గడువు ముగిసిన బైక్​ ఇన్సూరెన్స్​ను రెన్యూ చేసుకోండి

గడువు ముగిసిన మీ వాహనానికి బైక్​ ఇన్సూరెన్స్​ కోట్​ పొందండి

Third-party premium has changed from 1st June. Renew now

గడువు ముగిసిన టూ వీలర్​ ఇన్సూరెన్స్​ను ఆన్​లైన్​లో రెన్యూ చేసుకోండి

మన భారతదేశంలో టూ వీలర్స్​ చాలా పాపులర్​. ధర విషయం పక్కన పెడితే టూ వీలర్స్​ అనేవి చాలా ఉపయోగకరమైనవి. ట్రాఫిక్​ ఎక్కువగా ఉండే నగరాల్లో టూ వీలర్స్​ చాలా కంఫర్ట్​గా ఉంటాయి. అయితే, బైక్​ రైడ్​ చేయాలంటే మాత్రం మనకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్​ ఉండాలి. లేకపోతే బైక్​ నడపలేం.

టూ వీలర్​ ఇన్సూరెన్స్​ అనేది మీ బైక్​ను అనుకోని విపత్తుల నుంచి రక్షించడం మాత్రమే కాకుండా ఇంకా అనేక విధాలుగా మీకు సహాయపడుతుంది. భారతదేశ రోడ్ల మీద బైక్​ వేసుకుని తిరగాలంటే కనీసం థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ అయినా కలిగి ఉండాలి. లేకపోతే ట్రాఫిక్​ పోలీసులు ఫైన్లతో మీ జేబుకు చిల్లు పెట్టే ప్రమాదం ఉంది. చట్ట ప్రకారం కూడా బైక్​కు కనీసం థర్డ్​ పార్టీ టూ–వీలర్​ ఇన్సూరెన్స్​ కలిగి ఉండటం తప్పనిసరి.

కరోనా లాక్​డౌన్​ సమయంలో అనేక మంది టూ–వీలర్​ ఓనర్స్​ తమ ఇన్సూరెన్స్​ను రెన్యూ చేసుకోవడం మరిచిపోయారు. కొంతమంది ఇన్సూరెన్స్​ పాలసీ తీసుకోవడం అంత అవసరమా? అని భావిస్తారు. ఇంకొంత మందేమో మనం ఎలాగూ టూ వీలర్​ వాడటం లేదు కదా అని నిర్లక్ష్యం వహిస్తారు.

కానీ, బైక్​ ఇన్సూరెన్స్​ పాలసీని తప్పకుండా రెన్యువల్​ చేయించుకోవాలి. లేకపోతే మీరు అనేక రకాలుగా నష్టపోవాల్సి రావచ్చు. ఒకవేళ మీరు బైక్​ ఇన్సూరెన్స్  పాలసీని రెన్యువల్​ చేసుకోకపోతే నో క్లెయిమ్​ బోనస్​ను కూడా కోల్పోవాల్సి వస్తుంది. మీ బైక్​ ఇన్సూరెన్స్​ గడువు ముగిసినా రెన్యూ చేసుకోకపోతే ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

మీ టూ వీలర్​ ఇన్సూరెన్స్​ గడువు ముగిస్తే ఏమవుతుంది?

మీ బైక్​ను చాలా సందర్భాల్లో అనేక విపత్తుల నుంచి ఇన్సూరెన్స్​ పాలసీ కాపాడుతుంది. ఇది మీకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.

డ్యామేజ్​లు & నష్టాలు మీరే భరించాల్సి వస్తుంది

ఒకవేళ మీ టూ వీలర్​ ఇన్సూరెన్స్​ గడువు ముగిసినా మీరు రెన్యూ చేసుకోకపోతే, మీ బైక్​కు ఏదైనా నష్టం జరిగినపుడు మీరు మీ జేబు నుంచి డబ్బులను భరించాల్సి ఉంటుంది. లాక్​డౌన్​ సమయంలో మీరు మీ టూ వీలర్​ను ఉపయోగించపోయినప్పటికీ, మీ బైక్​ వేడెక్కడం, లేదా బండి పార్ట్స్​ను ఎవరైనా దొంగతనం చేయడం వంటివి జరిగితే ఇన్సూరెన్స్​ మిమ్మల్ని రక్షిస్తుంది.

ట్రాఫిక్​ పోలీసులకు దొరికితే ఫైన్​ కట్టాల్సి వస్తుంది

ఒకవేళ మీరు టూ వీలర్​ ఇన్సూరెన్స్​ లేకుండా వాహనం నడిపినపుడు ట్రాఫిక్​ పోలీసులు మిమ్మల్ని పట్టుకుంటే భారీ ఫైన్స్​ విధించే అవకాశం ఉంటుంది. ఇన్సూరెన్స్​ లేకుండా బండి నడుపుతూ పట్టుబడితే మొదటి సారి వేయి రూపాయల నుంచి రెండు వేలు, రెండో సారి రెండు వేల రూపాయలు ఫైన్​ వేస్తారు. ఇది మీకు చాలా బాధగా అనిపించొచ్చు. కానీ, టూ వీలర్​ ఇన్సూరెన్స్​ మాత్రం 750 రూపాయల నుంచే ప్రారంభం అవుతుంది. (మీ బండి రకాన్ని బట్టి ప్రీమియం అమౌంట్​ మారుతుంది)

నో క్లెయిమ్​ బోనస్​ (NCB) కోల్పోవాల్సి వస్తుంది

మీకు బైక్​ పాలసీ ఉన్నా కూడా మీరు ఎటువంటి క్లెయిమ్స్​ చేయకపోతే మీకు నో క్లెయిమ్​ బోనస్​ యాడ్​ అవుతుంది. ఒకవేళ మీరు పాలసీని రెన్యూ చేయకుండా ఉంటే మీరు నో క్లెయిమ్​ బోనస్​(NCB)ని కోల్పోవాల్సి వస్తుంది. అంటే మీరు తర్వాత మీ పాలసీని రెన్యూ చేసినా కూడా ఎటువంటి డిస్కౌంట్​ పొందలేరు.

మరో సారి ఇన్​స్పెక్షన్​కు వెళ్లాల్సి ఉంటుంది!

బైక్​ ఇన్సూరెన్స్​ పాలసీని మొదటిసారి తీసుకున్నపుడు మీరు సెల్ఫ్​ ఇన్​స్పెక్షన్​కు వెళ్లాలి. ఒకవేళ మీరు గడువు ముగిసేలోపు బైక్​ ఇన్సూరెన్స్​ పాలసీని రెన్యూ చేసుకోకపోతే మీరు మళ్లీ ఇన్​స్పెక్షన్​కు వెళ్లాల్సి వస్తుంది. ఇది మీ సమయాన్ని వృథా చేస్తుంది.

గడువు ముగిసిన బైక్​ ఇన్సూరెన్స్​ను ఆన్​లైన్​లో రెన్యూ చేయడమెలా?

మీదైనా, లేక మీకు తెలిసిన వారిదైనా సరే, బైక్​ ఇన్సూరెన్స్​ పాలసీ గడువు దగ్గర పడుతుంటే ఆన్​లైన్​లో రెన్యూ చేసుకోవడం ఎలా అని చాలా మందికి సందేహం వస్తుంది.

బైక్​ ఇన్సూరెన్స్​ పాలసీని రెన్యూ చేసుకోవడం అనేది ఇప్పుడు గతంలో ఉన్నంత కఠినంగా లేదు. మీరు ఇంట్లోనే కూర్చుని ఆన్​లైన్​లో బైక్​ ఇన్సూరెన్స్​ పాలసీని రెన్యూ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్​ చాలా ఈజీ. కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతుంది.

ఇన్సూరెన్స్​ డెవలప్​మెంట్ అథారిటీ (IRDAI) గుర్తించిన దాని ప్రకారం చాలా మంది తమ ఇన్సూరెన్స్​ పాలసీని రెన్యూ చేసుకోవడం మర్చిపోతున్నారు. చాలా మందికి అసలు ఇన్సూరెన్స్​ పాలసీ లేకుండా వాహనం నడిపితే ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనేది కూడా తెలియడం లేదు. మీరు మీ పాలసీ గడువు ముగిసే ముందే రెన్యూవల్​ చేసుకోండి.

ప్రస్తుతం ఐదు సంవత్సరాల వరకూ ఇన్సూరెన్స్​ పాలసీని తీసుకోవచ్చు. కాబట్టి లాంగ్ టర్మ్​ ఇన్సూరెన్స్​ను ఎంచుకొని నిశ్చింతంగా ఉండండి.

ఆన్​లైన్​లో ఇన్సూరెన్స్​ పాలసీని రెన్యూ చేసుకోవడం ఎలా అనే విషయం గురించి కింద సవివరం​గా ఉంది.

Digit ఇన్సూరెన్స్​తో బైక్​ ఇన్సూరెన్స్​ రెన్యూ చేసుకోవడం

  • మీ వాహనానికి అయ్యే ప్రీమియం అమౌంట్ కోసం టూ వీలర్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం చెక్​ చేసుకోండి.
  • Digit బైక్​ ఇన్సూరెన్స్​ రెన్యూవల్​ పేజ్​ సందర్శించండి.
  • మీ వాహన వివరాలు నమోదు చేసి ‘Get Quote’ బటన్​పై క్లిక్​ చేయండి. మీరు ఎంటర్​ చేసిన వివరాలు సరిగ్గా ఉన్నాయో లేవో సరిచూసుకోండి.
  • మీకు నచ్చిన ఇన్సూరెన్స్​ పాలసీని ఎంచుకోండి. ఉదాహరణకు, థర్డ్​–పార్టీ పాలసీ లేదా కాంప్రహెన్సివ్​ పాలసీ.
  • మీ టూ వీలర్​ కోసం సరైన యాడ్​–ఆన్స్​ను​ ఎంచుకోండి. (మీకు ఇష్టమైతేనే).
  • అవసరమైన వివరాలు ఎంటర్​ చేసి పేమెంట్​ చేయండి.
  • ఒకసారి మీరు పేమెంట్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మీకు PDF ఫార్మాట్​లో మీ పాలసీ కాపీ పంపించబడుతుంది. ఒకవేళ మీరు థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ తీసుకుంటే వెంటనే అది యాక్టివేట్​ అవుతుంది. ఇన్​స్పెక్షన్​ కోసం మీ వాహనం ఫొటోలు, వీడియోలను అప్​లోడ్​ చేయమని అడుగుతారు. ఇన్​స్పెక్షన్​ పూర్తయిన తర్వాత మీ కాంప్రహెన్సివ్​ పాలసీ యాక్టివేట్​ అవుతుంది. (సొంత​ డ్యామేజ్​లు​ కూడా కలిసే ఉంటాయి.)
  • మీ డిజిటల్​ PDF కాపీని డౌన్​లోడ్​ చేసుకుని భద్రపర్చుకోండి.

గడువు ముగిసిన టూ వీలర్​ పాలసీని ఆఫ్​లైన్​లో రెన్యూ చేయడం

మీకు ఆన్​లైన్​లో బైక్​ ఇన్సూరెన్స్​ పాలసీని రెన్యూ చేసుకోవడం నచ్చకపోతే మీరు మీకు నచ్చిన ఇన్సూరెన్స్​ కంపెనీ యొక్క మీకు దగ్గర్లోని బ్రాంచ్​ను సంప్రదించవచ్చు. ప్రస్తుతం ఉన్న భయానక పరిస్థితుల్లో బ్రాంచ్​ను సందర్శించడం కంటే ఆన్​లైన్​లోనే పాలసీ రెన్యూ చేసుకోవడం ఉత్తమం.

బైక్​ ఇన్సూరెన్స్​ గడువు ముగిసినపుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

బైక్​ ఇన్సూరెన్స్​ పాలసీ గడువు దగ్గర పడుతున్నపుడు వెంటనే మీ పాలసీని రెన్యూ చేసుకోండి. కొన్ని సందర్భాల్లో అనుకోని విషయాల వలన రెన్యూ చేయడం ఆలస్యం కావొచ్చు.

మీ బైక్​ ఇన్సూరెన్స్​ పాలసీ ఇప్పటికే పూర్తయినా, మీరు రెన్యూ చేయకుండా ఉన్నపుడు మీ బైక్​ను సురక్షితంగా ఉంచడమెలాగో తెలుసుకోండి.

  • మీకు ఒకవేళ ఇన్సూరెన్స్​ పాలసీ లేకపోతే బండి నడపకండి. సరైన ఇన్సూరెన్స్​ లేకుండా మీరు బండి నడిపిప్పుడు పోలీసులు పట్టుకుంటే భారీ ఫైన్​ వేసే ప్రమాదం ఉంది. అంతేకాకుండా దురదృష్టవశాత్తు ఏదైనా యాక్సిడెంట్​ అయితే రిస్క్​ మామూలుగా ఉండదు.
  • మీరు పాత ఇన్సూరెన్స్​ కంపెనీ నుంచి కొత్త కంపెనీకి మారడానికి తర్జన భర్జన పడుతుంటే, ఏఏ కంపెనీలు మంచి ఇన్సూరెన్స్ సర్వీస్​ ఇస్తాయనేది ఆన్​లైన్​లో వెతికి ఓ నిర్ణయం తీసుకోండి.
  • ఆన్​లైన్​లో రెన్యూ చేసుకునేటపుడు మీరు లాంగ్​ టర్మ్​ పాలసీ తీసుకోండి. దీంతో మీరు కొంత కాలం వరకు ఇన్సూరెన్స్​ రెన్యూవల్స్​ గురించి ఆందోళన పడకుండా ఉండొచ్చు.
  • మీరు పాలసీని రెన్యూ చేసేటపుడు మీ బైక్​ డాక్యుమెంట్లను అందుబాటులో ఉంచుకోండి. ఇన్సూరెన్స్​ పాలసీ రెన్యూ చేయడానికి బైక్​ డాక్యుమెంట్స్​ అవసరం ఉంటాయి.

గడువు ముగిసిన బైక్​ ఇన్సూరెన్స్​ పాలసీ రెన్యూవల్ గురించి FAQs

నేను లాంగ్​ టర్మ్​ బైక్​ ఇన్సూరెన్స్​ పాలసీ తీసుకుంటే అది ఎన్ని రోజులకు ఉంటుంది?

టూ వీలర్​కు మీరు లాంగ్​ టర్మ్​ పాలసీని ఒకేసారి ఐదేళ్లకు తీసుకోవచ్చు.

ఇన్సూరెన్స్​ లేకున్నా రోడ్​ మీద బైక్​ నడిపితే భారతదేశంలో ఎంత ఫైన్​ వేస్తారు?

ఇన్సూరెన్స్​ పాలసీ లేకుండా బండి నడిపితే మొదటిసారి దొరికినపుడు రూ. 1,000, రెండోసారి దొరికితే రూ. 2,000 వరకు ఫైన్​ వేసే అవకాశం ఉంటుంది.

గడువు ముగిసే తేదీ కంటే ముందే నేను నా బైక్​ ఇన్సూరెన్స్​ పాలసీని రెన్యూ చేసుకోవచ్చా?

అవును. రెన్యూ చేసుకోవచ్చు. అది చాలా మంచి పద్ధతి కూడా. మీ పాలసీ గడువు ముగిసే కొద్ది రోజుల ముందే రెన్యూ చేసుకోవడం ఉత్తమం. ఇలా చేయడం వలన మీకు ఏదో ఒక పాలసీ కవర్​ ఉంటుంది.

నా బైక్​ ఇన్సూరెన్స్​ పాలసీ గడువు తేదీని ఎలా చెక్​ చేయాలి?

మీరు Digit లో ఇన్సూరెన్స్​ పాలసీని తీసుకుంటే మీ రిజిస్టర్డ్​ ఈమెయిల్​ ఐడీకి మీ పాలసీ నెంబర్​తో కూడిన డాక్యుమెంట్​ వస్తుంది. మీరు ఆ డాక్యుమెంట్​లోనే గడువు తేదీని చూసుకోవచ్చు.