హీరో బైక్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసే వ్యక్తులకు డిజిట్ కంపెనీ గురించి కంపెనీ అందిస్తున్న యూజర్ ఫ్రెండ్లీ పాలసీల గురించి తెలిసే ఉంటుంది. ఇన్సూరెన్స్ మార్కెట్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీలలో డిజిట్ ముందు వరుసలో ఉంటుంది. డిజిట్ మీ టూ వీలర్లను సంరక్షించేందుకు వివిధ ఆఫర్లతో కూడిన పాలసీలను అందజేస్తుంది. మీరు డిజిట్లో ఎందుకు ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయాలో కింద వివరంగా ఉంది.
1. a) థర్డ్ పార్టీ లయబిలిటీ బైక్ ఇన్సూరెన్స్ – మీ టూ వీలర్ వలన థర్డ్ పార్టీ వ్యక్తులకు కానీ, ఆస్తులకు కానీ అయ్యే డ్యామేజీల నుంచి మిమ్మల్ని థర్డ్ పార్టీ లయబిలిటీ బైక్ ఇన్సూరెన్స్ కాపాడుతుంది. థర్డ్ పార్టీ వ్యక్తులకు అయిన గాయాలు, మరణాలను కూడా ఈ పాలసీ కవర్ చేస్తుంది.
2.b) కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్– మీ టూ వీలర్‌కు ఇది సమగ్ర సంరక్షణను అందిస్తుంది. ఈ పాలసీలో మీరు మీ సొంత డ్యామేజీలకు, థర్డ్ పార్టీ వ్యక్తుల డ్యామేజీలకు కూడా కవరేజీని పొందొచ్చు. అంతే కాకుండా ప్రకృతి విపత్తులు, అల్లరు వంటి కారణాల వలన మీ బండి డ్యామేజ్ అయినపుడు మిమ్మల్ని ఈ ప్లాన్ ఆర్థికంగా కాపాడుతుంది.
ఇవి మాత్రమే కాకుండా డిజిట్ కంపెనీ ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కూడా అందజేస్తుంది. ఎవరికైతే ఇప్పటికే థర్డ్ పార్టీ పాలసీ ఉండి ఉంటుందో వారికి మాత్రమే ఈ ప్లాన్ వర్తిస్తుంది. థర్డ్ పార్టీ పాలసీ ఉండి ఆర్థిక నష్టాలను కవర్ చేసే ప్లాన్ కోసం చూస్తున్న వారికి మాత్రమే ఈ ప్లాన్. 2018 సెప్టెంబర్ తర్వాత బండిని కొన్న వారికి మాత్రమే ఈ ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్ అందుబాటులో ఉంటుంది.
ఎక్కువ సంఖ్యలో నెట్వర్క్ గ్యారేజీలు – డిజిట్లో ఉన్న నెట్వర్క్ గ్యారేజీలను మీరు మీ టూ వీలర్ల రిపేర్ల కోసం వాడుకునే సౌలభ్యం ఉంటుంది. డిజిట్ కంపెనీకి భారతదేశ వ్యాప్తంగా అనేక సంఖ్యలో నెట్వర్క్ గ్యారేజీలు ఉన్నాయి. మీరు అటువంటి గ్యారేజ్‌కు వెళ్తే మీ పని సులభం అవుతుంది. అంతేకాకుండా అవి ఎక్కడ ఉన్నాయో కనుగొనడం కూడా చాలా ఈజీనే. ఈ నెట్వర్క్ గ్యారేజీలను మీరు ఉపయోగించుకుంటే మీరు మీ జేబు నుంచి రిపేర్ ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఉండదు.
సులభమైన కొనుగోలు, రెన్యువల్ ప్రక్రియ – డిజిట్ ఆన్లైన్ ప్లాన్లను అందజేస్తుంది. వీటి వలన మీ పని చాలా సులభం అవుతుంది. ఆన్లైన్ పాలసీని మీరు తీసుకునేందుకు చేయాల్సిందల్లా మీ బండికి సంబంధించిన కొన్ని వివరాలను సమర్పించడం మాత్రమే. వారు అడిగిన వివరాలను సమర్పించి పేమెంట్ చేస్తే మీ మెయిల్‌కు పాలసీ వివరాలు పంపబడతాయి. ఈ ప్రాసెస్ చాలా సులభంగా ఉంటుంది. ఈ పద్ధతిలో మీరు ఎటువంటి ఇన్సూరెన్స్ బ్రోకర్‌ను కలవాల్సిన అవసరం ఉండదు.
మీ అవసరాలకు తగినట్లు ఐడీవీ (IDV) ని మార్చుకునే వెసులుబాటు - ఐడీవీ అనేది మీ టూ వీలర్‌కు ఎప్పుడైనా పూర్తి డ్యామేజ్ జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మీకు లభించే మొత్తం. తయారీదారుడి ధర నుంచి మీ బైక్ డిప్రిషియేషన్ ఖర్చును తీసేస్తే ఐడీవీ వస్తుంది. డిప్రిషియేషన్‌ను లెక్కించే విధానంలో ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి తేడాలుంటాయి. డిజిట్ మీకు ఎక్కువ ఐడీవీని అందిస్తుంది. అంతేకాకుండా మీకు నచ్చిన విధంగా ఐడీవీని మార్చుకునే వెసులుబాటును కూడా డిజిట్ అందిస్తుంది.
నో క్లెయిమ్ బోనస్ సాయంతో మీ ప్రీమియం తగ్గించుకోండి – మీరు జాగ్రత్తగా వాహనాన్ని నడిపి ఎటువంటి ప్రమాదాలు చేయకుండా, ఎటువంటి క్లెయిమ్స్ చేయకుండా ఉంటే డిజిట్ మీకు నో క్లెయిమ్ బోనస్‌ను అందిస్తుంది. ఈ నో క్లెయిమ్ బోనస్ వలన మీరు అనేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ఈ నో క్లెయిమ్ బోనస్ మీకు 50 శాతం వరకు అందుతుంది. (క్లెయిమ్ చేయని సంవత్సరాల ఆధారంగా) ఈ నో క్లెయిమ్ బోనస్ వలన మీరు అధిక ప్రయోజనాలను పొందుతారు. మీ ప్రీమియంను కూడా తగ్గించుకోవచ్చు.
సులభమైన క్లెయిమ్ ప్రక్రియ, ఎక్కువ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి – డిజిట్ ఇన్సూరెన్స్‌లో మొత్తం ప్రాసెస్ ఆన్లైన్లోనే జరగడం వలన మీరు ఇక్కడ క్లెయిమ్ చేయడం చాలా సులభం. డిజిట్లో స్మార్ట్ ఫోన్ ఆధారిత తనిఖీ ప్రక్రియ కూడా ఉంది. క్లెయిమ్ ఫైల్ చేస్తే కంపెనీ నుంచి ఏజెంట్ వచ్చి వాహనాన్ని తనిఖీ చేయాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. ఇక మరో విషయం క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి. మీరు ఏదైనా పాలసీని తీసుకునేటపుడు క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిని తనిఖీ చేయాలి. ఇది చాలా అవసరం. డిజిట్‌కు అధిక క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి ఉంది. కాబట్టి, మీరు క్లెయిమ్ చేసిన పాలసీలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
ఎక్కువ సంఖ్యలో యాడ్–ఆన్స్ లభ్యం - స్టాండర్డ్ పాలసీలు వాహనంలోని కొన్ని భాగాల రిపేర్లకు ఎటువంటి ఆర్థిక కవరేజీని అందించవు. కావున మీరు వాటి కోసం యాడ్–ఆన్స్ తీసుకోవడం చాలా అవసరం. డిజిట్ మీకు అందించే యాడ్-ఆన్స్ వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మీరు ఖర్చుల నుంచి కవర్ అవుతారు. డిజిట్ అందించే కొన్ని ముఖ్యమైన యాడ్–ఆన్స్
- a) ఇంజన్, గేర్ ప్రొటెక్షన్ కవర్
- b) జీరో డిప్రిషియేషన్ కవర్
- c) బ్రేక్ డౌన్ అసిస్టెన్స్
- d) రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్
- e) కంజూమబుల్ కవర్
అన్ని సందర్భాల్లో మీరు ఆర్థిక పరమైన నష్టాలకు గురికాకుండా ఉండేందుకు యాడ్–ఆన్స్ సంరక్షణ ఎంతగానో ఉపయోగపడుతుంది.
మీరు ప్రమాదం గురించి చెప్పాలనుకున్నా, లేదా మీ పాలసీకి సంబంధించి ప్రశ్నలు అడగాలనుకున్నా కూడా మా కస్టమర్ టీమ్ సిద్ధంగా ఉంటుంది. వారు మీ సందేహాలను నివృత్తి చేస్తారు.
ఎవరూ పనిచేయని విధంగా డిజిట్ కస్టమర్ సపోర్ట్ టీమ్ సభ్యులు జాతీయ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటారు. దాంతో మీకు ఎలాంటి చింత ఉండదు.
ఎక్కడ హీరో బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయాలా? అనే సందేహాలకు పుల్‌స్టాప్ పెట్టండి.
మీరు మీ హీరో టూ వీలర్లకు అధిక ప్రీమియం ఉందని చింతిస్తున్నారా? ప్రీమియం తగ్గించుకోవడం కోసం కూడా మా వద్ద కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే మీ ప్రీమియం తగ్గుతుంది.