హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రెన్యూవల్ సమయంలో ఏమైనా మార్పు ఉందా?

హెల్త్ ఇన్సూరెన్స్​ను రెన్యూవల్ చేసినపుడు ఏం జరుగుతుందో మరింత తెలుసుకోండి. డిజిట్​తో పాలసీని వెంటనే రెన్యూవల్ చేసుకోండి.

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రెన్యూవల్ సమయంలో ఎందుకు పెరుగుతుంది?

హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ సమయంలో ప్రీమియం పెరుగుతుందా? ఇలా ఎందుకు ధర పెరుగుతుందో మీకు అర్థం కావడం లేదా? ప్రతీ సంవత్సరం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు ఎందుకు పెరుగుతాయో తెలుసుకోండి. డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్​లో మీకు లభించే కొన్ని రెన్యూవల్ ప్రయోజనాలను గురించి తెలుసుకోండి.

మీ నెలవారీ జీతం నుంచి ఇంటి అద్దె, ఇంధన ధరలు, తిండి ఖర్చుల వరకు ఇలా ప్రతీ ఒక్కదాని ధరల పెరగడం అనేది మీ జీవితాన్ని, మీ ఖర్చులను ప్రభావితం చేస్తుంది. మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా.

చాలా విషయాల వలే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరల పెరుగుదలలో కూడా ద్రవ్యోల్బణం ప్రముఖ పాత్రను పోషిస్తుంది. ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ వైద్య రంగంలో ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) అనేది మిగతా అన్ని రంగాల్లో కంటే చాలా ఎక్కువగా ఉంటుంది.

కేవలం ద్రవ్యోల్బణం మాత్రమే కాకుండా మీ వయసు, కవరేజ్ ప్రయోజనాలు, మీరు చివరి సంవత్సరాల్లో చేసిన క్లెయిముల వంటి అనేక విషయాలు కూడా మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధర పెరగడానికి కారణం కావొచ్చు.

ఈ ప్రతీ కారణాన్ని లోతుగా పరిశీలిద్దాం. రెన్యూవల్ సమయంలో ప్రీమియం పెరగకుండా ఉండేందుకు ఏం చేయాలో కూడా చూద్దాం.

రెన్యూవల్ సమయంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెరగడానికి కారణాలు

#1 ఆరోగ్య సంరక్షణ ద్రవ్యోల్బణం (పెరిగిన మెడికల్ చార్జీలు)

ఎకనమిక్​ టైమ్స్ సర్వే నివేదిక ప్రకారం ఆరోగ్య రంగంలో ద్రవ్యోల్బణం 12 శాతం నుంచి 18 శాతానికి పెరిగింది. మందుల ఖర్చులు, హాస్పిటల్ అడ్మిషన్ ఖర్చులు, చికిత్సా ఖర్చులు, మెడికల్ అడ్వాన్స్​మెంట్స్ వంటి ఖర్చులు ఇందులో ఉన్నాయి.

ఈ పెరుగుతున్న ఖర్చుల కారణంగా మీ బీమా సంస్థ కూడా బీమా మొత్తం విలువను ప్రతీ ఏడాది పెంచాలి. మీరు క్లెయిమ్ చేసిన సమయంలో మీకు ఈ పెరిగిన ఖర్చులను అందించేందుకు పెంపు తప్పనిసరి.

మీరు మీ ఇన్సూరెన్స్ ప్లాన్​ను రెన్యూవల్​ చేస్తున్నప్పుడు ఈ పెరుగుదల అనేది మీకు వర్తిస్తుంది.

దాని కోసం మీరేం చేయాలి?

ఇక్కడ దుర్వార్త ఏంటంటే.. ఇది నేరుగా వైద్య ఖర్చులతో సంబంధం కలిగి ఉంటుంది. కావున మీ సమ్ ఇన్సూర్డ్ (బీమా మొత్తం) విలువను తప్పనిసరిగా పెంచాలి. కాబట్టి మీరు ఈ విషయంలో ఏమీ చేయలేరు.

ఇక్కడ శుభవార్త ఏంటంటే.. కొన్ని బీమా సంస్థలు మీ క్లెయిముల చరిత్ర ఆధారంగా రెన్యూవల్ డిస్కౌంట్లు, బోనస్​లను అందజేస్తాయి.

మీ ప్లాన్​లో ఇటువంటి ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునేందుకు మీ బీమా సంస్థను సంప్రదించండి. (లేకపోతే సింపుల్​గా మీ పాలసీ డాక్యుమెంట్​ ఒకసారి చూడండి.) మీరు డిజిట్ అందిస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉంటే అందుకోసం పాలసీ సారాంశాన్ని చూస్తే సరిపోతుంది.

క్రితం సంవత్సరంలో ఎటువంటి క్లెయిములు చేయని వారికి మేము క్యుములేటివ్ బోనస్ ప్రయోజనాన్ని అందజేస్తాం. దీని అర్థం మేము మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం విలువను పెంచకుండానే మీ బీమా మొత్తం విలువను పెంచుతాం. 😊

మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకుంటున్న మీకు ఇదొక చిన్న రివార్డు అనుకోండి.

అదనంగా మేము మీకు ఒక యాడ్–ఆన్​ కవర్​ను అందజేస్తాం. దీని వలన మీరు ప్రతీ ఏడాది మీ బీమా మొత్తం విలువను రూ. 25,000 లేదా రూ. 50,000 మేర పెంచుకోవచ్చు. మీకు ద్రవ్యోల్బణం గురించిన చింత లేకుండా చేస్తున్నాం.

మీరు క్లెయిములు చేశారా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఇది జరుగుతుంది. ఈ ప్రయోజనం కోసం ప్రీమియం పెరుగుదల కేవలం రెన్యూవల్ సమయంలోనే వర్తిస్తుంది.

#2 మీ క్లెయిముల చరిత్ర

కొన్ని బీమా సంస్థలు ఏడాదిలో మీరు చేసిన క్లెయిముల సంఖ్య ఆధారంగా ప్రీమియం ధరలను పెంచుతారు. కానీ ఇలా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల విషయంలో ఉండకపోవచ్చు.

మీ క్లెయిముల చరిత్ర ఆధారంగా బీమా సంస్థ హెల్త్ ప్రీమియాన్ని పెంచుతుందో లేదో తెలుసుకునేందుకు మీ పాలసీ డాక్యుమెంట్​లో క్లెయిమ్స్ సెక్షన్​లోని షరతులు, నిబంధనలను చూడండి.

మీరు డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉంటే మీరు చేసిన క్లెయిమ్స్ సంఖ్య ఆధారంగా మేము ప్రీమియాన్ని పెంచం. కాబట్టి మీరు ఈ విషయంలో నిశ్చింతగా ఉండొచ్చు.

ఇందుకోసం మీరేం చేయాలి?

మీ బీమా సంస్థ క్లెయిమ్స్ సంఖ్యను బట్టి ప్రీమియం విలువను పెంచితే.. అది వారి షరతుల్లో భాగమైనందున మీరు పెద్దగా ఏమీ చేయలేరు.

కానీ ఇటువంటి సందర్భంలోనే మీరు మీ హెల్త్ పాలసీని ఇటువంటి షరతులు లేని వేరే హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థకు పోర్ట్ చేసుకోవచ్చు. పోర్టింగ్ అనేది కేవలం రెన్యూవల్ సమయంలో మాత్రమే చేసేది కావున అందుకు తగిన విధంగా నిర్ణయం తీసుకోండి.

#3 మీ వయసు

మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం విలువ మీ వయసు మీద కూడా ఆధారపడి ఉంటుందని మీరు ఇప్పటికే తెలుసుకొని ఉండవచ్చు.

కొన్ని సందర్భాల్లో వయసు కూడా రెన్యూవల్ సమయాల్లో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని ప్రభావితం చేస్తుంది. రెన్యూవల్ సమయంలో 60 ఏళ్లకు చేరువవుతున్న వారికి ఇది వర్తిస్తుంది.

ఇందుకోసం మీరేం చేయాలి?

మీరు సమయాన్ని వెనక్కి తీసుకురాలేరు. యుక్త వయసు​లోకి మారలేరు. కానీ మీరు ఎంచుకునే బీమా మొత్తం విలువ గురించి సరిగా ఆలోచించాలి. మీరు యుక్త వయసులో ఉంటే మీకు ఎక్కువ కవరేజ్ అవసరం లేదు. కానీ మీరు మీ సీనియర్ పేరెంట్స్ కోసం ప్లాన్ చేస్తుంటే వారికి ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజీ అవసరం.

కావున మీ కుటుంబ సభ్యుల వయసు, వారి ఆరోగ్య అవసరాలను బట్టి బీమా మొత్తం విలువను ఎప్పుడూ కస్టమైజ్ చేసుకుంటూ ఉండండి.

#4 కవరేజీ ప్రయోజనాలలో మార్పు

మీ హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ సమయంలో మీ బీమా సంస్థ నిబంధనలు, షరతులకు లోబడి మీరు కవరేజీ ప్రయోజనాలలో మార్పులు చేసుకోవచ్చు.

మీకు ఎక్కువ కవరేజీ అవసరమని భావించి మీరు దీనిని ఎంచుకొని ఉండవచ్చు. (బహుశా మీరు మెటర్నటీ యాడ్–ఆన్ లేదా ఇటీవల మీ ఆరోగ్య పరిస్థితులను గుర్తించి ఎక్కువ కవరేజ్ కోరుకోవచ్చు)

మీరు యాడ్–ఆన్​ను ఎంచుకోవడం, బీమా విలువను మార్చుకోవడం వంటివి చేస్తే అప్పుడు ప్రీమియం ధర కూడా మారుతుంది.

ఇందుకోసం మీరేం చేయాలి

ఈ సమయంలో మీరు చేయాల్సిన పని హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్​ను సమీక్షించడం. ఇలా చేయడం వలన మీ కవరేజ్ ప్రయోజనాలు ఏంటనేది మీరు తెలుసుకుంటారు. ఇంకా మీకేవైనా ఆరోగ్యపరమైన అవసరాలు ఉన్నాయా.. లేదా ప్రస్తుతం ఉన్న పాలసీ సరిపోతుందా అనేది తెలిసిపోతుంది. మీ ప్రస్తుత బీమా కంపెనీతో మీరు మీ ప్లాన్​ను మీ అవసరాలకు తగిన విధంగా అప్​గ్రేడ్ చేసుకోవచ్చు.

మీరు చేయగలిగే బెస్ట్ విషయం ఏంటంటే ఆన్​లైన్​లో అందుబాటులో ఉన్న పాలసీలను పోల్చి చూడండి. మీ పరిస్థితులకు తగిన విధంగా ఏదైనా ఇతర ప్లాన్ ఉందేమో చూడండి.

#5 మీ ఆరోగ్యం, సంరక్షణ

ఆరోగ్య ద్రవ్యోల్బణం కారణంగా మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కొద్దిగా పెరుగుతుందని మీకు తెలుసు. కానీ చాలా ఆరోగ్య బీమా సంస్థలు మీరు చివరి సంవత్సరంలో ఎంత ఆరోగ్యంగా ఉన్నారనే విషయాన్ని పరిగణనలోనికి తీసుకుని మీకు అందుకు రివార్డును కూడా అందజేస్తాయి.

ఉదాహరణకు చూసుకుంటే మీరు చివరి సంవత్సరంలో ఎటువంటి హెల్త్ క్లెయిమ్స్ చేయకపోతే.. డిజిట్​​ కంపెనీలో మేము మీకు క్యుములేటివ్ బోనస్ అందజేస్తాం. మీ బీమా ప్రీమియం పెరగకుండానే మీ కవరేజిని మేము పెంచుతాం.

మీరు అనారోగ్యంతో బాధపడుతున్నా లేక మరింత కవరేజ్ అవసరమయ్యే వ్యాధులతో బాధపడుతున్నా కొన్ని ఆరోగ్య బీమా సంస్థలు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని పెంచుతాయి.

అందుకోసం మీరేం చేయాలి?

ఇందుకు సరైన సమాధానం మీరు మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవడమే. కానీ కొన్ని సందర్భాల్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ అనుకోని సంఘటనలు జరుగుతాయి. మేము ఆ విషయాలను అర్థం చేసుకున్నాం.

క్యుములేటివ్ బోనస్ ప్రయోజనాలను పొందేందుకు మీరు చిన్నపాటి క్లెయిమ్స్ చేయకుండా ఉండటమే మంచిది.

ఉదాహరణకు: మీకు చిన్న ఫ్రాక్చర్ అయిందని అనుకుందాం. అటువంటి సమయంలో మీరు క్లెయిమ్ చేయకుండా ఉండటమే మంచిది. (ఫ్రాక్చర్ కోసం చికిత్స ఖర్చు తక్కువగానే ఉంటుంది.)

మీరు సంవత్సరంలో ఎటువంటి క్లెయిమ్ చరిత్రను కలిగి ఉండకుంటే.. మీ ప్రీమియంలో ఎటువంటి పెరుగుదల లేకుండానే మీ బీమా మొత్తం విలువను మేము పెంచుతాం.

హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసే సమయంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయాలు

మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ గడువు ముగిసే రెండు నెలల ముందు దానిని సమీక్షించడం చాలా మంచిది. దానిని గుడ్డిగా రెన్యూవల్ చేయడం కంటే సమీక్షించడం చాలా మంచి ఆలోచన. మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్​ను రెన్యూవల్ చేసే ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.

1. మీ బీమా మొత్తం సరిపోతుందా?

మీరు పాలసీని కొనుగోలు చేసిన సమయంలో తక్కువ బీమా మొత్తం ఉండే పాలసీని ఎంచుకుంటే.. మీ కవరేజ్ చాలా తక్కువగా ఉందని మీకు అనిపించొచ్చు. అందుకోసం మీరు ఎక్కువ బీమా మొత్తం ఉన్న పాలసీని ఎంచుకోవాలి.

చాలా బీమా సంస్థలు రెన్యూవల్ సమయంలో మీ బీమా మొత్తం విలువను పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తాయి. వారు మిమ్మల్ని అందుకు గల కారణాలు అడుగుతారు. మీరు బీమా మొత్తం విలువను పెంచితే మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా పెరుగుతుంది.

2. మీ ఎవరైనా కుటుంబ సభ్యులను యాడ్ చేయాలనుకుంటున్నారా?

ఇటీవలే మీరు కుటుంబ జీవితాన్ని ప్రారంభించి ఉండొచ్చు. మీ జీవితభాగస్వామిని కూడా హెల్త్ ఇన్సూరెన్స్​కు యాడ్ చేయాలని భావించొచ్చు. ఇటువంటి విషయాలను ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయండి.

మీరు ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్​కు మారడం ద్వారా కుటుంబంలోని అందరినీ యాడ్ చేసుకోవచ్చు. లేదా సింపుల్​గా ప్రతి ఒక్కరికీ ఇండివిజువల్ ప్లాన్స్ కొనుగోలు చేయండి.

3. యాడ్–ఆన్స్ మాటేమిటి?

పాలసీ రెన్యూవల్ సమయంలో చూడాల్సిన మరో విషయం యాడ్–ఆన్స్ గురించి. మీకు యాడ్–ఆన్స్ కావాలా వద్దా అనేది పూర్తిగా మీ ఇష్టం. ఉదాహరణకు చూసుకున్నట్లయితే మీరు మీ హెల్త్ పాలసీలో ఇంతవరకూ ఎటువంటి యాడ్–ఆన్స్ ఎంపిక చేసుకోలేదు. కానీ ఈ సారి మాత్రం మెటర్నిటీ, న్యూ బార్న్ బేబీ కవర్​ను ఎంచుకోవాలని అనుకుంటున్నారు. ఇటువంటి సందర్భంలో మీరు బీమా సంస్థకు తెలియజేసి మీ హెల్త్ పాలసీ రెన్యూవల్ సమయంలో దానిని యాడ్ చేసుకోండి.

4. మీ పాత బీమా సంస్థతో మీరు సంతోషంగా ఉన్నారా? లేదా పాలసీని పోర్ట్ చేయాలని అనుకుంటున్నారా?

చాలా మంది వ్యక్తులు తమ ప్రస్తుత బీమా కంపెనీ అందించే సేవలతో సంతృప్తిగా లేనపుడు తమ పాలసీని పోర్ట్ చేసేందుకు చూస్తారు. వారి అసంతృప్తికి కవరేజ్ ప్రయోజనాలు లేదా సేవలు, ప్రక్రియ కూడా కారణం కావొచ్చు.

కానీ రెన్యూవల్ సమయంలో మాత్రమే పాలసీని పోర్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. మీ ప్రస్తుత బీమా సంస్థకు దీని గురించి కనీసం రెన్యూవల్ గడువు కంటే 45 రోజులు ముందుగా తెలియజేయాలి. అప్పుడు మీరు పాలసీని సులభంగా పోర్ట్​ చేసుకోగలుగుతారు.

ఒకవేళ మీరు మీ బీమా కంపెనీతో సంతృప్తిగా లేకపోతే మార్కెట్లో లభించే వివిధ రకాల హెల్త్​ పాలసీలను ఆన్​లైన్​లో పోల్చి చూడండి. మీకు నచ్చిన కంపెనీకి పాలసీని పోర్ట్ చేసుకోండి.

5. మీ కవరేజీలో మీరు మార్పులను కోరుకుంటున్నారా?

మీ బీమా మొత్తం విలువ, కొత్త కవర్​ల గురించి మాత్రమే కాకుండా మీ ప్లాన్​లో మీరు ఏమైనా మార్పులు చేయాలని అనుకుంటున్నారా? పూర్తిగా పాలసీని సమీక్షించి తెలుసుకోండి.

ఉదాహరణకు మీరు ఇంతకుముందు బేసిక్ కవరేజ్ ప్లాన్​ ఎంచుకుని ఉండొచ్చు. అదనపు ప్రయోజనాల కోసం ఇప్పుడు దానిని కాంప్రహెన్సివ్ ప్లాన్​కు మార్చుకోవాలని భావిస్తుంటే.. అటువంటి సందర్భంలో మీరు మీ బీమా సంస్థతో మాట్లాడండి. మీ హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ సమయంలో మీ ప్లాన్​ను మార్చుకోండి.

హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ సమయంలో ప్రీమియంలు ఆదా చేయడానికి చిట్కాలు

ప్రతీసారి మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని గడువు కంటే ముందుగానే సమీక్షించి, రెన్యూవల్ చేసే ప్రక్రియను ప్రారంభించండి. గడువు తేదీ వరకు వేచి ఉండటం మంచి పద్ధతి కాదు. మీ పాలసీ గురించి పూర్తిగా ఆలోచించేందుకు గడువుకు కనీసం 45 రోజుల ముందు నుంచే ప్రక్రియను ప్రారంభించాలి. ఇలా చేయడం వలన మీరు ఎటువంటి  రెన్యూవల్ ప్రయోజనాలు, బోనస్ కోల్పోకుండా ఉంటారు. (గడువు తేదీ కంటే ముందు మీరు మీ పాలసీని రెన్యూవల్ చేయకపోతే ఎటువంటి రెన్యూవల్ ప్రయోజనాలు, స్పెషల్ బోనస్​లు మీకు వర్తించవు).

మీరు మీ కుటుంబ సభ్యులకు ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ రెన్యూవల్ చేయాలని లేదా కొనుగోలు చేయాలని భావించినా గుడ్డిగా అందరికీ ఒకే బీమా మొత్తం విలువను తీసుకోకండి. వయసును బట్టి ఆరోగ్య సంరక్షణ అవసరాలు మారుతూ ఉంటాయి. వాటిని బట్టి మీరు బీమా మొత్తం విలువను ఎంచుకోవాలి. ఉదాహరణకు: మీ పిల్లలకు రూ. 1-2 లక్షలతో కవరేజ్ సరిపోతుంది. కానీ మీ తల్లిదండ్రుల విషయానికి వచ్చేసరికి వారికి కనీసం రూ. 5 నుంచి 10 లక్షల వరకు కవరేజ్ అవసరం. బీమా విలువ మీ ప్రీమియం మీద నేరుగా ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా మీ డబ్బు ఆదా చేసేందుకు కూడా సహాయపడుతుంది.

ఈ సంవత్సరంలో మీలో కొత్త వ్యాధిని కనుక్కొంటే రెన్యూవల్ సమయంలో మీ ఆరోగ్య బీమా సంస్థకు ఆ విషయాన్ని తెలియజేయడం చాలా ముఖ్యం. ఆ వ్యాధికి ఏదైనా కవరేజ్ ఉందా అని చెక్ చేసుకోవాలి. అలా చేయడం వలన మీరు క్లెయిమ్స్ చేసే సమయంలో ఎటువంటి ఆశ్చర్యానికి గురి కాకుండా ఉంటారు.

మీ బీమా సంస్థ రెన్యూవల్ సమయంలో ఎటువంటి ప్రయోజనాలను అందిస్తుందో తనిఖీ చేయండి. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసిన సమయంలో వాటిని పొందారా? లేదా? అని తనిఖీ చేసుకోండి.