భారతదేశంలో బైక్ ఇన్సూరెన్స్ తప్పనిసరి

ఈ రోజే బైక్ ఇన్సూరెన్స్ కోట్ పొందండి. మీ డిజిట్ పాలసీని రిన్యూ చేయండి.

Third-party premium has changed from 1st June. Renew now

భారతదేశంలో బైక్ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి?

ప్రస్తుత రోజుల్లో ద్విచక్ర వాహనాలు చాలా సులభంగా ఉంటున్నాయి. మహానగరాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటి సంఖ్య పెరిగిపోతూ ఉంది. తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఉండే ఢిల్లీ, ముంబై, బెంగుళూరు వంటి మహానగరాల్లోనే కాకుండా ఇరుకైన రోడ్లు ఉండే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇవి సులువుగా తిరుగుతుంటాయి. వీటిని మెయింటేన్ చేయడం చాలా సులభం. ఎవరైతే ద్విచక్ర వాహనాలను కొనేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారికి బ్యాంకులు సులభంగా రుణాలను కూడా అందిస్తున్నాయి.

ఈ కారణాల వలన భారతదేశంలో టూ వీలర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మద్యతరగతి ప్రజలు ద్విచక్ర వాహనాలు కొనేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అందుకే మునుపెన్నడూ లేనంత ఎక్కువ సంఖ్యలో ఇప్పుడు ద్విచక్ర వాహనాలు భారతీయ రోడ్ల మీద ఉన్నాయి.

రోడ్ల మీద వాహనాల సంఖ్య పెరగడంతో ప్రమాదాల సంఖ్య కూడా క్రమంగా పెరిగింది. ఇదే స్థాయిలో టూ–వీలర్ ఇన్సూరెన్స్ అవసరం కూడా పెరిగింది. టూ వీలర్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసమో ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

టూ వీలర్​కు ఇన్సూరెన్స్ ఎందుకు చేయించుకోవాలి?

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని మోటారు కంపెనీలు కొత్త టూ వీలర్​ను కొనుగోలు చేసేటప్పుడు బీమాను అందిస్తున్నాయి. కానీ కొంత మంది వ్యక్తులు ఆ బీమా పాలసీ రద్దు చేయిస్తున్నారు. అంతేకాకుండా పాలసీ గడువు ముగిసిన తర్వాత కూడా రెన్యువల్ చేయకుండా అలాగే వదిలేస్తున్నారు. బీమా మీద ఖర్చు చేసే డబ్బులను ఆదా చేయాలని చాలా మంది చూస్తారు. అందుకోసమే వారు అలా ప్రవర్తిస్తారు. కొంతమందికి బీమా రెన్యువల్ చేసేందుకు సమయం ఉండదు. ఇలా బైక్ ఇన్సూరెన్స్​ను నిర్లక్ష్యం చేయడం వెనుక అసలు కారణం ఏంటని అడిగితే వారి దగ్గర సమాధానం ఉండదు. అసలు నేను బైక్ ఇన్సూరెన్స్​ను ఎందుకు తీసుకోవాలి? అని కొందరు అనుకుంటూ ఉంటారు.

మీ ద్విచక్ర వాహనానికి బీమా తీసుకోవడానికి రెండు రకాల కారణాలు ఉంటాయి. 1) భారతీయ రోడ్ల మీద తిరిగే అన్ని వాహనాలకు కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయినా తీసుకోవడం తప్పనిసరి. 2) బీమా అనేది మిమ్మల్ని, మీ వాహనాన్ని సంరక్షిస్తుంది. ఎవరైనా థర్డ్ పార్టీ వ్యక్తి ప్రమాదంలో చిక్కుకుంటే అతన్ని కూడా రక్షిస్తుంది. ఆర్థికంగా ఖర్చుల నుంచి కాపాడుతుంది.

చట్టప్రకారం చూసుకున్నట్లయితే కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయినా తీసుకోవడం తప్పనిసరి. కానీ మీరు కాంప్రహెన్సివ్ టూ వీలర్​ ఇన్సూరెన్స్ తీసుకోవాలని మేము మీకు సిఫార్సు చేస్తున్నాం. మీ వాహనానికి దొంగతనం, ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల వలన సంభవించిన నష్టాల నుంచి ఇది కవర్ చేస్తుంది. అంతేకాకుండా థర్డ్ పార్టీ గాయాలు లేదా ఆస్తి డ్యామేజీలు ఇందులో కవర్ చేయబడతాయి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ మధ్య పూర్తి తేడాలు కింద ఉన్నాయి. అది చూసిన తర్వాత మీకు పూర్తిగా అర్థమవుతుంది.

చూడండి : థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేదా అన్ని రకాల యాడ్​ ఆన్​ కవర్లతో కూడిన కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం తెలుసుకొనేందుకు బైక్ ఇన్సూరెన్స్ క్యాలుక్యులేటర్​ను ఉపయోగించండి.

భారతదేశంలో బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్లు

థర్డ్ పార్టీ కాంప్రహెన్సివ్

ప్రమాదంలో సొంత ద్విచక్ర వాహనానికి డ్యామేజ్ అయితే

×

అగ్నిప్రమాదంలో సొంత ద్విచక్ర వాహనానికి డ్యామేజ్ అయితే

×

సహజ ప్రకృతి విపత్తుల వలన సొంత ద్విచక్ర వాహనానికి డ్యామేజ్ అయితే

×

థర్డ్ పార్టీ వాహనానికి డ్యామేజ్ అయితే

×

థర్డ్ పార్టీ ఆస్తికి డ్యామేజ్ అయితే

×

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

×

థర్డ్ పార్టీ వ్యక్తికి గాయాలు/మరణం సంభవించినప్పుడు

×

మీ స్కూటర్ దొంగిలించబడితే

×

మీ ఐడీవీ (IDV)ని నచ్చినట్లుగా మార్చుకోండి

×

నచ్చిన యాడ్-ఆన్లతో అదనపు రక్షణ

×
Get Quote Get Quote

థర్డ్ పార్టీ, కాంప్రహెన్సివ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ మధ్య గల వ్యత్యాసం గురించి మరింత తెలుసుకోండి.

నేడు మార్కెట్లో మనకు లభించే అత్యుత్తమ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ఒకదానిని డిజిట్ అందిస్తుంది. డిజిట్ అందించే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్​లో అత్యంత వేగవంతమైన క్లెయిములు ఉంటాయి. ఎటువంటి తెలియని చార్జీలు ఉండవు. ఇది పారదర్శకమైన ప్రాసెసింగ్ ఇన్సూరెన్స్ మెకానిజాన్ని కలిగి ఉంటుంది.

మీరు రోడ్డు మీద ఎంత జాగ్రత్తగా బండిని నడిపినా కానీ ప్రమాదం జరగదని గ్యారంటీ ఇవ్వలేరు. మీరు ఎలా బండిని నడుపుతున్నారనే దానితో సంబంధం లేకుండానే ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఎటువంటి హెచ్చరికలు లేకుండానే ప్రమాదాలు సంభవిస్తాయి. అంతే కాకుండా ప్రకృతి విపత్తులు, దొంగతనాలు కూడా ఎప్పుడైనా జరగొచ్చు. ఇటువంటి ప్రమాదాలకు మీరు బాధ్యులా? కాదా అనే విషయాన్ని పక్కన పెడితే ఈ ప్రమాదాల్లో జరిగిన డ్యామేజీల వలన తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. కానీ ఒకవేళ మీకు కాంప్రహెన్సివ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ ఉంటే ఇది మిమ్మల్ని ఆర్థికపరమైన నష్టాలు, సంభావ్యత గల లయబులిటీల నుంచి కాపాడుతుంది.

అంతేకాకుండా మోటారు వాహనాల చట్టం–1998 ప్రకారం భారతదేశంలో బైక్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఎవరైతే టూ వీలర్​ను కొనుగోలు చేస్తారో వారు తప్పనిసరిగా బైక్ ఇన్సూరెన్స్ కొనాలి. బైక్ ఇన్సూరెన్స్ లేకుండా బైక్ నడపడం మంచిది కాదు.

డిజిట్ కాంప్రహెన్సివ్ టూ వీలర్ ఇన్సూరెన్స్​లో ఏమేం కవర్ అవుతాయి?

డిజిట్ అందించే టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీలో కింద పేర్కొన్న రిస్క్ ఫ్యాక్టర్లు కవర్ అవుతాయి.

సహజ ప్రకృతి వైపరీత్యాల వలన కలిగే డ్యామేజీలు లేదా నష్టాలు- సహజ ప్రకృతి విపత్తులుగా పిలవబడే భూకంపాలు, తుఫానులు, వరదలు మొదలయిన వాటి వలన సంభవించే నష్టాలు కవర్ అవుతాయి. ఈ సహజ విపత్తులు ఏ సమయంలోనైనా రావొచ్చు. అంతేకాకుండా ఇవి మన ప్రాణాలకు, ఆస్తులకు భారీ నష్టం కలిగించొచ్చు. ఇలా సహజ ప్రకృతి విపత్తుల వలన కలిగే నష్టాల నుంచి టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీలు మిమ్మల్ని సంరక్షిస్తాయి.

మానవ కారక ప్రకృతి వైపరీత్యాల వలన కలిగే డ్యామేజీలు లేదా నష్టాలు - సహజ ప్రకృతి వైపరీత్యాలే కాకుండా దోపిడీలు, దొంగతనాలు, అల్లర్ల వంటి మానవ కారక వైపరీత్యాల వలన కూడా మీ బైక్ భారీ నష్టాలను చవి చూడాల్సి వస్తుంది.

డిజిట్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీలు అటువంటి డ్యామేజీల నుంచి మీకు పూర్తి ఆర్థిక రక్షణను అందజేస్తాయి.

ప్రమాదంలో శాశ్వత లేదా పాక్షిక అంగవైకల్యం ఏర్పడితే- ప్రమాదాలనేవి జీవితంలోని అతిపెద్ద దురదృష్టాలు. ఎటువంటి ముందుస్తు సమాచారం లేకుండానే ప్రమాదాలు సంభవిస్తాయి. ఒక బైక్ రైడర్​కు ప్రమాదం జరిగినప్పుడు అతడు పాక్షిక లేదా శాశ్వత అంగవైకల్యాన్ని పొందుతాడు.

పాక్షిక అంగవైకల్యానికి ఉదాహరణలు.. నడవడంలో ఇబ్బంది, శరీరంలోని ఏదైనా అవయవం పనిచేయకపోవడం వంటివి. అదే శాశ్వత అంగవైకల్యం అంటే పూర్తిగా నడవలేకపోవడం, దృష్టిని కోల్పోవడం మొదలయినవి. టూ వీలర్ ఇన్సూరెన్స్ పైన పేర్కొన్న అన్ని రకాల చికిత్సా ఖర్చుల నుంచి మిమ్మల్ని ఆర్థికంగా కవర్ చేస్తుంది.

పాలసీదారుడు చనిపోయినపుడు – బైక్ నడుపుతున్న ఏదైనా సందర్భంలో జరిగిన ప్రమాదంలో పాలసీదారుడు లేదా బండి నడిపే థర్డ్ పార్టీ వ్యక్తి చనిపోవచ్చు. ఆ పాలసీ దారుడు కనుక పీఏ (PA) కవర్​ను ఎంచుకుంటే బీమా సంస్థ అతడు ఎవరైతే నామినీలుగా ఎంచుకున్నాడో వారికి పరిహారం అందజేస్తుంది.

డిజిట్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ కవర్ చేసే విషయాలలో కొన్ని ముఖ్యమైన విషయాలు. భారతీయ రోడ్ల మీద ట్రాఫిక్ నిబంధనలను ఎవరూ ఖచ్చితంగా పాటించరనేది అందరూ ఒప్పుకొని తీరాల్సిన సత్యం. టూ వీలర్ నడిపేటపుడు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సీట్లో కూర్చుని కారు నడిపిన దాని కంటే బైక్ నడిపిన వారే ఎక్కువగా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. డిజిట్ అందించే కాంప్రహెన్సివ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ ఎక్కువ రేంజ్ కవరేజిని అందిస్తుంది. ఇది స్వీయ భౌతిక గాయాలు, వాహనం సంపూర్ణ లేదా పాక్షిక డ్యామేజీ అయినా, రైడర్​కు శాశ్వత లేదా పాక్షిక అంగవైకల్యం సంభవించినా కూడా ఇది కవర్ చేస్తుంది. అంతేకాకుండా థర్డ్ పార్టీ లయబులిటీలను కూడా తీరుస్తుంది.

చట్టం నుంచి ఎదురయ్యే చిక్కుల నుంచి తప్పించుకునేందుకు, ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు తప్పనిసరిగా బీమా తీసుకోవాలి. మీరు ఇప్పటికే బైక్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని ఉంటే ఇంకా దేని కోసం ఎదురు చూస్తున్నారు? మీరు ఇప్పటికీ మీ టూ వీలర్ వాహనానికి బీమా కవర్ పొందకపోతే వెంటనే బీమా చేయించండి.