కార్పొరేట్ ప్రొఫెషనల్స్ కోసం సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్

Zero Paperwork. Quick Process.

మీరు ఇప్పటికే మీ యజమాని ద్వారా కవర్ చేయబడినప్పుడు మీరు సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు పొందాలి?

మీ హెల్త్ ఇన్సూరెన్స్‌ను డిజిట్ తో టాప్ అప్ చెయ్యడం లో ప్రయోజనం ఏమిటి?

పాండమిక్‌లను కవర్ చేస్తుంది : COVID-19 మన జీవితాల్లో చాలా అనిశ్చితిని తీసుకొచ్చిందని మేము అర్థం చేసుకున్నాము. ఇతర అనారోగ్యాలతో పాటు, COVID-19 ఒక మహమ్మారి అయినప్పటికీ కూడా కవర్ చేయబడింది.

డిజిట్ సూపర్ టాప్-అప్ ప్లాన్‌ను అందిస్తుంది : ఒక స్టాండర్డ్ టాప్-అప్ ప్లాన్‌లా కాకుండా, సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ క్లయిమ్ లు మీ డిడక్టబుల్ ను మించి ఉన్నా కూడా వాటిని కవర్ చేస్తుంది. స్టాండర్డ్ టాప్ అప్ ప్లాన్ లో సంవత్సరానికి డిడక్టబుల్ దాటి ఉన్న కేవలం ఒక క్లయిమ్ నే కవర్ చేస్తాయి.

ఆరోగ్య సంరక్షణ అవసరాలకు అనుగుణంగా మీ సూపర్ టాప్ : అప్ పాలసీని మలుచుకోండి: మీరు 1, 2, 3 మరియు 5 లక్షల డిడక్షన్ ను ఎంచుకోవచ్చు మరియు మీ ఇన్సూరెన్స్ మొత్తంగా రూ. 10 లక్షల నుండి 20 లక్షల మధ్య ఎంచుకోవచ్చు.

గది అద్దె పై పరిమితి లేదు : ప్రతి ఒక్కరికి వేర్వేరు ప్రాధాన్యతలు ఉంటాయి మరియు మేము దానిని అర్థం చేసుకున్నాము. అందుకే, మా ప్లాన్ లో గది అద్దె పరిమితులు లేవు! మీరు ఇష్టపడే ఏదైనా ఆసుపత్రి గదిని ఎంచుకోవచ్చు. 

ఏదైనా ఆసుపత్రిలో చికిత్స పొందండి : నగదు రహిత క్లయిమ్ ల కోసం భారతదేశంలోని మా నెట్‌వర్క్ హాస్పిటల్‌లలో 10500+ నుండి ఎంచుకోండి లేదా మీరు రీయింబర్స్‌మెంట్‌ ఎంపికను కూడా ఎంచుకోవచ్చు.

సులభమైన ఆన్‌లైన్ ప్రాసెస్‌లు : సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసే ప్రక్రియ నుండి మీ క్లయిమ్ వరకు అంతా పేపర్‌లెస్ గా, సులభమైన, శీఘ్ర మరియు అవాంతరాలు లేకుండా ఉంటుంది! క్లయిమ్ ల కోసం కూడా హార్డ్ కాపీలు అవసరం లేదు!

ఒక ఉదాహరణతో సూపర్ టాప్-అప్‌ని అర్థం చేసుకోండి

సూపర్ టాప్-అప్ ఇన్సూరెన్స్ (డిజిట్ హెల్త్ కేర్ ప్లస్) ఇతర టాప్-అప్ ప్లాన్‌లు
డిడక్టబుల్ ఎంపిక 2 లక్షలు 2 లక్షలు
ఎంచుకున్న ఇన్సూరెన్స్ మొత్తం 10 లక్షలు 10 లక్షలు
సంవత్సరంలో మొదటి క్లయిమ్ 4 లక్షలు 4 లక్షలు
మీరు చెల్లించేది 2 లక్షలు 2 లక్షలు
మీ టాప్-అప్ ఇన్సూరెన్స్ సంస్థ చెల్లించేది 2 లక్షలు 2 లక్షలు
సంవత్సరం లో 2వ క్లయిమ్ 6 లక్షలు 6 లక్షలు
మీరు చెల్లించేది ఏమి ఉండదు! 😊 2 లక్షలు (డిడక్టబుల్ ఎంపిక)
మీ టాప్-అప్ ఇన్సూరెన్స్ సంస్థ చెల్లించేది 6 లక్షలు 4 లక్షలు
సంవత్సరంలో 3వ క్లయిమ్ 1 లక్ష 1 లక్ష
మీరు చెల్లించేది ఏమి ఉండదు! 😊 1 లక్ష
మీ టాప్-అప్ ఇన్సూరెన్స్ సంస్థ చెల్లించేది 1 లక్ష ఏమీ చెల్లించదు ☹️

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఏమి కవర్ చేయబడింది?

లాభాలు

సూపర్ టాప్-అప్

ఇది డిడక్టబుల్ పరిమితిని దాటిన తర్వాత పాలసీ సంవత్సరంలో మొత్తం వైద్య ఖర్చుల కోసం క్లయిమ్ లను చెల్లిస్తుంది, మరియు సాధారణ టాప్-అప్ ఇన్సూరెన్స్ థ్రెషోల్డ్ పరిమితి ను మించి ఒక్క క్లయిమ్ ను మాత్రమే కవర్ చేస్తుంది.

మీ డిడక్టబుల్ ను ఒక్కసారి మాత్రమే చెల్లించండి- డిజిట్ స్పెషల్

అన్ని హాస్పిటలైజేషన్

ఇది అనారోగ్యం, ప్రమాదం లేదా తీవ్రమైన అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరే ఖర్చులకు వర్తిస్తుంది. మీ డిడక్టబుల్ పరిమితిని దాటిన తర్వాత, మొత్తం ఖర్చులు మీరు ఎంచుకున్న ఇన్సూరెన్స్ మొత్తం లో మిగిలి ఉన్నంత వరకు, బహుళ ఆసుపత్రుల కోసం కవర్ చేయడానికి ఇది ఉపయోగించబడుతుంది.

డే కేర్ విధానాలు

హెల్త్ ఇన్సూరెన్స్ 24 గంటల కంటే ఎక్కువ ఆసుపత్రిలో చేరిన వారికి మాత్రమే వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది. డే కేర్ విధానాలు సాంకేతిక పురోగతి కారణంగా 24 గంటల కంటే తక్కువ సమయం అవసరమయ్యే ఆసుపత్రిలో చేపట్టే వైద్య చికిత్సలను సూచిస్తాయి.

ముందుగా ఉన్న/నిర్దిష్ట అనారోగ్యం కొరకు వేచి ఉండే కాలం

మీరు ముందుగా ఉన్న లేదా నిర్దిష్ట అనారోగ్యం కోసం క్లయిమ్ వేసే వరకు మీరు వేచి ఉండాల్సిన సమయం ఇది.

4 సంవత్సరాలు/2 సంవత్సరాలు

గది అద్దె పై పరిమితి

వేర్వేరు వర్గాల గదులు వేర్వేరు అద్దెలను కలిగి ఉంటాయి. హోటల్ గదులకు సుంకాలు ఎలా ఉంటాయో అలాగే. డిజిట్‌తో, కొన్ని ప్లాన్‌లు మీ ఇన్సూరెన్స్ మొత్తం కంటే తక్కువగా ఉన్నంత వరకు, గది అద్దె పై పరిమితిని విధించవు.

గది అద్దె క్యాపింగ్ లేదు - డిజిట్ స్పెషల్

ICU గది అద్దె

ICU (ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు) తీవ్రమైన అనారోగ్యం గల రోగుల కోసం ఉద్దేశించబడింది. ICUలలో సంరక్షణ స్థాయి ఎక్కువగా ఉంటుంది, అందుకే అద్దె కూడా ఎక్కువగా ఉంటుంది. మీ ఇన్సూరెన్స్ మొత్తం కంటే అది తక్కువ ఉన్నంత కాలం ICU అద్దెకు డిజిట్ ఎటువంటి పరిమితిని విధించదు.

పరిమితి లేదు

రోడ్డు అంబులెన్స్ ఛార్జీలు

అంబులెన్స్ సేవలు అత్యంత ముఖ్యమైన వాటిలో ఒకటి. ఇవి వైద్య సేవలు అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించడంలో సహాయం చేయడమే కాకుండా, వైద్య అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన ప్రాథమిక సౌకర్యాలను కూడా కలిగి ఉంటాయి. దాని ఖర్చు ఈ సూపర్ టాప్-అప్ పాలసీ కింద కవర్ చేయబడుతుంది.

కాంప్లిమెంటరీ వార్షిక ఆరోగ్య తనిఖీ

మీ మొత్తం ఆరోగ్యం మరియు శ్రేయస్సు గురించి మీకు తెలుసని నిర్ధారించుకోవడానికి వార్షిక ఆరోగ్య పరీక్షలు ముఖ్యమైనవి. మీకు నచ్చిన ఏ ఆసుపత్రిలోనైనా వార్షిక వైద్య పరీక్షలు మరియు చెకప్‌ల కోసం పెట్టిన మీ ఖర్చులను రీయింబర్స్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే పునరుద్ధరణ ప్రయోజనం.

హాస్పిటలైజేషన్ ముందు/తరువాత

ఇది రోగనిర్ధారణ, పరీక్షలు మరియు కోలుకోవడం వంటి ఆసుపత్రిలో చేరే ముందు మరియు తర్వాత పెట్టే అన్ని ఖర్చులకు వర్తిస్తుంది.

పోస్ట్ హాస్పిటలైజేషన్ లంప్సమ్ - డిజిట్ స్పెషల్

ఆసుపత్రిలో చేరిన తర్వాత, డిశ్చార్జ్ సమయంలో జరిగే మీ అన్ని వైద్య ఖర్చులను కవర్ చేయడానికి మీరు ఉపయోగించగల ప్రయోజనం ఇది. దీనికి బిల్లులు అవసరం లేదు. రీయింబర్స్‌మెంట్ ప్రక్రియ ద్వారా మీరు ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకోవచ్చు లేదా స్టాండర్డ్ ఆసుపత్రిలో చేరిన తర్వాత ప్రయోజనాన్ని ఉపయోగించడాన్ని ఎంచుకోవచ్చు.

సైకియాట్రిక్ ఇల్నెస్ కవర్

గాయం కారణంగా, ఏదైనా మానసిక చికిత్స కోసం ఆసుపత్రిలో చేరవలసి వస్తే, అది ఈ ప్రయోజనం కింద కవర్ చేయబడుతుంది. అయితే, OPD సంప్రదింపులు దీని పరిధిలోకి రావు.

బారియాట్రిక్ సర్జరీ

ఈ కవరేజ్ వారి ఊబకాయం (BMI> 35) కారణంగా అవయవ సమస్యలను ఎదుర్కొంటున్న వారికి. అయితే, ఊబకాయం తినే రుగ్మతలు, హార్మోన్లు లేదా ఏదైనా ఇతర చికిత్స చేయగల పరిస్థితుల కారణంగా ఉంటే, ఈ శస్త్రచికిత్స ఖర్చు కవర్ చేయబడదు.

Get Quote

ఏది కవర్ చేయబడదు?

మీరు మీ డిడక్టబుల్ అయిపోయే వరకు మీరు క్లయిమ్ చేయలేరు

మీరు ఇప్పటికే ఉన్న మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ క్లయిమ్ మొత్తం అయిపోయిన తర్వాత లేదా మీ జేబు నుండి డిడక్టబుల్ పరిమితి వరకు ఖర్చు చేసిన తర్వాత మాత్రమే మీరు మీ సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ లో క్లయిమ్ చేయవచ్చు. అయితే, మీరు మీ డిడక్టబుల్ ఒక్కసారే చెల్లించాలి అనేది శుభవార్త.

ముందుగా ఉన్న వ్యాధులు

ముందుగా ఉన్న వ్యాధి విషయంలో, వెయిటింగ్ పీరియడ్ ముగియకపోతే, ఆ వ్యాధి లేదా అనారోగ్యం కోసం క్లయిమ్ వేయలేరు.

డాక్టర్ సిఫార్సు లేకుండా ఆసుపత్రిలో చేరడం

మీరు ఆసుపత్రిలో చేరిన ఏ పరిస్థితి అయినా డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తో సరిపోలక పోతే మీరు క్లయిమ్ చెయ్యలేరు.

ప్రసవానికి ముందు మరియు ప్రసవానంతర ఖర్చులు

ప్రసవానికి ముందు మరియు ప్రసవానంతర వైద్య ఖర్చులు, ఇది ఆసుపత్రికి దారి తీస్తే తప్ప.

క్లయిమ్ వేయడం ఎలా?

రీయింబర్స్‌మెంట్ క్లయిమ్ లు - ఆసుపత్రిలో చేరిన రెండు రోజులలోపు 1800-258-4242 లో మాకు తెలియజేయండి లేదా healthclaims@godigit.com కు ఇమెయిల్ చేయండి మరియు మీరు మీ హాస్పిటల్ బిల్లులు మరియు సంబంధిత రీయింబర్స్‌మెంట్ ప్రాసెస్ చేయడానికి పత్రాలు అన్నింటిని అప్‌లోడ్ చేయగల లింక్‌ను మేము మీకు పంపుతాము. 

నగదు రహిత క్లయిమ్ లు - నెట్‌వర్క్ ఆసుపత్రిని ఎంచుకోండి. మీరు నెట్‌వర్క్ ఆసుపత్రుల పూర్తి జాబితాను ఇక్కడ కనుగొనవచ్చు. హాస్పిటల్ హెల్ప్‌డెస్క్‌లో ఇ-హెల్త్ కార్డ్‌ని చూపించి, నగదు రహిత అభ్యర్థన ఫారమ్‌ను అడగండి. అన్నీ సరిగ్గా ఉంటే, మీ క్లయిమ్ అప్పటికప్పుడే ప్రాసెస్ చేయబడుతుంది.

మీరు కరోనావైరస్ కోసం క్లయిమ్ చేసినట్లయితే, ICMR - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పూణే యొక్క అధీకృత కేంద్రం నుండి మీకు పాజిటివ్ టెస్ట్ రిపోర్ట్ ఉందని నిర్ధారించుకోండి.

తరచుగా అడుగు ప్రశ్నలు

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ పొందడానికి నేను కార్పొరేట్ ప్లాన్‌ని కలిగి ఉండాలా?

లేదు, మీకు కార్పొరేట్ ప్లాన్ ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా మీరు సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ పొందవచ్చు.

సూపర్ టాప్-అప్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు ఏమిటి?

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి, ఇది స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంటే చాలా చౌకగా ఉంటుంది. రెండవది, ఇది అధిక మొత్తం ఇన్సూరెన్స్, పన్ను ఆదా మొదలైన అనేక ఇతర ప్రయోజనాలతో వస్తుంది. 

యజమానులు సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకాలను అందిస్తారా?

లేదు, యజమానులు సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను అందించరు. సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను మీరు మీ కోసం మరియు/లేదా మీ కుటుంబం కోసం కొనుగోలు చేయవచ్చు.

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ పరిమితులు ఏమిటి?

సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ఏకైక పరిమితి ఏమిటంటే, మీ ఆరోగ్య సంరక్షణ ఖర్చులు నిర్ణయించిన డిడక్టబుల్ పరిమితిని దాటిన తర్వాత మాత్రమే ఇది మీకు వర్తిస్తుంది.