క్యాష్​లెస్​ టూ వీలర్​ ఇన్సూరెన్స్

ఈ రోజే క్యాష్​లెస్​ బైక్​ ఇన్సూరెన్స్​ కోట్​ పొందండి.

Third-party premium has changed from 1st June. Renew now

బైక్‌కు క్యాష్​లెస్​ ఇన్సూరెన్స్​ గురించి సవివరంగా..​

మన దేశ జనాభా 133 కోట్లు దాటిపోయింది. ఇక్కడ భారీ అనేది ఒక పదం మాత్రమే అయిపోయింది. ఈ జనాభా వివిధ సామాజిక వర్గాల నుంచి వస్తోంది.

దేశ జనాభా ఏ విధంగా పెరిగిపోయిందో మనం రోడ్ల మీద చూడొచ్చు. విపరీతమైన ట్రాఫిక్​ను చూసినపుడు మనకు దేశ జనాభా పెరుగుదల గురించి స్పష్టత వస్తుంది. మనకు రోడ్ల మీద ఎక్కువగా ద్విచక్రవాహనాలే కనిపిస్తున్నాయి. ఇవి విపరీతంగా పెరిగిపోవడానికి గల ముఖ్య కారణం వీటి ధర చాలా తక్కువ, వీటిని మెయింటెన్​ చేయడం, డ్రైవింగ్​ చేయడం చాలా సులభం కావడం.

మోటార్​ వాహనాల చట్టం-1988 ప్రకారం టూ వీలర్​కు కనీసం థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ అయినా కొనుగోలు చేయడం తప్పనిసరి. భారతదేశంలోని ఇన్సూరెన్స్​ కంపెనీలు రెండు రకాల మోటార్​ వెహికిల్​ ఇన్సూరెన్స్‌లను అందిస్తున్నాయి. అవి ఒకటి కాంప్రహెన్సివ్​ ఇన్సూరెన్స్‌ కాగా, మరొకటి థర్డ్​ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్‌.

మీకు ఏదైనా వాహనం ఉండి మీ అవసరాల కోసం దానిని రోడ్డు మీద ఉపయోగించినట్లయితే ఇన్సూరెన్స్​ను కలిగి ఉండటం మీ కనీస బాధ్యత.

అసలు క్యాష్​లెస్​ బైక్​ ఇన్సూరెన్స్​ అంటే ఏమిటి?

ప్రమాదం జరిగిన తర్వాత డ్యామేజ్​ అయిన బండిని ఏ గ్యారేజీలో రిపేర్​ చేయించాలని ఆలోచిస్తారు. మీకు కనుక క్యాష్​లెస్​ బైక్​ ఇన్సూరెన్స్​ సదుపాయం ఉంటే మీ బండి రిపేర్​ ఖర్చుల కోసం మీరు మీ జేబు నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. అన్ని ఖర్చులను ఇన్సూరెన్స్​ కంపెనీయే భరిస్తుంది. ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

క్యాష్​లెస్​ బైక్​ ఇన్సూరెన్స్​ ఎంత ఉపయోగకరంగా ఉంటుందో తెలుసుకునేముందు మోటార్​ ఇన్సూరెన్స్​ పాలసీల గురించి తెలుసుకుందాం.

కాంప్రహెన్సివ్​ పాలసీ: మీరు కాంప్రహెన్సివ్​ పాలసీని ఎన్నుకుంటే ఇది మీ సొంత వాహనానికి అయిన నష్టాలను కూడా భర్తీ చేస్తుంది. మీ సొంత వాహనం, థర్డ్​ పార్టీ వాహనాన్ని కవర్​ చేసే ఈ పాలసీని కాంప్రహెన్సివ్​ బైక్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ అని పిలుస్తారు. ఇది కేవలం యాక్సిడెంట్​ అయినపుడు మాత్రమే కాకుండా అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, దొంగతనాల వంటి వాటి నుంచి కూడా మీ బైక్​ను సంరక్షిస్తుంది.

థర్డ్​ పార్టీ లయబిలిటీ పాలసీ: థర్డ్‌ పార్టీ బైక్‌ ఇన్సూరెన్స్‌ అనేది కేవలం థర్డ్​ పార్టీ వ్యక్తులను మాత్రమే సంరక్షిస్తుంది. థర్డ్​ పార్టీ వ్యక్తులు లేదా ప్రాపర్టీలకు జరిగిన నష్టాన్ని ఇది కవర్​ చేస్తుంది. ఇన్సూరెన్స్​ చేసిన వ్యక్తి తప్పు చేస్తే లీగల్​ ఖర్చులు, మెడికల్​ ఖర్చులను చెల్లించాల్సి ఉంటుంది.

చెక్‌: థర్డ్‌ పార్టీ లేదా కాంప్రహెన్సివ్‌ పాలసీ ప్రీమియంను లెక్కించడానికి బైక్‌ ఇన్సూరెన్స్‌ క్యాలుక్యులేటర్‌ను ఉపయోగించండి.

క్యాష్​లెస్​ బైక్​ ఇన్సూరెన్స్​ గురించి స్పష్టమైన వివరణ

క్యాష్​లెస్​ క్లెయిమ్స్​ ఎలా సెటిల్​ చేయబడతాయని మీకు సందేహం ఉండొచ్చు. క్యాష్​లెస్​ క్లెయిమ్​ సెటిల్​మెంట్​ గురించి పూర్తిగా తెలుసుకుంటే.. అద్భుతంగా సర్వీసును అందజేసే గ్యారేజీలతో ఇన్సూరెన్స్​ కంపెనీ పొత్తు పెట్టుకుంటుంది. ఎవరైనా పాలసీదారుడి బండికి డ్యామేజ్​ అయినపుడు క్యాష్​లెస్​ క్లెయిమ్​ కోసం చూస్తే నెట్​వర్క్​ గ్యారేజీకి వెళ్తాడు. అక్కడ అతడి వాహనాన్ని పూర్తిగా మరమ్మతు చేస్తారు. అప్పుడు గ్యారేజీ వ్యక్తి వాహన మరమ్మతుకు అయిన బిల్లులను సంబంధిత ఇన్సూరెన్స్‌ కంపెనీకి పంపుతుంది. మీరు ముందుగానే డ్యామేజ్​ను గురించిన వివరాలను ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేస్తారు. గ్యారేజ్​ వ్యక్తి కూడా తెలిపిన తర్వాత వెరిఫికేషన్​ చేసి మీ పాలసీలో పేర్కొన్న విధంగా పేమెంట్​ను వారికి సెటిల్​ చేస్తారు.

క్యాష్​లెస్​ ఇన్సూరెన్స్​ ఎలా క్లెయిమ్​ చేయాలి?

మీరు డిజిట్​ ఇన్సూరెన్స్​ తీసుకున్నట్లైతే క్యాష్​లెస్​ బైక్ ఇన్సూరెన్స్​ క్లెయిమ్​ ఎలా చేయాలో కింద వివరంగా ఉంది.

స్టెప్​1: ఇన్సూరెన్స్​ కంపెనీకి ఆన్​లైన్ ద్వారా కానీ అప్లికేషన్ ద్వారా కానీ తెలియజేయండి.

స్టెప్​ 2: 1800-258-5956 నెంబర్​కు కాల్​ చేయండి. అప్పుడు మీ మొబైల్​ నెంబర్​కు ఒక లింక్​ వస్తుంది.

స్టెప్​3: ఆ లింక్​ను ఓపెన్​ చేసి మీ బైక్​ యొక్క డ్యామేజీకి సంబంధించిన ఫొటోలను, వివరాలను మాకు పంపించండి.

స్టెప్ 4: ఏదైనా నెట్​వర్క్​ గ్యారేజ్​కు మీ బండిని తీసుకెళ్లండి. గ్యారేజ్​ వ్యక్తి మీ బండి మరమ్మతు కోసం అయిన బిల్లులను ఇన్సూరెన్స్​ కంపెనీకి పంపుతాడు.

స్టెప్5: ఇలా కాకుంటే మీరు డిజిట్​ కంపెనీకి రీయింబర్స్​మెంట్​ కోసం కూడా క్లెయిమ్​ చేసుకోవచ్చు.

క్యాష్​లెస్​ బైక్​ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్​ కోసం అవసరమైన పత్రాలు

డిజిట్​ వద్ద ఇన్సూరెన్స్​ చేసేటపుడు ఎటువంటి పత్రాలు అవసరం లేదు. అన్ని క్లెయిమ్స్​ స్మార్ట్​ ఫోన్​ ద్వారా ఆన్​లైన్​లోనే పూర్తి చేయబడతాయి. ఈ విధానం చాలా సులభంగా, పేపర్​లెస్​గా ఉంటుంది.

క్యాష్​లెస్​ బైక్​ ఇన్సూరెన్స్​ గురించి కొన్ని విషయాలు..

మీరు క్యాష్​లెస్​ బైక్​ ఇన్సూరెన్స్​ తీసుకుంటే మీ వాహనం డ్యామేజ్​ అయినపుడు జరిగిన అన్ని డ్యామేజీలకు ఖర్చులను కంపెనీయే భరిస్తుంది. బైక్​ ఇన్సూరెన్స్​ క్లెయిమ్స్​ గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.

  • క్యాష్​లెస్​ సౌలభ్యాన్ని అందజేసే లిస్టులో ఉన్న గ్యారేజీని కనుక్కోవడం ఒక్కోసారి క్లిష్టం కావొచ్చు. అటువంటి సందర్భంలో మీ బండిని సొంత ఖర్చులతో రిపేర్​ చేయించుకుని అందుకు అయిన మొత్తాన్ని బిల్లుల రూపంలో ఇన్సూరెన్స్​ కంపెనీకి అందజేస్తే సరిపోతుంది. వారు మీకు అయిన ఖర్చులను రీయింబర్స్​ చేస్తారు.
  • ఇన్సూరెన్స్​లో బైక్​ యొక్క అన్ని భాగాలు కవర్​ కావు. మీరు రిపేర్‌ చేయించుకునేటపుడు ఏయే భాగాలు కవర్​ కావనే విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. ఏ భాగాలు అయితే ఇన్సూరెన్స్​లో కవర్​ అవుతాయో వాటికే కంపెనీ క్లెయిమ్​ను సెటిల్​ చేస్తుంది.

క్యాష్​లెస్​ బైక్​ ఇన్సూరెన్స్​ సౌలభ్యాన్ని ఇన్సూరెన్స్​ కంపెనీలు మీ సౌలభ్యం కోసం అందజేశాయి. మీరు ఇన్సూరెన్స్​ పాలసీని తీసుకునే ముందు వివిధ పాలసీలను సరిపోల్చినట్లయితే ఈ సౌలభ్యం చాలా బాగుంటుంది.

డిజిట్​ అందించే క్యాష్​లెస్​ బైక్​ ఇన్సూరెన్స్​ను ఎందుకు ఎంచుకోవాలి?