పేరెంట్స్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్

డిజిట్ ఇన్సూరెన్స్​కు మారండి

భారతదేశంలో తల్లిదండ్రుల (పేరెంట్స్)కు తీసుకొనే ఇన్సూరెన్స్ సమాచారం

వయసు మీద పడ్డ వారికి హెల్త్​ ఇన్సూరెన్స్​ అనేది చాలా అవసరం. వారికి అనుకోని ఆరోగ్య ఖర్చులు వస్తాయి. ఈ భారం కుటుంబ పెద్దపై పడుతుంది.

దేశంలో ప్రభుత్వం 1.58 ట్రిలియన్లను హెల్త్​ కేర్​ కోసం కేటాయించినప్పటికీ, నాణ్యమైన వైద్యం అందడం కోసం అధిక ఖర్చులు భరించాల్సి వస్తుంది.

భారతదేశంలో తల్లిదండ్రుల (పేరెంట్స్​) కోసం హెల్త్​ ఇన్సూరెన్స్​ ఎంచుకోవడం అనేది అనుకోకుండా వచ్చిన వైద్య ఖర్చుల నుంచి మనల్ని కాపాడుతుంది. వృద్ధాప్యంలో ఉన్న మీ తల్లిదండ్రులను మెడికల్​ ఖర్చుల బారి నుంచి కాపాడటం కోసం ఈ హెల్త్​ ఇన్సూరెన్స్​లో అనేక బెనిఫిట్లు ఉన్నాయి.

హెల్త్​ ఇన్సూరెన్స్​ కవర్​ అనేది చాలా సాయపడుతుంది. ప్రత్యేకించి పెద్దవారైన మీ తల్లిదండ్రుల ఆరోగ్య ఖర్చులు ఈ హెల్త్​ ఇన్సూరెన్స్​లో కవర్ అవుతాయి.

తల్లిదండ్రుల కోసం ఉన్న వివిధ రకాల హెల్త్ ఇన్సూరెన్స

హెల్త్​ ఇన్సూరెన్స్​ల విషయానికి వచ్చే సరికి భారతదేశంలో మూడు రకాల హెల్త్​ ఇన్సూరెన్స్​లు అందుబాటులో ఉన్నాయి. వీటి వలన మీ కుటుంబ వైద్య చికిత్సల ఖర్చులు, మీ తల్లిదండ్రుల చికిత్సల ఖర్చులు కవర్​ అవుతాయి. అవేంటంటే..

1. ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్

ఈ హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ కేవలం పాలసీ హోల్డర్​ను మాత్రమే కవర్ చేస్తుంది. ఈ ప్లాన్​లో మీ కుటుంబ సభ్యులతో పాటు తల్లిదండ్రులను కూడా చేర్చేందుకు వీలుంటుంది.

ఈ పాలసీని తీసుకున్న వ్యక్తి వైద్య ఖర్చుల నుంచి సంరక్షింపబడతాడు. మీ తల్లిదండ్రులకు కూడా ఇన్సూరెన్స్​ పాలసీ ఉంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

మరింతగా తెలుసుకోండి ఇండివిడ్యువల్​ హెల్త్​ ఇన్సూరెన్స్​ 

2. ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్

ఇండివిడ్యువల్​ హెల్త్​ ఇన్సూరెన్స్​ ప్లాన్​లా కాకుండా ఈ పాలసీ మీ కుటుంబం మొత్తానికి వర్తిస్తుంది. ఈ ప్లాన్​ కింద మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ మీ తల్లిదండ్రుల కోసం ఫ్యామిలీ ఫ్లోటర్​ ప్లాన్​ను తీసుకోవడం మంచిది కాదు. ఒకే సంవత్సరంలో పలు క్లెయిమ్​లను చేయడం వలన తర్వాత మీరు చేసే క్లెయిమ్​లు సెటిల్​ కాకుండాపోయే ప్రమాదం ఉంటుంది.

భారతదేశంలో తల్లిదండ్రుల కోసం అనేక హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీలు ఉన్నాయి. కానీ వాటిలో మీరు ఏదో ఒక దాన్ని ఎంచుకుంటే 50 సంవత్సరాల కంటే పైబడిన మీ తల్లిదండ్రుల​కు అనేక షరతులు ఉంటాయి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యమే మీకు ముఖ్యం కాబట్టి వారికి ఎటువంటి షరతుల లేనటువంటి హెల్త్​ ఇన్సూరెన్స్​ ఉంటే బాగుంటుంది.

మరింతగా తెలుసుకోండి ఫ్యామిలీ హెల్త్​ ఇన్సూరెన్స్​ 

ఒక్క నిమిషం ఆగండి. మీ తల్లిదండ్రుల వయసు 60 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటే వారికి సీనియర్​ సిటిజన్​ హెల్త్​ ఇన్సూరెన్స్​ ప్లాన్​ కూడా అందుబాటులో ఉంటుంది.

ఈ ప్లాన్​ ఎలా పని చేస్తుందంటే?

3. సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్

ఈ ఇన్సూరెన్స్​ పాలసీలో వయసు మీద పడిన వ్యక్తులకు అన్ని మెడికల్​ ఖర్చులు కవర్​ అవుతాయి. వ్యాధితో సంబంధం లేకుండా అన్ని వ్యాధులకు ఈ పాలసీ కవర్​ అవుతుంది. ఈ పాలసీ పాలసీ హోల్డర్ల అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది.

హోమ్​ హాస్పిటలైజేషన్​, ఆయుష్​ కవరేజ్​ వంటివి కూడా ఈ పాలసీలో కవర్​ అవుతాయి. 60 ఏళ్ల పైబడిన వారికి  ఈ ఇన్సూరెన్స్​ పాలసీ చాలా పర్ఫెక్ట్​గా పని చేస్తుంది. 

మరింతగా తెలుసుకోండి

తల్లిదండ్రులకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటపుడు చూడాల్సిన విషయాలు

మన దేశంలో ఉన్న వివిధ ఇన్సూరెన్స్​ కంపెనీలు వివిధ రకాల బెనిఫిట్స్​ను అందిస్తాయి. ఈ అంశాలు మిమ్మల్ని ఆర్థిక ఖర్చుల నుంచి కాపాడుతాయి. కాబట్టి మీ తల్లిదండ్రుల కోసం కాంప్రహెన్సివ్​ హెల్త్​ ఇన్సూరెన్స్​ తీసుకోవడం చాలా అవసరం.

మీరు మీ హెల్త్​ కేర్​ ప్లాన్​ నుంచి అధిక ప్రయోజనాలు పొందాలని భావించినపుడు మీరు తప్పకుండా కింది అంశాలను చెక్​ చేయాలి.

1. కవరేజ్

  • యాక్సిడెంటల్ & జబ్బుల వలన ఆస్పత్రిపాలైతే – ప్రమాదాలు లేదా జబ్బులు అనేవి ఊహించకుండా వచ్చేవి. ఇవి అందరిని ఖర్చుల పాలు చేస్తాయి. అందుకే కాంప్రహెన్సివ్​ హెల్త్​ పాలసీని తీసుకోవాలి. పాలసీ తీసుకునే ముందు యాక్సిడెంట్స్​కు లేదా జబ్బు పడితే ఎవరు కవరేజి అందిస్తున్నారనే విషయాలను తనిఖీ చేసుకోవాలి.
  • ప్రీ, పోస్ట్​ హాస్పిటలైజేషన్​ ఖర్చులు – ప్రస్తుత రోజుల్లో ఆస్పత్రులలో చికిత్స ఖర్చుల కంటే ఇతర ఖర్చులే ఎక్కువ అవుతున్నాయి. ఉదా. ఓపీడీ (OPD) విజిట్స్​, డయాగ్నొస్టిక్​ టెస్టులు, డాక్టర్​ పరీక్షలు తదితరాలు. అందుకే పాలసీ తీసుకునే ముందే ఏ పాలసీలో ప్రీ, పోస్ట్​ హాస్పిటల్​ ఖర్చులు కవర్​ అవుతున్నాయనే విషయాన్ని చూసుకోవాలి.
  • వార్షిక హెల్త్​ చెకప్​ ఖర్చులు – వయసు మళ్లిన వారికి వార్షిక హెల్త్​ చెకప్స్​ తప్పనిసరిగా చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ హెల్త్​ చెకప్స్​ కోసం మీరు అనేక రకాలుగా ఆర్థికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కనుక మీరు పాలసీని తీసుకునే ముందు మీ పాలసీలో వార్షిక హెల్త్​ చెకప్స్​కు అయ్యే ఖర్చులు కవర్​ అవుతాయా? లేదా? అనే విషయాన్ని తనిఖీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
  • మేజర్​ ఆపరేషన్లు – ప్రస్తుతం ఎటువంటి మేజర్​ ఆపరేషన్లయినా ఎక్కువ ఖర్చుతో కూడుకుని ఉంటున్నాయి. బేరియాట్రిక్​ (ఒబేసిటీతో బాధపడే రోగులకు చేసే సర్జరీ) తో పాటు ఇంకా పెద్ద, పెద్ద సర్జరీలకు చికిత్స మీరు తీసుకునే హెల్త్​ పాలసీలో ఉందా? లేదా? అనే విషయాన్ని చూసుకోవాలి. ఇటువంటి సర్జరీలు కవర్​ అయ్యే పాలసీని కనుక మీరు తీసుకుంటే ఇక ఆస్పత్రి ఖర్చుల గురించి చింతించాల్సిన అవసరం ఉండదు. మీ తల్లిదండ్రుల​ను దేశంలోని ఏ పెద్ద ఆస్పత్రికి అయినా తీసుకెళ్లి నిర్భయంగా చికిత్స చేయించవచ్చు.
  • మానసిక అనారోగ్యానికి చికిత్స –మానసిక అనారోగ్యానికి చికిత్స అందించాల్సిన అవసరం గురించి ఇప్పుడిప్పుడే నెమ్మదిగా అందరికీ తెలుస్తోంది. దేశంలో ఉన్న ప్రముఖ ఇన్సూరెన్స్​ కంపెనీలన్నీ ఈ చికిత్సను తమ పాలసీలలో చేర్చుతున్నాయి. కాబట్టి మీరు మీ తల్లిదండ్రులకు హెల్త్​ పాలసీని తీసుకునే ముందు మానసిక వైద్యానికి పాలసీ కవర్​ అవుతుందా? లేదా? అనే విషయాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి.
  • రూమ్​ రెంట్​ క్యాపింగ్​ లేదు – రూమ్​ రెంట్​ అనేది ప్రస్తుతం అన్ని ఆస్పత్రులలో ఎక్కువగానే ఉంటుంది. మీరు మీ తల్లిదండ్రులను ప్రీమియం హాస్పిటల్స్​లో చేరిస్తే రూమ్​ రెంట్​ విషయంలో మీకు ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఎటువంటి రూమ్​ రెంట్​ క్యాపింగ్​ ఉండని పాలసీని ఎంచుకోవాలి. అలా ఎంచుకుంటే మీరు మీ తల్లిదండ్రుల​ను ఏ ప్రీమియం ఆస్పత్రిలోనైనా చేర్చి చికిత్స చేయించవచ్చు. కావున మీరు పాలసీ ఎంచుకునే ముందు రూమ్​ రెంట్​ క్యాపింగ్ చార్జీల గురించి తప్పనిసరిగా చెక్​ చేసుకోండి. ​

2. క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్స్

ప్రమాదకరమైన గుండె జబ్బులు, క్యాన్సర్​, కాలేయ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యల వంటివి క్రిటికల్​ ఇల్​నెస్​ (తీవ్రమైన అనారోగ్య సమస్యలు) కిందకు వస్తాయి. ఇటువంటి వైద్యపరమైన పరిస్థితులకు చికిత్స అందించాలంటే రూ. 1 లక్ష నుంచి మొదలై రూ. 10 లక్షల వరకు కవర్​ అవుతాయి.

మీరు క్రిటికల్ ఇల్​నెస్​ కవర్​ను ఎంచుకుంటే ఇటువంటి వ్యాధుల చికిత్స కవర్ అవుతుంది. అదే మీరు కాంప్రహెన్సివ్​ ఇన్సూరెన్స్​ కవరేజ్​ ఎంచుకుంటే ఎక్కువ ఇన్సూరెన్స్​ అమౌంట్​ మీకు లభిస్తుంది. సర్జికల్​ చార్జీలతో పాటు క్రిటికల్​ ఇల్​నెస్​, పోస్ట్​ రిలీజ్​ చార్జీలు కూడా ఈ కవర్​లో మీకు లభిస్తాయి.

మీరు ఇన్సూరెన్స్​ పాలసీని తీసుకున్న 30 రోజులలోపు ఎటువంటి క్లెయిమ్స్​ చేయలేరు. ఎందుకంటే ఈ సమయం యాక్టివేషన్​ పీరియడ్​ కిందకు వస్తుంది.

3. స్థోమత

మీరు మీ తల్లిదండ్రుల కోసం తీసుకున్న హెల్త్​ పాలసీకి కట్టే ప్రీమియం చార్జీలు మీకు ఆర్థిక భారం కాకుండా ఉండాలి.

ఇతర కంపెనీల పాలసీలతో ఇన్సూరెన్స్​ మొత్తం, కవరేజీ అంశాలు, ప్రీమియం మొదలగు వాటిని పోల్చుకుని పాలసీని ఎంచుకోవాలి.

మరింతగా తెలుసుకోండి హెల్త్​ ఇన్సూరెన్స్​ను పోల్చి చూడండి

4. ఆదాయపు పన్ను బెనిఫిట్లను క్లెయిమ్ చేసుకోగలగడం

క్యాష్​లెస్​ ట్రీట్​మెంట్​ అనేది హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీలో ముఖ్యమైన విషయం.

ఈ విధానంలో మీ ఇన్సూరెన్స్​ కంపెనీలు వైద్య ఖర్చులను నేరుగా మీ తల్లిదండ్రులు చికిత్స చేయించుకున్న నెట్​వర్క్​ ఆస్పత్రి​కే చెల్లిస్తారు. మీరు పాలసీని ఎంచుకునే ముందు ఆ ఇన్సూరెన్స్​ కంపెనీలో ఎన్ని నెట్​వర్క్​ ఆస్పత్రులు ఉన్నాయనే విషయాన్ని పరిశీలించుకోవాలి.

మరింత తెలుసుకోండి:

5. 0% కో పేమెంట్ ఆప్షన్

మీరు పాలసీని ఎంచుకునే ముందు కో–పేమెంట్​ అవకాశం లేని పాలసీని ఎంచుకోవాలి. కొన్ని ఇన్సూరెన్స్​ పాలసీలు మీకు అయిన చికిత్స ఖర్చులను కొంత శాతం మాత్రమే చెల్లిస్తాయి. కాబట్టి మీరు పాలసీ తీసుకునే ముందే కో–పేమెంట్​ అవకాశం లేని పాలసీని ఎంచుకోవడం ఉత్తమం.

తల్లిదండ్రుల కోసం 0% కో–పేమెంట్​ ఉన్న హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ కోసం చూస్తున్నారా? 

6. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో

క్లెయిమ్​ సెటిల్​మెంట్​ రేషియో అనేది పాలసీ తీసుకునే ముందు చూడాల్సిన మరో విషయం. ఇన్సూరెన్స్​ కంపెనీకి ఎంత మంది క్లెయిమ్​ చేశారు, ఎంత మందికి క్లెయిమ్​ సెటిల్​ అయిందనే విషయాలను బట్టి క్లెయిమ్​ సెటిల్​మెంట్​ రేషియోను లెక్కిస్తారు.

క్లెయిమ్​ సెటిల్​మెంట్​ రేషియో ఎక్కువగా ఉన్న ఇన్సూరెన్స్​ కంపెనీలో పాలసీ తీసుకోవడం మంచిది. ఇటువంటి కంపెనీలో మీరు పాలసీ తీసుకుంటే ఏదైనా అత్యవసర సమయంలో మీరు చేసే క్లెయిమ్​ రిజెక్ట్​ కాకుండా ఉంటుంది.

7. కాంప్రహెన్సివ్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ కవరేజ్

ప్రస్తుతం ఉన్న చాలా ఇన్సూరెన్స్​ కంపెనీలు ప్రీ ఎగ్జిస్టింగ్​ ఇల్​నెస్​​ క్లెయిమ్​ చేసినపుడు వెయిటింగ్​ పీరియడ్​ను కలిగి ఉంటాయి. మినిమల్​ వెయిటింగ్​ పీరియడ్​ ఉన్న పాలసీల కోసమే ఎవరైనా వెతుకుతారు. అటువంటి పాలసీని తీసుకోవడమే ఉత్తమం.

మీ పాలసీలో కవర్​ అయిన అనారోగ్యాల సంఖ్యను కూడా మీరు గమనించాల్సి ఉంటుంది. అప్పుడే మీ పాలసీ మీకు గరిష్ట ప్రయోజనాలను అందిస్తుందా? లేదా అనే విషయం తెలుస్తుంది.

8. యాడ్–ఆన్ బెనిఫిట్స్

పైన పేర్కొన్న ఫీచర్ల గురించి మాత్రమే కాకుండా మీరు యాడ్​–ఆన్​లు కూడా ఎంచుకుంటే అవి మరింతగా మీకు ఆదా​ చేస్తాయి. కొన్ని రకాల యాడ్​–ఆన్స్​ చూస్తే..

డిస్​క్లెయిమర్​ : డిజిట్ అందించే ఆరోగ్య పాలసీలతో ప్రస్తుతం ఆయుష్ ప్రయోజనాలను అందించట్లేదనే విషయాన్ని గమనించగలరు.

9. సులభమైన క్లెయిమ్ ప్రాసెస్

సాధారణంగా క్లెయిమ్స్​ సెటిల్​ చేయడానికి ఇన్సూరెన్స్​ కంపెనీలు రెండు పద్ధతులను అవలంభిస్తాయి. అవి..

  • క్యాష్​లెస్​ సెటిల్​మెంట్స్​
  • హెల్త్​ రీయింబర్స్​మెంట్​

మీరు క్లెయిమ్​ సెటిల్​మెంట్ కోసం ఏ ఆప్షన్​ ఎంచుకుంటారో దాని మీద అవగాహన కలిగి ఉండాలి. కానీ, ప్రస్తుతం చాలా ఇన్సూరెన్స్​ కంపెనీలు వారి క్లెయిమ్​ ప్రాసెస్​ను ఆన్​లైన్​కు షిఫ్ట్​ చేశాయి. ఈ ప్రాసెస్ ఇప్పుడు చాలా ఈజీగా మారింది.

10. కంపెనీ రిప్యుటేషన్ను సమీక్షించండి

చివర​గా మీరు పాలసీ తీసుకుందామని భావించే ఇన్సూరెన్స్​ కంపెనీ గురించి దాని కస్టమర్లు ఏమనుకుంటున్నారో ఒకసారి సోషల్​ మీడియా సైట్లలో చూడటం మంచిది. గూగుల్​ రివ్యూలు కూడా తనిఖీ చేయాలి. అటు తర్వాత ఏది బా​గా ఉంటే ఆ కంపెనీలో మంచి హెల్త్​కేర్​ ప్లాన్​ను ఎంచుకోవాలి.

పేరెంట్స్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఏమేం కవర్ కావు?

మీరు మీ తల్లిదండ్రుల​కు ఇన్సూరెన్స్​ పాలసీని తీసుకున్నపుడు అందులో ఏమేం కవర్​ కావనే విషయాలను గురించి తెలుసుకోవడం చాలా అవసరం. మీ పేరెంట్స్​కు తీసుకున్న హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీలో కింది అంశాలు కవర్​ కావు..

  • వెయిటింగ్​ పీరియడ్​ ముగిసే వరకు ఉన్న అనారోగ్య ఖర్చులకు మెడికల్​ చార్జీలు వర్తించవు.
  • ఒకవేళ మీ తల్లిదండ్రులు డాక్టర్​ సలహా/ప్రిస్క్రిప్షన్​ లేకుండా ఆస్పత్రిలో చేరితే అప్పుడు హెల్త్​ ఇన్సూరెన్స్​ కవర్​ కాదు.

మీ పేరెంట్స్కు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎందుకు తీసుకోవాలి?

మీరు కాంప్రహెన్సివ్​ హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీని తీసుకుంటే కింది ప్రయోజనాలు పొందుతారు.

  • తక్కువ రోగ నిరోధక శక్తి, జీర్ణ క్రియ రేటు వలన వయసుపైబడిన వారు ఎక్కువగా వ్యాధులకు గురవుతూ ఉంటారు. కాబట్టి అటువంటి వారి కోసం హెల్త్​ పాలసీ తీసుకోవడం చాలా అవసరం. హెల్త్​ పాలసీ వలన ఆర్థికంగా ఎక్కువ ఖర్చులకు గురికాకుండా ఉండవచ్చు. అందుకే పేరెంట్స్​కు హెల్త్​ ఇన్సూరెన్స్​ కవర్​ తప్పకుండా తీసుకోవాలి.
  • పాలసీ ఉంటే మీ పేరెంట్స్ అనారోగ్యానికి గురైనప్పుడు నాణ్యమైన చికిత్స పొందుతారు. దానికి ఇన్సూరెన్స్​ కంపెనీలు హామీ ఇస్తాయి.
  • చాలా ఇన్సూరెన్స్​ కంపెనీలు ఇన్సూరెన్స్​ మొత్తాన్ని రీఫర్నిష్​ చేసేందుకు అవకాశం కల్పిస్తాయి. దీని వలన మీకు ఆర్థిక భారం తగ్గుతుంది.
  • ఎటువంటి ఆర్థిక భారం మీ మీద పడనందున మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

మీ పేరెంట్స్కు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకంటే ఏ విధంగా ప్రయోజనం చేకూరుస్తుంది?

మీకు ఏ సందర్భంలోనైనా మెడికల్​ ఎమర్జెన్సీ వచ్చినపుడు హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ మిమ్మల్ని ఖర్చుల నుంచి కాపాడుతుంది. కాబట్టి మీ పేరెంట్స్​కు హెల్త్​ ఇన్సూరెన్స్​ తీసుకోవాలి. పాలసీని తీసుకుంటే మీరు ప్రేమించే వ్యక్తులు తొందరగా కోలుకోవాలని మాత్రమే చూస్తారు. ఖర్చులను కాదు.

అంతేకాకుండా మీరు పాలసీ చేసిన మొత్తానికి ఆదాయపు పన్ను మినహాయింపును కూడా పొందొచ్చు. మీ పేరెంట్స్​ 60 సంవత్సరాల పైబడినవారైతే రూ. 50,000, 60 సంవత్సరాల కంటే తక్కువ వయసు వారైతే రూ. 25,000 ట్యాక్స్​ బెనిఫిట్​ పొందొచ్చు.

పేరెంట్స్కు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనడం ఎలా?

హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో అనేక సార్లు కాపాడుతుంది. ఎటువంటి మెడికల్​ ఖర్చులయినా హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీలో కవర్​ అవుతాయి. ప్రస్తుత రోజుల్లో అనేక ఇన్సూరెన్స్​ కంపెనీలు తమ హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీలను ఆన్​లైన్​లో ఆఫర్​ చేస్తున్నాయి. వెరిఫికేషన్​, ప్రీమియం పేమెంట్లు మొత్తం ఆన్​లైన్​లోనే పూర్తవుతున్నాయి.

కింద పేర్కొన్న విధంగా ఇన్సూరెన్స్​ పాలసీని తీసుకోవాలి. మొదట మీరు ఏ కంపెనీ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారో ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఒకవేళ మీరు డిజిట్​ ఇన్సూరెన్స్​ పాలసీని ఎంచుకుంటే మీ హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీని పొందేందుకు కింది స్టెప్స్​ను ఫాలో కావాలి.

  • స్టెప్​ 1– అధికారిక​ వెబ్​సైట్​లోకి వెళ్లి మీ ప్రాంతం పిన్​కోడ్​ను ఎంటర్​ చేయాలి. మీరు ఎంతమందికి ఇన్సూరెన్స్​ పాలసీని తీసుకోవాలని భావిస్తున్నారో ఎంటర్​ చేయండి. మీ పేరెంట్స్​కు కావాల్సిన ఆప్షన్లను ఎంచుకోవాలి.
  • స్టెప్​ 2  – మీ తల్లిదండ్రుల పుట్టినరోజు వివరాలను ఎంటర్​ చేయాలి.
  • స్టెప్​ 3 – కాంటాక్ట్​ వివరాలు ఎంటర్​ చేయండి.
  • స్టెప్​ 4  – ఎంత మొత్తానికి ఇన్సూరెన్స్​ చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి.
  • స్టెప్​ 5 – అక్కడ అడిగిన విధంగా మీ వ్యక్తిగత వివరాలను ఎంటర్​ చేయాలి.
  • స్టెప్​ 6  – మరోసారి మీ పాలసీ వివరాలను సరిచూసుకోవాలి.
  • స్టెప్​ 7  – ఆన్​లైన్​లో ప్రీమియం అమౌంట్​ను చెల్లించాలి.

 

మీరు పైన ఉన్న స్టెప్స్​ను పూర్తి చేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే మీ ఇన్సూరెన్స్​ పాలసీ యాక్టివేట్​ చేయబడుతుంది. దానికన్నా ముందు మీరు సమర్పించిన అన్ని వివరాలను తనిఖీ చేస్తారు.

దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరిగిపోతున్న మెడికల్​ చార్జీలు, మందుల ఖర్చులతో సతమతం కాకుండా ఉండేందుకు మీరు మీ పేరెంట్స్​కు హెల్త్​ ఇన్సూరెన్స్​ తీసుకోవడం బెటర్​ ఆప్షన్​. మీరు ఇతర యాడ్​–ఆన్​లను ఎంచుకొని మీ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని సురక్షితంగా చూసుకోవచ్చు. వైద్య ఖర్చుల నుంచి ఉపశమనం పొందొచ్చు.

పేరెంట్స్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి

నేను సీనియర్ సిటిజన్లు అయిన నా పేరెంట్స్ను ఫ్యామిలీ ఫ్లోటర్ ఇన్సూరెన్స్ ప్లాన్లో యాడ్ చేయొచ్చా?

లేదు. అలా చేసేందుకు వీలు పడదు. ఫ్యామిలీ ఫ్లోటర్​ ప్లాన్​ అనేది 60 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది.

నేను నా పేరెంట్స్కు హెల్త్ కేర్ కవర్ను తొందరగా ఎందుకు ఎంచుకోవాలి?

ఎక్కువ వయస్సున్న వ్యక్తులకు ఇన్సూరెన్స్​ పాలసీలు తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్​ కంపెనీలు సహ చెల్లింపుల (కో–పేమెంట్​) నిబంధనలను పెడతాయి. అందుకే మీ తల్లిదండ్రులకు వీలైనంత ముందే పాలసీ తీసుకోవడం మంచిది.

నేను నా పేరెంట్స్ పాలసీ కవరేజీని ఎలా పెంచగలను?

టాప్​ అప్​ కవర్స్​ను ఎంచుకుంటే మీ పేరెంట్స్​ పాలసీ కవరేజీని పెంచవచ్చు. ఇండిపెండెంట్​ కవర్స్​ను ఎంచుకోవడం కంటే ఇదే అత్యుత్తమం.