ఆన్‎లైన్‎లో బైక్ ఇన్సూరెన్స్ రెన్యువల్

ఆన్‌లైన్‌లో బైక్ ఇన్సూరెన్స్ రెన్యువల్ కోసం కొటేషన్ పొందండి

Third-party premium has changed from 1st June. Renew now

ఆన్‌లైన్‌లో టూ వీలర్ ఇన్సూరెన్స్ రెన్యువల్​కు సంబంధించిన అన్ని వివరాలు

అనేక రవాణా మార్గాలు ఉన్నప్పటికీ, ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు అందరూ టూ వీలర్లనే కన్వీనియెంట్​ అని భావిస్తారు..

రైడింగ్ చేసే ముందు, ప్రతి బైక్ రైడర్ ట్రాఫిక్ నియమాలన్నింటిని తెలుసుకోవాలి. స్పీడ్ లిమిట్​ను చెక్ చేయాలి, హెల్మెట్ ధరించాలి, అతని/ఆమె వాహనానికి అవసరమైన టూ వీలర్ ఇన్సూరెన్స్ పొందాలి.

మీరు కొత్త  వాహనాన్ని కొనుగోలు చేస్తున్నా లేదా పాతదాన్ని బాగు చేయించుకోవాలని చూస్తున్నా కనీసం థర్డ్-పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం చట్టం ప్రకారం తప్పనిసరి.

ఆన్‌లైన్‌లో బైక్ ఇన్సూరెన్స్ రెన్యువల్ అనేది ఎందుకు మంచి ఆలోచన?

బైక్ ఇన్సూరెన్స్ పాలసీ డ్యామేజీలు, దొంగతనం, అల్లర్లు, సమ్మె, తీవ్రవాదం, ఇతర ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ కల్పించవచ్చు. పాలసీ గడువు ముగిసే తేదీకి మించి మీ బైక్ యొక్క ఇన్సూరెన్స్ రక్షణను కొనసాగించడమే బైక్ ఇన్సూరెన్స్ రెన్యువల్‌.

ఎక్స్​పైరీ డేట్​ ప్రస్తుత ఇన్సూరెన్స్ పాలసీ ఎప్పుడు నిలిపివేయబడుతుందో సూచిస్తుంది. బైక్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసేటప్పుడు పాత నిబంధనలు, షరతులే ఉండవచ్చు లేదా యాడ్-ఆన్‌లతో మీరు  మీ పాలసీని మెరుగుపరచవచ్చు.

విరామం లేకుండా బైక్ పాలసీని రెన్యువల్ చేయడం వల్ల పాలసీదారుడికి కొంత బోనస్ లభిస్తుంది. గత పాలసీలో ఎలాంటి క్లెయిమ్‌లు లేనప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది.

బైక్ ఇన్సూరెన్స్ రెన్యువల్​ కోసం అందుబాటులో ఉన్న ఆప్షన్లు

మీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యువల్​ చేసేటప్పుడు కింది వాటిలో ఏదైనా ఒక దానిని ఎంచుకోవచ్చు.

# అదే ఇన్సూరర్​తో ఉండండి : ఒకవేళ మీరు మీ ప్రస్తుత ఇన్సూరెన్స్ కంపెనీతో ఆనందంగా ఉంటే, మీరు అదే ఇన్సూరర్​ని కొనసాగించవచ్చు. అయితే, సమయానికి ఇన్సూరెన్స్ రెన్యువల్ అయ్యేలా చూసుకోండి. దీని వల్ల మీ క్లెయిమ్​ మీద ప్రభావం పడదు.

గడువు ముగియక ముందే ప్రీమియం డిపాజిట్ చేయండి. ఎందుకంటే ఇన్సూరర్ పేమెంట్​ను పొందినప్పుడే పాలసీ వర్తిస్తుంది.

# కొత్త ఇన్సూరర్ కి మారండి : సర్వీస్ బాగా లేనందువల్ల మీరు పాత ఇన్సూరర్ నుంచి మారాలనుకుంటే అప్పుడు కొత్త ఇన్సూరర్​కు మారవచ్చు. కొత్త ఇన్సూరర్ మీ బైక్​కు ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ముందు దానిని పరీక్షిస్తాడు.

ప్రపోజర్​ ఆన్​లైన్​లో మొత్తం ఇన్​ఫర్మేషన్​ ఇచ్చి, రిక్వెస్ట్​ చేసిన విధంగా ప్రీమియం చెల్లించాలి. ఇదంతా పాత పాలసీ గడువు ముగిసిపోయే లోపు పూర్తి చేయాలి.

బైక్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యువల్ చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

బైక్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యువల్ చేసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించడంలో ఖచ్చితంగా తప్పు లేదు. దీర్ఘకాలంలో మీకు ఉపయోగపడే వాటిని కొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారా? లేదా?

అదేవిధంగా బైక్ ఇన్సూరెన్స్ పాలసీ రెన్యువల్ విషయంలో కూడా కింద పేర్కొన్న విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి:

# పాత పాలసీలో కవరేజ్ స్కోప్​: మీ పాత ఇన్సూరెన్స్ మీకు సమగ్ర కవరేజ్ ఇస్తుందా? దీని గురించి ఆలోచించండి. కావాల్సిన వివరాలను ఇన్సూరెన్స్ కంపెనీని అడిగి తెలుసుకోండి.

# ఏ ఇన్సూరర్ బెస్ట్ : రెన్యువల్ తేదీ అయిపోయే లోపు మార్కెట్​లో ఉన్న ఇన్సూరర్ల గురించి తెలుసుకోవాలి. పాలసీ కొనే సమయం నుంచి దానిని క్లెయిమ్​ చేసుకునే సమయం వరకు ఎలా ఉందో తెలుసుకోండి. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఇదంతా మీ పాలసీ ఎక్స్​పైర్​ కాకముందే చేయాలి, ముగిసిన తర్వాత కాదు.

# ఏ ఇన్సూరెన్స్​ కవర్ బెస్ట్: మోటార్ పాలసీల్లో మీకు కాంప్రహెన్సివ్ మోటార్ పాలసీ లేదంటే థర్డ్–పార్టీ లయబిలిటీ, రెండింటిలో ఏది మీకు బెస్ట్ అనేది నిర్ణయించుకోవాలి. ప్రేమియం రేట్లు, కటింగ్ లాంటి పలు అంశాలను పరిగణినలోకి తీసుకోవాలి. యాడ్-ఆన్ కవరేజ్, దాని వల్ల మారే రేట్ల గురించి కూడా తెలుసుకోండి.

# ఏదైనా యాడ్-ఆన్ కవర్: కొన్ని యాడ్-ఆన్ ల ద్వారా మీ పాలసీ కవర్​ని పెంచుకోవాలనుకుంటున్నారా? లేదా? మీరు ఖచ్చితంగా పర్సనల్ యాక్సిడెంట్ కవర్, ఇంజన్ ప్రొటెక్షన్, ఫ్యూయల్ గ్యాస్ కిట్ లాంటి వాటిని ఖచ్చితంగా కొనాలి.

 

కొత్త ఇన్సూరర్​కి మారేటప్పుడు ఏమేం చూసుకోవాలి?

మార్కెట్లో ఎన్నో ఫోన్ల కంపెనీలు ఉన్నా కానీ కొన్ని ఫోన్లు మాత్రమే అందరినీ ఆకట్టుకుంటాయి. అచ్చంగా ఇన్సూరెన్స్ విషయంలో కూడా అంతే. ఎన్నో ఇన్సూరెన్స్​లు ఉన్నా కొన్ని మాత్రమే ఎక్కువ అమ్ముడవుతుంటాయి.

కొత్త ఇన్సూరర్​కి మారేటప్పుడు చాలా విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. అందులో కొన్ని:

# మీ కన్వీనియెన్స్​ తెలుసుకోండి: మారాలని అనుకోవడం ఎంతో సులభం. కానీ, ఇలా మారడం వల్ల ఏమైనా ఖర్చు అవుతుందా అనేది చూసుకోండి.

# క్లెయిమ్​ రివ్యూలను చదవండి: ఆన్​లైన్​లో అందుబాటులో ఉన్న అన్ని ఇన్సూరర్ల ఫీడ్ బ్యాక్ గురించి తెలుసుకోండి. కొన్ని ప్రత్యేక కంపెనీలు ఇన్సూరర్ గురించి లెక్కలతో సహా మీకు చూపిస్తాయి.

# ఇన్సూరర్ ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నాడో చెక్ చేయండి : ఇన్సూరర్ ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నాడో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. పలు రకాల వెబ్​సైట్లలో ఇందుకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంటాయి.

# ప్రొడక్టులను పోల్చి చూడండి : ఇన్సూరెన్ప్ ప్రొడక్టులను చెక్ చేయండి. ఒకదానితో మరొకదాన్ని పోల్చి చూడండి. మీకు ఓకే అనిపించిన వాటినే ఎంచుకొని ముందుకు సాగండి.

బైక్ ఇన్సూరెన్స్‎ని ఆన్‎లైన్‎లో రెన్యూ చేయడానికి టాప్ కారణాలు

మిగిలిన ఇండస్ట్రీల మాదిరిగానే ఇన్సూరెన్ప్ కూడా ఆన్​లైన్ ప్లాట్​ఫాం, మీడియాల్లో బాగా రాణిస్తోంది. మీరు ఈసారి రెన్యువల్ చేయించేటప్పుడు ఆన్​లైన్​లో చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే:

# సమాయాన్ని ఆదా చేయవచ్చు : రెన్యూకి సంబంధించిన ప్లాన్లను బ్రౌజ్ చేయడానికి, పోల్చడానికి ఆన్​లైన్ మంచి వేదిక. ఇక్కడ మీకు నచ్చిన దాని గురించి తెలుసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా మీ సమయాన్ని ఆదా చేస్తుంది.

# ప్రీమియంలు తక్కువగా ఉంటాయి : ఆన్​లైన్ లో ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం అనేది తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే ఇక్కడ ఇన్సూరర్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ మీద, ఇతర వాటి మీద ఖర్చు చేయాల్సిన డబ్బు ఆదా అవుతుంది.

# క్విక్​, ఈజీ : ఆన్​లైన్​లో పాలసీని కొనుగోలు చేయడం ఎంతో ఈజీగా ఉంటుంది, త్వరగా జరిగిపోతుంది. మీరు ఎలాంటి సమయాభావం లేకుండా పాలసీలను చెక్ చేయవచ్చు.

# రివ్యూలు : ఇన్సూరెన్స్ కంపెనీ, వారి ప్రొడక్టులపై రివ్యూలు, క్విక్ బైట్లను చూడవచ్చు. ప్రొడక్టుకు సంబంధించి రకరకాల ప్రజల ఉద్దేశాలు, సలహాలను పొందవచ్చు.

# ఇబ్బంది లేని సర్వీస్ : ఆన్​లైన్​లో ఏజెంట్లు, బ్రోకర్ల బెడద ఉండదు. ఇన్సూరర్ తో మీరు నేరుగా కాంటాక్ట్ కావచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా, పూర్తి పారదర్శకంగా ఆన్​లైన్​లో పాలసీలు తీసుకోవచ్చు.

ఆన్‎లైన్‎లో బైక్ ఇన్సూరెన్స్‎ని ఎలా రెన్యూ చేయాలి?

Step 1 - బైక్ ఇన్సూరెన్స్ పేజీకి వెళ్లండి. వాహనానికి సంబంధించిన మేక్​, మోడల్, వేరియంట్​, రిజిస్ట్రేషన్ తేదీని నింపండి. ‘Get Quote’ని క్లిక్ చేసి మీకు నచ్చిన ప్లాన్​ని ఎంచుకోండి

Step 2 - థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్  లేదా కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్  లలో మీకు నచ్చిన దానిని ఎంచుకోండి

Step 3 - గత ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన వివరాలను అందించండి. పాలసీ అయిపోయిన తేదీ, గత ఏడాది చేసిన క్లెయిమ్​, ఎర్న్​ చేసిన నో క్లెయిమ్​ బోనస్ తదితర వివరాలు ఇవ్వండి. 

Step 4 -మీ ప్రీమియంకు సంబంధించిన కొటేషన్​ను మీరు పొందుతారు. మీరు ఒకవేళ స్టాండర్డ్ ప్లాన్​ను ఎంచుకుంటే మీకు కావాల్సిన యాడ్-ఆన్స్, IDVని సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ ఫైనల్ ప్రీమియంను తర్వాతి పేజీలో చూడవచ్చు.

బైక్ ఇన్సూరెన్స్ రెన్యువల్‎కి Digitని ఎందుకు ఎంచుకోవాలి?