ఆన్​లైన్​లో కార్​ ఇన్సూరెన్స్ రెన్యువల్

మీ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీని 2 నిమిషాల్లో రెన్యూ చేయండి

Third-party premium has changed from 1st June. Renew now

ఆన్​లైన్​ కార్​ ఇన్సూరెన్స్​ రెన్యువల్‌ గురించి క్లుప్తంగా

కార్​ ఇన్సూరెన్స్​ను రెన్యువల్‌ చేసుకోవాల్సిన సమయం వచ్చినపుడు మీరు పాత ఇన్సూరెన్స్​ కంపెనీలో పాలసీని ఉంచాలా? లేదా కొత్త ఇన్సూరెన్స్​ కంపెనీకి మారాలా? అనే విషయంలో తర్జనభర్జన పడతారు. ఈ నిర్ణయం తీసుకోవడం కొంత ప్రయాసతో కూడుకున్నదే. అందుకే మీరు నిర్ణయం తీసుకోవడాన్ని మేము చాలా సులభం చేస్తాం.

ముందు మీరు అసలు కార్​ ఇన్సూరెన్స్​ రెన్యువల్‌ అంటే ఏమిటో తెలుసుకోండి.

అసలు కార్​ ఇన్సూరెన్స్​ రెన్యువల్‌ అంటే ఏమిటి?

కార్‌ ఇన్సూరెన్స్‌ రెన్యువల్‌ అంటే ఇన్సూరెన్స్‌ కంపెనీ మీ ప్రీమియం రేటును మార్చకుండా మీ ఇన్సూరెన్స్‌ పాలసీని కొనసాగించే సమయం. కార్​ ఇన్సూరెన్స్‌ను తప్పకుండా రెన్యువల్‌ చేయించుకోవాలి. దీనికి ఎటువంటి అదనపు ఖర్చులు ఉండవు. మీరు ఏవైనా మార్పులు చేసే వరకూ మీ ఇన్సూరెన్స్​ పాలసీ రేటు మారదు. మీకు పాత ఇన్సూరెన్స్​ కంపెనీ నచ్చకపోతే మీ పాలసీ రెన్యూ చేసే సమయంలో మీరు కొన్ని విషయాలను ఆలోచించాలి. అవేంటంటే..

నేను పాత ఇన్సూరెన్స్‌ కంపెనీతో వెళ్లినప్పుడు, లేదా కొత్త ఇన్సూరెన్స్​ కంపెనీతో వెళ్లినప్పుడు ఎటువంటి అవకాశాలు ఉంటాయి?

మీకు ఇక్కడ రెండు రకాల ఆప్షన్స్​ ఉంటాయి. మీరు మీ పాత ఇన్సూరెన్స్​ కంపెనీ, వారు అందించే కస్టమర్​ సపోర్ట్​, క్లెయిమ్​ ప్రక్రియ​తో సంతోషంగా ఉంటే పాత ఇన్సూరెన్స్​ కంపెనీనే ఎంచుకోవచ్చు. లేదా మీకు నచ్చకపోతే కొత్త ఇన్సూరెన్స్​ కంపెనీకి మారిపోవచ్చు. ఏదనేది మీ అవసరాలు, పాత కంపెనీతో మీకున్న అనుభవం మీద ఆధారపడి ఉంటుంది.

కారు ఇన్సూరెన్స్​ పాలసీని రెన్యూ చేసేముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు

కార్​ ఇన్సూరెన్స్​ రెన్యువల్‌ చేసుకునే ముందు అనేక అంశాలను పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ప్రతి సంవత్సరం రెన్యూ చేయిస్తే ఏ ఏ అంశాలను  గమనించాలో కింద నిశితంగా పేర్కొన్నాం. ఓ సారి లుక్కేయండి.

  • పాలసీ రకం – మీరు పాలసీ తీసుకునే ముందు అది ఏ రకమైన పాలసీ అనేది తెలుసుకోండి. ఇది చాలా ముఖ్యం. ఆ పాలసీ రకం తెలిసిన తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోండి. మీకు అంతకు ముందు కేవలం థర్డ్​ పార్టీ కార్​ ఇన్సూరెన్స్​ మాత్రమే ఉండి ఉంటే, రెన్యువల్​ సమయంలో మీరు కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ను కూడా ఎంచుకోవచ్చు.
  • మీ ఇన్సూరెన్స్‌ కంపెనీని రివ్యూ చేయండి – మీరు ఇన్సూరెన్స్​ తీసుకొనే కంపెనీనీ ఒకసారి తనిఖీ చేయండి. దీని వలన భవిష్యత్​లో మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
  • యాడ్​-ఆన్స్​ – మీ పాలసీకి సరిపోయే, మీకు ఎక్కువ ప్రయోజనాలు అందజేసే సరైన యాడ్​-ఆన్​ను ఎంచుకోండి. యాడ్​-ఆన్​ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. జీరో డిప్రిషియేషన్‌ కవర్​, NCB కవర్​, ఇన్‌వాయిస్‌ ప్రొటెక్షన్‌ కవర్‌ , ఇంజన్‌ సంరక్షణ కవర్‌ వాటిలో కొన్ని. కార్​ ఇన్సూరెన్స్​ యాడ్​-ఆన్​ల గురించి మరింత తెలుసుకోండి. సరైన యాడ్​-ఆన్​ను ఎంచుకోండి.
  • క్లెయిమ్​ చేసే విధానం – ఇది చాలా ముఖ్యం. క్లెయిమ్​ చేసే విధానం అనేది అతివేగంగా ఉండాలి. చాలా సులభంగా ఉండాలి. ఇన్సూరెన్స్‌ తీసుకున్న కంపెనీ క్లెయిమ్​ చరిత్ర ఎలా ఉందనేది వివిధ మార్గాల ద్వారా తనిఖీ చేయాలి.
  • ఆన్​లైన్​లో ధరలను పోల్చి చూడండి  – ధరలను పోల్చి చూడటం కోసం ఆన్​లైన్​ విధానాన్ని ఎంచుకోండి. మీరు పాలసీని కూడా ఆన్​లైన్​లోనే రెన్యూ చేసుకోవచ్చు. డిజిట్​ ఇన్సూరెన్స్​లో గొప్ప విషయం ఏంటంటే మీరు కొత్త పాలసీ తీసుకున్నా లేక పాలసీని రెన్యూ చేసుకోవాలనుకున్నా ఆన్​లైన్​లోనే పూర్తవుతుంది. ఎటువంటి పేపర్​వర్క్​ అవసరం ఉండదు. ఆన్​లైన్​లో కేవలం మీ వివరాలు నమోదు చేస్తే సరిపోతుంది.
  • సరైన ఐడీవీ  – సరైన ఐడీవీని ఎంచుకోవడం అనేది కార్​ ఇన్సూరెన్స్​ పాలసీని తీసుకోవడంలో కానీ, రెన్యూ చేసుకోవడంలో కానీ చాలా ముఖ్యం. ఇది చాలా కీలక పాత్రను పోషిస్తుంది. అనుకోని సందర్భాల్లో మీ వాహనానికి ఏదైనా డ్యామేజ్​ జరిగినపుడు మీకు ఎక్కువ ఐడీవీ (IDV) ఉంటే ఎక్కువ మొత్తం పరిహారం అందుతుంది.
  • మీ కారు ఇన్సూరెన్స్​ లాప్స్​ కాకుండా చూసుకోండి – ఎల్లప్పుడూ మీ కారు ఇన్సూరెన్స్​ను సమయం కంటే ముందుగానే రెన్యూ చేయించుకోవడం చాలా ముఖ్యం. లేదంటే మీకు భారీ జరిమానాలు పడతాయి. అంతే కాకుండా ఇన్సూరెన్స్​ లేకుండా కారును బయటికి తీసినపుడు ఏదైనా అనుకోని ప్రమాదం కనుక జరిగితే మీకు ఇన్సూరెన్స్​ కంపెనీ నుంచి ఎటువంటి నష్టపరిహారం అందదు. కావున మీ కార్​ ఇన్సూరెన్స్​ను సమయం కంటే ముందుగానే రెన్యూ చేయించుకోవడం ఉత్తమం.
  • నో క్లెయిమ్​ బోనస్​ – మీరు కనుక సంవత్సరం మొత్తంలో ఎటువంటి క్లెయిమ్స్​ చేసుకోకుండా ఉంటే మీకు నో క్లెయిమ్​ బోనస్ డిస్కౌంట్​ అందుతుంది. ఈ డిస్కౌంట్​ను ఇన్సూరెన్స్​ కంపెనీయే మీకు అందిస్తుంది. ఈ డిస్కౌంట్​ అమౌంట్​ మొత్తం మీ తర్వాతి ప్రీమియం నుంచి కట్​ అవుతుంది. ఒకవేళ మీరు మీ ఇన్సూరెన్స్​ కంపెనీని మార్చుకున్నా కానీ ఈ నో క్లెయిమ్​ బోనస్​ అనేది కొత్త కంపెనీకి బదిలీ అవుతుంది.
  • గ్యారేజీల నెట్​వర్క్​  – మీరు పాలసీ రెన్యువల్‌ చేసుకునేటపుడు నెట్‌వర్క్​ గ్యారేజీలను తనిఖీ చేయాలి. మీ కారుకు ఏదైనా అనుకోని సందర్భంలో ప్రమాదం జరిగితే తప్పకుండా మీరు గ్యారేజికి తీసుకెళ్లాల్సి ఉంటుంది.
  • కస్టమర్​ సపోర్ట్​  - 24/7 కస్టమర్​ సపోర్ట్​ అనేది చాలా ముఖ్యం. మీ ఇన్సూరెన్స్​ కంపెనీ ఈ సౌలభ్యాన్ని అందిస్తుందా లేదా తెలుసుకోండి.

ఆన్‌లైన్‌లో కార్‌ ఇన్సూరెన్స్‌ రెన్యూ చేయడానికి ప్రధాన కారణాలు

  • నో పేపర్​ వర్క్​ – ఆన్​లైన్​ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. కేవలం మీ ప్రాథమిక వివరాలు, పాత ఇన్సూరెన్స్​ వివరాలు సమర్పిస్తే సరిపోతుంది. ఎటువంటి పేపర్​ వర్క్​ అవసరం ఉండదు.
  • ఇది సులభం, త్వరగా అయిపోతుంది  - ఇంటర్నెట్​ అనేది మనకు వరం లాంటిది. మీరు కనుక మీ పాలసీని రెన్యూ చేసుకోవాలని చూస్తే ఆన్​లైన్​ ఉత్తమ మార్గం. ఇందులో పాలసీ రెన్యూ అనేది నిమిషాల్లో పూర్తవుతుంది.
  • ప్రశాంతంగా కూర్చుని రేట్లు, యాడ్​-ఆన్​ కవర్లను పోల్చి చూడండి - ఆన్​లైన్​లో పోల్చి చూడటం అనేది చాలా సులువు. మీరు ప్రీమియం రేట్లు, యాడ్​-ఆన్స్​ను అనేక ఇన్సూరెన్స్​ కంపెనీలతో పోల్చి చూడొచ్చు. మీకు ఏది మేలనిపిస్తే ఆ పాలసీ తీసుకునేందుకు నిర్ణయం తీసుకోండి. ఇందులో ఎటువంటి బలవంతం లేదు.
  • సమయాన్ని ఆదా చేయండి​ – మీరు ఆన్​లైన్​లో కార్​ పాలసీని రెన్యూ చేసుకోవడం వలన మీ సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. మీరు ఇంటి వద్దే ఉండి ఈ పనిని పూర్తి చేసేందుకు ఆస్కారం ఉంటుంది. మీ వీలును బట్టి ఏ సమయంలోనైనా పాలసీని రెన్యూ చేయండి. ఈ ప్రక్రియ చాలా తక్కువ సమయాన్ని తీసుకుంటుంది.

కార్​ ఇన్సూరెన్స్​ను ఆన్​లైన్​లో ఎలా రెన్యూ చేయాలి?

కార్​ ఇన్సూరెన్స్​ను 4 సులభమైన స్టెప్పుల్లో రెన్యూ చేయండి

స్టెప్​ 1  – మీ వాహనం యొక్క మోడల్​, తయారీ దారు, వేరియంట్​, రిజిస్ట్రేషన్​ తేదీ, వాహనం నడిపే నగరం మొదలైన వివరాలను నమోదు చేసి గెట్​ కోట్​ బటన్​ మీద క్లిక్​ చేయాలి. అప్పుడు మీకు వివిధ రకాల ప్లాన్లు కనబడతాయి. వాటిల్లోనుంచి మీకు నచ్చిన ప్లాన్​ను ఎంచుకుంటే సరిపోతుంది.

స్టెప్​ 2  – థర్డ్​ పార్టీ లయబిలిటీ లేదా స్టాండర్డ్ ప్యాకేజ్​ దేనినైనా సరే మీరు ఎంచుకోవచ్చు.

స్టెప్​ 3 – మీ పాత పాలసీ వివరాలను సమర్పించండి. ఉదా. గడువు ముగిసిన తేదీ, మీరు క్లెయిమ్స్​ చేసిన వివరాలు, నో క్లెయిమ్​ బోనస్​ తదితరాలు.

స్టెప్​ 4 – మీకు ప్రీమియం అమౌంట్​ అనేది కనబడుతుంది. మీరు కనుక స్టాండర్డ్​ ప్లాన్​ను ఎంచుకుంటే తదుపరి యాడ్​-ఆన్స్​ను ఎంచుకోవాలి. మీ వాహన ఐడీవీ (IDV)ని సెట్​ చేసుకోవాలి. మీరు కనుక సీఎన్‌జీ (CNG) కార్​ను కలిగి ఉంటే మీ ప్రీమియం మొత్తం ఎంత అవుతుందో తదుపరి పేజీలో కనబడుతుంది.

ఆన్​లైన్​ కార్​ ఇన్సూరెన్స్​ రెన్యువల్‌కు ఏమేం అవసరం

  • పూర్తి పేరు
  • చిరునామా
  • కార్​ మేక్​, మోడల్​ వివరాలు
  • కార్​ రిజిస్ట్రేషన్​ నెంబర్​
  • పాత పాలసీ నెంబర్
  • యాడ్​-ఆన్స్​
  • పేమెంట్​ వివరాలు

డిజిట్​ కార్​ ఇన్సూరెన్స్​నే మీరు ఎందుకు ఎంచుకోవాలి?