కాంప్రహెన్సివ్ vs థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్

ఆన్​లైన్​లో బైక్​ ఇన్సూరెన్స్​ కోట్​ పొందండి.

Third-party premium has changed from 1st June. Renew now

కాంప్రహెన్సివ్​, థర్డ్​ పార్టీ టూ వీలర్​ ఇన్సూరెన్స్​ మధ్య తేడా ఏమిటి?

కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​, థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ మధ్య ప్రధాన వ్యత్యాసం అవి అందించే ప్రయోజనాలే. థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ కేవలం థర్డ్​ పార్టీ లయబిలిటీలకు మాత్రమే కవర్​ అవుతుంది. అదే సమయంలో కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ మీ బైక్​ సొంత డ్యామేజీలతో పాటు థర్డ్​ పార్టీ డ్యామేజీల​ను కూడా కవర్​ చేస్తుంది. మరిన్ని ప్రయోజనాలు పొందేందుకు యాడ్​-ఆన్స్​, కవర్స్​ను ఎంచుకునే అవకాశం కూడా దీనిలో ఉంటుంది.  

అన్ని రకాల ప్రమాదాల నుంచి మీ బైక్​ను కాపాడే బైక్​ ఇన్సూరెన్స్​ను తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఏదైనా నగరంలో తిరిగేటప్పుడు అనేక ప్రమాదా​లు ఎదురవుతాయి. అంతేకాకుండా ప్రస్తుతం వచ్చిన కొత్త చట్టాల ప్రకారం, మీరు బైక్​ ఇన్సూరెన్స్ లేకుండా నడుపుతూ పట్టుబడితే అధిక జరిమానాలను చెల్లించాల్సి వస్తుంది. మీరు ఆ భారాన్ని తట్టుకోలేరు. కాబట్టి బైక్​ ఇన్సూరెన్స్​ తీసుకోవడం చాలా ముఖ్యం.

మీకోసం థర్డ్​ పార్టీ, కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ల ప్రయోజనాలు, పరిమితులను మేము ఇక్కడ అందించాం. ఈ విషయాలను పరిగణనలోనికి తీసుకొని, ఆ తర్వాత మీకు నచ్చిన ఇన్సూరెన్స్​ను ఎంచుకోండి.

Difference between Comprehensive and Third-Party Bike Insurance

కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​
అసలేంటి? కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ పాలసీలో మీకు థర్డ్​ పార్టీ లయబిలిటీ ప్లాన్,​ ఓన్​ డ్యామేజ్​ కవర్​ లభిస్తాయి. దీంతో మీ బండి చాలా సురక్షితంగా ఉంటుంది. మోటార్​ వాహనాల చట్టం–1988 ప్రకారం ప్రతీ వాహనానికి థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ తప్పనిసరి. ఇది థర్డ్​ పార్టీకి జరిగిన డ్యామేజీలను కవర్​ చేస్తుంది.
కవరేజీ​ వివరాలు​ ఈ పాలసీలో మీకు ఎక్కువ కవరేజీ​ లభిస్తుంది. దొంగతనాలు, డ్యామేజీల నుంచి మీ బండి రక్షించబడుతుంది. ఈ పాలసీ మీ బండికి జరిగిన అన్ని రకాల డ్యామేజీల నుంచి కాపాడుతుంది. వ్యక్తిగత, బండి, లేదా ప్రాపర్టీకి నష్టం జరిగినా కానీ కవర్​ అవుతుంది. ఈ పాలసీ పరిమిత కవరేజిని అందిస్తుంది. థర్డ్​ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ థర్డ్​ పార్టీ వ్యక్తులు, ప్రాపర్టీలకు జరిగిన డ్యామేజీలను మాత్రమే కవర్​ చేస్తుంది.
యాడ్​–ఆన్స్​ ఈ పాలసీలో మీరు ఎన్నో ప్రయోజనాలున్న యాడ్​–ఆన్​ కవర్స్​ను ఎంచుకునే సౌలభ్యం ఉంటుంది. ఉదా. జీరో డిప్రిషియేషన్​ కవర్​, రిటర్న్​ టు ఇన్​వాయిస్​ కవర్​, రోడ్​ సైడ్​ అసిస్టెన్స్​, కంజూమబుల్​ కవర్​ మొదలగునవి ఈ పాలసీ కేవలం పర్సనల్​ యాక్సిడెంట్​ కవర్​ను మాత్రమే అందిస్తుంది.
దేన్ని కొనుగోలు చేయాలి? మీ బండికి యాడ్​–ఆన్స్​తో కూడిన పూర్తి కవరేజీ కావాలనుకుంటే మీరు ఈ పాలసీని కొనుగోలు చేయండి. మీరు చాలా తక్కువ సందర్భాల్లో బండి నడిపేవారైతే, లేదా మీ బండి చాలా పాతదైతే మాత్రమే ఈ పాలసీని తీసుకోవాలి.
ప్రీమియం ధర కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం కన్నా ఎక్కువగా ఉంటుంది. థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ పాలసీ తక్కువ ఖర్చుతో కూడుకున్నది.

కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ అంటే ఏమిటి?

కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ మీకు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. దీనిలో మీకు థర్డ్​ పార్టీ లయబిలిటీలు,​ ఓన్​ డ్యామేజ్​ కవర్​ కూడా లభిస్తుంది. థర్డ్​ పార్టీ లయబిలిటీల​తో పాటు అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల నుంచి కూడా మీ బైక్​ను ఇది సంరక్షిస్తుంది.

అంతేకాకుండా ఈ పాలసీలో మీరు అదనంగా యాడ్​–ఆన్స్​ను ఎంచుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. ఈ యాడ్​–ఆన్స్​ వలన మీ టూ వీలర్​కు అదనపు రక్షణ అందుతుంది. ఉదాహరణకు, మీరు రోడ్​ సైడ్​ అసిస్టెన్స్​ కవర్​ను ఎంచుకొని కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ను కొనుగోలు చేస్తే.. మీ బండికి బ్రేక్​ డౌన్​ సమస్యలు తలెత్తినపుడు ఇది కవర్​ చేస్తుంది.

 

కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ ప్రయోజనాలు

మీ బైక్​ డ్యామేజీలను కవర్​ చేస్తుంది

ఎక్కువ మంది ప్రజలు కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ను కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం ఇది వారి సొంత వాహనం డ్యామేజీలు,​ నష్టాల​ను కూడా కవర్​ చేయడమే. దీంతో మీకు డబ్బు ఆదా కావడంతో పాటు నిశ్చింతగా ఉండొచ్చు.

థర్డ్​ పార్టీ లయబిలిటీల నుంచి కాపాడుతుంది

అచ్చంగా థర్డ్​ పార్టీ పాలసీ మాదిరే కాంప్రహెన్సివ్​ పాలసీలో కూడా మీ బైక్​ థర్డ్​ పార్టీ లయబిలిటీల నుంచి కవర్​ అవుతుంది. ఉదాహరణకు, మీ బండి ఎవరి కారుకైనా ఢీకొంటే ఆ సమయంలో కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ మీకు తోడుగా ఉంటుంది.

మీ ఐడీవీ (IDV)ని మీరే కస్టమైజ్​ చేసుకునే అవకాశం

డిజిట్​ అందించే కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ను మీరు ఎంచుకుంటే మీకు బైక్​ ఐడీవీ (IDV)ని మీరే ఎన్నుకునే అవకాశం ఉంటుంది.​ ఐడీవీ (IDV) అనేది మీ బైక్​ మార్కెట్​ విలువను సూచిస్తుంది. డిజిట్​ మీ బండి ఎప్పటికీ ఉత్తమమైనదనే నమ్ముతుంది.

ప్రకృతి విపత్తుల సమయంలో రక్షణ

కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ మీ బండిని కేవలం ప్రమాదాల వలన కలిగే డ్యామేజీల​ నుంచి మాత్రమే కాకుండా ప్రకృతి విపత్తుల వలన కలిగే డ్యామేజెల​ నుంచి కూడా కాపాడుతుంది. ఉదా. వరదలు, తుఫానులు వంటి వాటి వలన కలిగే డ్యామేజీలు.

మీ బండి దొంగతనానికి గురయితే నష్టపరిహారం

దురదృష్టవశాత్తు మీ బండి దొంగతనానికి గురైనా కూడా కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ మిమ్మల్ని కవర్​ చేస్తుంది. మీకు రిటర్న్​ టు ఇన్​వాయిస్ కవర్​ ఉంటే మీ బండికి చివరి​ ఇన్​వాయిస్​ విలువను మొత్తం పరిహారంగా అందజేయబడుతుంది.

సరసమైన ధరల్లో లభ్యం

చాలా మంది కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​కు థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ కన్నా ఎక్కువ ఖర్చవుతుందని అనుకుంటారు. కానీ, కాంప్రహెన్సివ్​ ఇన్సూరెన్స్​ థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​తో పోల్చినపుడు చాలా ప్రయోజనాలను అందిస్తుంది. మనం మన బైకును చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు దానికి ఉత్తమమైన కాంప్రహెన్సివ్​ ఇన్సూరెన్స్​ తీసుకోవడమే మంచిది.

వ్యక్తిగత డ్యామేజీలను కూడా కవర్​ చేస్తుంది!

థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్,​ కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​లలో పర్సనల్​ యాక్సిడెంట్​ కవర్​ కూడా అందించబడుతుంది. మీకు టూ వీలర్​ ఉంది కనుక ఇది తీసుకోవడం చాలా అవసరం. (చట్ట ప్రకారం తప్పనిసరి కూడా). ఇది మీ బైక్​ ఇన్సూరెన్స్​ ప్లాన్​లో అతి ముఖ్యమైనది. 

కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ పరిమితులు

  • మీ బైకుకు జరిగిన చిన్న డ్యామేజీలు​ (సొట్టలు పడటం లాంటివి) కవర్​ కావు
  • డిప్రిషియేషన్ నుంచి మీ బైక్​ను సంరక్షించదు
  • మీ బండి యొక్క ఫైబర్​, రబ్బర్​ భాగాలు​ పూర్తిగా కవర్​ కావాలంటే మీరు దానికి ప్రత్యేక యాడ్​–ఆన్​ తీసుకోవాల్సి ఉంటుంది
  • అణు దాడి లేదా యుద్దం వలన సంభవించే నష్టాలు, డ్యామేజీల​కు ఏ బైక్​ ఇన్సూరెన్స్​ కంపెనీ కూడా పరిహారం అందించదు

మినహాయింపులు

  • తాగి నడిపితే- మీరు మద్యం సేవించి వాహనం నడిపితే చట్ట ప్రకారం మీకు క్లెయిమ్​ వర్తించదు.
  • టూ వీలర్​ లైసెన్స్​ లేకుండా నడిపితే: మీకు సరైన లైసెన్స్​ లేకపోతే మీ ఇన్సూరెన్స్​ కవర్​ కాదు. మీరు చేసిన క్లెయిమ్​ తిరస్కరించబడుతుంది. ఏ ఇన్సూరెన్స్​ కంపెనీ కూడా మీ క్లెయిమ్​ను అంగీకరించదు.
  • సరైన లైసెన్స్​ ఉన్న వ్యక్తి లేకుండా డ్రైవింగ్​ చేస్తే:- సరైన లైసెన్స్​ కలిగి ఉన్న వ్యక్తి పక్కన లేకుండా మీరు లెర్నర్ లైసెన్స్​ (LLR)తో వాహనం నడిపితే మీ ఇన్సూరెన్స్ కవర్​ కాదు. కాబట్టి, సరైన లైసెన్స్​ లేకుండా వాహనాన్ని నడుపకూడదు.
  • పర్యవసాన నష్టాలు– ప్రమాదం జరిగిన తర్వాత కొన్నాళ్లకు కలిగే డ్యామేజీలను పర్యవసాన నష్టాలు అంటారు. ఇటువంటి డ్యామేజీలు ఈ పాలసీలో కవర్​ కావు. మీరు ఇందుకోసం ఏదైనా ప్రత్యేకమైన కవర్​ తీసుకుంటే మాత్రం కవర్​ అవుతుంది.
  • స్వీయ నిర్లక్ష్యం– నిర్లక్షపూరితమైన పనులు చేయొద్దు. దాని కారణంగా మీ బైక్​ ప్రమాదానికి గురయితే మీరు క్లెయిమ్​ చేసినా కానీ వర్తించదు.
  • యాడ్​–ఆన్స్​ కొనుగోలు చేయకుంటే:– ఒక ప్రత్యేకమైన యాడ్​–ఆన్​ అందించే ప్రయోజనాన్ని మీరు క్లెయిమ్​ చేయాలనుకుంటే మీకు ఆ యాడ్​–ఆన్​ ఉండి ఉండాలి. యాడ్​–ఆన్​ కొనుగోలు చేయకుండా క్లెయిమ్​ చేస్తే అది చెల్లదు. అందుకే అవసరమైన యాడ్​-ఆన్స్​ను కొనుగోలు చేయాలి. దాని అవసరం మీకు ఎప్పుడు పడుతుందో ఎవరికీ తెలియదు

థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ అంటే ఏమిటి?

పేరులో సూచించిన విధంగానే థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్ అనేది కేవలం థర్డ్​ పార్టీ లయబిలిటీలకు మాత్రమే వర్తిస్తుంది. మీ బైక్​కు కనీసం ఈ ఇన్సూరెన్స్​ అయినా తప్పనిసరిగా ఉండాలి. థర్డ్​ పార్టీ నష్టాలు, లయబిలిటీల నుంచి ఇది మిమ్మల్ని సంరక్షిస్తుంది.

ఉదా. మీరు ఒక వ్యక్తికి ప్రమాదం చేసినపుడు థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ అనేది థర్డ్​ పార్టీ వ్యక్తులకు, వారి ఆస్తులకు జరిగిన డ్యామేజీలను కవర్​ చేస్తుంది. మీ సొంత వాహనానికి అయిన డ్యామేజీల​ను కవర్​ చేయదు.

థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ ప్రయోజనాలు

థర్డ్​ పార్టీ లయబిలిటీలను కవర్​ చేస్తుంది

థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ వలన థర్డ్​ పార్టీ వ్యక్తులకు జరిగిన నష్టాలు, డ్యామేజీల​ నుంచి మీరు కాపాడబడతారు. ఇది కేవలం అంతే అందజేస్తుంది.

చట్టం దృష్టి నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది

మోటార్​ వాహనాల చట్టం ప్రకారం ప్రతీ వాహనానికి ఇన్సూరెన్స్​ తప్పనిసరి. ప్రతీ వాహనం కనీసం థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ అయినా కలిగి ఉండాలి. ఇలా అయితేనే ఎటువంటి జరిమానాలు లేకుండా మీరు రోడ్​ మీద ప్రయాణించగల్గుతారు.

జరిమానాల బారి నుంచి కాపాడుతుంది

థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ ఉంటే మీరు ట్రాఫిక్​ జరిమానాల నుంచి కాపాడబడతారు. ఈ పాలసీ ప్రీమియం ట్రాఫిక్​ జరిమానాల కంటే చాలా తక్కువగానే ఉంటుంది. మీ జేబు​ను సురక్షితంగా ఉంచుకోవడం కోసం ఈ పాలసీ తప్పనిసరి.

థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ పరిమితులు

  • ఇది మీ బండిని సొంత డ్యామేజీల నుంచి కాపాడదు. ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, ప్రకృతి విపత్తుల నుంచి కూడా మీ బండిని కవర్​ చేయదు.
  • ఈ పాలసీలో మీరు ఎటువంటి యాడ్​–ఆన్స్​ను కొనుగోలు చేయలేరు
  • థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​లో మీరు మీ ఐడీవీ (IDV)ని కస్టమైజ్​ చేసుకోలేరు
  • మీ బైక్​ దొంగతనానికి గురైనప్పుడు ఈ పాలసీ ఎటువంటి పరిహారం అందించదు

మినహాయింపులు

  • బైక్​ సొంత డ్యామేజీలు: - పైన పేర్కొన్న విధంగా థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ కేవలం థర్డ్​ పార్టీ డ్యామేజీల​ను మాత్రమే కవర్​ చేస్తుంది. మీ బండి సొంత డ్యామేజీల​ను ఇది కవర్​ చేయదు.
  • తాగి వాహనం నడిపితే: - చట్ట ప్రకారం మీరు మద్యం సేవించి వాహనం నడపకూడదు. ఇలా చేస్తూ ప్రమాదానికి గురైతే ఏ ఇన్సూరెన్స్​ కంపెనీ కూడా మీ బండి ఇన్సూరెన్స్​ క్లెయిమ్​ను అంగీకరించదు.
  • సరైన లైసెన్స్​ లేకుండా వాహనం నడిపితే: – మీరు సరైన లైసెన్స్​ లేకుండా వాహనం నడుపుతూ ప్రమాదానికి గురైనా కూడా చట్ట ప్రకారం మీకు ఎటువంటి క్లెయిమ్​ వర్తించదు.

కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​కు ఎందుకు అప్​గ్రేడ్​ చేసుకోవాలి?

  • మీ ఇష్టమైన బైక్​ను కాపాడుకునేందుకు: మీరు మీ బైక్​ను ఎక్కువగా ఇష్టపడేవారైతే దానిని అనేక ప్రమాదాల నుంచి సంరక్షించుకునేందుకు కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ను తీసుకోవాలి. ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు లేదా ఏదైనా అనుకోని సంఘటనల నుంచి ఇది మీ బండిని రక్షిస్తుంది.
  • ఒకే ఇన్సూరెన్స్​ పాలసీలో థర్డ్​ పార్టీ లయబిలిటీలు, సొంత డ్యామేజీల​ నుంచి బైక్​ను కాపాడుకునేందుకు: కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​లో ఉన్న మంచి విషయం ఇదే. మీరు ఈ ఒక్క పాలసీని తీసుకుంటే చాలు. సొంత​ డ్యామేజీలతో పాటు థర్డ్​ పార్టీ లయబిలిటీల నుంచి ఇది మిమ్మల్ని సంరక్షిస్తుంది.
  • అదనపు కవర్స్​ యొక్క ప్రయోజనం పొందేందుకు: ఈ పాలసీలో సొంత డ్యామేజ్​ నుంచి బైక్​ను రక్షించుకోవడంతో పాటు పలు ఇతర యాడ్​-ఆన్స్​ను కూడా మీరు ఎంచుకునే సౌలభ్యం ఉంటుంది. మీకు నచ్చిన యాడ్– ఆన్స్​ను ఎంచుకుని మీరు మీ వాహనాన్ని రక్షించుకోండి.

కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ కొనుగోలు చేసే ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయాలు

  • కొనుగోలు, క్లెయిమింగ్​ ప్రక్రియ: ఇన్సూరెన్స్​ కొనుగోలు చేసే ముందు చాలా మంది ఆలోచించేది అందులో ఉన్న ప్రక్రియ గురించి. ఇది చాలా ముఖ్యమైన విషయం. డిజిట్​లో అన్ని ప్రక్రియలు చాలా సులభంగా, కేవలం ఒకే ఒక క్లిక్​తో పూర్తవుతాయి. పూర్తిగా ఆన్​లైన్​లో ఉంటాయి.
  • సర్వీస్​ ప్రయోజనాలు: డిజిట్​ అత్యధిక సర్వీస్​ ప్రయోజనాలను అందిస్తుంది. మీకు సరిపోయే సర్వీస్​ ప్రయోజనాలను చెక్​ చేసుకున్నాకే మీకు నచ్చిన దానిని ఎంచుకోండి.
  • క్లెయిమ్​ సెటిల్​మెంట్​ స్పీడ్​, రేషియో: ఒక ఇన్సూరెన్స్ కంపెనీ తమకు వచ్చిన క్లెయిమ్స్​ను విజయవంతంగా సెటిల్​ చేస్తున్నారో లేదో ఆ కంపెనీ క్లెయిమ్​ సెటిల్​మెంట్​ రేషియోను చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం డిజిట్​ కంపెనీ యొక్క టూ వీలర్​ క్లెయిమ్​ సెటిల్​మెంట్​ రేషియో 92 శాతంగా ఉంది.
  • సరైన ఐడీవీ – ఐడీవీ (IDV) దీన్నే ఇన్సూర్డ్​ డిక్లేర్డ్​ వాల్యూ అంటారు. అంటే, మీ బండికి ఇన్సూరెన్స్​ కంపెనీ అందించే గరిష్ట మొత్తం అన్నమాట. మీ బండి దొంగతనానికి గురైనపుడు లేదా పూర్తిగా డ్యామేజీ అయినపుడు మీకు ఐడీవీ (IDV)ని బట్టే ఇన్సూరెన్స్​ కంపెనీ డబ్బులు చెల్లిస్తుంది. తక్కువ ప్రీమియంతో వస్తుంది కదా అని బైక్​ ఐడీవీ (IDV)ని తక్కువగా చేసుకుంటే మీరే నష్టపోవాల్సి వస్తుంది. మీరు ఇన్సూరెన్స్​ కొనుగోలు/రిన్యూ చేసే ప్రతీసారి ఐడీవీ (IDV)ని చెక్​ చేసుకోండి. ప్రీమియం కోసం ఐడీవీ (IDV) ని తక్కువగా ఎంచుకోవద్దు. గరిష్ట మొత్తంలో ఐడీవీ (IDV) ని ఎంచుకోవడం వలన మీ బండి దొంగతనానికి గురైనపుడు మీకు ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయి. డిజిట్​లో మీరు మీకు నచ్చిన విధంగా మీ వాహన ఐడీవీ (IDV) ని కస్టమైజ్​ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఐడీవీ (IDV) విషయంలో సరైన నిర్ణయం తీసుకోండి.
  • 24x7 సపోర్ట్​: ఎవరికి ఎప్పుడు సహాయం అవసరం పడుతుందో ఎవరూ ఊహించలేరు. అందుకే మా కస్టమర్​ సపోర్ట్​ టీమ్​ మీకోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది.