వాడిన (సెకండ్​ హ్యాండ్​) బైక్​కు ఇన్సూరెన్స్ పాలసీ

Third-party premium has changed from 1st June. Renew now

సెకండ్ హ్యాండ్ బైక్ కొనుగోలు చేసే ముందు తనిఖీ చేయాల్సిన విషయాలు

మీరు ఒక బండిని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లతే.. మరియు అందుకోసం ఎక్కువగా ఖర్చు చేయకూడదనుకుంటే సెకండ్ హ్యాండ్ (వాడిన) బైక్ తీసుకోవడం మంచి ఆలోచన. సెకండ్ హ్యాండ్ బండిని కొనుగోలు చేసే ముందు ఎటువంటి విషయాలు పరిశీలించాలో తెలుసుకోండి. వాటి మీద దృష్టి పెట్టండి. మీకు రోడ్డు మీద మంచి మజాను అందించే బైక్​ను ఎంచుకోండి.

ఎలా తనిఖీ చేయాలని తికమకపడుతున్నారా? ఏమీ పర్లేదు.. మేము మీకు సాయం చేస్తాం. సవివరమైన గైడ్ కింద ఉంది.

వాడిన బైక్ కొనుగోలు చేసే ముందు ఈ చెక్ లిస్ట్ తనిఖీ చేయండి.

మీ రైడింగ్ కోసం తగిన బైక్​లను వెతకండి  – మీరు ఎటువంటి ప్రయోజనాల కోసం బైక్​ కొంటున్నారని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అందుకు తదనుగుణంగా వెతకండి.

పరిశోధన ముఖ్యం – మీరు ఎటువంటి బైక్ కావాలనుకుంటున్నారో.. దాని గురించి నిపుణులతో చర్చించండి. ఆన్​లైన్​లో వెతకండి.

బైక్​ను నిశితంగా తనిఖీ చేయండి – బండికి వేసిన రంగు, మరకలు, ఏమైనా లీకేజీలు, టైర్లు, సొట్టలను పరిశీలించండి. అవతలివైపు బాడీని కూడా తనిఖీ చేయండి. ఏవైనా సొట్టలు ఉన్నాయో ప్రత్యేకించి తనిఖీ చేయండి. సొట్టలు కనుక మరీ అంతగా లేకపోతే ఓకేగా పరిగణించండి.

బ్రేక్స్ - వాడిన బైకుల​లో ఎక్కువ డ్రమ్స్ బ్రేక్స్ ఉంటాయి. కావున బ్రేకులను పరీక్షించండి. మీరు వాటిని అలాగే ఉంచాలని అనుకుంటున్నారా.. మార్చాలని చూస్తున్నారా నిర్ణయించుకోండి. సర్వీస్ కూడా పరిగణించాలి.

సర్వీసింగ్ రికార్డ్ – ఆ బైక్​ ఎన్నిసార్లు సర్వీసింగ్​కు వెళ్లిందో, ఎందుకు వెళ్లిందో యజమానిని అడిగి తెలుసుకోండి.

బైక్ VIN నెంబర్ స్కాన్ చేయండి. ఏదైనా సమస్య ఉందో చూడండి - వెహికిల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (VIN) అనేది చాలా ముఖ్యం. చాలా బైకుల​లో స్టీరింగ్ వద్ద మీకు VIN నెంబర్ స్టాంప్ చేసి కనబడుతుంది. హెడ్​లైట్ కింద అది ఉంటుంది. అధికారిక టైటిల్​లో ఉన్న నెంబర్​తో ఈ నెంబర్​ సరిపోలుతుందో లేదో తనిఖీ చేయండి.

లైట్స్ - హెడ్​లైట్ బల్బ్, ఇండికేటర్లు, టెయిల్ లైట్స్ పని చేసే స్థితిలో ఉన్నాయో లేదో చూడండి. ఒకవేళ పని చేయకపోతే వాటిని మార్పించండి.

పేపర్లను తనిఖీ చేయండి – ఆర్​సీ బుక్, బైక్ ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ, పొల్యూషన్ సర్టిఫికెట్, ఎక్స్​టెండెడ్ వారంటీ సర్టిఫికెట్ (ఉంటే)..

టెస్ట్ డ్రైవ్ (Test drive) – బండి వేగం, మైలేజీని చెక్ చేసేందుకు, నడిపినపుడు బైక్ పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒకసారి దాన్ని నడిపి చూడండి.

లోకల్ మెకానిక్​తో మాట్లాడి పూర్తిగా తనిఖీ చేయించండి – మీరు సెకండ్ హ్యాండ్ బైక్​ను ప్రైవేట్ వ్యక్తి నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ.. అందుకు ఏదైనా కాంట్రాక్ట్ చేసుకునే ముందు థర్డ్ పార్టీని పరిశీలించాలి.

మీరు కావాలనుకున్న సెకండ్ హ్యాండ్ బైక్ దొరికితే.. దానిని మీకు దగ్గర్లోని లోకల్ మెకానిక్ షాపులో చెక్ చేయించేందుకు తీసుకెళ్లండి. (మీకు బైక్ మెకానిక్ గురించి తెలియకపోతే) ఈ చెకింగ్ పూర్తయిన తర్వాత అప్పుడు ఓనర్​షిప్, ఇన్సూరెన్స్​కు సంబంధించిన పత్రాలను తనిఖీ చేయాలి.

బైక్ ఓనర్​షిప్​ ఎలా బదిలీ చేసుకోవాలి?

ఓనర్​షిప్ బదిలీ చాలా ముఖ్యం. ఇది ఎలా చేసుకోవాలంటే..

స్టెప్ 1 (Step 1) – బైక్ యజమాని ఏ రిజిస్ట్రేషన్ ఆఫీసులో అయితే బండిని రిజిస్టర్ చేయించాడో అదే రిజిస్ట్రేషన్ ఆఫీసులో మీరు ఓనర్​షిప్ బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

స్టెప్ 2 (Step 2) – ఒరిజినల్ డాక్యుమెంట్లతో ఫామ్ 29, ఫామ్ 30ని సబ్మిట్ చేయాలి. ఆర్​సీ (RC), బీమా, ఎమిషన్ టెస్ట్, పన్ను చెల్లింపు రశీదులు, మూడు పాస్​పోర్ట్ సైజ్ ఫొటోలు, విక్రేత చిరునామ ధ్రువీకరణ పత్రాల వంటి డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి.

స్టెప్ 3 (Step 3) – రిజిస్టరింగ్ అథారిటీ అన్ని వెరిఫికేషన్లను పూర్తి చేసిన తర్వాత.. 14 రోజుల్లో బండి ఓనర్​షిప్ మీ పేరు మీదకు బదిలీ అవుతుంది.

చాలా సులభం కదా.. దీనికి కావాల్సిన డాక్యుమెంట్లివిగో..:

  • విక్రేత సంతకంతో కూడిన ఫామ్ 29: రెండు కాపీలు
  • చాసెస్ ప్రింట్​తో ఉన్న, కొనుగోలు చేస్తున్న వ్యక్తి, బైక్ అమ్ముతున్న వ్యక్తి సంతకాలు చేసిన ఫామ్ 30: ఒక కాపీ.
  • బైక్ అనేది వేరే ప్రాంతం లేదా ఆర్​టీవో (RTO) నుంచి తీసుకొస్తే తప్పనిసరిగా ఎన్​వోసీ (NOC – నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్) సమర్పించాలి. 
  • బండి అమ్మే వ్యక్తి రుణం తీసుకొని ఉంటే తప్పనిసరిగా ఆ లోన్ క్లియరెన్స్ ఎన్​వోసీ (NOC) ఉండాలి.
  • ఒరిజినల్ ఆర్​సీ (RC)
  • ఇన్సూరెన్స్ కాపీ
  • ఎమిషన్ టెస్ట్
  • పన్ను చెల్లింపు రశీదులు
  • విక్రేత చిరునామా ధ్రువీకరణ పత్రాలు
  • మూడు పాస్​పోర్ట్ సైజ్ ఫొటోలు

సెంట్రల్ మోటార్ వెహికిల్స్ యాక్ట్​–1989 లోని రూల్–81 ప్రకారం పైన పేర్కొన్న డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ ఫీజుతో కలిపి రిజిస్ట్రేషన్ అథారిటీకి సబ్మిట్ చేయాలి.

బైక్ ఇన్సూరెన్స్ ఎలా బదిలీ చేసుకోవాలి?

మీరు కొనుగోలు చేసిన బైక్ ఇన్సూరెన్స్​ను బదిలీ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఓనర్​షిప్​ను బదిలీ చేసుకునే సమయంలో అన్ని ఫార్మాలిటీలను సరిగా పూర్తి చేశారని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. బైక్ ఇన్సూరెన్స్ బదిలీని ఇది మరింత సులభతరం చేస్తుంది.

బైక్ ఇన్సూరెన్స్ బదిలీ చేసుకునేందుకు ఏమేం కావాలంటే..

  • యజమాని బీమా కంపెనీకి కనీసం 15 రోజుల ముందు బైక్ ఇన్సూరెన్స్ బదిలీ గురించి తెలియజేస్తూ దరఖాస్తు చేసుకోవాలి.
  • రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఓనర్​షిప్ బదిలీ తేదీ, ఒరిజినల్ ఇన్సూరెన్స్ పాలసీ వివరాలు, వాహన వివరాలు, డీలర్ పేరు, చెల్లించిన ప్రీమియంల వంటి పత్రాలను తీసుకెళ్లాలి.
  • యజమాని వ్యక్తిగత వివరాలతో పాటుగా.. కొనుగోలుదారు కూడా వ్యక్తిగత ఐడీని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బీమా బదిలీ కోసం పాన్​ (PAN) కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి సబ్మిట్ చేయొచ్చు. బీమా కంపెనీ వాళ్లు అన్ని డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత కొత్త యజమాని పేరు మీదకు పాలసీ మార్చబడుతుంది.
  • బైక్ యజమాని బీమా బదిలీ సమయంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ సబ్మిట్ చేయాలి. ఎందుకుంటే ఇన్సూరెన్స్ ప్రీమియం లెక్కించడం చాలా ముఖ్యం.
  • బైక్ యజమాని నో–క్లెయిమ్ బోనస్ సర్టిఫికెట్​ను సమర్పిస్తే.. ప్రీమియంలో డిస్కౌంట్​ కూడా పొందొచ్చు.

వాడిన బైక్​ల కోసం కొత్త బీమా పాలసీ

మీరు సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకున్నపుడు బీమా రాకపోతే.. మీరు సొంతంగా బీమా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బీమా అనేది చట్టప్రకారం తప్పనిసరి. సెకండ్ హ్యాండ్ బైకులకు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ అత్యంత ప్రాధాన్యమైన పాలసీ. ఇందులో కస్టమైజ్డ్ యాడ్–ఆన్​ల వలన గరిష్ట ప్రయోజనాలు చేకూరుతాయి. మీరు మీ బైక్​ ఇన్సూరెన్స్​ను అయితే ఆన్​లైన్​లో తీసుకోవచ్చు లేదా ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్లయినా తీసుకోవచ్చు. అన్ని రకాల అవసరమైన డాక్యుమెంట్లు సబ్మిట్ చేసి.. తర్వాత మీ బైక్​కు సరిపోయే పాలసీని తీసుకోండి.

వాడిన బైకుల కోసం ఉన్న పాలసీల రకాలు

థర్డ్ పార్టీ (Third-Party) – థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది పేరులాగానే థర్డ్ పార్టీ నష్టాలను కవర్ చేస్తుంది. అలాగే, యజమానికి వ్యక్తిగత గాయాలు/మరణం సంభవిస్తే కవర్ చేస్తుంది.

ఏమేం కవర్ అవుతాయంటే?

  • థర్డ్ పార్టీ గాయం/మరణం
  • ఇతరుల ఆస్తి లేదా వాహనం డ్యామేజ్ అయితే
  • ఇంతవరకు లేనట్లయితే.. యజమాని, డ్రైవర్​కు పర్సనల్ డ్యామేజ్ కవర్​ను అందజేస్తుంది.

ఏమేం కవర్ కావంటే?

  • భాగాల తరుగుదల, బ్రేక్​డౌన్ అసిస్టెన్స్ వంటి యాడ్–ఆన్స్ ఉండవు.
  • అగ్ని ప్రమాదాలు, దొంగతనాలు, ప్రమాదాల వలన సొంత వాహనానికి డ్యామేజ్ అయితే

మేము కాంప్రహెన్సివ్ లేదా స్టాండర్డ్ ప్యాకేజ్ పాలసీనే సిఫారసు చేస్తాం. మీరు బండి మీద ఎక్కువగా రైడ్ చేయనట్లయితే, మీ బండి చాలా పాతదైతే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మీకు సరిపోతుంది.

కాంప్రహెన్సివ్ పాలసీ (Comprehensive Policy) – ఈ పాలసీ థర్డ్ పార్టీ నష్టాలతో పాటుగా సొంత బైక్​కు, దాని యజమానికి అయిన నష్టాలను కూడా కవర్ చేస్తుంది. కాంప్రహెన్సివ్ లేదా స్టాండర్డ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ మీ బండికి భరోసాను అందించడమే కాకుండా మీ జేబును కూడా ఆర్థిక నష్టాల నుంచి కాపాడుతుంది.   

ఏమేం కవర్ అవుతాయంటే?

  • థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్​లో ఉన్న అన్ని రకాల ప్రయోజనాలు. అంటే థర్డ్ పార్టీ వ్యక్తులకు లేదా ఆస్తులకు ఏదైనా డ్యామేజ్ అయినా ఆసుపత్రిపాలైనా ఇది కవర్ చేస్తుంది.
  • అంతేకాకుండా సొంత వాహనానికిఅయిన డ్యామేజీల​ను కూడా కవర్ చేస్తుంది. ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, దొంగతనాల వంటి ఎలాంటి విషయాల్లో డ్యామేజ్ అయినా కానీ ఇది కవర్ చేస్తుంది.
  • మీకు ఇంతవరకు లేనట్లయితే.. యజమాని, డ్రైవర్​కు వ్యక్తిగత డ్యామేజ్ కవర్​ను అందజేస్తుంది.

వాడిన బైకుల కోసం అందుబాటులో ఉన్న యాడ్–ఆన్స్

మీ సెకండ్ హ్యాండ్ బైక్ సమగ్ర సంరక్షణ కోసం మేము సరైన యాడ్​–ఆన్​లను అందజేస్తాం. గరిష్ట ప్రయోజనాలను పొందేందుకు బైక్ ఇన్సూరెన్స్​ యాడ్–ఆన్లను కూడా ఎంచుకోండి.

  • పార్ట్స్ డిస్క్రిప్షన్ కవర్ (జీరో డెప్ / బంపర్ టు బంపర్) – సమయం గడిచే కొద్ది మీ బండి విలువ తగ్గిపోతుంది. డిప్రిసియేషన్ (తరుగుదల) అనేది మీరు క్లెయిములు చేసినపుడు కూడా బండి విలువను తగ్గిస్తుంది. కానీ జీరో డిప్రిసియేషన్ కవర్ యాడ్–ఆన్​ను మీరు ఎంచుకుంటే ఎటువంటి తరుగుదల ఉండదు. డిజిట్ అధీకృత వర్క్​షాప్​లో మీరు మరమ్మతులు చేయించుకున్నపుడు పూర్తి అమౌంట్ క్లెయిమ్ అవుతుంది.
  • కంజూమబుల్ కవర్ – ఈ యాడ్​–ఆన్​లో రిప్లేస్​మెంట్ భాగాలు అయిన స్క్రూలు, ఇంజిన్ ఆయిల్​, నట్లు, బోల్టులు, గ్రీస్ వంటివి కవర్ చేయబడతాయి.
  • ఇంజిన్, గేర్ బాక్స్ ప్రొటెక్షన్ కవర్ ఏదైనా ప్రమాదం వలన ఇంజిన్​కు డ్యామేజ్ అయితే స్టాండర్డ్ ప్యాకేజ్ పాలసీ కింద కవర్ చేయబడుతుంది. కానీ అది పర్యవసాన డ్యామేజ్ అయితే కవర్ కాదు. కానీ ఈ యాడ్–ఆన్​ కనుక ఉంటే ప్రమాదం జరగకపోయినా కానీ ఇంజిన్ పాడైతే ఆ ఖర్చులను కవర్ చేస్తుంది.
  • రిటర్న్ టు ఇన్​వాయిస్ కవర్ ఒకవేళ మీ బండి దొంగిలించబడినా లేదా మరమ్మతు చేయరాకుండా పాడైపోయినా, మరమ్మతు ఖర్చు ఐడీవీ (IDV)లో 75 శాతం కంటే ఎక్కువ అయినా, అటువంటి సందర్భంలో కొత్త బైక్ కొనుగోలు చేయాలని మేము సూచిస్తాం. మీరు ఎక్స్--షోరూమ్ ధర ఎంత ఉందో అంత పొందుతారు లేదా పాత ఇన్​వాయిస్​లో ఉన్నది మైనస్ ఐడీవీ (IDV ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ). అంతే కాకుండా రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్​ను కూడా మేము కవర్ చేస్తాం.
  • బ్రేక్​డౌన్ అసిస్టెన్స్ (RSA) – రోడ్ మీద ఎప్పుడైనా బ్రేక్ డౌన్ అయితే 24 గంటల సహాయం పొందండి. సిటీ సెంటర్ నుంచి 500 కిలో మీటర్ల వరకు ఇది వర్తిస్తుంది.

మీకు మరిన్ని సందేహాలుంటే మాకు కాల్ చేయండి. మేము సంతోషంగా సాయం చేస్తాం.