హెల్త్ ఇన్సురంచె ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి

డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్‌కి మారండి

త్వరలో రిటైర్ అయ్యే వారి కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ఆప్షన్లు

త్వరలో రిటైర్ అయ్యే వారు తమ వృత్తిపరమైన జీవితంలో తమ లక్ష్యాలను సాధించినపుడు.. పదవీవిరమణ కోసం ప్లాన్ చేయడం అనేది ముఖ్యమైనదిగా ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది జాగ్రత్తగా పరిశీలించాల్సిన అంశం.

యజమాని అందించిన హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ముగియడంతో.. త్వరలో రిటైర్ అయ్యే వారు పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మీద దృష్టి పెట్టాలి. అది మీకు మరింత భద్రతను అందిస్తుంది. మీరు పదవీవిరమణ పొందిన తర్వాత మీ ఆరోగ్య అవసరాలకు తగిన విధంగా ఇది కవరేజ్ అందిస్తుంది. ఈ సమయంలో తీసుకున్న నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి.

త్వరలో రిటైర్ అయ్యే వారు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాల గురించి తెలుసుకుందాం.

త్వరలో రిటైర్ అయ్యే వారి కోసం హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటపుడు పరిగణించాల్సిన 8 విషయాలు

సరైన హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ ఎంచుకోవడం వలన ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా రిటైర్‌మెంట్ స్టేజ్ ఎంజాయ్ చేయొచ్చు. రిటైర్‌మెంట్ తర్వాత పర్సనల్ హెల్త్ కవర్ ఎంచుకునే ముందు పరిగణించాల్సిన విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. మీ ఆరోగ్య అవసరాలు, ఆర్థిక స్థితులు ఏంటో ఓ అంచనాకు రండి

పదవీవిరమణ తర్వాత మీ ఆరోగ్య అవసరాలు, మీ ఆర్థిక వనరుల గురించి లెక్కేయండి. మీ వయసు, ముందు గుర్తించిన వ్యాధులు, కుటుంబ వైద్యచరిత్ర మరియు జీవనశైలిని బట్టి మీరు ఎంచుకునే పాలసీ రకాన్ని ఎంచుకోండి.

పర్సనల్ హెల్త్ కేర్ ద్వారా మీకు అందే కాంప్రహెన్సివ్ ప్రయోజనాలు మరియు కవరేజ్ గురించి అంచనా వేయండి. అంతే కాకుండా మీకు కావాల్సిన ఆరోగ్య అవసరాలకు సరిగ్గా సరిపోతాయని నిర్ధారించుకోండి. అంతే కాకుండా మీరు పదవీవిరమణ చేసినపుడు మీ ఆర్థిక స్థోమతలో మార్పులను పరిగణలోకి తీసుకుని ప్రీమియం లను గురించి తనిఖీ చేయండి.

సరైన ఆర్థిక మరియు ఆరోగ్య లక్ష్యాలను ఎంచుకుని అందుకు సరైన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను తీసుకోండి.

2. ముందుగానే పాలసీని తీసుకోండి. కవరేజ్‌లో గ్యాప్స్ లేకుండా చూసుకోండి

మీ పదవీ విరమణ సమయంలో మీరు ఎంప్లాయర్ నుంచి పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు మారినపుడు.. ముందుగానే ప్రారంభించడం మరియు కవరేజీలో అంతరాలను లేకుండా చూసుకోవడం ద్వారా ముఖ్యమైన సందర్భాల్లో మీకు సహాయపడతాయి.

మీరు త్వరలో పదవీవిరమణ పొందితే మీ అవసరాలకు తగిన విధంగా ఉండే హెల్త్ ఇన్సూరెన్స్ ఎంచుకోండి. మీకు యజమాని అందించిన హెల్త్ ఇన్సూరెన్స్ ముగిసినపుడు కవరేజీలో ఎటువంటి అంతరాయం లేదని నిర్ధారించుకోండి. ఎందుకంటే పాలసీలో గ్యాప్స్ ఉంటే అనుకోని సందర్భంలో ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది.

ముందుగానే ప్రక్రియను ప్రారంభించడం ద్వారా మరియు ముందుగానే సరైన పాలసీని ఎంచుకోవడం ద్వారా మీరు పదవీవిరమణ పొందిన తర్వాత ఎటువంటి చిక్కులు లేకుండా మీ జీవితాన్ని హాయిగా గడపొచ్చు.

3. వివిధ ప్లాన్లతో పోల్చి చూసి సరైన ప్లాన్ ఎంచుకోండి

వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలు అందించే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల గురించి రీసెర్చ్ చేయండి.

ముందస్తుగా మీ ఆరోగ్య అవసరాలు, మీ కుటుంబ ఆరోగ్య అవసరాలు ముందుగా ఉన్న వ్యాధులు వైద్య అవసరాలను గురించి అంచనా వేయండి. మీ అవసరాలకు సరిపోయే హెల్త్ పాలసీని అందించే ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకోండి. ఎక్కువ సంఖ్యలో నెట్‌వర్క్ హాస్పిటల్స్, అధిక కవరేజీ, ప్రయోజనాలు అందించే పాలసీని ఎంచుకోండి.

లైఫ్‌టైమ్ రెన్యూవబులిటీ, సీనియర్ సిటిజన్ స్పెసిఫిక్ బెనిఫిట్స్, పదవీవిరమణ పొందిన వారు అనుకూలికరించుకునే విధంగా ఉన్న ప్లాన్స్ ఎంచుకోండి. ఆ పాలసీ మీ బడ్జెట్‌తో సరిపోలుతుందని నిర్ధారించుకోండి. మీ పాలసీ మీకు అనువైన ప్రీమియంలను అందిస్తుందని నిర్ధారించుకోండి.

4. క్రిటికల్ ఇల్‌నెస్ కవరేజ్‌ను పరిగణించండి

క్రిటికల్ ఇల్‌నెస్ కొరకు కవరేజ్ అందించే హెల్త్ పాలసీని త్వరలో రిటైర్ అయ్యేవారు ఎంచుకోవడం ఉత్తమం. అటువంటి పాలసీ తీవ్రమైన అనారోగ్యాలకు కూడా కవరేజ్ అందిస్తుంది. సవాలుగా మారిన సందర్భాల్లో అదనపు ఖర్చులను మేనేజ్ చేసేందుకు మీకు తోడ్పడుతుంది.

అధిక కవరేజ్‌తో లభించే ప్లాన్లను గురించి సెర్చ్ చేయండి. మీ పదవీవిరమణ తర్వాత మీకు రక్షణ అందించేందుకు పాలసీ ఇంక్లూజన్స్, ఎక్స్‌క్లూజన్స్ మరియు వెయిటింగ్ పీరియడ్స్ మొదలైన వాటి గురించి తెలుసుకోండి. మీరు సరైన క్రిటికల్ ఇల్‌నెస్ కవరేజ్ ఉన్న పాలసీని ఎంచుకోవడం ద్వారా మీ పదవీవిరమణ తర్వాత హాయిగా ఉండొచ్చు.

5. ఫ్యామిలీ ఫ్లోటర్ ఆప్షన్ కోసం వెతకండి

మీరు పదవీవిరమణ తర్వాత కుటుంబసభ్యులను కూడా కవర్ చేయాలని అనుకుంటే.. ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ను పరిగణించండి. ఈ పాలసీలు మీ జీవిత భాగస్వామితో పాటు మీ పిల్లలకు కూడా సింగిల్ ప్రీమియం కింద కవరేజ్ అందిస్తాయి. ఇవి మీకు సౌకర్యవంతంగా ఉంటాయి.

మీ కుటుంబం యొక్క నిర్దిష్ట ఆరోగ్య అవసరాలను అంచనా వేయండి. మీకు ఎక్కువ కవరేజ్ అందించే పాలసీని ఎంచుకోండి. మీకు అత్యంత ఇష్టమైన వారితో పదవీవిరమణ కాలాన్ని ఎంజాయ్ చేసేందుకు మీ బడ్జెట్‌లో ప్రీమియం ఉండే సరైన ప్లాన్స్ ఎంచుకోండి.

6. కో-పేమెంట్స్ మరియు సబ్-లిమిట్స్

పాలసీలో కో-పేమెంట్, సబ్ లిమిట్స్ గురించి పూర్తిగా తెలుసుకోండి.

పాలసీ తీసుకున్న వ్యక్తి వైద్య ఖర్చుల కోసం జేబు నుంచి చెల్లించాల్సిన మొత్తాన్నే కో-పేమెంట్ అని అంటారు. సబ్ లిమిట్స్ అనేవి కొన్ని రకాల మెడికల్ సర్వీసెస్ లేదా గది అద్దెల మీద పరిమితి గురించి వివరిస్తాయి.

ఈ నియమాలను అర్థం చేసుకోవడం ద్వారా పదవీవిరమణ పొందిన వారు పాలసీ తీసుకున్న తర్వాత జేబు నుంచి చెల్లించాల్సిన కో-పేమెంట్, సబ్ లిమిట్స్ మొదలైన వాటిని సూచిస్తుంది. మీరు పదవీవిరమణ పొందిన తర్వాత ఎటువంటి ఆర్థిక భారాలు లేకుండా ఉండేందుకు ఎటువంటి కో-పేమెంట్ మరియు సబ్ లిమిట్స్ లేకుండా ఉండే పాలసీని ఎంచుకోవడం అవసరం.

7. నెట్‌వర్క్ హాస్పిటల్స్ మరియు క్యాష్‌లెస్ ఫెసిలిటీ సౌకర్యం గురించి అంచనాకు రండి

మీరు తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో మీరు కోరుకునే ప్రదేశాల్లో ఎక్కువ నెట్‌వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయా లేదా తెలుసుకోండి.

మీరు కోరుకునే హాస్పిటల్స్ క్యాష్ లెస్ హాస్పిటల్స్ లిస్ట్‌లో ఉన్నాయో లేదో చూసుకోండి. మీ జేబు నుంచి ఎటువంటి ఖర్చు చేయకుండా ఉండొచ్చు. క్యాష్‌లెస్ సౌకర్యం అందుబాటులో ఉందో చూసుకోండి. ఇది క్లెయిమ్ ప్రాసెస్‌ను సులభతరం చేస్తుంది. మీరు ఎటువంటి ఖర్చులు జేబు నుంచి పెట్టుకోకుండా మిమ్మల్ని అనుమతిస్తుంది.

విస్తృతమైన నెట్‌వర్క్ మరియు క్యాష్‌లెస్ మెథడ్ అనేది వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో మీకు మనశ్శాంతిని అందిస్తుంది. ఎటువంటి ఆర్థిక ఒత్తిడి లేకుండా మీరు వైద్యచికిత్సలను పొందుతారు. మీ పదవీవిరమణ తర్వాత మీరు ఎటువంటి ఒత్తిడి లేకుండా జీవించవచ్చు.

8. నిపుణుల సలహాను తీసుకోండి

వివిధ రకాల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ఉన్న సంక్లిష్టతలను గురించి అర్థం చేసుకునేందుకు ఎవరైనా నిపుణుడి సలహాను తీసుకోండి.

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసేందుకు దాని గురించి అర్థం చేసుకునేందుకు నిపుణుడి సలహా తీసుకోండి. విశ్వసనీయ పాలసీ ప్రొవైడర్లను ఎంచుకుని పదవీ విరమణ ప్రయోజనాలను పొందండి. అంతే కాకుండా మీ ఆరోగ్య అవసరాలకు తగిన విధంగా మీ పాలసీలను అనుకూలీకరించుకోండి. నిపుణుల సలహా తీసుకుని పదవీ విరమణ తర్వాత ఎటువంటి చీకూచింతా లేకుండా జీవించండి.

పదవీవిరమణకు ముందు పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ పొందడం, మీ పదవీవిరమణ వయసును సురక్షితంగా చేసుకోవడం అనేది కీలకమైన దశ.

యజమాని అందించిన కవరేజ్ నుంచి పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కు మారేందుకు ముందు ముందస్తు ప్రణాళిక అనేది చాలా కీలకం.

త్వరలో రిటైర్ అయ్యే వారి హెల్త్ ఇన్సూరెన్స్ కోసం తరచూ అడిగే ప్రశ్నలు

నేనే పదవీవిరమణ పొందిన తర్వాత కూడా నా యజమాని ద్వారా వచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనసాగించవచ్చా?

లేదు. యజమానులు అందజేసే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉద్యోగుల పదవీవిరమణ తర్వాత వర్తించవు. కొంత మంది ప్రొవైడర్లు మాత్రం వాటిని పర్సనల్ ఇన్సూరెన్సెస్‌గా మార్చుకునే సదుపాయాన్ని కల్పిస్తాయి. దీని ప్రీమియం మీరే చెల్లించాల్సి వస్తుంది కాబట్టి.. మీరు పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్.

పదవీవిరమణ తర్వాత నా పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో నా జీవిత భాగస్వామిని చేర్చుకోవచ్చా?

అవును. చాలా రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ కింద మీ జీవిత భాగస్వామిని చేర్చుకునేందుకు అనుమతిస్తాయి.

పదవీవిరమణ సమయంలో నా అవసరాల కోసం నా వ్యక్తిగత ఇన్సూరెన్స్‌ను అనుకూలీకరించవచ్చా?

అవును. మీ పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు రైడర్స్‌ను యాడ్ చేయడం ద్వారా మీ వైద్య అవసరాలను నెరవేర్చుకోవచ్చు. క్రిటికల్ ఇల్‌లెస్, హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్స్ మొదలైన రైడర్స్‌ను హెల్త్ ప్లాన్స్ అందిస్తాయి.