ఆన్‌లైన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయండి

డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు మారండి

హెల్త్ ఇన్సూరెన్స్‌లో మీరు తెలుసుకోవాల్సిన యాడ్ ఆన్స్/రైడర్స్ గురించి..

మీరు ఒక స్టాండర్డ్​ హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీని కొనుగోలు చేశారనుకుందాం. ఈ ప్లాన్​ వలన మీరు అన్ని రకాల వ్యాధుల నుంచి రక్షించబడతారని అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే, కొన్ని అవసరాలను స్టాండర్డ్​ హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ కవర్​ చేయలేదు.

అవేంటి? మరెలా?

అటువంటి సమయంలోనే రైడర్స్​ కీలక పాత్ర పోషిస్తాయి.

మీరు ఇప్పటికే హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీని కలిగి ఉన్నట్లయితే మీరు తప్పకుండా రైడర్స్​ లేదా యాడ్​–ఆన్స్​ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఇవి మీకు ఏ విధంగా సాయపడతాయో తెలుసుకోండి.

హెల్త్​ ఇన్సూరెన్స్​ రైడర్​ లేదా యాడ్​-ఆన్​ అంటే ఏమిటి?

ఈ రైడర్స్​ వలన మీకు అదనపు ప్రయోజనాలు సమకూరుతాయి. హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీలోని ప్రస్తుత ఫీచర్లలాగే ఉంటాయి. ఇవి వేరుగా యాడ్​ అవుతాయి.

హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ యాడ్​-ఆన్స్​ లేదా రైడర్లు మీ ప్రస్తుత హెల్త్​ పాలసీకి అదనపు ప్రయోజనాలను సమకూర్చడానికి ఉపయోగపడతాయి.

Insurance Regulatory and Development Authority of India (IRDAI) ప్రకారం, అన్ని రైడర్స్​ లేదా యాడ్​–ఆన్స్​ ప్రీమియంలు అసలు పాలసీ ప్రీమియంలో 30 శాతానికి మించకూడదు. కాబట్టి హెల్త్​ పాలసీ తీసుకునేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

మీరు మీ ఫ్యామిలీ కోసం ఒక family floater health insurance పాలసీని తీసుకోవాలని నిర్ణయించుకున్నారని అనుకుందాం. ఆ పాలసీ సంవత్సరానికి రూ. 5000 ప్రీమియంతో ఉందని అనుకుంటే, మీరు తీసుకునే యాడ్​–ఆన్స్​ ఆ పాలసీ ప్రీమియంలో 30% మాత్రమే ఉండాలి. అప్పుడు మీ యాడ్​–ఆన్స్​ ఖరీదు రూ. 1500 లకు మించకూడదు. (5000 x 30%) ఈ విధంగా IRDAI నిబంధన విధించింది.

హెల్త్​ ఇన్సూరెన్స్​ యాడ్​-ఆన్స్​లోని వివిధ రకాలు​?

వివిధ రకాల యాడ్​ ఆన్స్​ గురించి కింద వివరంగా ఇవ్వబడింది.

హెల్త్​ ఇన్సూరెన్స్​ యాడ్​–ఆన్​ ఏమేమి కవర్​ చేస్తుంది?
రూమ్​ రెంట్​ మాఫీ ఈ హెల్త్​ ఇన్సూరెన్స్​ రైడర్​ వలన మీరు ఎప్పుడైనా ఆస్పత్రి పాలైనపుడు రూమ్​ రెంట్​ చార్జీల లిమిట్​ను పెంచుకునే అవకాశం ఉంటుంది. మీకు రూమ్​ రెంట్​ చార్జీలకు ఎటువంటి లిమిట్​ ఉండదు.
మెటర్నటీ కవర్​ ప్రెగ్నెన్సీ, పిల్లలు పుట్టినప్పుడు అయ్యే అన్ని ఖర్చులను ఈ రైడర్​ కవర్​ చేస్తుంది.
హాస్పిటల్​ క్యాష్​ కవర్​ హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ హోల్డర్​ ఆస్పత్రి పాలైనప్పుడు రోజూవారీగా చార్జీలను చెల్లించే పాలసీ ఇది.
క్రిటికల్​ ఇల్​నెస్​ కవర్​ ఎవరైనా పాలసీహోల్డర్​ క్యాన్సర్​, గుండె జబ్బుల సమస్యలతో అధిక ఖర్చులకు గురైనపుడు ఈ యాడ్-ఆన్​ మిమ్మల్ని ఖర్చుల నుంచి కవర్​ చేస్తుంది.
పర్సనల్​ యాక్సిడెంట్​ కవర్​ ఈ యాడ్​-ఆన్​ మీకు అన్ని రకాల ప్రమాద గాయాలు, అనుకోకుండా సంభవించే అంగవైకల్యం వంటి వాటి నుంచి కాపాడుతుంది. పక్షవాతం లేదా మరణం సంభవించినా కూడా కవర్​ చేస్తుంది.
జోన్​ అప్​గ్రేడ్​ ఈ యాడ్​-ఆన్​ పాలసీ హోల్డర్​కు అదనపు ఆర్థిక భరోసాను అందజేస్తుంది. అతడు/ఆమె ఏ జబ్బుకు చికిత్స తీసుకున్నారనే విషయం మీద మనకు అందే ఆర్థిక సాయం ఆధారపడి ఉంటుంది.
ఆయుష్​ ట్రీట్​మెంట్​ కవర్​ ఈ యాడ్​-ఆన్​ కవర్​ వలన పాలసీ హోల్డర్​ కేవలం ఆస్పత్రిలోనే కాకుండా వేరే విధానాల్లో కూడా చికిత్స తీసుకునే సౌలభ్యం ఉంటుంది. (ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి మొదలగునవి).

హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీల్లో యాడ్​-ఆన్స్​ రకాలు– వివరణ

1. రూమ్​ రెంట్​ వేవర్

స్టాండర్డ్​ హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీలో ఆసుపత్రి రూమ్​ రెంట్​ చార్జీలనేవి ముందే ఒక లిమిట్​ వరకు నిర్ణయించబడతాయి. కానీ రూమ్​ రెంట్​ వేవర్​ యాడ్​–ఆన్​తో రూమ్​ రెంట్​ చార్జీల లిమిట్​ పెంచబడుతుంది. అలాగే, తర్వాత ఎలాంటి లిమిట్స్​ ఉండవు.

ఒకవేళ మీరు మెట్రోపాలిటన్​ నగరాల్లోని ఆస్పత్రులలో చేరితే, ఈ రైడర్​ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మెట్రోపాలిటన్​ నగరాల్లోని ఆస్పత్రులలో గదుల అద్దెలు విపరీతంగా ఉంటాయి. కాబట్టి, ఈ రైడర్​ తీసుకోవడం చాలా అవసరం.

మీరు ప్రస్తుతం తీసుకున్న పాలసీలో రూమ్​ రెంట్​ చార్జీ ఒక రాత్రికి రూ. 1500 గా ఉందని అనుకోండి. కానీ, మీరు చేరాలని భావిస్తున్న ఆస్పత్రిలో రూమ్​ రెంట్​ చార్జీ అంతకంటే ఎక్కువగా ఉంది. అటువంటి సందర్భంలో మీకు ఈ రైడర్​ ఉంటే మీ రూమ్​ రెంట్​ చార్జీ రాత్రికి 4000 రూపాయల వరకు పెంచుకునేందుకు సహాయపడుతుంది.

2. మెటర్నటీ కవర్

మెటర్నిటీ కవర్​ (maternity cover) పాలసీని తీసుకోవడం వలన మీరు ప్రెగ్నెన్సీ, పిల్లలు పుట్టినప్పుడు అయ్యే ఖర్చుల నుంచి మినహాయింపు పొందొచ్చు. కొన్ని ఇన్సూరెన్స్​ కంపెనీలు బిడ్డ పుట్టినప్పటి నుంచి 3 నెలల వరకు ఈ కవరేజీని అందిస్తున్నాయి.

3. హాస్పిటల్​ క్యాష్​ కవర్

ఈ యాడ్​–ఆన్​ లేదా రైడర్​ వలన మీరు ఆస్పత్రిలో చేరిన తర్వాత రోజువారీ క్యాష్​ అలవెన్స్​ను పొందే అవకాశం ఉంటుంది. కానీ, ఇక్కడ ఇన్సూరెన్స్​ కంపెనీలు ఒక షరతును విధిస్తాయి. ఆస్పత్రిలో చేరి 24 గంటల కంటే ఎక్కువ సేపు అడ్మిట్​ అయి ఉంటేనే ఈ కవర్​ వర్తిస్తుంది. అప్పుడే మీకు వైద్య ఖర్చుల కోసం డబ్బు ఇస్తాయి.

ఇలా పరిహారం​గా వచ్చిన డబ్బులను మీరు ఆహారం లేదా ప్రయాణ ఖర్చులకు వాడుకోవచ్చు.

4. క్రిటికల్​ ఇల్​నెస్ కవర్​

ఈ యాడ్–ఆన్​ను​ ఎనేబుల్​ చేసుకుంటే ఏదైనా క్రిటికల్​ ఇల్​నెస్​ (తీవ్రమైన అనారోగ్యం) వచ్చిందని నిర్ధారణ అయినపుడు ఇన్సూరెన్స్​ కంపెనీలు ఏక మొత్తంలో ఇన్సూరెన్స్​ పాలసీ అమౌంట్​ మొత్తాన్ని అందజేస్తాయి.

ఉదాహరణకు, మీరు రూ. 5 లక్షల హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీని తీసుకున్నారని అనుకుందాం. అంతేకాకుండా, మీరు క్రిటికల్​ ఇల్​నెస్​ కవర్​ను కూడా తీసుకుంటే మీకు ఏదైనా తీవ్ర అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మీ పాలసీని క్లెయిమ్​ చేసుకుంటే మీకు ఏకమొత్తంలో క్రిటికల్​ ఇల్​నెస్​ కింద రూ. 15 లక్షలు వస్తాయి. మీ చికిత్స ఖర్చు మీకు వచ్చిన ఇన్సూరెన్స్​ మొత్తం కంటే తక్కువే అవుతుంది.

ఒకవేళ మీకు క్యాన్సర్​ సోకిందనుకోండి. అప్పుడు మీరు మీ ఇన్సూరెన్స్​ కంపెనీతో క్లెయిమ్​ చేస్తే అప్పటికే మీ చికిత్సకు రూ. 9.5 లక్షలు అయినప్పటికి కూడా ఆ కంపెనీ మీకు ఏకమొత్తంలో రూ. 15 లక్షలు చెల్లిస్తుంది.

5. పర్సనల్​ యాక్సిడెంట్​ కవర్​

యాక్సిడెంటల్​ డ్యామేజ్​ల వలన పాలసీ హోల్డర్​ ఇబ్బంది​ పడినపుడు ఈ యాడ్​–ఆన్​ ఫైనాన్షియల్​ కవరేజ్​ను అందిస్తుంది. ఒకవేళ పాలసీ హోల్డర్​కు పాక్షిక అంగవైకల్యం వచ్చినా, శాశ్వత అంగవైకల్యం వచ్చినా, లేదా పాలసీ హోల్డర్​ చనిపోయినా కూడా ఇది వర్తిస్తుంది.

పాలసీ హోల్డర్​ ఒక వేళ యాక్సిడెంట్​లో చనిపోతే అతని కుటుంబం ఈ యాడ్​–ఆన్​ ద్వారా ఏకమొత్తంలో అమౌంట్​ను అందుకుంటుంది.

6. జోన్​ అప్​గ్రేడ్​

జోన్​ అప్​గ్రేడ్​ వలన కొన్ని పట్టణాల్లో మీరు ఎక్కువ ఫైనాన్షియల్​ కవరేజీని పొందుతారు. ఆ పట్టణాల్లో ఉన్న మెడికల్​ ఖర్చులను బట్టి ఈ జోన్​ల నిర్ణయించబడుతాయి. ఒక ప్రాంతంలో ఎంత ఎక్కువ ఖర్చులు ఉంటే, ఆ ప్రాంతం అంత ఉన్నత జోన్​లో ఉంటుంది.

ఈ యాడ్–ఆన్​ వలన మీరు ఎక్కువ చికిత్స ఖర్చులను ఈజీగా లెక్కించవచ్చు. అంతేకాకుండా, ఈ యాడ్​–ఆన్​ వలన మీ మొత్తం ప్రీమియంలో 10 నుంచి 20 శాతం వరకు తగ్గింపును కూడా పొందుతారు.

భారతదేశంలోని వివిధ​ జోన్​లు​:

  • జోన్​ A - ఢిల్లీ/NCR, ముంబై (నవీ ముంబై, థానే, కల్యాణ్​)
  • జోన్​ B – హైదరాబాద్​, సికింద్రాబాద్​, బెంగుళూర్​, అహ్మదాబాద్​, కోల్​కతా, వడోదరా, చెన్నై, పుణే, సూరత్​
  • జోన్​ C – జోన్​ A, జోన్​ B లలో లేని అన్ని నగరాలు జోన్​ Cలో ఉంటాయి.

ప్రస్తుతం డిజిట్‌లో రెండు రకాల జోన్స్ ఉన్నాయి: జోన్ A (గ్రేటర్ హైదరాబాద్, ఢిల్లీ NCR, గ్రేటర్ ముంబై) మరియు జోన్ B (ఇతర అన్ని ప్రదేశాలు). మీరు కనుక జోన్ Bలో ఉంటే మీకు ప్రీమియం మీద అదనపు డిస్కౌంట్ అందుతుంది. కేవలం అది మాత్రమే కాదు. మా వద్ద ఎటువంటి జోన్ బేస్డ్ కో పేమెంట్స్ లేవు. 

7. ఆయుష్​ కవర్​

దీనిలో భాగంగా 60 సంవత్సరాల పైనున్న వ్యక్తులు ఆయుర్వేదం, యునాని, యోగా, సిద్ధ, హోమియోపతి వంటి ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులకు ఆర్థిక కవరేజీని పొందవచ్చు.

ఈ కవర్​ కేవలం 60 సంవత్సరాలకు పైబడిన సీనియర్​ సిటిజన్లకు మాత్రమే వర్తిస్తుంది.

నిరాకరణ: యాడ్ ఆన్స్ అనేవి వివిధ రకాల బీమా కంపెనీలలో వివిధ రకాలుగా ఉంటాయి. యాడ్ ఆన్స్ గురించి పూర్తి సమాచారం కొరకు.. మీ బీమా సంస్థను సంప్రదించండి.

కానీ, హెల్త్​ పాలసీని తీసుకున్నపుడు అన్ని యాడ్​–ఆన్​లను తప్పకుండా తీసుకోవాలా?

అటువంటిదేం లేదు!

కానీ, మీరు పాలసీని తీసుకున్నపుడు ప్రతీ రైడర్​ను యాడ్​ చేసుకుంటే మీ జేబు నుంచి ఎక్కువ డబ్బులు ఖర్చు కాకుండా ఈ యాడ్​–ఆన్స్​ మిమ్మల్ని కాపాడుతాయి.

మీరు పాలసీని తీసుకునే ముందు మీ ఫ్యామిలీకి ఎలాంటి యాడ్–ఆన్స్​ కావాలో వాటిరి మాత్రమే​ ఎంచుకోవాలి. యాడ్​–ఆన్స్​ ఎంచుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం అవసరం.

 

Important: కరోనా హెల్త్​ ఇన్సూరెన్స్​ బెనిఫిట్స్​ గురించి తెలుసుకోండి

హెల్త్​ ఇన్సూరెన్స్​ యాడ్​–ఆన్స్​ గురించిన FAQs

క్యాష్​లెస్ సెటిల్​మెంట్లకు యాడ్​-ఆన్స్​ అందుబాటులో ఉంటాయా?

అవును, ఉంటాయి. మీరు మీ ఇన్సూరెన్స్​ నెట్​వర్క్​ ఆస్పత్రుల్లో క్యాష్​లెస్​ పేమెంట్లు చేసినపుడు కూడా యాడ్​–ఆన్స్​ వర్తిస్తాయి.

జోన్​ అప్​గ్రేడ్​ కవర్​ కోసం నగరాలను ఎలా వర్గీకరించారు?

మీ నగరాల్లో చికిత్స ఖర్చులు ఎలా ఉన్నాయనే విషయాన్ని బట్టి ఇన్సూరెన్స్​ కంపెనీలు నగరాలనును డివైడ్​ చేస్తాయి.

హాస్పిటల్​ క్యాష్​ కవర్​ను నేను వేరే అవసరం కోసం వాడుకోవచ్చా?

వాడుకోవచ్చు. హాస్పిటల్​ క్యాష్​ కవర్​ కింద వచ్చిన డబ్బును మీరు ఏ అవసరం కోసమైనా వాడుకోవచ్చు.