హీరో ప్లెజర్ ఇన్సూరెన్స్

హీరో ప్లెజర్ ఇన్సూరెన్స్ పాలసీ ధర రూ. 752 నుంచే మొదలవుతుంది. డిజిట్ పాలసీని రిన్యూ చేయండి.

Third-party premium has changed from 1st June. Renew now

source

మీ రోజువారీ ప్రయాణం బడ్జెట్​లో సాగిపోవాలనుకుంటే మీకు హీరో ప్లెజర్ బైక్ అత్యుత్తమ ఆప్షన్. మీరు ఈ బైక్​ను కొనుగోలు చేసిన తర్వాత.. వెంటనే బండికోసం టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయాలి. హీరో ప్లెజర్ ఇన్సూరెన్స్​ పాలసీని కొనుగోలు చేసే ముందు అందులో ఉన్న ప్రయోజనాలను తనిఖీ చేయడం చాలా అవసరం.

దీనిని తయారు చేసింది హీరో హోండా కంపెనీ. కానీ ప్రస్తుతం హీరో మోటోకార్ప్ ఈ స్కూటీ తయారీకి సంబంధించిన అన్ని హక్కులను కలిగి ఉంది. 2013 నాటి నివేదికలు చెప్పిన దాని ప్రకారంగా నెలకు దాదాపు 40,000 స్కూటీలు అమ్ముడయ్యాయి. ఈ స్కూటీ చాలా తేలికగా ఉండి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ స్కూటీ ఇప్పటికీ కూడా చాలా మంది యువరైడర్లకు ప్రత్యేకించి మహిళలకు తొలి ఎంపికగా ఉంది.

రోజువారి జీవితంలో మీకు ఎంతగానో ఉపయోగపడే హీరో ప్లెజర్ బైక్​ను జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. హీరో ప్లెజర్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడం వలన మీరు మీ స్కూటీని చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు. మోటారు వాహనాల చట్టం-1988 ప్రకారం భారతదేశంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. అది మాత్రమే కాకుండా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా మీకు అందే భద్రతను పొందడం చాలా అవసరం.

అయితే ముందుగా ఈ పాపులర్ స్కూటీలో ఉన్న కొన్ని ఫీచర్లను చూద్దాం.

హీరో ప్లెజర్ ఇన్సూరెన్స్​లో ఏమేం కవర్ అవుతాయి..

డిజిట్ హీరో ఇన్సూరెన్స్ పాలసీని ఎందుకు కొనుగోలు చేయాలి?

హీరో ప్లెజర్ కోసం వివిధ రకాల ఇన్సూరెన్స్ ప్లాన్లు

థర్డ్ పార్టీ కాంప్రహెన్సివ్

ప్రమాదంలో సొంత టూ వీలర్​కు అయిన డ్యామేజీలు/నష్టాలు

×

అగ్ని ప్రమాదాల వలన సొంత టూ వీలర్​కు అయిన డ్యామేజీలు/నష్టాలు

×

ప్రకృతి విపత్తుల వలన మీ సొంత టూ వీలర్ వాహనానికి అయిన డ్యామేజీలు/నష్టాలు

×

థర్డ్ పార్టీ వాహనానికి అయిన డ్యామేజీలు

×

థర్డ్ పార్టీ ప్రాపర్టీకి అయిన డ్యామేజీలు

×

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

×

థర్డ్ పార్టీ వ్యక్తికి గాయాలు/మరణం సంభవిస్తే

×

మీ స్కూటర్ లేదా బైక్ దొంగతనానికి గురయితే

×

ఐడీవీ(IDV)ని కస్టమైజ్ చేసుకోండి

×

మీకు నచ్చిన యాడ్-ఆన్స్​తో అదనపు రక్షణ

×
Get Quote Get Quote

థర్డ్ పార్టీ, కాంప్రహెన్సివ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ మధ్య గల వ్యత్యాసం గురించి మరింత తెలుసుకోండి.

క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి?

మీరు మా టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్​ను కొనుగోలు కానీ రెన్యూవల్ కానీ చేసిన తర్వాత మీరు క్లెయిమ్ చేసేందుకు కేవలం 3 స్టెప్స్ ఉంటాయి. ఈ డిజిటల్ క్లెయిమ్ ప్రక్రియతో మీరు నిశ్చింతగా ఉండొచ్చు.

స్టెప్ 1

1800-258-5956 నంబర్​పై కాల్ చేయండి. ఎటువంటి ఫారాలు నింపాల్సిన అవసరం లేదు.

స్టెప్ 2

మీ మొబైల్ నెంబర్​కు స్వీయ తనిఖీ లింక్ పంపించబడుతుంది. మీ స్మార్ట్​ఫోన్ ద్వారా మీ వాహనానికి జరిగిన డ్యామేజీలను​ ఫొటో తీసి మాకు పంపించండి. మేము దశలవారీగా ఏం చేయాలో మీకు తెలియజేస్తాం.

స్టెప్ 3

మీకు నచ్చిన పద్ధతిలో రిపేర్ చేయించుకోండి. అంటే రీయింబర్స్​మెంట్ అయినా ఎంచుకోండి మా నెట్​వర్క్ గ్యారేజీల్లోకి వెళ్లి నగదు రహిత రిపేర్లు అయినా చేయించుకోవచ్చు.

డిజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఎంత తొందరగా సెటిల్ అవుతాయి? మీరు బీమా కంపెనీని మార్చినపుడు మీ మెదడులోకి మొదటగా వచ్చే ప్రశ్న ఇది. అంటే మీరు సరిగ్గానే చేస్తున్నారు. డిజట్ క్లెయిమ్స్ రిపోర్ట్ కార్డ్ చదవండి.

హీరో ప్లెజర్ గురించి క్లుప్తంగా..

హీరో ప్లెజర్ అనేది ఒక కొంటె పిల్లలాంటి వాహనం. ఇది రద్దీగా ఉండే భారతీయ వీధులకు సరిగ్గా సరిపోతుంది. ఆటోమేటెడ్ గేర్ల వలన ఇది చాలా సులభంగా ఉంటుంది. వంపులలో కూడా దీనితో చాలా ఈజీగా ఉంటుంది. హీరో ప్లెజర్ డీసెంట్ యాక్సిలరేషన్ (త్వరణం) కలిగి ఉంటుంది.

  • ఈ వాహనం 102 cc డిస్​ప్లేస్​మెంట్ ఇంజిన్​తో మీకు లభిస్తుంది.

  • 6.90 BHP గరిష్ట పవర్​ను కలిగి ఉంటుంది. ఇది 7,000 గరిష్ట RPMను కలిగి ఉంటుంది.

  • ఈ స్కూటీ గరిష్టంగా లీటరుకు 65 కిలోమీటర్ల మైలేజ్​ను అందిస్తుంది. రోడ్ పరిస్థితులతో సంబంధం లేకుండా ఈ స్కూటీ 63 కిలోమీటర్ల మైలేజ్​ను అందిస్తుంది.

మైలేజీ పరంగా చూసుకుంటే ఇది అత్యుత్తమ క్లాస్. ఈ బండిని నడుపుతుంటే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది సెల్ఫ్ స్టార్ట్​తో వస్తుంది. ఈ ఫీచర్ వలన రైడర్లకు మరింత సౌలభ్యంగా ఉంటుంది. దీని ఇగ్నిషన్ కర్య్బుటర్ మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఇది అత్యంత నమ్మకమైన ఆప్షన్లలో ఒకటిగా నిలిచింది.

హీరో ప్లెజర్ బైక్ అనేక రంగుల్లోనే కాక అల్లాయ్ వీల్స్​తో కూడా వస్తుంది. ఈ విషయాన్ని గురించి మీరు తెలుసుకోవాలి.

ఇది రోజూ ఉపయోగపడే యంత్రం కాబట్టి.. హీరో ప్లెజర్ ఇన్సూరెన్స్ తీసుకోవడంతో పాటుగా దాని ధరను కూడా చెక్ చేయాలి. అంతేకాకుండా అందులో అందుతున్న ఫీచర్లను కూడా తనిఖీ చేయాలి.

ఇటువంటి సందర్భంలో డిజిట్ కాంప్రహెన్సివ్ క్యురేటెడ్ ఇన్సూరెన్స్ పాలసీలు మీకు సహాయం చేస్తాయి.

హీరో ప్లెజర్ స్కూటీ ఇన్సూరెన్స్ కోసం డిజిట్​ను ఎందుకు ఎంచుకోవాలి?

భారతదేశంలో టాప్​లో ఉన్న బీమా సంస్థల్లో డిజిట్ ఒకటి. ఇది ప్రత్యేకమై బీమా సంస్థగా నిలుస్తుంది.

మీ స్కూటీ కోసం హీరో ప్లెజర్ ఇన్సూరెన్స్ కోసం చూస్తుంటే.. డిజిట్ అందించే కింది పాలసీలను గురించి ఒకసారి తెలుసుకోండి.

దీనిపై ఓ లుక్కేయండి.

వెరిఫికేషన్ సౌలభ్యంతో క్లెయిమ్స్ ఫైల్ చేయడం చాలా సులభం – చాలా సందర్భాలలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రక్రియ అనేది రోజుల తరబడి సాగే ప్రక్రియ. ఇప్పటికే మీరు బాధలలో ఉంటారు కాబట్టి మిమ్మల్ని మరింతగా ఇబ్బంది పెట్టడం ఎందుకని డిజిట్ మీకు సింపుల్ క్లెయిమ్ ప్రక్రియను అందజేస్తుంది. డిజిట్ క్లెయిమ్ నింపే విధానం ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా స్మార్ట్​ఫోన్ ఆధారిత స్వీయతనిఖీ ప్రక్రియ మీ సమయాన్ని ఆదా చేస్తుంది. డిజిట్ ఉత్తమ క్లెయిమ్ సెటిల్​మెంట్ రికార్డును కలిగి ఉంది. కావున మీ క్లెయిమ్ అప్రూవల్ పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.

మీరు ఎంచుకునేందుకు అనేక పాలసీ ఆప్షన్లు – డిజిట్ మీ హీరో ప్లెజర్ కోసం ఇన్సూరెన్స్ ఆప్షన్లను కూడా అందిస్తోంది. మీ అవసరాలకు తగిన బెస్ట్ పాలసీని ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అదే సమయంలో మీరు కొనుగోలు చేసిన పాలసీ ఎటువంటి కవర్స్​ను అందిస్తుందో మీరు తెలుసుకోవాలి.

  • థర్డ్ పార్టీ టూ వీలర్ లయబులిటీ ఇన్సూరెన్స్ పాలసీ: మీరు హీరో ప్లెజర్​ను నడుపుకుంటూ ఏదైనా ప్రమాదానికి కారణమైతే ఈ పాలసీ మిమ్మల్ని లయబులిటీ నుంచి కవర్ చేస్తుంది. అంతేకాకుండా ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉండటం అనేది చట్ట ప్రకారం తప్పనిసరి. మీరు ఏ విధమైన ఇన్సూరెన్స్ పాలసీ లేకుండా వాహనం నడిపితే మొదటి సారి పట్టుబడినపుడు రూ. 2000, రెండో సారి కూడా పట్టుబడితే రూ. 4000 వరకు ట్రాఫిక్ ఫైన్ పడుతుంది. మీ వలన ఎవరైనా వ్యక్తులకు కానీ, ఆస్తులకు కానీ డ్యామేజ్ జరిగితే మీ థర్డ్ పార్టీ లయబులిటీ హీరో ప్లెజర్ ఇన్సూరెన్స్ పాలసీ కవర్ చేస్తుంది. మీ సొంత వాహనానికి జరిగిన డ్యామేజీలను ఇది కవర్ చేయదు.

  • కాంప్రహెన్సివ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ: ఈ పాలసీ పేరుకు తగినట్లుగానే థర్డ్ పార్టీ లయబులిటీలతో పాటుగా సొంత డ్యామేజీలను రెండింటినీ కవర్ చేస్తుంది. అంతేకాకుండా ప్రకృతి విపత్తులు, వరదలు, భూకంపాలు, అగ్నిప్రమాదాలు, దొంగతనాలు, పేలుళ్ల వలన మీ స్కూటీకి సంభవించే ఆర్థిక నష్టాలను కవర్ చేస్తుంది.

మీరు మీ హీరో ప్లెజర్ వాహనాన్ని 2018 సెప్టెంబర్ తర్వాత కొనుగోలు చేసినట్లయితే మీరు మీ వాహనం కోసం ఓన్ డ్యామేజ్ కవర్ ను కూడా కొనుగోలు చేయవచ్చు. మీకు ఇప్పటికే థర్డ్ పార్టీ లయబులిటీ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంటే మాత్రమే ఓన్ డ్యామేజ్ కవర్ కొనుగోలు చేయొచ్చు.

వివిధ రకాల యాడ్-ఆన్స్​తో పూర్తి రక్షణ – డిజిట్ మీకు కొన్ని రకాల యాడ్–ఆన్​ కవర్లను కూడా అందిస్తుంది. ఈ యాడ్-ఆన్​ కవర్లను మీరు హీరో ప్లెజర్ కాంప్రహెన్సివ్ పాలసీతో తీసుకోవచ్చు. మీ రైడింగ్ అలవాట్ల ప్రకారం మీకు అవసరమైన యాడ్–ఆన్లను తీసుకోవాలి. డిజిట్ అందించే కొన్ని రకాల యాడ్-ఆన్స్.

  • జీరో డిప్రిషియేషన్ కవర్

  • రిటర్న్ టు ఇన్​వాయిస్ కవర్

  • ఇంజిన్, గేర్ ప్రొటెక్షన్ కవర్

  • కంజూమబుల్ కవర్

  • బ్రేక్​డౌన్ అసిస్టెన్స్

  • ఐడీవీ(IDV)ని పర్సనలైజ్ చేసుకునే అవకాశం -  ఐడీవీ (IDV) ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ అనేది మీ స్కూటీ ఎప్పుడైనా దొంగిలించబడినపుడు లేదా మరమ్మతు చేయలేని విధంగా పాడైపోయినపుడు మీకు ఇన్సూరెన్స్ కంపెనీ అందించే మొత్తాన్ని సూచిస్తుంది. ఈ మొత్తం మీ వాహనాన్ని మార్చుకునేందుకు సహాయపడుతుంది. డిజిట్ మీకు నచ్చిన విధంగా, మీ అవసరాలకు తగిన విధంగా ఐడీవీ (IDV) మార్చుకునే సౌలభ్యాన్ని కలగజేస్తుంది. కానీ మీరు ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ప్లెజర్ స్కూటీ ఇన్సూరెన్స్ పాలసీ ధర మీరు ఎంచుకునే ఐడీవీ (IDV) మీద ఆధారపడి ఉంటుంది.

  • నెట్​వర్క్ గ్యారేజీల్లో నగదు రహిత రిపేర్లు – ప్రయాణానికి తరచూ ఉపయోగించే మీ హీరో ప్లెజర్ పాడయిపోతే వెంటనే మరమ్మతు చేయించడం చాలా అవసరం. ఒకవేళ మీ స్కూటీ ప్రమాదంలో డ్యామేజ్ అయితే మాకు భారతదేశ వ్యాప్తంగా ఉన్న 1,000 కంటే ఎక్కువ నెట్​వర్క్ గ్యారేజీల్లో మీరు స్కూటీని రిపేర్ చేయించుకోవచ్చు. నెట్​వర్క్ గ్యారేజీల్లో నగదు రహిత క్లెయిములు వర్తిస్తాయి. కాబట్టి మీరు డబ్బుల గురించి ఏవిధంగా చింతించాల్సిన అవసరం ఉండదు.

  • 24X7 ఎప్పుడైనా అందుబాటులో ఉండే కస్టమర్ సర్వీస్ – అత్యవసర సమయాల్లోనే బీమా పాలసీల అవసరం పడుతుంది. కావున కస్టమర్ ప్రతినిధుల్ని ఎటువంటి సమయంలోనైనా మనం సంప్రదిస్తుంటాం. ఈ అవసరాన్ని డిజిట్ బాగా గుర్తించింది. డిజిట్ అందించే కస్టమర్ సర్వీస్ కేవలం పగలు, రాత్రి మాత్రమే కాదు. వారంలోని ప్రతీ రోజు కూడా అందుబాటులో ఉంటుంది. మీ హీరో ప్లెజర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ గురించి ఎటువంటి ప్రశ్న అయినా లేదా ఇంకేదైనా మేము మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాం.

  • నో క్లెయిమ్ బోనస్ ద్వారా ఖర్చు తగ్గింపు  - మీరు చాలా జాగ్రత్తగా బండి నడిపేవారే అయినప్పటికీ, వేరే వారి తప్పిదాల వలన మీకు ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు. అటువంటి సందర్భాలను మినహాయిస్తే.. మీరు మీ ద్విచక్రవాహనం మీద పాలసీ సమయంలో ఎటువంటి క్లెయిమ్స్ చేయకుండా ఉంటే.. మీకు సదరు ఇన్సూరెన్స్ సంస్థ ప్రయోజనాలను అందజేస్తుంది. ఈ ప్రయోజనాలనే నో క్లెయిమ్ బోనస్ (NCB) అని పిలుస్తారు. ఈ రివార్డుల వలన మీ హీరో ప్లెజర్ స్కూటీ ఇన్సూరెన్స్ ప్రీమియం ధర తగ్గుతుంది.

  • ఆన్​లైన్​లో సులభంగా రెన్యూవల్ చేసుకునే సౌలభ్యం – ఆన్​లైన్​ ద్వారా బీమా పాలసీని ఎంచుకోవడం అనేది చాలా సులభంగా ఉంటుంది. సరైన ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకునేందుకు ఇది తోడ్పడుతుంది. మీకు అందుబాటులో ఉన్న సరైన పాలసీని ఎంచుకోవడంలో ఇది మీకు సహాయం చేస్తుంది. రకరకాల ప్లాన్లను పోల్చడానికి ఇది సహాయపడుతుంది. మరోవైపు చూసుకుంటే ఇది పాలసీని తీసుకోవడంలో ప్రక్రియను సులభం చేస్తుంది. ఆన్​లైన్​లో మీరు హీరో ప్లెజర్ ఇన్సూరెన్స్​ను రెన్యూవల్ చేసుకునేందుకు మీరు మీ ఖాతాలోకి లాగిన్ అయి డబ్బు చెల్లిస్తే సరిపోతుంది.

మీకు డిజిట్ అందించే హీరో ప్లెజర్ ఇన్సూరెన్స్​తో అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఆన్​లైన్ విధానం ద్వారా మీరు ఇన్సూరెన్స్ పాలసీని త్వరగా పొందొంచ్చు. ఇది భద్రతతో పాటుగా చట్టపరమైన విషయాలను కూడా కవర్ చేస్తుంది.

హీరో ప్లెజర్- వేరియంట్స్, ఎక్స్ షోరూం ధర

వేరియంట్స్ ఎక్స్ షో రూం ధర (సిటీని బట్టి మారే అవకాశం ఉంటుంది)
ప్లెజర్​ సెల్ఫ్ స్టార్ట్, 63 Kmpl, 102 cc రూ. 45,100
ప్లెజర్​ సెల్ఫ్ డ్రమ్ అల్లాయ్, 63 Kmpl, 102 cc రూ. 47,100

భారతదేశంలో ప్లెజర్ స్కూటీ ఇన్సూరెన్స్ పాలసీ గురించి తరచూ అడిగే ప్రశ్నలు

నా ప్లెజర్ స్కూటీకి వయసు మీద పడుతున్నా నేను నా ఐడీవీ (IDV)ని అలాగే స్థిరంగా ఉంచుకోవచ్చా?

స్థిరంగా ఉంచుకోవచ్చు. కానీ ఇలా చేయడం వలన మీ ప్రీమియం పెరుగుతుంది. మీ స్కూటీ డిప్రిషియేషన్ వలన మీ ఐడీవీ (IDV) అనేది తగ్గిపోతుంది. కానీ మీరు మీ ప్రీమియంను పెంచుకునేందుకు సిద్ధంగా ఉంటే ఐడీవీ (IDV)ని కూడా పెంచుకోవచ్చు.

నా హీరో ప్లెజర్ స్కూటీ ఇప్పటికే పాతదైతే దానికోసం కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకోవడం ఉత్తమమేనా?

మీ స్కూటీ పాతదైతే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిదే. మీ స్కూటీకి ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే ఈ పాలసీలు మీకు అధిక కవర్​ను అందిస్తాయి.

థర్డ్ పార్టీ లయబులిటీ హీరో ప్లెజర్ ఇన్సూరెన్స్ మీద నేను యాడ్-ఆన్ కవర్ ప్రయోజనాలు పొందడం సాధ్యమవుతుందా?

లేదు. యాడ్–ఆన్స్ అనేవి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీలతో మాత్రమే లభ్యమవుతాయి.