బంపర్‌ టు బంపర్‌ ఇన్సూరెన్స్‌

2 నిమిషాల్లో ఆన్‌లైన్‌ ద్వారా పాలసీని కొనండి/ రెన్యువల్‌ చేసుకోండి

Third-party premium has changed from 1st June. Renew now

బంపర్‌ టు బంపర్‌ కారు ఇన్సూరెన్స్‌ కవర్‌

ఊహించుకోండి! కొన్ని నెలల ప్రణాళిక, బడ్జెట్, ఎంక్వైరీలు, సలహాల తర్వాత చివరికి మీ కలల కారును కొనేందుకు నిర్ణయించుకున్నారని అనుకోండి. కొంత సమయం తర్వాత, మీ బ్రాండ్ న్యూ కారు తాళాలు మీరు అందుకున్నారు. డ్రైవర్ సీటులో కూర్చొని రోడ్డుపై అలా షికారుకు వెళ్తున్నారు అనుకోండి.

మీరు అకస్మాత్తుగా క్రాష్‌ అయిన భయంకరమైన శబ్దాన్ని విన్నారనుకోండి. కొద్ది సేప‌టి త‌ర్వాత మీ కారుకు ఏదో తాకినట్లు గుర్తించారు. గుండె పగిలినంత పని అవుతుంది కదూ. షోరూం నుంచి చేతిలోకి వచ్చిన కారు క్షణాల్లో సెకండ్‌ హ్యాండ్‌ కారు అయిపోయింది.

ఇక్కడే మీకు కార్‌ ఇన్సూరెన్స్‌ వ‌ర్తిస్తుంది. మీరు బంపర్ టు బంపర్ ఇన్సూరెన్స్‌ కవర్‌ని ఎంచుకుంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండవచ్చు. మీ బ్రాండ్ న్యూ కారు ఎటువంటి నష్టం లేకుండా సరికొత్తగా తిరిగి వస్తుంది!

బంపర్ టు బంపర్ ఇన్సూరెన్స్‌ అంటే ఏమిటి?

బంపర్ టు బంపర్ కవర్ సాధారణంగా కొంత అదనపు ప్రీమియంతో కాంప్రహెన్సివ్‌ కార్‌ ఇన్సూరెన్స్‌ పాలసీతో యాడ్-ఆన్‌గా వస్తుంది. బంపర్ టు బంపర్ కవర్ అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం.

సామాన్యుల భాష‌లో చెప్పాలంటే, ఇది ఇంజన్ డ్యామేజీ, టైర్లు, బ్యాట‌రీలు, గ్లాస్‌ను త‌ప్పించి కారులోని ప్రతి అంగుళాన్ని కవర్‌ చేసే యాడ్‌-ఆన్ ఇన్సూరెన్స్. ఇది సాధారణ కారు ఇన్సూరెన్స్ పాల‌సీలాగా కాకుండా, మీ కారు డ్యామేజీ అయితే 100 శాతం కవరేజీని అందిస్తూ మీ కారును పూర్తిగా చూసుకునే మీ సూప‌ర్ హీరో.

దీన్ని జీరో డిప్రిషియేషన్‌ లేదా తరుగుదల లేని కారు ఇన్సూరెన్స్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది ఇన్సూరెన్స్ క‌వ‌ర్ నుంచి డిప్రిషియేషన్‌ను (త‌రుగుద‌ల‌ను) మినహాయించి, పూర్తి క‌వ‌రేజీని అంద‌జేస్తుంది.

ఈ కవర్‌ను భారతదేశంలో 2009లో ప్రవేశపెట్టారు. ఈ ప్లాన్ చాలామంది కార్ల యజమానులకు ముఖ్యంగా కింద పేర్కొన్న వారికి ఒక వ‌రం లాంటిది:

  • కొత్తగా కారు కొన్నవారికి లేదా కారు కొని 5 సంవత్సరాల కంటే తక్కువ కాలం అవుతున్నవారికి
  • కొత్త లేదా అనుభవం లేని డ్రైవర్లు
  • ఖరీదైన స్పేర్ పార్ట్స్‌ క‌లిగి ఉండే హై-ఎండ్ లగ్జరీ సూపర్ కార్ల యజమానులు
  • చాలా తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలు/వాటి సమీపంలో నివసిస్తున్న యజమానులు
  • చిన్న చిన్న డెంట్‌లు, బంప్‌ల గురించి కూడా మీరు ఆందోళన చెందేవారైతే

బ్రాండ్-న్యూ కారుపై చిన్న డెంట్ లేదా గీత పడినా బాధపడే కొత్త కారు యజమానులు, అరుదైన, ఖరీదైన విడిభాగాలతో అత్యాధునిక ఖరీదైన కార్లను సొంతం చేసుకోవాలనుకునే వారికి దీని గురించి బాగా తెలుసు. ఈ వాహనాల యజమానులను 100 శాతం కవరేజ్ కోసం అదనపు ప్రీమియం చెల్లించాలని అడిగితే, తమ కారు రక్షణ కోసం అది చిన్న ధర మాత్రమే అని వారు భావిస్తారు.

ఉపయోగించండి: బంపర్ టు బంపర్ కవరేజీతో కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం లెక్కించేందుకు కార్ ఇన్సూరెన్స్ క్యాలుక్యులేటర్‌

పోల్చిచూడండి: బంపర్‌ టు బంపర్‌ కవర్‌ కలిగి ఉన్న, కలిగి లేని కాం‍ప్రహెన్సివ్‌ పాలసీ

బంపర్ టు బంపర్ కవర్‌తో బంపర్ టు బంపర్ కవర్‌ లేకుండా
తరుగుదల (డిప్రిషియేషన్‌) లేకుండా 100 శాతం కవరేజీ అందిస్తుంది. తరుగుదల (డిప్రిషియేషన్‌) తర్వాత కవరేజీ అందిస్తుంది.
ప్రీమియం కాస్త ఎక్కువగా ఉంటుంది స్టాండర్డ్‌ పాలసీ ప్రీమియం
ఐదేళ్ల కంటే పాత వాహనాలకు వర్తించదు పాత వాహనాలకు కూడా వర్తిస్తుంది.

ఇక్కడ ఉన్న ఏకైక విషయం ఏంటంటే, మీరు కాం‍ప్రహెన్సివ్‌ కార్ పాలసీతో బంపర్ టు బంపర్ యాడ్-ఆన్‌ను ఎంచుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని గెలవాలంటే మరికొన్ని కోల్పోవాలి కదా!. ఈ పాలసీలో కొంచెం ఎక్కువ ప్రీమియం చెల్లించినప్పటికీ, మీరు మాత్రం మనశ్శాంతిగా ఉండవచ్చు.

బంపర్ టు బంపర్ ఇన్సూరెన్స్ ఎంచుకునే ముందు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోండి

మీరు ఈ కవరేజీని ఎంచుకునే ముందు ఈ కింది అంశాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం:

క్లెయిమ్‌ల సంఖ్య: సాధారణంగా ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక సంవత్సరంలో చేసే కారు ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల సంఖ్యను పరిమితం చేస్తాయి. ప్రతి చిన్న డెంట్ కోసం క్లెయిమ్ దాఖలు చేయకుండా వినియోగదారులను పరిమితం చేస్తుంటాయి. అందువల్ల మీ ఇన్సూరెన్స్ కంపెనీ అందించే క్లెయిమ్‌ల సంఖ్యను సరిచూసుకోవడం ముఖ్యం.

ధర: ఒక స్పష్టమైన కారణం ఉండటం వల్ల బంపర్ టు బంపర్ అధిక ప్రీమియం కలిగి ఉంటుంది. ఇది తరుగుదల (డిప్రిషియేషన్‌)ని పరిగణనలోకి తీసుకోకుండా పూర్తి కవరేజీని అందిస్తుంది. కాబట్టి ఇది కాంప్రహెన్సివ్‌ పాలసీ కంటే కొంచెం ఎక్కువ ప్రీమియం వసూలు చేస్తుంది.

కొత్త కార్లకూ అందుబాటులో ఉంటుంది: ఇది ప్రాథమికంగా కొత్తగా కొన్న వాటికి, కొన్నాక 5 సంవత్సరాల వరకు వర్తిస్తుంది. తమ సరికొత్త కారును రక్షించుకోవడానికి కొంచెం అదనంగా డబ్బు చెల్లించడానికి ప్రజలు ఇష్టపడరు. కాకపోతే ఇది వినియోగదారులకు వచ్చే లాభాలతో పోలిస్తే తక్కువ ఖర్చు అనే చెప్పొచ్చు.

బంపర్ టు బంపర్ కార్‌ ఇన్సూరెన్స్‌ ప్రయోజనాలు

ఒకవేళ మీ వాహనం యొక్క ఇన్సూరెన్స్ సాధారణ ఇన్సూరెన్స్ పాలసీ అయితే.. మీ కారుకు దాదాపు రూ. 15 వేల విలువైన డ్యామేజీ అయితే, మీ జేబులో నుంచి 50 శాతం మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది. డ్యామేజీ అయిన విడి భాగాల మార్కెట్ విలువలో సగం తీసేసిన తర్వాతే మీ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ అవుతుంది. తరుగుదల (డిప్రిషియేషన్‌) అంటే మీ వాహనం క్షీణించడం లేదా సాధారణంగా అరిగిపోవడం వల్ల ఆ వాహనం విలువ తగ్గడం.

ఒకవేళ మీ వాహనం యొక్క ఇన్సూరెన్స్ సాధారణ ఇన్సూరెన్స్ పాలసీ అయితే.. మీ కారుకు దాదాపు రూ. 15 వేల విలువైన డ్యామేజీ అయితే, మీ జేబులో నుంచి 50 శాతం మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది. డ్యామేజీ అయిన విడి భాగాల మార్కెట్ విలువలో సగం తీసేసిన తర్వాతే మీ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ అవుతుంది. తరుగుదల (డిప్రిషియేషన్‌) అంటే మీ వాహనం క్షీణించడం లేదా సాధారణంగా అరిగిపోవడం వల్ల ఆ వాహనం విలువ తగ్గడం.

  • ఫైబర్ గ్లాస్ భాగాలకు -30% డిప్రిషియేషన్‌
  • రబ్బరు, ప్లాస్టిక్ భాగాలు, రబ్బరు, బ్యాటరీలపై -50% డిప్రిషియేషన్
  • గాజుతో చేసిన భాగాలు- సున్నా (నిల్)

ఈ విషయం చాలా నిరుత్సాహపరుస్తుంది. సాధారణ వాహన ఇన్సూరెన్స్ తో పోలిస్తే బంపర్ టు బంపర్ కవర్ ప్రజలలో ప్రజాదరణ పొందుతోంది. డిజిట్ ఇన్సూరెన్స్ వంటి విశ్వసనీయ ఇన్సూరెన్స్ కంపెనీలు తమ పాలసీని కస్టమర్లు ఎక్కువగా ఉపయోగించుకునేలా కాంప్రహెన్సివ్‌ పాలసీతో యాడ్-ఆన్ కవర్‌ను అందిస్తున్నాయి.

ఇప్పుడు మీ వాహనం ఇన్సూరెన్స్ జీరో డిప్రిషియేషన్‌ ఇన్సూరెన్స్ అయితే, ఒకవేళ మీ కారుకు 15 వేల విలువైన నష్టం జరిగితే, మీరు ఎటువంటి డిప్రిషియేషన్‌ తగ్గింపు లేకుండా అన్ని ఫైబర్, రబ్బరు, మెటల్ భాగాలకు మొత్తం (100%) కవరేజీని పొందుతారు.

ఏ ఇతర లాభదాయకమైన ఆఫర్ మాదిరిగానే బంపర్ టు బంపర్ కవర్‌లో కూడా కొన్ని పరిమితులు ఉంటాయి.

బంపర్ టు బంపర్ ఇన్సూరెన్స్ కింద కవర్ కానివి ఏవి?

  • మీ వాహనం వ‌య‌సు 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దానికి వ‌ర్తించ‌దు.
  • ఏదైనా చట్టవిరుద్ధమైన లేదా అనైతిక విష‌యాల్లో వాహ‌నం ఇరుక్కుంటే ఇన్సూరెన్స్‌ కంపెనీ మీ క్లెయిమ్‌ను ప్రాసెస్ చేయ‌దు.
  • ప్రైవేట్ వాహనాన్ని వాణిజ్య అవసరాలకు ఉప‌యోగిస్తే
  • ఇంజన్ డ్యామేజ్, బ్యాటరీ/టైర్/ క్లచ్ ప్లేట్లు/బేరింగ్‌లు దెబ్బతిన్న‌ట్ల‌యితే
  • కారు డ్యామేజీ అయిన సంద‌ర్భంలో డ్రైవ‌ర్ ఆల్క‌హాల్ కానీ, డ్ర‌గ్స్ కానీ తీసుకొని ఉన్నట్ల‌యితే
  • వాహనం డాక్యుమెంట్లు అసంపూర్ణంగా ఉంటే
  • పాలసీ కాలపరిమితి ప్రకారం క్లెయిమ్ చేయకుంటే
  • ఇన్సూరెన్స్‌ లేకుండా ప్రమాదం జ‌రిగితే
  • మెకానిక‌ల్ బ్రేక్ డౌన్ వ‌ల్ల డ్యామేజీ జ‌రిగితే
  • యాక్సెసరీలు, గ్యాస్ కిట్, టైర్ల వంటి వస్తువులకు నష్టం జ‌రిగిన‌ట్ల‌యితే

బంప‌ర్ టు బంప‌ర్ యాడ్-ఆన్ క‌వ‌ర్‌ను క‌నుక మీరు ఎంచుకుంటే మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను ఎంచుకున్న‌ట్లే. అనూహ్య‌మైన ప‌రిణామాలు ఎదురైతే మీ వాహ‌నానికి, మీ జేబుకు చిల్లు ప‌డ‌కుండా మీ వాహ‌నాల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించుకోవ‌చ్చు. అనూహ్య‌మైన ప‌రిస్థితుల నుంచి, మీ ఊహించ‌ని ఖ‌ర్చుల నుంచి కాపాడే గొడుగు లాంటిది. మీ కారు, మీ జేబు కోసం మీ పాలసీతో ఈ క‌వ‌ర్‌ను ఎంచుకొని తెలివైన నిర్ణయం తీసుకోండి.

బంప‌ర్ టు బంప‌ర్ ఇన్సూరెన్స్ గురించి త‌ర‌చూ అడిగే ప్ర‌శ్న‌లు

యాక్సిడెంటు గురించి మీరు 24 గంట‌ల‌ లోపు రిపోర్టు చేయ‌క‌పోతే ఏమ‌వుతుంది?

ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చిన గ‌డువులోగా త‌ప్ప‌నిస‌రిగా యాక్సిడెంట్‌ గురించి రిపోర్టు చేయాలి. ఒక‌వేళ రిపోర్టు చేయక‌పోతే మీ కారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌వ్వొచ్చు.

ఏదైనా యాక్సిడెంటులో నా సొంత కారును నేనే డ్యామేజీ చేస్తే బంప‌ర్ టు బంప‌ర్ ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసుకోవ‌చ్చా?

అవును, క్లెయిమ్ చెల్లింపుల సమయంలో డిప్రిషియేషన్‌ లెక్కించబడదని మాత్రమే బంపర్-టు-బంపర్ కవర్ అనేది సూచిస్తుంది. అయినా, మీ సొంత డ్యామేజీలు కవర్ అవుతాయి.

పార్కింగ్ స్థలంలో పెట్టిన కారును ఎవ‌రో గుర్తు తెలియని వ్యక్తులు ఢీకొట్టినట్ల‌యితే, కారు న‌ష్టాల‌కు బంప‌ర్ టు బంప‌ర్ ఇన్సూరెన్స్ కవర్‌ వ‌ర్తిస్తుందా?

అవును, ఆ డ్యామేజీల‌కు కూడా కారు ఇన్సూరెన్స్ కింద క‌వ‌ర్ అవుతాయి. క్లెయిమ్ చెల్లింపుల సమయంలో డిప్రిషియేషన్‌ లెక్కించబడదని మాత్రమే బంపర్-టు-బంపర్ కవర్ సూచిస్తుంది.

కారు ఇన్సూరెన్స్ కింద కారు బంప‌ర్ క‌వ‌ర్ అవుతుందా?

అవును, మీరు కాంప్రహెన్సివ్‌ కార్‌ ఇన్సూరెన్స్‌ లేదా ఓన్‌ డ్యామేజెస్‌ కార్‌ ఇన్సూరెన్స్‌ను ఎంచుకున్నట్లయితే మీ కారు బంపర్ కవర్ అవుతుంది.