బైక్​ ఇన్సూరెన్స్​ను పోల్చి చూడండి

ఆన్​లైన్​లో బైక్​ ఇన్సూరెన్స్​ ప్రీమియంను చెక్ చేసి పోల్చి చూడండి

Third-party premium has changed from 1st June. Renew now

అసలు టూ వీలర్​ ఇన్సూరెన్స్​ను ఎందుకు పోల్చి చూడాలి?

మీకు ఓ కొత్త షర్ట్​ కావాలని అనుకున్నపుడు మీరు బట్టల షాప్‌కి వెళ్లి మీకు కావాల్సిన షర్ట్​ను కొనుక్కుంటారు. మీకు ఆ షర్ట్​ గురించి తెలిస్తే తేలిగ్గా అదే షర్ట్​ను ఎంచుకుంటారు. ఆ షర్ట్​ గురించి ఏమీ తెలియనపుడు మీరు అక్కడున్న అన్ని రకాల షర్ట్స్​ను పోల్చిచూస్తారు. మీకు నచ్చిన షర్టులను ట్రయల్​ రూమ్‌లోకి వెళ్లి వేసుకుని చూసుకుంటారు. మీకు సరిగ్గా నప్పుతుందని అనిపిస్తేనే కొనుక్కుంటారు.

మీరు ఆ షర్టుకు బిల్లు చెల్లించేందుకు మీరు వెళ్లినపుడు ఆ చొక్కా నలగకుండా ఉందో లేదో చూసుకుంటారు. బైక్​ ఇన్సూరెన్స్​ తీసుకునే ముందు కూడా మీరు అలాగే చేయండి. అందుబాటులో ఉన్న ఆప్షన్ల​ను ఒకసారి తనిఖీ చేయండి. ఆ పాలసీలు మీకు సరిపోతాయో లేదో సరిచూసుకోండి. ఒకసారి పాలసీ తీసుకున్న తర్వాత మీరు చెక్​ చేసినా ప్రయోజనం ఉండదు. కాబట్టి ముందుగానే అన్నీ చెక్‌ చేసుకుంటే బాగుంటుంది.

మీ అవసరాలకు సరిపోయే పాలసీ తక్కువ ఖర్చులో కూడా మీకు లభ్యం కావొచ్చు. కాబట్టి మీరు బైక్​ పాలసీని కొనుగోలు చేసే ముందు వివిధ రకాల కంపెనీలు అందించే పాలసీలను పోల్చి చూడండి.

బైక్​ ఇన్సూరెన్స్​ను ఎందుకు పోల్చి చూడాలి?

ఇన్సూరెన్స్ కంపెనీల విశ్వసనీయతను తెలుసుకోవడానికి..

మీరు పాలసీని తీసుకునే ముందు ఇన్సూరెన్స్​ కంపెనీల విశ్వసనీయతను చెక్​ చేయండి. ఇందుకోసం మీరు ప్రజల సమీక్షలను కూడా తనిఖీ చేయండి. అప్పడు మీకు ఉత్తమ సర్వీస్​ అందించే ఇన్సూరెన్స్​ కంపెనీ ఏదో తెలిసిపోతుంది. ఇక మీకు అప్పుడు మంచి ఇన్సూరెన్స్​  కంపెనీ ఏదో కనుక్కోవడం చాలా ఈజీగా ఉంటుంది.

మీ పాలసీ నిబంధనలను తెలుసుకోండి

మీరు సొంతంగా పాలసీ గురించి అర్థం చేసుకున్నపుడు ఏజెంట్లను సంప్రదించాల్సిన అవసరం ఉండదు. పాలసీలో కవర్​ అయ్యే విషయాలు, కవర్​ కాని విషయాల గురించి మీకు తెలిసినపుడు మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకునేందుకు వీలుంటుంది. మీరు అనేక రకాల ఇన్సూరెన్స్​ పాలసీలను చదివినపుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది.

క్లెయిమ్​ ప్రాసెస్‌లో కంపాటబిలిటీ గురించి పూర్తిగా తెలుసుకోండి

క్లెయిమ్​ ప్రాసెస్​లో ఏ ఇన్సూరెన్స్​ కంపెనీలు ఉత్తమమో తెలుసుకునేందుకు వివిధ పాలసీలను పోల్చి చూడటం చాలా అవసరం. మీరు క్లెయిమ్​ చేసిన తర్వాత ఉండే విషయాలను గురించి కూడా ఈ రీసెర్చ్ మీకు తెలియజేస్తుంది. అప్పుడు మీకు నచ్చిన పాలసీని మీరు ఎంచుకోవచ్చు.

సరైన డీల్​ను కనుక్కోండి

భారతదేశంలో ఉన్న టాప్​ ఇన్సూరెన్స్​ కంపెనీలు అందించే డీల్స్​ను మీరు చెక్​ చేయండి. ఏ పాలసీకి ఎంత ప్రీమియం ఉందో చూసి మీకు సరిగ్గా సరిపోయే పాలసీని తీసుకోండి. మీ డబ్బును ఆదా చేసుకోండి.

ఆఫర్లు, డిస్కౌంట్లు పొందండి

కొన్ని ఇన్సూరెన్స్​ కంపెనీలు తమ బైక్​ ఇన్సూరెన్స్​ ప్లాన్ల మీద పెద్ద మొత్తంలో డిస్కౌంట్లు అందజేస్తున్నాయి. మీరు సరిగ్గా వెతకకుంటే ఆ పాలసీలను మిస్సయ్యే అవకాశం ఉంది. కావున పెద్ద మొత్తంలో డిస్కౌంట్ల కోసం సరిగ్గా తనిఖీ చేయండి.

ఆన్‌లైన్‌లో బైక్​ ఇన్సూరెన్స్‌ను పోల్చి చూసేటప్పుడు పరిగణనలోనికి తీసుకోవాల్సిన అంశాలు

  • కవరేజ్​: మీకు ఏ విధమైన కవరేజ్​ (పాలసీ రకం) కావాలో ముందుగా నిర్ణయించుకోవాలి. థర్డ్​ పార్టీ లయబిలిటీ పాలసీయా, లేక కాంప్రహెన్సివ్​ పాలసీయా అనేది పక్కాగా నిర్ణయించుకోండి. భారతదేశంలో వాహనాలకు కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్​ అయినా ఉండటం తప్పనిసరి. ఈ పాలసీ ప్రీమియం మీ వాహనం ఇంజన్​ సామర్థ్యాన్ని బట్టి ఇన్సూరెన్స్​ రెగ్యులేటరీ అండ్​ డెవలప్​మెంట్​ అథారిటీ ఆఫ్​ ఇండియా (IRDAI) నిర్దేశించింది. కాంప్రహెన్సివ్​ పాలసీ సొంత​ డ్యామేజీలకు కూడా వర్తిస్తుంది. అంతేకాకుండా థర్డ్​ పార్టీ లయబిలిటీని కూడా ఇది అందిస్తుంది. మీకు ఏ ఇన్సూరెన్స్​ కంపెనీలో కాంప్రహెన్సివ్​ ఇన్సూరెన్స్​ తక్కువ ప్రీమియంలో లభ్యమవుతుందో ఒకసారి చెక్​ చేసుకోండి.

  • ఐడీవీ: ఇన్సూర్డ్​ డిక్లేర్డ్​​ వ్యాల్యూని సులభం​గా ఐడీవీ అని వ్యవహరిస్తారు. ఇది మీ బండి మార్కెట్​ (అప్పటి) విలువను చూపిస్తుంది. డిప్రిషియేషన్​ ఖర్చు​ను తీసివేసి విలువను చూపిస్తుంది. మీరు పాలసీ తీసుకున్న కంపెనీలో ఐడీవీని కస్టమైజ్ చేసుకునే వీలు ఉందో లేదో చూడండి. ఐడీవీ విలువ తక్కువగా ఉంటే మీ ప్రీమియం తగ్గుతుంది. ఐడీవీ ఎక్కువగా ఉంటే మీ ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. ఐడీవీ విలువను మార్చుకునేందుకు వీలు లేకపోతే మీ వాహన ఐడీవీ విలువను ఇన్సూరెన్స్​ కంపెనీ తక్కువగా నిర్ణయించే అవకాశం ఉంటుంది. ఐడీవీ తక్కువగా ఉండటం వలన మీ ప్రీమియం అమౌంట్​ తగ్గుతుంది. అప్పుడు మీరు తొందరగా అటువైపు ఆకర్షింపబడే అవకాశం ఉంటుంది. బైక్​ ఇన్సూరెన్స్​లో ఐడీవీ గురించి మరింత తెలుసుకోండి.

  • ప్రీమియం : మీరు తీసుకోవాలని అనుకుంటున్న ఇన్సూరెన్స్​ కంపెనీలు అందజేసే పాలసీ కోట్స్​ను పోల్చి చూడండి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీని అందజేసే టూ వీలర్​ ఇన్సూరెన్స్​ పాలసీని తీసుకోండి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి. ప్రతీసారి తక్కువ ప్రీమియం ఉన్న పాలసీలను తీసుకోవడం మంచిది కాదు. కావున నియమ నిబంధనలను జాగ్రత్తగా చదవండి.

  • యాడ్–ఆన్స్ : యాడ్​–ఆన్స్​ అనేవి స్వతహాగా ఉంటాయి. కాంప్రహెన్సివ్​ ఇన్సూరెన్స్​తో పాటుగా వీటిని కూడా ఎంచుకునే సౌలభ్యం ఉంటుంది. యాడ్​-ఆన్స్​ను ఎంచుకోవడం వలన మీ పాలసీ కవరేజ్​ విలువ పెరుగుతుంది. అదే సమయంలో మీ ప్రీమియం అమౌంట్​ కూడా పెరుగుతుంది. ఏ ఇన్సూరెన్స్​ కంపెనీ మీ అవసరాలకు తగిన యాడ్​–ఆన్స్​ను మీ బడ్జెట్​లో అందిస్తుందో చెక్ చేయండి. ఇంజన్​ ప్రొటెక్షన్​, జీరో డిప్రిషియేషన్, రిటర్న్​ టు ఇన్​వాయిస్ వంటి యాడ్​-ఆన్స్​ను ఇన్సూరెన్స్​ కంపెనీలు అందిస్తున్నాయి. ప్రో–ట్రిప్​ (Pro-tip): మీకు అవసరం ఉంటే మాత్రమే యాడ్​–ఆన్స్​ను తీసుకోండి. ఎందుకంటే యాడ్​–ఆన్స్​ వలన మీ ప్రీమియం పెరుగుతుంది. బైక్​ ఇన్సూరెన్స్​లో​ యాడ్​-ఆన్​ కవర్​​ గురించి మరింత తెలుసుకోండి.

  • క్లెయిమ్​ ప్రాసెస్​, క్లెయిమ్​ సెటిల్​మెంట్​ రేషియో : మీరు పాలసీ తీసుకోబోయే కంపెనీలో క్లెయిమ్​ ప్రాసెస్​ ఈజీగా, ఫాస్ట్​గా ఉందో తనిఖీ చేయడం అవసరం. ప్రస్తుతం నడుస్తోంది డిజిటల్​ వరల్డ్​. కావున ఆన్​లైన్​లో అందించే పేపర్​లెస్​ క్లెయిమ్​ కోసం వెతకండి. పాలసీదారులు ఎక్కువగా చూసేది వారి క్లెయిమ్​ సమయానికి సెటిల్​ అయిందా? లేదా? అని. ఇన్సూరెన్స్​ కంపెనీకి ఎన్ని క్లెయిమ్స్​ వచ్చాయి? వాటి నుంచి ఎన్ని క్లెయిమ్స్​ సెటిల్​ అయ్యాయనే వివరాలను బట్టి క్లెయిమ్​ ​సెటిల్​మెంట్​ రేషియోను లెక్కిస్తారు. ఈ క్లెయిమ్​ సెటిల్​మెంట్​ రేషియో ఎక్కువ ఉన్న కంపెనీని విశ్వసించవచ్చు.

  • కస్టమర్​ సర్వీస్​ అందుబాటు : మీరు ప్రీమియంలు కట్టేందుకు సిద్ధంగా ఉంటే.. కొన్ని కంపెనీలు మనకు సరైన కస్టమర్​ సర్వీస్​ అందిస్తాయి. కానీ, కొన్ని కంపెనీలు మాత్రం సరైన విధంగా కస్టమర్​ సర్వీస్​ను అందించవు. మంచి కస్టమర్​ సర్వీస్​ అనేది ఎల్లప్పుడూ అవసరం. కావున కస్టమర్​ సర్వీస్​ అత్యుత్తమంగా ఉండే కంపెనీల్లో మాత్రమే మీరు పాలసీలు తీసుకోవాలి.

  • ఎక్కువ కాలం, తక్కువ ప్రీమియం : ఇన్సూరెన్స్​ అనేది అనేక జిమ్మిక్కులతో కూడుకున్నది. మీకు ఎంత డిస్కౌంట్​ లభిస్తుందనే విషయం గురించి తెలుసుకోండి. సంవత్సరం పాలసీ తీసుకునే కన్నా ఎక్కువ రోజులకు పాలసీ తీసుకోవడం వలన మీ డబ్బులు ఆదా అవుతాయి.

  • గ్యారేజ్​ నెట్​వర్క్​: ఏ ఇన్సూరెన్స్​ కంపెనీ​కైతే దేశవ్యాప్తంగా గ్యారేజ్​ నెట్​వర్క్​లు ఉన్నాయో తనిఖీ చేయడం చాలా అవసరం. ఎప్పుడైనా మీ వాహనానికి రిపేర్​ వచ్చినపుడు నెట్​వర్క్ లోని గ్యారేజీకి వెళ్తే క్యాష్​లెస్​ క్లెయిమ్స్​ చేస్తారు. అటువంటి గ్యారేజీలు మీ పరిసరాల్లో ఎక్కడైనా ఉన్నాయో చూసుకొని పాలసీని తీసుకోండి.

  • రివ్యూలు: మిగతా వస్తువులను కొనుగోలు చేసినపుడు ఎలాగైతే మీరు రివ్యూలను చూస్తారో.. పాలసీలు కొనుగోలు చేసేటపుడు కూడా ఆన్​లైన్​లో రివ్యూలను చూడటం మంచిది. అప్పుడే మీకు ఆ పాలసీ గురించి పూర్తిగా తెలుస్తుంది. గూగుల్​ రివ్యూలు, ఫేస్​బుక్​ రేటింగ్స్​ మీకు ఒక ఐడియాను ఇస్తాయి. అంతే కాకుండా మీరు సులభంగా నిర్ణయం తీసుకునేలా చేస్తాయి.

  • ఏమేం కవర్​ కావు : చాలా ఇన్సూరెన్స్​ కంపెనీలు తాము కవర్​ చేసే విషయాలను చాలా పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తాయి. కానీ ఇక్కడ మీరు చూడాల్సింది కవర్​ కాని విషయాల గురించి.. వాటి గురించి ఆలోచించండి. ఎందుకంటే మీరు క్లెయిమ్​ చేద్దామని అనుకున్నపుడు అది కవర్​ కాదని తెలిస్తే మీరు షాక్​కు గురవుతారు.

  • డిడక్టబుల్స్​ : ప్రతీ పాలసీలో డిడక్టబుల్స్​ ఉంటాయి. మీరు పాలసీ క్లెయిమ్​ చేసినపుడు మినహాయించబడే​ మొత్తాన్ని డిడక్టబుల్స్​ అంటారు. మీ పాలసీలో డిడక్టబుల్స్​ ఎక్కువగా ఉంటే మీ పాలసీ ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఇదే విధంగా ప్రీమియం ఎక్కువగా ఉంటే డిడక్టబుల్స్​ అమౌంట్​ తక్కువగా ఉంటుంది.

టూ వీలర్​ ఇన్సూరెన్స్​ పాలసీని ఎలా పోల్చాలి?

ఆన్​లైన్​లో టూ వీలర్​ ఇన్సూరెన్స్​ను పోల్చండి ఆఫ్​లైన్​లో టూ వీలర్​ ఇన్సూరెన్స్​ను పోల్చండి
మీకు సౌలభ్యంగా ఉండే మీ గదిలో కూర్చుని మీ ల్యాప్​టాప్​లో ఇన్సూరెన్స్​ వెబ్​సైట్లను చూస్తూ పోల్చడం మొదలుపెట్టండి. తక్కువ మొత్తానికి మీకు పాలసీలు అందజేసే మీ ఏరియాలోని ఇన్సూరెన్స్​ బ్రోకర్​ను సంప్రదించండి.
మీ బైక్​ వివరాలను నింపి, మీరు కావాలనుకుంటున్న యాడ్​-ఆన్స్​ను ఎంచుకోండి. ఐడీవీని ఎంచుకోండి. మీ ఏజెంట్​కు మీ బండికి సంబంధించిన అన్ని వివరాలను ఇవ్వండి. అతడు మీకు సరిపడే పాలసీను సూచిస్తాడు.
కొత్త కంపెనీలు మీరు కోరుకున్న విధంగా పాలసీ వివరాలను మీకు అందిస్తాయి. వివరాలు అతడికి ఇచ్చిన తర్వాత అతడు ఎంక్వైరీ చేసి వివిధ కంపెనీల నుంచి మీకు సరిపోయే పాలసీలను మీకు అందజేస్తాడు.

ఆన్​లైన్​లో బైక్​ ఇన్సూరెన్స్​ను పోల్చడం వలన ప్రయోజనాలు

సమయం ఆదా అవుతుంది

ఆన్​లైన్​లో బైక్​ ఇన్సూరెన్స్​ను పోల్చడం వలన మీ విలువైన సమయం చాలా ఆదా అవుతుంది. మీ వివరాలను సిద్ధంగా ఉంచుకోవడం వలన ఆన్​లైన్​లో ఉచిత కోట్స్​ను పొందొచ్చు. ఇలా చేయడం వలన మీ సమయం ఆదా​ అవుతుంది.

సులభమైన పద్ధతి

ఆన్​లైన్​లో బైక్​ ఇన్సూరెన్స్​ ను పోల్చడం చాలా సులువు. మీ అవసరాలకు తగిన ఇన్సూరెన్స్​ను ఎంచుకోండి. ఇన్సూరెన్స్​ను ఆన్​లైన్​లో పోల్చడం వలన ఇది సాధ్యపడుతుంది. అంతేకాకుండా మీకు ఖాళీ సమయం ఉన్నపుడు కూడా చేయొచ్చు.

ఇన్సూరెన్స్​ ప్రీమియం క్యాలుక్యులేటర్

ఇన్సూరెన్స్​ పాలసీని ఎన్నుకునేందుకు మనకు వేర్వేరు రకాల కారణాలు ఉంటాయి. ఇన్సూరెన్స్ క్యాలుక్యులేటర్​ వంటి సాధనాలతో మీ ప్రీమియాన్ని తగ్గించుకునేందుకు వీలుంటుంది. అంతేకాకుండా ఆన్​లైన్​లో ఇన్సూరెన్స్​ ప్రీమియం రేట్లను తనిఖీ చేసి మీకు మీరుగా ఏది సరైందో నిర్ణయం తీసుకోండి. మీరు కావాలనుకుంటే మీ ప్రీమియాన్ని రాత్రి 2 గంటలకు కూడా లెక్కించుకోవచ్చు.

సులభమైన, ఎవరి ప్రభావం లేకుండా నిర్ణయాలను తీసుకోవడం

ఇన్సూరెన్స్​ బ్రోకర్​ వద్దకు వెళ్లి పాలసీను పోల్చి చూసిన దానికంటే ఆన్​లైన్​లో పోల్చి చూడటం వలన మనకు ఎక్కువ రకాల ఆప్షన్స్​ దొరుకుతాయి. సరైన కవరేజ్​ ఉన్న పాలసీని ఎంచుకోవడం చాలా అవసరం. అందుకోసం ఇంటర్​నెట్​ అనేది చాలా బెస్ట్​ ప్లేస్. మీ పాలసీకి భిన్నమైన యాడ్​–ఆన్స్​ను జతచేసి ఎక్కువ కవరేజ్​ పొందండి.

ఆన్​లైన్​లో బైక్​ ఇన్సూరెన్స్​ను పోల్చి చూసేటప్పుడు పరిగణించాల్సిన విషయాలు

ఇన్సూరెన్స్​ కంపెనీల విశ్వసనీయత - మార్కెట్​లో చాలా రకాల ఇన్సూరెన్స్​ కంపెనీలు ఉన్నాయి. కాబట్టి, మీరు పాలసీ తీసుకునే ముందు కొంత సమయం వెచ్చించి ఇన్సూరెన్స్​ కంపెనీ గురించి చెక్​ చేయడం చాలా అవసరం. కంపెనీ క్లెయిమ్​ సెటిల్​మెంట్​ రేషియోను తనిఖీ చేసేందుకు మీరు ఆన్​లైన్​లో రివ్యూలు చూసే వీలుంటుంది.

మీరు ఎంత చెల్లిస్తారు - మీకు అందే కవరేజ్​ కోసం మీరు ఎంత ప్రీమియం చెల్లిస్తున్నారనేది ఒక సారి ఇన్సూరెన్స్​ క్యాలుక్యులేటర్లతో తనిఖీ చేయండి. మీరు అన్ని వివరాలు నింపి బటన్​ నొక్కగానే మీ ప్రీమియంకు సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి. మీరు ఎంచుకున్న యాడ్–​ఆన్స్​కు ఎంత ఖర్చు అవుతుందో చూసుకోండి. వాటి వలన మీకు ఎంత ప్రయోజనం ఉంటుందో బేరీజు వేసుకోండి.

మీ అవసరాల గురించి స్పష్టత – మీ బైక్​ను సంరక్షించుకోవడం కోసం ఎలాంటి రకాల యాడ్​–ఆన్స్​ను తీసుకోవాలో పాలసీదారుడి​గా మీకు తెలుసు. ఈ అన్ని అవసరాలను కవర్​ చేసేందుకు సరిపోయే పాలసీని తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం సరైన యాడ్– ఆన్స్​ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

రెండు డిడక్టబుల్స్ – ఇదో జూదం వంటిది. కావున మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి రిస్కులను మీరు కవర్​ చేయాలని అనుకుంటున్నారో మీకు బాగా తెలుసు. కావున తక్కువ రిస్క్​ ఉందని మీరు భావించినపుడు పాలసీలో ఎక్కువ డిడక్టబుల్స్​ను ఎంచుకోవడం వలన మీ పాలసీ ప్రీమియం చాలా వరకు తగ్గుతుంది.