హెల్త్​ ఇన్సూరెన్స్​ పోర్టబులిటీ

Zero Paperwork. Quick Process.

హెల్త్​ ఇన్సూరెన్స్​ పోర్టబులిటీ అంటే ఏమిటి?

హెల్త్​ ఇన్సూరెన్స్​ పోర్టబులిటీ అనగా ప్రస్తుతం ఒక కంపెనీ వద్ద ఉన్న మన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని మరో హెల్త్​ ఇన్సూరెన్స్​ కంపెనీకి బదిలీ చేసుకోవడం. ఈ పోర్టబులిటీని మన ఇష్టపూర్వకంగా చేసుకోవచ్చు. ఇది అచ్చంగా మొబైల్​ నంబర్​ పోర్టబులిటీలాగానే పని చేస్తుంది.

ఈ హెల్త్​ ఇన్సూరెన్స్​ పోర్టబులిటీలో మన వెయిటింగ్​ పీరియడ్​ అనేది కోల్పోకుండా అలాగే ఉంటుంది. అలాగే నో క్లెయిమ్​ బోనస్​ అనేది పాత కంపెనీ నుంచి కొత్త ఇన్సూరెన్స్​ కంపెనీకి బదిలీ అవుతుంది. బయట కంపెనీలో ఉన్న బెటర్​ ప్లాన్స్​ కు మన పాలసీని మార్చుకునే సౌలభ్యం ఉంటుంది. అంతేగాక, మీరు కొత్తగా వెయిటింగ్ పీరియడ్ ను ప్రారంభించడం, అప్పటివరకు ఉన్న క్యుములేటివ్ బోనస్ ను కోల్పోవడం వంటివేమీ ఉండవు.

మీ హెల్త్​ ఇన్సూరెన్స్​ను డిజిట్ కే ఎందుకు పోర్ట్​ చేసుకోవాలి?

నా హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీని డిజిట్ కు పోర్ట్ చేసుకునేందుకు ఏం చేయాల్సి ఉంటుంది?

  • Step 1: డిజిట్ హెల్త్​ కు పోర్ట్​ అవుతాం అనే ఆప్షన్​ మీద క్లిక్​ చేయండి.
  • Step 2: మీ పేరు, మొబైల్​ నంబర్​ను ఎంటర్​ చేయండి.
  • Step 3: ఇక అంతే మిగతాది మాకు వదిలేయండి. 48 గంటల్లో మా హెల్త్​ ఇన్సూరెన్స్​ ఎక్స్​పర్ట్ మీకు కాల్​ చేసి వివరాలు నమోదు చేసుకుంటారు. మీరు మీ పాలసీని పోర్ట్​ చేసుకునేందుకు హెల్ప్​ చేస్తారు.

నా హెల్త్​ ఇన్సూరెన్స్​ను డిజిట్ కు పోర్ట్​ చేసుకునేందుకు ఏ డాక్యుమెంట్స్​ కావాలి?

  • మీ ప్రస్తుత​ హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ యొక్క షెడ్యూల్​ అవసరమవుతుంది. దీనిని మీ ప్రస్తుత​ హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ ప్రొవైడర్​ అందజేస్తారు.
  • మీ ఐడెంటిటీ ప్రూఫ్​.
  • మిగతా వివరాలైన మెడికల్​ డీటెయిల్స్​, క్లెయిమ్​ హిస్టరీని మీకు కాల్ చేసి కలెక్ట్​ చేసుకుంటారు.

మీ హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీలో ఏమేం పోర్ట్​ చేయొచ్చు?

ప్రస్తుతం ఉన్న అందరు ఇన్సూర్డ్​ మెంబర్లను​.

ప్రస్తుత ఇన్సూర్డ్​ అమౌంట్ ను.

మీ క్యుములేటివ్​ బోనస్​.

మీ ప్రీ ఎగ్జిస్టింగ్​ డిసీజ్​ వెయిటింగ్​ పీరియడ్​.

మీ స్పెసిఫిక్​ డిసీజ్​ వెయిటింగ్​  పీరియడ్.

మీ మెటర్నటీ బెనిఫిట్​ వెయిటింగ్​ పీరియడ్​ (మీరు ఎంచుకున్నట్లయితే)

హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీని పోర్ట్​ చేసుకునేందుకు మీకు ఉన్న హక్కులు

IRDA నియమాల ప్రకారం ప్రతి పాలసీ హోల్డర్​కు​ తన ఇన్సూరెన్స్​ పాలసీని పోర్ట్​ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. (ఇండివిడ్యువల్​ పాలసీలు, ఫ్యామిలీ హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీలు) జనరల్​ లేదా స్పెషలైజ్​డ్​ హెల్త్​ ఇన్సూరెన్స్​ కంపెనీ నుంచి మరో కంపెనీకి మారే అవకాశం ఉంటుంది.

IRDA ఆదేశాల ప్రకారం, కొత్త ఇన్సూరెన్స్​ కంపెనీ వాళ్లు పాలసీ హోల్డర్​కు పాత కంపెనీ అందించిన ఇన్సూరెన్స్​ మొత్తాన్ని అందిస్తారు.

హెల్త్​ ఇన్సూరెన్స్​ను కొత్త కంపెనీకి పోర్ట్​ చేసినపుడు మీ వెయిటింగ్​ పీరియడ్​, నో క్లెయిమ్​ బోనస్​ కూడా బదిలీ చేయబడుతుంది.

మీ హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ విజయవంతంగా పోర్ట్​ అయితే మీకు పాత ఇన్సూరెన్స్ కంపెనీ, కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ ఇద్దరి నుంచి సందేశాలు అందుతాయి. IRDA ఆదేశాల ప్రకారం ఇది తప్పనిసరి.

హెల్త్​ ఇన్సూరెన్స్​ పోర్ట్​ చేసుకునేందుకు IRDA విధించిన నియమాలు​ – మీకోసం సరళంగా

పాలసీ ప్రకారం..

మీరు పోర్ట్​ చేయాలని భావించినపుడు కేవలం ఒకేలాంటి పాలసీని మాత్రమే పోర్ట్​ చేయగలుగుతారు. దీని ప్రకారం మీరు కవరేజ్​ మొత్తాన్ని మార్చుకోలేరు. మీ పాలసీ టైప్​, ప్లాన్​ మార్చుకునేందుకు వీలుపడదు.

ఇన్సూరెన్స్ కంపెనీపై ఆధారపడి..

ఇన్సూరెన్స్​ కంపెనీలు ఎక్కువగా జనరల్ ఇన్సూరెన్స్​ కంపెనీలు అయి ఉంటాయి. కాబట్టి మీరు మీ పాలసీని పోర్ట్​ చేసేటపుడు ఈ విషయాన్ని చూసుకోవాలి. మీరు మీ పాత కంపెనీ ప్రకారమే పోర్ట్​ కావాల్సి ఉంటుంది. డిజిట్ కూడా ఒక జనరల్​ ఇన్సూరెన్స్​ కంపెనీ.

సమయం తేడా రాకుండా..

మీరు మీ హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీని పోర్ట్​ చేయాలని భావించినపుడు పాలసీ రెన్యూవల్​ సమయంలోనే పోర్ట్​ చేసేందుకు ఆస్కారం ఉంటుంది. మీరు మీ పాలసీ పీరియడ్​ను కోల్పోయినట్లయితే మీ పోర్టింగ్​ రిక్వెస్ట్ రిజెక్ట్​ చేసే అవకాశాలు ఉంటాయి.

మీ పాత ఇన్సూరెన్స్​ కంపెనీకి సమాచారం ఇవ్వాలి..

మీరు మీ హెల్త్​ పాలసీని కొత్త ఇన్సూరెన్స్​ కంపెనీకి పోర్ట్​ చేస్తున్నపుడు పాత కంపెనీకి సమాచారం ఇవ్వడం చాలా ముఖ్యం. మీ పాలసీ రెన్యూవల్​ తేదీకి మరో 45 రోజుల సమయం ఉందనగా ఈ విషయాన్ని ఆ కంపెనీకి తెలియజేయండి.

అది కంపెనీ బాధ్యతే..

మీరు హెల్త్​ ఇన్సూరెన్స్​ను పోర్ట్ చేస్తున్నట్లు సదరు కంపెనీకి తెలియజేసిన తర్వాత మూడు రోజులలో వారు మీ అభ్యర్థనను అంగీకరిస్తారు.

పోర్టింగ్​ ఫీజులు..

IRDA ఆదేశాల ప్రకారం హెల్త్ ఇన్సూరెన్స్​ పాలసీని పోర్ట్​ చేసేందుకు ఎటువంటి ఫీజులు ఉండవు. (మీ పాత ఇన్సూరెన్స్​ కంపెనీ కానీ, మీరు పోర్ట్​ కావాలని చూస్తున్న కొత్త కంపెనీ కానీ మీ నుంచి ఎటువంటి ఫీజులు వసూలు చేయవు) ఈ సర్వీసు మీకు ఉచితంగా లభిస్తుంది.

ప్రీమియంలలో మార్పులు చేసినట్లయితే..

ఇన్సూరెన్స్​ ప్రీమియం అనేది ఇన్సూరెన్స్​ కంపెనీ మీద ఆధారపడి ఉంటుంది. ఇన్సూరెన్స్​ కంపెనీ అనేక అంశాలను బేరీజు వేసుకొని బెనిఫిట్లను నిర్ణయిస్తుంది. మీరు మీ హెల్త్​ పాలసీని పోర్ట్​ చేసినపుడు మీ పాత కంపెనీ వలె కొత్త కంపెనీలో కూడా ప్రీమియం రేట్లు ఉండాలని రూల్​ ఏమి ఉండదు. మీరు సేమ్​ పాలసీని తీసుకున్నా కూడా ప్రీమియం రేట్లలో తేడా ఉండవచ్చు.

గ్రేస్​ పీరియడ్స్​..

మీ హెల్త్​ ఇన్సూరెన్స్​ పోర్టబులిటీ ప్రాసెస్​లో ఉన్నపుడు మీకు అదనపు గ్రేస్ పీరియడ్​ అందించబడుతుంది. మీ పాత పాలసీ యాక్టివ్​ లో ఉన్న దాని ప్రకారం మీ ప్రీమియం రేటు నిర్ణయించబడుతుంది.

మీ ఇన్సూరెన్స్​ మొత్తాన్ని పెంచుకోవాలంటే...

మీరు పోర్ట్​ అయినపుడు మీ హెల్త్​ ఇన్సూరెన్స్​ మొత్తాన్ని పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఈ రిక్వెస్ట్​ను కొత్త హెల్త్​ ఇన్సూరెన్స్​ కంపెనీ ఆమోదించాల్సి ఉంటుంది.

వెయిటింగ్​ పీరియడ్స్​..

మీరు మీ హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీని పోర్ట్​ చేసినపుడు మీ వెయిటింగ్​ పీరియడ్​ ప్రభావితం కాదు. మీరు ఒక వేళ కొత్త కవరేజీని ఎంచుకుని ఆ కవరేజీలో వెయిటింగ్​ పీరియడ్​ అనేది ముందటి ప్లాన్​ కంటే వేరుగా ఉన్నపుడు మాత్రమే మీ వెయిటింగ్ పీరియడ్​ మారుతుంది. ఉదాహరణకు స్పెసిఫిక్​ ఇల్​నెస్​ లేదా ప్రీ ఎగ్జిస్టింగ్​ వ్యాధులకు మీకు ఉన్న వెయిటింగ్​ పీరియడ్​ మారదు. చాలామటుకు హెల్త్​ ఇన్సూరెన్స్​ ప్లాన్లలో ఇది ఒకే రకంగా ఉంటుంది. కానీ మీరు కొత్త కంపెనీలో మెటర్నిటీ కవర్​ ఎంచుకుంటే మీరు మీ వెయిటింగ్​ పీరియడ్​ పూర్తి​ చేయాల్సి ఉంటుంది.

మీ హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీని ఎప్పుడు పోర్ట్ చేసుకోవాలంటే?

ప్రస్తుతం ఉన్న హెల్త్​ ఇన్సూరెన్స్​ కంపెనీతో మీరు సంతోషంగా లేనపుడు

మీ ప్రస్తుత ఇన్సూరెన్స్ కంపెనీ తీరుతో మీరు సంతోషంగా ఉండకపోవచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీ అందించే సర్వీసులు, మీరు చెల్లించే ప్రీమియం చార్జీలు మీకు అంతగా నచ్చకపోవచ్చు. అటువంటి సమయంలో మీకు నచ్చిన పాలసీకి మీరు పోర్ట్​ కావచ్చు.

మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్​ చేయాలని భావించినపుడు, పాలసీ రెన్యూవల్​ టైమ్​కు 45 రోజుల ముందుగానే మీరు మీకు నచ్చే ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకోవాలి. అనంతరం మీ హెల్త్​ పాలసీ పోర్టింగ్​ రిక్వెస్ట్​ ప్లేస్​ చేయాలి.

ప్రస్తుతం ఉన్న వాటి కంటే మంచి ప్లాన్స్​ బయట లభించినపుడు

మీ ప్రస్తుత హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ బాగానే ఉన్నపటికీ, బయట మీకు ఎక్కువ బెనిఫిట్లు లభించినపుడు మీ హెల్త్​ ఇన్సూరెన్స్​ను పోర్ట్​ చేసుకోవడం ఉత్తమం.

ఉదాహరణకు: మీరు మీ తల్లిదండ్రుల కోసం AYUSH బెనిఫిట్​, మెటర్నిటీ కవర్​ కోసం చూస్తున్నపుడు మీ ప్రస్తుత పాలసీ వాటిని కవర్​ చేయకుంటే బయట లభించే పాలసీలకు మీరు పోర్ట్​ కావచ్చు.

ఇటువంటి సందర్భంలో మీరు కనీసం మూడు ఇన్సూరెన్స్ కంపెనీల పాలసీలనైనా చెక్​ చేయాలి. అనంతరం మీ పాలసీని పోర్ట్​ చేసుకోవాలి.

మీ ప్రస్తుత పాలసీ గడువు ముగిసేందుకు 45 రోజుల ముందు మీరు పోర్టబులిటీ ప్రక్రియను ప్రారంభించడండి. ఇలా చేయడం వలన గడువు ముగియక ముందే మీ పాలసీ పోర్టింగ్​ పూర్తవుతుంది.

మీ హెల్త్​ ఇన్సూరెన్స్​ను డిజిటల్​లోకి మార్చుకుందామని భావించినపుడు...

మీకు అనేక సంవత్సరాలుగా హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ ఉన్నట్లయితే ఆ కంపెనీ మీకు డిజిటల్​ సౌకర్యం కల్పించకపోవచ్చు. పాలసీ ప్రక్రియ కాంటాక్ట్​ లెస్​గా ఉండకపోవచ్చు. పాలసీ రెన్యూవల్​ చేయాలన్నా మరేం చేయాలన్నా ఎక్కువ సమయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.

ఇటువంటి సందర్భంలో మీ హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీని పోర్ట్​ చేసుకోవడం ఉత్తమం. ఇలా చేయడం వలన మీరు భవిష్యత్​లో ఎటువంటి సమస్యలనూ ఎదుర్కోరు.

మీ హెల్త్​ ఇన్సూరెన్స్​ను పోర్ట్ చేసే ముందు ఈ 3 విషయాలను గుర్తుంచుకోండి

1. ప్రస్తుత పాలసీ గడువు ముగిసే తేదీ గురించి తెలుసుకోండి

ప్రతి విషయానికి సమయం​ అనేది చాలా ముఖ్యం. హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీని పోర్ట్​ చేయాలని మనం చూసినపుడు సమయం చాలా కీలకమవుతుంది. మనం పాలసీని పోర్ట్​ చేసుకోవాలనుకున్నపుడు గుర్తుంచుకోవాల్సిన విషయాల్లో ముఖ్యమైనది మన పాలసీ రెన్యూవల్​ తేదీ ఎప్పుడనే విషయం.

మీ పాలసీ గడువు ముగియడానికి కనీసం 45 రోజుల ముందు మీరు పోర్టింగ్​ రిక్వెస్ట్​ను ప్లేస్​ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ పాలసీ గడువు ముగిసిపోతే మీరు పోర్ట్​ చేసుకోలేరు.

2. కొత్త ఇన్సూరెన్స్​ కంపెనీ ప్రొవైడర్​ తో నిజాయతీగా ఉండండి. పోర్ట్​ రిక్వెస్ట్ రిజెక్ట్​ కాకుండా చూసుకోండి.

మీ కొత్త హెల్త్​ ఇన్సూరెన్స్​ కంపెనీ ప్రొవైడర్​ తో నిజాయతీగా ఉండండి. మీ పోర్ట్​ రిక్వెస్ట్ రిజెక్ట్​ కాకుండా చూసుకోండి. వారితో కేవలం నిజాలు మాత్రమే చెప్పండి. క్లెయిమ్​ హిస్టరీ, మెడికల్​ హిస్టరీ, తదితర విషయాల్లో నిజాలను చెప్పాలి. లేకపోతే మీ పోర్ట్ రిక్వెస్ట్ రిజెక్ట్​ అయ్యే ప్రమాదం ఉంటుంది.

3. ఒకే​ ప్లాన్​ అయినా బెనిఫిట్స్ వేరుగా ఉండవచ్చు..

మీరు ఒకేరకమైన​ హెల్త్​ ఇన్సూరెన్స్​ ప్లాన్​ ను ఎంచుకున్నప్పటికీ కొత్త కంపెనీలో బెనిఫిట్స్ వేరేలా ఉండే అవకాశం ఉంటుంది. ఒక్కో కంపెనీ ఒక్కో రకమైన బెనిఫిట్స్ అందిస్తుంది.

ఉదాహరణకు రూమ్​ రెంట్​ చార్జీల విషయమే తీసుకుంటే ఒక్కో ఇన్సూరెన్స్​ పాలసీలో రూమ్​ రెంట్​ చార్జీలు ఒక్కో రకంగా ఉంటాయి (ఒక్కోసారి రూమ్ రెంట్ పరిమితి ఉండకపోవచ్చు no room rent capping). కాబట్టి మీరు పాలసీని పోర్ట్​ చేసేటపుడు ప్రతి విషయం గురించి, బెనిఫిట్స్​ గురించి వివరంగా చదవాలి.

హెల్త్​ ఇన్సూరెన్స్​ పోర్టింగ్​ వల్ల లాభాలు, ప్రతికూలతలు ఏంటి?

లాభాలు ప్రతికూలతలు
మీ బెనిఫిట్లను అలాగే ఆనందించండి. మీరు మీ పాలసీని పోర్ట్ చేయడం వలన ఎటువంటి బెనిఫిట్లను కోల్పోరు. పోర్టింగ్​ చేయడం వలన మీ వెయిటింగ్​ పీరియడ్​ ప్రభావితం కాదు. రెన్యూవల్​ సమయంలోనే పోర్ట్​ చేసుకునేందుకు వీలుంటుంది. పోర్టింగ్​ ఆప్షన్​ చాలా బాగున్నప్పటికీ కేవలం రెన్యూవల్​ సమయంలోనే మనం పోర్ట్​ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీరు మీ హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీని పోర్ట్​ చేయాలని భావిస్తే రెన్యూవల్​ సమయానికి ముందుగానే మీరు పోర్ట్​ కావాలనుకుంటున్న కంపెనీ గురించి ఎంక్వైరీ చేయండి. ఇలా చేయడం వలన మీకు ఎక్కువ సమయం ఉంటుంది.
మీ నో క్లెయిమ్​ బోనస్ (NCB) అలాగే ఉంటుంది. – పాలసీదారులెవరూ తమ నో క్లెయిమ్​ బోనస్​ ను వదులుకునేందుకు ఇష్టపడరు. పోర్టింగ్​ వలన కలిగే ప్రయోజనాల్లో ఇదొకటి. మీ నో క్లెయిమ్​ బోనస్​ అనేది కొత్త పాలసీకి జోడించబడుతుంది. మీ ఇన్సూరెన్స్​ పాలసీలో కొన్ని మార్పులు​ మాత్రమే ఉంటాయి. మీరు మీ హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీని బెటర్​ ప్లాన్​ కు పోర్ట్ చేసినప్పటికీ ఎక్కువగా మార్పులు​ చేయలేరు. ఇన్సూరెన్స్​ ప్రీమియం రేట్లు, నిబంధనలు కొత్త కంపెనీ ప్రకారం మారుతాయి.
ఇన్సూరెన్స్​ కంపెనీని మార్చుకోవడం వలన మీ వెయిటింగ్​ పీరియడ్​ ఏ మాత్రం ప్రభావితం కాదు. మీరు పోర్ట్ చేసిన తర్వాత కూడా బెనిఫిట్స్​ను ఎంజాయ్​ చేయొచ్చు. మీరు పాత ఇన్సూరెన్స్​ కంపెనీలో ఎంత సమయం ఉన్నారనే విషయం మీద వెయిటింగ్​ పీరియడ్​ ఆధారపడి ఉంటుంది. మీరు మీ పాలసీని పోర్ట్​ చేసినపుడు అధిక కవరేజీ కావాలంటే ఎక్కువ ప్రీమియం కట్టాల్సి రావొచ్చు. ఇది మీ మునుపటి ఇన్సూరెన్స్​ కంపెనీ కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఎంచుకున్న ప్లాన్​ను బట్టి ప్రీమియం ధరలు ఉంటాయి.

భారతదేశంలో హెల్త్​ ఇన్సూరెన్స్​ పోర్టబులిటీ గురించ తరచూ అడిగే ప్రశ్నలు

పాలసీ హోల్డర్​ పోర్టబులిటీ కోసం ఎప్పుడు అప్లై చేయాలి?

హెల్త్​ ఇన్సూరెన్స్​ రెన్యూవల్​కు 60 రోజుల ముందుగానే మీరు పోర్టబులిటీకి అప్లై చేసుకోవాలి.

నేను పాలసీని పోర్ట్​ చేసినపుడు నా వెయిటింగ్​ పీరియడ్​ ప్రభావితం అవుతుందా?

లేదు. ఆ బెనిఫిట్​ అలాగే కొత్త ఇన్సూరెన్స్​ కంపెనీకి బదిలీ అవుతుంది. మీ వెయిటింగ్​ పీరియడ్​ మారదు. ఉదాహరణకు.. మీ ఇల్​నెస్​ వెయిటింగ్​ పీరియడ్​ 4 సంవత్సరాలు అనుకుందాం. మీరు రెండో సంవత్సరంలో పాలసీని పోర్ట్​ చేస్తే మీరు ఇంకా రెండు సంవత్సరాలు మాత్రమే వేచి ఉండాల్సి వస్తుంది.

హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీని పోర్ట్​ చేసినపుడు నేను ఏమైనా నష్టపోవాల్సి వస్తుందా?

లేదు. అటువంటిదేం ఉండదు. మీరు పాలసీని ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి పోర్ట్​ చేసుకున్నపుడు ఏ విషయాల్లోనూ నష్టపోరు.

ఎప్పుడు నేను హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీని పోర్ట్​ చేసుకోవాలి?

మీకు ప్రస్తుతం ఉన్న పాలసీ కంటే బెటర్​ ఆప్షన్స్​ బయటి కంపెనీలో కనిపిస్తే మీరు మీ పాలసీని తదుపరి రెన్యువల్​ సమయంలో పోర్ట్ చేసుకోవచ్చు.

హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీని పోర్ట్​ చేసేటపుడు ఏ సమస్యలు ఎదురవుతాయి?

మీరు మీ పాలసీని పోర్ట్​ చేసేటపుడు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య పోర్టింగ్​ రిక్వెస్ట్​ రిజెక్షన్​. ప్రతి ఒక హెల్త్​ ఇన్సూరెన్స్​ కంపెనీ తమ వద్దకు వచ్చిన హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీలను రిజెక్ట్​ కానీ అప్రూవ్​ కానీ చేసేందుకు హక్కును కలిగి ఉంటుంది. వారు దీనిపై నిర్ణయం​ తీసుకునేటపుడు ప్రధానంగా తనిఖీ చేసే అంశాలు.. క్లెయిమ్​ హిస్టరీ, మెడికల్ డీటెయిల్స్​, పాలసీ హోల్డర్ల వయసు మొదలైనవి.

మీ పోర్టబులిటీ రిక్వెస్ట్​ ను ఇన్సూరెన్స్​ కంపెనీ రిజెక్ట్​ చేయొచ్చా?

అవును. ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ పోర్టబులిటీ రిక్వెస్ట్​ ను రిజెక్ట్​ చేసే హక్కును కలిగి ఉంటుంది. చాలా సందర్భాల్లో జెన్యూన్​ కస్టమర్ల పోర్టబులిటీ రిక్వెస్ట్​లు మాత్రమే ఆమోదించబడతాయి.

నేను ఎప్పుడైనా హెల్త్​ ఇన్సూరెన్స్​ పోర్ట్​ చేసుకోవచ్చా?

లేదు. అలా చేసేందుకు వీలుపడదు. మీ ప్రస్తుత​ పాలసీ రెన్యూవల్​ చేసే సమయం వచ్చినపుడు మాత్రమే హెల్త్​ ఇన్సూరెన్స్​ను పోర్ట్​ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మీ పాలసీ గడువు ముగియడానికి కనీసం 45 రోజులు ముందుగా మీరు పోర్టింగ్ కోసం దరఖాస్తు చేయాలి.   

నేను నా హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీని టర్మ్​ మధ్యలో పోర్ట్​ చేయొచ్చా?

లేదు. అలా చేసేందుకు వీలుపడదు. మీ పాలసీ రెన్యూవల్​కు వచ్చినపుడు మాత్రమే మీరు పోర్ట్​ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మీ పాలసీ గడువు ముగియడానికి కనీసం 45 రోజులు ముందుగా మీరు పోర్టింగ్ కోసం దరఖాస్తు చేయాలి.

నా హెల్త్​ ఇన్సూరెన్స్​ పోర్టబులిటీ రిక్వెస్ట్ రిజెక్ట్ అయినపుడు ఏం జరుగుతుంది? ఎందుకు?

మీ హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ పోర్టబులిటీ రిక్వెస్ట్​ రిజెక్ట్​ అయితే అందుకు గల కారణాలను మీరు ఇన్సూరెన్స్​ కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకోవచ్చు. వారు చెప్పిన విషయాలను ఒకసారి సరిచూసుకోండి. హెల్త్​ ఇన్సూరెన్స్​ పోర్టబులిటీ రిక్వెస్ట్​లు ఎక్కువగా రిజెక్ట్​ అయ్యేందుకు ప్రధాన కారణం అసంపూర్ణమైన వివరాలు. పాలసీదారుడి మెడికల్​ హిస్టరీ, క్లెయిమ్​ హిస్టరీ, ప్రస్తుత ఇన్సూరెన్స్​ కంపెనీ వివరాలు సరిగ్గా సమర్పించకపోతే పాలసీ పోర్టబులిటీ రిక్వెస్ట్ రిజెక్ట్​ అవుతుంది.

హెల్త్​ ఇన్సూరెన్స్​ను పోర్ట్​ చేసే సమయంలో పాలసీ హోల్డర్​ వయసు పరిగణించబడుతుందా?

అవును. వయసు​ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మీ వయసును బట్టే పాలసీ ప్రీమియం రేట్లు  నిర్ధారించబడతాయి.

పోర్టింగ్​ కు బదులుగా నేను రెండు వేర్వేరు హెల్త్​ ఇన్సూరెన్స్​ కంపెనీల నుంచి పాలసీలను పొందొచ్చా?

అవును. పొందొచ్చు. మీరు ఒకే విధమైన రెండు పాలసీలు తీసుకునే బదులు వేర్వేరుగా ఉన్న రెండు పాలసీలు తీసుకోవడం ఉత్తమం.

సాధారణంగా హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీని ఎందుకు పోర్ట్​ చేస్తారు?

చాలామంది ప్రస్తుతం ఉన్న ఇన్సూరెన్స్​ కంపెనీతో విసిగిపోయినపుడు తమ హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీని పోర్ట్​ చేసుకునేందుకు చూస్తారు. అంతేకాకుండా వారికి వేరే కంపెనీలో బెటర్​ ప్లాన్స్ కనిపించినా కానీ పోర్ట్​ చేసుకుంటారు.

పోర్టింగ్​కు బదులుగా నేను నా ప్రస్తుత పాలసీ ప్లాన్​ మార్చుకోవచ్చా?

అవును, మీరు మార్చుకోవచ్చు.