హీరో స్ప్లెండర్ అనేది భారతదేశంలో ఉన్న బడ్జెట్ బైకులలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది. మీరు ఒక ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయాలని చూస్తున్నప్పుడు మీరు కొనాలనుకునే బండి ఫీచర్లు, ఎటువంటి ఫీచర్లు ఆ బండిని హైలైట్ చేశాయి, ఆ బైక్‌కు జనాదరణ ఎలా ఉందనే విషయాలను, అలాంటి బైక్‌కు మీరు బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు ఏయే విషయాలను పరిశీలించాలని గమనించాలో చూసుకోవాలి.
అత్యంత జనాదరణ పొందిన స్ల్పెండర్ బండి వెనుక హీరో మోటో కార్ప్ కంపెనీ ఉంది. చాలా రోజుల నుంచి భారతదేశంలో హీరో కంపెనీ మార్కెట్ లీడర్‌గా ఉంటూ వస్తోంది. జూన్ 2019లో హీరో స్ప్లెండర్, HF డీలక్స్ రికార్డు స్థాయిలో అమ్మకాలను నెలకొల్పాయి. స్ప్లెండర్ విషయానికి వస్తే 2.42 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. (1)
మీరు మంచి మైలేజీ ఇచ్చే బైక్ కోసం చూస్తున్నట్లయితే మీకు స్ప్లెండర్ సరిగ్గా సూటవుతుంది.
అయితే, స్ప్లెండర్ బైకును చాలా ధృడంగా రూపొందించినప్పటికీ, ప్రమాదాల వలన జరిగే డ్యామేజీలు బండి పనితీరును దెబ్బతీస్తాయి. హీరో స్ల్పెండర్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం వలన మీ వాహన మరమ్మతుల కోసం అయ్యే ఆర్థిక ఖర్చుల నుంచి మీరు కవర్ చేయబడతారు. థర్డ్ పార్టీ లయబులిటీల నుంచి కూడా ఈ ఇన్సూరెన్స్ పాలసీ మిమ్మల్ని సంరక్షిస్తుంది.
మోటారు వాహనాల చట్టం–1988 ప్రకారం మీరు బీమాను కలిగి ఉండటం తప్పనిసరి. ఒకవేళ ఈ నిబంధనను పాటించడంలో మీరు విఫలమయితే భారీగా ట్రాఫిక్ జరిమానాలు పడే ప్రమాదం ఉంది. బీమా లేకుండా పట్టుబడిన మొదటిసారికి రూ. 2,000, రెండో సారి పట్టుబడితే రూ. 4,000 వరకు జరిమానా విధించబడుతుంది.