హెల్త్ ఇన్సురంచె ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి

డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్‌కి మారండి.

ఈఎంఐలో హెల్త్ ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేయడం మంచి ఆలోచనేనా?

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత గురించి అతిగా చెప్పలేం. కానీ చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేసేందుకు విముఖత చూపొచ్చు. ఇందుకు ఉన్న కారణాల్లో ఒక ప్రధాన కారణం ఖర్చు. నెలవారీ ఆదాయాల మీద ఆధారపడే వారు ఒకే మొత్తంలో వార్షిక ప్రీమియంను చెల్లించడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది.

ఇండియన్లకు హెల్త్ ఇన్సూరెన్స్ ను మరింత సులభతరం చేసేందుకు 2019లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈఎంఐల ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను చెల్లించే విధంగా అనుమతించమని ఇన్సూరెన్స్ కంపెనీలను కోరింది. అందువల్ల నెలవారీ, క్వార్టర్లీ (మూడు నెలలకు), అర్ధ వార్షిక వాయిదాల్లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని చెల్లించడం సాధ్యమవుతుంది.

ఈఎంఐలో హెల్త్ ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేయడం వలన కలిగే ప్రయోజనాలు

నెలవారీగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను చెల్లించడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి:

1. ఎక్కువ సౌలభ్యం

నెలవారీ ఆదాయం మీద ఆధారపడే వ్యక్తులకు ప్రీమియంలు ఈఎంఐల ద్వారా చెల్లించడం చాలా సులభంగా ఉంటుంది. ఎటువంటి అవాంతరాలు లేని చెల్లింపులు చేసేందుకు ఆన్ లైన్ చెల్లింపుల వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మరింత సులభతరం చేసేందుకు ఈ రెండు ఫీచర్లు ఎంతో ఉపయోగపడ్డాయి.

2. పెరుగుతున్న వైద్య ఖర్చుల నుంచి కాపాడుతుంది

ఈ రోజుల్లో వైద్య ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. వాటి నుంచి ఆర్థిక భద్రతను పొందేందుకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. అధిక ఇన్సూరెన్స్ చేసిన మొత్తము (సమ్ ఇన్సూర్డ్) పొందడం చాలా ముఖ్యం. ఇది అధిక ప్రీమియంకు దారి తీయొచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ లను ఈఎంఐల ద్వారా చెల్లించడం చాలా మందికి సులభంగా ఉంటుంది. తద్వారా పెరుగుతున్న ఖర్చులను ఇది మేనేజ్ చేస్తుంది.

3. సులభంగా భరించే స్థోమత

నెలవారీ ఆదాయం మీద ఆధారపడే వ్యక్తులు ఒకేసారి పెద్దమొత్తంలో ప్రీమియం కట్టడం సవాలుగా ఉంటుంది. నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక పద్ధతిలో ఈఎంఐల ద్వారా ప్రీమియంలను చెల్లించే వెసులుబాటు ఉండడం వలన వారు మరింత సులభంగా సరసమైన హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. మరియు చికిత్స విషయంలో ఎటువంటి రాజీపడాల్సిన అవసరం లేదు.

4. సీనియర్ సిటిజన్లకు ఎంతో ప్రయోజనం

సీనియర్లు ఎక్కువ ఆరోగ్య సమస్యలను కలిగి ఉంటారు. అందువల్లే వారి హెల్త్ ఇన్సూరెన్స్ లకు ఎక్కువ ప్రీమియంలు ఉంటాయి. అంతే కాకుండా సీనియర్ సిటిజన్లు కూడా కొంత మందికి పరిమిత నెలవారీ ఆదాయం ఉండవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ లు ఈఎంఐలలో అందుబాటులో ఉండడంతో ఎంతో ముఖ్యమైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ప్రతి ఒక్కరూ తీసుకుంటున్నారు. వైద్య ఖర్చుల విషయంలో తమ పొదుపుల గురించి ఎటువంటి చింత లేకుండా ఉంటున్నారు.

5. అధిక కవరేజీని ఎంచుకోండి

ఎక్కువ కవరేజీని, లేదా ఎక్కువ మొత్తంలో ఇన్సూరెన్స్ చేసిన మొత్తమును పొందాలని అనుకుంటారు. అటువంటి సమయంలో ఒకేసారి ప్రీమియం కట్టడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ నెలవారీ ఈఎంఐ చెల్లింపులతో ఒకేసారి మొత్తం కట్టకుండా మంచి కవరేజీని ఎంచుకోవచ్చు.

6. పన్ను ప్రయోజనాలు పొందండి

ఎవరైనా వారి ఇన్సూరెన్స్ ప్రీమియంలను ఈఎంఐల ద్వారా కట్టొచ్చు. అయినా కానీ వారు ఆదాయపు పన్ను సెక్షన్ 80D కింద పన్ను ప్రయోజనాలు పొందేందుకు అర్హులు. ఇన్సూరెన్స్ కోసం చెల్లించిన ప్రీమియం ను బట్టి వారు ఆదాయపు పన్ను తగ్గింపులపై క్లెయిమ్ చేసుకోవచ్చు.

ఈఎంఐలో హెల్త్ ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేయడం వల్ల నష్టాలు ఏమిటి?

ఈఎంఐల మీద హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నపుడు కొన్ని ప్రతికూలతలు మరియు నష్టాలు కూడా ఉన్నాయి. (ఈఎంఐలను విస్మరించడం సాధ్యం కాదు.. తేదీ మిస్ కాకుండా కట్టాల్సి ఉంటుంది.):

  • అదనపు ప్రీమియం - చాలా సందర్భాలలో హెల్త్ ఇన్సూరెన్స్ ల మీద చెల్లించే నెలవారీ ఈఎంఐ ప్రీమియంలు మామూలు ప్రీమియం కంటే ఎక్కువ భారం కావొచ్చు. ఉదాహరణ చూసుకుంటే వారు ఏక మొత్తంలో చెల్లించిన దానికంటే ఒక్కోసారి 3-5 శాతం ఎక్కువ కట్టాల్సి రావొచ్చు.
  • క్లయిమ్ ల కోసం వెయిటింగ్ - నిర్దిష్ట సంఖ్యలో ఇన్‌స్టాల్‌మెంట్‌లు కట్టే వరకు మీరు ఎటువంటి క్లయిమ్ లు చేసేందుకు అవకాశం ఉండదు. అదే వార్షిక ప్రీమియం ఒకేసారి చెల్లించే విషయంలో ఈ నిబంధన ఉండదు.
  • పెద్ద మొత్తంలో SI(సమ్ ఇన్సూర్డ్) అవసరం కావొచ్చు - చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం నిర్దిష్ట మొత్తం కంటే ఎక్కువ ఇన్సూరెన్స్ చేసినపుడు మాత్రమే ఈఎంఐల సౌకర్యాన్ని అందిస్తాయి. రూ. 5 లక్షల కంటే తక్కువ SI (సమ్ ఇన్సూర్డ్) ఎంచుకునే వారు ఈ ప్రయోజనాన్ని పొందలేరు.
  • డిస్కౌంట్లను కోల్పోవడం - ఈఎంఐలలో ప్రీమియంలను చెల్లించే వారు డిస్కౌంట్లను కోల్పోయే ప్రమాదం ఉంది. ఒకేసారి ప్రీమియం మొత్తం చెల్లించినప్పుడు డిస్కౌంట్ లభించే అవకాశం ఉంటుంది.

ఈఎంఐలో కొనుగోలు చేసినప్పుడు ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ ను ఎంచుకోవాలి?

అనేక రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఈఎంఐలను అందిస్తున్నందున సరైన దానిని ఎంచుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది. దాని కోసం పరిగణించాల్సిన కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటంటే:

  • ఎటువంటి వడ్డీ లేకుండా వచ్చే ఈఎంఐ (నో కాస్ట్ ఈఎంఐ) హెల్త్ ఇన్సూరెన్స్ కోసం చూడండి. ఈఎంఐ ద్వారా కడితే వార్షిక ఇన్సూరెన్స్ ప్రీమియంతో పోల్చినప్పుడు ఎటువంటి అదనపు ఖర్చులు ఉండకూడదు.
  • మీరు తీసుకున్న పాలసీ మీ ఆరోగ్య సంరక్షణ అవసరాలకు మరియు మీరు పాలసీ కింద కవర్ చేస్తున్న వ్యక్తుల సంఖ్యకు కవరేజీని అందిస్తుందని నిర్దారించుకోండి.
  • నిబంధనలు మరియు షరతులను చదవడం ద్వారా మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏం మినహాయించబడిందో తెలుసుకోండి.
  • ఇన్సూరెన్స్ సంస్థ నగదు రహిత ఆసుపత్రి లో చేరడం (క్యాష్ లెస్ హాస్పిటలైజేషన్) అందించిందని, మరియు దానికి మెరుగైన (జనం విశ్వసించే) కస్టమర్ సర్వీస్ రికార్డ్ ఉందని నిర్దారించుకోండి.

చివరగా

ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని ప్రీమియంలను చెల్లించే స్థోమత ఎక్కువగా లేదు. అందుకోసమే నెలవారీ ఈఎంఐ ఎంపికలు గొప్ప ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ రకమైన పాలసీ (విధానం) లు అందుబాటులో లేనప్పటికీ, కాంప్రహెన్సివ్ ఆరోగ్య సంరక్షణ కవరేజ్ పొందేందుకు ఇవి ప్రజలను అనుమతిస్తాయి.

అందువల్ల మీరు ఈఎంఐ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేయడం వలన కలిగే నష్టాల గురించి అంతగా పట్టించుకోకపోతే, పెరుగుతున్న వైద్య ఖర్చుల నుంచి మిమ్మల్ని మీ కుటుంబసభ్యులను రక్షించుకునేందుకు ఇది ఉత్తమ మార్గం.

తరచుగా అడిగే ప్రశ్నలు

హెల్త్ ఇన్సూరెన్స్ ను ఈఎంఐలలో చెల్లించేందుకు మీరు ఎలా ఎంచుకోవాలి?

మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసే సమయంలో సౌకర్యవంతమైన చెల్లింపు ఎంపికల గురించి ఇన్సూరెన్స్ సంస్థతో మాట్లాడండి. వారు ఈ సదుపాయాన్ని కలిగి ఉంటే మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను నెలవారీ, త్రైమాసిక, లేదా అర్థ వార్షిక వాయిదాలలో చెల్లించవచ్చు.

ఆన్ లైన్ లో, ఆఫ్ లైన్ లో లేదా ఆటో డెబిట్ ఆన్ చేయడం ద్వారా మీ ఖాతా నుంచి వార్షిక ప్రీమియం మాదిరిగానే డెబిట్ అవుతుంది.

హెల్త్ ఇన్సూరెన్స్ ను ఈఎంఐల ద్వారా ఎవరు ఎంచుకోవాలి?

నెలవారీ ఆదాయం వచ్చే వారికి మరియు ఒకే సారి పెద్ద మొత్తంలో ఖర్చు చేయకూడదనుకునే అప్పుడే జీవితం మొదలుపెట్టిన యువ నిపుణులకు, మరియు ఎక్కువ మొత్తంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఉండే సీనియర్ సిటిజన్లకు ఈఎంఐలో పాలసీని తీసుకోవడం మంచి ఎంపిక.

మీరు ఈఎంఐలో చెల్లించినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఎలా చెల్లించాలి?

మీరు ప్రీమియం ను ఈఎంఐలో చెల్లించినా కూడా ప్రీమియం అనేది అలాగే లెక్కించబడుతుంది. ఇది కింద ఉన్న అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది:

  • మీరు ఎంచుకున్న ఇన్సూరెన్స్ చేసిన మొత్తము (సమ్ ఇన్సూర్డ్)
  • మీరు ఎంపిక చేసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ రకం
  • ఇన్సూరెన్స్ చేయబడిన కుటుంబసభ్యుల సంఖ్య
  • ఇన్సూరెన్స్ చేయబడిన సభ్యుల వయసు
  • ధూమపానం వంటి జీవనశైలి అలవాట్లు
  • మధుమేహం, రక్తపోటు, ఆస్తమా వంటి ముందుగా ఉన్న వైద్య పరిస్థితులు
  • మీరు నివసించే నగరం, ఆ నగరంలో ఉండే వైద్య ఖర్చులు మరియు ప్రమాదాలు