టీవీఎస్‌ జూపిటర్‌ ఇన్సూరెన్స్‌

టీవీఎస్‌ జూపిటర్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ కేవలం రూ. 714 నుంచే మొదలవుతుంది

Third-party premium has changed from 1st June. Renew now

ఆన్​లైన్​లో టీవీఎస్‌ జూపిటర్‌ ఇన్సూరెన్స్​ను కొనడం/రెన్యు చేయడం ఎలా?

source

మీ రోజూవారి వ్యక్తిగత అవసరాల కోసం మీ బడ్జెట్‌లో వచ్చే టూ వీలర్​ను తీసుకోవాలని చూస్తున్నారా? అయితే మీరు టీవీఎస్‌ కంపెనీ జూపిటర్​ స్కూటర్​ను పరిగణనలోకి తీసుకోవచ్చా? అన్ని రకాల టీవీఎస్‌ స్కూటర్ల గురించి మరింతగా తెలుసుకోండి. టీవీఎస్‌ కంపెనీ యొక్క అన్ని స్కూటర్లలోకెల్లా జూపిటర్​ స్కూటరే ఎందుకు ఉత్తమమైందో తెలుసుకోండి. మీరు వాహనం కొనుగోలు చేసేటప్పుడు టీవీఎస్‌ జూపిటర్​ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయండి.

1978లో స్థాపించబడిన టీవీఎస్‌ మోటార్​ కంపెనీ అందిస్తున్న స్కూటర్లలో జూపిటర్​ స్కూటర్​ ఒకటి. టీవీఎస్‌ కంపెనీ భారతదేశంలో మూడో అతి పెద్ద టూ-వీలర్​ మోటార్​ కంపెనీ. 2019 మేలో ఈ కంపెనీ 3 లక్షలకు పైచిలుకు వాహనాలను విక్రయించింది. (1)

పరిమిత బడ్జెట్‌లో టీవీఎస్‌ జూపిటర్​ టూ-వీలర్​ చాలా పాపులర్​ అయిన మోటార్​ సైకిల్. తక్కువ బడ్జెట్​లో వస్తున్న దీనివల్ల మనకు అధిక ప్రయోజనాలున్నాయి. 2019 అక్టోబర్‌లో చేపట్టిన ఓ సర్వే ప్రకారం జూపిటర్​ అనేది భారతదేశంలో విక్రయించబడుతున్న స్కూటర్లలో రెండో అత్యుత్తమ స్కూటర్​. కేవలం ఆ ఒక్క నెలలోనే టీవీఎస్‌ కంపెనీ 74,500 జూపిటర్​ వాహనాలను విక్రయించింది. (2)

మీరు టీవీఎస్‌ జూపిటర్​ కొనుగోలు చేసే ముందు దానికి డ్యామేజీలు​ జరిగితే ఎలా అనే విషయాలను కూడా ఆలోచించాలి. ఎందుకంటే అలాంటి సమయాల్లో మీరు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేలా చూసుకోవాలి.

మీకు ఎటువంటి ఆర్థికపరమైన నష్టాలు రాకుండా ఉండేందుకు మీరు టీవీఎస్‌ జూపిటర్​ వాహన ఇన్సూరెన్స్‌ను తప్పనిసరిగా కొనుగోలు చేయాలి.

ఇక భారతదేశంలో ఇన్సూరెన్స్​ లేకుండా రోడ్డు మీద తిరగడం చట్ట విరుద్దం. కాబట్టి మీరు కనీసం థర్డ్​ పార్టీ లయబులిటీ టూ-వీలర్‌ ఇన్సూరెన్స్‌ను అయినా తీసుకోవడం తప్పనిసరి. లేదంటే మీరు జరిమానా చెల్లించాల్సి రావచ్చు. ఇన్సూరెన్స్​ లేకుండా మొదటిసారి ట్రాఫిక్​ పోలీసుకు దొరికితే రూ. 2,000, రెండోసారి దొరికితే రూ. 4,000 జరిమానా చెల్లించాలి.

టీవీఎస్‌ జూపిటర్​ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్​ అవుతాయి?

డిజిట్​ అందించే టీవీఎస్‌ జూపిటర్​ ఇన్సూరెన్స్‌నే ఎందుకు తీసుకోవాలి?

టీవీఎస్‌ జూపిటర్‌కు సంబంధించి అందుబాటులో ఉన్న వివిధ రకాల ఇన్సూరెన్స్​ ప్లాన్లు

థర్డ్​ పార్టీ కాంప్రహెన్సివ్​

సొంత టూ-వీలర్​కు డ్యామేజ్​ కానీ, నష్టం కానీ జరిగినపుడు

×

సొంత టూ-వీలర్​కు అగ్ని ప్రమాదాల వలన డ్యామేజెస్​/నష్టాలు జరిగినపుడు

×

ప్రకృతి విపత్తుల వలన సొంత టూ-వీలర్​కు డ్యామేజ్​/నష్టం జరిగినపుడు

×

థర్డ్​ పార్టీ వాహనానికి డ్యామేజ్​ జరిగినపుడు

×

థర్డ్​ పార్టీ ప్రాపర్టీకి డ్యామేజ్​ జరిగినపుడు

×

పర్సనల్​ యాక్సిడెంట్​ కవర్​

×

థర్డ్​ పార్టీ వ్యక్తికి గాయాలయినపుడు లేదా మరణం సంభవించినపుడు

×

మీ స్కూటర్​ దొంగిలించబడినపుడు

×

వాహనం ఐడీవీ (IDV) కస్టమైజేషన్‌

×

ఎంచుకున్న యాడ్‌-ఆన్స్‌తో ఎక్కువ సంరక్షణ

×
Get Quote Get Quote

కాంప్రహెన్సివ్‌, థర్డ్‌ పార్టీ టూ వీలర్‌ ఇన్సూరెన్స్‌ మధ్య తేడా గురించి మరింతగా తెలుసుకోండి.

క్లెయిమ్​ ఎలా ఫైల్​ చేయాలి

మీరు డిజిట్​ టూ-వీలర్​ ఇన్సూరెన్స్​ ప్లాన్‌ను కొనుగోలు చేస్తే ఎలాంటి చింతా లేకుండా ఉండొచ్చు. మా క్లెయిమ్​ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. కేవలం మూడంటే మూడే స్టెప్పుల్లో పూర్తవుతుంది.

స్టెప్​ 1

ఎటువంటి ఫామ్స్​ నింపాల్సిన అవసరం లేకుండా కేవలం 1800-258-5956 అనే నెంబర్​కు డయల్​ చేస్తే సరిపోతుంది.

స్టెప్​ 2

అప్పుడు మీ మొబైల్​ నెంబర్​కు ఒక స్వీయ తనిఖీ లింక్​ పంపబడుతుంది. ఆ లింకు ద్వారా మీ వాహన డ్యామేజీకి సంబంధించిన ఫొటో తీసి మాకు పంపితే సరిపోతుంది. ఎలా పంపాలనేది అక్కడే వివరించబడుతుంది.

స్టెప్​ 3

మీకు ఏ విధానంలో ఇన్సూరెన్స్​ క్లెయిమ్​ కావాలో ఎంచుకుంటే సరిపోతుంది. ఉదా: క్యాష్‌లెస్​ రిపేర్లు, రీయింబర్స్​మెంట్​ మొదలగునవి.

డిజిట్​ క్లెయిమ్స్​ ఎంత తొందరగా సెటిల్​ చేయబడతాయి? ఇన్సూరెన్స్​ కంపెనీ మారే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించే మొదటి విషయం ఇదే. మీ మనస్సులోకి వచ్చే తొలి ప్రశ్న కూడా ఇదే. ఈ విషయంలో డిజిట్​ చాలా వేగంగా ఉంటుంది. డిజిట్‌ యొక్క క్లెయిమ్‌ నివేదికను చదవండి

టీవీఎస్‌ జూపిటర్​ గురించి క్లుప్తంగా..

టీవీఎస్‌ కంపెనీ జూపిటర్​ వాహనాన్ని 2013లో ప్రవేశపెట్టింది. తర్వాతి 7 సంవత్సరాల్లో జూపిటర్​ భారతీయ స్కూటర్​ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ప్రతి ఒక్కరూ బడ్జెట్​ ఫ్రెండ్లీ వాహనం కోసం జూపిటర్​ వైపు చూసేలా చేసుకుంది. దీంతో ఏటికేడు జూపిటర్​ వాహనాల అమ్మకాలు పెరుగుకుంటూ పోతున్నాయి.

టీవీఎస్‌ జూపిటర్​ గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు:

  • ఇందులో 110cc ఇంజన్​ ఉంది. ఇది 4-స్ట్రోక్​ ఇంజన్​. మన భారతదేశంలో ఎవరు టూ-వీలర్​ కొనాలని భావించినా మొదట చూసేది మైలేజ్​. మైలేజ్​కు మన భారతీయులు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. మైలేజ్​ విషయానికి వస్తే జూపిటర్​ లీటర్​ పెట్రోల్​కు 49 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. దీనిలో అత్యుత్తమ మోడల్​ 62 కిలోమీటర్ల మైలేజ్​ ఇస్తుంది.
  • అంతర్గత ఫీచర్లతో పాటు బయటి ఫీచర్లు కూడా అద్భుతంగా ఉంటాయి. ఈ బండి డిజైన్​ చూసేందుకు సింపుల్‌గా ఉండి మనల్ని ఇట్టే ఆకర్షిస్తుంది. కొన్ని వాహనాలకు చిన్న చిన్న సందర్భాల్లోనే డెంట్లు పడతాయి. కానీ టీవీఎస్‌ జూపిటర్​ విషయంలో ఎటువంటి డెంట్లు పడకుండా చాలా పటిష్టమైన​ బాడీ ఉంటుంది.
  • జూపిటర్​ వాహనానికి వచ్చిన అవార్డులను చూసి కస్టమర్లు ఈ బైక్​ ఎటువంటిదో తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు భారతదేశంలో ఏ స్కూటర్​కు సాధ్యం కాని రీతిలో జూపిటర్​ బైక్​ 2014లో NDTV కార్​ అండ్​ బైక్​ అవార్డును గెలుచుకుంది. ఇప్పటివరకు ఈ అవార్డును గెలుచుకున్న మొదటి టూ-వీలర్​ జూపిటరే.
  • మార్కెట్‌లోకి విడుదల చేసినప్పటి నుంచి ఈ బైక్​ 5 స్కూటర్​ ఆఫ్ ది ఇయర్​ అవార్డులను గెలుచుకుంది.

పై విషయాలను బట్టి టీవీఎస్‌ జూపిటర్​ ఉత్తమ శ్రేణి వాహనం అని అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ బైక్‌ను తీసుకున్న తర్వాత బైక్​కు ఎటువంటి ప్రమాదం జరిగినా లేక ప్రమాదవశాత్తు కాలిపోయినా మీరు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.

అంతేకాకుండా మీరు జూపిటర్‌‌తో ఏదైనా ప్రమాదం చేసినా అప్పుడు థర్డ్​ పార్టీ వ్యక్తులకు అయిన గాయాలు, వారి వాహనాలకు అయిన రిపేర్ల ఖర్చు నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు జూపిటర్​ ఇన్సూరెన్స్​ కొనుగోలు చేయడం ఒక్కటే మార్గం.

ఇంజన్​ కెపాసిటీ, బండి మేకింగ్​, ఇంకా అనేక రకాల కారకాల మీద మీ ఇన్సూరెన్స్​ ప్రీమియం అనేది ఆధారపడి ఉంటుంది. బండిలో ఉన్న అదనపు సెక్యూరిటీ ఫీచర్లను కూడా ఇన్సూరెన్స్​ కంపెనీ తనిఖీ చేస్తుంది.

మీ బండికి ఏ ఇన్సూరెన్స్​ తీసుకోవాలి అని తికమకపడుతున్నారా? డిజిట్​ ఇన్సూరెన్స్​ చాలా ఉత్తమ ఎంపిక.

టీవీఎస్‌ జూపిటర్​ ఇన్సూరెన్స్‌ కోసం డిజిట్‌నే ఎందుకు ఎంచుకోవాలి?

అతి కొద్ది సమయంలోనే డిజిట్​ కంపెనీ ఇన్సూరెన్స్​ కంపెనీల్లో టాప్‌ పొజిషన్‌కు చేరింది. వేరే కంపెనీలు అందించని అనేక రకాల ఆప్షన్లను అందిస్తూ డిజిట్​ అగ్రగామిగా దూసుకుపోతుంది. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును డిజిట్​ ఇన్సూరెన్స్​ కంపెనీ సాధించుకుంది. మీరు డిజిట్​ కంపెనీ టూ-వీలర్​ ఇన్సూరెన్స్‌ను ఎంచుకుంటే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి.

  • మీ జూపిటర్​ వాహనం కోసం సులభమైన క్యాష్​లెస్​ రిపేర్లు– డిజిట్​  కంపెనీ దేశవ్యాప్తంగా వేల నెట్​వర్క్​ గ్యారేజీలను కలిగి ఉంది. కావున మీ స్కూటర్‌కు ఎటువంటి డ్యామేజ్​ జరిగినా కానీ మీకు అణా పైసా ఖర్చు లేకుండా డిజిట్​ క్యాష్​లెస్​ రిపేర్ల సౌలభ్యంతో రిపేర్​ చేయించుకోవచ్చు. మీరు నాన్​-నెట్‌వర్క్​ గ్యారేజీలలో రిపేర్​ చేయించుకుంటే మీరు రిపేర్​ ఖర్చును మొదటగా చెల్లించాల్సి ఉంటుంది. అటు తర్వాత మీకు క్లెయిమ్​ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. మీ దగ్గర డబ్బు లేనప్పుడు క్యాష్​లెస్​ రిపేర్లు చాలా బాగా ఉపయోగపడతాయి.
  • తక్కువ డాక్యుమెంటేషన్​, స్విఫ్ట్‌ క్లెయిమ్​– క్లెయిమ్స్ సమయంలో డిజిట్​ పాలసీ హోల్డర్లను ఎటువంటి ఇబ్బందులకు గురి చేయదు. ఆన్​లైన్​లో క్లెయిమ్​ ఫైల్​ చేసి తక్కువ సమయంలో ఆర్థిక సహాయం పొందేలా చేస్తుంది. మీ టూ-వీలర్​కు ప్రమాదం జరిగిన వెంటనే రిపేర్​ చేయించేందుకు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. స్మార్ట్​ ఫోన్​ ఆధారిత తనిఖీ ప్రక్రియ ద్వారా క్లెయిమ్స్​ చేయడం మరింత సులభమయింది. అందుకే మా డిజిట్​ కంపెనీకి ఎక్కువ క్లెయిమ్​ సెటిల్​మెంట్​ రేషియో ఉంది. మీ క్లెయిమ్స్​ తిరస్కరణకు గురయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
  • మీకు నచ్చిన పాలసీలు ఎంచుకునే సౌలభ్యం– ఏదైనా ఇన్సూరెన్స్​ ప్రొవైడర్​ ఒక వాహనం కోసం అనేక రకాల ఇన్సూరెన్స్​ పాలసీలను అందించాలి. అప్పుడే కస్టమర్లకు ఏ పాలసీ ఎంత సమర్థనీయంగా, ఉపయోగకరంగా ఉంటుందనే విషయం అర్థమవుతుంది. ఆ విషయంలో డిజిట్​ కంపెనీ అందరికన్నా ముందు ఉంటుంది. డిజిట్​ ప్లాన్లలో అనేక రకాల ఇన్సూరెన్స్​ పాలసీలు ఉన్నాయి.
  • థర్డ్​ పార్టీ టూ-వీలర్​ ఇన్సూరెన్స్​ పాలసీ– డిజిట్​ అందించే జూపిటర్​ ఇన్సూరెన్స్​ ప్లాన్లలో థర్డ్​ పార్టీ పాలసీలు కూడా ఉన్నాయి. కానీ, ఈ ప్లాన్లను మీరు తీసుకుంటే కేవలం థర్డ్​ పార్టీ వ్యక్తులకు అంటే మీ వాహనం వలన బాధింపబడిన అవతలి వ్యక్తులకు మాత్రమే ఈ ప్లాన్​ వర్తిస్తుంది. సొంత డ్యామేజీలకు ఇది వర్తించదు.
  • కాంప్రహెన్సివ్​ టూ-వీలర్​ ఇన్సూరెన్స్​ పాలసీ– ఏదైనా నష్టం జరిగినపుడు థర్డ్​ పార్టీ వ్యక్తితో పాటు మీకు కూడా ఇన్సూరెన్స్​ అందించే పాలసీ రకాన్ని కాంప్రహెన్సివ్​ ఇన్సూరెన్స్​ అని అంటారు. ఇది థర్డ్​ పార్టీ డ్యామేజీలతో పాటు సొంత డ్యామేజీలను కూడా కవర్​ చేస్తుంది. వరదలు, అగ్ని ప్రమాదాలు, భూకంపాల వంటి వాటి వలన మీ వాహనం ఎటువంటి డ్యామేజ్​కు గురైనా ఈ పాలసీ కవర్​ చేస్తుంది.

మీరు 2018 సెప్టెంబర్​ తర్వాత జూపిటర్​ వాహనాన్ని కొనుగోలు చేసినట్లయితే, మీరు ఒక విషయం గమనించాలి. మీ వాహనానికి ఒక సొంత డ్యామేజ్‌ కవర్‌ తీసుకోవాలి. మీరు ఇప్పటికే థర్డ్​ పార్టీ పాలసీని కలిగి ఉన్నా కానీ స్టాండలోన్‌ కవర్​ను పొందొచ్చు. దీని వలన మీ బైక్​కు అదనపు సంరక్షణ అందుతుంది.

  • 24x7 కస్టమర్​ సపోర్ట్​– ఒక కంపెనీ అత్యుత్తమ కంపెనీ అనిపించుకోవాలంటే కస్టమర్లకు మెరుగైన సేవలు అందించాలి. కంపెనీ కస్టమర్​ సర్వీస్​ బాగుండాలి. అందుకే డిజిట్​ కంపెనీ ఎల్లవేళలా కస్టమర్లకు సర్వీసును అందిస్తోంది. డిజిట్​ కంపెనీ కస్టమర్​ కేర్​ సర్వీస్​ ఇన్సూరెన్స్​ ఇండస్ట్రీలోనే టాప్​. మీకు ఎటువంటి సహాయం కావాలన్నా, క్లెయిమ్స్​ విషయంలో ఎటువంటి సందేహాలున్నా కేవలం ఒక కాల్​ చేస్తే సరిపోతుంది.
  • నో క్లెయిమ్​ బోనస్​ బెనిఫిట్లు– మీరు ఎటువంటి ప్రమాదాలు చేయని రైడర్​ అయితే మీకు ప్రతి సంవత్సరం నో క్లెయిమ్​ బోనస్ జమ అవుతుంది. ఈ నో క్లెయిమ్​ బోనస్​ వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. డిజిట్​ ఆకర్షణీయమైన నో క్లెయిమ్​ బోనస్​ రివార్డులను అందిస్తుంది. దీని వలన మీ ప్రీమియంలో డిస్కౌంట్​ లభిస్తుంది. 50 శాతం వరకు ప్రీమియంలో తగ్గింపును పొందేందుకు ఆస్కారం ఉంటుంది.
  • మీకు నచ్చిన విధంగా ఇన్సూర్డ్​ డిక్లేర్డ్​ వాల్యూ (IDV) మార్చుకునే వెసులుబాటు- ఐడీవీ (IDV) అనేది ఇన్సూర్డ్​ డిక్లేర్డ్​ వాల్యూను సూచిస్తుంది. ఇది మీరు మీ స్కూటర్‌కు చేసే మొత్తం క్లెయిమ్​. ఈ మొత్తాన్ని మీకు ఇష్టం వచ్చిన విధంగా పెంచుకునేందుకు, తగ్గించుకునేందుకు డిజిట్​ మిమ్మల్ని అనుమతిస్తుంది. ఒకవేళ మీ బండికి ఏదైనా నష్టం లేదా డ్యామేజ్​ అయినపుడు ఈ విలువను బట్టే మీకు పాలసీ క్లెయిమ్​ వస్తుంది. కావున ఐడీవీ (IDV) అనేది చాలా ముఖ్యం​. ఐడీవీ (IDV) ఎక్కువగా సెట్​ చేసుకుంటే ఎక్కువ ప్రీమియం కట్టాల్సి వస్తుంది. ఐడీవీ (IDV)  తక్కువగా సెట్​ చేసుకుంటే తక్కువ ప్రీమియం కట్టాల్సి వస్తుంది.
  • యాడ్​-ఆన్లతో అదనపు రక్షణ– యాడ్- ఆన్స్​ అనేవి ఏ పాలసీలోనైనా ఉంటాయి. ఇవి అదనపు సంరక్షణను అందజేస్తాయి. వీటికి ప్రత్యేక ధర ఉంటుంది. అందుకే చాలామంది పాలసీ కవర్‌తో పాటు అదనంగా యాడ్​-ఆన్స్​ను తీసుకుంటారు. డిజిట్​ అందించే కొన్ని రకాలైన యాడ్​-ఆన్స్​.
  • జీరో డిప్రిషియేషన్‌ కవర్​
  • ఇంజన్​, గేర్​ ప్రొటెక్షన్​ కవర్
  • రిటర్న్​ టు ఇన్​వాయిస్​ కవర్​
  • బ్రేక్‌డౌన్‌ అసిస్టెన్స్​
  • కన్‌జ్యూమబుల్‌ కవర్​
  • ఆన్‌లైన్‌లో పాలసీలను కొనడం, రెన్యు చేయడం చాలా సులభం– డిజిట్​ కంపెనీ ఆన్​లైన్​లో పాలసీలు కొనుగోలు చేసే సౌలభ్యాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం చాలా సులభంగా ఉంటుంది. ఈ పద్ధతిలో వివిధ కంపెనీలను సరిపోల్చుకోవడం కూడా సులభమే. మీరు డిజిట్​ పాలసీని తీసుకోవాలని భావిస్తే సింపుల్‌గా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శిస్తే సరిపోతుంది. అక్కడ మీకు కావలసిన ప్లాన్‌ను ఎంచుకుని ప్రీమియం చెల్లిస్తే మీ పాలసీ ప్రారంభమవుతుంది. మీరు ఒకవేళ మీ పాలసీని రెన్యు చేయాల్ని వచ్చినా కానీ డిజిట్​ వెబ్​సైట్​లోకి లాగిన్​ అయ్యి మీ పాలసీ వివరాలు నమోదు చేసి లాగిన్​ అయితే సరిపోతుంది. ఆ తర్వాత మీ ప్రీమియం వివరాలు వస్తాయి.
  • మీ టీవీఎస్‌ జూపిటర్​ స్కూటర్‌కు డిజిట్​ ఇన్సూరెన్స్​ అత్యుత్తమ ఎంపిక.

టీవీఎస్‌ జూపిటర్​ వేరియంట్లు, ఎక్స్​-షోరూమ్‌ ధర

వేరియంట్లు ఎక్స్‌-షోరూమ్​ ధర (నగరాన్ని బట్టి మారవచ్చు)
జూపిటర్​ STD, 62 Kmpl, 109.7 cc ₹ 52,945
జూపిటర్​ ZX, 62 Kmpl, 109.7 cc ₹ 57,443
జూపిటర్​ క్లాసిక్​, 62 kmpl, 109.7 cc ₹ 59,935
జూపిటర్​ ZX డిస్క్​, 62 Kmpl, 109.7 cc ₹ 59,950

భారతదేశంలో టీవీఎస్​ జూపిటర్​ ఇన్సూరెన్స్​ గురించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQలు)

తక్కువ ప్రీమియం రేట్లు ఉండేలా చూస్తే టీవీఎస్​ జూపిటర్‌‌కు ఏ ఇన్సూరెన్స్​ ప్లాన్​ ఉత్తమమైనది?

థర్డ్​ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్​ కవర్​ అనేది ప్రాథమిక​ ప్లాన్​. కానీ, ఇది మీ వాహనానికి అయిన డ్యామేజీ ఖర్చులకు ఎటువంటి డబ్బులను అందించదు. మీ వాహనం వలన థర్డ్​ పార్టీ వ్యక్తులు బాధిపంబడినప్పుడు మాత్రమే ఈ పాలసీ వర్తిస్తుంది.

నెట్​వర్క్​ గ్యారేజీలను వాడుకోవడం వలన నాకు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి?

మీకు క్యాష్‌లెస్​ రిపేర్లు మీ ఇన్సూరెన్స్​ కంపెనీల నెట్​వర్క్​ గ్యారేజీల్లో మాత్రమే లభ్యమవుతాయి. ప్రమాదాలు, లేదా ఇతర కారణాల వలన మీ వాహనానికి అయిన​  డ్యామేజీలకు కూడా ఇక్కడ మీకు రిపేర్ చేస్తారు. ఇందుకోసం మీరు ఎటువంటి రిపేర్​ ఖర్చుల​ను జేబు నుంచి చెల్లించాల్సిన అవసరం ఉండదు. వెంటనే రిపేర్​ చేయించుకుని క్లెయిమ్​ను తర్వాత ఫైల్​ చేసుకోవచ్చు.

నా వాహనానికి చిన్న డెంట్​ పడిన సందర్భంలో నేను ఇన్సూరెన్స్​ క్లెయిమ్​ చేయొచ్చా?

క్లెయిమ్​ చేయాలా వద్దా అనేది మీ వ్యక్తిగత నిర్ణయం. మీ స్కూటర్​కు చిన్న డ్యామేజ్​ జరిగినపుడు క్లెయిమ్​ చేయకుండా ఉండటమే మంచిది. ఇలా చేయడం వలన మీరు నో క్లెయిమ్​ బోనస్​ను అలాగే ఉంచుకోగలుగుతారు. ఇది మీకు చాలా ప్రయోజనాలను​ అందజేస్తుంది. కాబట్టి చిన్న చిన్న ప్రమాదాలకు క్లెయిమ్​ చేయొద్దు.