hamburger
phone icon

General Insurance

లైఫ్ ఇన్సూరెన్స్‌

క్లెయిమ్స్‌

రిసోర్సెస్‌

కార్ ఇన్సురంచె ఆన్లైన

usp icon

10000+

Cashless Garages

usp icon

5100 Crore+

Paid-in Claims

usp icon

1.5 Crore+

Policies Sold

false
Up to 90% Off with PAYD Add-On
This is a {{carWheelerCtrl.localStorageValues.product}} reg no, please enter a private car reg no.

I agree to the Terms & Conditions

Buy Online for Huge Savings

Digit Exclusive

Claim your Offer

Up to 90% Discount

Save big with Digit - Claim up to 90% discount on new car insurance premium.

I agree to the Terms & Conditions

true
car

Check Price

arrow
×
car

Car insurance Online, Up to 90% Discount

This is a {{carWheelerCtrl.localStorageValues.product}} reg no, please enter a private car reg no.
usp icon

10000+

Cashless Garages

usp icon

5100 Crore+

Paid-in Claims

usp icon

1.5 Crore+

Policies Sold

కార్ ఇన్సూరెన్స్‌లో ఐడివి గురించి తెలుసుకోండి

ఐడివి ఫుల్​ ఫామ్​ ఏమిటి?

ఇన్సూరెన్స్​లో అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉండే పదాలు ఉంటాయని మనకు తెలుసు. కానీ, వాటిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి ఒక ముఖ్యమైన పదమే . ఐడివి అనేది ‘ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ’ను  సూచిస్తుంది,

కార్ ఇన్సూరెన్స్‌లో ఐడివి అంటే ఏమిటి?

కార్ ఇన్సూరెన్స్‌లో ఐడివి ని అర్ధం చేసుకోవడం అంత కష్టమైన విషయమేమి కాదు కానీ, ఇది మీ కారు యొక్క మార్కెట్ విలువను సూచిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, ఇది మీ కారుకు ఈరోజు మార్కెట్​లో పొందగలిగే అమౌంట్​.

క్లెయిమ్ చెల్లింపుల సమయంలో మీ క్లెయిమ్ అమౌంట్​ను సరిగ్గా గుర్తించడంలో కార్​ ఇన్సూరెన్స్​లోని ఈ ఐడివి మీ ఇన్సూరెన్స్​ కంపెనీకి సహాయపడుతుంది. అదనంగా, ఇది మీ కార్​ ఇన్సూరెన్స్​ కోసం సరైన ప్రీమియం ధరను నిర్ణయించడంలో కూడా మాకు సహాయపడుతుంది.

ఐడివి ఎందుకు ముఖ్యం?

ఇన్సూర్డ్​ డిక్లేర్డ్​ వ్యాల్యూ అనేది మీ ప్రియమైన కార్​ ఇన్సూరెన్స్​ విషయంలో ఒక ముఖ్యమైన అంశం. మీ ఐడివి మీ వాహనం యొక్క ప్రీమియంను నిర్ణయిస్తుంది. ఐడివికి, మీ ప్రీమియంకు మధ్య డైరెక్ట్​ లింక్ ఉంది. 

ఐడివి ఎక్కువగా ఉంటే, చెల్లించాల్సిన ప్రీమియం కూడా ఎక్కువగా ఉంటుంది. అలా అని, మీ వాహనం ఐడివిని తక్కువ చేసి చెప్పకండి. ఎందుకంటే, మీ వాహనం డ్యామేజ్ అయినట్లయితే, మీకే నష్టం అవుతుంది.

ఐడివి క్యాలుక్యులేటర్- మీ కారు కోసం IDVని లెక్కించండి

ఐడివి క్యాలుక్యులేటర్ అనేది అత్యంత ముఖ్యమైన ఇన్సూరెన్స్​ క్యాలుక్యులేటర్ టూల్స్​లో ఒకటి, ఎందుకంటే ఇది మీ కార్​ మార్కెట్ విలువను మాత్రమే కాకుండా మీ కార్​ ఇన్సూరెన్స్​ కోసం మీరు చెల్లించాల్సిన ప్రీమియం యొక్క సరైన అమౌంట్​ను నిర్ణయించడంలో కూడా సహాయపడుతుంది.

క్లెయిమ్‌ల సమయంలో చెల్లించాల్సిన సరైన అమౌంట్​ను నిర్ణయించడం, మీ కారు దొంగిలించబడిన లేదా రిపేర్​ చేయలేనంతగా పాడైపోయిన సందర్భాల్లో ఇది మాకు (ఇన్సూరర్​) మరింత సహాయపడుతుంది.

కారు వయస్సు డిప్రిషియేషన్​ %
6 నెలలు, అంతకంటే తక్కువ 5%
6 నెలల నుంచి 1 సంవత్సరం 15%
1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు 20%
2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు 30%
3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు 40%
4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు 50%

ఉదాహరణకు: మీరు కారు​ తీసుకుని 6 నెలల అయ్యి, దాని ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర రూ. 100 అయినట్లయితే, డిప్రిషియేషన్​ రేటు 5% మాత్రమే.

అంటే దాని కొనుగోలు తర్వాత, మీ ఐడివి రూ. 95 కి పడిపోతుంది - 1 సంవత్సరం మించకుండా వాహనం వయస్సు 6 నెలల కంటే ఎక్కువ అయితే రూ. 85 కి పడిపోతుంది. వాహనం వయస్సు 2 సంవత్సరాలకు మించకుండా 1 సంవత్సరం కంటే ఎక్కువ అయితే రూ. 80 అవుతుంది. వాహనం వయస్సు 3 సంవత్సరాలకు మించకుండా 2 సంవత్సరాల కంటే ఎక్కువ అయితే రూ. 70 అవుతుంది. ఇంకా - దాని 5వ సంవత్సరంలో 50% తరుగుదల తర్వాత రూ. 50 వరకు ఉంటుంది.

ఒకవేళ మీ కారు 5 సంవత్సరాల కంటే పాతదైతే, దాని ఐడివి ఆ కారు మ్యానుఫ్యాక్చరర్​, మోడల్, దాని విడిభాగాల లభ్యత, దాని ప్రస్తుత కండిషన్​పై ఆధారపడి ఉంటుంది.

తిరిగి అమ్మే సమయంలో, మీ ఐడివి మీ కారు మార్కెట్ విలువను సూచిస్తుంది. అయితే, మీరు మీ కారును బాగా మెయింటేన్​ చేస్తూ, అది ఇంకా కొత్తదానిలా మెరుస్తూ ఉంటే, మీ ఐడివి మీకు అందించే దానికంటే ఎక్కువ ధరను మీరు ఆశించవచ్చు. చివరికి, మీరు మీ కారుపై ఎంత ప్రేమ చూపించారో ఈ విలువ తెలియజేస్తుంది.

మీ కారు ఐడివిని గుర్తించడంలో సహాయపడే కారకాలు ఏమిటి?

కారు వయస్సు: ఐడివి మీ కారు మార్కెట్ విలువను సూచిస్తుంది కాబట్టి, సరైన ఐడివిని గుర్తించడంలో మీ కారు వయస్సు చాలా ముఖ్యం. మీ కారు ఎంత పాతదైతే, దాని ఐడివి అంత తక్కువగా ఉంటుంది. 

మ్యానుఫ్యాక్చరర్​ మేక్​, వాహనం మోడల్: మీ కారు మేక్​, మోడల్ నేరుగా మీ ఐడివిపై ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు; Lamborghini Venen వంటి కారు మేక్​, మోడల్‌లో వ్యత్యాసం కారణంగా Aston Martin One కంటే ఎక్కువ ఐడివిని కలిగి ఉంటుంది.

సిటీ రిజిస్ట్రేషన్​ వివరాలు: మీ కారు రిజిస్ట్రేషన్ వివరాలు మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లో ఉంటాయి. అలాగే, మీ కారు రిజిస్టర్ చేయబడిన సిటీ, దాని ఇన్సూర్డ్​ డిక్లేర్డ్​ వ్యాల్యూపై ప్రభావం చూపుతుంది. మెట్రో సిటీలో ఉండే మీ కారు ఐడివి, టైర్-II సిటీలోని దాని ఐడివి కంటే తక్కువగా ఉండవచ్చు.

స్టాండర్డ్​ డిప్రియేషన్​ (ఇండియన్​ మోటార్ టారిఫ్ ప్రకారం): మీరు షోరూమ్ నుంచి బయటకు వెళ్లిన క్షణం నుంచి మీ కారు వ్యాల్యూలో తరుగుదల ప్రారంభమవుతుంది - ప్రతి సంవత్సరం దాని డిప్రియేషన్​ పర్సంటేజ్​ పెరుగుతుంది. ఇది కూడా అంతిమంగా మీ ఐడివిని ప్రభావితం చేస్తుంది. మీ కారు వయస్సుతో పాటు సంబంధిత డిప్రియేషన్​ రేట్లను అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడే పట్టిక ఇక్కడ ఉంది.

ఐడివి మీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

ఇన్సూర్డ్​ డిక్లేర్డ్​ వ్యాల్యూ, మీ కారు ఇన్సూరెన్స్​ ప్రీమియం కలిసి మెలిసి ఉంటాయి. అంటే, మీ ఐడివి ఎంత ఎక్కువగా ఉంటే, మీ కారు ఇన్సూరెన్స్​ ప్రీమియం అంత ఎక్కువగా ఉంటుంది - అలాగే, మీ వాహనం వయస్సు, ఐడివి తగ్గుతున్న కొద్దీ, మీ ప్రీమియం కూడా తగ్గుతుంది.

అలాగే, మీరు మీ కారును అమ్మాలని నిర్ణయించుకున్నప్పుడు, ఎక్కువ ఐడివి ఉంటే దానికి మీరు ఎక్కువ ధరను పొందుతారు. కారును ఉపయోగించిన విధానం, కారుకు సంబంధించిన గతంలోని ఇన్సూరెన్స్​ క్లెయిమ్‌ల ఎక్స్​పీరియెన్స్​ మొదలైన ఇతర అంశాల వల్ల కూడా ధర ప్రభావితం కావచ్చు.

కాబట్టి, మీరు మీ కారు కోసం సరైన కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకుంటున్నప్పుడు, ప్రీమియంను మాత్రమే కాకుండా అందించబడుతున్న ఐడివి ని కూడా సరి చూసుకోండి.

తక్కువ ప్రీమియం అందించే కంపెనీ మిమ్మల్ని ఆకర్షించవచ్చు. కానీ దానికి కారణం ఆ ఆఫర్‌లో ఐడివి తక్కువగా ఉండటమే. ఐడివి ఎక్కువగా ఉంటే మీ కారును మొత్తంగా నష్టపోయిన సందర్భంలో అధిక కంపెన్సేషన్​ పొందవచ్చు.

ఐడివి ని తగ్గించడం/పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు?

ఎక్కువ ఐడివి: ఎక్కువ ఐడివి అంటే ఎక్కువ ప్రీమియం. అయితే, మీరు ఇన్సూర్​ చేసుకున్న కారును పోగొట్టుకున్నప్పుడు లేదా కారు దొంగిలించబడినప్పుడు మీరు పరిహారం కూడా ఎక్కువగానే పొందుతారు.

తక్కువ ఐడివి: తక్కువ ఐడివి అంటే తక్కువ ప్రీమియం. అయితే, ప్రీమియంపై మీరు చేసే ఈ కొద్దిపాటి సేవింగ్​, మీరు ఇన్సూర్​ చేసుకున్న కారును పోగొట్టుకున్నప్పుడో లేదా కారు దొంగిలించబడినప్పుడో మీకు పెద్ద నష్టంగా మారవచ్చు.

కార్ ఇన్సూరెన్స్‌లో ఐడివి యొక్క ప్రాముఖ్యత

  • మీ ఐడివి అనేది మీ కారు మార్కెట్ విలువ. కాబట్టి ఇది మీ కారు ఇన్సూరెన్స్​ ప్రీమియంపై నేరుగా ప్రభావం చూపుతుంది.

  • మీ కారు ఐడివి దాని ప్రమాద స్థాయిని కూడా నిర్ణయిస్తుంది. మీ కారు ఐడివి ఎంత ఎక్కువగా ఉంటే, దాని రిస్క్ అంత ఎక్కువ. అందుకే దీనికి అధిక ప్రీమియం డిమాండ్ ఉంటుంది.

  • క్లెయిమ్‌ల సమయంలో, మీ కారు విలువ ఆధారంగా పరిహారాలు చెల్లించబడతాయి. రిపేర్​ లేదా రీప్లేస్​మెంట్​ ఖర్చులు కూడా దీని ఆధారంగానే ఉంటాయి. అందువల్ల, అవసరమైన సమయాల్లో, మీరు నష్టపోయిన దానికి, మీరు చేసిన క్లెయిమ్​కు సరైన మొత్తంలో పరిహారం పొందుతారు కాబట్టి ఇది మీ కార్​ ఇన్సూరెన్స్​లో అత్యంత కీలకమైన అంశాలలో ఒకటి.

  • మీ కారు దొంగిలించబడినా లేదా రిపేర్​ చేయలేనంతగా పాడైపోయినా, మీ నష్టానికి సంబంధించి మీరు పొందే పరిహారం ఖచ్చితంగా మీ ఐడివి మొత్తంగా ఉంటుంది. కాబట్టి, మీ కారు అసలైన విలువ ప్రకారం మీ ఐడివి సరైనదని ఎల్లప్పుడూ నిర్ధారించుకోండి.

నాకు ఐదు సంవత్సరాల వయస్సు అనుకుని వివరించండి

మేము ఇన్సూరెన్స్​ను సులభతరం చేస్తున్నాము. ఎంతలా అంటే, ఇప్పుడు 5 ఏళ్ల పిల్లలు కూడా దానిని అర్థం చేసుకునేలా.

మీకో ఖరీదైన వాచ్ ఉంది. ఒక రోజు, మీరు దానిని అమ్మితే మీకు ఎంత లభిస్తుందో తెలుసుకోవాలని అనుకున్నారు. మీరు దానిని వాచ్‌మేకర్ దగ్గరకు తీసుకెళ్లారు. వాచ్‌మేకర్ మీ గడియారాన్ని చూసి, వాచ్ ఎంత పాతది అని అడిగాడు, మీరు దాని వయస్సు 5 సంవత్సరాలు అని చెప్పండి. అప్పుడు అతను అది గాజు, లోహం, తోలు, ఏ స్క్రూలతో తయారు చేశారు, దాని వయస్సు ఎంత అనేది రాసుకొని, మొదట వాచ్​లో ఉపయోగించిన మెటీరియల్ ధరను జోడించి వీటన్నింటి ఆధారంగా, మీరు మీ గడియారాన్ని అమ్మితే, మీకు రూ. 500 లభిస్తాయని అతను మీకు చెప్తాడు. ఈ సందర్భంలో, మీ ఐడివి రూ. 500!

కార్ ఇన్సూరెన్స్‌లో ఐడివి గురించి తరచూ అడిగే ప్రశ్నలు

✓ ఒక కొత్త కారు యొక్క ఐడివి అంటే ఏమిటి?

మీ కొత్త కారు యొక్క ఐడివి దాని ఇన్‌వాయిస్ విలువగా ఉంటుంది. మీరు ఇప్పటికే కారును ఉపయోగించడం ప్రారంభించినట్లయితే దాని డిప్రియేషన్​తో కలిపి ఉంటుంది.

 

✓ షోరూమ్ వెలుపల ఉన్న కారు ఐడివి ఎంత ఉంటుంది?

మీరు ఇప్పటికే మీ కారును ఉపయోగించడం ప్రారంభించి ఉంటే, దానిని షోరూమ్ నుంచి బయటకు తీసుకొచ్చాక, మీ కారు యొక్క ఐడివి మీ కారు ఇన్‌వాయిస్ విలువ నుంచి దానిపై వర్తించే కనీస తరుగుదల మైనస్ అవుతుంది.

 

✓ 5 సంవత్సరాల కంటే పాత కార్లకు ఐడివి ఎంత ఉంటుంది?

ఇండియన్ మోటార్ టారిఫ్ యొక్క స్టాండర్డ్​ డిప్రియేషన్​ రేట్ల ప్రకారం, 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్న కారు దాని సరైన ఐడివిని నిర్ణయించడానికి కనీసం 50% తరుగుదలను కలిగి ఉంటుంది.

 

✓ అధిక ఐడివి కలిగి ఉండటం మంచి ఆలోచనేనా?

వాస్తవానికి, ఇది మీ వద్ద ఉన్న కారు రకం, దాని కండిషన్​పై ఆధారపడి ఉంటుంది. అధిక ఐడివి అనేది అంత పాతవి కాని, మంచి కండిషన్​లో ఉన్న కార్లకు అనుకూలంగా ఉంటుంది. మరో విషయం గుర్తుంచుకోండి, ఐడివి ఎక్కువగా ఉంటే, మీరు ఏటా చెల్లించే ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుంది.

 

✓ ఒకవేళ తక్కువ ఐడివిని ప్రకటిస్తే ఏమి జరుగుతుంది?

కొన్నిసార్లు, తక్కువ ఐడివిని ప్రకటించడం ద్వారా ప్రజలు తక్కువ ప్రీమియంలకు ఆకర్షితులవుతారు. అయితే, మీ ప్రీమియం చౌకగా ఉన్నప్పటికీ, క్లెయిమ్‌ల సమయంలో మీకు లభించే పరిహారాలు కూడా తక్కువగానే ఉంటాయని, అది మీ కారుకు సరిపోకపోవచ్చని గుర్తుంచుకోవాలి. కాబట్టి, మా సలహా ఏంటంటే, ఎక్కువ లేదా తక్కువ ఐడివి కోసం కాకుండా మీ కారుకు సరైన ఐడివి పొందండి.