ద్విచక్ర వాహన బీమా
డిజిట్ టూ వీలర్ బీమా కి మారండి.

Third-party premium has changed from 1st June. Renew now

ద్విచక్ర వాహన బీమా లో టైర్ ప్రొటెక్ట్ యాడ్-ఆన్ కవర్

ద్విచక్ర వాహన బీమా లో టైర్ ప్రొటెక్ట్ యొక్క యాడ్-ఆన్ కవర్ బీమా చేయబడిన వాహనంలో పాడైన టైర్(ల)ని మార్చడానికి అయ్యే ఖర్చును కవర్ చేస్తుంది. ఈ యాడ్-ఆన్ కవర్ కింద, టైర్‌ను తీసివేయడం మరియు తిరిగి అమర్చడం కోసం లేబర్ ఛార్జీలు అలాగే వీల్ బ్యాలెన్సింగ్ కోసం అయ్యే ఖర్చు కూడా కవర్ చేయబడతాయి. టైర్ ప్రొటెక్ట్ కింద ప్రయోజనాలు పాలసీ వ్యవధిలో ప్రతి సంవత్సరం బీమా చేయబడిన వాహనం యొక్క గరిష్టంగా రెండు టైర్లకు మాత్రమే ఉపయోగించబడతాయి. 

గమనిక: టూ-వీలర్ బీమా లో టైర్ ప్రొటెక్ట్ యాడ్-ఆన్ కవర్ డిజిట్ టూ-వీలర్ ప్యాకేజీ పాలసీగా ఫైల్ చేయబడింది – UIN నంబర్ IRDAN158RP0006V01201718/A0019V01201718.

ద్విచక్ర వాహన బీమా లో టైర్ ప్రొటెక్ట్ యాడ్-ఆన్ కవర్ కింద కవర్ చేయబడినవి

టైర్ ప్రొటెక్ట్ యాడ్-ఆన్ కవర్ కింద అందించే కవరేజీలు క్రింద ఇవ్వబడ్డాయి:

యాడ్-ఆన్ కవర్ పాడైపోయిన టైర్(ల) స్థానంలో కొత్త సమానమైన లేదా వాటికి దగ్గర్లో సమానమైన టైర్(ల) మోడల్ మరియు స్పెసిఫికేషన్‌తో రీయింబర్స్ చేస్తుంది.

కొత్త టైర్(లు) తొలగించడం మరియు అమర్చడం కోసం అయ్యే లేబర్ ఛార్జీలు

వీల్ బ్యాలెన్సింగ్ కోసం అయ్యే ఖర్చు.

ఏది కవర్ చేయబడదు?

టైర్ ప్రొటెక్ట్ యాడ్-ఆన్ కవర్ బేస్ ఇన్సూరెన్స్ పాలసీ క్రింద జాబితా చేయబడిన మినహాయింపులకు తోడుగా కింది వాటికి కవరేజీని అందించదు:

  • పంక్చర్/టైర్ రిపేర్ కోసం అయ్యే ఖర్చు. 

  • అనధికార మరమ్మత్తు కారణంగా లేదా తయారీ/అసెంబ్లీ సమయంలో లేదా మరమ్మత్తు చేపట్టే సమయంలో పేలవమైన పనితనం కారణంగా సంభవించిన నష్టం. 

  • సరిగ్గా నిల్వ చెయ్యని లేదా రవాణా కారణంగా బీమా చేయబడిన వాహనానికి నష్టం.

  • బీమా చేయబడిన వాహనం పనితీరును ప్రభావితం చేయని నష్టాలు. 

  • టైర్(ల) దొంగతనం

  • టైర్(లు) దెబ్బతినడం వల్ల చక్రాల ఉపకరణాలు, రిమ్‌లు, సస్పెన్షన్ లేదా ఏదైనా ఇతర భాగం/యాక్సెసరీలకు కలిగే డ్యామేజ్ లేదా నష్టం.

  • చక్రాలు/టైర్లు/ట్యూబ్‌ల సాధారణ నిర్వహణ మరియు సర్దుబాట్లకు అయ్యే ఖర్చు. 

  • వీల్ బ్యాలెన్సింగ్ కోసం దాఖలు చేసిన క్లెయిమ్ లేదా డిజిట్ అధీకృత రిపేర్ షాప్‌లో బీమా చేయబడిన వాహనం రిపేర్ చేయబడని పరిస్థితిలో పరిగణించబడదు. 

  • మరమ్మత్తు ప్రారంభించే ముందు డ్యామేజ్/నష్టాన్ని పరిశీలించే అవకాశం అందించబడని నష్టం కవర్ చేయబడదు.

  • తయారీదారు యొక్క వారంటీ/రీకాల్ క్యాంపెయిన్/అటువంటి ఏవైనా ఇతర ప్యాకేజీల కింద కవర్ చెయ్యబడిన నష్టం.

  • సమయానుకూలంగా చెయ్యాల్సిన మెయింటెనెన్స్ ను నిర్లక్ష్యం చేయడం వల్ల కలిగే నష్టం.

 

డిస్ క్లైమర్ - కథనం సమాచార ప్రయోజనాల కోసం, డిజిట్ పాలసీ వర్డ్స్ డాక్యుమెంట్‌కు సంబంధించి ఇంటర్నెట్ అంతటా సేకరించబడింది. డిజిట్ టూ వీలర్ ప్యాకేజీ పాలసీ - టైర్ ప్రొటెక్ట్ (UIN: IRDAN158RP0006V01201718/A0019V01201718) గురించి వివరణాత్మక కవరేజ్, మినహాయింపులు మరియు షరతుల కోసం, మీ పాలసీ డాక్యుమెంట్‌ను జాగ్రత్తగా పరిశీలించండి.

 

టైర్ ప్రొటెక్ట్ యాడ్-ఆన్ కవర్‌పై తరచుగా అడిగే ప్రశ్నలు (FAQలు)

కొత్త టైర్(ల) ఇన్వాయిస్ కాపీ లేనప్పుడు, టైర్(ల) రీప్లేస్‌మెంట్ క్లెయిమ్‌ను బీమా సంస్థ పరిష్కరిస్తుందా?

లేదు, టైర్ తయారీ, మోడల్, క్రమ సంఖ్య మొదలైన వివరాలతో కూడిన ఇన్‌వాయిస్ కాపీ లేనప్పుడు బీమా సంస్థకు క్లెయిమ్ కోసం చెల్లించాల్సిన బాధ్యత ఉండదు.

నష్టపోయిన సమయంలో టైర్(ల) ఉపయోగించని ట్రెడ్ డెప్త్ >=7మిమీ అయితే అనుమతించదగిన క్లెయిమ్ మొత్తం ఎంత?

నష్టపోయే సమయంలో టైర్(ల) ఉపయోగించని ట్రెడ్ డెప్త్ >=7 మిమీ ఉంటే అది కొత్త టైర్(ల) ధరలో 100 శాతం.

మాదవశాత్తూ నష్టం లేదా డ్యామేజ్ సంభవించినట్లయితే, ఈ యాడ్-ఆన్ కవర్ కింద నష్టం/డ్యామేజ్ కవర్ చేయబడుతుందా?

అవును, ప్రమాదవశాత్తూ నష్టం లేదా నష్టం జరిగితే బీమా సంస్థ నష్టాన్ని/డ్యామేజ్ ని తిరిగి చెల్లిస్తుంది.