కొత్త బైక్ ఇన్సూరెన్స్

ఆన్​లైన్​లో కొత్త బైక్ ఇన్సూరెన్స్ కోట్ పొందండి

Third-party premium has changed from 1st June. Renew now

All about New Bike Insurance Explained

చివరికి మీరు టూ వీలర్ సాధించి గెలిచారు. మేము మీ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాం. కానీ ఒక నిపుణుడిగా మీ బండి సంరక్షణ గురించి ఏం ఆలోచించారని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఇది చాలా సులభం. మీరు బైక్​కు బీమా తీసుకుని బండిని సంరక్షించవచ్చు. మీరు ఎలా బీమా తీసుకోవాలో మార్గదర్శనం చేసేందుకు మేము ఇక్కడ ఉన్నాం.

ఇన్సూరెన్స్​లో రెండు రకాలు ఉంటాయి. 1) కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్, 2) థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్

భారతదేశంలో కొత్త బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్లు

బైక్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకునేటపుడు ఐడీవీ ప్రాముఖ్యత ఏంటి

ఐడీవీ – ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ, ఒకవేళ మీ బైక్ దొంగతనానికి గురైనా లేదా మరమ్మతు చేయరాని విధంగా డ్యామేజ్ అయినా కానీ మీకు బీమా కంపెనీ అందించే గరిష్ట విలువ. తక్కువ ప్రీమియంలు ఆకర్షణీయంగా ఉంటాయని మాకు తెలుసు. కానీ మీకు వచ్చే ఆర్థిక ప్రయోజనాలను కూడా చూసుకోవాలి. అందుకోసమే పాలసీ తీసుకునే ముందు మీ ఐడీవీ ని చెక్ చేసుకోండి. మీకు అందించే ప్రీమియంను మాత్రమే కాదు.

మీరు అధిక ఐడీవీ ని ఎంచుకోవాలని మేము సిఫారసు చేస్తున్నాం. ఎందుకంటే.. మీ బైక్ పూర్తిగా డ్యామేజ్ అయిన సందర్భంలో అధిక ఐడీవీ ఉంటే అధిక మొత్తంలో రీయింబర్స్​మెంట్ వస్తుంది.

డిజిట్ విషయానికి వస్తే మేము మిమ్మల్ని మీ వాహన ఐడీవీ కస్టమైజ్ చేసుకునేందుకు మీకు అవకాశం కల్పిస్తాం. మీకు నచ్చిన విధంగా ఐడీవీ ని మార్చుకోవచ్చు. మీరు ఎటువంటి షరతులు లేకుండా స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవడానికి మేము సహకరిస్తాం.

కొత్త బైక్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేస్తున్నపుడు ఆలోచించాల్సిన విషయాలు

మీరు కొత్త బైక్ కోసం ఇన్సూరెన్స్​ను కొనుగోలు చేస్తున్నపుడు ఆలోచించాల్సిన చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. వాటి గురించి ఆలోచించడం వలన మీరు సరైన ఇన్సూరెన్స్ కవర్​ను పొందే అవకాశం ఉంటుంది. కింద కొన్ని పేర్కొనబడ్డాయి.

# క్లెయిమ్ ప్రొసీజర్- ఇది చాలా ముఖ్యమైనది. ఇందులో ఎటువంటి అవాంతరాలు లేకుండా ఉండాలి. ఈ ప్రొసీజర్ చాలా వేగం​గా ఉంటే క్లెయిములు వేగంగా సెటిల్ అవుతాయి. సోషల్ మీడియా చానెల్స్, అధికారిక వెబ్​సైట్, కస్టమర్ రివ్యూలను చదివి ఆ కంపెనీ క్లెయిముల చరిత్రను చెక్ చేయండి.

# పాలసీ రకం- పాలసీ రకాలను తెలుసుకోండి. మీరు నిర్ణయం తీసుకోవడానికి ఉన్న ఆప్షన్ల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ బీమా అవసరాలను బట్టి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేదా కాంప్రహెన్సివ్ ప్లాన్లను ఎంచుకోండి.

# యాడ్–ఆన్స్- సరైన యాడ్–ఆన్స్ ఎంచుకోవడం వలన కూడా మీరు గరిష్ట ప్రయోజనాలను పొందొచ్చు. జీరో డిప్రిషియేషన్ కవర్, ఎన్​సీబీ కవర్, ఇన్​వాయిస్ ప్రొటెక్షన్ కవర్, ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్ వంటివి ఇందులో కొన్ని ముఖ్యమైనవి. యాడ్–ఆన్స్ గురించి మరింతగా తెలుసుకుని సరైన వాటిని ఎంచుకోండి.

# సరైన ఐడీవీ- సరైన ఐడీవీ అనేది మీ బైక్ ఇన్సూరెన్స్ రెన్యూవల్​లో ముఖ్య భూమిక పోషిస్తుంది. అత్యధిక ఐడీవీ ఉంటే అనుకోని సందర్భాల్లో మీకు నష్టం వాటిల్లినపుడు పొందే పరిహారం కూడా అధికంగా ఉంటుంది. డిజిట్ పారదర్శకతను నమ్ముతుంది. అందుకోసమే మీ వాహన ఐడీవీ ని మీకు నచ్చిన విధంగా మార్చుకునేందుకు అనుమతిస్తుంది.

# ఆన్​లైన్​లో ధరలను పోల్చి చూడండి​– ఆన్​లైన్​కు వెళ్లి ధరలను పోల్చి చూడండి. మీరు ఆన్​లైన్​లో కూడా పాలసీని కొనుగోలు చేయొచ్చు. ఇక్కడ మీకు అనేక ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. మాతో కలిసి ఆన్​లైన్​లో పాలసీ కొనుగోలు చేయడంలో ఉత్తమమైనది ఏంటంటే.. ఇక్కడ ఎటువంటి పేపర్​వర్క్ లేదు. కేవలం ఆన్​లైన్​లో మీ వివరాలు నమోదు చేస్తే సరిపోతుంది. మీరు ప్రీమియం పోల్చి చూసుకోవడానికి మా బైక్ ఇన్సూరెన్స్ క్యాలుక్యులేటర్​ను కూడా ఉపయోగించుకోవచ్చు.

కొత్త బైక్ ఇన్సూరెన్స్ పాలసీని డీలర్ దగ్గరి నుంచి కొనుగోలు చేయడం మంచి ఆలోచనేనా?

చాలా మంది వ్యక్తులు తమ సమయాన్ని ఆదా చేసుకునేందుకు, తమ శక్తిని వృథా చేసుకోకుండా ఉండేందుకు బీమా పాలసీని బైక్ డీలర్ల దగ్గర తీసుకుంటూ ఉంటారు. ఆన్​లైన్​లో కానీ ఆఫ్​లైన్​లో కానీ వెతకరు. ఇది సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది. కానీ మీరు చేస్తున్నది సరైనదేనా? మీరు మీ డీలర్ నుంచి బీమా పాలసీని తీసుకోవడం వలన ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.

# మీకు పరిమిత ఆప్షన్లు మాత్రమే లభిస్తాయి - మీరు మీ బైక్ డీలర్ వద్ద నుంచి ఒకసారి టూ వీలర్ కొనుగోలు చేసిన తర్వాత అతడు మిమ్మల్ని బైక్ ఇన్సూరెన్స్ తీసుకోమని చెబుతాడు. ఈ విషయం అప్పుడు సౌకర్యవంతంగానే అనిపించొచ్చు. కానీ ఇది అనేక ప్రయోజనాలను కోల్పోయేలా చేస్తుంది. మీరు ఆన్​లైన్​లో ధరలు పోల్చి చూసే అవకాశాన్ని కోల్పోతారు. అంతేకాకుండా మీ బైక్ డీలర్ ఏవేని రెండు మూడు బీమా కంపెనీలతో మాత్రమే పొత్తు పెట్టుకుని ఉండే అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో అతడు మీకు సదరు కంపెనీల పాలసీలు మాత్రమే చూపిస్తాడు. కావున మీరు బెస్ట్ పాలసీని ఎంచుకోలేరు.

# బెస్ట్ యాడ్–ఆన్స్ - మీ బైక్​కు అనేక ప్రయోజనాలను కలిగించే యాడ్–ఆన్స్​ విషయంలో మీకు నచ్చిన విధంగా ఎంచుకునేందుకు ఆప్షన్ ఉండదు. అదే ఆన్​లైన్​లో బైక్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం వలన మీరు మీకు ఇష్టం వచ్చిన ప్లాన్​ను ఎంచుకోవడంతో పాటుగా యాడ్​-ఆన్స్​ను కూడా మీకు నచ్చిన వాటినే తీసుకోవచ్చు.

# రేట్లను పోల్చలేరు- రేట్లను పోల్చడం చాలా ముఖ్యం. కానీ మీరు మీ డీలర్ దగ్గరి నుంచి బీమా పాలసీని కొనుగోలు చేసినప్పుడు ఈ అవకాశాన్ని కోల్పోతారు.

ఆన్​లైన్​కు వెళ్లి వెతకమని మేము మీకు సిఫారసు చేస్తున్నాం. నేరుగా ఆన్​లైన్ ద్వారానే మీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయండి. ఈ ప్రక్రియ చాలా వేగంగా ఉంటుంది. ఎటువంటి పేపర్ వర్క్ అవసరం ఉండదు. ఇంకా మీరు మీ బైక్ ఇన్సూరెన్స్ నుంచి ఏదైనా ఆశిస్తున్నారో సరిగ్గా అటువంటి పాలసీనే పొందే అవకాశం ఉంటుంది.

ఆన్​లైన్​లో కొత్త బైక్ ఇన్సూరెన్స్ ఎలా కొనుగోలు చేయాలి?

స్టెప్1 – బైక్ ఇన్సూరెన్స్ పేజీకి వెళ్లండి. వాహనం మోడల్, తయారీదారుడి పేరు, వేరియంట్, రిజిస్ట్రేషన్ తేదీ (కొత్త బైక్ ఎంచుకోండి). అప్పుడు గెట్ కోట్ మీద ప్రెస్ చేసి మీకు ఇష్టం వచ్చిన పాలసీని ఎంచుకోండి.

స్టెప్2 – కేవలం థర్డ్ పార్టీ లయబులిటీ లేదా స్టాండర్డ్ ప్యాకేజ్ (కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్) కావాలో ఎంచుకోండి.

స్టెప్3 –మీరు పొందిన నో క్లెయిమ్ గురించి వివరాలు సమర్పించండి.

స్టెప్4 – మీరు ప్రీమియం పొందుతారు. ఒకవేళ మీరు స్టాండర్డ్ ప్లాన్ ఎంచుకున్నట్లయితే ఐడీవీ ని సెట్ చేసుకోవడం, యాడ్–ఆన్స్ ఎంచుకోవడం వంటివి ఉంటాయి. పూర్తి ప్రీమియం విలువ తదుపరి పేజీలో కనిపిస్తుంది.