మీ రోజూవారి వ్యక్తిగత అవసరాల కోసం మీ బడ్జెట్లో వచ్చే టూ వీలర్‌ను తీసుకోవాలని చూస్తున్నారా? అయితే మీరు టీవీఎస్ కంపెనీ జూపిటర్ స్కూటర్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చా? అన్ని రకాల టీవీఎస్ స్కూటర్ల గురించి మరింతగా తెలుసుకోండి. టీవీఎస్ కంపెనీ యొక్క అన్ని స్కూటర్లలోకెల్లా జూపిటర్ స్కూటరే ఎందుకు ఉత్తమమైందో తెలుసుకోండి. మీరు వాహనం కొనుగోలు చేసేటప్పుడు టీవీఎస్ జూపిటర్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయండి.
1978లో స్థాపించబడిన టీవీఎస్ మోటార్ కంపెనీ అందిస్తున్న స్కూటర్లలో జూపిటర్ స్కూటర్ ఒకటి. టీవీఎస్ కంపెనీ భారతదేశంలో మూడో అతి పెద్ద టూ-వీలర్ మోటార్ కంపెనీ. 2019 మేలో ఈ కంపెనీ 3 లక్షలకు పైచిలుకు వాహనాలను విక్రయించింది. (1)
పరిమిత బడ్జెట్లో టీవీఎస్ జూపిటర్ టూ-వీలర్ చాలా పాపులర్ అయిన మోటార్ సైకిల్. తక్కువ బడ్జెట్లో వస్తున్న దీనివల్ల మనకు అధిక ప్రయోజనాలున్నాయి. 2019 అక్టోబర్‌లో చేపట్టిన ఓ సర్వే ప్రకారం జూపిటర్ అనేది భారతదేశంలో విక్రయించబడుతున్న స్కూటర్లలో రెండో అత్యుత్తమ స్కూటర్. కేవలం ఆ ఒక్క నెలలోనే టీవీఎస్ కంపెనీ 74,500 జూపిటర్ వాహనాలను విక్రయించింది. (2)
మీరు టీవీఎస్ జూపిటర్ కొనుగోలు చేసే ముందు దానికి డ్యామేజీలు జరిగితే ఎలా అనే విషయాలను కూడా ఆలోచించాలి. ఎందుకంటే అలాంటి సమయాల్లో మీరు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేలా చూసుకోవాలి.
మీకు ఎటువంటి ఆర్థికపరమైన నష్టాలు రాకుండా ఉండేందుకు మీరు టీవీఎస్ జూపిటర్ వాహన ఇన్సూరెన్స్‌ను తప్పనిసరిగా కొనుగోలు చేయాలి.
ఇక భారతదేశంలో ఇన్సూరెన్స్ లేకుండా రోడ్డు మీద తిరగడం చట్ట విరుద్దం. కాబట్టి మీరు కనీసం థర్డ్ పార్టీ లయబులిటీ టూ-వీలర్ ఇన్సూరెన్స్‌ను అయినా తీసుకోవడం తప్పనిసరి. లేదంటే మీరు జరిమానా చెల్లించాల్సి రావచ్చు. ఇన్సూరెన్స్ లేకుండా మొదటిసారి ట్రాఫిక్ పోలీసుకు దొరికితే రూ. 2,000, రెండోసారి దొరికితే రూ. 4,000 జరిమానా చెల్లించాలి.