ఎన్ఫీల్డ్ క్లాసిక్‌పై షికారు చేయాలనుకుంటున్నారా? అయితే, మీ మోటార్ సైకిల్‌ను బయటకు తీసుకెళ్ళే ముందు, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం గురించి ఆలోచించారా? మీకు అత్యధికంగా ప్రయోజనాలను అందించే టూవీలర్ ఇన్సూరెన్స్ పాలసీ ఫీచర్లను పరిశీలించండి.
రాయల్ ఎన్ఫీల్డ్ అనేది బ్రిటీష్ మోటార్ సైకిల్ కంపెనీ. ఇది 20వ శతాబ్దంలో ముఖ్యంగా రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో ఇంగ్లీష్ సాయుధ దళాలకు ఈ మోటార్ సైకిళ్లను అందించారు.
2వ ప్రపంచ యుద్ధం సమయంలో అందించిన సేవలకు గుర్తుగా రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్‌ని కంపెనీ తయారు చేసింది. ఇది నాటి యుద్ధానికి గుర్తుగా మాత్రమే కాకుండా; రైడింగ్‌కి అనువుగా, ఆ కాలపు సాంప్రదాయ ఆలోచనలకు తగ్గట్టుగా రూపొందించారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని, బుల్లెట్ ప్రస్తుత మెయిన్ ఫ్రేమ్‌ను రూపొందించారు.
అన్ని ఇతర రాయల్ ఎన్ఫీల్డ్ మోడల్‌ల మాదిరిగానే, క్లాసిక్ కూడా భారతదేశంలో తయారు చేయబడిన మోటార్ సైకిళ్లలా ఎక్కవ ధర కలిగిన స్పెక్ట్రమ్‌కు చెందినది. అందుకే ప్రమాదంలో లేదా మరేదైనా కారణంగా ఏదైనా నష్టం జరిగితే రిపేర్‌కు అయే ఖర్చు చాలా ఎక్కువ.
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ ఇన్సూరెన్స్ పాలసీ అటువంటి పరిస్థితులు తలెత్తినప్పుడు మిమ్మల్ని ఆర్థిక ఇబ్బందుల నుండి కాపాడే ఒక కీలక సాధనం. ఇంకా మోటారు వాహనాల చట్టం–1988 ప్రకారం ప్రతీ వాహన యజమానులు తమ వాహనానికి కనీసం థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీని అయినా తప్పనిసరిగా కొనుగోలు చేయాలి.
బీమా లేకుండా పట్టుబడితే తొలిసారి రూ. 2000 ట్రాఫిక్ జరిమానా, మళ్లీ మళ్లీ పట్టుబడితే రూ. 4000 వరకు జరిమానా చెల్లించాల్సి రావచ్చు.