మీ మొదటి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? దాని ఇంజన్ 60–70 ఏళ్ల క్రితం ప్రదర్శించిన సత్తానే ఇప్పుడు కూడా చాటుతుందా అని ఆశ్చర్యపోతున్నారా?
ఇన్సూరెన్స్ పాలసీలతో మరింత మెరుగ్గా సంరక్షించగలిగితే ప్రతీ రాయల్ ఎన్ఫీల్డ్ ఒక తుపాకీ లాగా తయారవుతుందా, అటువంటి పాలసీల ద్వారా అందించే ప్రయోజనాలు ఏమిటో మనం ఇప్పుడు చర్చిద్దాం, తెలుసుకుందాం.
రాయల్ ఎన్ఫీల్డ్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలంగా కొనసాగుతున్న మోటార్‌సైకిల్ బ్రాండ్. దీన్ని అసాధరణ విషయంగా ఆ సంస్థ భావిస్తోంది. 1901 లో దీని ఉత్పత్తిని ప్రారంభించారు, ఈ మోడల్ బుల్లెట్ ప్రపంచంలోనే ఎక్కువ కాలం వినియోగంలో ఉన్న మోటార్‌సైకిల్ డిజైన్‌గా నిలిచింది.
4 స్ట్రోక్ ఇంజిన్ కలిగి, దృఢ నిర్మాణంతో దీని డిజైన్ పాపులారిటీ సాధించింది. ఈ మోడల్ 1931లో ప్రారంభమైంది. మొదట్లో బుల్లెట్ 350 cc మరియు 500ccలో విడుదల చేయబడినప్పటికీ, తర్వాత 1933లో 250cc వేరియంట్‌ను విడుదల చేశారు. దృఢమైన బ్యాక్ ఫినిషింగ్ దానిని హార్డ్టైల్గా మార్చింది. తద్వారా రైడర్‌కు స్ప్రింగ్ సీటు అవసరం ఉంది. బ్రిటీష్ ఆర్మీ వారి విధుల్లో 350 cc వేరియంట్‌ను ఉపయోగించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో గ్రేట్ సక్సెస్‌ను సాధించింది.
ఓ ప్రముఖ సామెత ప్రకారం - విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ (గొప్ప శక్తితో గొప్ప బాధ్యత కూడా వస్తుంది అని అర్థం) అందుకే మీ బైక్ వివిధ ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి రక్షించబడేలా చూసుకోవడానికి, మీరు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడం చాలా ముఖ్యం.
అంతేకాకుండా, మోటారు వాహనాల చట్టం–1988 ప్రకారం బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం కూడా తప్పనిసరి. మీరు కనీసం థర్డ్ పార్టీ లయబిలిటీ టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా లేకుండా బండి నడుపుతూ పట్టుబడితే, మొదటిసారి రూ.2000, మరోసారి కూడా పట్టుబడితే రూ.4000 వరకు మీరు జరిమానాలు చెల్లించాల్సి రావచ్చు.