్టీకి డ్యామేజ్​ జరిగినప్పుడు వ్యక్తిగత డ్యామేజీలు​ జరిగినప్పుడు అపరిమిత​ లయబులిటీ, వాహన లేదా ప్రాపర్టీ డ్యామేజీలకు రూ. 7.5 లక్షల వరకు కవరేజీ

ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ ప్లాన్లలో రకాలు

మీ త్రీ వీలర్​ అవసరాలను బట్టి డిజిట్​ మీకు రెండు రకాల ఇన్సూరెన్స్​ పాలసీలను అందిస్తుంది. రిస్క్​ ఎక్కువగా ఉన్న వాహనాలకు స్టాండర్డ్​ వెహికిల్​ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా మంచిది. ఈ పాలసీ వలన మీరు ఆర్థికంగా లాభపడతారు. ఇది రిక్షా యజమాని లేదా డ్రైవర్​కు ఎలాంటి గాయాలైనా కూడా కవర్​ చేస్తుంది.

లయబులిటీ ఓన్లీ స్టాండర్డ్​ ప్లాన్​

మీ ఆటో రిక్షా వలన ఎవరైనా థర్డ్​ పార్టీ వ్యక్తికి లేదా ప్రాపర్టీకి డ్యామేజ్​ అయినప్పుడు

×

థర్డ్​ పార్టీ వాహనానికి మీ ఆటో రిక్షా వలన డ్యామేజ్​ జరిగినప్పుడు

×

ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాలు, దొంగతనాలు, ప్రమాదాల వలన మీ సొంత ఆటో రిక్షాకు నష్టం​ జరిగినప్పుడు

×

ఆటో రిక్షా యజమానికి లేదా డ్రైవర్​కు గాయాలు/మరణం సంభవించినపుడు

If the owner-driver doesn’t already have a Personal Accident cover in his name

×
Get Quote Get Quote

ఎలా క్లెయిమ్​ చేయాలి?

1800-258-5956 అనే నెంబర్​కు కాల్​ చేయండి. లేదా hello@godigit.com అనే మెయిల్​ ఐడీకి మెయిల్​ చేస్తే సరిపోతుంది.

మీ పాలసీ వివరాల​ను దగ్గర ఉంచుకోండి. పాలసీ నెంబర్​, ప్రమాదం ఎక్కడ జరిగింది, ప్రమాదం జరిగిన తేదీ, సమయం, ఇన్సూరర్​ కాంటాక్ట్​ నెంబర్​ను కలిగి ఉండటం వలన మా పని మరింత సులువు అవుతుంది.

డిజిట్​ ఇన్సూరెన్స్​ క్లెయిమ్స్​ ఎంత వేగంగా సెటిల్​ అవుతాయి? ఎవరైనా సరే ఇన్సూరెన్స్​ కంపెనీని మార్చేటపుడు మొదటగా వచ్చే ప్రశ్న ఇదే. డిజిట్​లో ఇన్సూరెన్స్​ క్లెయిమ్స్​ చాలా వేగంగా సెటిల్​ అవుతాయి. డిజిట్​ క్లెయిమ్స్​ రిపోర్టు కార్డును చదవండి

మా కస్టమర్లు మా గురించి ఏమంటున్నారంటే..

వికాస్​ తప్పా
★★★★★

నా వెహికిల్​ ఇన్సూరెన్స్​ ప్రాసెస్‌లో నాకు డిజిట్​ వలన మంచి ఎక్స్​పీరియెన్స్​ లభించింది. ఇది చాలా కస్టమర్​ ఫ్రెండ్లీ. డిజిట్​ ఇన్సూరెన్స్​ టెక్నాలజీని ఎక్కువగా వాడుతుంది. తద్వారా కస్టమర్లకు తక్కువ సమయంలోనే సాయపడుతుంది. నేరుగా కలవాల్సిన అవసరం లేకుండానే నా క్లెయిమ్​ త్వరగా సెటిల్​ అయిపోయింది. కస్టమర్​ సెంటర్​ ప్రతినిధులు నా కాల్స్​ అందుకుని సాయం చేసిన విధానం చాలా బాగుంది. నా పాలసీని హ్యాండిల్​ చేసిన రామరాజు కొదనకు ప్రత్యేక ధన్యవాదాలు.

విక్రాంత్​ పరాశర్
★★★★★

డిజిట్​ ఇన్సూరెన్స్​ కంపెనీ అద్భుతమైన కంపెనీ. దీనిలో మీ ఐడీవీని మార్చుకునే సౌలభ్యం కూడా ఉంది. డిజిట్​ కంపెనీ సిబ్బంది చాలా మంచి వ్యక్తులు. నేను డిజిట్​ కంపెనీ వ్యక్తి అయిన ఫర్ఖూన్​కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నన్ను ఆయన డిజిట్​ ఇన్సూరెన్స్​లో పాలసీ తీసుకోమని చెప్పాడు. కానీ, ఇప్పుడు నేను నా మరో వాహనానికి కూడా డిజిట్​లోనే ఇన్సూరెన్స్​ తీసుకోవాలని చూస్తున్నాను. ఇందులో ధరలు చాలా తక్కువగా ఉంటాయి. మంచి సర్వీస్​ అందుబాటులో ఉంటుంది.

సిద్ధార్థ్​ మూర్తి
★★★★★

నేను 4 వాహనాలకు డిజిట్​ నుంచి ఇన్సూరెన్స్​ తీసుకున్నాను. ఈ కంపెనీ చాలా ఉత్తమం. పూనం దేవి నాకు ప్లాన్​ గురించి వివరించిన విధానం చాలా బాగుంది. కస్టమర్లు ఏ విషయాల గురించి ఆలోచిస్తారో ఆమెకు బాగా తెలుసు. తను నా అవసరాలకు తగిన పాలసీని సూచించింది. ఆన్​లైన్​లో పేమెంట్​ చేయడం కూడా చాలా సులువు. నాకు అత్యుత్తమ పాలసీని సూచించిన పూనం దేవికి ప్రత్యేక ధన్యవాదాలు. డిజిట్​ రిలేషన్​షిప్​ టీమ్​ రోజురోజుకూ మరింత మెరుగవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్​ ది బెస్ట్​.

Show all Reviews

ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ గురించి మరింత తెలుసుకోండి.

డిజిట్​ అందించే ఆటో రిక్షా ఇన్సూరెన్స్​లో ఎటువంటి టైప్​ రిక్షాలు ఉంటాయి?

డిజిట్​ కమర్షియల్​ వెహికిల్​ ప్యాకేజీలో మేము అన్ని రకాల ఆటో రిక్షాలను కవర్​ చేస్తాం. పెట్రోల్​, డీజిల్​తో నడిచే ఆటోరిక్షాలు: మన భారతదేశంలో ఇటువంటి ఆటోలను చాలా ఎక్కవగా వాడుతున్నారు. వీటిని ఎక్కువగా టీవీఎస్​ (TVS), బజాజ్​ కంపెనీలు తయారు చేస్తాయి. మీరు చాలా నగరాలలో ఇవే ఆటో రిక్షాలను చూస్తారు. ఎలక్ట్రిక్​ ఆటో రిక్షాలు: ఎలక్ట్రిక్​ ఆటో రిక్షాలు త్రీ వీలర్​ కుటుంబంలోకి కొత్తగా వచ్చి చేరాయి. ఈ-ఆటో రిక్షా కరెంటుతో లేదా సోలార్​ ప్యానెళ్లతో నడుస్తుంది. వేరే రిక్షాలు పెట్రోల్​ డీజిల్​ వంటి సాధనాలతో నడుస్తాయి.

డిజిట్​ కమర్షియల్​ వెహికిల్​ ప్యాకేజీలో మేము అన్ని రకాల ఆటో రిక్షాలను కవర్​ చేస్తాం.

  • పెట్రోల్​, డీజిల్​తో నడిచే ఆటోరిక్షాలు: మన భారతదేశంలో ఇటువంటి ఆటోలను చాలా ఎక్కవగా వాడుతున్నారు. వీటిని ఎక్కువగా టీవీఎస్​ (TVS), బజాజ్​ కంపెనీలు తయారు చేస్తాయి. మీరు చాలా నగరాలలో ఇవే ఆటో రిక్షాలను చూస్తారు.
  • ఎలక్ట్రిక్​ ఆటో రిక్షాలు: ఎలక్ట్రిక్​ ఆటో రిక్షాలు త్రీ వీలర్​ కుటుంబంలోకి కొత్తగా వచ్చి చేరాయి. ఈ-ఆటో రిక్షా కరెంటుతో లేదా సోలార్​ ప్యానెళ్లతో నడుస్తుంది. వేరే రిక్షాలు పెట్రోల్​ డీజిల్​ వంటి సాధనాలతో నడుస్తాయి.

ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ తప్పనిసరా?

అవును. భారతదేశంలోని మోటార్​ వాహనాల చట్టం​ ప్రకారం రిక్షాలకు ఇన్సూరెన్స్​ చాలా తప్పనిసరి. చివరికి థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ అయినా తీసుకోవాలి. ఎటువంటి పాలసీ లేకుండా రోడ్ల మీద తిరిగితే చట్ట ప్రకారం మీకు జరిమానా పడుతుంది. మీరు ఆటో రిక్షా ద్వారానే ఆదాయాన్ని ఆర్జిస్తుంటే లేదా మీ వ్యాపారానికి ఆటొ రిక్షా చాలా ముఖ్యమైతే మీరు తప్పనిసరిగా స్టాండర్డ్​ ఇన్సూరెన్స్​ పాలసీని తీసుకోవాలి. ఈ పాలసీ కేవలం థర్డ్​ పార్టీలకు అయిన డ్యామేజీలను మాత్రమే కాకుండా మీ సొంత వాహనానికి అయిన డ్యామేజీలను కూడా కవర్​ చేస్తుంది. యజమాని లేదా డ్రైవర్​కు గాయలు అయినపుడు ఇది మిమ్మల్ని కవర్​ చేస్తుంది.

అవును. భారతదేశంలోని మోటార్​ వాహనాల చట్టం​ ప్రకారం రిక్షాలకు ఇన్సూరెన్స్​ చాలా తప్పనిసరి. చివరికి థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ అయినా తీసుకోవాలి. ఎటువంటి పాలసీ లేకుండా రోడ్ల మీద తిరిగితే చట్ట ప్రకారం మీకు జరిమానా పడుతుంది.

మీరు ఆటో రిక్షా ద్వారానే ఆదాయాన్ని ఆర్జిస్తుంటే లేదా మీ వ్యాపారానికి ఆటొ రిక్షా చాలా ముఖ్యమైతే మీరు తప్పనిసరిగా స్టాండర్డ్​ ఇన్సూరెన్స్​ పాలసీని తీసుకోవాలి. ఈ పాలసీ కేవలం థర్డ్​ పార్టీలకు అయిన డ్యామేజీలను మాత్రమే కాకుండా మీ సొంత వాహనానికి అయిన డ్యామేజీలను కూడా కవర్​ చేస్తుంది. యజమాని లేదా డ్రైవర్​కు గాయలు అయినపుడు ఇది మిమ్మల్ని కవర్​ చేస్తుంది.

ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ను కొనడం/రెన్యూ చేయడం ఎందుకు ముఖ్యం?

ఏదైనా ప్రమాదం లేదా ప్రకృతి విపత్తుల వలన మీ ఆటోకు నష్టం జరిగితే మీ వ్యాపారం దెబ్బ తినకుండా ఉండేందుకు ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ తీసుకోవడం చాలా అవసరం. థర్డ్​ పార్టీ లయబులిటీలు,​ కష్టాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం ఇన్సూరెన్స్​ చాలా అవసరం. చట్ట ప్రకారం భారతదేశంలో తిరిగే ప్రతీ వాహనం ఇన్సూరెన్స్​ కలిగి ఉండాలి. కనీసం థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ అయినా సరే కలిగి ఉండాలి. మీ ఆటోలో ప్రయాణించే ప్రయాణికుల భద్రత కోసం మీరు తప్పనిసరిగా ఇన్సూరెన్స్​ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు కాంప్రహెన్సివ్​ ఇన్సూరెన్స్​ పాలసీ తీసుకుంటే ఇది మీ ప్రయాణికులతో పాటు మిమ్మల్ని కూడా సంరక్షిస్తుంది.

  • ఏదైనా ప్రమాదం లేదా ప్రకృతి విపత్తుల వలన మీ ఆటోకు నష్టం జరిగితే మీ వ్యాపారం దెబ్బ తినకుండా ఉండేందుకు ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ తీసుకోవడం చాలా అవసరం.
  • థర్డ్​ పార్టీ లయబులిటీలు,​ కష్టాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం ఇన్సూరెన్స్​ చాలా అవసరం. చట్ట ప్రకారం భారతదేశంలో తిరిగే ప్రతీ వాహనం ఇన్సూరెన్స్​ కలిగి ఉండాలి. కనీసం థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ అయినా సరే కలిగి ఉండాలి.
  • మీ ఆటోలో ప్రయాణించే ప్రయాణికుల భద్రత కోసం మీరు తప్పనిసరిగా ఇన్సూరెన్స్​ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు కాంప్రహెన్సివ్​ ఇన్సూరెన్స్​ పాలసీ తీసుకుంటే ఇది మీ ప్రయాణికులతో పాటు మిమ్మల్ని కూడా సంరక్షిస్తుంది.

ఆటో రిక్షా ఇన్సూరెన్స్​కు మోటార్​ వెహికిల్​ ఇన్సూరెన్స్​కు తేడా ఏంటి?

ఆటో రిక్షా ఇన్సూరెన్స్​, కమర్షియల్​ మోటార్​ వెహికిల్​ ఇన్సూరెన్స్​కు మధ్య చాలా తేడా ఉంటుంది. ఆటో రిక్షాలో రోజూ చాలా మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. ఇదే ప్రధాన వ్యత్యాసంగా ఉంటుంది. ఈ విషయమే ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ను మరో కమర్షియల్​ వెహికిల్​ ఇన్సూరెన్స్​ నుంచి వేరు చేస్తుంది. ఇది పరిమాణంలో చాలా చిన్నగా ఉన్నందున దీని వలన రిస్క్​ తక్కువగా ఉంటుంది. అందుకే ట్రక్కులు​, బస్​ ఇన్సూరెన్స్​లతో పోల్చుకుంటే మీరు ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ తీసుకున్నపుడు చాలా తక్కువ ధరకు వస్తుంది.

ఆటో రిక్షా ఇన్సూరెన్స్​, కమర్షియల్​ మోటార్​ వెహికిల్​ ఇన్సూరెన్స్​కు మధ్య చాలా తేడా ఉంటుంది. ఆటో రిక్షాలో రోజూ చాలా మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. ఇదే ప్రధాన వ్యత్యాసంగా ఉంటుంది. ఈ విషయమే ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ను మరో కమర్షియల్​ వెహికిల్​ ఇన్సూరెన్స్​ నుంచి వేరు చేస్తుంది. ఇది పరిమాణంలో చాలా చిన్నగా ఉన్నందున దీని వలన రిస్క్​ తక్కువగా ఉంటుంది. అందుకే ట్రక్కులు​, బస్​ ఇన్సూరెన్స్​లతో పోల్చుకుంటే మీరు ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ తీసుకున్నపుడు చాలా తక్కువ ధరకు వస్తుంది.

నేను నా ఆటో రిక్షాకు సరైన కమర్షియల్​ వెహికిల్​ ఇన్సూరెన్స్​ను ఎలా ఎంచుకోవాలి?

ప్రస్తుత రోజుల్లో చాలా రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి సరైన ఇన్సూరెన్స్​ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీరు ఎంచుకున్న ఇన్సూరెన్స్​ మిమ్మల్ని, మీ వ్యపారాన్ని అన్ని రకాల విపత్కర పరిస్థితుల నుంచి సంరక్షించేలా ఉండాలి. క్లెయిమ్స్​ చాలా వేగంగా సెటిల్​ అవ్వాలి. అదే ఇన్సూరెన్స్​లో చాలా ముఖ్యమైన అంశం. ఎవరైనా సరే ఇన్సూరెన్స్​ తీసుకునేటపుడు ఇదే విషయాన్ని చూస్తారు. మీరు సరైన త్రీ వీలర్​ ఇన్సూరెన్స్​ తీసుకునేందుకు కింది విషయాలు సాయపడతాయి.. సరైన ఇన్సూర్డ్​ డిక్లేర్డ్​ వాల్యూ (ఐడీవీ): ఐడీవీ (IDV) అనేది మీ వాహనం మార్కెట్​ విలువను సూచిస్తుంది. మీ వాహన విలువను తరుగుదల (డిప్రిషియేషన్)​తో సహా చూపిస్తుంది. ఈ విలువ మీదే మీ ప్రీమియం ఆధారపడి ఉంటుంది. మీరు సరైన ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ కోసం చూస్తుంటే అందులో మీ వాహన ఐడీవీ (IDV) విలువ కరెక్ట్​గా ఉందో లేదో సరి చూసుకోండి. సర్వీస్​ ప్రయోజనాలు: సర్వీస్​ అనేది చాలా ముఖ్యం. ప్రస్తుతం చాలా ఇన్సూరెన్స్​ కంపెనీలు 24x7 కస్టమర్​ సపోర్ట్​ను అందిస్తున్నాయి. అందుకే క్యాష్‌లెస్​ నెట్​వర్క్​ గ్యారేజీలు, ఇతర విషయాలను కూడా పరిగణనలోనికి తీసుకోవాలి. యాడ్​–ఆన్స్​ చూడండి: మీరు త్రీ వీలర్​ ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ తీసుకునే ముందు యాడ్​–ఆన్స్​ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. యాడ్​–ఆన్స్​ అనేవి మీకు అదనపు రక్షణను కల్పిస్తాయి. క్లెయిమ్​ వేగం: ఇన్సూరెన్స్​ తీసుకున్నపుడు క్లెయిమ్​ ఎంత వేగం సెటిల్​ అవుతుందనేది చాలా ముఖ్యం​. మీరు ఏదైనా కంపెనీలో ఇన్సూరెన్స్​ తీసుకునేటపుడు క్లెయిమ్​ సెటిల్​మెంట్​కు వారు ఎంత సమయం తీసుకుంటున్నారో తప్పనిసరిగా తెలుసుకోవాలి. అత్యుత్తమ విలువ: సరైన ప్రీమియం, క్లెయిమ్​ సెటిల్​మెంట్​ వేగం, అనేక అంశాలను పరిగణనలోనికి తీసుకుని సరైన విధంగా మీకు సాయపడే ఆటో రిక్షా ఇన్సూరెన్స్​నే మీరు ఎంచుకోవాలి.

ప్రస్తుత రోజుల్లో చాలా రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి సరైన ఇన్సూరెన్స్​ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీరు ఎంచుకున్న ఇన్సూరెన్స్​ మిమ్మల్ని, మీ వ్యపారాన్ని అన్ని రకాల విపత్కర పరిస్థితుల నుంచి సంరక్షించేలా ఉండాలి. క్లెయిమ్స్​ చాలా వేగంగా సెటిల్​ అవ్వాలి. అదే ఇన్సూరెన్స్​లో చాలా ముఖ్యమైన అంశం. ఎవరైనా సరే ఇన్సూరెన్స్​ తీసుకునేటపుడు ఇదే విషయాన్ని చూస్తారు.

మీరు సరైన త్రీ వీలర్​ ఇన్సూరెన్స్​ తీసుకునేందుకు కింది విషయాలు సాయపడతాయి..

  • సరైన ఇన్సూర్డ్​ డిక్లేర్డ్​ వాల్యూ (ఐడీవీ): ఐడీవీ (IDV) అనేది మీ వాహనం మార్కెట్​ విలువను సూచిస్తుంది. మీ వాహన విలువను తరుగుదల (డిప్రిషియేషన్)​తో సహా చూపిస్తుంది. ఈ విలువ మీదే మీ ప్రీమియం ఆధారపడి ఉంటుంది. మీరు సరైన ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ కోసం చూస్తుంటే అందులో మీ వాహన ఐడీవీ (IDV) విలువ కరెక్ట్​గా ఉందో లేదో సరి చూసుకోండి.
  • సర్వీస్​ ప్రయోజనాలు: సర్వీస్​ అనేది చాలా ముఖ్యం. ప్రస్తుతం చాలా ఇన్సూరెన్స్​ కంపెనీలు 24x7 కస్టమర్​ సపోర్ట్​ను అందిస్తున్నాయి. అందుకే క్యాష్‌లెస్​ నెట్​వర్క్​ గ్యారేజీలు, ఇతర విషయాలను కూడా పరిగణనలోనికి తీసుకోవాలి.
  • యాడ్​–ఆన్స్​ చూడండి: మీరు త్రీ వీలర్​ ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ తీసుకునే ముందు యాడ్​–ఆన్స్​ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. యాడ్​–ఆన్స్​ అనేవి మీకు అదనపు రక్షణను కల్పిస్తాయి.
  • క్లెయిమ్​ వేగం: ఇన్సూరెన్స్​ తీసుకున్నపుడు క్లెయిమ్​ ఎంత వేగం సెటిల్​ అవుతుందనేది చాలా ముఖ్యం​. మీరు ఏదైనా కంపెనీలో ఇన్సూరెన్స్​ తీసుకునేటపుడు క్లెయిమ్​ సెటిల్​మెంట్​కు వారు ఎంత సమయం తీసుకుంటున్నారో తప్పనిసరిగా తెలుసుకోవాలి.
  • అత్యుత్తమ విలువ: సరైన ప్రీమియం, క్లెయిమ్​ సెటిల్​మెంట్​ వేగం, అనేక అంశాలను పరిగణనలోనికి తీసుకుని సరైన విధంగా మీకు సాయపడే ఆటో రిక్షా ఇన్సూరెన్స్​నే మీరు ఎంచుకోవాలి.

ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ కోట్స్​ను ఆన్‌లైన్​లో పోల్చి చూడండి

తక్కువ రేటు ఉన్న ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ను తీసుకునే బదులు మీరు ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ను ఎంచుకునేటపుడు ఒకసారి వివిధ కంపెనీల ఆటో రిక్షా ఇన్సూరెన్స్​లను తనిఖీ చేయడం అవసరం. వాళ్లు అందిస్తున్న సేవలు, ప్రయోజనాలు, క్లెయిమ్​ సెటిల్​మెంట్​ కాలం తదితర అంశాలను గమనించాలి. మీరు త్రీ వీలర్​ ఇన్సూరెన్స్​ తీసుకునేటపుడు కింది విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఈ విషయాలు చాలా ముఖ్యం మరి. సర్వీస్​ ప్రయోజనాలు: మీరు ఏదైనా సమస్యలో ఉన్నపుడు వారు అందించే సేవలు చాలా ముఖ్యం. కావున మీరు ఇన్సూరెన్స్​ తీసుకుందామని భావించే కంపెనీలో మంచి సర్వీసు ఉండేలా చూసుకోండి. డిజిట్​ కంపెనీలో 24*7 కస్టమర్​ సపోర్ట్​ అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా మాకు దేశవ్యాప్తంగా 2500 కంటే ఎక్కువగా క్యాష్​లెస్​ గ్యారేజీలు ఉన్నాయి. వేగవంతమైన క్లెయిమ్​ సెటిల్​మెంట్​: ఇన్సూరెన్స్​ ప్రక్రియలో అతి ముఖ్యమైనది క్లెయిమ్​ సెటిల్​మెంట్​. కావున త్వరగా క్లెయిమ్​ సెటిల్​ చేసే కంపెనీలో మీరు ఇన్సూరెన్స్​ చేయించుకోవాలి. డిజిట్​ కంపెనీలో 96% క్లెయిములు 30 రోజుల వ్యవధిలోపే సెటిల్​ అవుతాయి. అంతేకాకుండా మేము క్లెయిమ్స్​ కోసం ఎటువంటి హార్డ్​​ కాపీలను వినియోగదారుల నుంచి తీసుకోము. ప్రతీది పేపర్​లెస్​గా ఉంటుంది. క్లెయిమ్స్​ త్వరగా సెటిల్​ అవుతాయి. ఎటువంటి చింత లేకుండా ప్రక్రియ పూర్తవుతుంది. మీ ఐడీవీని తనిఖీ చేయండి: చాలా ఆటో రిక్షా ఇన్సూరెన్స్​లలో తక్కువ ఐడీవీ (IDV) ఉంటుంది. ఐడీవీ (IDV) అనేది మీ వాహనం మార్కెట్​ విలువను సూచిస్తుంది. ఇది మీ వాహనం ప్రీమియం రేటును నిర్ణయిస్తుంది. ఇది ఎంత ఎక్కువ ఉంటే మీరు క్లెయిమ్​ సెటిల్​మెంట్​ చేసుకునే సమయంలో మీకు అంత ఎక్కువ మొత్తం వస్తుంది. దొంగతనం, డ్యామేజీ లాంటివి జరిగినపుడు మీకు ఐడీవీ (IDV) విలువ సహాయపడుతుంది. డిజిట్​లో మీరు ఇన్సూరెన్స్​ చేసేటపుడు మీ ఐడీవీ (IDV) ని మార్చుకునే అవకాశం ఉంటుంది. అందువలన మీరు నష్టపోకుండా ఉండే అవకాశం ఉంది. అత్యుత్తమ విలువ: అన్ని విషయాలను గమనించిన తర్వాత మీకు అన్నింట్లో అనువైన ఆటో రిక్షా పాలసీనే ఎంచుకోండి. ధర, సేవలు, క్లెయిమ్​ సెటిల్​మెంట్ కాలం తదితర విషయాలను పరిగణనలోకి తీసుకోండి.

తక్కువ రేటు ఉన్న ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ను తీసుకునే బదులు మీరు ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ను ఎంచుకునేటపుడు ఒకసారి వివిధ కంపెనీల ఆటో రిక్షా ఇన్సూరెన్స్​లను తనిఖీ చేయడం అవసరం. వాళ్లు అందిస్తున్న సేవలు, ప్రయోజనాలు, క్లెయిమ్​ సెటిల్​మెంట్​ కాలం తదితర అంశాలను గమనించాలి.

మీరు త్రీ వీలర్​ ఇన్సూరెన్స్​ తీసుకునేటపుడు కింది విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఈ విషయాలు చాలా ముఖ్యం మరి.

  • సర్వీస్​ ప్రయోజనాలు: మీరు ఏదైనా సమస్యలో ఉన్నపుడు వారు అందించే సేవలు చాలా ముఖ్యం. కావున మీరు ఇన్సూరెన్స్​ తీసుకుందామని భావించే కంపెనీలో మంచి సర్వీసు ఉండేలా చూసుకోండి. డిజిట్​ కంపెనీలో 24*7 కస్టమర్​ సపోర్ట్​ అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా మాకు దేశవ్యాప్తంగా 2500 కంటే ఎక్కువగా క్యాష్​లెస్​ గ్యారేజీలు ఉన్నాయి.
  • వేగవంతమైన క్లెయిమ్​ సెటిల్​మెంట్​: ఇన్సూరెన్స్​ ప్రక్రియలో అతి ముఖ్యమైనది క్లెయిమ్​ సెటిల్​మెంట్​. కావున త్వరగా క్లెయిమ్​ సెటిల్​ చేసే కంపెనీలో మీరు ఇన్సూరెన్స్​ చేయించుకోవాలి. డిజిట్​ కంపెనీలో 96% క్లెయిములు 30 రోజుల వ్యవధిలోపే సెటిల్​ అవుతాయి. అంతేకాకుండా మేము క్లెయిమ్స్​ కోసం ఎటువంటి హార్డ్​​ కాపీలను వినియోగదారుల నుంచి తీసుకోము. ప్రతీది పేపర్​లెస్​గా ఉంటుంది. క్లెయిమ్స్​ త్వరగా సెటిల్​ అవుతాయి. ఎటువంటి చింత లేకుండా ప్రక్రియ పూర్తవుతుంది.
  • మీ ఐడీవీని తనిఖీ చేయండి: చాలా ఆటో రిక్షా ఇన్సూరెన్స్​లలో తక్కువ ఐడీవీ (IDV) ఉంటుంది. ఐడీవీ (IDV) అనేది మీ వాహనం మార్కెట్​ విలువను సూచిస్తుంది. ఇది మీ వాహనం ప్రీమియం రేటును నిర్ణయిస్తుంది. ఇది ఎంత ఎక్కువ ఉంటే మీరు క్లెయిమ్​ సెటిల్​మెంట్​ చేసుకునే సమయంలో మీకు అంత ఎక్కువ మొత్తం వస్తుంది. దొంగతనం, డ్యామేజీ లాంటివి జరిగినపుడు మీకు ఐడీవీ (IDV) విలువ సహాయపడుతుంది. డిజిట్​లో మీరు ఇన్సూరెన్స్​ చేసేటపుడు మీ ఐడీవీ (IDV) ని మార్చుకునే అవకాశం ఉంటుంది. అందువలన మీరు నష్టపోకుండా ఉండే అవకాశం ఉంది.
  • అత్యుత్తమ విలువ: అన్ని విషయాలను గమనించిన తర్వాత మీకు అన్నింట్లో అనువైన ఆటో రిక్షా పాలసీనే ఎంచుకోండి. ధర, సేవలు, క్లెయిమ్​ సెటిల్​మెంట్ కాలం తదితర విషయాలను పరిగణనలోకి తీసుకోండి.

ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ ప్రీమియంను​ ప్రభావితం చేసే అంశాలు?

ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ ప్రీమియంను కింది విషయాలు ప్రభావితం చేస్తాయి. మోడల్​, ఇంజన్​, వాహన తయారీ: ఏ విధమైన మోటార్​ ఇన్సూరెన్స్​కు అయినా మోడల్​, తయారీ, ఇంజన్​ రకం అనేవి చాలా ముఖ్యం. అదేవిధంగా మీ ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ కూడా మీ మోడల్​పై ఆధారపడుతుంది. అలాగే రిక్షాకు వాడే ఇంధనం కూడా ముఖ్యమే. దానితోపాటు తయారైన సంవత్సరం వంటి ఇతర విషయాలను కూడా పరిగణనలోనికి తీసుకుంటారు. ప్రాంతం: మీరు ఏ ప్రాంతంలో మీ ఆటో రిక్షాను నడుపుతున్నారనే విషయం కూడా ఇక్కడ ముఖ్యమే. ఈ విషయం కూడా మీ ఆటో రిక్షా ప్రీమియంను నిర్ధారిస్తుంది. మెట్రోపాలిటన్​ నగరాల్లో ట్రాఫిక్​ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ తిరిగే వాహనాలకు ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. అదే చిన్న నగరాలలో అయితే ఇన్సూరెన్స్​ ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. నో క్లెయిమ్​ బోనస్: మీకు ఇదివరకే ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ ఉండి మీరు దానిని రెన్యూ చేయాలని చూస్తున్నపుడు మీకు నో క్లెయిమ్​ బోనస్​ (NCB) వలన కొంత రాయితీ​ లభిస్తుంది. మీరు అంతకుముందు తీసుకున్న ఇన్సూరెన్స్​ కాలవ్యవధిలో ఎటువంటి క్లెయిమ్స్​ చేయకుండా ఉంటే నో క్లెయిమ్​ బోనస్​ డిస్కౌంట్​ లభిస్తుంది. ఇది కూడా మీ పాలసీ ప్రీమియంను ప్రభావితం చేస్తుంది. ఇన్సూరెన్స్​ ప్లాన్​ రకం: ప్రస్తుతం ఆటో రిక్షాలకు సంబంధించి రెండు రకాల ఇన్సూరెన్స్​లు అందుబాటులో ఉన్నాయి. మీ ఇన్సూరెన్స్​ ప్రీమియం అనేది మీరు ఎంచుకునే ఇన్సూరెన్స్​ రకం మీద కూడా ఆధారపడి ఉంటుంది. మీరు లయబులిటీ ప్లాన్​ను మాత్రమే ఎంచుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. అదే స్టాండర్డ్​ ఇన్సూరెన్స్​ను ఎంచుకుంటే ప్రీమియం రేటు ఎక్కువగా ఉంటుంది. కానీ, లయబులిటీ ఇన్సూరెన్స్​లో మీకు కవర్​ అయ్యే విషయాలు చాలా తక్కువగా ఉంటాయి. అదే స్టాండర్డ్​ ఇన్సూరెన్స్​లో మీకు కవర్​ అయ్యే విషయాలు ఎక్కువగా ఉంటాయి. స్టాండర్డ్ ఇన్సూరెన్స్​ తీసుకున్నపుడు డ్రైవర్​కు ప్రమాదం జరిగినా కూడా కవర్​ అవుతుంది.

ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ ప్రీమియంను కింది విషయాలు ప్రభావితం చేస్తాయి.

  • మోడల్​, ఇంజన్​, వాహన తయారీ: ఏ విధమైన మోటార్​ ఇన్సూరెన్స్​కు అయినా మోడల్​, తయారీ, ఇంజన్​ రకం అనేవి చాలా ముఖ్యం. అదేవిధంగా మీ ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ కూడా మీ మోడల్​పై ఆధారపడుతుంది. అలాగే రిక్షాకు వాడే ఇంధనం కూడా ముఖ్యమే. దానితోపాటు తయారైన సంవత్సరం వంటి ఇతర విషయాలను కూడా పరిగణనలోనికి తీసుకుంటారు.
  • ప్రాంతం: మీరు ఏ ప్రాంతంలో మీ ఆటో రిక్షాను నడుపుతున్నారనే విషయం కూడా ఇక్కడ ముఖ్యమే. ఈ విషయం కూడా మీ ఆటో రిక్షా ప్రీమియంను నిర్ధారిస్తుంది. మెట్రోపాలిటన్​ నగరాల్లో ట్రాఫిక్​ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ తిరిగే వాహనాలకు ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. అదే చిన్న నగరాలలో అయితే ఇన్సూరెన్స్​ ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది.
  • నో క్లెయిమ్​ బోనస్: మీకు ఇదివరకే ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ ఉండి మీరు దానిని రెన్యూ చేయాలని చూస్తున్నపుడు మీకు నో క్లెయిమ్​ బోనస్​ (NCB) వలన కొంత రాయితీ​ లభిస్తుంది. మీరు అంతకుముందు తీసుకున్న ఇన్సూరెన్స్​ కాలవ్యవధిలో ఎటువంటి క్లెయిమ్స్​ చేయకుండా ఉంటే నో క్లెయిమ్​ బోనస్​ డిస్కౌంట్​ లభిస్తుంది. ఇది కూడా మీ పాలసీ ప్రీమియంను ప్రభావితం చేస్తుంది.
  • ఇన్సూరెన్స్​ ప్లాన్​ రకం: ప్రస్తుతం ఆటో రిక్షాలకు సంబంధించి రెండు రకాల ఇన్సూరెన్స్​లు అందుబాటులో ఉన్నాయి. మీ ఇన్సూరెన్స్​ ప్రీమియం అనేది మీరు ఎంచుకునే ఇన్సూరెన్స్​ రకం మీద కూడా ఆధారపడి ఉంటుంది. మీరు లయబులిటీ ప్లాన్​ను మాత్రమే ఎంచుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. అదే స్టాండర్డ్​ ఇన్సూరెన్స్​ను ఎంచుకుంటే ప్రీమియం రేటు ఎక్కువగా ఉంటుంది. కానీ, లయబులిటీ ఇన్సూరెన్స్​లో మీకు కవర్​ అయ్యే విషయాలు చాలా తక్కువగా ఉంటాయి. అదే స్టాండర్డ్​ ఇన్సూరెన్స్​లో మీకు కవర్​ అయ్యే విషయాలు ఎక్కువగా ఉంటాయి. స్టాండర్డ్ ఇన్సూరెన్స్​ తీసుకున్నపుడు డ్రైవర్​కు ప్రమాదం జరిగినా కూడా కవర్​ అవుతుంది.

ఆటో రిక్షా ఇన్సూరెన్స్​ గురించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQలు)

నేను డిజిట్​ నుంచి ఆన్​లైన్​లో ఈ-రిక్షా ఇన్సూరెన్స్​ను కొనుగోలు చేయొచ్చా?

కొనుగోలు చేయొచ్చు. అందుకోసం మీరు కేవలం 70 2600 2400 అనే నెంబర్​కు వాట్సాప్​ చేస్తే సరిపోతుంది. అప్పుడు మేము మీ ఈ-ఆటో రిక్షా కోసం తగిన ప్లాన్​ను సూచిస్తాం.

లయబులిటీ ఓన్లీ ఆటో రిక్షా పాలసీ, స్టాండర్డ్​ ఆటో రిక్షా పాలసీల మధ్య తేడా ఏంటి?

లయబులిటీ ఓన్లీ ఆటో రిక్షా పాలసీ కేవలం థర్డ్​ పార్టీ నష్టాల​ను మాత్రమే కవర్​ చేస్తుంది. థర్డ్​ పార్టీ ప్రాపర్టీలకు డ్యామేజ్​ అయినా కవర్​ చేస్తుంది. కానీ, స్టాండర్డ్​ పాలసీ మీ సొంత డ్యామేజీలను కూడా కవర్​ చేస్తుంది. ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాల వలన ఎటువంటి నష్టాలు సంభవించినా ఇది కవర్​ చేస్తుంది.

నా ఆటో రిక్షాకు డ్యామేజ్​ అయినపుడు నేను దానిని ఎక్కడ రిపేర్​ చేయించుకోవాలి?

భారతదేశ వ్యాప్తంగా మాకు 1400 కంటే ఎక్కువగా నెట్​వర్క్​ గ్యారేజీలు ఉన్నాయి. మీరు మాతో పాలసీ చేయించుకుంటే వీటిలో ఎక్కడైనా రిపేర్లు చేయించుకోవచ్చు. అలాకాకుండా మీరు ఏదైనా రిక్షా గ్యారేజీలో రిపేర్​ చేయించుకుని రీయింబర్స్​మెంట్​ ఆప్షన్​ను కూడా ఎంచుకోవచ్చు.

ఆటో రిక్షా ఇన్సూరెన్స్​లో ప్రయాణికులు కూడా కవర్​ అవుతారా?

ప్రయాణికులు థర్డ్​ పార్టీ కింద కవర్​ అవుతారు. కాబట్టి లయబులిటీ పాలసీ, స్టాండర్డ్ పాలసీ ఏది ఉన్నా సరిపోతుంది.

నా కంపెనీలో 100 ఆటో రిక్షాలున్నాయి. వాటన్నిటినీ నేను డిజిట్​ ద్వారా ఇన్సూర్​ చేయొచ్చా?

చేసుకోవచ్చు. మీరు ఎన్ని వాహనాలకు ఇన్సూరెన్స్​ చేయించాలనే పరిమితి ఏమీ లేదు.

నా ఆటోకు ప్రమాదం జరిగినప్పుడు నేను ఏం చేయాలి?

వెంటనే 1800-103-4448 నెంబర్​కు కాల్​ చేయండి. ఇక అక్కడి నుంచి మేము మీకు హెల్ప్​ చేస్తాం.